Vol 12 సంచిక 3
May / June 2021
అవలోకనం
డా.జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ఈశ్వరమ్మడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ డాక్టర్ అగర్వాల్ “కేవలం ఔషధం వ్యాధిని నయం చేయలేదు” అనే విషయంపై మన దృష్టిని సారింప జేస్తూ IB యొక్క సమర్ధత గురించి, ఈ కోవిడ్ సమయంలో ప్రాక్టీషనర్లు చేస్తున్న నిస్వార్థ సేవ గురించి, స్ప్రెడ్ ద వర్డ్ ప్రచారం యొక్క సానుకూల ప్రభావం గురించి, ప్రపంచవ్యాప్తంగా ప్రాక్టీషనర్ల నెట్ వర్కింగ్ గురించి, నివేదికలను పంచుకున్నారు. పునః రూపకల్పన చేసిన వైబ్రియానిక్స్ వెబ్సైట్ ను మరింత అభివృద్ధి చేయడానికి సూచనలను కూడా ఆహ్వానించారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
12 ఆసక్తికరమైన కేసులు పంచుకో బడ్డాయి. నెత్తి మీద దురద, వీపు మరియు కీళ్ళ నొప్పులు, గ్యాస్ నిలుపుదల, గజ్జి, ఉబ్బసం, ప్రోస్ట్రేట్ అడేనోమా (నిరపాయమైన ప్రోస్టేటిక్ హైపర్ప్లాసియా), ఆహార అసహనం, మోకాలినొప్పి, అధిక బీపీ, దురద మరియు కంటి వెంట నీరు కారడం, కంటిశుక్లం శస్త్రచికిత్స అనంతర సమస్యలు, అవకాడో పండుకు అలెర్జీ, పి.సి.ఒ.డి కారణంగా తక్కువ మరియు క్రమరహిత బహిష్టు, ఎండోమెట్రియాసిస్, కాలు నొప్పి, కటి మరియు వెన్నుముక స్టెనోసిస్.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
మేము ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. ఒకరు న్యాయవాదిగా వృత్తిని నిర్వహిస్తూ వైబ్రియానిక్స్ సామర్థ్యాన్ని మొదట వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత ప్రాక్టీషనరుగా అర్హత సాధించడానికి ప్రేరణ పొందారు. స్వామి యొక్క స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని పొందుతూ 2019 ఫిబ్రవరి నుండి ఎంతో ఆనందంగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. మరియొక ప్రాక్టీషనరు సాయి సంస్థలో చురుకైన సభ్యుడుగా ఉంటూ మొట్టమొదట అనేక వ్యక్తిగత అనారోగ్యాల నుండి తనను తాను నివృత్తి చేసుకొని 2010 నుండి సమీప గ్రామాలలో చాలా మందికి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ సమయంలో ఇమ్యూనిటీ బూస్టర్ తో పాటు ప్రతీ సంవత్సరం డెంగ్యూ మరియు ఇతర ఉష్ణమండల వ్యాధులను నివారించడానికి రెమిడీలను ఇచ్చేవారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
జ్ఞానం సంపాదించుకోవడానికి చదవడం, కొత్త రోగులను ఎలా కనుగొనాలో తెలుసుకోవడం, అలోపతి క్రీమ్ ముందు వైబ్రియానిక్స్ రెమిడీ యొక్క బాహ్య అనువర్తనం, ప్రసారం లేదా బ్రాడ్ కాస్టింగ్ యొక్క అన్ని అంశాలు, వైబ్రియానిక్స్ ప్రయత్నించడానికి భయపడే వారిని లేదా ప్రయత్నించడానికి ఇష్టపడని వారితో ఎలా వ్యవహరించాలి, వంశపారంపర్య వ్యాధులలో జీవనశైలి యొక్క పాత్ర, మరియు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యములలో ఒక నిర్దిష్ట బిందువుకు మించి స్వస్థత లేదా అభివృద్ధి జరగనప్పుడు ఏమి చేయాలి వంటి విషయాలు వివరింప బడ్డాయి.
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
స్వామి ప్రేమతో వ్యాధి నుండి ఎలా దూరంగా ఉండాలు, ఆరోగ్యం ఎలా పరిరక్షించుకోవాలొ, నిస్వార్థ సేవ ద్వారా భగవంతునితో ఏకత్వాన్ని ఎలా సాధించుకోవాలో తెలిపారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
అమెరికా మరియు ఇండియాలో భవిష్యత్తులో జరగబోయే వర్క్ షాప్ ల గురించి సమాచారం ఇవ్వబడింది.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
ఆరోగ్య వ్యాసంలో మేము ఆరోగ్య సంక్షేమం కోసం “ఆహారాన్ని పరిమళభరితంగా, రుచికరంగా చేయడంలో మూలికలు” అనే వ్యాసం ఇవ్వడం జరిగింది. మూలికలు అంటే ఏమిటి, వాటి ప్రయోజనాలు, వాటి వినియోగం, వాటిని నిల్వ చేయడం గురించి సమాచారం ఇవ్వబడింది. ఆహారం రుచికరంగా చేయడంలో ఉపయోగపడే 20 రకాల మూలికల ప్రమేయం, వానిలో నాలుగు రకాల మూలికలు కూరగాయల వలే ఉపయోగపడటం, సామాన్యంగా వినియోగించే మూలికలు, హెర్బల్ టీ తయారీ గురించి ఇవ్వబడింది. అలాగే కోవిడ్-19 రెమిడీ అప్డేట్ కూడ ఇవ్వబడింది. ఢిల్లీలో సాయి ఇంటర్నేషనల్ సెంటర్ లో ప్రారంభించిన కొత్త వైబ్రియానిక్స్ క్లినిక్ గురించి, IB గురించి ఆసక్తి రేకెత్తించే కథలు మరియు స్వామి యొక్క ఆశీర్వాదం, విస్తృత సంఖ్యలో సభ్యులు పాల్గొంటున్న పుట్టపర్తి వర్చువల్ వర్క్‌షాప్‌ల గురించి, మరియు లండన్లో ఇటీవల స్వర్గస్తుడైన ప్రాక్టీషనరు గురించి సమాచారం ఇవ్వబడింది.
పూర్తి వ్యాసం చదవండి