Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 12 సంచిక 3
May / June 2021
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ప్రపంచమంతటా మాతృశ్రీ ఈశ్వరమ్మ వేడుకలు జరుగబోతున్న శుభ సందర్భంలో మీకు ఇలా వ్రాస్తున్నందుకు నేను ఆశీర్వదింప బడినట్లుగా భావిస్తున్నాను. మాత ఈశ్వరమ్మ ప్రేమ, కరుణ, మరియు నిస్వార్థ సేవకు ప్రతి రూపం. ఆమె స్వామి ఎంచుకున్న దేహ సంబంధమైన మాతృమూర్తి మాత్రమే కాదు స్వామిని ఆశ్రయించే భక్తులకు దారిచూపే ఆశల ప్రతిరూపం. ఆధ్యాత్మికంగాను మరియు వైబ్రియానిక్స్ సేవా పరంగా ఎదగాలని కోరుకునే వారందరికీ ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో అనేక ఇబ్బందులకు లోనవుతున్న ఈ కష్టకాలంలో తన నిష్కళంకమైన ప్రేమతో కూడిన సేవలను అందించిన మాతృశ్రీ ఈశ్వరమ్మ యొక్క సాధు జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఒక మహా సముద్రం వంటివి.

 ఒక సందర్భంలో స్వామి ఇలా చెప్పారు “ఆధ్యాత్మిక ధృక్పధాన్ని పెంపొందించుకోండి, రోగులకు ప్రేమ మరియు శ్రద్ధతో చికిత్స చేసి  వారిని సంతోషంగా ఆరోగ్యంగా చేయండి. దేవుని దయ లేకుండా కనీసం నాడి కూడా కొట్టుకోదు. కేవలం ఔషధం మాత్రమే  వ్యాధిని నయం చేయగలదు అనే తప్పు భావనలో మీరు ఉన్నారు. అదే నిజమైతే ఉత్తమ వైద్య సదుపాయాలు ఉన్న రాజులు, సంపన్నుల జీవితాలు ఏమైనాయి? కనుక ఔషధముతో పాటు దైవకృప కూడా ఉండాలి. ఔషధం మరియు దైవానుగ్రహం అనేవి నెగిటివ్ మరియు పాజిటివ్ వంటివి. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే వ్యాధి నయమవుతుంది. కాబట్టి ఔషధం తీసుకోవడంతో పాటు దైవ కృప కోసం ప్రార్థించాలి... సత్య సాయి బాబా దివ్య వాణి, వాల్యూమ్ 34 డిస్క్ 2, 2001 జనవరి 19. ఈ మహమ్మారి రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో ఇది మనందరికీ అనగా రోగులకు మరియు ప్రాక్టీషనర్లకు కూడా ఒకే విధంగా వర్తిస్తుంది.

కోవిడ్-19 యొక్క త్వరగా ఉత్పరివర్తనం చెందే క్రొత్త డబుల్ వేరియంట్ కబంధ హస్తలలో చిక్కుకున్న అనేక దేశాలు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్ IB.సామాన్య ప్రజలను చేరుకోడానికి మనం సమిష్టిగా చేసే ప్రయత్నాలను రెట్టింపు చేయవలసిన అవసరం ఉంది. IB యొక్క సామర్ధ్యమునకు  సంబంధించిన క్షేత్రం నుండి మనకు ప్రోత్సాహకరమైన అనేక నివేదికలు వచ్చాయి. క్రమం తప్పకుండా IB తీసుకుంటున్న వారిలో IB తీసుకొనని వారికన్నా చాలా తక్కువగా అంటువ్యాధులు సోకినట్లు నివేదికలు అందుతున్నాయి. అలాగే మోతాదును పెంచడం వల్ల ఇట్టి సంక్రమణలను త్వరగా అధిగమించవచ్చని మేము గమనించాము. రోగులకు వైబ్రియానిక్స్  పట్ల విశ్వాసం పెంపొందించడంలో ప్రాక్టీషనర్ల యొక్క విశ్వాసం మరియు ఆరోగ్యం పట్ల వారి యొక్క మనస్తత్వం/వైఖరి అనేవి కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.   

ఈ సందర్భంగా పరిస్థితికి అనుకూలంగా స్పందిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు వారి సేవా గంటల పరిధి దాటి (వారు వైబ్రియానిక్స్ కు ప్రామిస్ చేసిన సేవా గంటలు) నిస్వార్ధంగా సేవ చేస్తున్న వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ల ప్రయత్నాలకు అభినందనలతో కృతజ్ఞత తెలియ జేస్తున్నాము. భయాందోళనకు గురైన వారికి కొందరు ప్రాక్టీషనర్లు 24/7 కౌన్సిలింగ్ అందిస్తున్నారు, మరికొందరు భౌతికంగా రెమిడీ ఇవ్వలేని వారికి వాటిని బ్రాడ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా ప్రసారం చేస్తున్నారు, మరి కొందరు రెమిడీలు మాత్రమే కాకుండా ఇతర మందులు మరియు సామగ్రిని రోగుల అవసరాల మేరకు పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం వంటి నియమాలకు కట్టుబడి ఉండాలని మరియు అవసరమైన వారికి సేవ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.

మన “స్ప్రెడ్ ద వర్డ్” ప్రచారం అందిస్తున్న అద్భుత విజయము మీతో  పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత రెండు నెలలలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరిగాయి. వాటిలో ప్రధమంగా న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్ లో వైబ్రియానిక్స్ క్లినిక్ ప్రారంభోత్సవం (మరిన్ని వివరాల కోసం అదనంగా విభాగం చూడండి). మరొకటి మన కర్నాటక బృందం నాయకత్వంలో బెంగళూరులో రెండు చికిత్సా కేంద్రాలను ప్రారంభించడం. ఒక కేంద్రం నివాస గృహంలో ఉంది, ఇది శారీరక మరియు మానసిక వికలాంగులకు అవసరమైన వైద్య సంరక్షణ, (కృత్రిమ అవయవాలు, శస్త్ర చికిత్సలతో సహా) మరియు  ప్రాణాంతక అనారోగ్యాలకు చికిత్స కూడా అందిస్తున్నది. ఇక్కడ డాక్టర్ మరియు నర్సులు వైబ్రియానిక్స్ చికిత్సను ఆదరంగా స్వీకరించారు. మన బృందం మార్చిలో 52 మంది మానసిక రోగులకు చికిత్స చేసింది, ప్రస్తుతం కోవిడ్ ఆంక్షల కారణంగా వారు ఏప్రిల్ శిబిరం నిర్వహించలేక పోయారు. అయినప్పటికీ 55 మంది రోగులకు ఇమ్యూనిటీ బూస్టర్ IB అందించారు. రెండవ క్లినిక్ 500 మంది (వీరిలో 60 మంది హాస్టల్ లో ఉండేవారు) పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలలో ప్రారంభింప బడింది. ఈ పిల్లలకు వైబ్రియానిక్స్ రెమిడీలతో పాటు ఉచిత కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఈ సందర్భంలో మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ప్రశాంతి నిలయమునకు సేవకోసం వచ్చే సభ్యులకు ఇమ్యూనిటీ బూస్టర్ IB అందించే విధానాన్ని క్రమబద్దీకరించడం. మన వెబ్సైట్ ద్వారా IB  కోసం అభ్యర్ధనలు రావడంతో పాటు మన రెగ్యులర్ పేషంట్ల ద్వారా వారికి మరియు ఆసక్తి ఉన్న వారి బంధువులు మరియు స్నేహితులకు అందించడానికి IB కోసం  అభ్యర్ధనలు అందుతూనే ఉన్నాయి. గత నెలలోనే మేము మొత్తం 35,424 మంది గ్రహీతలకు IB అందించాము. గత సంవత్సరకాలంగా మొత్తం IB గ్రహీతల సంఖ్య 362,408 ఉంది.    

ప్రస్తుతం ఇంట్లోనే బస ఉండే పరిస్థితి దృష్ట్యా వర్చువల్ నెట్వర్కింగ్ ని సద్వినియోగం చేసుకోవాలనే ధ్యాస ప్రాక్టీషనర్లలో కొత్త ఒరవడిని ప్రోత్సహించింది. ఆంధ్ర మరియు తెలంగాణ లోని సీనియర్ ప్రాక్టీషనర్లు వారి కోఆర్డి నేటర్11585 యొక్క మార్గదర్శకత్వంలో వారి జ్ఞానాన్ని పంచుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి సహకారం పొందడానికి నెలవారి సమావేశాలు ప్రారంభించారు. వారి సమావేశాలలో వివిధ శారీరక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో వివరించడానికి వైద్య నేపథ్యం కలిగిన ప్రాక్టీషనర్ల ప్రదర్శనలు, కేసు చరిత్రలను చర్చించడం, మరియు ప్రాక్టీషనర్ల ప్రశ్నలను పరిష్కరించడం వంటివి ఉన్నాయి. ఇదే తరహాలో రెండు నెలలకు ఒకసారి  సమావేశాలు ఇప్పటికే 2019 డిసెంబర్ నుండి తమిళనాడు ప్రాక్టీషనర్లు నిర్వహిస్తున్నారు. 2021 మార్చి 6 & 7 తేదీలలో రెండు అర్ధ దినాలలో 20 మంది ప్రాక్టీషనర్ల కోసం మొదటి యు.ఎస్. మరియు కెనడా వర్చువల్ పునశ్చరణ సదస్సు జరిగింది. వర్చువల్ ఇంటరాక్షన్లు అనేవి ప్రాక్టీషనర్లను మరింత దగ్గరగా తీసుకువచ్చి సమూహంలో చక్కని అనుకూలతను సృష్టిస్తున్నాయి. ఈ పునశ్చరణం ముగింపులో చాలామంది ప్రాక్టీషనర్లు ఈ చొరవను ఉత్తేజపరిచే, జ్ఞానాన్ని పెంచే, శక్తిని పెంపొందింప చేసేదిగా ఉందని ప్రశంసించారు. తోటి వారితో సహకరించడానికి మరింత సమైక్య వేదికను సృష్టించాల్సిన అవసరం ఉందని మరియు రెండు దేశాల ప్రాక్టీషనర్ల కోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వర్చువల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని భావించారు. ఈ నెట్వర్క్ ప్రాక్టీషనర్ ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమేకాక వారి జ్ఞానం మరియు అనుభవం ఆధారంగా సూచనలు ప్రశ్నలు- ఫలితాలు మరియు ఇతర సమాచారానికి సంబంధించి వారిలో భావ ప్రసారాన్ని సులభతరం చేస్తుంది. 

 2021 మార్చిలో పునః రూపకల్పన చేసిన మా వెబ్సైట్ ప్రారంభించిన పది నెలల కన్నా తక్కువ వ్యవధిలో పదివేల హిట్ల మైలు రాయిని దాటాము. వెబ్ సైట్ యొక్క కంటెంట్ మరియు లక్షణాలను మెరుగుపరచడానికి సందర్శకుల నుండి మాకు అనేక సూచనలు వచ్చాయి. ఇది మా ఐటీ బృందాన్నిమరింత బిజీగా ఉంచుతోంది. ఇవే మన సంస్థ యొక్క  DNA లో అంతర్భాగంగా భావింపబడే నిరంతర అభివృద్ధి మరియు ఆవిష్కరణల స్ఫూర్తితో ముందుకు సాగడంకోసం ప్రాక్టీషనర్లు నుండి మరిన్ని సలహాలను మేము స్వాగతిస్తున్నాం. దయచేసి మీ ప్రతిపాదనలను మరియు అభిప్రాయాన్ని ఐటీ వింగ్  [email protected]కు పంపండి. ఈ వ్యాసం ముగింపులో కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి ప్రాక్టీషనర్లుగా మీరు చేసే అన్ని ప్రయత్నాల్లోనూ  అపారమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు దైవఆత్మవిశ్వాసంతో GODFIDENCE తో ముందుకు సాగండి. 

ప్రేమతో సాయి సేవలో

జిత్ కె అగ్గర్వాల్

 

నెత్తిమీద దురద 03576...UK

సైకాలజీలో డాక్టరేట్ చదువుతున్న 26 ఏళ్ల మహిళ రెండు నెలలుగా నెత్తిమీద దురదతో బాధపడుతున్నారు. దురద ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె నిస్సహాయంగా తన రెండు చేతులతో నెత్తిని తీవ్రంగా గోకుతూ ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాధికి స్పష్టమైన కారణం ఏదీ లేదని అనిపించింది. ఇటువంటి పరిస్థితిలో ఎంతో వత్తిడికి లోనవుతూ ఒక సంవత్సరములోనే రెండు నగరాలకు వెళ్ళవలసి వచ్చింది. అంతేకాక తన మొదటి సందర్శన తరువాత తిరిగి వచ్చిన వెంటనే Ph.D ప్రోగ్రాం ప్రారంభించడం వలన  అధ్యయనము కోసం విశ్వవిద్యాలయానికి ప్రతిరోజూ గంట సేపు ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉపశమనం కోసం ఆమె ప్రతీరోజూ తల స్నానం చేసేవారు. వివిధ రకాల ఔషధ పూరిత షాంపూలను ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. 2019 ఫిబ్రవరి 24న ప్రాక్టీషనరు ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:

CC11.2 Hair problems + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC21.6 Eczema…TDS

మార్చి1 న ఆమెకు చాలా బాధగా ఉన్నట్లు గట్టిగా ఏడవాలని ఉన్నట్లు తెలిపారు. ఇది పుల్లౌట్ గా భావించి ఆ దుష్ప్రభావాన్ని  తగ్గించడానికి శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటికి పంపడానికి నీరు పుష్కలంగా త్రాగమని ప్రాక్టీషనరు సూచించారు.     మోతాదు కూడా తగ్గించమని చెప్పినప్పటికి రోగి TDS గా కొనసాగించడానికే ఇష్టపడ్డారు. రెండు రోజుల తర్వాత శరీరంలోని కొన్ని భాగాలలో తేలికపాటి దద్దుర్లు ఏర్పడ్డాయి కానీ వాటివలన అసౌకర్యం ఏమీ కలగలేదు. నెత్తి మీద దురద విషయంలో 30%  ఉపశమనం పొందారు. వారం తర్వాత దురద విషయంలో 60% మెరుగుదల కలుగగా దద్దుర్లు పూర్తిగా అదృశ్యం అయ్యాయి. మార్చి 17న ఆమె వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా కోలుకొని ప్రశాంతంగా ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. మోతాదును ఒకవారం BD కి  తర్వాత రెండు వారాల పాటు OD కి  ఏప్రిల్ 7న OW కి తగ్గించి పూర్తిగా ఆపివేయడానికి ముందు ఒక నెలవరకూ కొనసాగించారు.    ఆమె విశ్వవిద్యాలయ పరీక్షలలో చక్కటి ఫలితంతో ఉత్తీర్ణత సాధించారు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత కూడా వ్యాధి పునరావృతం కాలేదు.

నడుము & కీళ్ల నొప్పులు, గ్యాస్ సమస్య 02814...India

32 ఏళ్ల మహిళ సిజేరియన్ డెలివరీ తర్వాత రెండేళ్లుగా తన వీపు, మోకాళ్ళు, చీలమండ కీళ్ళనొప్పి మరియు అజీర్ణం కారణంగా ప్రేగులలో గ్యాస్ నిలుపుదల సమస్యతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరం అలోపతి మందులు తీసుకున్నా ఎటువంటి ప్రయోజనం కలగలేదు.  ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించి లక్షణాలు తిరిగి పునరావృతం అయ్యేవి. 2017 ఏప్రిల్ 9న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:  

CC4.1 Digestion tonic + CC9.1 Recuperation + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.6 Osteoporosis…6TD 

ఒక నెలలోనే ఆమె నొప్పుల్లో 40% ఉపశమనం కలిగింది. జీర్ణక్రియలో 70% మెరుగుదల ఉంది. జూన్ 18న వెన్నునొప్పి విషయంలో 70%  మెరుగుదల ఏర్పడగా కీళ్ల నొప్పులు దాదాపుగా అదృశ్యమై పోయినట్లు ఆమె తెలిపారు. గ్యాస్ నిలుపుదల సమస్య తిరిగి తలెత్తలేదు. అందుచేత మోతాదు TDS కి తగ్గించబడింది. జులై 16 నాటికి ఆమె వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా  ఉపశమనం పొందారు కనుక మోతాదు క్రమంగా తగ్గించి మరుసటి నెల నాటికి ఆపివేయబడింది. 2021 ఏప్రిల్ నాటికి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.

గజ్జి 02814...India

45 ఏళ్ల వ్యక్తి అతని 40 ఏళ్ల భార్య ఇద్దరూ ఆరు నెలలకు పైగా శరీరమంతా తీవ్రమైన దురద మరియు మొటిమలు వంటివాటితో  బాధపడుతున్నారు. అల్లోపతీ చికిత్స పెద్దగా సహాయం చేయలేదుకనుక వారు దాన్ని ఆపివేసారు. 2018 మే 11న ప్రాక్టీషనరును  సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:   

CC21.3 Skin allergies…TDS నోటికి మరియు బాహ్య అనువర్తనం కోసం కొబ్బరినూనెలో ఇవ్వబడిన మోతాదు …OD 

ఒక నెల తర్వాత దురద మరియు దద్దుర్లు రెండూ 40%, మరి ఒక నెలలో 90% మెరుగుపడ్డాయి. మరో రెండు వారాల తరువాత 2018 జులై 10 నాటికి నోటికి తీసుకునే మోతాదు OD కి తగ్గించబడింది. లక్షణాలు పూర్తిగా తగ్గడం వలన మోతాదు మరో 6 వారాలలో 2018 జులై  24 నాటికి పూర్తిగా తగ్గించి సున్న చేయబడింది. 2021 ఏప్రిల్ నాటికి దాదాపు మూడేళ్ల తర్వాత కూడా ఈ జంటకు ఎటువంటి చర్మ సమస్యలు తలెత్తలేదు.

ఉబ్బసం 03569...USA

46 ఏళ్ల మహిళ చిన్నప్పటినుంచి ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారు. సంవత్సరానికి రెండు మూడు సార్లు ఆమెకు ఉబ్బసం, రాత్రిపూట దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఏర్పడుతుంటాయి. ఈ స్థితి వాతావరణములో మార్పు, కాలుష్యం మరియు మానసిక ఒత్తిడి వలన ప్రేరేపింప బడుతోంది. వైద్యులు సూచించిన సల్బుటామల్  ఇన్హేలర్ ఉపయోగించడం వలన ఒక నెలలో ఈ లక్షణాలు తగ్గుతూ ఉండేవి. ఈమె 2018 జూన్ 24 న ప్రాక్టీషనరుగా అర్హత సాధించిన ఒక వారం తరువాత  ఇండియాకి ప్రయాణం చేసారు. చేరుకున్న వెంటనే ఆమెకు నాసికా అవరోధము, ఆయాసము ప్రారంభ మయ్యాయి. తన గత అనుభవం ప్రకారం ఇన్హేలర్ ఉపయోగించి నప్పటికీ ఈ లక్షణాలు ఒక గంటలో తీవ్రమయ్యి ఉబ్బసానికి దారితీస్తాయి. వెంటనే ఇన్హేలర్ తీసుకోవడమే కాకుండా తన వెల్నెస్ కిట్ నుండి గెట్ వెల్ అనే క్రింది రెమిడీ 2018 జులై 2 న తీసుకోవడం ప్రారంభించారు.    

CC9.2 Infections acute…ప్రతీ 10 నిమిషాలకు నీటితో ఒక మోతాదు రెండు గంటల వరకు అనంతరం 6TD 

ఆమెను ఆశ్చర్యానికి గురిచేస్తూ రెండు గంటల తర్వాత కూడా వ్యాధి లక్షణాలు తీవ్రం కాలేదు.  అందుచేత ఆమె తిరిగి ఇన్హేలర్ ఉపయోగించలేదు. మూడు రోజుల్లో ఆమెకు ఆయాసము మరియు ముక్కు నిరోధము పూర్తిగా తగ్గింది. జూలై 5న మోతాదు TDS కు, జూలై 8 నాటికి OD కి  తగ్గింపబడి జూలై 12న నిలిపివేయ బడింది.  ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలకు పైగా కనీసం తేలికపాటి శ్వాస కోశ ఇబ్బంది కూడా లేకుండా ఆమె హాయిగా ఉన్నారు.

సంపాదకుని వ్యాఖ్య:  వెల్నెస్ కిట్ నుండి బ్రీత్ వెల్ అనేది ఈ వ్యాధికి సరియైనది. అయినప్పటికీ CC9.2 Infections acute  అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ అనారోగ్యానికి సంబంధించిన కంపనాలను కలిగి ఉంటుంది కనుక అద్భుతాలు సృష్టిస్తుంది!

ప్రొస్టేట్ అడేనోమా (ప్రోస్టేట్ లో నిరపాయ గ్రంధి వృద్ధి) 03558...France

65 ఏళ్ల వ్యక్తి 2018 ఆగస్టు నుండి మూత్రవిసర్జన కోసం రాత్రివేళల్లో తరచుగా మేలుకొనేవారు. ఈ సమస్య నెమ్మదిగా  పగటి పూటకు కూడా వ్యాపించింది. 2018 సెప్టెంబర్ 23 అతనికి ప్రోస్టేట్ అడెనోమా (విస్తరించిన ప్రోస్టేట్ మూత్ర ప్రవాహాన్ని పరిమితం చేయడం) అనే వ్యాధిగా నిర్ధారించ బడింది. యూరాలజిస్ట్ ను సంప్రదించగా ప్రోస్టేక్టమీ(ప్రోస్టేట్ ను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించే) శస్త్రచికిత్స సూచించారు, మరియు ఆ సమయంలో పరీక్షల ద్వారా వెల్లడైన మూత్రమార్గం ఇన్ఫెక్షన్ తగ్గడo కోసం ఒరేకెన్ మాత్రలు సూచించారు. యాంటీబయాటిక్ యొక్క దుష్ప్రభావాల గురించి మరియు శస్త్రచికిత్స ద్వారా ప్రోస్టేట్ తొలగింపు గూర్చి ఏర్పడిన భయం కారణంగా ఇతను అల్లోపతి చికిత్స తిరస్కరించారు. ఐతే పరిస్థితి క్రమంగా విషమంగా మారి మరి నాలుగు నెలల తర్వాత అతను రాత్రి కూడా మూత్ర విసర్జన కోసం 5- 6 సార్లు మేల్కొనవలసిన ఇబ్బంది ఏర్పడింది. అతని జీవన ప్రమాణాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. అతను ప్రత్యామ్నాయ మరియు సురక్షితమైన వైద్య చికిత్స కోసం వెతకడం ప్రారంభించారు. 2019 జనవరి 20న అతను ప్రాక్టీషనరును సంప్రదించారు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC12.1 Adult tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.3 Incontinence + CC14.2 Prostate + CC15.2 Psychiatric disorders…6TD

నెమ్మదిగా అయినప్పటికీ స్థిరమైన మెరుగుదల ఉన్నందున అతను రెమిడీ కొనసాగించారు. ఐదు నెలల తర్వాత రాత్రి సమయంలో మూత్ర విసర్జన మూడు సార్లకు తగ్గిపోగా పగటి పూట అతనికి ఎటువంటి ఇబ్బంది ఏర్పడడం లేదు. 2020 జనవరి 19 నాటికి అతనికి పూర్తిగా తగ్గిపోయి అప్పుడప్పుడు మాత్రమే రాత్రి సమయంలో మేల్కొనుట జరుగుతోంది. మోతాదు TDS కు తగ్గించబడింది. తర్వాత ఐదు నెలల్లో అతను ఎప్పుడూ రాత్రి లేవవలసిన అవసరం లేదు కాబట్టి మోతాదు OD కి తగ్గించబడింది. చివరికి 2021 జనవరి 3న ఆగిపోయింది 2021 నాటికి వ్యాధి పునరావృతం కాలేదు.

ఆహార అసహనం 03566...USA

70 ఏళ్ల మహిళా శిశువైద్యురాలు 30 ఏళ్లకు పైగా కొన్ని ఆహారపదార్ధాలపై అలర్జీ కలిగి ఉన్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు, గోధుమలు తిన్న మూడు నాలుగు గంటల లోపు ఆమెకు కడుపునొప్పి వికారం మరియు విరోచనాలు కలుగుతాయి. ముందు జాగ్రత్త కోసం పెప్టో బిస్మాల్ తీసుకుంటున్నా ఇది సాధారణంగా వారం రోజుల పాటు కొనసాగుతుంది.  ఇట్టి నిస్సహాయ స్థితిలో ఈ ఆహారాలు తినడం మానేసి ఇది తన విధి అని సరిపెట్టుకొన్నారు. ఒక రాత్రి స్వామి కలలో కనిపించి ఈ సమస్యకు ప్రాక్టీషనర్ వద్దనుండి “బాబా”  ఔషధం తీసుకోమని చెప్పారు. కాబట్టి ఆమె 2019 మార్చి 9న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:  

CC4.1 Digestion tonic + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS

ఆమె ఆరునెలల పాటు తనకు ఇబ్బంది కలిగించే ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఈ రెమిడీని భక్తి శ్రద్ధలతో తీసుకున్నారు.  2019 సెప్టెంబరులో ఆమె ఒక వివాహ వేడుకకు హాజరై తను కోరుకున్న ఆహార పదార్ధాలను తిన్నారు. వాటిలో కొన్ని వంటకాలలో బంగాళదుంప, కాలిఫ్లవర్, మరియు గోధుమలు కూడా ఉన్నాయి. ఆమెకు ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా సాధారణ స్థితిలోనే ఉండడం గమనించి ఆశ్చర్యానికి గురి అయ్యారు. తనకు నయమయిందని భావించి ఆమె క్యాబేజీని కూడా తన  ఆహారంలో చేర్చి వారానికి రెండు మూడు సార్లు తినడం ప్రారంభించినా తనకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నారు. కనుక మోతాదు సెప్టెంబర్ 28న BD మరియు 2020 జనవరి 10న OD కి తగ్గించారు. 2021 మార్చిలో చేసిన రివ్యూ మేరకు ఆమె ఏ ఇబ్బంది లేకుండా ప్రతీ ఆహార పదార్ధాన్ని తింటూనే ఉన్నారు అయితే మోతాదు OD గా కొనసాగించడానికి ఇష్టపడ్డారు ఎందుకంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని భావిస్తున్నారు.   

సంపాదకుని వ్యాఖ్య: సాధారణంగా ఆహార అసహనం ఒకటి రెండు నెలల్లో వైబ్రో చికిత్సతో తగ్గిపోతుంది.

మోకాలినొప్పి, అధిక రక్తపోటు 11616...India

75 ఏళ్ల మహిళ 15 సంవత్సరాల క్రితం తన భర్త మరణించినప్పటి నుంచి మోకాలు నొప్పి మరియు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆమె “సిద్ధ” చికిత్సని ఐదేళ్లుగా ప్రయత్నించినా గణనీయమైన ప్రయోజనం ఏమీ కలగలేదు. గత ఐదేళ్లుగా ఆమె BP కి అల్లోపతి మందులు తీసుకుంటున్నారు. ఫలితంగా BP 140/90 వద్ద నియంత్రణలో ఉంటోంది. ఒక్కొక్కసారి BP ఎక్కువ కావడం వలన ఆమెకు తలలో తేలికగా అయిపోయి, బ్యాలెన్సు కోల్పోయేలా చేస్తుంది కొన్నిసార్లు ఆమె నడుస్తున్నప్పుడు క్రింద పడిపోతున్నారు. ఆమె మోకాలి నొప్పిని అలోపతి నివారిణితో తగ్గించుకో గలుగుతున్నారు. ఇటీవలే ఆమె అధిక కొలెస్ట్రాల్ కోసం ఔషధం తీసుకోవడం ప్రారంభించారు. 2019 ఆగస్టు 21న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:   

మోకాలి నొప్పికి

#1. CC12.1 Adult tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…QDS

అధిక రక్తపోటుకు:

#2. CC3.3 High Blood Pressure + CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic…TDS 

రెండు నెలల తర్వాత ఆమె మొత్తం 25% ఉపశమనం ఉన్నట్లు తెలిపారు. అంతేకాక అప్పటికే అల్లోపతీ మందులు తీసుకోవడం నిలిపి వేసినట్లు చెప్పారు. 2020 ఫిబ్రవరి 25 నాటికి ఆమె BP 125/80 వద్ద సాధారణ స్థాయికి చేరింది. మోకాలి నొప్పుల విషయంలో 70% తగ్గింపు కలిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఆమె ఎటువంటి సపోర్టు లేకుండా సులభంగా మెట్లు కూడా ఎక్కగలుగు తున్నారు. కానీ గత కొన్ని వారాలుగా పగటిపూట తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళడం, కొన్ని సమయాల్లో ఆమెకు పాదాలలో మండుతున్న భావనా కలుగుతున్నాయి. అందువల్ల తరచుగా మూత్ర విసర్జన జారీ, పాదాలలో మంటను పరిగణనలోకి తీసుకొని , #1 మరియు  #2 క్రింది విధంగా మెరుగు పరచబడ్డాయి:  

#3. CC18.5 Neuralgia + #1…TDS

#4. CC13.3 Incontinence + #2…BD 

  మార్చి 14 నాటికి కేవలం రెండు వారాల్లో అన్ని సమస్యల నుండి పూర్తిగా కోలుకున్నట్లు ఐతే అప్పుడప్పుడు మోకాలు నొప్పి మాత్రం స్వల్పంగా ఉందని అది తన వయసు దృష్ట్యా సాధారణమే అని ఆమె తెలిపారు. అ తరువాత 8 నెలలలో అనగా 2020 నవంబర్ నాటికి   #1 మరియు  #2 నెమ్మదిగా OD నిర్వహణా మోతాడుకు తగ్గించబడ్డాయి. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2021 ఏప్రిల్ నాటికి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.

దురద మరియు నీరు కారే కనులు, కంటి శుక్లాల శస్త్ర చికిత్స అనంతర స్థితి 11629...India

50 ఏళ్ల మహిళా వ్యవసాయ కార్మికురాలికి 2 సంవత్సరాల క్రితం కుడి కన్నుకు కంటిశుక్లం కోసం ఆపరేషన్ చేయబడింది. కానీ ఆమె దృష్టి 25% నుండి 75% మాత్రమే మెరుగుపడింది. అంతేకాక తన పొలంలో పనికి వెళ్లినప్పుడు తీవ్రమైన ఎండకు మరియు ధూళికి గురి అయినప్పుడల్లా కంటిలో దురద మరియు కంటివెంట నీరు నిరంతరం నీరు కారుతూ ఉంటోంది. వైద్యులు సూచించిన ఫ్లూబిగాట్ మరియు అరా ఐడ్రాప్స్ ఉపయోగిస్తోంది, కానీ అవి ఆమెకు సహాయం చేయలేదు. క్రమంగా ఆమె ఎండకు లేదా ధూళికి  గురి కాక పోయినా పై లక్షణాలు  ఏర్పడడం ప్రారంభించాయి. ఇది ఆమె రోజు వారి పనికి ప్రతికూలంగా ప్రభావితం కావడంతో చాలా బాధ అనుభవిస్తూ ఉంది. 2020 మార్చి 9న ఆమె ప్రాక్టీషనరును సందర్శించినప్పుడు ఆమె కుడి కన్ను నిరంతరంగా నీరు కారుతోంది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC7.3 Eye infections + CC7.6 Eye injury…6TD మౌఖికంగా & డిస్టిల్ వాటర్ లో కంటిచుక్కలుగా TDS   

ఆమె మెరుగుదల అనుభూతి చెందటం ప్రారంభించగానే మూడు రోజుల తర్వాత అల్లోపతి కంటి చుక్కలు తీసుకోవడం ఆపివేసారు.  మార్చి 14 నాటికి నీరు కారడం 50% తగ్గింది. దురద స్వల్పంగా తగ్గింది ఐతే మొత్తంమీద కంటిచూపు కొంత మెరుగుపడింది.   ఇప్పుడు మౌఖికంగా తీసుకొనే రెమిడీ కూడా TDS తగ్గించబడింది. ఏప్రిల్ 12న ఆమె దృష్టి పూర్తిగా సాధారణమైనదని మరియు కంటిలో దురద మాయమైందని కానీ కంటి నుండి నీరుకారడం ఇంకా స్వల్పంగా కొనసాగుతోందని తెలిపారు. మే మొదటి వారం నాటికి ఆమె అన్ని లక్షణాల  నుండి విముక్తి పొందారు. ఎండ మరియు ధూళి ఉన్నప్పటికీ పొలంలో సాధారణంగా పని చేసుకోగలుగుతున్నట్లు తెలిపారు. మే 25న మౌఖికంగా మరియు బాహ్యంగా తీసుకొనే రెమిడీలు OD కి తగ్గించడం జరిగింది.   2021 మార్చి నాటికి ఆమె చక్కగా పనిచేసుకుంటూ రెమిడీ OD గా కొనసాగించసాగారు.

అవకాడో పండుకు అలెర్జీ 03599...USA

11 ఏళ్ల అమ్మాయికి అవకాడో తిన్నప్పుడల్లా ముఖం మినహా శరీరమంతా దురద పొడిగా ఉండే పొక్కులు ఏర్పడుతున్నాయి. ఈ తీవ్రమైన అలర్జీ ప్రతిచర్య ఒక సంవత్సరానికి పైగా కలుగుతోంది. అల్లోపతి మందులతో ఆమె సాధారణ స్థితికి రావడానికి ఒక వారం పడుతోంది. వైబ్రియానిక్స్ పట్ల పరిచయము నమ్మకం ఉన్నందున అమ్మాయి తల్లి శాశ్వత పరిష్కారం కోసం ప్రాక్టీషనరును  సంప్రదించారు. 2020 నవంబర్ 27న సంప్రదింపుల సమయంలో ఇటీవలే తిరిగి లక్షణాలు ఏర్పడిన కారణంగా అమ్మాయికి  దద్దుర్లు ఏర్పడిఉన్నాయి. అలాగే ఈ అమ్మాయికి కడుపులో నట్టలు (టేప్ వార్మ్స్) కూడా ఉన్నాయని అమ్మాయి తల్లి భావించింది కానీ దానికి ఔషధం ఏదీ ఇవ్వలేదు. ప్రాక్టీషనరు ద్వారా రోగికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:   

CC4.6 Diarrhoea + CC4.10 Indigestion…నీటిలో ప్రతి పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకు ప్రతి స్పందన లేకపోతే మరొక గంట మరుసటి రోజు నుండి 6TD. 

ఆమె వేరే ఔషధం ఏదీ తీసుకోలేదు. డిసెంబర్ 5 నాటికి ఒక వారంలో దద్దుర్లు పూర్తిగా మాయమయ్యాయి. కాబట్టి ఆమె చర్మం సాధారణ స్థితికి చేరుకుంది. ఐతే స్వల్పంగా దురద ఉంది, కానీ అది కూడా కొంత కాలం తరువాత తగ్గిపోయింది. మోతాదును TDS కు తగ్గించారు. రెండు వారాల తర్వాత ఆమె ఎటువంటి అలర్జీ ప్రతిచర్య లేకుండా ఒక వారం వ్యవధిలో రెండుసార్లు అవకాడో తిన్నది. 2021 జనవరి 2న పాలు మరియు పెరుగు లకు పాపకు దీర్ఘకాలంగా ఉన్న అలర్జీ కూడా మాయమైందని పాప తల్లి సంతోషంగా తెలిపారు. మోతాదు BD కి తగ్గించి ఆరు వారాల తర్వాత ఆపివేశారు. 2021 ఏప్రిల్ నాటికి పాలు, పాల ఉత్పత్తులు మరియు అవకాడో విషయంలో ఎటువంటి అలెర్జీ పునరావృతం లేకుండా పాప ఆనందంగా స్వీకరిస్తున్నది.  

సంపాదకుని వ్యాఖ్య:  CC4.6 Diarrhoea పై కోంబోలో కడుపులో నట్టల (టేప్ వార్మ్స్) కోసం చేర్చబడింది.

పిసిఓడి సమస్య కారణంగా తక్కువ స్రావము మరియు క్రమరహిత బహిష్టు 02726...USA

38 ఏళ్ల మహిళ 20 సంవత్సరాలుగా తక్కువ స్రావము మరియు క్రమరహిత బహిష్టు కాలములతో బాధపడుతున్నారు. ఈమెకు తలమీద  జుట్టు రాలిపోవడం మరియు ఊబకాయం సమస్యలు కూడా ఉన్నాయి. డాక్టర్ ఈ పరిస్థితిని PCOD గా నిర్ధారించారు. ఎండోక్రైనాలజిస్ట్ రెండు సంవత్సరాల హార్మోన్ చికిత్స చేసిన మీదట సంవత్సరానికి ఐదారుసార్లు బహిష్టు రావడం ప్రారంభించింది కానీ క్రమం తప్పకుండా రావడం లేదు. ఆరేళ్లపాటు ఆయుర్వేదం హోమియోపతి మరియు యోగా వంటి ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు ప్రయత్నించినప్పటికీ ఆమె బహిష్టు కాలాలు సక్రమంగా కాక సంవత్సరానికి 3-4సార్లు మాత్రమే కలుగుతున్నాయి. నెల క్రితం ఆమె బరువును తగ్గించు కొనడానికి చాలా తక్కువ కేలరీల డైట్ ప్లాన్ ప్రారంభించారు. 2020 ఏప్రిల్ 8న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడి ఇచ్చారు:  

#1. CC6.2 Hypothyroid + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic + CC17.2 Cleansing…TDS 

 ఆమె రోజుకు ఒక్కసారి మాత్రమే #1 ని తీసుకొనసాగింది, తన సమస్యల విషయంలో ఎక్కువ మెరుగుదల గమనించలేదు. 2020 సెప్టెంబరులో ఆమె బహిష్టు కాలాలు సక్రమం అయ్యాయని జుట్టురాలడంలో 20% మెరుగుదల ఉందని గ్రహించారు. అందుచేత #1 ని  TDS గా తీసుకోవడానికి ప్రారంభించారు. 2020 అక్టోబర్ 2న ప్రాక్టీషనరు #1 ని క్రింది విధంగా సవరించారు.  

#2. CC6.2 Hypothyroid + CC8.4 Ovaries & Uterus + CC10.1 Emergencies + CC11.2 Hair problems + CC12.1 Adult tonic+ CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic…TDS నీటిలో  

తాను రజస్వల ఐన నాటినుండి ఎంతో కాలం తరువాత బహిష్టు కాలాలు క్రమం తప్పకుండా కొనసాగడం చూసి ఆమె ఎంతో ఆనందించారు. 2021 జనవరి 1 నాటికి ఆమె బరువు 9 కిలోలు (20 పౌండ్లు) కోల్పోయింది. జుట్టు రాలడంలో 50% మెరుగుదల ఉంది కానీ దానిపై ఆమె దృష్టి పెట్టడం లేదు. మోతాదు OD కి తగ్గించబడింది. 2021 ఏప్రిల్ నాటికి ఆమె #2 ను ముందస్తు కోసం  OD గా కొనసాగిస్తూనే ఉన్నారు.   

రోగి యొక్క వ్యాఖ్యానము  (సంక్షిప్తం చేయబడింది) తేదీ  29 జనవరి 2021:

2020 సెప్టెంబర్ నుండి నా బహిష్టు కాలాలు సరైన సమయానికి రావడం ప్రారంభమయ్యాయి. నాకు యుక్తవయ్సు వచ్చిన నాటినుండి నేను ఎప్పుడూ ఇది అనుభవించలేదు. నా పీరియడ్స్ రెగ్యులర్ గా మారడం, క్రమంగా బరువు తగ్గడం మరియు సానుకూల వైఖరి ఇవన్నీ వైబ్రియానిక్స్ యొక్క ఫలితం మాత్రమే అని నేను నమ్ముతున్నాను. అలాగే రెమిడీలు గోళి రూపంలో కన్నా నీటిలోనే చాలా ప్రభావంతంగా ఉన్నాయని నేను ధృవీకరిస్తున్నాను.  

ఎండోమెట్రియాసిస్ కాలినొప్పి అండాశయ తిత్తి 03518...Canada

41 ఏళ్ల మహిళ 2016 సెప్టెంబరులో తన కుమారునికి రొమ్ముపాలు ఇవ్వడం మానేసిన తర్వాత తీవ్రమైన తిమ్మిరి, నొప్పి (నొప్పి తీవ్రత 9-10) మరియు బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం కలిగి ఉన్నారు. ఆమెకు కటి ప్రాంతంలో నిరంతరము నొప్పి (తీవ్రత 5-9) కూడా కలుగుతూ అది ఎడమ కాలు నుండి ఆమె చీలమండ వరకు ప్రసరిస్తూ ఉంటుంది. 2017 మధ్యలో వైద్యులు దీనిని ఎండోమెట్రియాసిస్ మరియు ఎడమ కాలులో బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పోరోసిస్) గా నిర్ధారణ చేసారు. ఆమెకు ఎప్పుడూ అలసటగా ఉంటూ తన రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా చాలా కష్టమవుతూ ఉండడంతో గత మూడేళ్లుగా నొప్పి నివారణ మందులతోనే కాలం గడపసాగారు. 2020 ఆమె బహిష్టు కాలాల మధ్య రక్తపు మరకలు కనిపించడం ఆమె గమనించారు. మూడు నెలల తర్వాత అల్ట్రా సౌండ్ పరీక్షలలో ఆమె గర్భాశయంలో 1.9 సెంటీమీటర్ల తిత్తి ఉన్నట్లు వెల్లడయ్యింది. 2020 ఆగస్టు 23న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:  

ఎండో మెట్రియాసీస్ మరియు గర్భాశయ తిత్తికి:

#1. CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent…TDS in water 

కటి, మరియు కాలి నొప్పికి ఆస్టియో పోరోసిస్ కు:

#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS నీటితో  

 నెల తర్వాత ఆమెకు నొప్పుల విషయంలో 50%  ఉపశమనం లభించింది. నెల తరువాత ఆమెకు రుతుస్రావం క్రమబద్ధం కావడం, మరియు అన్ని నొప్పుల నుండి 100% ఉపశమనం కలిగింది. ఇది ఆమెను స్థానిక సాయి సెంటర్లో గతంలో తన నిస్సహాయత వల్ల చేయలేకపోయిన స్వచ్ఛంద సేవ చేపట్టడానికి ప్రోత్సహించింది. #1 మరియు #2 యొక్క మోతాదు BD కి తగ్గించబడింది. రెండు వారాల తరువాత నవంబర్ 5 న తీసిన అల్ట్రా సౌండ్ పరీక్షలో తిత్తి యొక్క ఎలాంటి ఆధారాలు లేవు. నవంబర్ 30 న మోతాదు OD కి తగ్గించి 2020 డిసెంబర్ 11న రెమిడీ పూర్తిగా ఆపివేయబడింది. 2021 ఏప్రిల్ నాటికి ఏ లక్షణాలు పునరావృతం కాలేదు, ఆమె ఎటువంటి నొప్పులు లేని ఆరోగ్య కరమైన, శక్తివంతమైన ఉల్లాసవంతమైన జీవితం గడప సాగారు.

కటి వెన్నుముక నాడీ సంకోచము (స్టెనోసిస్) 12051...India

2019 జనవరిలో 80 ఏళ్ళ వ్యక్తికి కటి దిగువ భాగం నుండి కుడి పాదం వరకు సలుపుతూ నొప్పి ఏర్పడింది.  డాక్టర్ దీనిని వెన్నుముక కటి ప్రాంతంలో నరాల సంకోచంగా నిర్ధారించారు. అతనికి అంతకు ముందునుండి మోకాలిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న కారణంగా దానికి 2014 డిసెంబర్ నుండి #1 CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles and Supportive tissue + CC20.5 Spine తీసుకుంటున్నారు (వార్తాలేఖ సంచిక 6 సంపుటి 3 చూడండి). 2019 నవంబర్లో ఇతనికి కాలిలో ఏర్పడిన నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే అతను పది నిమిషాలకు మించి నిలబడ లేక పోయేవారు. కొంచెం దూరం నడవడానికి చాలా ఇబ్బంది పడేవారు.  వైద్యుడు నేర్విజన్-పి మాత్రలు ఒక నెలపాటు సూచించాడు కానీ అది కొంత ఉపశమనం మాత్రమే ఇచ్చింది. 2019 డిసెంబర్ 12న ప్రాక్టీషనర్ పై రెమిడీ ఆపివేసి క్రింది రెమిడీ ఇచ్చారు.  

#2 NM3 Bone + NM38 Back Pain + NM40 Knees + NM97 Sciatica + OM18 Sacral & Lumbar…TDS

రెండు వారాల తర్వాత నొప్పిలో 90% తగ్గింపు ఏర్పడడమే కాకుండా అతను ఆగకుండా ఒక కిలోమీటర్ దూరం నడవగలగడం చూసి ఎంతో సంతోషించారు. మరో రెండు వారాల్లో అతను నొప్పిలో 100% ఉపశమనం పొందారు. అతని వయస్సు మరియు అస్థిపంజర ఆరోగ్య చరిత్ర కారణంగా ప్రాక్టీషనరు అదే రెమిడీ చాలా నెలలు కొనసాగించమని సలహా ఇచ్చారు. 2020 ఏప్రిల్ 29 న అతని ఆసన ప్రాంతంలో అడపాదడపా ఏర్పడే ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మల విసర్జన చేస్తున్న సమయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. కనుక మోతాదు 6TD కి పెంచబడింది. మే 15 నాటికి ఈ ఇబ్బంది తొలగిపోవడంతో మోతాదు TDS కి మార్చబడింది. మూడు వారాల తర్వాత నిర్వహణ మోతాదు OD కి తగ్గించబడింది. 2021 ఏప్రిల్ నాటికి ఎటువంటి పునరావృతం లేకుండా అతను ఆరోగ్యంగా ఉన్నారు.

108 CC బాక్స్ ఉపయోగిస్తుంటే CC20.1 SMJ tonic + CC20.5 Spine ఇవ్వండి

 పేషెంటు వ్యాఖ్యానము :

2019 నవంబర్ లో నేను నా విధులకు తిరిగి హాజరు అవుతానో లేదో అని చాలా భయపడ్డాను. నేను ఎలివేటర్ నుండి కొంచం దూరం ఉన్న నా అపార్ట్ మెంటు వరకూ కూడా నడవలేక పోయాను. నేను స్వామిని మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు సాయి వైబ్రియానిక్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. మరియు నా గత అనుభవం కూడా నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది. వైబ్రియానిక్స్ తీసుకోవడం ద్వారా స్వామి నా బాధను పూర్తిగా తొలగించారు. ఇప్పుడు నేను నడవగలగడమే కాక నా  కార్యకలాపాలు అన్నింటిని ఎవరిపైనా ఆధారపడకుండా చేసుకోగలుగుతున్నాను. ప్రస్తుతం నేను వైబ్రియానిక్స్ రెమిడిలు తప్ప వేరే ఏ మందులు వాడడం లేదు.  ఈ వయసులో నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు నా ప్రియమైన స్వామికి నేనెప్పుడూ కృతజ్ఞతలు కలిగివుంటాను.

ప్రాక్టీషనర్ల వివరాలు 03576...UK

ప్రాక్టీషనర్ 03576…యు.కె. 2006 నుండి ఈమె లాయరుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. 2014 ఏప్రియల్ లో టర్కీలో ఒక విహార యాత్ర లో ఉన్నప్పుడు ఒక భారతీయ కుటుంబం నుండి షిరిడి బాబా వారి గురించి మొదటిసారి విన్నారు. అది ఆమెలో ఎంతో ఆసక్తిని రేకెత్తించగా  2014 లోనే రెండుసార్లు షిర్డి పర్యటన చేసారు. 2015 ప్రారంభములో వీరు మధ్యవర్తి ద్వారా  ఒక స్వామిని దర్శించారు. ఆ సమయంలో స్వామి మీటింగ్ లో ఉండడం వలన మధ్యవర్తి వారి సందేశం మాత్రమే వినిపించారు.భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశ్రమానికి వెళ్ళమని ఆ సందేశం ద్వారా వీరిని ప్రోత్సహించారు. ఈ ప్రయాణానికి తగిన డబ్బు తన వద్ద ఉండడంతో (షిరిడి వెళ్లడంలో విమానాలు ఆలస్యంగా బయల్దేరిన కారణంగా విమానయాన సంస్థలు ఆమెకు తిరిగి డబ్బు చెల్లించాయి) 2015 మార్చిలో ఆమె పుట్టపర్తికి మొదటి యాత్ర చేసి చేశారు. తిరిగి వచ్చేటప్పుడు ఆమె తన జీవితాన్ని మార్చే ఒక చక్కని కల కనడం, ఆ కలలో ఆమె యొక్క అనేక ప్రశ్నలకు స్వామి సమాధానం ఇవ్వడంతో ఆమె పూర్తి శాఖాహారి గానూ మరియు మత్తుపదార్ధాల వ్యసనానికి దూరంగా ఉండే అవకాశం కల్పించింది. ఆమె తన పరిసరాల్లో జరిగే అనేక సాయికార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం ప్రారంభించారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే “నేను స్వామి వైపు కొన్ని అడుగులు మాత్రమే వేశాను కానీ స్వామి నాకు ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచారు. స్వామి నన్ను ఓదార్చడానికి, తన యొక్క ఉనికిని నిరూపించుకోవడానికి అద్భుతమైన లీలలు ఒకదాని తరువాత మరొకటి ప్రదర్శించడంతో వారి పట్ల నా  విశ్వాసం ఒక్కరాత్రిలో పెరిగిపోయింది. స్వామి పట్ల నాకున్న సందేహాలు అన్నింటినీ వారు తొలగించారు”

 స్వామి 90వ జన్మ దినోత్సవ వేడుకల కోసం ఆమె మళ్లీ పుట్టపర్తిని సందర్శించి వైద్య శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సేవ తోనే ఎక్కువకాలం కొనసాగాలని అంతర్వాణి నుండి బలమైన పిలుపు వినిపించింది. ఇది ఆమెను పార్ట్ టైం పనిలో కనీస వేతనంతో కమ్యూనిటీ కేర్ వర్కర్ గా పనిచేయడానికి పురికొల్పింది. అంతేకాక ఆమె ప్రతీ వారాంతంలో చిత్తవైకల్యం గల రోగులకోసం పనిచేయడం ప్రారంభించారు, ఐతే న్యాయవాదిగా పూర్తి సమయం ఉద్యోగంలో కొనసాగారు. మన హృదయం నుండి ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక వింటాడు అనే బైబిల్ వాక్యము వలన ప్రభావితురాలై  చర్చిలలోని స్వస్తత గదుల పట్ల ఆకర్షితురాలయ్యారు. ఇది ఆమెను  బాధలలో ఉన్న కుటుంబసభ్యులు, మరియు స్నేహితుల కోసం క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవిధంగా ప్రేరేపించింది. ఎంత కష్టమైనా సరే ఈ ప్రార్ధనలు ఆమె హృదయపూర్వకంగా చేసారు. ఇతరులకు సహాయం చేయడానికి మరొక మార్గం కోసం స్వామికి చేసిన ప్రార్ధన నేపథ్యంలో సాయి వైబ్రియానిక్స్ ఆమె జీవితంలో అభివ్యక్తమయింది. అకస్మాత్తుగా ఏర్పడిన కొన్ని ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తూ రెమిడీ తీసుకున్న వెంటనే ఇవి అదృశ్యమయ్యే సరికి వైబ్రేషనల్ హీలింగ్ పై 100% విశ్వాసం స్థిరపడింది. అందుచేత ఈ అనారోగ్యాలు ఆమె జీవితంలోకి వైబ్రియానిక్స్ ను తీసుకురావడానికి ఒక సాకు మాత్రమే అని ఆమె భావిస్తున్నారు.

ప్రాక్టీషనరుగా ఉత్తీర్ణత పొందడానికి ఆమె చేసిన ప్రయాణం అవరోధలతో కూడి ఉంది. ఆమెకు ఒక సంవత్సరం తర్వాత ప్రయత్నించమని సలహా కూడా ఇవ్వబడింది. సాధారణ పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని అంగీకరించి దీని నుండి వైదొలగడం జరిగి ఉండేదేమో కానీ దీని కోసం తీవ్రంగా ప్రయత్నించవలసిందిగా ఆమెకు స్వామి నుండి బలమైన సందేశం వచ్చింది. పర్యవసానంగా 2019 ఫిబ్రవరిలో AVP గా అర్హత సాధించారు. వెనక్కి తిరిగి చూస్తే ఈ లీల ఆమె అహాన్ని తొలగించి మానవతను తీర్చిదిద్దడానికి స్వామి ప్రణాళికలో ఇదంతా ఒక భాగమని ప్రాక్టీషనరు భావిస్తున్నారు. ఆ తరువాత త్వరలోనే 2019 సెప్టెంబరులో VP అయ్యారు.

గత రెండేళ్లలో ఆమె 100కు  పైగా రోగులకు గుండె సమస్యలు, ఆమ్లత్వం, మధుమేహం, అధిక రక్తస్రావం మరియు క్రమరహిత ఋతుకాలాలు, ప్రొస్టేట్ సమస్యలు, అఫెసియా, మూర్ఛ, ఆస్టియో ఆర్థరైటిస్ మరియు కోవిడ్-19 వంటి వివిధ రకాల వ్యాధులకు  విజయవంతంగా చికిత్స చేసారు. CC15.1 Mental & Emotional tonic, అనేది ప్రజలను శాంతియుతంగా చేసి సానుకూల ప్రశాంతత ద్వారా వారి ప్రతికూల ఆలోచనలను తొలగింపజేసి చికిత్స ప్రారంభ మయ్యేందుకు తోడ్పడే అద్భుతమైన రెమిడీ అని వీరు తెలుసుకున్నారు. ఆమె తోటపనిపై కొత్త ప్రేమైక విధానం కనుగొని మొక్కలను సంరక్షించడమువలన ఇంటికి చక్కని ఆకర్షణ  రావడముతో ఆనందంగా ఉంటుందని తెలుసుకున్నారు. మొక్కలు ఆరోగ్యంగా మరియు కీటకాలు మరియు ఇతర వ్యాధుల నుండి విముక్తి కలిగించడానికి ప్రతిరోజూ మొక్కలపై స్ప్రే చేయడానికి CC1.1 Animal tonic + CC1.2 Plant tonic ను ఈమె ఉపయోగిస్తారు. మొక్కలను వేరొక చోటికి మార్పిడి చేయడానికి ప్లాన్ చేసినా లేదా అవి అసంతృప్తిగా ఉన్నట్లు అనిపించినా  CC15.1 Mental & Emotional tonic జతచేస్తారు. ఆమె CC1.1 Animal tonic ను మరొక విధంగా కూడా విజయవంతంగా ఉపయోగించారు. ఆరేళ్ల బాలిక మూడేళ్లపాటు అల్లోపతి చికిత్సలో ఉన్నప్పటికీ తన కడుపులో నట్టలను (టేప్ వార్మ్స్)  వదిలించుకో లేకపోయింది.  ప్రాక్టీషనరు 2019 సెప్టెంబర్ లో ఆమెకు అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం ప్రారంభించారు. పాపకు ఇతర సమస్యలు తొలగిపోయాయాయి కానీ నట్టలు కొనసాగాయి. 2020 జూన్ 30న ఇదివరకటి రెమిడీకి CC1.1 Animal tonic జోడించారు. ఐదు రోజుల్లో పురుగులు బయటకు వచ్చాయి. 2021 మార్చిలో తొమ్మిది నెలల తర్వాత కూడా ఆమె ఇప్పటికీ వాటి నుంచి ఇబ్బంది పడలేదు.   

   మరొక కేసు విషయంలో కిడ్నీఉన్న ప్రాంతంలో నొప్పితో సహా బహుళ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 70 ఏళ్ల మహిళకు ప్రాక్టీషనర్ చికిత్స చేస్తూ ఉన్నారు. 2020 జనవరి 2 న అల్ట్రాసౌండ్ స్కాన్ ఆమె మూత్రపిండం పైన గడ్డ ఉన్నట్లు వెల్లడించింది. కాబట్టి ఆమె CC2.3 Tumours & Growths జోడించారు. జనవరి 28 న CT స్కాన్ చేసినప్పుడు కణితి లేనట్టు రిపోర్టు వచ్చింది.   

 ప్రాక్టీషనర్ తన ప్రార్థన గదిలో 108CC పెట్టి ఉంచుతారు. రెమిడీలు తయారు చేసేటప్పుడు స్వామి యొక్క బలమైన మార్గదర్శక ఉనికిని ఎల్లప్పుడూ అనుభవిస్తారు. చాలా మంది రోగులు సంప్రదింపులు జరిపిన వెంటనే ఇంకా రెమిడీ ఇవ్వక ముందే ఉపశమనం పొందడం ప్రారంభమైనట్లు తెలియుజేసారు. ప్రార్థనతో పాటు రెమిడీ ఇచ్చినప్పుడు వ్యాధి నివారణ త్వరగా ఉంటుందని ఆమె కనుగొన్నారు. తన ఇంట్లో ఫోటోల నుండి విభూతి మరియు తేనె రావడం దైవిక ఉనికికి నిదర్శనమని ఆమె భావిస్తున్నారు.  ఆమెకు స్వామితో మాట్లాడే అలవాటు ఉండడంతో రోగులకు వైద్యం చేసేటప్పుడు ఎల్లప్పుడూ స్వామి సహాయం తీసుకుంటారు. రోగులు వారి వ్యాధులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇవ్వడం  మరిచిపోయిన అనేక సందర్భాల్లో వారి రోగ నివారణకు స్వామి ఆమెకు మార్గనిర్దేశం చేసేవారు. వ్యాధి నివారణ తరువాత ఆమె రోగులకు దీనిని ప్రస్తావించినప్పుడు వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడం మర్చిపోయామని ధృవీకరించేవారు.

 వారంలో ఒకరోజు సాయంత్రం రోగుల యొక్క ఫోన్ కాల్స్ కోసం సమయాన్ని కేటాయిస్తూ వారాంతంలో రెమిడీలను సిద్ధం చేస్తారు.  మిగిలిన సమయంలో ఆమె రోగుల అభ్యర్థులను స్వీకరిస్తూ వారితో సంక్షిప్త ఫోన్ సందేశాల ద్వారా సమాచారం అందిస్తూ ఉంటారు. అన్ని అత్యవసర కేసులకు ఈమె ప్రాధాన్యత ఇస్తూ స్టాంపులు అంటించిన కవర్లు రెమిడీలు పంపించడానికి సిద్ధంగా ఉంచుకుంటారు. క్రమంతప్పకుండా సమావేశాలకు హాజరు కావడం ఆమెను వైబ్రియానిక్స్ ప్రపంచంతో దగ్గర కావడానికి, కష్టమైన కేసులను చర్చించడానికి, సీనియర్ల నుండి నేర్చుకోవడానికి అవకాశాన్ని అందిస్తోంది. శారీరకంగా వ్యక్తమయ్యే ముందు వ్యాధి ఈతరిక్ దేహంలో కనిపిస్తుందని  మనకు బాగానే ఉన్నట్లు  అనిపించినప్పటికీ కూడా అది సూక్ష్మశరీరంలో కొనసాగుతూ ఉంటుందని అందువల్ల చికిత్స అకస్మాత్తుగా ఆపకుండా ఉండడం ముఖ్యం అని ఆమె తెలుసుకున్నారు. ఈ అవగాహన ఆమె తన సొంత జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు రోగులకు మరింత సానుకూలమైన జీవన విధానాన్ని అవలంబించడంలో సలహా ఇవ్వడానికి తోడ్పడింది.

   ఇతర ప్రాక్టీషనర్ల కోసం ఆమె వద్ద ఒక చిట్కా ఉంది. రోగుల రికార్డులను సమగ్రముగా నిర్వహించడం సమయాన్ని ఆదా చేయడంతో పాటు రోగులకు రెమిడీలు సూచించే టప్పుడు పాత రికార్డులను వెతకడంలో ఉన్న ఇబ్బందిని నివారిస్తుంది. సేవా గంటలు పూర్తిచేయడానికి మరియు పూర్తయిన కేసులను ప్రచురణ కోసం సమర్పించడంలో కూడా సహాయపడుతుంది. మరొక చిట్కా ఏమిటంటే మనం ప్రతీ ఒక్కరికీ సహాయం చేయడానికి ఆసక్తి కనబరచినా సహాయం తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. అటువంటి సందర్భాలలో వారి కోసం ప్రార్థించడం స్వామికి శరణాగతి చెయ్యడం మరియు ఇతర రోగుల కోసం ఆ సమయాన్ని సేవను మళ్ళించడం మంచిది.

ఆమె తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రార్ధన కోసం, స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను చదవడం, సానుకూల ప్రమాణములను లేదా అఫిర్మేషన్స్ వినడం, రోగులతో ఈ అభ్యాసనాన్ని పంచుకోవడం కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. ప్రాపంచిక విషయాల పట్ల ఆమె ధృక్పథం పూర్తిగా మారిపోయింది. మన అంతర్గత ఆలోచనలు మరియు భావాలు ప్రతిబింబమే బాహ్య ప్రపంచం అని ఆమె గ్రహించగలిగారు. గతంలో ఆమెను ఆందోళనకు గురిచేసిన బాధ కలిగించే సంఘటనలు, అంచనాలు, మరియు నిరాశలను తన మనో ధృక్పధం నుండి తొలగించుకోవడం నేర్చుకున్నారు. వైబ్రియానిక్స్ ప్రాక్టీషనరుగా అర్హత సాధించడం తన అధ్యాత్మిక పురోగతికి అంతర పరివర్తనకు స్వామి ఆమెకు ఇచ్చిన ఉత్తమ అవకాశమని నమ్ముతున్నారు.  ఇతరులకు సహాయం చేయగలగడంలో స్వామికి ఒక సాధనంగా ఉండగలిగె స్థితిలో ఉంచడం తన అదృష్టంగా భావిస్తున్నారు.

 

పంచుకున్న కేసు

ప్రాక్టీషనర్ల వివరాలు 02814...India

ప్రాక్టీషనర్ 02814...ఇండియా  పెర్సనల్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేసి ఇ ఉద్యోగవిరమణ పొందిన వీరు సైన్స్ లో డిగ్రీ తోపాటు ఫార్మకాలజీ లో డిప్లమా కూడా పొందారు. 1968 లో తన తండ్రి స్నేహితుడి నుండి స్వామి ఫోటోలు అందుకున్నప్పుడు స్వామి గురించి మొదటిసారిగా విన్నారు. తర్వాత అతను ప్రతీరోజూ బాబాను ప్రార్థించడం ప్రారంభించి 1972 స్వామి దర్శనం పొందడం అదృష్టంగా భావిస్తున్నారు. తర్వాత అతను సత్య సాయి సేవా సంస్థలలో చురుకైన సేవాదళ్ సభ్యుడు అయ్యారు. రాష్ట్ర సమన్వయకర్తగానూ, హర్యానా & చండీఘర్ రాష్ట్రాలకు ప్రశాంతి సెక్యూరిటీ  PS సభ్యునిగా, బాలవికాస్ జోనల్ కోఆర్డినేటర్ గా, డిజాస్టర్ మేనేజ్మెంట్ లోనూ మరియు   అధ్యాత్మిక, విద్య,  సేవా విభాగాల అధ్యాపక బృందంలో ఫేకల్టీ మెంబరుగా పనిచేశారు నాలుగు జిల్లాలకు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న వీరు ఇటీవల కోవిడ్ పరిస్థితి కారణంగా రెండింటిని వదులుకున్నారు. పుట్టపర్తిలో తన ఆశ్రమ విధులు పూర్తి చేసిన తర్వాత 2011 మార్చి 23 న స్వామి కేవలం సేవాదళ్ కు మాత్రమే ఇచ్చిన చివరి ఆశీర్వాదం సందర్భంలో దానిని అందుకోవడం తన అదృష్టంగా ప్రాక్టీషనరు భావిస్తున్నారు.

  2010 మే నెలలో రిషికేశ్ లో జరగబోయే AVP శిక్షణ కోసం నిర్దేశించిన ఒక ప్రకటన వారు చూసారు. వెంటనే దాని కోసం సైన్ చేసి   మూడు రోజుల కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత AVP అయ్యి 54CC బాక్సుతో తన అభ్యాసం ప్రారంభించారు. 2010 అక్టోబర్లో పుట్టపర్తిలో తన రెగ్యులర్ సేవ కోసం వెళ్లినప్పుడు అతను VP శిక్షణా కార్యక్రమంలో చేరి కొత్తగా విడుదల చేసిన 108CC బాక్సును కూడా అందుకున్నారు. అర్హత దృష్ట్యా అకాలంగా అనిపించినప్పటికీ ఈ ప్రాక్టీషనరు యొక్క నిబద్ధత మరియు అంకితభావమునకు మెచ్చి డాక్టర్ అగర్వాల్ వీరిని ఉన్నత శ్రేణికి దరఖాస్తు చెయ్యమని సూచించగా 2011 మార్చిలో SVP అయ్యారు. వైబ్రియానిక్స్ లో పురోగతి సాధించాలనే వారి సంకల్పం ఎంత బలీయమైనది అంటే సీనియర్ స్థాయిలో కేవలం నాలుగు నెలల ప్రాక్టీస్ అనంతరం జూలై 2011 లో AVP టీచర్ అయ్యారు.

 2009 నుండి అల్లోపతి ఔషధం తీసుకుంటున్న అధిక రక్తపోటు వ్యాధి నివారణ కోసం ప్రాక్టీషనరు తనకు తానే మొదటి పేషంటు అయ్యారు.  2010 జూన్ లో CC3.3 High Blood Pressure (BP) తీసుకోవడం ప్రారంభించారు. ఆరు నెలలలో తను అల్లోపతి వైబ్రియానిక్స్ రెండింటిని మానివేసినప్పటికీ ఆ తరువాత 5 సంవత్సరాల వరకూ వారి బిపి సాధారణ స్థితిలోనే ఉంది. తరువాత  బి.పి పెరగడం ప్రారంభమయ్యే సరికి క్రిందటి రెమిడీకి CC3.5 Arteriosclerosis జోడించడం ద్వారా మరో రెండేళ్లపాటు అదుపులో ఉంచగలిగారు. ఆ తర్వాత వీరికి రక్తపోటు నియంత్రణ కోసం స్వల్పంగా ఆలోపతి మందు అవసరం అయ్యింది. 18 సంవత్సరాల వయసునుండే సైనస్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా దీర్ఘకాలిక తలనొప్పి, ఛాతీ ఇన్ఫెక్షన్, మరియు జ్వరము కలగసాగాయి. ప్రాక్టీషనరు 2010 జులై నుంచి CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic తీసుకోవడం ప్రారంభించారు. కేవలం మూడు నెలలలోనే  ఈ సమస్య పూర్తిగా నయం అయ్యింది. 2009లో జరిగిన ఒక ప్రమాదంలో స్నాయువు దెబ్బతినడంతో అది మెడ నొప్పికి కారణమైంది. ఒక సంవత్సరం ఆలోపతి చికిత్స తీసుకున్నప్పటికీ నొప్పి మరియు స్పాండిలైటిస్ నిరంతరాయంగా కొనసాగాయి కానీ CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine తో చికిత్స ప్రారంభించిన రెండు నెలల్లోనే ఈ సమస్యలు అదృశ్యమయ్యాయి. ఈ  రెమిడీల యొక్క సామర్ధ్యము స్వయంగా అనుభవించడం వలన వీరి విశ్వాసము రాయి వలె ధృఢంగా బలపడింది.    

    ప్రాక్టీషనర్ అన్ని సమయాల్లో వైబ్రియానిక్స్ సేవ కోసం అందుబాటులో ఉంటారు. పగటిపూట వారి రోగుల నుండి టెలిఫోన్ ద్వారా విచారణలు స్వీకరిస్తారు. సాయంత్రం సమీపంలోని ఆలయంలో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతూ రెమిడీలు ఇస్తారు. పేషంట్లకు మరునాడు ఇవ్వడం కోసం ముందటి రాత్రి వారు రెమిడీలను  సిద్ధం చేస్తారు. ప్రాక్టీషనర్ గత పదేళ్లలో 22 వేలకు మందికి పైగా అనేక రకాల ఆరోగ్య సమస్యల కోసం చికిత్స చేశారు. గ్రామీణ సేవా కార్యక్రమంలో మరియు సాయి ఆర్గనైజేషన్ నిర్వహించే  వైద్య శిబిరాల్లో వైబ్రియానిక్స్ ను ప్రవేశపెట్టడంలో వీరు ముఖ్య పాత్ర పోషించారు. ప్రశాంతి సేవకోసము  మరియు సేవాదళ్ కి వైబ్రియానిక్స్ రెమిడీలు ఇచ్చే సేవ కోసం వీరు సంవత్సరానికి 2-3 సార్లు ప్రశాంతి నిలయం సందర్శిస్తారు. ప్రశాంతి నిలయం విధుల్లో ఉన్న కొద్దిమంది సేవకులు ప్రతీ వేసవి లోనూ డెంగ్యూ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. 2019లో రెండు వారాల పాటు CC9.3 Tropical diseases 2100 మందికిపైగా సేవాదళ్ కి ఇచ్చారు. ఆ సంవత్సరంలో ఒక్క కేసు కూడా కనిపించలేదు 2020 మార్చి నుండి మే నెల వరకూ 4500 ఆశ్రమ సందర్శకులకు, మరియు తన నివాస పట్టణము మరియు సమీప గ్రామాలలో 5000 మందికిపైగా ప్రజలకు IB ఇచ్చారు.

  ఈ ప్రాక్టీషనరు 2001 నుండి మల్టిపుల్ స్కె లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న 50 సంవత్సరాల మహిళ యొక్క కేసు గురించి వివరించాలనుకుంటున్నారు. ఆమె గత పదేళ్లుగా స్టెరాయిడ్స్ తో సహా అనేక అలోపతి మందులను తీసుకుంటూ ఉన్నారు. ఆగస్టు 2011 ఆగష్టులో ప్రాక్టీషనరును సందర్శించినప్పుడు ఆమె హీమోగ్లోబిన్ మరియు కాల్షియం లోపం వలన పెళుసుగా ఉండే గోర్లు అలాగే నిద్రలేమి మరియు తిమ్మిరితో బాధ పడుతున్నారు. ఇది స్టెరాయిడ్ల దుష్ప్రభావమని ఆమె భావించారు. ఈ లక్షణాల ఆధారంగా రెమిడీలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఆమె పరిస్థితి నెమ్మదిగా మరియు స్థిరంగా మెరుగుపడడం ప్రారంభించింది. 2016 ఫిబ్రవరిలో మాత్రమే 80% మెరుగ్గా ఉందని ఆమె తెలియజేశారు. అందువలన డాక్టరు స్టెరాయిడ్లను నిలిపి వేశారు. ఆ తర్వాత వ్యాధి నివారణ చాలా వేగంగా జరిగింది. రెమిడీ యొక్క మోతాదు తగ్గించడం ప్రారంభించి 2016 డిసెంబర్ నాటికి వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా విముక్తి పొందడంతో రెమిడీ ఆపివేయడం జరిగింది. నాలుగు సంవత్సరాల తర్వాత ఆమెతో చివరిసారి మాట్లాడిన సందర్భంలో తన అనారోగ్య సమస్యల అన్నింటి నుండి విముక్తి పొందినట్లు చెప్పారు.

 విజయవంతమైన ఫలితాలు కలగడంతో రోగులు ప్రాక్టీషనర్లుగా మారి ఈ సేవలను చేపట్టడానికి ప్రేరేపించిన మరో రెండు కేసులను వీరు వివరించారు. ఒకటి వివాహమై 12 సంవత్సరాల తర్వాత పిల్లలు లేని వివాహిత జంట యొక్క సమస్య. విశ్వాసంతో భర్త    CC14.3 Male infertility మరియు భార్య CC8.1 Female tonic 16 నెలలు తీసుకున్నతరువాత భార్య గర్భం దాల్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఈ జంట ప్రాక్టీషనర్లుగా శిక్షణ పొందారు. రెండవ కేసులో 13 ఏళ్ల బాలుడు మార్చి 2012 మార్చిలో గాయం కారణంగా చెవిలో కర్ణభేరికి చిల్లులు ఏర్పడి చెవి పోటుతో బాధపడుతూ ఆరు వారాలు తీసుకున్న అల్లోపతి మందులు సహాయం చేయకపోవడంతో శస్త్రచికిత్స చేయవలసి ఉందని వైద్యులు సలహా ఇచ్చారు. అతనికి CC5.2 Deafness + CC10.1 Emergencies + CC21.11 Wounds & Abrasions ఇవ్వబడింది. 2012 అక్టోబర్లో వారు ENT వైద్యుని సంప్రదించినప్పుడు శస్త్ర చికిత్స లేకుండా చెవి పూర్తిగా నయం కావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తన కుమారుని వ్యాధి పూర్తిగా నివారణ కావడం చూసి తండ్రి AVP శిక్షణ పొంది చురుకైన ప్రాక్టీషనరుగా కొనసాగుతున్నారు.     

ఈ ప్రాక్టీషనరు స్వామి యొక్క దివ్యవాణి “నీవు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తాను” పై పూర్తి విశ్వాసం ఉంచి మిషనరీ ఉత్సాహంతో వైబ్రియానిక్స్ ను సాధన చేస్తున్నారు. అనేక సందర్భాలలో వీరు ఇట్టి భరోసాను అనుభవించారు. ఒకసారి తన స్వస్థలానికి మూడు గంటల దూరంలో ఉన్న వైద్య శిబిరంలో సేవ పూర్తి చేసిన తర్వాత పేషంట్లు ఎక్కువగా ఉండి బాగా ఆలశ్యం కావడంతో తన ఇంటికి తిరిగి రావడానికి  లాస్టు బస్సు మిస్సయ్యానని అనుకున్నారు. కానీ బస్టాండ్ చేరుకునేసరికి బస్సు ఇంకా అక్కడే ఉందని కనుగొని ఇది స్పష్టంగా స్వామి దయ అని భావించారు. మరోసారి అదే వైద్య శిబిరానికి తన తదుపరి సందర్శనలో సేవను ఒక గంట ముందుగానే ముగియడంతో ప్రాక్టీషనరు బస్టాండుకు దగ్గరగా ఉన్న ఒక ఆలయం వద్ద బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా లాస్ట్ బస్  వచ్చి వీరి ముందు ఆగింది. అందుబాటులో ఉన్న చివరి సీటు దొరకడంతో బాగా అలసిపోయిన తనకు మూడు గంటలు బస్సులో నిలబడి  ప్రయాణం చేసీ అవస్థను నివారించింది.

 ప్రాక్టీషనరు తన జీవితము అంతర్గత దైవత్వంతో నిరంతరం సన్నిహితంగా ఉండటానికి స్వామి యొక్క మార్గదర్శకత్వంపై ఆధారపడ్డారు. ఇది వీరికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప జేసింది. చికిత్స ద్వారా పూర్తి స్వస్థత చేకూరిన రోగులు ఆర్థికపరంగా లేదా ఇతరత్రా తిరిగి చెల్లించాలని అనుకున్నప్పుడు ప్రాక్టీషనరు స్వామి  ఉచితంగా మరియు పరోపకారంగా చేస్తున్న అనేక ప్రాజెక్టుల గురించి చెబుతారు. ఇది  వారిని స్వామి యొక్క దైవిక మిషన్ లో భాగం కావడానికి ప్రోత్సహిస్తుందని ప్రాక్టీషనర్ విశ్వసిస్తున్నారు.      నిస్వార్థ సేవలో నిమగ్నమవడం ఈ ప్రాక్టీషనరుకు అపారమైన ఆనందాన్ని ఇస్తోంది.  

పంచుకున్న కేసులు

ప్రశ్నలు జవాబులు

Q1.  మా దేశంలో సాధారణంగా రోగులను కనుగొనడం చాలా కష్టం. గత సంవత్సరం కాలం నుండి కోవిడ్ కారణంగా నాకు కొత్తరోగులే లేరు. నేను పోస్టల్ సేవల ద్వారా ప్రస్తుతం నా పాత పేషంట్లకు రీఫిల్స్ పంపే సేవ మాత్రమే చేయగలుగుతున్నాను. కొత్త రోగులను కనుగొనడంలో ఏమైనా సూచనలు ఇస్తారా?  

A. కొత్త రోగులను పొందడానికి ఉత్తమ మార్గం పాత రోగుల సహాయంతో వారి నోటి మాట ద్వారా ఇతరులకు తెలపడం. వారి అనుభవాలను చికిత్సలో కొనసాగుతున్న మెరుగుదలను, వ్యాధి విషయంలో వారి విజయ గాధలను వైబ్రియానిక్స్ యొక్క ప్రయోజనాలను పొందడానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు, సహచరులకు తెలియ పరచమని     ప్రోత్సహించండి. ప్రజలు తమ యొక్క మొక్కలు మరియు పెంపుడు జంతువులకు చికిత్సా ప్రయత్నం చేయడంపై ఆసక్తి చూపుతారు. మీరు VP లేదా అంత కంటే పై స్థాయిలో ఉంటే మీ సంప్రదింపు సమాచారంతో అనుకూలత కలిగిఉన్న మన ప్రామాణిక విజిటింగ్ కార్డు వెబ్సైట్ నుండి తీసుకొని ఉపయోగించే సౌకర్యం ఉంది. మీ రోగులకు వైబ్రియానిక్స్ గురించి మౌఖిక లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు ఇవ్వడానికి తగినన్ని విజిటింగ్ కార్డులను వారికి అందించండి. రోగులు విజయవంతమైన చికిత్సా గాధలను, కథనాలను చదవడానికి ఇష్టపడతారు కనుక మన వార్తా లేఖలు మరియు వెబ్సైట్ వివరాలను వారికి తెలియపరచండి.

______________________________________________________________________________________________________________

Q2. నా పేషంటు మొటిమల కోసం వైద్యులు సూచించిన అల్లోపతి క్రీము ఉపయోగిస్తున్నారు. కొంత విరామం తర్వాత బాహ్యానువర్తనం బాహ్యంగా చర్మం పై రాయడానికి వైబ్రియానిక్స్ రెమిడీ కూడా సూచించవచ్చా?   

A. అవును మీరు సూచించవచ్చు. ఈ కేసు విషయంలో వైబ్రియానిక్స్ రెమిడీ అలోపతి క్రీము కంటే ముందు చర్మం పై రాయడం మంచిది. ఎందుకంటే ఈ కంపనాలు 20 నిమిషాలలో శరీరంలో శోషింప బడతాయి. అలోపతి క్రీము మొదట చర్మం పై రాస్తె అది చర్మంపై 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండి వైబ్రియానిక్స్ కంపనాలకు ఆటంకం కలిగిస్తుంది.  ______________________________________________________________________________________________________________

Q3. బ్రాడ్కాస్టింగ్ ద్వారా రెమిడీల ప్రసార విధానం గురించి నేను కొంత అవగాహనా లోపంతో ఉన్నాను. ఈ విధానం గురించి మరియు ప్రసారానికి సంబంధించిన ఏవైనా నియమాలు మరియు అవసరాలను గురించి నాకు తెలియజేయగలరా?   

A. ప్రసారం చేసే విధానంతో సహా బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన అన్ని అంశాలు మునుపటి వార్తాలేఖలు సంపుటి 7 సంచిక 1 నుండి 4 మరియు 6లోనూ, సంపుటి 8 సంచిక 6, సంచిక 9 సంపుటి 4, సంచిక 10 సంపుటి 2, సంచిక 11 సంపుటి 4 మరియు సంచిక 12 సంపుటి 1లో ఉన్నాయి. సంచిక 7 సంపుటి 4లో SRHVP యొక్క స్లాట్ లో కార్డును ఉంచి నేరుగా ప్రసారం చేయవచ్చని పేర్కొన్నారు. అయితే కార్డ్ ఉపయోగించి మొదట సిద్ధం చేసిన రెమిడీతో మామూలుగా ప్రచారం చేయడం ఉత్తమంగా ఉంటుందని తాజా పరిశోధన నిర్ధారించింది. ఐతే మోతాదు ఇచ్చేటప్పుడు దాని యొక్క నిడివి, మోతాదు తగ్గించే విధానము, ప్రారంభ మోతాదు ఇచ్చే మందు సిద్ధం చేయడం, వంటి నియమాలు మౌఖికంగా తీసుకోవడం మాదిరిగానే ఉంటాయని గుర్తుంచుకోండి. ______________________________________________________________________________________________________________

Q4. నా రోగులలో కొంతమంది రెమిడీ తీసుకున్న కొంతకాలము తర్వాత వాడడం మానేశారు, మరికొందరు స్వీకరించిన తర్వాత భయం లేదా కుటుంబ ఒత్తిడి కారణంగా తీసుకోవడం ప్రారంభించలేదు. వార్తాలేఖలు మరియు వెబ్ సైట్ ద్వారా అవగాహన చేసుకొని కూడా రెమిడీ తీసుకొనడానికి ఇష్టపడని వారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని ఎలా అధిగమించాలో నాకు మార్గనిర్దేశం చేయగలరా?    

A.  చాలామంది తెలియని విషయాల పట్ల భయపడుతూ ఉంటారు. అందుచేత వైబ్రియానిక్స్ సాహిత్యం చదివిన తర్వాత కూడా కొందరు భయము మరియు సంశయంతొ ఈ చికిత్స తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చనే విషయం అర్ధం చేసుకోదగినదే. ఇటువంటి సందర్భాల్లో వారి మొక్కలు పెంపుడు జంతువులు వంటి వాటికి రెమిడీ ఇవ్వడం ఉత్తమం. ఇది చాలా వేగంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వైబ్రియానిక్స్ తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. ఈ రెమిడీ తీసుకోవడానికి వారికి అంతర్గతముగా ఇష్టం లేనందున ఇవి వారికి బాగా పనిచేసే అవకాశం లేదు. వైబ్రియానిక్స్ గురించి అవగాహన కల్పించడమే మన  బాధ్యత, అంతేకానీ ఈ వైద్య వ్యవస్థ యొక్క ప్రయోజనాలను గురించి చెప్పి వీటిని వాడండి అని ఎవరినైనా ఒప్పించడానికి  ప్రయత్నించకూడదు. సాంప్రదాయ ఔషధం పనిచేయని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఈ చికిత్సను కోరుకుంటారు. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే ప్రజలు వేగంగా అద్భుత నివారణ కోసం ఆశిస్తూ ఉంటారు, ఇది జరగనప్పుడు వారు మరొక చికిత్సకు మరులుతూ ఉంటారు. అలా అని వారు వైబ్రియానిక్స్ ప్రయోజనములు పొందలేకపోయారని భావం కాదు. అందుచేత ఏది జరిగినా దైవ సంకల్పంగా భావించి మీ శక్తిని ఇతర కొత్త పేషంట్లపైన కేంద్రీకరించడం మంచిది.

______________________________________________________________________________________________________________

Q5. వంశపారంపర్యంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో జీవనశైలి పాత్ర ఏమిటి?

A. మనకు బాధను కలుగజేసే వ్యాధులలో 10-30% మాత్రమే వంశ పారంపర్యంగా వస్తున్నట్లు అంచనా వేయబడింది. మిగిలినవి జీవనశైలి మరియు కాలుష్యం వంటి పర్యావరణ కారకాల వల్ల వస్తాయి. మరోవిషయం ఏమిటంటే మన శరీరంలో ఉండే జన్యువులు(జీన్స్) శాశ్వతంగా ప్రోగ్రాం (నిర్దిష్టం) చేయబడి ఉండవు. అవి మన పర్యావరణాన్ని బట్టి ప్రధానంగా మన పంచేంద్రియాల నుండి మనం తీసుకునే వాటిద్వారా ప్రభావితం అవుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. జీవనశైలి యొక్క ప్రాముఖ్యత గురించి అనగా ఆహారం, వ్యాయామం, ధ్యానం, నిద్ర, మనసును ప్రశాంతంగా ఉంచడం, మరియు ప్రతీ పనిని ఆనందంగా చేయడం గురించి రోగులకు అవగాహన కల్పించడం చాలా అవసరం. ఐతే  మీరు వారితో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరుచుకున్న తరువాతనే ఇవి చెప్పాలి. ప్రారంభములోనే ఇట్టి సున్నితమైన విషయాలు చెప్పడం వైబ్రియానిక్స్ నుండి వారిని దూరము చెయ్యవచ్చు.

______________________________________________________________________________________________________________

Q6. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నా రోగుల్లో చాలామంది చికిత్స ప్రారంభంలో 60-80% వేగంతో కోలుకున్నారు, కానీ అనంతరం చికిత్సలో మెరుగుదల ఆగిపోయింది. కారణం ఏమై ఉండవచ్చు? నా కర్తవ్యం ఏమిటి?   

A.  వైబ్రేషన్ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి శరీరం కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధికి రోగనిరోధక శక్తిని రూపొందించు కొంటుంది.   అప్పుడు శరీరం రెమిడీ ద్వారా ఇచ్చే ఆ ప్రకంపనలకు రిసెప్షన్ లేదా స్వీకరణ ఆపి వేస్తుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. రైల్వేస్టేషన్ ప్రక్కన  అపార్ట్ మెంట్ లోకి నివాసం కోసం వెళ్ళినప్పుడు ఆ శబ్దం మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. మీరు నిద్ర కూడా  పోలేరు. ఐతే కొన్ని నెలల తర్వాత మీరు శబ్దం గురించి మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీ శరీరం ఆ శబ్దం యొక్క స్పెక్ట్రమ్ నుండి  మినహాయింపబడడం వలన అది శబ్దానికి స్పందించదు. మీరు చెప్పిన పై విషయంలో శరీరంలో ఉండే ఒక రకమైన మియాజం  చికిత్స పరంగా కలిగే మరింత అభివృద్ధిని అడ్డుకుంటుంది. అందువల్ల అటువంటి సందర్భాల్లో వార్తాలేఖ సంచిక 8 సంపుటి 5 లో వివరించినట్లుగా అసలు రెమిడీని తిరిగి ప్రారంభించే ముందు SR560 All Miasms తో చికిత్స చెయ్యండి.  అలాగే ఇలాంటి ప్రశ్న కోసం వార్తాలేఖ సంపుటి 6 సంచిక 2 చూడండి.

దివ్య వైద్యుని దివ్య వాణి

 మానసిక సరళత మరియు సమతుల్య భావన లేకపోవడం అనేవి నిజానికి మనం వ్యాధి అని దేనినైతే పిలుస్తామో అట్టి స్థితికి దారితీస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మరియు వ్యాధిని ఎలా నివారించాలి అనే విషయంలో తనవద్దకు వచ్చే వ్యక్తులకు సలహా ఇవ్వడం వైద్యుని యొక్క పవిత్ర కర్తవ్యం. వ్యాధులు అభివృద్ధికి ప్రధాన కారణమైన ఆహారం మరియు విహారం (వినోద కార్యకలాపాలు) లోని ప్రతికూలధోరణి కనుగొని అణిచి వేయడానికి అతను సమాజంలో అప్రమత్తంగా ఉండాలి. మానవులు ధరించే దుస్తులు, వారు నివసించే గృహాలు,మరియు వారు ఉంటున్న ప్రాంతాలు చక్కగా మరియు శుభ్రంగా ఉండాలి. తీసుకునే ఆహారం శరీరాన్ని బలంగా ఉంచడానికి, అనారోగ్యాన్ని నిరోధించడానికి అవసరమైన అన్ని అంశాలను సరఫరా చేయాలి. ఒకవేళ ఈ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండగలిగితే తప్పనిసరిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాతావరణం నుండి మనం పీల్చే గాలి, మనం తీసుకునే నీరు, నివసించే ప్రాంతము, మన చుట్టుపక్కల ఉండే మొక్కలు మరియు జంతుజాలము అన్నింటిలోనూ హానికరమైన సూక్ష్మ జీవులు ఉన్నాయి. మనసు మరియు శరీరము శక్తివంతమైన నిరోధక కవచాన్ని కలిగి ఉండకపోతే అవి అనారోగ్యానికి కారణమవుతాయి. 

…శ్రీసత్య సాయి బాబా, “డాక్టర్ వృత్తి' దివ్యవాణి 1980సెప్టెంబర్                                                                                        http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-53.pdf

 

నిస్వార్థ సేవ చేయడానికి మాత్రమే మానవ శరీరం మీకు ఇవ్వబడింది అనే విషయం మీరు గ్రహించాలి. అట్టి సేవ హృదయాన్ని విశాలం చేస్తుంది, అహాన్ని నాశనం చేస్తుంది, మరియు ఆనందాన్ని సృష్టిస్తుంది. సేవ మానవ సోదరత్వము, దైవ పితృత్వము అనే విశాల భావము పెంపొందింప జేస్తుంది. మీ లక్ష్యము అక్కడితో పూర్తిఐనట్లు కాదు, ఆధ్యాత్మిక ఏకత్వం (మానవాళి అందరిలోనూ ఉన్న దివ్యత్వము ఒకటే) గురించి ప్రచారం కూడా చెయ్యాలి. మానవ జాతిని ద్వైత భావమునుండి అద్వైత భావము వైపు నడిపించాలి.      

...శ్రీసత్య సాయి బాబా, “సేవ యొక్క అధ్యాత్మిక ప్రాముఖ్యత” దివ్యవాణి, 1995నవంబర్21                         http://www.sssbpt.info/ssspeaks/volume28/sss28-34.pdf

 

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింపబోయే వర్క షాప్ లు సదస్సులు *

 • యుఎస్ఎ: వర్చువల్ AVP వర్క్ షాప్ ** వారానికి రెండుసార్లు సెప్టెంబర్ నుండి నవంబర్ 2021   సంప్రదించ వలసిన వారు సుశాన్ వెబ్సైట్ [email protected]
 • ఇండియా పుట్టపర్తి : వర్చువల్ AVP వర్క్ షాప్, వారపు తరగతులు 2021 జూన్  2 నుండి జులై 16 వరకు ముగింపులో పుట్టపర్తిలో ప్రాక్టికల్ వర్క్ షాప్ (గురుపూర్ణిమ అనంతరం) 2021 జులై 26-27 ** (వివరాలు పాల్గొనే వారికి అందించబడతాయి), సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
 • ఇండియా పుట్టపర్తి: వర్చువల్ AVP వర్క్ షాప్, 2021 సెప్టెంబర్ నుండి నవంబర్ ** తేదీలు తరువాత ప్రకటించబడతాయి సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా  టెలిఫోన్ నంబరు  8500-676-092
 • ఇండియా పుట్టపర్తి: వర్చువల్ AVP వర్క్ షాప్ Jan 2022** తేదీలు తరువాత ప్రకటించబడతాయి సంప్రదించ వలసిన వారు హెమ్ వెబ్సైట్  [email protected]

* AVP మరియు SVP వర్క్ షాప్ లు ప్రవేశ ప్రక్రియ మరియు ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఉంటాయి. పునశ్చరణ సదస్సులు ప్రస్తుతం సాధనలో ఉన్న ప్రాక్టీషనర్లకు ఉంటాయి.   

** మార్పులు ఉండవచ్చు

అదనంగా

1. ఆరోగ్య చిట్కాలు

మీ ఆహారాన్ని పరిమళ భరితం చేయడానికి మూలికలు

బాహ్యంగా కనిపించే చర్మం కింద సున్నితమైన మరొక పొర ఉంటుంది. ఈ పొరే చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఆకుపచ్చని  ఆకులు ఇతర ప్రయోజనాలు కూడా కలిగి ఉండటమే కాకుండా ఈ పొరను బలోపేతం చేస్తాయి”.…శ్రీ సత్య సాయి బాబా1

1. మూలికలు అంటే ఏమిటి?

 మూలికలు అనేవి ఆకుకూరలు లేదా మొక్క యొక్క లేత కొమ్మలతో పాటు పుష్పించే భాగాలు. మూలికలలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని ఆహారానికి రుచిని చేకూర్చడానికి, కొన్ని కూరగాయలుగానూ, కొన్ని ఓషధులుగానూ, కొన్ని సౌందర్య చికిత్సకోసం, కొన్ని పరిమళ ద్రవ్యాలు గానూ లేదా క్రిమిసంహారక మందులుగా ఉపయోగిస్తారు. ఈ వ్యాసంలో ఆరోగ్యాన్ని పెంచే తినదగిన వనమూలిక ఆకులను అందిస్తున్నాము. సుగంధద్రవ్యాల కన్నా తేలికైన ఈ మూలికలు ఆహార పదార్ధాలకు రుచి, కాంతి, మరియు రంగులను అందించడానికి తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు.2-4

2. మూలికల యొక్క ప్రయోజనాలు ఉపయోగము మరియు నిల్వ

ప్రయోజనాలు: ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, వ్యాధిని నివారించడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి, జలుబు వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడానికి, నొప్పులు నివారించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, మరియు యాంటీ ఆక్సిడెంట్ లు మూలికలలో సమృద్ధిగా ఉంటాయి.4-5 తాజా మూలికలు ఆహారంలో చక్కెర మరియు ఉప్పు స్థానమును భర్తీ చేయడానికి లేదా కనీసం వీటిని తగ్గించి తీసుకోవడానికి ఉపయోగపడతాయి.5

 వినియోగము: మృదువైన మరియు లేత మూలికలను చేతితో చిన్న చిన్న భాగాలుగా తురిమి వంట చివరిలో లేదా వడ్డించే సమయంలో వంటకాలలో చేర్చవచ్చు. ఎండిన మూలికలను వంట ప్రారంభంలో లేదా మధ్యలో వంటకాలకు జోడించండి. ఒక టీస్పూన్ ఎండిన మూలికలు నాలుగు టీస్పూన్ల పచ్చి వాటికి సమానం, కనుక  ప్రధాన ఆహార పదార్థం యొక్క రుచి పాడవకుండా  చూసుకోవడానికి వీటి ప్రభావాన్ని తెలుసుకొనడానికి ఒక చిటికెడుతో ప్రారంభించండి.6,7

నిల్వ: తాజా లేదా పచ్చి మూలికలు మెత్తగా కడిగి జాగ్రత్తగా ఆరబెట్టి పేపరుతో చుట్టి రిఫ్రిజిరేటరులో పునర్వినియోగపరచదగిన సంచిలో దాచిపెడితే ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. తులసి మరియు మెంతి వంటి సున్నితమైన వాటిని గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో నిలవ చేయండి. ప్రతీ రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ పాడైన ఆకులు లేదా కొమ్మలను తీసివెయ్యాలి. ఎండిన మూలికలను గాలి చొరబాటు లేని ప్లాస్టిక్ సంచులు, గాజు పాత్రలు, లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలలో భద్రపరిచి చల్లని, వెలుగు సోకని  మరియు పొడి ప్రదేశంలో నిల్వ చెయ్యాలి ఫ్రిజ్ లో నిలువ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అలా చేస్తే అవి సంవత్సరము లేదా అంత కంటే ఎక్కువ కాలమే నిలువ ఉంటాయి. మూడు నాలుగు నెలలకు ఒకసారి కొద్ది మొత్తాన్ని నలిపి వాసన పరిశీలించడం ద్వారా వాటి తాజాదనాన్ని తనిఖీ చేయవచ్చు. ఈ సువాసన తాజాగా ఉండాలి.6,8,9

మనం సాధారణంగా ఉపయోగించే 20 రకాల మూలికలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. వీటి యొక్క భారతీయ పేర్లను కూడా అవసరమైన చోట వీటి పేర్ల ప్రక్కనే ఇవ్వబడ్డాయి.

3. రుచికరమైన మూలికలు

3.1 బాసిల్ లేదా పవిత్ర తులసి: తులసిలో వివిధ రకాలు అనేక రుచులతో ఉన్నాయి. తీయని తులసి ఆకులు అనేక రకాల సాస్ లలో (ముఖ్యంగా ఇటాలియన్పెస్టోలలో),  సలాడ్లు, పులుసులు, మరియు పిజ్జా పైన చల్లడం ద్వారా పరిమళ భరితమైన రుచి వస్తుంది. ఎక్కువ పరిశోధనకు గురిచేయబడిన “తులసి” ఆకు లేత ఆకుపచ్చ రంగుతో లేదా ఉదా రంగులో ఉండి పళ్ల మాదిరిగా ఉండే  అంచులు కలిగి మిరియాలకు ఉండే ఘాటైన వాసన ఉండి నయం చేసే అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. జీవనశైలి వ్యాధులను నివారించడానికి, రక్తంలో చక్కెరను సాధారణీకరించడానికి, రక్తపోటును తగ్గించడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి మరియు జలుబు ఫ్లూ తో పాటు ఆందోళన నిరాశ ఉపశమనం కలిగించడానికి దీని సమ్మేళనం ఉపయోగపడుతుంద.10,13

3.2 బే/ బిర్యానీ ఆకులు (తేజ్ పత్తా):  అన్ని మూలికల్లో కెల్లా చాలా సుగంధ భరితమైన ఈ ఆకులను వంట సమయంలో వేసి వడ్డించే ముందు తొలగిస్తారు. సైనసైటిస్ నుండి ఉపశమనం కోసం వంటలలో ఉపయోగిస్తారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పోషక పదార్ధాల శోషణం పెరుగుతుంది. మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు కడుపులో వ్రణముల నివారణ జరుగుతుంది.14-16

3.3 సెలరీ (అజ్మడ్): ఘాటైన పరిమళ భరిత రుచికలిగిన సంప్రదాయ మూలిక ఐన దీని ఆకులు సలాడ్లు, పులుసులు, నూడుల్స్ పైన చల్లడానికి అనువైనవి. మరియు వీటి కాడలను పచ్చివిగా కూడా తింటారు లేదా కూరగాయల వలె వండుతారు. ఇది సహజ డిటాక్సీఫయర్ అనగా మలినాలు తొలగించేదిగా పనిచేస్తుంది మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లను నివారిస్తుంది.17


3.4 చైవ్: ఈ మూలిక సలాడ్లు మరియు కూరగాయల వంటకాలపై ముఖ్యంగా వేపిన బంగాళాదుంపల వంటకంపై చల్లడానికి బాగుంటుంది. విటమిన్ A,C,K ఖోలిన్, ఫోలెట్, మరియు ఫైబర్ యొక్క మంచి మూలము. ఇది కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎండ తీక్షణత వలన ఏర్పడే చర్మ వ్యాధులు, గొంతులో పుండులను నయం చేస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, శారీరక జీవక్రియలను మరియు పిండము అభివృద్ధికి సహాయపడుతుంది. తేలికపాటి ఉద్దీపన కారిణిగాను, మూత్ర విసర్జన కారిణిగా మరియు సహజ కీటక వికర్షకముగా ఉపయోగ పడుతుంది. దీనిని వెంటనే ఉపయోగించటానికి సిద్ధంగా ఉంటే తప్ప వాటిని కత్తిరించ కూడదు. ఎండబెట్టి ఫ్రిజ్ లో దాచడం ద్వారా కొన్ని సంవత్సరాల వరకు నిల్వ చేయవచ్చు.18,19

3.5 కొత్తిమీర (రాధనియా): కొత్తిమీర ధనియాల మొక్క యొక్క తాజా ఆకులను సూచిస్తుంది. లేత ఆకులు మరియు కాండము తో సహా సలాడ్లు, పులుసులు, మరియు ఇతర వంటకాలకు మంచి రుచిని ఇస్తాయి. A, C, మరియు K విటమిన్లకు మంచి మూలము. ఇది జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, చర్మపు దురదను తగ్గిస్తుంది. ఆందోళన తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది, దృష్టిని మెరుగు పరుస్తుంది, అస్థిపంజర వ్యవస్థకు చక్కని పటుత్వాన్ని ఇస్తుంది.4,20,21 (వార్తాలేఖ సంచిక 11సంపుటి 3చూడండి).

కులాంట్రో / పొడవైన కొత్తిమీర: కొత్తిమీరతో పోల్చుకొని తరుచూ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పొడవైన ఆకులు మరియు బలమైన వాసన కలిగిన అసాధారణ మూలిక. ఎక్కువగా ఎండిన రూపంలో లభిస్తుంది.4


3.6 కరివేపాకు (కాది పత్తా): ఈ అద్భుతమైన చెట్టు ఆకులు (భారత దేశంలో అనేక గృహాల్లో పెంచుకునే చెట్టు) భారతదేశం మరియు శ్రీలంకలో వంటలో ఒక తప్పనిసరియైన మరియు అవసరమైన పదార్థము. ఇది రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి  అంటువ్యాధులు మరియు రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి జీర్ణక్రియ పెంచడానికి మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి తాజా ఆకులు నమలవచ్చు.22-24

3.7 మెంతులు (సువాబాజి):  పచ్చళ్లు మరియు అనేక వంటకాలను రుచికరం చేయడానికి, స్నాక్స్ మరియు సలాడ్లలోనూ ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో పెద్ద మొత్తంలో బంగాళదుంపలతో కలిపి కూరగాయల వలె ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియను పెంచుతుంది, అంటువ్యాధులు నివారిస్తుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, కాల్షియం శోషణను పెంచుతుంది, బహిష్టు సంబంధిత     తిమ్మిరి మరియు నిద్రలేమి నుండి ఉపశమనం ఇస్తుంది. ఇది ఒక రోజుకు మించి ఎక్కువ కాలం తాజాగా ఉండదు.25-27

3.8 ఫెన్నెల్ (సంఫ్ కె పత్తే): చూడడానికి మరియు రుచి విషయంలో ఇది మెంతి కూరను పోలి ఉంటుంది. ఇది సంపూర్ణంగా తినదగిన మూలిక. దీని రసం జీర్ణక్రియకు సహాయపడుతుంది, మరియు మూత్ర సంక్రమణలు, శరీర నొప్పి మరియు జ్వరం, నిద్రలేమి, నిరాశ నుండి ఉపశమనం కలిగిస్తుంది.28 (వార్తాలేఖ సంచిక 11 సంపుటి 3 చూడండి)

3.9 పుదీనా (పుదీనా):  పుదీనా త్రాగునీరు, పానీయాలు, ఐస్క్రీమ్లు మరియు క్యాండీ లకు పరిమళ భరితమైన తీపి మరియు మసాలా రుచిని ఇస్తుంది. జీర్ణక్రియకు, ప్రేగులలో పురుగులు, ఛాతిలో రద్దీ చికిత్స చేయడానికి, మెదడు పనితీరు పెంచడానికి, మరియు హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది సౌందర్య సాధనాలు, టూత్ పేస్ట్, మరియు నోటి తాజాదనం పెంచేందుకు ఉపయోగపడుతుంది. పుదీనా మొక్కలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా తెలిసినవి రెండు స్మియర్మింట్ (సాధారణ వంటలు మరియు చ్యూయింగ్ గమ్ లో ఉపయోగిస్తారు) మరొకటి పిప్పర్ మింట్, ఇది అప్రమత్తత మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.29-31

3.10 ఒరిగానో: రుచి కోసం పిజ్జా, పాస్తా, సలాడ్ మరియు పులుసులపై చల్లుతారు. కడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, మరియు ఇన్ఫెక్షన్ చికిత్స చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఒరిగానో టీ ఆరోగ్యానికి గొంతు నొప్పి మరియు దగ్గుకు మంచిది.32-35

మార్జోరామ్: ఒరిగానో తో సారూప్యముగా ఉంటుంది కానీ దానికన్నా తేలికైనది మరియు తీయగా ఉంటుంది.35

3.11 పార్స్లీ: రూపము వినియోగము మరియు ప్రయోజనాల విషయంలో కొత్తిమీర మాదిరిగానే ఉండే ఈ పార్స్లీ ఆకులు వాడిగా రంపము వలె అంచులు ఉండి చేదైన రుచి కలిగి ఉంటాయి. ఇది పేలవమైన రుచిని కలిగి కొత్తిమీరతో కలిపినపుడు రుచి మెరుగుపడుతుంది. సహజముగా శ్వాసకు తాజాదనం అందించేది, మూత్ర విసర్జన కారిగా కూడా పనిచేస్తుంది. దీనిలో  విటమిన్ A, C & K తో పాటు B కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతుంది, కళ్ళు, చర్మము, గుండె మరియు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరియు ఆమ్లత్వం మరియు త్రేనుపులను తగ్గిస్తుంది.4,36-38

 ఫ్రెంచ్ పార్స్లీ /చెర్విల్ : పార్స్లీతో సారూప్య మైనది కానీ కొంత సున్నితంగా ఉంటుంది.4

3.12 రోస్మేరీ (గుల్మెహాంది): పుదీనా కుటుంబానికి చెందిన ఈ ఆకు మొనలు సూదిగా ఉంటాయి వంటకాలలో చివరిలో రుచి కోసం వేస్తారు, మరియు టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది, ఒత్తిడి మరియు మగతను తగ్గిస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కీటకాలకు వికర్షకంగా పనిచేస్తుంది. పరిమళ ద్రవ్యాలు మరియు సౌందర్య సాధనాల తయారీలో తరచుగా ఉపయోగిస్తారు.39-41

3.13 సేజ్: ఆకులపై జుట్టు లాంటి నిర్మాణములతో కలప వంటి ఈ మూలిక రోజ్మెరి తో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఆహారపదార్ధాలకు రుచిని ఇవ్వడమే కాకుండా హెర్బల్ టీ మరియు ఇతర పానీయాలు తయారు చేయడానికి అనువైనది.  సాంప్రదాయకంగా ఇది అంటు వ్యాధులు, నొప్పి, నోటిలో పుండ్లు,మరియు జ్ఞాపకశక్తి సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సహజ సిద్ధమైన ప్రక్షాళిని, గాలిలో మలినాలను పొగుడుతుంది. ప్రాచీన కాలంలో దుష్ట శక్తులను నివారించడానికి మరియు పాము కాటుకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగించారు.4,42,43

3.14 సావోరీ: శీతాకాలపు సావొరీ: ఇది రుచికరమైన మూలిక, ఏదైనా ఆహార పదార్ధానికి పుదీనా రుచిని జోడించి గలదు. సుగంధ భరిత మిరియాల రుచి కలిగిన  వేసవిసావొరీ  అనేది పార్స్లేకి మంచి ప్రత్యామ్నాయము.  సలాడ్ లలో పచ్చిది ఉపయోగించ వచ్చు  లేదా వంటకాలలో ముఖ్యంగా బీన్స్ తో ఉడికించి వాడవచ్చు. ఈ రెండు రకాల సేవోరీ లు రుచికరమైనవి పోషకకరమైనవి. కండరాల నొప్పి, శ్వాసలో ఇబ్బంది,  జీర్ణ సమస్యలు మరియు కీటకాలు కొరకడం లేదా కుట్టడం నుండి ఉపశమనం కలిగించడానికి మరియు అంటువ్యాధులతో పోరాడటానికి సహాయ పడతాయి.44-47

3.15 టెర్రాగన్: పచ్చిగా తినడానికి   రుచికరమైనది. పంటి నొప్పి నుండి  మరియు ఆగిపోయిన  రుతుస్రావమునకు చికిత్స చేస్తుంది.      బ్యాక్టీరియాతో పోరాడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది, మరియు నిద్రను పెంచుతుంది. టెర్రగాన్ టీ వత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. 4,48

3.16 తైమ్: ఒరిగానో కు బంధువుగా పరిగణింపబడే ఈ ఆకుకూర మట్టి వాసనతో, నిమ్మకాయ, మరియు పుదీనా వలె ఉంటుంది. రోజ్మేరీతో కలిసి ఉపయోగించినప్పుడు మంచి రుచిని ఇస్తుంది. ఇది ఓరిగానో కంటే ఎక్కువ విటమిన్ A & C కలిగి ఉంది. ఇది సహజ మూత్రవిసర్జన కారి, ఆకలిని పెంచుతుంది, జీర్ణాశయ మరియు శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించగలదు. మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడే గలదు ఇది తెగుళ్ళను పోగొడుతుంది పురాతన కాలంలో ఇది విషాన్ని నివారించడానికి మరియు చికిత్స చేయడానికి సమర్థవంతంగా ఉపయోగించబడింది.4,49,50

4. మూలిక ఆకులు కూరగాయల మాదిరిగా ఎక్కువగా ఉపయోగపడతాయి

4.1 అమరాన్త్ ఆకులు (చౌలయ్): అనేక రకాల ఆకుకూరల కన్నా ఉన్నతమైన గుణాలు కలిగిన దీనిలో విటమిన్ A, C, B కాంప్లెక్స్ K మరియు ఐరన్ లు సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో బచ్చలికూర కంటే ఎక్కువ పొటాషియం మరియు కాల్షియం ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధిని, ఇనుము లోపము, మరియు రక్తహీనత నివారిస్తుంది. లేత ఆకులను సలాడ్లతో కలపవచ్చు లేదా జూస్ గానూ, పేస్టు గానూ, కూరగాను తయారుచేసుకోవచ్చు అలాగే కాయ ధాన్యాలలో కూడా కలిపి వండుకోవచ్చు. 51-53   

4.2 ఫెను గ్రీక్ ఆకులు (మెంతి): దీనిని సాధారణంగా గోధుమ పిండి రొట్టెలు (చపాతీలు)కు చట్నీగా లేదా కూరగాయగా ప్రత్యేకించి  బంగాళదుంపతో కలిపి వండుతారు. దీనిని నిత్యమూ వినియోగించడం రక్తహీనత మరియు అన్నిరకాల జీర్ణకోశ వ్యాధులకు, ఇంకా ఇతరములైన బెరిబెరి  మరియు క్షయ వంటి వ్యాధుల నివారణకు, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు, మరియు శరీర ఉష్ణోగ్రత స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. దీనిని పేస్టుగా తయారు చేసి ఉపయోగిస్తే మచ్చలు తొలగించడానికి, బట్టతల రాకుండా నియంత్రిస్తుంది. నిమ్మరసంతో కలిపి సహజమైన మౌత్ వాష్ గా చేయవచ్చు.54 (వార్తాలేఖ సంపుటి 11సంచిక 3 & 5కూడా చూడండి.)

4.3 మునగ: అద్భుతమైన మొక్క యొక్క అత్యంత శక్తివంతమైన భాగం ఆకులు. వీనిలో 90 కంటే ఎక్కువ పోషకాలు, 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు, మరియు అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. పాలలో కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం మరియు బచ్చలి కూర కన్నా 3 రెట్లు ఐరన్ దీనిలో ఉంటాయి. ఆకులను రొట్టెలు, దోశాలు తయారీకి, పేస్టుగా తయారుచేస్తారు లేదా వాటి పోషక విలువల కోసం కూరగాయల కలిపి ఉపయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో చక్కెరను సమతుల్యం చేస్తుంది, మరియు జీర్ణ వ్యవస్థకు అద్భుతమైనది. మునగ గింజలను మురికి నీటిలో వేస్తే అవి నీటిలోని మురికిని పీల్చుకొని ఆ నీటిని త్రాగడానికి యోగ్యంగా చేస్తాయి.55-57 (వార్తాలేఖ సంచిక 11సంపుటి 5ను కూడా చూడండి.)

4.4 సోరెల్ ఆకులు/ గోంగూర: కాలుష్యనికి భయపడకుండా అన్ని రుతువులలో తినగలిగే ఏకైక ఆకుకూర ఇది. సాధారణంగా రుచికి ఉప్పగా ఉంటుంది కానీ వేడిచేయడం ద్వారా పుల్లని రుచి పొందుతుంది. సాధారణంగా దీనిని చట్నీ గా తీసుకుంటున్నా పచ్చళ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలతో కలిపి కూడా ఉపయోగిస్తారు. దీనిలో పోషక పదార్ధాలు అధికంగా ఉండడంవల్ల రక్తహీనతతో సహా అనేక వ్యాధులను నివారిస్తుంది.58-60

5. హైబ్రీడ్ మూలికలు

5.1 హెర్బ్స్ డి ప్రొవిన్స్: సాధారణంగా ఫ్రెంచి వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది తులసి, బే ఆకులు, మార్జోరామ్, ఒరిగానో, రోజ్మేరీ,  సావొరీ, తారాగన్, మరియు తైమ్ వంటి ఎండిన మూలికలు సుగంధ మిశ్రమం.61

5.2 తిసాని / హెర్బల్ టీ: మూలికలతో తయారుచేసుకునే టీ మనలో ఎంతో చైతన్యం నింపుతుంది. ఏదైనా  మీకు నచ్చిన మూలిక తీసుకొని వేడి నీటిలో రెండు మూడు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఉంచి వడగట్టి త్రాగండి. ఈ విధమైన రూపంలో తీసుకుంటే సులువుగా జీర్ణం అవుతుంది మరియు ఆ మూలిక యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఒరిగానో, రోజ్మెరీ, సేజ్, తారాగన్, తైమ్, తులసి వంటి వాటితో పాటు మనం  యూకలిప్టస్ ఆకులు,ఎఖినేసియా, మందార (యాంటీవైరల్), సోపు లెమనోగ్రాస్, పుదీనా, సెలెరీ మరియు రూయిబాస్ (నిర్విషీకరణ కోసం మంచి జీర్ణక్రియ, మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి) లేదా చెమోమైల్ మరియు పాసన్ ఫ్లవర్ (ప్రశాంతత కోసం) వీటి నుండి టీ తయారు చేసుకొనవచ్చు.62-66

6. ముగింపు

 అన్ని మూలికలను తక్కువ మొత్తాలలో తీసుకుంటే అవి ఆహారాన్ని ఆకలి పెంచేవిగా, తాజాగా ఉండేలా చేస్తాయి మరియు మనల్ని సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. మూలికలను కూరగాయలుగా ఉపయోగించినప్పటికీ తగుమొత్తములోనే తీసుకోవడం ప్రధానం. అలర్జీ ఉన్నవారు, రక్తం పలచబడటానికి మందులు వాడేవారు, లేదా జీవనశైలి లేదా ప్రాణాంతక వ్యాధుల నిమిత్తం మందులు వాడేవారు, లేదా గర్భిణి స్త్రీలు నిర్దిష్ట మూలికలు మరియు వాటిని తీసుకునే పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

 సూచనలు లింకులు

 1. Food for a healthy body and mind, Divine Discourse at the Sri Sathya Sai Institute of Higher learning, July 1996, https://static.ssssoindia.org/wp_uploads/2018/03/26172212/Preventive-Health-Care-Module.pdf, page 15.
 2. What is a herb: http://www.differencebetween.net/science/health/difference-between-plants-and-herbs/
 3. Herb milder than spice: https://www.britannica.com/story/whats-the-difference-between-an-herb-and-a-spice
 4. Various benefits of herbs: https://www.homestratosphere.com/types-of-herbs/
 5. Beneficial herbs: https://www.mdlinx.com/article/10-nutritious-herbs-you-should-add-to-your-diet-now/lfc-3732
 6. Usage and Storage of herbs: https://www.thespruceeats.com/what-are-herbs-995714
 7. https://www.thespruceeats.com/how-to-substitute-dried-herbs-for-fresh-herbs-1388887
 8. Storing fresh herbs: https://www.goodhousekeeping.com/home/gardening/a33670791/how-to-store-fresh-herbs/;
 9. https://www.thekitchn.com/your-guide-to-storing-fresh-herbs-in-the-fridge-231412
 10. Basil varieties, use, benefits: https://www.thespruceeats.com/what-is-basil--1807985;
 11. https://www.medicalnewstoday.com/articles/266425#benefits
 12. Holy basil/tulsi Research-backed efficacy: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5376420/;
 13. https://draxe.com/nutrition/benefits-of-basil/
 14. Bay leaves: https://www.everydayhealth.com/diet-nutrition-pictures/healthy-herbs-and-how-to-use-them.aspx;
 15. https://www.thespruceeats.com/what-is-a-bay-leaf-995576;
 16. https://draxe.com/nutrition/bay-leaf/
 17. Celery: https://draxe.com/nutrition/benefits-of-celery/
 18. Chives: https://draxe.com/nutrition/what-are-chives/;
 19. https://draxe.com/nutrition/what-are-chives/
 20. Cilantro/Coriander: https://draxe.com/nutrition/coriander;
 21. Benefits of coriander leaves: https://www.netmeds.com/health-library/post/coriander-leaves-5-excellent-health-benefits-of-adding-these-aromatic-leaves-to-your-daily-diet
 22. Curry leaves: https://www.netmeds.com/health-library/post/curry-leaves-medicinal-uses-therapeutic-benefits-for-hair-diabetes-and-supplements;
 23. https://draxe.com/nutrition/top-herbs-spices-healing/;
 24. https://indianexpress.com/article/lifestyle/health/chew-curry-leaves-ayurveda-diet-health-benefits-6559838/
 25. Dill leaves: https://www.netmeds.com/health-library/post/dill-leaves-astonishing-benefits-of-adding-this-nutritious-herb-to-your-diet;
 26. https://draxe.com/nutrition/top-herbs-spices-healing/;
 27. https://www.tarladalal.com/glossary-dill-leaves-shepu-suva-bhaji-376i
 28. Fennel leaves: https://www.1mg.com/hi/patanjali/saunf-benefits-fennel-in-hindi/
 29. Mint: https://www.netmeds.com/health-library/post/pudinamint-leaves-health-benefits-of-pudina-juice-uses-for-skin-hair-and-side-effects;
 30. https://www.webmd.com/diet/health-benefits-mint-leaves#1;
 31. https://draxe.com/nutrition/mint-leaves/
 32. Oregano: https://www.webmd.com/vitamins/ai/ingredientmono-644/oregano;
 33. https://draxe.com/nutrition/oregano-benefits/;
 34. https://www.thespruceeats.com/greek-oregano-tea-1705058
 35. Oregano & Marjoram: https://www.masterclass.com/articles/whats-the-difference-between-oregano-and-marjoram
 36. Parsley: https://draxe.com/nutrition/parsley-benefits/;
 37. Parsley vs Cilantro: https://www.wellandgood.com/cilantro-vs-parsley/
 38. Parsley vs coriander: https://economictimes.indiatimes.com/parsley-versus-coriander-a-dichotomy-of-cultural differences/articleshow/25002244.cms?from=mdr
 39. Rosemary: https://draxe.com/nutrition/rosemary-benefits/;
 40. https://www.verywellmind.com/does-rosemary-actually-improve-your-memory-4156875;
 41. https://www.flushinghospital.org/newsletter/the-health-benefits-of-rosemary/
 42. Sage: https://draxe.com/nutrition/sage-benefits/;
 43. https://www.netmeds.com/health-library/post/sage-5-stunning-health-benefits-of-the-memory-boosting-herb
 44. Savory: https://www.homestratosphere.com/types-of-herbs/#Winter_Savory;
 45. https://www.healthbenefitstimes.com/summer-savory/;
 46. https://www.masterclass.com/articles/what-is-savory-herb-learn-about-winter-and-summer-savory-with-4-recipe-ideas;
 47. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4142450/
 48. Tarragon: https://draxe.com/nutrition/tarragon/
 49. Thyme: https://draxe.com/nutrition/thyme/;
 50. https://www.healthline.com/health/health-benefits-of-thyme
 51. Amaranth leaves: https://www.nutrition-and-you.com/amaranth-greens.html;
 52. https://pharmeasy.in/blog/16-health-benefits-and-nutritional-value-of-amaranth-leaves/;
 53. https://www.researchgate.net/figure/Nutrients-comparison-of-vegetable-amaranth-with-spinach-and-other-leafy-vegetables-per_tbl4_232276940
 54. Fenugreek leaves: https://stylesatlife.com/articles/fenugreek-leaves-benefits/
 55. Moringa: https://draxe.nutrition/moringa-benefits/;
 56. https://www.vanguardngr.com/2013/06/the-many-unknown-benefits-of-moringa-leaf/;
 57. https://www.banyanbotanicals.com/info/blog-the-banyan-insight/details/moringa-oleifera-ayurveda-superfood/
 58. Sorrel leaves/Sour spinach: https://www.thehindu.com/life-and-style/food/go-for-the-gongura/article19125502.ece
 59. https://www.livemint.com/mint-lounge/features/gongura-an-ancient-leaf-for-all-seasons-1552045899317.html;
 60. https://medhyaherbals.com/gongura-roselle-ambadi/
 61. Herbs de Provence: https://www.masterclass.com/articles/what-are-herbs-de-provence
 62. Tisane/Herbal tea: https://www.healthline.com/nutrition/10-herbal-teas;
 63. https://www.healthline.com/nutrition/tea-for-digestion#TOC_TITLE_HDR_3;
 64. https://www.verywellfit.com/eucalyptus-tea-benefits-and-side-effects-4163892;
 65. https://completewellbeing.com/article/herbal-tea-drink-wellbeing/;
 66. https://www.healthline.com/health/anxiety/tea-for-anxiety

2. కోవిడ్-19 రెమిడీ నవీనీకరణ

భారతదేశంలో కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ యొక్క తీవ్రమైన కొరత, ఆక్సిజన్ స్థాయిని పెంచే మార్గాలను అన్వేషించడముపై పరిశోధనా  బృందాన్ని ప్రోత్సహించింది. SR304 Oxygen ను 200C వద్ద ఉపయోగించి తయారుచేసిన రెమిడీ నీటిని ప్రతీ పది నిమిషాలకు ఇవ్వడం ద్వారా ఆక్సిజన్ స్థాయి తక్కువ సమయంలో 90 కి పెరిగిందని పరిశోధనలు నిర్ధారించాయి. అభివృద్ధిని బట్టి మోతాదును క్రమంగా తగ్గించుకుంటూ వస్తే 2 రోజులలోనే ఆక్సిజన్ స్థాయి 95 కి చేరుకుంటుంది. 108 CC  బాక్స్ మాత్రమే ఉన్న ప్రాక్టీషనర్లు పైన పేర్కొన్న కార్డుకు బదులుగా CC19.1 Chest tonic పైన పేర్కొన్న మోతాదులో ఉపయోగించవచ్చు. వార్తాలేఖ సంచిక 12 సంపుటి 2 లో సూచించిన మార్గదర్శకాల ప్రకారం  IB రెమిడీ తప్పనిసరిగా కొనసాగించాలని గుర్తుంచుకోండి.

 పైన కనుగొన్న అంశాల ఆధారంగా SRHVP ఉపయోగించి తయారుచేయాబడే IB రెమిడీ క్రింది విధంగా సవరించబడింది: BR4 Fear + BR9 Digestion + SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM40 Throat + SR272 Arsen Alb 30C + SR277 Bryonia 30C + SR291 Gelsemium 30C + SR304 Oxygen 200C. 108 CC బాక్సు ఉపయోగించి తయారుచేయబడే రెమిడీ విషయంలో మార్పేమీ లేదు. వివరాలకు వార్తాలేఖ సంచిక 12 సంపుటి 2 లో అదనంగా అనే విభాగంలో 2ను చూడండి. మీరు మరింత సమాచారంతో మీ జ్ఞానాన్ని పరిపుష్ఠి చేసుకోవడానికి ఆక్సిజన్ కార్డు తో ప్రాక్టీషనర్ 11601…ఇండియా తనయొక్క అద్భుత అనుభవాలను వార్తాలేఖ సంచిక 11 సంపుటి 6 లో విభాగం 2 లో చూడండి. SR 304 కార్డును 200C లో ఉపయోగించడం ద్వారా ఆస్పత్రిలోనే కాక ఇంటివద్ద కూడా ఆక్సిజన్ లేమితో బాధపడుతున్న అనేక రోగులకు విజయవంతంగా చికిత్స చేసినట్లు ఆమె రిపోర్టులు సూచిస్తున్నాయి.  

IB ని ముక్కులో చుక్కలుగా ఉపయోగించడం

ప్రాక్టీషనర్ 11626 కు ఘాటైన వాసన మరియు ధూళికి అలర్జీ ఏర్పడి తుమ్ములు కూడా అభివృద్ధి అయ్యాయి. కనుక IB మోతాదును 6TD కి పెంచుకున్నారు (అంతకు ముందు ప్రివెంటివ్ గా OD వద్ద తీసుకునే వారు). రెండు రోజుల్లో తుమ్ములు తగ్గిపోయాయి కానీ ముక్కులో అవరోధం మరియు తలనొప్పి అలానే కొనసాగాయి. ఐతే IB నీటిలో తయారు చేసి ముక్కులో చుక్కలుగా ఉపయోగించినప్పుడు నాసా అవరోధం వెంటనే తగ్గిపోతుందని ప్రాక్టీషనర్11623 ద్వారా తెలుసుకున్నారు. ఈ విధంగా నీటిలో తయారుచేసి ఒక చుక్క నాసా రంధ్రంలో వేయగానే ఎంతో ఉపశమనం కలిగి లోనున్న తెమడ నీరుగా బయటకు ప్రవహించడం ప్రారంభమైంది. ఆమె ఈ చుక్కలను BD గా ఉపయోగించగా రెండు రోజుల్లో ఆమె సైనసైటిస్ పూర్తిగా తొలగిపోయింది. అప్పటినుండి  ఆమె తన పిల్లలకు ఎప్పుడు నాసా అవరోధం కలిగినా దీన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.  

3. న్యూఢిల్లీలో సాయి ఇంటర్నేషనల్ సెంటర్ లో 2021 ఏప్రిల్ 4న సాయి వైబ్రియానిక్స్ క్లినిక్ ప్రారంభం  

స్వామి యొక్క అపారమైన ఆశీర్వాదాలతో 2021 ఏప్రిల్ 4న కొత్త ఢిల్లీలోని సత్యసాయి అంతర్జాతీయ కేంద్రంలో వారాంతంలో నిర్వహించే సాయి క్లినిక్ ప్రారంభించు కోవడం ద్వారా వైబ్రియానిక్స్ మరో మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా  

 ఢిల్లీ NCR రాష్ట్ర అధ్యక్షుడు మరియు సత్య సాయి సేవ సంస్థ కి చెందిన ఆఫీస్ బేరర్స్ మరియు  ఈ ప్రాంతానికి చెందిన సాయి వైబ్రియానిక్స్ బృందము హాజరయ్యారు.

ఈ కార్యక్రమం వేదపఠనం మరియు జ్యోతి ప్రజ్వలనము తో  ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో వైబ్రియానిక్స్ బృందం చేస్తున్న సేవలను రాష్ట్ర అధ్యక్షుడు ప్రశంసిస్తూ సంస్థ యొక్క పూర్తి మద్దతు వైబ్రియానిక్స్ కు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రేమతో సేవలను కొనసాగించాలని స్వామి చూపిన మార్గాన్ని అనుసరించాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. 22 మంది ప్రాక్టీషనర్లు తీసుకువచ్చిన 108CC బాక్సులకు చార్జింగ్ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

 

 

 

ఈ క్లినిక్ ప్రతీ ఆదివారము వంతుల వారీగా ఇద్దరు ప్రాక్టీషనర్లచే నిర్వహింప బడుతుంది. పేషంట్ల నుండి బిపి, పల్స్ రేటు మరియు రక్తంలో చక్కెర వంటివి సేకరించడంలో సుశిక్షుతులైన సేవాదళ్ వీరికి సహకారం అందిస్తారు. ఈ క్లినిక్ స్థాపించడంలో ప్రాక్టీషనర్లు11573&11437యొక్క నిరంతర కృషి ఎంతో అభినందనీయం.

 

 

 

 

 

 

 

 

 

 

4. ఉత్తేజకరమైన కథలు

4.1 స్వచ్ఛమైన ప్రేమ ప్రవహిస్తూనే ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితిలో తరగతులు ఆన్లైన్లో జరుగుతున్న నేపధ్యంలో ఒక సాయి విద్యా సంస్థకు చెందిన విద్యార్థి ప్రస్తుతం తన తల్లితో ఢిల్లీ లోఉన్నారు. ఇద్దరికీ గత రెండు వారాలుగా కోవిడ్ లక్షణాలు కలుగగా తల్లి దాదాపు మంచం పట్టారు. ఈ విద్యార్ధి ఇద్దరికీ ఖచ్చితంగా కోవిడ్ పాజిటివ్ అనే భావించాడు కానీ వారి పరీక్ష ఫలితాలు ఎందుకో చాలా ఆలస్యం అయ్యాయి. సమీపంలో నివసిస్తున్న వారి దగ్గరి బంధువులు ఎవరూ కూడా వారికి ఏదైనా తీసుకురావడంలో కనీసం వారిని పట్టించుకోక పోవడంతో  వారు వండిన ఆహారాన్ని పొందడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 2021 ఏప్రిల్ 23న ఈ విద్యార్ధి అఖిల భారత వైబ్రియానిక్స్ కోఆర్డినేటర్ కు ఎంతో వేదనతో ఒక సందేశాన్ని పంపగా వెంటనే వారు  స్థానికంగా ఉండే ప్రాక్టీషనర్11389 సంప్రదించారు. కేవలము కొన్ని నిమిషాలలో ఆమె వ్యక్తిగతంగా రెమిడీలతో పాటు ప్రిస్క్రిప్షన్ అవసరం లేని కొన్ని అలోపతి మందులు పంపిణీ చేసారు. ఢిల్లీలో అ సమయంలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆమెను మార్గమధ్యంలో ఎవరూ ఎక్కడ ఆపలేదు. అంతేకాక ఈ ప్రాంతంలోని కోవిడ్ గృహ నిర్బంధములో ఉన్న కుటుంబాల కోసం స్థానిక సేవా సంస్థ వారు ఇంట్లో వండిన ఆహారాన్ని అందించడం ప్రారంభించినప్పుడు ఇలా హఠాత్తుగా నలుదిశలా ప్రవాహంలో స్వామి అనుగ్రహం కురిపించడం చవిచూచి వీరిద్దరూ మాటలతో వ్యక్తం చేయలేని కృతజ్ఞతతో ఉండిపోయారు. రెమిడీ తీసుకున్న 3వ రోజునుండి ఆ విద్యార్ధి ఆన్లైన్ తరగతులు హాజరు ప్రారంభించగా అతని తల్లి లేచి తన ఇంటి చుట్టూ నడవ గలిగారు. అంతేకాక ఐదవ రోజు నుండి ఇంట్లో పని చేసుకోవడం ప్రారంభించారు. ఆ విద్యార్థి ఇలా వ్రాశాడు:

 “మేము స్వామిని పుట్టపర్తిలో చూడలేక పోయాము కానీ అందరూ చెప్పగా విన్నాము “స్వామి అనేక రూపాలుగా అనేక మార్గాలలో మీ వద్దకు వస్తారు ఎందుకంటే అతడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక”. ఈరోజు నేను అందుకున్నది  ఔషధమే కావచ్చు, కానీ నేను దానిని స్వచ్ఛమైన ప్రేమ అని పిలుస్తాను. ఈ రకమైన ప్రేమను స్వామి మనందరిపై కురిపిస్తారు. ఈ సమయంలో స్వామి మీ రూపంలో వచ్చినందుకు స్వామికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవి నా జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత కష్టతరమైన రోజులని నిస్సందేహంగా చెప్పగలను. సాయిరాం.” 

4.2 స్వామి ఆశీస్సులు కొనసాగుతున్నాయి

2021 ఏప్రిల్ 20న ప్రాక్టీషనర్ 10741 తన 108 CC బాక్సులోని CC3.7 Circulation  కలిగిన డ్రాఫర్ బాటిల్ పూర్తిగా ఎండి పోయిందని కనుగొన్నారు. ఆమె అభ్యర్థన మేరకు తోటి ప్రాక్టీషనరు అదే రోజు మధ్యాహ్నం ఒక చిన్న సీసాలో ఆమె CC 3.7 తీసుకువచ్చారు. ఆమె తన డ్రాపర్ బాటిల్ లో తన సహచరి తెచ్చిన సీసా నుండి రెమిడీని డ్రాపర్ బాటిల్ లో పోద్దామని ప్రయత్నించినప్పుడు అది అప్పటికే ¾ భాగం నిండినట్లు చూసి అని అవాక్కయ్యారు. ఆమె సహచరి నుండి తీసుకువచ్చిన రెమిడీని జోడించడానికి తగినంత చోటు మాత్రమే ఉంది. 2008 మార్చి 2న స్వామి మాస్టర్ బాక్సును భౌతికంగా ఆశీర్వదించినప్పుడు స్వామి ఇదే బాటిల్ బయటకు తీసారు. (108 CC పుస్తకం మొదటి పేజీ లోని చిత్రాన్ని చూడండి). ఇది ప్రాక్టీషనర్లు అందరికీ స్వామి యొక్క పునర్వాగ్దానముగా భావించవచ్చు.   

5. వర్క్ షాపులు మరియు సదస్సులు

5.1 వర్చువల్ AVP వర్క్ షాప్ 2021 జనవరి 9 నుండి మార్చి 6 వరకూ ; పుట్టపర్తిలో ప్రాక్టికల్ వర్క్ షాప్ మార్చి 13-14

ఈ తొమ్మిది వారాల వర్క్ షాప్ లో 36 వర్చువల్ సెషన్లలో అభ్యర్థులు తమ ఈ కోర్స్ లో అప్పటికే అధ్యయనం చేసిన  మాన్యువల్ లోని మొత్తం 9 అధ్యాయములపై  లోతైన విశ్లేషణ జరిగింది. వర్చువల్ ప్లాట్ఫామ్ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రస్తుతం  ప్రాక్టీషనర్లు ఈ సదస్సులలో నిశ్శబ్ద ప్రేక్షకుల వలె  పాల్గొన్నారు. ఇది వైబ్రియానిక్స్ పట్ల వారి అవగాహన పెంచుకొనడానికి మరియు తమ జ్ఞానాన్ని పునశ్చరణ చేసుకొనడానికి సహాయ పడింది. అంతేకాకుండా వైబ్రియానిక్స్ ఉపాధ్యాయులుగా కావాలని కోరుకునే కొందరు సీనియర్లకు కొన్ని టాపిక్ లను బోధించే అవకాశం ఇవ్వబడింది. వైబ్రియానిక్స్ పెరుగుదలకు అత్యంత కీలకమైన రోగ చరిత్రలను వ్రాసే విషయంలో మార్గదర్శకత్వం ఇవ్వబడింది. అలాగే వ్యాధి రాకుండా నివారించే క్రమంలో ఆరోగ్య కరమైన జీవనశైలి యొక్క ప్రాముఖ్యతపై చర్చలు కూడా జరిగాయి. IASVP విభాగపు డైరెక్టర్ ప్రస్తుతం వైబ్రియానిక్స్ నిర్మాణం పై ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సభ్యులను ఉద్దేశించి డాక్టర్ అగ్గర్వాల్ ప్రారంభంలో చేసిన ప్రసంగంలో రోగిలో వ్యాధి నయం కావడానికి భక్తి, అంకితభావం, మరియు కృతజ్ఞత ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశాలు. ప్రేమను వ్యక్తపరచడంలోనే రోగికి వ్యాధి నుంచి స్వస్తత కలిగించవచ్చని నొక్కి చెప్పారు. ప్రాక్టీషనర్లు తమ వంతు కృషి చేసి ఫలితాలను స్వామికి వదిలివేయాలి. ఈ విర్ట్యువల్ వర్క్ షాప్ చివరి రోజున ప్రపంచవ్యాప్తంగా 61 మంది పాల్గొనడంతో గొప్ప విజయాన్ని సాధించింది. పుట్టపర్తిలో జరిగిన ప్రాక్టికల్ వర్క్ షాప్ లో కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేసి 108CC బాక్స్ ను కృతజ్ఞతతోనూ మరియు వారి రోగులకు సేవచేయడంలో తమ వంతు కృషి చేయాలనే సంకల్పంతో అందుకున్నారు.  

5.2 వర్చువల్ SVP వర్క్ షాప్ పుట్టపర్తి 2021 మార్చి 22-23  

రెండు రోజుల సదస్సు 2018-19 లో అర్హత సాధించిన తొమ్మిది మంది SVP ల కోసం ఫాలో అప్ వర్క షాప్ గా నిర్వహించబడగా   అందులో ఏడుగురు మరియు 5 గురు ఇతర సీనియర్ ప్రాక్టీషనర్లు హాజరయ్యారు. మొదటిరోజు అనేక కేసు చరిత్రలపై వివరణాత్మక  మరియు లోతైన చర్చ జరిగింది.  డాక్టర్ అగర్వాల్ గారి నుండి అందుకున్న ఎంతో విలువైన సమాచారంతో సహా రెండవ రోజు మొత్తము మియాజమ్ మరియు బ్రాడ్కాస్టింగ్ యొక్క అభ్యాసములకు కేటాయించ బడినది.

 

 

 

 

 

6.జ్ఞాపకార్థం

ఎంతో అనుభవజ్ఞురాలు గొప్ప సేవకురాలు ఐన మన ప్రాక్టీషనరు శ్రీమతి కమలేష్ వాద్వా00535 2021 జనవరి 22న తన 84 వ ఏట లండన్ లోని తన ఇంటి నుండి మనకు  వీడ్కోలు పలికారు.  హీమోలైటిక్ అనీమియా (రక్తహీనత)  కారణంగా గత సంవత్సరం పూర్తిగా ఆరోగ్యం కోల్పోయే వరకూ చురుకుగా తన రోగులకు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఈ సేవను కొనసాగించడం ఆమెకు కష్టమైంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాము.