దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 12 సంచిక 3
May / June 2021
మానసిక సరళత మరియు సమతుల్య భావన లేకపోవడం అనేవి నిజానికి మనం వ్యాధి అని దేనినైతే పిలుస్తామో అట్టి స్థితికి దారితీస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మరియు వ్యాధిని ఎలా నివారించాలి అనే విషయంలో తనవద్దకు వచ్చే వ్యక్తులకు సలహా ఇవ్వడం వైద్యుని యొక్క పవిత్ర కర్తవ్యం. వ్యాధులు అభివృద్ధికి ప్రధాన కారణమైన ఆహారం మరియు విహారం (వినోద కార్యకలాపాలు) లోని ప్రతికూలధోరణి కనుగొని అణిచి వేయడానికి అతను సమాజంలో అప్రమత్తంగా ఉండాలి. మానవులు ధరించే దుస్తులు, వారు నివసించే గృహాలు,మరియు వారు ఉంటున్న ప్రాంతాలు చక్కగా మరియు శుభ్రంగా ఉండాలి. తీసుకునే ఆహారం శరీరాన్ని బలంగా ఉంచడానికి, అనారోగ్యాన్ని నిరోధించడానికి అవసరమైన అన్ని అంశాలను సరఫరా చేయాలి. ఒకవేళ ఈ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండగలిగితే తప్పనిసరిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాతావరణం నుండి మనం పీల్చే గాలి, మనం తీసుకునే నీరు, నివసించే ప్రాంతము, మన చుట్టుపక్కల ఉండే మొక్కలు మరియు జంతుజాలము అన్నింటిలోనూ హానికరమైన సూక్ష్మ జీవులు ఉన్నాయి. మనసు మరియు శరీరము శక్తివంతమైన నిరోధక కవచాన్ని కలిగి ఉండకపోతే అవి అనారోగ్యానికి కారణమవుతాయి.
…శ్రీసత్య సాయి బాబా, “డాక్టర్ వృత్తి' దివ్యవాణి 1980సెప్టెంబర్ http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-53.pdf
నిస్వార్థ సేవ చేయడానికి మాత్రమే మానవ శరీరం మీకు ఇవ్వబడింది అనే విషయం మీరు గ్రహించాలి. అట్టి సేవ హృదయాన్ని విశాలం చేస్తుంది, అహాన్ని నాశనం చేస్తుంది, మరియు ఆనందాన్ని సృష్టిస్తుంది. సేవ మానవ సోదరత్వము, దైవ పితృత్వము అనే విశాల భావము పెంపొందింప జేస్తుంది. మీ లక్ష్యము అక్కడితో పూర్తిఐనట్లు కాదు, ఆధ్యాత్మిక ఏకత్వం (మానవాళి అందరిలోనూ ఉన్న దివ్యత్వము ఒకటే) గురించి ప్రచారం కూడా చెయ్యాలి. మానవ జాతిని ద్వైత భావమునుండి అద్వైత భావము వైపు నడిపించాలి.
...శ్రీసత్య సాయి బాబా, “సేవ యొక్క అధ్యాత్మిక ప్రాముఖ్యత” దివ్యవాణి, 1995నవంబర్21 http://www.sssbpt.info/ssspeaks/volume28/sss28-34.pdf