Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 12 సంచిక 3
May / June 2021


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ప్రపంచమంతటా మాతృశ్రీ ఈశ్వరమ్మ వేడుకలు జరుగబోతున్న శుభ సందర్భంలో మీకు ఇలా వ్రాస్తున్నందుకు నేను ఆశీర్వదింప బడినట్లుగా భావిస్తున్నాను. మాత ఈశ్వరమ్మ ప్రేమ, కరుణ, మరియు నిస్వార్థ సేవకు ప్రతి రూపం. ఆమె స్వామి ఎంచుకున్న దేహ సంబంధమైన మాతృమూర్తి మాత్రమే కాదు స్వామిని ఆశ్రయించే భక్తులకు దారిచూపే ఆశల ప్రతిరూపం. ఆధ్యాత్మికంగాను మరియు వైబ్రియానిక్స్ సేవా పరంగా ఎదగాలని కోరుకునే వారందరికీ ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో అనేక ఇబ్బందులకు లోనవుతున్న ఈ కష్టకాలంలో తన నిష్కళంకమైన ప్రేమతో కూడిన సేవలను అందించిన మాతృశ్రీ ఈశ్వరమ్మ యొక్క సాధు జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఒక మహా సముద్రం వంటివి.

 ఒక సందర్భంలో స్వామి ఇలా చెప్పారు “ఆధ్యాత్మిక ధృక్పధాన్ని పెంపొందించుకోండి, రోగులకు ప్రేమ మరియు శ్రద్ధతో చికిత్స చేసి  వారిని సంతోషంగా ఆరోగ్యంగా చేయండి. దేవుని దయ లేకుండా కనీసం నాడి కూడా కొట్టుకోదు. కేవలం ఔషధం మాత్రమే  వ్యాధిని నయం చేయగలదు అనే తప్పు భావనలో మీరు ఉన్నారు. అదే నిజమైతే ఉత్తమ వైద్య సదుపాయాలు ఉన్న రాజులు, సంపన్నుల జీవితాలు ఏమైనాయి? కనుక ఔషధముతో పాటు దైవకృప కూడా ఉండాలి. ఔషధం మరియు దైవానుగ్రహం అనేవి నెగిటివ్ మరియు పాజిటివ్ వంటివి. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే వ్యాధి నయమవుతుంది. కాబట్టి ఔషధం తీసుకోవడంతో పాటు దైవ కృప కోసం ప్రార్థించాలి... సత్య సాయి బాబా దివ్య వాణి, వాల్యూమ్ 34 డిస్క్ 2, 2001 జనవరి 19. ఈ మహమ్మారి రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో ఇది మనందరికీ అనగా రోగులకు మరియు ప్రాక్టీషనర్లకు కూడా ఒకే విధంగా వర్తిస్తుంది.

కోవిడ్-19 యొక్క త్వరగా ఉత్పరివర్తనం చెందే క్రొత్త డబుల్ వేరియంట్ కబంధ హస్తలలో చిక్కుకున్న అనేక దేశాలు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్ IB.సామాన్య ప్రజలను చేరుకోడానికి మనం సమిష్టిగా చేసే ప్రయత్నాలను రెట్టింపు చేయవలసిన అవసరం ఉంది. IB యొక్క సామర్ధ్యమునకు  సంబంధించిన క్షేత్రం నుండి మనకు ప్రోత్సాహకరమైన అనేక నివేదికలు వచ్చాయి. క్రమం తప్పకుండా IB తీసుకుంటున్న వారిలో IB తీసుకొనని వారికన్నా చాలా తక్కువగా అంటువ్యాధులు సోకినట్లు నివేదికలు అందుతున్నాయి. అలాగే మోతాదును పెంచడం వల్ల ఇట్టి సంక్రమణలను త్వరగా అధిగమించవచ్చని మేము గమనించాము. రోగులకు వైబ్రియానిక్స్  పట్ల విశ్వాసం పెంపొందించడంలో ప్రాక్టీషనర్ల యొక్క విశ్వాసం మరియు ఆరోగ్యం పట్ల వారి యొక్క మనస్తత్వం/వైఖరి అనేవి కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.   

ఈ సందర్భంగా పరిస్థితికి అనుకూలంగా స్పందిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు వారి సేవా గంటల పరిధి దాటి (వారు వైబ్రియానిక్స్ కు ప్రామిస్ చేసిన సేవా గంటలు) నిస్వార్ధంగా సేవ చేస్తున్న వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ల ప్రయత్నాలకు అభినందనలతో కృతజ్ఞత తెలియ జేస్తున్నాము. భయాందోళనకు గురైన వారికి కొందరు ప్రాక్టీషనర్లు 24/7 కౌన్సిలింగ్ అందిస్తున్నారు, మరికొందరు భౌతికంగా రెమిడీ ఇవ్వలేని వారికి వాటిని బ్రాడ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా ప్రసారం చేస్తున్నారు, మరి కొందరు రెమిడీలు మాత్రమే కాకుండా ఇతర మందులు మరియు సామగ్రిని రోగుల అవసరాల మేరకు పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం వంటి నియమాలకు కట్టుబడి ఉండాలని మరియు అవసరమైన వారికి సేవ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.

మన “స్ప్రెడ్ ద వర్డ్” ప్రచారం అందిస్తున్న అద్భుత విజయము మీతో  పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత రెండు నెలలలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరిగాయి. వాటిలో ప్రధమంగా న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్ లో వైబ్రియానిక్స్ క్లినిక్ ప్రారంభోత్సవం (మరిన్ని వివరాల కోసం అదనంగా విభాగం చూడండి). మరొకటి మన కర్నాటక బృందం నాయకత్వంలో బెంగళూరులో రెండు చికిత్సా కేంద్రాలను ప్రారంభించడం. ఒక కేంద్రం నివాస గృహంలో ఉంది, ఇది శారీరక మరియు మానసిక వికలాంగులకు అవసరమైన వైద్య సంరక్షణ, (కృత్రిమ అవయవాలు, శస్త్ర చికిత్సలతో సహా) మరియు  ప్రాణాంతక అనారోగ్యాలకు చికిత్స కూడా అందిస్తున్నది. ఇక్కడ డాక్టర్ మరియు నర్సులు వైబ్రియానిక్స్ చికిత్సను ఆదరంగా స్వీకరించారు. మన బృందం మార్చిలో 52 మంది మానసిక రోగులకు చికిత్స చేసింది, ప్రస్తుతం కోవిడ్ ఆంక్షల కారణంగా వారు ఏప్రిల్ శిబిరం నిర్వహించలేక పోయారు. అయినప్పటికీ 55 మంది రోగులకు ఇమ్యూనిటీ బూస్టర్ IB అందించారు. రెండవ క్లినిక్ 500 మంది (వీరిలో 60 మంది హాస్టల్ లో ఉండేవారు) పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలలో ప్రారంభింప బడింది. ఈ పిల్లలకు వైబ్రియానిక్స్ రెమిడీలతో పాటు ఉచిత కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఈ సందర్భంలో మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ప్రశాంతి నిలయమునకు సేవకోసం వచ్చే సభ్యులకు ఇమ్యూనిటీ బూస్టర్ IB అందించే విధానాన్ని క్రమబద్దీకరించడం. మన వెబ్సైట్ ద్వారా IB  కోసం అభ్యర్ధనలు రావడంతో పాటు మన రెగ్యులర్ పేషంట్ల ద్వారా వారికి మరియు ఆసక్తి ఉన్న వారి బంధువులు మరియు స్నేహితులకు అందించడానికి IB కోసం  అభ్యర్ధనలు అందుతూనే ఉన్నాయి. గత నెలలోనే మేము మొత్తం 35,424 మంది గ్రహీతలకు IB అందించాము. గత సంవత్సరకాలంగా మొత్తం IB గ్రహీతల సంఖ్య 362,408 ఉంది.    

ప్రస్తుతం ఇంట్లోనే బస ఉండే పరిస్థితి దృష్ట్యా వర్చువల్ నెట్వర్కింగ్ ని సద్వినియోగం చేసుకోవాలనే ధ్యాస ప్రాక్టీషనర్లలో కొత్త ఒరవడిని ప్రోత్సహించింది. ఆంధ్ర మరియు తెలంగాణ లోని సీనియర్ ప్రాక్టీషనర్లు వారి కోఆర్డి నేటర్11585 యొక్క మార్గదర్శకత్వంలో వారి జ్ఞానాన్ని పంచుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి సహకారం పొందడానికి నెలవారి సమావేశాలు ప్రారంభించారు. వారి సమావేశాలలో వివిధ శారీరక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో వివరించడానికి వైద్య నేపథ్యం కలిగిన ప్రాక్టీషనర్ల ప్రదర్శనలు, కేసు చరిత్రలను చర్చించడం, మరియు ప్రాక్టీషనర్ల ప్రశ్నలను పరిష్కరించడం వంటివి ఉన్నాయి. ఇదే తరహాలో రెండు నెలలకు ఒకసారి  సమావేశాలు ఇప్పటికే 2019 డిసెంబర్ నుండి తమిళనాడు ప్రాక్టీషనర్లు నిర్వహిస్తున్నారు. 2021 మార్చి 6 & 7 తేదీలలో రెండు అర్ధ దినాలలో 20 మంది ప్రాక్టీషనర్ల కోసం మొదటి యు.ఎస్. మరియు కెనడా వర్చువల్ పునశ్చరణ సదస్సు జరిగింది. వర్చువల్ ఇంటరాక్షన్లు అనేవి ప్రాక్టీషనర్లను మరింత దగ్గరగా తీసుకువచ్చి సమూహంలో చక్కని అనుకూలతను సృష్టిస్తున్నాయి. ఈ పునశ్చరణం ముగింపులో చాలామంది ప్రాక్టీషనర్లు ఈ చొరవను ఉత్తేజపరిచే, జ్ఞానాన్ని పెంచే, శక్తిని పెంపొందింప చేసేదిగా ఉందని ప్రశంసించారు. తోటి వారితో సహకరించడానికి మరింత సమైక్య వేదికను సృష్టించాల్సిన అవసరం ఉందని మరియు రెండు దేశాల ప్రాక్టీషనర్ల కోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వర్చువల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని భావించారు. ఈ నెట్వర్క్ ప్రాక్టీషనర్ ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడమేకాక వారి జ్ఞానం మరియు అనుభవం ఆధారంగా సూచనలు ప్రశ్నలు- ఫలితాలు మరియు ఇతర సమాచారానికి సంబంధించి వారిలో భావ ప్రసారాన్ని సులభతరం చేస్తుంది. 

 2021 మార్చిలో పునః రూపకల్పన చేసిన మా వెబ్సైట్ ప్రారంభించిన పది నెలల కన్నా తక్కువ వ్యవధిలో పదివేల హిట్ల మైలు రాయిని దాటాము. వెబ్ సైట్ యొక్క కంటెంట్ మరియు లక్షణాలను మెరుగుపరచడానికి సందర్శకుల నుండి మాకు అనేక సూచనలు వచ్చాయి. ఇది మా ఐటీ బృందాన్నిమరింత బిజీగా ఉంచుతోంది. ఇవే మన సంస్థ యొక్క  DNA లో అంతర్భాగంగా భావింపబడే నిరంతర అభివృద్ధి మరియు ఆవిష్కరణల స్ఫూర్తితో ముందుకు సాగడంకోసం ప్రాక్టీషనర్లు నుండి మరిన్ని సలహాలను మేము స్వాగతిస్తున్నాం. దయచేసి మీ ప్రతిపాదనలను మరియు అభిప్రాయాన్ని ఐటీ వింగ్  [email protected]కు పంపండి. ఈ వ్యాసం ముగింపులో కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి ప్రాక్టీషనర్లుగా మీరు చేసే అన్ని ప్రయత్నాల్లోనూ  అపారమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు దైవఆత్మవిశ్వాసంతో GODFIDENCE తో ముందుకు సాగండి. 

ప్రేమతో సాయి సేవలో

జిత్ కె అగ్గర్వాల్