Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 12 సంచిక 3
May / June 2021


1. ఆరోగ్య చిట్కాలు

మీ ఆహారాన్ని పరిమళ భరితం చేయడానికి మూలికలు

బాహ్యంగా కనిపించే చర్మం కింద సున్నితమైన మరొక పొర ఉంటుంది. ఈ పొరే చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఆకుపచ్చని  ఆకులు ఇతర ప్రయోజనాలు కూడా కలిగి ఉండటమే కాకుండా ఈ పొరను బలోపేతం చేస్తాయి”.…శ్రీ సత్య సాయి బాబా1

1. మూలికలు అంటే ఏమిటి?

 మూలికలు అనేవి ఆకుకూరలు లేదా మొక్క యొక్క లేత కొమ్మలతో పాటు పుష్పించే భాగాలు. మూలికలలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని ఆహారానికి రుచిని చేకూర్చడానికి, కొన్ని కూరగాయలుగానూ, కొన్ని ఓషధులుగానూ, కొన్ని సౌందర్య చికిత్సకోసం, కొన్ని పరిమళ ద్రవ్యాలు గానూ లేదా క్రిమిసంహారక మందులుగా ఉపయోగిస్తారు. ఈ వ్యాసంలో ఆరోగ్యాన్ని పెంచే తినదగిన వనమూలిక ఆకులను అందిస్తున్నాము. సుగంధద్రవ్యాల కన్నా తేలికైన ఈ మూలికలు ఆహార పదార్ధాలకు రుచి, కాంతి, మరియు రంగులను అందించడానికి తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు.2-4

2. మూలికల యొక్క ప్రయోజనాలు ఉపయోగము మరియు నిల్వ

ప్రయోజనాలు: ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, వ్యాధిని నివారించడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి, జలుబు వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడానికి, నొప్పులు నివారించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, మరియు యాంటీ ఆక్సిడెంట్ లు మూలికలలో సమృద్ధిగా ఉంటాయి.4-5 తాజా మూలికలు ఆహారంలో చక్కెర మరియు ఉప్పు స్థానమును భర్తీ చేయడానికి లేదా కనీసం వీటిని తగ్గించి తీసుకోవడానికి ఉపయోగపడతాయి.5

 వినియోగము: మృదువైన మరియు లేత మూలికలను చేతితో చిన్న చిన్న భాగాలుగా తురిమి వంట చివరిలో లేదా వడ్డించే సమయంలో వంటకాలలో చేర్చవచ్చు. ఎండిన మూలికలను వంట ప్రారంభంలో లేదా మధ్యలో వంటకాలకు జోడించండి. ఒక టీస్పూన్ ఎండిన మూలికలు నాలుగు టీస్పూన్ల పచ్చి వాటికి సమానం, కనుక  ప్రధాన ఆహార పదార్థం యొక్క రుచి పాడవకుండా  చూసుకోవడానికి వీటి ప్రభావాన్ని తెలుసుకొనడానికి ఒక చిటికెడుతో ప్రారంభించండి.6,7

నిల్వ: తాజా లేదా పచ్చి మూలికలు మెత్తగా కడిగి జాగ్రత్తగా ఆరబెట్టి పేపరుతో చుట్టి రిఫ్రిజిరేటరులో పునర్వినియోగపరచదగిన సంచిలో దాచిపెడితే ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. తులసి మరియు మెంతి వంటి సున్నితమైన వాటిని గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో నిలవ చేయండి. ప్రతీ రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ పాడైన ఆకులు లేదా కొమ్మలను తీసివెయ్యాలి. ఎండిన మూలికలను గాలి చొరబాటు లేని ప్లాస్టిక్ సంచులు, గాజు పాత్రలు, లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలలో భద్రపరిచి చల్లని, వెలుగు సోకని  మరియు పొడి ప్రదేశంలో నిల్వ చెయ్యాలి ఫ్రిజ్ లో నిలువ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అలా చేస్తే అవి సంవత్సరము లేదా అంత కంటే ఎక్కువ కాలమే నిలువ ఉంటాయి. మూడు నాలుగు నెలలకు ఒకసారి కొద్ది మొత్తాన్ని నలిపి వాసన పరిశీలించడం ద్వారా వాటి తాజాదనాన్ని తనిఖీ చేయవచ్చు. ఈ సువాసన తాజాగా ఉండాలి.6,8,9

మనం సాధారణంగా ఉపయోగించే 20 రకాల మూలికలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. వీటి యొక్క భారతీయ పేర్లను కూడా అవసరమైన చోట వీటి పేర్ల ప్రక్కనే ఇవ్వబడ్డాయి.

3. రుచికరమైన మూలికలు

3.1 బాసిల్ లేదా పవిత్ర తులసి: తులసిలో వివిధ రకాలు అనేక రుచులతో ఉన్నాయి. తీయని తులసి ఆకులు అనేక రకాల సాస్ లలో (ముఖ్యంగా ఇటాలియన్పెస్టోలలో),  సలాడ్లు, పులుసులు, మరియు పిజ్జా పైన చల్లడం ద్వారా పరిమళ భరితమైన రుచి వస్తుంది. ఎక్కువ పరిశోధనకు గురిచేయబడిన “తులసి” ఆకు లేత ఆకుపచ్చ రంగుతో లేదా ఉదా రంగులో ఉండి పళ్ల మాదిరిగా ఉండే  అంచులు కలిగి మిరియాలకు ఉండే ఘాటైన వాసన ఉండి నయం చేసే అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. జీవనశైలి వ్యాధులను నివారించడానికి, రక్తంలో చక్కెరను సాధారణీకరించడానికి, రక్తపోటును తగ్గించడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి మరియు జలుబు ఫ్లూ తో పాటు ఆందోళన నిరాశ ఉపశమనం కలిగించడానికి దీని సమ్మేళనం ఉపయోగపడుతుంద.10,13

3.2 బే/ బిర్యానీ ఆకులు (తేజ్ పత్తా):  అన్ని మూలికల్లో కెల్లా చాలా సుగంధ భరితమైన ఈ ఆకులను వంట సమయంలో వేసి వడ్డించే ముందు తొలగిస్తారు. సైనసైటిస్ నుండి ఉపశమనం కోసం వంటలలో ఉపయోగిస్తారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పోషక పదార్ధాల శోషణం పెరుగుతుంది. మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు కడుపులో వ్రణముల నివారణ జరుగుతుంది.14-16

3.3 సెలరీ (అజ్మడ్): ఘాటైన పరిమళ భరిత రుచికలిగిన సంప్రదాయ మూలిక ఐన దీని ఆకులు సలాడ్లు, పులుసులు, నూడుల్స్ పైన చల్లడానికి అనువైనవి. మరియు వీటి కాడలను పచ్చివిగా కూడా తింటారు లేదా కూరగాయల వలె వండుతారు. ఇది సహజ డిటాక్సీఫయర్ అనగా మలినాలు తొలగించేదిగా పనిచేస్తుంది మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లను నివారిస్తుంది.17


3.4 చైవ్: ఈ మూలిక సలాడ్లు మరియు కూరగాయల వంటకాలపై ముఖ్యంగా వేపిన బంగాళాదుంపల వంటకంపై చల్లడానికి బాగుంటుంది. విటమిన్ A,C,K ఖోలిన్, ఫోలెట్, మరియు ఫైబర్ యొక్క మంచి మూలము. ఇది కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎండ తీక్షణత వలన ఏర్పడే చర్మ వ్యాధులు, గొంతులో పుండులను నయం చేస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, శారీరక జీవక్రియలను మరియు పిండము అభివృద్ధికి సహాయపడుతుంది. తేలికపాటి ఉద్దీపన కారిణిగాను, మూత్ర విసర్జన కారిణిగా మరియు సహజ కీటక వికర్షకముగా ఉపయోగ పడుతుంది. దీనిని వెంటనే ఉపయోగించటానికి సిద్ధంగా ఉంటే తప్ప వాటిని కత్తిరించ కూడదు. ఎండబెట్టి ఫ్రిజ్ లో దాచడం ద్వారా కొన్ని సంవత్సరాల వరకు నిల్వ చేయవచ్చు.18,19

3.5 కొత్తిమీర (రాధనియా): కొత్తిమీర ధనియాల మొక్క యొక్క తాజా ఆకులను సూచిస్తుంది. లేత ఆకులు మరియు కాండము తో సహా సలాడ్లు, పులుసులు, మరియు ఇతర వంటకాలకు మంచి రుచిని ఇస్తాయి. A, C, మరియు K విటమిన్లకు మంచి మూలము. ఇది జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, చర్మపు దురదను తగ్గిస్తుంది. ఆందోళన తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది, దృష్టిని మెరుగు పరుస్తుంది, అస్థిపంజర వ్యవస్థకు చక్కని పటుత్వాన్ని ఇస్తుంది.4,20,21 (వార్తాలేఖ సంచిక 11సంపుటి 3చూడండి).

కులాంట్రో / పొడవైన కొత్తిమీర: కొత్తిమీరతో పోల్చుకొని తరుచూ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పొడవైన ఆకులు మరియు బలమైన వాసన కలిగిన అసాధారణ మూలిక. ఎక్కువగా ఎండిన రూపంలో లభిస్తుంది.4


3.6 కరివేపాకు (కాది పత్తా): ఈ అద్భుతమైన చెట్టు ఆకులు (భారత దేశంలో అనేక గృహాల్లో పెంచుకునే చెట్టు) భారతదేశం మరియు శ్రీలంకలో వంటలో ఒక తప్పనిసరియైన మరియు అవసరమైన పదార్థము. ఇది రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి  అంటువ్యాధులు మరియు రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి జీర్ణక్రియ పెంచడానికి మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి తాజా ఆకులు నమలవచ్చు.22-24

3.7 మెంతులు (సువాబాజి):  పచ్చళ్లు మరియు అనేక వంటకాలను రుచికరం చేయడానికి, స్నాక్స్ మరియు సలాడ్లలోనూ ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో పెద్ద మొత్తంలో బంగాళదుంపలతో కలిపి కూరగాయల వలె ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియను పెంచుతుంది, అంటువ్యాధులు నివారిస్తుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, కాల్షియం శోషణను పెంచుతుంది, బహిష్టు సంబంధిత     తిమ్మిరి మరియు నిద్రలేమి నుండి ఉపశమనం ఇస్తుంది. ఇది ఒక రోజుకు మించి ఎక్కువ కాలం తాజాగా ఉండదు.25-27

3.8 ఫెన్నెల్ (సంఫ్ కె పత్తే): చూడడానికి మరియు రుచి విషయంలో ఇది మెంతి కూరను పోలి ఉంటుంది. ఇది సంపూర్ణంగా తినదగిన మూలిక. దీని రసం జీర్ణక్రియకు సహాయపడుతుంది, మరియు మూత్ర సంక్రమణలు, శరీర నొప్పి మరియు జ్వరం, నిద్రలేమి, నిరాశ నుండి ఉపశమనం కలిగిస్తుంది.28 (వార్తాలేఖ సంచిక 11 సంపుటి 3 చూడండి)

3.9 పుదీనా (పుదీనా):  పుదీనా త్రాగునీరు, పానీయాలు, ఐస్క్రీమ్లు మరియు క్యాండీ లకు పరిమళ భరితమైన తీపి మరియు మసాలా రుచిని ఇస్తుంది. జీర్ణక్రియకు, ప్రేగులలో పురుగులు, ఛాతిలో రద్దీ చికిత్స చేయడానికి, మెదడు పనితీరు పెంచడానికి, మరియు హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది సౌందర్య సాధనాలు, టూత్ పేస్ట్, మరియు నోటి తాజాదనం పెంచేందుకు ఉపయోగపడుతుంది. పుదీనా మొక్కలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా తెలిసినవి రెండు స్మియర్మింట్ (సాధారణ వంటలు మరియు చ్యూయింగ్ గమ్ లో ఉపయోగిస్తారు) మరొకటి పిప్పర్ మింట్, ఇది అప్రమత్తత మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.29-31

3.10 ఒరిగానో: రుచి కోసం పిజ్జా, పాస్తా, సలాడ్ మరియు పులుసులపై చల్లుతారు. కడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, మరియు ఇన్ఫెక్షన్ చికిత్స చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఒరిగానో టీ ఆరోగ్యానికి గొంతు నొప్పి మరియు దగ్గుకు మంచిది.32-35

మార్జోరామ్: ఒరిగానో తో సారూప్యముగా ఉంటుంది కానీ దానికన్నా తేలికైనది మరియు తీయగా ఉంటుంది.35

3.11 పార్స్లీ: రూపము వినియోగము మరియు ప్రయోజనాల విషయంలో కొత్తిమీర మాదిరిగానే ఉండే ఈ పార్స్లీ ఆకులు వాడిగా రంపము వలె అంచులు ఉండి చేదైన రుచి కలిగి ఉంటాయి. ఇది పేలవమైన రుచిని కలిగి కొత్తిమీరతో కలిపినపుడు రుచి మెరుగుపడుతుంది. సహజముగా శ్వాసకు తాజాదనం అందించేది, మూత్ర విసర్జన కారిగా కూడా పనిచేస్తుంది. దీనిలో  విటమిన్ A, C & K తో పాటు B కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతుంది, కళ్ళు, చర్మము, గుండె మరియు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరియు ఆమ్లత్వం మరియు త్రేనుపులను తగ్గిస్తుంది.4,36-38

 ఫ్రెంచ్ పార్స్లీ /చెర్విల్ : పార్స్లీతో సారూప్య మైనది కానీ కొంత సున్నితంగా ఉంటుంది.4

3.12 రోస్మేరీ (గుల్మెహాంది): పుదీనా కుటుంబానికి చెందిన ఈ ఆకు మొనలు సూదిగా ఉంటాయి వంటకాలలో చివరిలో రుచి కోసం వేస్తారు, మరియు టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది, ఒత్తిడి మరియు మగతను తగ్గిస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కీటకాలకు వికర్షకంగా పనిచేస్తుంది. పరిమళ ద్రవ్యాలు మరియు సౌందర్య సాధనాల తయారీలో తరచుగా ఉపయోగిస్తారు.39-41

3.13 సేజ్: ఆకులపై జుట్టు లాంటి నిర్మాణములతో కలప వంటి ఈ మూలిక రోజ్మెరి తో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఆహారపదార్ధాలకు రుచిని ఇవ్వడమే కాకుండా హెర్బల్ టీ మరియు ఇతర పానీయాలు తయారు చేయడానికి అనువైనది.  సాంప్రదాయకంగా ఇది అంటు వ్యాధులు, నొప్పి, నోటిలో పుండ్లు,మరియు జ్ఞాపకశక్తి సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సహజ సిద్ధమైన ప్రక్షాళిని, గాలిలో మలినాలను పొగుడుతుంది. ప్రాచీన కాలంలో దుష్ట శక్తులను నివారించడానికి మరియు పాము కాటుకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగించారు.4,42,43

3.14 సావోరీ: శీతాకాలపు సావొరీ: ఇది రుచికరమైన మూలిక, ఏదైనా ఆహార పదార్ధానికి పుదీనా రుచిని జోడించి గలదు. సుగంధ భరిత మిరియాల రుచి కలిగిన  వేసవిసావొరీ  అనేది పార్స్లేకి మంచి ప్రత్యామ్నాయము.  సలాడ్ లలో పచ్చిది ఉపయోగించ వచ్చు  లేదా వంటకాలలో ముఖ్యంగా బీన్స్ తో ఉడికించి వాడవచ్చు. ఈ రెండు రకాల సేవోరీ లు రుచికరమైనవి పోషకకరమైనవి. కండరాల నొప్పి, శ్వాసలో ఇబ్బంది,  జీర్ణ సమస్యలు మరియు కీటకాలు కొరకడం లేదా కుట్టడం నుండి ఉపశమనం కలిగించడానికి మరియు అంటువ్యాధులతో పోరాడటానికి సహాయ పడతాయి.44-47

3.15 టెర్రాగన్: పచ్చిగా తినడానికి   రుచికరమైనది. పంటి నొప్పి నుండి  మరియు ఆగిపోయిన  రుతుస్రావమునకు చికిత్స చేస్తుంది.      బ్యాక్టీరియాతో పోరాడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది, మరియు నిద్రను పెంచుతుంది. టెర్రగాన్ టీ వత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. 4,48

3.16 తైమ్: ఒరిగానో కు బంధువుగా పరిగణింపబడే ఈ ఆకుకూర మట్టి వాసనతో, నిమ్మకాయ, మరియు పుదీనా వలె ఉంటుంది. రోజ్మేరీతో కలిసి ఉపయోగించినప్పుడు మంచి రుచిని ఇస్తుంది. ఇది ఓరిగానో కంటే ఎక్కువ విటమిన్ A & C కలిగి ఉంది. ఇది సహజ మూత్రవిసర్జన కారి, ఆకలిని పెంచుతుంది, జీర్ణాశయ మరియు శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించగలదు. మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడే గలదు ఇది తెగుళ్ళను పోగొడుతుంది పురాతన కాలంలో ఇది విషాన్ని నివారించడానికి మరియు చికిత్స చేయడానికి సమర్థవంతంగా ఉపయోగించబడింది.4,49,50

4. మూలిక ఆకులు కూరగాయల మాదిరిగా ఎక్కువగా ఉపయోగపడతాయి

4.1 అమరాన్త్ ఆకులు (చౌలయ్): అనేక రకాల ఆకుకూరల కన్నా ఉన్నతమైన గుణాలు కలిగిన దీనిలో విటమిన్ A, C, B కాంప్లెక్స్ K మరియు ఐరన్ లు సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో బచ్చలికూర కంటే ఎక్కువ పొటాషియం మరియు కాల్షియం ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధిని, ఇనుము లోపము, మరియు రక్తహీనత నివారిస్తుంది. లేత ఆకులను సలాడ్లతో కలపవచ్చు లేదా జూస్ గానూ, పేస్టు గానూ, కూరగాను తయారుచేసుకోవచ్చు అలాగే కాయ ధాన్యాలలో కూడా కలిపి వండుకోవచ్చు. 51-53   

4.2 ఫెను గ్రీక్ ఆకులు (మెంతి): దీనిని సాధారణంగా గోధుమ పిండి రొట్టెలు (చపాతీలు)కు చట్నీగా లేదా కూరగాయగా ప్రత్యేకించి  బంగాళదుంపతో కలిపి వండుతారు. దీనిని నిత్యమూ వినియోగించడం రక్తహీనత మరియు అన్నిరకాల జీర్ణకోశ వ్యాధులకు, ఇంకా ఇతరములైన బెరిబెరి  మరియు క్షయ వంటి వ్యాధుల నివారణకు, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు, మరియు శరీర ఉష్ణోగ్రత స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. దీనిని పేస్టుగా తయారు చేసి ఉపయోగిస్తే మచ్చలు తొలగించడానికి, బట్టతల రాకుండా నియంత్రిస్తుంది. నిమ్మరసంతో కలిపి సహజమైన మౌత్ వాష్ గా చేయవచ్చు.54 (వార్తాలేఖ సంపుటి 11సంచిక 3 & 5కూడా చూడండి.)

4.3 మునగ: అద్భుతమైన మొక్క యొక్క అత్యంత శక్తివంతమైన భాగం ఆకులు. వీనిలో 90 కంటే ఎక్కువ పోషకాలు, 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు, మరియు అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. పాలలో కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం మరియు బచ్చలి కూర కన్నా 3 రెట్లు ఐరన్ దీనిలో ఉంటాయి. ఆకులను రొట్టెలు, దోశాలు తయారీకి, పేస్టుగా తయారుచేస్తారు లేదా వాటి పోషక విలువల కోసం కూరగాయల కలిపి ఉపయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో చక్కెరను సమతుల్యం చేస్తుంది, మరియు జీర్ణ వ్యవస్థకు అద్భుతమైనది. మునగ గింజలను మురికి నీటిలో వేస్తే అవి నీటిలోని మురికిని పీల్చుకొని ఆ నీటిని త్రాగడానికి యోగ్యంగా చేస్తాయి.55-57 (వార్తాలేఖ సంచిక 11సంపుటి 5ను కూడా చూడండి.)

4.4 సోరెల్ ఆకులు/ గోంగూర: కాలుష్యనికి భయపడకుండా అన్ని రుతువులలో తినగలిగే ఏకైక ఆకుకూర ఇది. సాధారణంగా రుచికి ఉప్పగా ఉంటుంది కానీ వేడిచేయడం ద్వారా పుల్లని రుచి పొందుతుంది. సాధారణంగా దీనిని చట్నీ గా తీసుకుంటున్నా పచ్చళ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలతో కలిపి కూడా ఉపయోగిస్తారు. దీనిలో పోషక పదార్ధాలు అధికంగా ఉండడంవల్ల రక్తహీనతతో సహా అనేక వ్యాధులను నివారిస్తుంది.58-60

5. హైబ్రీడ్ మూలికలు

5.1 హెర్బ్స్ డి ప్రొవిన్స్: సాధారణంగా ఫ్రెంచి వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది తులసి, బే ఆకులు, మార్జోరామ్, ఒరిగానో, రోజ్మేరీ,  సావొరీ, తారాగన్, మరియు తైమ్ వంటి ఎండిన మూలికలు సుగంధ మిశ్రమం.61

5.2 తిసాని / హెర్బల్ టీ: మూలికలతో తయారుచేసుకునే టీ మనలో ఎంతో చైతన్యం నింపుతుంది. ఏదైనా  మీకు నచ్చిన మూలిక తీసుకొని వేడి నీటిలో రెండు మూడు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఉంచి వడగట్టి త్రాగండి. ఈ విధమైన రూపంలో తీసుకుంటే సులువుగా జీర్ణం అవుతుంది మరియు ఆ మూలిక యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఒరిగానో, రోజ్మెరీ, సేజ్, తారాగన్, తైమ్, తులసి వంటి వాటితో పాటు మనం  యూకలిప్టస్ ఆకులు,ఎఖినేసియా, మందార (యాంటీవైరల్), సోపు లెమనోగ్రాస్, పుదీనా, సెలెరీ మరియు రూయిబాస్ (నిర్విషీకరణ కోసం మంచి జీర్ణక్రియ, మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి) లేదా చెమోమైల్ మరియు పాసన్ ఫ్లవర్ (ప్రశాంతత కోసం) వీటి నుండి టీ తయారు చేసుకొనవచ్చు.62-66

6. ముగింపు

 అన్ని మూలికలను తక్కువ మొత్తాలలో తీసుకుంటే అవి ఆహారాన్ని ఆకలి పెంచేవిగా, తాజాగా ఉండేలా చేస్తాయి మరియు మనల్ని సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. మూలికలను కూరగాయలుగా ఉపయోగించినప్పటికీ తగుమొత్తములోనే తీసుకోవడం ప్రధానం. అలర్జీ ఉన్నవారు, రక్తం పలచబడటానికి మందులు వాడేవారు, లేదా జీవనశైలి లేదా ప్రాణాంతక వ్యాధుల నిమిత్తం మందులు వాడేవారు, లేదా గర్భిణి స్త్రీలు నిర్దిష్ట మూలికలు మరియు వాటిని తీసుకునే పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

 సూచనలు లింకులు

  1. Food for a healthy body and mind, Divine Discourse at the Sri Sathya Sai Institute of Higher learning, July 1996, https://static.ssssoindia.org/wp_uploads/2018/03/26172212/Preventive-Health-Care-Module.pdf, page 15.
  2. What is a herb: http://www.differencebetween.net/science/health/difference-between-plants-and-herbs/
  3. Herb milder than spice: https://www.britannica.com/story/whats-the-difference-between-an-herb-and-a-spice
  4. Various benefits of herbs: https://www.homestratosphere.com/types-of-herbs/
  5. Beneficial herbs: https://www.mdlinx.com/article/10-nutritious-herbs-you-should-add-to-your-diet-now/lfc-3732
  6. Usage and Storage of herbs: https://www.thespruceeats.com/what-are-herbs-995714
  7. https://www.thespruceeats.com/how-to-substitute-dried-herbs-for-fresh-herbs-1388887
  8. Storing fresh herbs: https://www.goodhousekeeping.com/home/gardening/a33670791/how-to-store-fresh-herbs/;
  9. https://www.thekitchn.com/your-guide-to-storing-fresh-herbs-in-the-fridge-231412
  10. Basil varieties, use, benefits: https://www.thespruceeats.com/what-is-basil--1807985;
  11. https://www.medicalnewstoday.com/articles/266425#benefits
  12. Holy basil/tulsi Research-backed efficacy: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5376420/;
  13. https://draxe.com/nutrition/benefits-of-basil/
  14. Bay leaves: https://www.everydayhealth.com/diet-nutrition-pictures/healthy-herbs-and-how-to-use-them.aspx;
  15. https://www.thespruceeats.com/what-is-a-bay-leaf-995576;
  16. https://draxe.com/nutrition/bay-leaf/
  17. Celery: https://draxe.com/nutrition/benefits-of-celery/
  18. Chives: https://draxe.com/nutrition/what-are-chives/;
  19. https://draxe.com/nutrition/what-are-chives/
  20. Cilantro/Coriander: https://draxe.com/nutrition/coriander;
  21. Benefits of coriander leaves: https://www.netmeds.com/health-library/post/coriander-leaves-5-excellent-health-benefits-of-adding-these-aromatic-leaves-to-your-daily-diet
  22. Curry leaves: https://www.netmeds.com/health-library/post/curry-leaves-medicinal-uses-therapeutic-benefits-for-hair-diabetes-and-supplements;
  23. https://draxe.com/nutrition/top-herbs-spices-healing/;
  24. https://indianexpress.com/article/lifestyle/health/chew-curry-leaves-ayurveda-diet-health-benefits-6559838/
  25. Dill leaves: https://www.netmeds.com/health-library/post/dill-leaves-astonishing-benefits-of-adding-this-nutritious-herb-to-your-diet;
  26. https://draxe.com/nutrition/top-herbs-spices-healing/;
  27. https://www.tarladalal.com/glossary-dill-leaves-shepu-suva-bhaji-376i
  28. Fennel leaves: https://www.1mg.com/hi/patanjali/saunf-benefits-fennel-in-hindi/
  29. Mint: https://www.netmeds.com/health-library/post/pudinamint-leaves-health-benefits-of-pudina-juice-uses-for-skin-hair-and-side-effects;
  30. https://www.webmd.com/diet/health-benefits-mint-leaves#1;
  31. https://draxe.com/nutrition/mint-leaves/
  32. Oregano: https://www.webmd.com/vitamins/ai/ingredientmono-644/oregano;
  33. https://draxe.com/nutrition/oregano-benefits/;
  34. https://www.thespruceeats.com/greek-oregano-tea-1705058
  35. Oregano & Marjoram: https://www.masterclass.com/articles/whats-the-difference-between-oregano-and-marjoram
  36. Parsley: https://draxe.com/nutrition/parsley-benefits/;
  37. Parsley vs Cilantro: https://www.wellandgood.com/cilantro-vs-parsley/
  38. Parsley vs coriander: https://economictimes.indiatimes.com/parsley-versus-coriander-a-dichotomy-of-cultural differences/articleshow/25002244.cms?from=mdr
  39. Rosemary: https://draxe.com/nutrition/rosemary-benefits/;
  40. https://www.verywellmind.com/does-rosemary-actually-improve-your-memory-4156875;
  41. https://www.flushinghospital.org/newsletter/the-health-benefits-of-rosemary/
  42. Sage: https://draxe.com/nutrition/sage-benefits/;
  43. https://www.netmeds.com/health-library/post/sage-5-stunning-health-benefits-of-the-memory-boosting-herb
  44. Savory: https://www.homestratosphere.com/types-of-herbs/#Winter_Savory;
  45. https://www.healthbenefitstimes.com/summer-savory/;
  46. https://www.masterclass.com/articles/what-is-savory-herb-learn-about-winter-and-summer-savory-with-4-recipe-ideas;
  47. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4142450/
  48. Tarragon: https://draxe.com/nutrition/tarragon/
  49. Thyme: https://draxe.com/nutrition/thyme/;
  50. https://www.healthline.com/health/health-benefits-of-thyme
  51. Amaranth leaves: https://www.nutrition-and-you.com/amaranth-greens.html;
  52. https://pharmeasy.in/blog/16-health-benefits-and-nutritional-value-of-amaranth-leaves/;
  53. https://www.researchgate.net/figure/Nutrients-comparison-of-vegetable-amaranth-with-spinach-and-other-leafy-vegetables-per_tbl4_232276940
  54. Fenugreek leaves: https://stylesatlife.com/articles/fenugreek-leaves-benefits/
  55. Moringa: https://draxe.nutrition/moringa-benefits/;
  56. https://www.vanguardngr.com/2013/06/the-many-unknown-benefits-of-moringa-leaf/;
  57. https://www.banyanbotanicals.com/info/blog-the-banyan-insight/details/moringa-oleifera-ayurveda-superfood/
  58. Sorrel leaves/Sour spinach: https://www.thehindu.com/life-and-style/food/go-for-the-gongura/article19125502.ece
  59. https://www.livemint.com/mint-lounge/features/gongura-an-ancient-leaf-for-all-seasons-1552045899317.html;
  60. https://medhyaherbals.com/gongura-roselle-ambadi/
  61. Herbs de Provence: https://www.masterclass.com/articles/what-are-herbs-de-provence
  62. Tisane/Herbal tea: https://www.healthline.com/nutrition/10-herbal-teas;
  63. https://www.healthline.com/nutrition/tea-for-digestion#TOC_TITLE_HDR_3;
  64. https://www.verywellfit.com/eucalyptus-tea-benefits-and-side-effects-4163892;
  65. https://completewellbeing.com/article/herbal-tea-drink-wellbeing/;
  66. https://www.healthline.com/health/anxiety/tea-for-anxiety

2. కోవిడ్-19 రెమిడీ నవీనీకరణ

భారతదేశంలో కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ యొక్క తీవ్రమైన కొరత, ఆక్సిజన్ స్థాయిని పెంచే మార్గాలను అన్వేషించడముపై పరిశోధనా  బృందాన్ని ప్రోత్సహించింది. SR304 Oxygen ను 200C వద్ద ఉపయోగించి తయారుచేసిన రెమిడీ నీటిని ప్రతీ పది నిమిషాలకు ఇవ్వడం ద్వారా ఆక్సిజన్ స్థాయి తక్కువ సమయంలో 90 కి పెరిగిందని పరిశోధనలు నిర్ధారించాయి. అభివృద్ధిని బట్టి మోతాదును క్రమంగా తగ్గించుకుంటూ వస్తే 2 రోజులలోనే ఆక్సిజన్ స్థాయి 95 కి చేరుకుంటుంది. 108 CC  బాక్స్ మాత్రమే ఉన్న ప్రాక్టీషనర్లు పైన పేర్కొన్న కార్డుకు బదులుగా CC19.1 Chest tonic పైన పేర్కొన్న మోతాదులో ఉపయోగించవచ్చు. వార్తాలేఖ సంచిక 12 సంపుటి 2 లో సూచించిన మార్గదర్శకాల ప్రకారం  IB రెమిడీ తప్పనిసరిగా కొనసాగించాలని గుర్తుంచుకోండి.

 పైన కనుగొన్న అంశాల ఆధారంగా SRHVP ఉపయోగించి తయారుచేయాబడే IB రెమిడీ క్రింది విధంగా సవరించబడింది: BR4 Fear + BR9 Digestion + SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM40 Throat + SR272 Arsen Alb 30C + SR277 Bryonia 30C + SR291 Gelsemium 30C + SR304 Oxygen 200C. 108 CC బాక్సు ఉపయోగించి తయారుచేయబడే రెమిడీ విషయంలో మార్పేమీ లేదు. వివరాలకు వార్తాలేఖ సంచిక 12 సంపుటి 2 లో అదనంగా అనే విభాగంలో 2ను చూడండి. మీరు మరింత సమాచారంతో మీ జ్ఞానాన్ని పరిపుష్ఠి చేసుకోవడానికి ఆక్సిజన్ కార్డు తో ప్రాక్టీషనర్ 11601…ఇండియా తనయొక్క అద్భుత అనుభవాలను వార్తాలేఖ సంచిక 11 సంపుటి 6 లో విభాగం 2 లో చూడండి. SR 304 కార్డును 200C లో ఉపయోగించడం ద్వారా ఆస్పత్రిలోనే కాక ఇంటివద్ద కూడా ఆక్సిజన్ లేమితో బాధపడుతున్న అనేక రోగులకు విజయవంతంగా చికిత్స చేసినట్లు ఆమె రిపోర్టులు సూచిస్తున్నాయి.  

IB ని ముక్కులో చుక్కలుగా ఉపయోగించడం

ప్రాక్టీషనర్ 11626 కు ఘాటైన వాసన మరియు ధూళికి అలర్జీ ఏర్పడి తుమ్ములు కూడా అభివృద్ధి అయ్యాయి. కనుక IB మోతాదును 6TD కి పెంచుకున్నారు (అంతకు ముందు ప్రివెంటివ్ గా OD వద్ద తీసుకునే వారు). రెండు రోజుల్లో తుమ్ములు తగ్గిపోయాయి కానీ ముక్కులో అవరోధం మరియు తలనొప్పి అలానే కొనసాగాయి. ఐతే IB నీటిలో తయారు చేసి ముక్కులో చుక్కలుగా ఉపయోగించినప్పుడు నాసా అవరోధం వెంటనే తగ్గిపోతుందని ప్రాక్టీషనర్11623 ద్వారా తెలుసుకున్నారు. ఈ విధంగా నీటిలో తయారుచేసి ఒక చుక్క నాసా రంధ్రంలో వేయగానే ఎంతో ఉపశమనం కలిగి లోనున్న తెమడ నీరుగా బయటకు ప్రవహించడం ప్రారంభమైంది. ఆమె ఈ చుక్కలను BD గా ఉపయోగించగా రెండు రోజుల్లో ఆమె సైనసైటిస్ పూర్తిగా తొలగిపోయింది. అప్పటినుండి  ఆమె తన పిల్లలకు ఎప్పుడు నాసా అవరోధం కలిగినా దీన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.  

3. న్యూఢిల్లీలో సాయి ఇంటర్నేషనల్ సెంటర్ లో 2021 ఏప్రిల్ 4న సాయి వైబ్రియానిక్స్ క్లినిక్ ప్రారంభం  

స్వామి యొక్క అపారమైన ఆశీర్వాదాలతో 2021 ఏప్రిల్ 4న కొత్త ఢిల్లీలోని సత్యసాయి అంతర్జాతీయ కేంద్రంలో వారాంతంలో నిర్వహించే సాయి క్లినిక్ ప్రారంభించు కోవడం ద్వారా వైబ్రియానిక్స్ మరో మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా  

 ఢిల్లీ NCR రాష్ట్ర అధ్యక్షుడు మరియు సత్య సాయి సేవ సంస్థ కి చెందిన ఆఫీస్ బేరర్స్ మరియు  ఈ ప్రాంతానికి చెందిన సాయి వైబ్రియానిక్స్ బృందము హాజరయ్యారు.

ఈ కార్యక్రమం వేదపఠనం మరియు జ్యోతి ప్రజ్వలనము తో  ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో వైబ్రియానిక్స్ బృందం చేస్తున్న సేవలను రాష్ట్ర అధ్యక్షుడు ప్రశంసిస్తూ సంస్థ యొక్క పూర్తి మద్దతు వైబ్రియానిక్స్ కు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రేమతో సేవలను కొనసాగించాలని స్వామి చూపిన మార్గాన్ని అనుసరించాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. 22 మంది ప్రాక్టీషనర్లు తీసుకువచ్చిన 108CC బాక్సులకు చార్జింగ్ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

 

 

 

ఈ క్లినిక్ ప్రతీ ఆదివారము వంతుల వారీగా ఇద్దరు ప్రాక్టీషనర్లచే నిర్వహింప బడుతుంది. పేషంట్ల నుండి బిపి, పల్స్ రేటు మరియు రక్తంలో చక్కెర వంటివి సేకరించడంలో సుశిక్షుతులైన సేవాదళ్ వీరికి సహకారం అందిస్తారు. ఈ క్లినిక్ స్థాపించడంలో ప్రాక్టీషనర్లు11573&11437యొక్క నిరంతర కృషి ఎంతో అభినందనీయం.

 

 

 

 

 

 

 

 

 

 

4. ఉత్తేజకరమైన కథలు

4.1 స్వచ్ఛమైన ప్రేమ ప్రవహిస్తూనే ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితిలో తరగతులు ఆన్లైన్లో జరుగుతున్న నేపధ్యంలో ఒక సాయి విద్యా సంస్థకు చెందిన విద్యార్థి ప్రస్తుతం తన తల్లితో ఢిల్లీ లోఉన్నారు. ఇద్దరికీ గత రెండు వారాలుగా కోవిడ్ లక్షణాలు కలుగగా తల్లి దాదాపు మంచం పట్టారు. ఈ విద్యార్ధి ఇద్దరికీ ఖచ్చితంగా కోవిడ్ పాజిటివ్ అనే భావించాడు కానీ వారి పరీక్ష ఫలితాలు ఎందుకో చాలా ఆలస్యం అయ్యాయి. సమీపంలో నివసిస్తున్న వారి దగ్గరి బంధువులు ఎవరూ కూడా వారికి ఏదైనా తీసుకురావడంలో కనీసం వారిని పట్టించుకోక పోవడంతో  వారు వండిన ఆహారాన్ని పొందడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 2021 ఏప్రిల్ 23న ఈ విద్యార్ధి అఖిల భారత వైబ్రియానిక్స్ కోఆర్డినేటర్ కు ఎంతో వేదనతో ఒక సందేశాన్ని పంపగా వెంటనే వారు  స్థానికంగా ఉండే ప్రాక్టీషనర్11389 సంప్రదించారు. కేవలము కొన్ని నిమిషాలలో ఆమె వ్యక్తిగతంగా రెమిడీలతో పాటు ప్రిస్క్రిప్షన్ అవసరం లేని కొన్ని అలోపతి మందులు పంపిణీ చేసారు. ఢిల్లీలో అ సమయంలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆమెను మార్గమధ్యంలో ఎవరూ ఎక్కడ ఆపలేదు. అంతేకాక ఈ ప్రాంతంలోని కోవిడ్ గృహ నిర్బంధములో ఉన్న కుటుంబాల కోసం స్థానిక సేవా సంస్థ వారు ఇంట్లో వండిన ఆహారాన్ని అందించడం ప్రారంభించినప్పుడు ఇలా హఠాత్తుగా నలుదిశలా ప్రవాహంలో స్వామి అనుగ్రహం కురిపించడం చవిచూచి వీరిద్దరూ మాటలతో వ్యక్తం చేయలేని కృతజ్ఞతతో ఉండిపోయారు. రెమిడీ తీసుకున్న 3వ రోజునుండి ఆ విద్యార్ధి ఆన్లైన్ తరగతులు హాజరు ప్రారంభించగా అతని తల్లి లేచి తన ఇంటి చుట్టూ నడవ గలిగారు. అంతేకాక ఐదవ రోజు నుండి ఇంట్లో పని చేసుకోవడం ప్రారంభించారు. ఆ విద్యార్థి ఇలా వ్రాశాడు:

 “మేము స్వామిని పుట్టపర్తిలో చూడలేక పోయాము కానీ అందరూ చెప్పగా విన్నాము “స్వామి అనేక రూపాలుగా అనేక మార్గాలలో మీ వద్దకు వస్తారు ఎందుకంటే అతడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక”. ఈరోజు నేను అందుకున్నది  ఔషధమే కావచ్చు, కానీ నేను దానిని స్వచ్ఛమైన ప్రేమ అని పిలుస్తాను. ఈ రకమైన ప్రేమను స్వామి మనందరిపై కురిపిస్తారు. ఈ సమయంలో స్వామి మీ రూపంలో వచ్చినందుకు స్వామికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవి నా జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత కష్టతరమైన రోజులని నిస్సందేహంగా చెప్పగలను. సాయిరాం.” 

4.2 స్వామి ఆశీస్సులు కొనసాగుతున్నాయి

2021 ఏప్రిల్ 20న ప్రాక్టీషనర్ 10741 తన 108 CC బాక్సులోని CC3.7 Circulation  కలిగిన డ్రాఫర్ బాటిల్ పూర్తిగా ఎండి పోయిందని కనుగొన్నారు. ఆమె అభ్యర్థన మేరకు తోటి ప్రాక్టీషనరు అదే రోజు మధ్యాహ్నం ఒక చిన్న సీసాలో ఆమె CC 3.7 తీసుకువచ్చారు. ఆమె తన డ్రాపర్ బాటిల్ లో తన సహచరి తెచ్చిన సీసా నుండి రెమిడీని డ్రాపర్ బాటిల్ లో పోద్దామని ప్రయత్నించినప్పుడు అది అప్పటికే ¾ భాగం నిండినట్లు చూసి అని అవాక్కయ్యారు. ఆమె సహచరి నుండి తీసుకువచ్చిన రెమిడీని జోడించడానికి తగినంత చోటు మాత్రమే ఉంది. 2008 మార్చి 2న స్వామి మాస్టర్ బాక్సును భౌతికంగా ఆశీర్వదించినప్పుడు స్వామి ఇదే బాటిల్ బయటకు తీసారు. (108 CC పుస్తకం మొదటి పేజీ లోని చిత్రాన్ని చూడండి). ఇది ప్రాక్టీషనర్లు అందరికీ స్వామి యొక్క పునర్వాగ్దానముగా భావించవచ్చు.   

5. వర్క్ షాపులు మరియు సదస్సులు

5.1 వర్చువల్ AVP వర్క్ షాప్ 2021 జనవరి 9 నుండి మార్చి 6 వరకూ ; పుట్టపర్తిలో ప్రాక్టికల్ వర్క్ షాప్ మార్చి 13-14

ఈ తొమ్మిది వారాల వర్క్ షాప్ లో 36 వర్చువల్ సెషన్లలో అభ్యర్థులు తమ ఈ కోర్స్ లో అప్పటికే అధ్యయనం చేసిన  మాన్యువల్ లోని మొత్తం 9 అధ్యాయములపై  లోతైన విశ్లేషణ జరిగింది. వర్చువల్ ప్లాట్ఫామ్ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రస్తుతం  ప్రాక్టీషనర్లు ఈ సదస్సులలో నిశ్శబ్ద ప్రేక్షకుల వలె  పాల్గొన్నారు. ఇది వైబ్రియానిక్స్ పట్ల వారి అవగాహన పెంచుకొనడానికి మరియు తమ జ్ఞానాన్ని పునశ్చరణ చేసుకొనడానికి సహాయ పడింది. అంతేకాకుండా వైబ్రియానిక్స్ ఉపాధ్యాయులుగా కావాలని కోరుకునే కొందరు సీనియర్లకు కొన్ని టాపిక్ లను బోధించే అవకాశం ఇవ్వబడింది. వైబ్రియానిక్స్ పెరుగుదలకు అత్యంత కీలకమైన రోగ చరిత్రలను వ్రాసే విషయంలో మార్గదర్శకత్వం ఇవ్వబడింది. అలాగే వ్యాధి రాకుండా నివారించే క్రమంలో ఆరోగ్య కరమైన జీవనశైలి యొక్క ప్రాముఖ్యతపై చర్చలు కూడా జరిగాయి. IASVP విభాగపు డైరెక్టర్ ప్రస్తుతం వైబ్రియానిక్స్ నిర్మాణం పై ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సభ్యులను ఉద్దేశించి డాక్టర్ అగ్గర్వాల్ ప్రారంభంలో చేసిన ప్రసంగంలో రోగిలో వ్యాధి నయం కావడానికి భక్తి, అంకితభావం, మరియు కృతజ్ఞత ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశాలు. ప్రేమను వ్యక్తపరచడంలోనే రోగికి వ్యాధి నుంచి స్వస్తత కలిగించవచ్చని నొక్కి చెప్పారు. ప్రాక్టీషనర్లు తమ వంతు కృషి చేసి ఫలితాలను స్వామికి వదిలివేయాలి. ఈ విర్ట్యువల్ వర్క్ షాప్ చివరి రోజున ప్రపంచవ్యాప్తంగా 61 మంది పాల్గొనడంతో గొప్ప విజయాన్ని సాధించింది. పుట్టపర్తిలో జరిగిన ప్రాక్టికల్ వర్క్ షాప్ లో కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేసి 108CC బాక్స్ ను కృతజ్ఞతతోనూ మరియు వారి రోగులకు సేవచేయడంలో తమ వంతు కృషి చేయాలనే సంకల్పంతో అందుకున్నారు.  

5.2 వర్చువల్ SVP వర్క్ షాప్ పుట్టపర్తి 2021 మార్చి 22-23  

రెండు రోజుల సదస్సు 2018-19 లో అర్హత సాధించిన తొమ్మిది మంది SVP ల కోసం ఫాలో అప్ వర్క షాప్ గా నిర్వహించబడగా   అందులో ఏడుగురు మరియు 5 గురు ఇతర సీనియర్ ప్రాక్టీషనర్లు హాజరయ్యారు. మొదటిరోజు అనేక కేసు చరిత్రలపై వివరణాత్మక  మరియు లోతైన చర్చ జరిగింది.  డాక్టర్ అగర్వాల్ గారి నుండి అందుకున్న ఎంతో విలువైన సమాచారంతో సహా రెండవ రోజు మొత్తము మియాజమ్ మరియు బ్రాడ్కాస్టింగ్ యొక్క అభ్యాసములకు కేటాయించ బడినది.

 

 

 

 

 

6.జ్ఞాపకార్థం

ఎంతో అనుభవజ్ఞురాలు గొప్ప సేవకురాలు ఐన మన ప్రాక్టీషనరు శ్రీమతి కమలేష్ వాద్వా00535 2021 జనవరి 22న తన 84 వ ఏట లండన్ లోని తన ఇంటి నుండి మనకు  వీడ్కోలు పలికారు.  హీమోలైటిక్ అనీమియా (రక్తహీనత)  కారణంగా గత సంవత్సరం పూర్తిగా ఆరోగ్యం కోల్పోయే వరకూ చురుకుగా తన రోగులకు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఈ సేవను కొనసాగించడం ఆమెకు కష్టమైంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాము.