ప్రశ్నలు జవాబులు
Vol 12 సంచిక 3
May / June 2021
Q1. మా దేశంలో సాధారణంగా రోగులను కనుగొనడం చాలా కష్టం. గత సంవత్సరం కాలం నుండి కోవిడ్ కారణంగా నాకు కొత్తరోగులే లేరు. నేను పోస్టల్ సేవల ద్వారా ప్రస్తుతం నా పాత పేషంట్లకు రీఫిల్స్ పంపే సేవ మాత్రమే చేయగలుగుతున్నాను. కొత్త రోగులను కనుగొనడంలో ఏమైనా సూచనలు ఇస్తారా?
A. కొత్త రోగులను పొందడానికి ఉత్తమ మార్గం పాత రోగుల సహాయంతో వారి నోటి మాట ద్వారా ఇతరులకు తెలపడం. వారి అనుభవాలను చికిత్సలో కొనసాగుతున్న మెరుగుదలను, వ్యాధి విషయంలో వారి విజయ గాధలను వైబ్రియానిక్స్ యొక్క ప్రయోజనాలను పొందడానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు, సహచరులకు తెలియ పరచమని ప్రోత్సహించండి. ప్రజలు తమ యొక్క మొక్కలు మరియు పెంపుడు జంతువులకు చికిత్సా ప్రయత్నం చేయడంపై ఆసక్తి చూపుతారు. మీరు VP లేదా అంత కంటే పై స్థాయిలో ఉంటే మీ సంప్రదింపు సమాచారంతో అనుకూలత కలిగిఉన్న మన ప్రామాణిక విజిటింగ్ కార్డు వెబ్సైట్ నుండి తీసుకొని ఉపయోగించే సౌకర్యం ఉంది. మీ రోగులకు వైబ్రియానిక్స్ గురించి మౌఖిక లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు ఇవ్వడానికి తగినన్ని విజిటింగ్ కార్డులను వారికి అందించండి. రోగులు విజయవంతమైన చికిత్సా గాధలను, కథనాలను చదవడానికి ఇష్టపడతారు కనుక మన వార్తా లేఖలు మరియు వెబ్సైట్ వివరాలను వారికి తెలియపరచండి.
______________________________________________________________________________________________________________
Q2. నా పేషంటు మొటిమల కోసం వైద్యులు సూచించిన అల్లోపతి క్రీము ఉపయోగిస్తున్నారు. కొంత విరామం తర్వాత బాహ్యానువర్తనం బాహ్యంగా చర్మం పై రాయడానికి వైబ్రియానిక్స్ రెమిడీ కూడా సూచించవచ్చా?
A. అవును మీరు సూచించవచ్చు. ఈ కేసు విషయంలో వైబ్రియానిక్స్ రెమిడీ అలోపతి క్రీము కంటే ముందు చర్మం పై రాయడం మంచిది. ఎందుకంటే ఈ కంపనాలు 20 నిమిషాలలో శరీరంలో శోషింప బడతాయి. అలోపతి క్రీము మొదట చర్మం పై రాస్తె అది చర్మంపై 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండి వైబ్రియానిక్స్ కంపనాలకు ఆటంకం కలిగిస్తుంది. ______________________________________________________________________________________________________________
Q3. బ్రాడ్కాస్టింగ్ ద్వారా రెమిడీల ప్రసార విధానం గురించి నేను కొంత అవగాహనా లోపంతో ఉన్నాను. ఈ విధానం గురించి మరియు ప్రసారానికి సంబంధించిన ఏవైనా నియమాలు మరియు అవసరాలను గురించి నాకు తెలియజేయగలరా?
A. ప్రసారం చేసే విధానంతో సహా బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన అన్ని అంశాలు మునుపటి వార్తాలేఖలు సంపుటి 7 సంచిక 1 నుండి 4 మరియు 6లోనూ, సంపుటి 8 సంచిక 6, సంచిక 9 సంపుటి 4, సంచిక 10 సంపుటి 2, సంచిక 11 సంపుటి 4 మరియు సంచిక 12 సంపుటి 1లో ఉన్నాయి. సంచిక 7 సంపుటి 4లో SRHVP యొక్క స్లాట్ లో కార్డును ఉంచి నేరుగా ప్రసారం చేయవచ్చని పేర్కొన్నారు. అయితే కార్డ్ ఉపయోగించి మొదట సిద్ధం చేసిన రెమిడీతో మామూలుగా ప్రచారం చేయడం ఉత్తమంగా ఉంటుందని తాజా పరిశోధన నిర్ధారించింది. ఐతే మోతాదు ఇచ్చేటప్పుడు దాని యొక్క నిడివి, మోతాదు తగ్గించే విధానము, ప్రారంభ మోతాదు ఇచ్చే మందు సిద్ధం చేయడం, వంటి నియమాలు మౌఖికంగా తీసుకోవడం మాదిరిగానే ఉంటాయని గుర్తుంచుకోండి. ______________________________________________________________________________________________________________
Q4. నా రోగులలో కొంతమంది రెమిడీ తీసుకున్న కొంతకాలము తర్వాత వాడడం మానేశారు, మరికొందరు స్వీకరించిన తర్వాత భయం లేదా కుటుంబ ఒత్తిడి కారణంగా తీసుకోవడం ప్రారంభించలేదు. వార్తాలేఖలు మరియు వెబ్ సైట్ ద్వారా అవగాహన చేసుకొని కూడా రెమిడీ తీసుకొనడానికి ఇష్టపడని వారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని ఎలా అధిగమించాలో నాకు మార్గనిర్దేశం చేయగలరా?
A. చాలామంది తెలియని విషయాల పట్ల భయపడుతూ ఉంటారు. అందుచేత వైబ్రియానిక్స్ సాహిత్యం చదివిన తర్వాత కూడా కొందరు భయము మరియు సంశయంతొ ఈ చికిత్స తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చనే విషయం అర్ధం చేసుకోదగినదే. ఇటువంటి సందర్భాల్లో వారి మొక్కలు పెంపుడు జంతువులు వంటి వాటికి రెమిడీ ఇవ్వడం ఉత్తమం. ఇది చాలా వేగంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వైబ్రియానిక్స్ తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. ఈ రెమిడీ తీసుకోవడానికి వారికి అంతర్గతముగా ఇష్టం లేనందున ఇవి వారికి బాగా పనిచేసే అవకాశం లేదు. వైబ్రియానిక్స్ గురించి అవగాహన కల్పించడమే మన బాధ్యత, అంతేకానీ ఈ వైద్య వ్యవస్థ యొక్క ప్రయోజనాలను గురించి చెప్పి వీటిని వాడండి అని ఎవరినైనా ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. సాంప్రదాయ ఔషధం పనిచేయని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఈ చికిత్సను కోరుకుంటారు. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే ప్రజలు వేగంగా అద్భుత నివారణ కోసం ఆశిస్తూ ఉంటారు, ఇది జరగనప్పుడు వారు మరొక చికిత్సకు మరులుతూ ఉంటారు. అలా అని వారు వైబ్రియానిక్స్ ప్రయోజనములు పొందలేకపోయారని భావం కాదు. అందుచేత ఏది జరిగినా దైవ సంకల్పంగా భావించి మీ శక్తిని ఇతర కొత్త పేషంట్లపైన కేంద్రీకరించడం మంచిది.
______________________________________________________________________________________________________________
Q5. వంశపారంపర్యంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో జీవనశైలి పాత్ర ఏమిటి?
A. మనకు బాధను కలుగజేసే వ్యాధులలో 10-30% మాత్రమే వంశ పారంపర్యంగా వస్తున్నట్లు అంచనా వేయబడింది. మిగిలినవి జీవనశైలి మరియు కాలుష్యం వంటి పర్యావరణ కారకాల వల్ల వస్తాయి. మరోవిషయం ఏమిటంటే మన శరీరంలో ఉండే జన్యువులు(జీన్స్) శాశ్వతంగా ప్రోగ్రాం (నిర్దిష్టం) చేయబడి ఉండవు. అవి మన పర్యావరణాన్ని బట్టి ప్రధానంగా మన పంచేంద్రియాల నుండి మనం తీసుకునే వాటిద్వారా ప్రభావితం అవుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. జీవనశైలి యొక్క ప్రాముఖ్యత గురించి అనగా ఆహారం, వ్యాయామం, ధ్యానం, నిద్ర, మనసును ప్రశాంతంగా ఉంచడం, మరియు ప్రతీ పనిని ఆనందంగా చేయడం గురించి రోగులకు అవగాహన కల్పించడం చాలా అవసరం. ఐతే మీరు వారితో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరుచుకున్న తరువాతనే ఇవి చెప్పాలి. ప్రారంభములోనే ఇట్టి సున్నితమైన విషయాలు చెప్పడం వైబ్రియానిక్స్ నుండి వారిని దూరము చెయ్యవచ్చు.
______________________________________________________________________________________________________________
Q6. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నా రోగుల్లో చాలామంది చికిత్స ప్రారంభంలో 60-80% వేగంతో కోలుకున్నారు, కానీ అనంతరం చికిత్సలో మెరుగుదల ఆగిపోయింది. కారణం ఏమై ఉండవచ్చు? నా కర్తవ్యం ఏమిటి?
A. వైబ్రేషన్ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి శరీరం కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధికి రోగనిరోధక శక్తిని రూపొందించు కొంటుంది. అప్పుడు శరీరం రెమిడీ ద్వారా ఇచ్చే ఆ ప్రకంపనలకు రిసెప్షన్ లేదా స్వీకరణ ఆపి వేస్తుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. రైల్వేస్టేషన్ ప్రక్కన అపార్ట్ మెంట్ లోకి నివాసం కోసం వెళ్ళినప్పుడు ఆ శబ్దం మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. మీరు నిద్ర కూడా పోలేరు. ఐతే కొన్ని నెలల తర్వాత మీరు శబ్దం గురించి మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీ శరీరం ఆ శబ్దం యొక్క స్పెక్ట్రమ్ నుండి మినహాయింపబడడం వలన అది శబ్దానికి స్పందించదు. మీరు చెప్పిన పై విషయంలో శరీరంలో ఉండే ఒక రకమైన మియాజం చికిత్స పరంగా కలిగే మరింత అభివృద్ధిని అడ్డుకుంటుంది. అందువల్ల అటువంటి సందర్భాల్లో వార్తాలేఖ సంచిక 8 సంపుటి 5 లో వివరించినట్లుగా అసలు రెమిడీని తిరిగి ప్రారంభించే ముందు SR560 All Miasms తో చికిత్స చెయ్యండి. అలాగే ఇలాంటి ప్రశ్న కోసం వార్తాలేఖ సంపుటి 6 సంచిక 2 చూడండి.