Vol 12 సంచిక 2
March / April 2021
అవలోకనం
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ఇటీవలే సమాధి చెందిన స్వామి ఆనంద గారికి ఘనమైన నివాళులు అందిస్తూ సాయి వైబ్రియానిక్స్ ఆవిర్భావము పరిణామాలకు వారి కృషిని గుర్తు చేసుకుంటూ డాక్టర్ అగ్గర్వాల్ గారు వైబ్రియానిక్స్ సంబంధించి సంస్థాగత మరియు విద్యా విషయక అభివృద్ధి, వైబ్రియానిక్స్ విస్తృతికి చేసిన కృషి, వ్యక్తుల సంక్షేమానికి రెమిడీల పంపిణీ ద్వారా చేస్తున్న కృషిని పేర్కొన్నారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
10 ఆసక్తి కరమైన కేసుల గురించి ఇందులో వివరించడం జరిగింది. దీర్ఘకాలిక వెన్నునొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్, మెదడులో క్యాన్సర్ విస్తృతి, మడమ ఎముక అధికంగా పెరగడం, రక్త హీనత, ఋతు తిమ్మిరి, నిద్ర లేమి, మోకాలి నొప్పి, జీర్ణాశయ పుండ్లు, ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాశకోశ సంబంధిత వ్యాధి, ముసలి శునకంలో కండరాల బలహీనత, కోవిడ్-19, శ్వాశకోశ అలెర్జీ, వినికిడి మరియు వాసన గ్రహించే సామర్ధ్యం కోల్పోవడం.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్ల గురించి ఈ వార్తాలేఖలో పరిచయం చేస్తున్నాము. సాయి కుటుంబములో పుట్టి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఒక ప్రాక్టీషనరు తనను మరియు తన కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉంచడానికి సహజమైన, ప్రకృతి సిద్ధమైన మార్గాలను అనుసరిస్తూ తన రోగులను ఆరోగ్యకరమైన జీవన శైలి వైపు ప్రోత్సహిస్తున్నారు. చికిత్స లేనిదిగా భావించిన అర్థ్రైటీస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు విజయవంతంగా చికిత్స చేసారు. తన వ్యాపార జీవన సరళి నుండి విశ్రాంతి తీసుకున్న మరొక ప్రాక్టీషనరు 2014 నుండి పూర్తిగా వైబ్రియానిక్స్ సేవకే అంకిత మయ్యారు. 30,000 వరకు రోగులకు అన్ని రకాల వ్యాధులకు 95% విజయవంతమైన రేటుతో చికిత్స చేయడం జరిగింది. వీనిలో చర్మ కేన్సర్ వంటి కొన్ని అద్భుతమైన కేసులు కూడా ఉన్నాయి.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
క్రింది వానిని గురించి తెలుసుకోవడానికి ఈ విభాగం చదవండి: కోవిడ్-19 టీకా యొక్క దుష్ప్రభావములను పోగొట్టే రెమిడీలు ఏవైనా ఉన్నాయా, రక్షిత వాతావరణంలో ఉంచినప్పుడు మరియు తల్లి క్రమం తప్పకుండా IB తీసుకుంటున్నప్పుడు నవజాత శిశువుకు IB ఇవ్వాలా, జనన సమయంలో కలిగే బాధ తొలగించడానికి నవజాత శిశువుకు ఇవ్వవలసిన కోంబో ఏమిటి, పురుష హార్మోన్ల సమక్షంలో క్యాన్సర్ కణాలు వేగంగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో మనం ఇచ్చే CC 14.1Male tonic పురుష హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది కదా దీనిని ఎలా అన్వయించు కోవాలి, ఇటీవల ప్రపంచమంతా వ్యాపిస్తున్న క్యాండిడా ఆరిస్ అనే కొత్త ఫంగస్ నివారణకు తగిన రెమిడీ ఏది?
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్యవాణి
మానవ శరీరం ఎన్నో రకాల సూక్ష్మ జీవులకు, పరాన్న జీవులకు నివాస స్థానం అయినప్పటికీ, మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో సేవ ద్వారా ఆత్మ సాక్షాత్కారం వైపు ఎలా పురోగమించాలో స్వామి ప్రేమ పూర్వకంగా తెలిపారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
అమెరికా మరియు ఇండియాలో భవిష్యత్తులో నిర్వహింపబోయే విర్ట్యువల్ శిక్షణా శిబిరాల గురించి తెలుప బడింది. AVP మరియు SVP వర్కుషాపులు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసుకున్నవారికి కాగా పునశ్చరణ తరగతులు ప్రస్తుతం ప్రాక్టీషనర్లుగా ఉన్నవారికి ఉంటాయి.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
“నోటి ఆరోగ్యము మన సంక్షేమానికి ఒక చక్కని మార్గము” అనే ఆరోగ్య వ్యాసం ద్వారా నోటి నిర్మాణము మరియు విధులు, వివిధ నోటి రుగ్మతలు, నోటి దుర్వాసన పోగొట్టుటకు గృహ చిట్కాలు, నోరు పొడి బారడం, దంతములపై గార పట్టడం, పంటి నొప్పి మరియు చిగుళ్ళ వ్యాధులు, మరియు నోటిలో ప్రమాద వశాత్తు ఏర్పడిన కాలిన గాయాల గురించి ఈ వ్యాసం సవివరంగా తెలిపింది. అంతేకాక ఎలా బ్రష్ చెయ్యాలి ఎలా చేయకూడదు అనేది కూడా వివరింప బడింది. అలాగే కోవిడ్-19 అప్డేట్ గురించి, ప్రపంచ వ్యాప్తంగా IB విషయంలో కలిగిన 3 అద్భుతమైన అనుభవాలు గురించి, మూడు ఆసక్తి కరమైన కథలు, మరియు సంక్లిష్ట భూభాగంలో మోహరించిన దళాలకు హ్యాపీనెస్ ఔషధం గురించి వివరాలు పంచుకోవడం జరిగింది. సంస్మరణ అనే విభాగంలో ఇటీవలే స్వర్గస్తులైన ఇద్దరు అంకిత భావం గల ప్రాక్టీషనర్లకు నివాళులు అర్పింప బడినవి.
పూర్తి వ్యాసం చదవండి