Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 12 సంచిక 2
March / April 2021


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఓం నమః శివాయ! రానున్న పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా అందరికీ దీవెనలు. స్వామి ఒకసారి ఇలా చెప్పేవారు. “ప్రజలు ఈ లోకానికి నిద్రించడానికి మరియు భుజించడానికి రాలేదు. వారు క్రమశిక్షణతో కూడిన ప్రక్రియల ద్వారా వారిలో ఉన్న దైవమును వ్యక్తీకరించడానికి వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరిని వ్యక్తి అని పిలుస్తారు. అనగా తమలో ఉన్న దివ్యశక్తి ప్రేరణ మేరకు తమ శక్తిని వ్యక్తం చేసేవారే వ్యక్తులు. ఈ దైవిక ప్రయోజనం కోసమే ప్రజలు శరీరము ధరించి దానిని నియంత్రించడానికి ఉపయోగకరమైన కార్యాచరణ మార్గాలకు  మళ్ళించడానికి అవసరమైన తెలివితేటలు కలిగి ఉన్నారు. నైతికత మరియు మంచి పనుల (ధర్మ నిష్ఠ  మరియు కర్మ నిష్ఠ) యొక్క స్థిరమైన సాధన ద్వారా మీరు దీనిని సాధించాలి- దైవ ప్రసంగము, శివరాత్రి, 1963.  

ఈ భాషణ మన ఉనికి యొక్క తత్వాన్ని మరియు ప్రయోజనాన్ని అందంగా గ్రహింప చేస్తోంది. మన జీవిత లక్ష్యాన్ని గ్రహించడంలో వైబ్రియానిక్స్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందో  మరియు మన తోటివారి సంక్షేమం కోసం మన తెలివితేటలు మరియు చర్యలను ఎలా మళ్లింప చేయవచ్చో తెలిపే ఒక చక్కని జ్ఞాపిక.  

 దైవ శక్తి యొక్క ఈ అందమైన స్పులింగాన్ని (స్పార్క్) తనలో మూర్తీభవింప చేసుకొని మానవత్వం యొక్క అభివృద్ధికి ఉపయోగించిన అటువంటి భగవదాశీర్వాద పూర్వక ఆత్మయే స్వామి ఆనంద. 84 సంవత్సరాల వయసులో జనవరి 24న సమాధి చెందిన స్వామీజీకి వీడ్కోలు పలకడం చాలా బాధగా ఉంది. స్వామి నారాయణి(మాతాజీ)తో పాటు సహరచయితగా స్వామి ఆనంద వైబ్రియానిక్స్ చికిత్సా వ్యవస్థకు ఆధారమైన అద్భుతమైన హ్యాండ్ బుక్కులను(కర పుస్తకాలను) రూపొందించారు. వారు ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతాజీకి ఆధారంగా నిలుస్తూ సరళమైన సమగ్రమైన సమర్థవంతమైన మరియు విప్లవాత్మక వ్యవస్థను దివ్య చికిత్సా ప్రకంపనాల రూపంలో రూపు దాల్చడానికి ఆమెకు మద్దతు ఇచ్చారు. ఇదే అనంతరం శ్రీసత్య సాయి బాబా వారి అపారమైన దయ మరియు ఆశీర్వాదాలతో సాయి వైబ్రియానిక్స్ గా పరిణామం చెందింది. 2014 లో మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సుకు స్వామీజీ రావడంతో మేమంతా ఆశీర్వదింప బడ్డామని భావించి ఎంతో ఆనందించాము. మరియు మూర్తీభవించిన సరళత మరియు వినయములకు ప్రతీకగా స్వామీజీని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము.

ఒక సంవత్సరం క్రితం సంస్థాగత నిర్మాణమును వ్యవస్థీకరించిన తరువాత (సంపుటి 11 సంచిక 2 మార్చి-ఏప్రిల్ 2020 లో ప్రకటించినట్టు) మేము ఇప్పుడు మాస నివేదికల సమన్వయకర్తలను ప్రాంతీయ సమన్వయ కర్తల స్థాయికి(RC) పెంచాము. మాస నివేదికలను  సేకరించడము వాటిని అప్లోడ్ చేయడం అనే పరిమిత స్థాయి నుండి ఇప్పుడు విస్తరించిన బాధ్యతలను వీరు కలిగి ఉన్నారు. వారు వైబ్రియానిక్స్ యొక్క అన్ని కార్యకలాపాల పూర్తి పర్యవేక్షణతో ఆయా ప్రాంతాలలో సంస్థ  యొక్క అభివృద్ధికి నాయకత్వం వహిస్తారు. వారు IASVP  విభాగపు డైరెక్టర్ మరియు క్రింది స్థాయిలో పనిచేసే ప్రాక్టీషనర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. భారతదేశం నుండి 24 ఆర్ సి లు తమ రెండవ నెలవారి సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారని తెలియజేయుటకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ సమావేశాలు ప్రాక్టీషనర్లు అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా వారినుండి డేటా సేకరణ, రిపోర్టింగ్ విధానాలను క్రమబద్దీకరించడం, కేస్ హిస్టరీలు వ్రాయడం, IASVP లో నమోదు మరియు ఇమ్యూనిటీ బూస్టర్ పంపిణీకి మార్గం సుగమం చేసాయి.   

IB విషయాన్ని చూసినట్లైతే ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న నివేదికల ప్రకారం మొత్తం మీద కోవిడ్-19 కేసులు తగ్గుతున్నప్పటికీ మహమ్మారి తగ్గుదల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వ్యాక్సిన్ కోసం డ్రైవ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా  ప్రారంభమైనప్పటికీ  కొత్త వైరస్ జాతుల ఆవిర్భావం మరియు వ్యాప్తి ఉధృతమవుతున్న దృష్ట్యా వ్యాక్సిన్ యొక్క ప్రభావాన్ని గురించి మనం ఇంకా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల IB పంపిణీ విషయంలో ఇదే ఒరవడి కొనసాగించడమే కాక టీకాలు వేసిన తర్వాత కూడా IB కొనసాగించడం అత్యవసరం. టీకా యొక్క దుష్ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై చాలామంది ప్రాక్టీషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మేము ఈ ఆందోళనకు సమాధానం ఈ వార్తాలేఖలోని “ప్రశ్న-జవాబు” విభాగంలోనూ మరియు “అదనంగా” అనే విభాగంలో కోవిడ్-19 కు నవీనీకరించబడిన కోంబోలతో  పాటు కోవిడ్ నివారణ మరియు చికిత్స రెండింటికీ పరిష్కారాన్ని అందించాము.

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో “స్ప్రెడ్ ద వర్డ్” ప్రచారం ప్రారంభమైనట్లు తెలపడానికి సంతోషముగా ఉంది. మన వైబ్రియానిక్స్ బృందం 2021 ఫిబ్రవరి 6న అనంతపూర్ లోని మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర అధ్యాపకులతో సమావేశం అయ్యింది. దీని తర్వాత ఐదు వందల మంది విద్యార్థులు హాజరైన సమావేశములో ప్రాక్టీషనర్లు12051 & 02696 పరిచయ/అవగాహన ప్రసంగం అందించారు. పాఠశాల అధికారుల ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 11 గురువారం విద్యార్థులకు ఫాలో అప్ ప్రసంగం కూడా అందించారు. ప్రేక్షకుల ఆసక్తి ఎంత గొప్పగా ఉందంటే మొదట పదిహేను ఇరవై నిమిషాల ప్రసంగానికి ప్రణాళిక వేసినప్పటికీ ఈ కార్యక్రమం గంటన్నర పాటు కొనసాగింది. ప్రాక్టీషనర్12051 ఆంధ్ర మరియు కర్ణాటక రెండు రాష్ట్రాలలోని ఇతర పాఠశాలలు మరియు వృద్ధాప్య గృహాలకు దీనిని విస్తరించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

  మునుపటి AVP వర్క్ షాప్ లను వర్చువల్ వర్క్ షాప్ లతో భర్తీ చేసే ప్రక్రియ ఇప్పుడు పూర్తయిందని తెలియజేయడానికి నాకు ఆనందంగా ఉంది. ఈ రిమోట్ లెర్నింగ్ ఎంపిక దూరం మరియు ప్రయాణాల నుండి ఉత్పన్నమయ్యే వ్యయ ప్రయాసలను తొలగించి  ప్రత్యక్ష బోధన ఫలితంగా అనేక మంది ఉపాధ్యాయులు తమ ప్రతిభను ఉపయోగించుకునే అవకాశాన్ని మాకు అందించింది. మా యు.ఎస్.ఎ మరియు కెనడా కోఆర్డినేటర్ మొదటి రెండు వర్చువల్ AVP వర్క్ షాప్ లను 2020లో ఏప్రిల్ నుండి జూలై మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు నిర్వహించారు. ఈ విజయాల ఫలితంగా ఆ తర్వాత భారతదేశంలో మొదటి తొమ్మిది వారాల AVP  వర్చువల్ వర్క్ షాప్ 2021 జనవరి 9న ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు ప్రారంభించారు, మరియు పుట్టపర్తిలో రెండు రోజుల ప్రాక్టికల్ వర్క్ షాప్ తో ఇది ముగుస్తుందని భావిస్తున్నాము. ఈ వర్క్ షాప్ లను సమగ్రంగా మరియు ఇంటర్ యాక్టివ్ గానూ చేసే ప్రక్రియ దిశగా అనేక ఆలోచనలు మరియు ప్రణాళికలు చోటుచేసుకున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హత గల మన ప్రాక్టీషనర్లు డెమోలు, రోల్ ప్లే, మరియు భాగస్వామ్యంతో రోగులు, జంతువులు, మరియు మొక్కలకు చికిత్స చేయడంలో వారి సుసంపన్నమైన అనుభవాలను ఈ వర్క్ షాప్ లలో పంచుకున్నారు.  

 గత కొన్ని నెలలుగా సాయి వైబ్రియానిక్స్ యొక్క సేవలో మరొక మైలురాయి వంటి సంఘటన నమోదు చేశాము.  2020 అక్టోబర్లో మంచుతో కూడిన కొండ ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో మోహరించి మానసిక, భౌతిక ఒత్తిడికి లోనవుతూ ఉన్న సుమారు పదివేల మంది సైనిక బృందాలకు రెమిడీలు అందించే అవకాశం లభించింది. మా పరిశోధన బృందం ఒక ప్రత్యేకమైన కోంబోను అభివృద్ధి చేసింది. ఈ కోంబో తీసుకున్న వారినుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉంది. కోంబో తీసుకున్న వారంతా  చక్కని శ్రేయస్సు,మరియు ఆనందకర స్థితిని నివేదించారు. మరిన్ని వివరాలు ఈ వార్తాలేఖలో “అదనంగా” అనే విభాగంలో #4 లో ఇవ్వబడ్డాయి.  

 నా ప్రియమైన సోదరీ సోదరులారా ఈ వ్యాఖ్యను ముగిస్తూ మీ అందరికీ ఆనందకరమైన మహాశివరాత్రిని కోరుకుంటున్నాను. మనమందరం శివుడిలో మునిగిపోయి మిగిలిన మన జీవిత శేషాన్ని తాత్కాలిక నివసమైన ఈ భూగ్రహం మీద ఆనందంగా గడపాలని ప్రార్థిస్తున్నాను. స్వామి వారి మాటల్లోనే “ఈ అరుదైన అవకాశాన్ని ఈ అద్వితీయమైన అదృష్టాన్ని అనేక జననాల యోగ్యతగా భావించి ఆత్మవికాసానికి ఉపయోగించుకొనండి.” దైవ ప్రసంగం, శివరాత్రి, 1965.  

  సాయికి ప్రేమపూర్వక సేవలో మీ

  జిత్ కె అగ్గర్వాల్