అదనంగా
Vol 12 సంచిక 2
March / April 2021
1. ఆరోగ్య చిట్కాలు
నోటి ఆరోగ్యం- మన శ్రేయస్సుకు ఒక మంచి మార్గం!
“మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నోటిని శుభ్రపరుచుకోవాలి. దంతాల లోపలి మరియు బయటి వైపు కూడా చక్కగా బ్రష్ చేయాలి. నాలుక యొక్క ఉపరితలం పూర్తిగా శుభ్రం చేయాలి, ఎందుకంటే “నోరు అన్నీ వ్యాధులకు ముఖ ద్వారం లేదా ప్రవేశ ద్వారం. ఒకరితో ఒకరము మాట్లాడుకునేటప్పుడు అసహ్యకరమైన వాసన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా పరిశుభ్రత ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ”… శ్రీ సత్య సాయి బాబా1
1. నోరు: నిర్మాణము మరియు విధులు
నోరు (బాహ్య కుహరము) పెదాలు, బుగ్గలు, అంగిలి, నాలుక, చిగుళ్ళు మరియు దంతాల తోపాటు నోరు నోటి కుహరం ఆహారం మరియు పానీయం తీసుకోవడానికి జీర్ణక్రియను ప్రారంభించడానికి గాలి పీల్చుకోవడానికి మాట్లాడటానికి మరియు పాడటానికి మరియు భావోద్వేగాన్ని చూపించడానికి ముఖ్యంగా చిరునవ్వులు చిందించ డానికి ఉపయోగపడే ప్రధాన అవయవము. కనుక దీనిని శరీరానికి అద్దము వంటిది అనడంలో అతిశయోక్తి లేదు!2
నోటి పైభాగంలో ఉండే అంగిలి ముందు భాగం గట్టిగానూ మరియు వెనుక వైపు మృదువుగానూ ఉంటుంది. మృదువైన అంగిలి చివర మాంసపు కండ వలె వ్రేలాడుతూ కొండనాలుక దానికి ఇరు వైపులా గొంతు వరకు స్తంభాల మాదిరిగా గొంతుకిరువైపులా గవదలు ఉంటాయి. ఆరోగ్యకరమైన నాలుక లేత గులాబీ రంగులో ఉండి దాని ఉపరితలంపై కొంత తెలుపు రంగుతో ఉండి రుచిని తెలుసుకోవడానికి, నమలడానికి, మ్రింగడానికి, మాట్లాడడానికి ఉపయోగ పడుతుంది. ఆహారాన్ని నమిలేటప్పుడు నోటి గోడలు మరియు క్రింది భాగంనుండి లాలాజల గ్రంధుల ద్వారా స్రవించే లాలాజలం జీర్ణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. మందముగా వ్యాపించిఉన్న చిగుళ్ళు దంతాలను కలిగి ఉండే అస్తి నిర్మాణాలు. దంతాలు కొరకడానికి, నమలడానికి, చప్పరించడానికి ఉపయోగపడుతూ ఒక్కొక్క దవడలో 4 కొరుకుదంతాలు, 2 కోరదంతాలు, 4 విసరు దంతాలు 4 నములు దంతాలు మరియు 2 జ్ఞాన దంతాలు కలిగి ఉండి వయోజనులలో 32 దంతాలు ఉంటాయి. నములు దంతాలకు 2-3 మూలాలు ఉండగా ఇతర దంతాలకు ఒక్కొక్క మూలం ఉంటుంది. ప్రతీ దంతము నాలుగు రకాల కణజాలంతో తయారై ఉంటుంది. గుజ్జు (పంటిని పోషణకు ఉపయోగపడే లోపలి భాగం) దీని చుట్టూ గట్టిగా పసుపు రంగులో ఉండే డెంటిన్ మరియు రక్షిత ఎనామిల్ లేదా పింగాణి భాగము (శరీరంలో అత్యంత గట్టి పదార్ధము) మరియు దంతాన్ని చిగురు స్థానంలో సరిగా కూర్చుండ బెట్టి ఉంచే కఠినమైన భాగం సిమెంటమ్, త్రిభుజాకార(ట్రిజిమినల్) నాడి(12కపాలనాడులలో అతిపెద్దది మరియు సంక్లిష్టమైనది) ఇది నోటికి సంచలనాలను అందిస్తుంది మరియు నమలడానికి కండరాలకు ప్రేరణ ఇస్తుంది. 2,3,4,5
2. దంతాల రుగ్మతలు నోటి రుగ్మతలు: నోరు మరియు ప్రత్యేకించి నాలుకపై పూత మరియు చిగుళ్ళు మరియు దంతాల మధ్య ఆవర్తన స్థలం బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన ప్రదేశం. ఎందుకంటే దీని సగటు ఉష్ణోగ్రత 37c/98.6F మరియు ఆర్ద్రత స్థాయి 96%6.. నోరు మన జీర్ణ మరియు శ్వాశకోశ వ్యవస్థకు ప్రవేశ స్థానం. హృదయ మరియు అస్థిపంజర వ్యవస్థ దంతాలకు అనుసంధానించబడి ఉండడం వలన నోటి ఇన్ఫెక్షన్లు శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తాయి. ప్రధాన కారణం ఆహారంలో జిగటగా ఉండే మరియు చక్కెరతో కూడిన పదార్ధాలు మరియు పానీయాలు తీసుకోవడం మరియు తగినంత నోటి పరిశుభ్రత లేకపోవడం.9
2.1 ఫలకము: అనేది దంతాలపై బ్యాక్టీరియా యొక్క మృదువైన జిగట వంటి పొర. ఇది బ్రష్ చేయడం ద్వారా తొలగించవచ్చు. దానిని తొలగించకుండా అలాగే కొనసాగేలా చేస్తే “గార” ఏర్పడి దాన్ని తొలగించడానికి వైద్య పరమైన సహాయం అవసరం అవుతుంది. ఆహారంలో ఉన్న చక్కెర లేదా పిండి పదార్థాలతో కలిసి ఇది ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి దంత క్షయానికి, చిగుళ్ళ వ్యాధులకు మార్గం సుగమం చేస్తుంది.9,10
2.2 దంతక్షయం / రంధ్రాలు: ఇవి బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా దంతాలలో ఏర్పడే రంధ్రాలను తద్వారా దంతక్షయాన్ని సూచిస్తాయి. 9,10
2.3 చిగురు వాపు: ఇది దంతాల మీద రుద్దడం లేదా బ్రష్ ను మెలిపెట్టడం వంటివి చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఏర్పడి చిగుళ్ళ నుండి రక్తస్రావము కలుగుతూ ఉంటుంది. ఇది మరింత తీవ్రమై పీరియడోమ్టిస్(పైరోయియా) వ్యాధికి దారితీస్తుంది. 9,10,11,12
2.4 పీరియడొంటల్ వ్యాధి: నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ చిగుళ్ళను కూడా దాటి ఎముక మరియు కణజాలాలను ప్రభావితం చేయడానికి దిగువన వ్యాపించినప్పుడు చిగుళ్ళు దంతాలనుండి పట్టు కోల్పోవడంతో మరింత నష్టం జరిగి ఎముక వ్యాధికి గురికావడం, పళ్ళు ఊడిపోవడం వంటి ప్రమాదలకు దారితీస్తుంది. 9,10,11,12
2.5 ఓరల్ స్కిన్ ఇన్ఫెక్షన్ లు: నోటిపుండ్లు (పెదవులు మరియు నోటి చుట్టూ ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే బాధాకరమైన పుండ్లు హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల కలుగుతాయి) క్యాంకర్ సోర్స్ అనే వాటిని ఆప్తస్ అల్సర్ అని కూడా పిలుస్తారు(నోటిలో బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల సంభవించే బాధాకరమైన పుండ్లు, ఇది అంటువ్యాధి కాదు, ఆహారము సరిగా తీసుకోక పోవడం, ఇనుము, ఫోలెట్, విటమిన్ B12 లోపాలను సూచిస్తుంది). నోటిలో లైకెన్ ప్లానస్ (నాలుకపై లేస్ వలె తెల్లని గీతలు –రోగనిరోధకతకు సంబంధించిన రుగ్మత) త్రష్(ఈస్ట్ శిలీంద్రము ఇన్ఫెక్షన్ కారణంగా నోటిలో తెల్లనిమచ్చలు) లూకో ప్లేకియా (చిగుళ్ళు ,నాలుక లేదా బుగ్గలపై అధిక కణాల పెరుగుదల కారణంగా తెల్లని మచ్చలు, ధూమపానం చేసే వాళ్ళలో ఇది సాధారణం క్రమంగా నోటి క్యాన్సర్ గా అభివృద్ధి చెందుతాయి. 2,9,13
2.6 దుర్వాసన (హాలీటోసిస్): మీనోటి శ్వాస వాసన క్రమంగా సహించడం వల్ల మీకు చెడు శ్వాస ఉందని తెలియకపోవచ్చు. ఆహార పదార్ధాలు పళ్లలో చిక్కుకు పోవడం వలన మరియు పంటి గార వలన దుర్వాసన కలగవచ్చు. ఇది చిగుళ్ల వ్యాధి, దంతాలలో రంధ్రాలు, పొడి నోరు, యాసిడ్ రిఫ్లెక్స్/ GERD, నోటి క్యాన్సర్ డయాబెటిస్(తీపి లేదా పండ్ల వంటి వాసన) లేదా మూత్రపిండాలు పనిచేయకపోవడం(మూత్రం చేపల వాసన లేదా అమోనియా వాసన ఉంటే) వంటి వ్యాధులకు కారణ మవుతుంది. 2,6,9,12,14
2.7 నోరు ఎండిపోవడం (జెరో స్టోమియా) తగినంత లాలాజలం లేకపోవడం వలన పెదాలు పగలడం, నోటిలో తడి ఆరిపోతున్న అనుభూతి, లేదా అధిక దాహం వేయడం వంటివి నోటి పూత, పుండ్లు ఇన్ఫెక్షన్లు, మరియు దంతక్షయానికి దారితీస్తాయి. అధిక ధూమపానం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. పొడిబారిన నోరు వత్తిడి, మందులు, క్యాన్సర్ చికిత్స వల్ల కావచ్చు లేదా డయాబెటిస్ వ్యాధికి సంకేతం కావచ్చు. 2,14
2.8 రంగు పాలిపోవడం/ గడ్డలు ఏర్పాడడం: నోరు తెలుపు లేదా ఎరుపు రంగుకు మారడం ముఖ్యంగా వయోజనులైన మగవారిలో నోటి క్యాన్సర్ తో సహా అనేక దంత సమస్యలకు సంకేతం అని చెప్పవచ్చు. పూసిన నాలుక అజీర్ణమునకు సంకేతం. పుండ్లు, గడ్డలు, వాపులు, లేదా మందపు పొరలు ఏర్పడి నమల డానికి, మ్రింగడానికి, మాట్లాడడానికి లేదా నాలుక లేదా దవడ కదపడానికి అవరోధంగా ఉంటే, గొంతు మంట లేదా పెదాలు పగలడం వంటివి ఎక్కువకాలం తగ్గకుండా ఉంటే వైద్య పరీక్ష అవసరం. నోటి క్యాన్సర్లు వెంటనే నివారించక పోతే ప్రాణాంతకం అవుతాయి. 4,14
2.9 సున్నితమైన దంతాలు: సురక్షిత పంటి పింగాణి పొర పలచన అయినప్పుడు లేదా చిగుళ్లు ఇన్ఫెక్షన్ కు గురిఐనప్పుడు దంతాలు సున్నితంగా మారి ఏదైనా వేడి లేదా చల్లని, తీపి లేదా పుల్లని ఆహారం పదార్ధం తీసుకోవడం వల్ల బాధాకరము అవుతాయి. అధికంగా లేదా మోటుగా బ్రష్ చేయడం, ఆమ్లము తో కూడిన ఆహారం తినడం, మరియు పళ్లను కొరకడం, రాపిడికి గురిచేయడం వలన దంతాల యొక్క సున్నితత్వానికి దారితీయవచ్చు. 9,15
2.10 ఇతర నోటి రుగ్మతలు: క్రమబద్ధమైన వరుసలో లేని దంతాలు, ప్రభావితమైన దంతాలు (జ్ఞాన దంతాలు వలె చిగుళ్ళ నుండి బయటకు రాని దంతాలు), బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ (స్పష్టమైన కారణం లేకుండా రుచి మరియు ఇంద్రియ సంబంధ నరముల లోపము లేదా మరేదైనా వైద్య పరిస్థితి కి సంబంధించినది), జన్యుపరమైన అసాధారణతలు చీలిక అంగిలి నాలుక వంటివి ఈ కోవకు చెందుతాయి. నాలుక లేదా క్రింది పెదవి వాచినప్పుడు లేదా విస్తరించినప్పుడు, నాలుక మరియు చిగుళ్ల మీద పగుళ్ళు ఏర్పడడం లేదా పొడి బారడం, లాలాజలం తక్కువగా ఉత్పత్తి కావడం లేదా చిక్కగా రావడం, ఇవన్నీ లాలాజల రాళ్లు లేదా స్వయం ప్రతిరక్షక రుగ్మతను సూచిస్తాయి. దవడలోవాపు లేదా నొప్పి ఆర్థరైటిస్ ను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా మరేదైనా వైద్యస్థితి ఉదాహరణకు దీర్ఘకాలిక ఆమ్ల ప్రకోపం, GERD వంటివి దంతక్షయానికి దారి తీస్తాయి. మధుమేహం, HIV/AIDS , బోలు ఎముకల వ్యాధి మరియు అల్జిమీర్ వ్యాధి నోటి ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. మందులు అధికంగా తీసుకోవడం వలన లాలజలము తగ్గి వ్యాధులకు దారితీస్తుంది.2,7,8,14,16,17
3. గృహ చిట్కాలు:
3.1 నోటి దుర్వాసన: పుష్కలంగా నీరు త్రాగండి, నారింజ ఇండియన్ గూస్ బెర్రీ మరియు నిమ్మకాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోండి. ఇవి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాని చంపడానికి తగినంత లాలాజలం ఉత్పత్తి చేస్తాయి. లవంగం, లేదా సోంపు/ సోపు గింజలు నమలండి. ఇంట్లో చేసిన లేదా సహజమైన మౌత్ వాష్ లేదా చల్లని నీటితో పుక్కిలించండి. 18,19
హెచ్చరిక: వక్క లేదా సుఫారీ కి అలవాటు పడితే అది నోటి క్యాన్సర్కు దారితీయవచ్చు.18,19
3.2 నోరు పొడిబారడం: దీనికోసం నీటిని సిప్ చేస్తూ ఉండండి కానీ అధికంగా నీరు త్రాగడం వల్ల నోటిలోని శ్లేష్మపొర తరిగి పోయి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అత్తిపండ్లను తినడం వలన అవి లాలాజల గ్రంధులను ప్రేరేపిస్తాయి. ఉపశమనం కోసం చెక్కర లేని కలకండ లేదా బబుల్ గమ్ వంటిది చప్పరించ వచ్చు. వీటిని క్జిలిటల్ తో పూత వంటిదిగా తీసుకుంటే ఇది దంతక్షయం నివారించడానికి కూడా సహాయపడుతుంది. పొడి బారిన లేదా పగిలిన పెదవుల కోసం కొబ్బరి నూనె, నెయ్యి, నూనెతో కూడిన లిప్ బామ్, లేదా విటమిన్ E తోకూడిన అయింట్ మెంట్ రాయండి. పొడి ఆహారంతో పాటు కొంత నీటిని తీసుకోండి, మరియు ఆమ్ల పానీయాలను నివారించండి.2,14,20
3.3 ఫలకము లేదా టార్టర్ లేదా పంటి గార: వెనిగర్ ద్రావణంతో నోటిని పుక్కిలించండి, లేదా వారానికి రెండు సార్లు నారింజ పై తొక్క లేదా దాని పేస్ట్ తో రెండు మూడు నిమిషాలు రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు చిటికెడు ఉప్పుతో బ్రష్ చెయ్యండి లేదా బేకింగ్ సోడా, కలబంద, మరియు గ్లిజరిన్ తో వారానికి ఒకసారి రుద్దండి. పక్షానికి ఒకసారి టూత్ బ్రష్ ను నిమ్మరసంలో ముంచి పళ్ళ మీద సుతారంగా రాయండి, ఒక నిమిషం తర్వాత శుభ్రం చేసుకోండి నువ్వులను బాగా నమిలి ఆపై ఈ పేస్ట్ తో బ్రష్ చేయండి. టమాటా, ఆరెంజ్, స్ట్రాబెర్రీస్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్ల తో కూడిన పేస్ట్ ను (సున్నితమైన దంతాల కోసం ఉపయోగించవద్దు) రాసుకొని ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.21
3.4 పంటి నొప్పి మరియు చిగుళ్ల వ్యాధి: వెచ్చని ఉప్పునీటితో నోరు శుభ్రం చేసుకోండి లేదా నొప్పి మంట నుండి ఉపశమనం పొందడానికి కోల్డ్ కంప్రెస్ ఉపయోగించండి. చిగుళ్ల నుండి రక్తస్రావం నిరోధించడానికి మరియు దంత ఫలకాన్ని కూడా తొలగించడానికి 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ దానికి సమానమైన నీటితో పుక్కిలించాలి. సున్నితమైన దంతాల కోసం జామ ఆకులు, లైకొరిస్ వ్రేళ్ళు (ములేతి), తాజా వెల్లుల్లి, లేదా సున్నితపు దంతాల కోసం లవంగం లమలాలి. వెల్లుల్లి లేదా పసుపు పేస్ట్ పట్టించండి లేదా లవంగం లేదా పిప్పెరమెంట్ తో మెత్తగా మసాజ్ చేయండి.22,23,24,25
3.5 ప్రమాద వశాత్తు మంట లేదా నోటిలో కాలిన గాయాలు: మొదట చల్లని నీరు త్రాగాలి తర్వాత ఒక ఐస్ క్యూబ్ లేదా చల్లని నీరు నోటిలో పదినిమిషాలు ఉంచాలి. కొద్దిసేపు నోటి ద్వారా శ్వాస తీసుకోవాలి. నోటికి ఉపశమనం కలిగించడం కోసము కొంచెం తేనె, పెరుగు, లేదా చల్లని పాలు తీసుకోవాలి. ఉపశమనం కోసం మింట్ టూత్ పేస్ట్ మరియు కణజాల పునరుత్పత్తి కోసం విటమిన్ E నూనెను పట్టించండి. గాయం నయం అయ్యేవరకు వేడివి, గట్టిగా ఉండేవి, ఉప్పుతో కూడినవి మరియు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలి.26
4. నోటి ఆరోగ్యానికి చిట్కాలు: వ్యాధి వచ్చాక చికిత్స చేసే కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది
దంత పరిశుభ్రత: దంత పరిశుభ్రత చాలా ముఖ్యం ఎందుకంటే ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించగలదు2,3,7,27-36
- రెండు నిమిషాలు చక్కగా బ్రష్ చేసుకోండి, ప్రతీ రాత్రి పడుకునే ముందు ఈ విధంగా బ్రష్ చేయడము వలన అంతకంటే కూడా ప్రతీ భోజనం తర్వాత బ్రష్ చేసుకోవడం, లేదా కనీసం ఉప్పు నీటితో నోరు శుభ్రం చేసుకోవడం మంచిది. బ్రష్ చేసుకునే సరైన విధానం ఏమిటంటే దంతాలు కలిసే ప్రదేశము, చిగుళ్ళు లక్ష్యంగా చేసుకొని బ్రష్ ను కొంత కోణంలో సున్నితంగా రుద్దండి. ప్రతీ పంటిని కొన్నిసార్లు సున్నితంగా రుద్దండి. పళ్ళకు లోపల, బయట అలాగే మీ నాలుకను కూడా శుభ్రం చేయడం మానకండి. అయితే శక్తివంతమైన లేదా అధికంగా బ్రెష్ చేయడం మానండి. దవడకు ముందు ఉన్న పళ్లలో లోపలి భాగాన్ని శుభ్రం చేసే సమయంలో బ్రష్ ను నిలువుగా పట్టుకోండి. బ్రష్ విషయంలో కుచ్చులు ఉండే భాగం చిన్నదిగాను మరియు మృదువైన కుచ్చులు ఉండేలా జాగ్రత్త వహించండి. ప్రతీ మూడు నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చండి. బఠానీ గింజంత టూత్ పేస్ట్ ఒకసారికి సరిపోతుంది. బ్రష్ చేయడం పూర్తి చేశాక ఉమ్మివేయండి, పుక్కిలించకూడదు. ఎలా బ్రష్ చెయ్యాలి, ఎలా చేయకూడదు28 అనే విషయంపై డెమో కోసం లింక్29 చూడండి 7, 27,28,29,30
- రోజుకు ఒకసారైనా ఫ్లాస్31 చెయ్యండి: పళ్ళు తోముకునే ముందు దంతాల మధ్య, మరియు పళ్ళకు చిగుళ్ళకు మధ్య ఉన్న ధృఢ ప్రదేశాల నుండి బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు ఒకసారి పాచి తొలగించండి. నోటి పరిశుభ్రతకు ప్రతీరోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం చాలా మంచిది. గాయాలను నివారించడానికి పంటి పుల్ల లేదా ఇతర వస్తువులను ఉపయోగించడము మానండి.7,27,28,29,31,32
- పొగాకుకు నో చెప్పండి: చక్కెరతో కూడిన స్నాక్స్, సంరక్షణ కారకాలతో ఉండే టెట్రా ప్యాక్ లలో ఉండే పళ్ళరసాలు, మరియు గట్టిగా జిగురుగా ఉండే ఆహారపదార్ధాలు తినడం మానండి. 3,7,27-32
- క్రమం తప్పకుండా దంతాలను చెకప్ చేయించుకోవడం మంచిది అలాగే ఏవైనా అసాధారణ మార్పులు ఏర్పడ్డాయేమో తెలుసుకోవడం కోసం మీ నాలుకను కూడా తనిఖీ చేయించడం మంచిది.4,7,28 బాల్యం నుండే పిల్లలకు మంచి దంత సంరక్షణ పద్ధతులను అలవాటు చేయడం ఎంతో మంచిది. 3,33,34
- పోషకాహారం మరియు తగినంత సహజ విటమిన్-డి ఉన్న ఆహారం తీసుకోండి. ముక్కలుగా తినగలిగే ఆపిల్ వంటి పళ్ళు (దీనిలో గ్జైలిటాల్ఉంటుంది) తినడం, మరియు క్యారట్ వంటి కూరగాయలను నమలడం వలన అవి దంతాలను శుభ్రపరిచి, చిగుళ్లను గట్టిపరచడమే కాక నోటిని శుభ్రపరచడానికి ఉపయోగపడే లాలాజలం ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది.35,36
5. ముగింపు: పసివారినుండి పెద్దవారి వరకు తగిన దంత సంరక్షణ తీసుకోవడం నోటిఆరోగ్యానికి ఎంతో మంచిది. సాయి వైబ్రియానిక్స్ తో వ్యాధి నిరోధకం మరియు నివారణ కోసం రెమిడీలు తీసుకోవడం మంచిది.
రిఫెరెన్సులు మరియు వెబ్సైట్ లింకులు:
1. Health is wealth”, Divine Discourse, 27 May 2002, Summer Course on Indian Culture and Spirituality: https://sathyasai.org/discour/2002/d020527.pdf, page 1-2.
2. Mouth-functions: https://medlineplus.gov/mouthdisorders.html
3. Mouth structure & function: https://kidshealth.org/en/parents/mouth-teeth.html
4. Tongue colour: https://medicalnewstoday.com/articles/tongue-color#healthy-color
5. Teeth anatomy: https://www.vcdental.com.au/tooth-anatomy-education/
6. Mouth & Bad breath (halitosis): https://verywellhealth.com/bad-breath-causes-of-halitosis-1191875
7. Oral health: a window to your overall health: https://mayoclinic.org/healthy-lifestyle/adult-health/in-depth/dental/art-20047475
8. Mouth reflects body health: https://healthcareinamerica.us/what-your-mouth-can-tell-you-about-the-rest-of-your-body-6ffec5989859; https://periodontal.co.uk/the-mouth-is-the-mirror-of-the-body/
9. Mouth disorders with pic: https://www.verywellhealth.com/top-common-dental-problems-1059461
10. Plaque, tooth decay & Gum disease: https://mayoclinic.org/diseases-conditions/gingivitis/symptoms-causes/syc-20354453
11. Tooth decay & gum diseases: https://healthdirect.gov.au/mouth-diseases
12. Gum diseases:Gingivitis & Periodontitis: https://medicinenet.com/gum_disease/article.htm
13. Oral skin disorders: https://healthhub.sg/a-z/diseases-and conditions/412/skin_disorders_in_the_mouth_lips_national_skin_centre; https://mayoclinic.org/diseases-conditions/canker-sore/symptoms-causes/syc-20370615; https://mayoclinic.org/diseases-conditions/oral-lichen-planus/symptoms-causes/syc-20350869;
14. Mouth & Breath as an indicator of health: https://keystonehealth.org/blog/mouth-can-tell-health/
15. Causes of Sensitive teeth: https://www.everydayhealth.com/dental-health/10-biggest-causes-of-tooth-sensitivity.aspx;
16. Burning mouth syndrome: https://mayoclinic.org/diseases-conditions/burning-mouth-syndrome/symptoms-causes/syc-20350911
17. Oral birth defects: https://www.cdc.gov/ncbddd/birthdefects/cleftlip.html
Home remedies
18. Prevent bad breath: https://www.healthline.com/health/home-remedies-for-bad-breath; https://www.everydayhealth.com/columns/white-seeber-grogan-the-remedy-chicks/ways-fight-bad-breath-naturally/
19. Caution with betel nut: https://www.healthline.com/health/betel-nut-dangers; https://www.healthline.com/health/betel-nut-dangers#cancer-risk
20. Moisten Dry mouth: https://www.mayoclinic.org/diseases-conditions/dry-mouth/expert-answers/dry-mouth/faq-20058424; https://www.colgate.com/en-us/oral-health/dry-mouth/dry-mouth-home-remedies; https://health.clevelandclinic.org/8-tips-to-relieve-your-dry-mouth/
21. Remove plaque/tartar natural way: https://www.youtube.com/watch?v=CChuqOX449w; https://www.carefreedental.com/resources/24-your-teeth/116-19-amazing-home-remedies-for-removing-plaque-naturally
22. Toothache home remedies: https://www.healthline.com/health/dental-and-oral-health/home-remedies-for-toothache; https://medicalnewstoday.com/articles/320315
23. Home remedy for gum disease: https://www.healthline.com/health/dental-and-oral-health/gingivitis-home-remedy;
24. https://healthline.com/health/busted-lip#treatment
25. Treat sensitive teeth: https://medicalnewstoday.com/articles/324731; https://dentalhealth.org/sensitive-teeth
26. Treat burn in mouth: https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/home-remedies/6-natural-ways-to-treat-a-burn-on-the-roof-of-the-mouth/photostory/72243721.cms
Preventive Care:
27. Tips: Maintain good oral health: https://www.mayoclinic.org/healthy-lifestyle/adult-health/in-depth/dental/art-20045536; https://www.betterhealth.vic.gov.au/health/ten-tips/10-tips-to-look-after-your-teeth
28. Correct brushing of teeth: https://www.dhsv.org.au/dental-advice/general-dental-advice/how-to-brush-your-teeth; https://www.colgate.com/en-in/oral-health/brushing-and-flossing/how-to-brush; https://www.dentalcare.com/en-us/patient-education/patient-materials/manual-brushing-and-flossing
29. Demo for brushing: https://w ww.verywellhealth.com/how-to-brush-your-teeth-1058985; https://www.youtube.com/watch?v=BapR9J86ZZw;
30. How not to brush: https://www.webmd.com/oral-health/features/brushing-teeth-mistakes#3
31. How to Floss video: https://youtube.com/watch?v=rm5oAAeoEnl
32. Oil pulling for oral health: https://www.healthline.com/nutrition/6-benefits-of-oil-pulling; https://www.healthline.com/nutrition/oil-pulling-coconut-oil#TOC_TITLE_HDR_2
33. Kids dental care: https://www.medicalnewstoday.com/articles/324708#limit-sugars-and-starches
34. Preventive care tips for children & women: https://www.healthline.com/health/dental-oral-health-prevention; https://medicalnewstoday.com/articles/324708
35. Best diet for oral health: https://dentistry.uic.edu/news-stories/the-best-foods-for-a-healthy-smile-and-whole-body/; https://dentistry.uic.edu/news-stories/eat-fruits-and-veggies-for-a-healthy-smile/; https://www.colgate.com/en-us/oral-health/nutrition-and-oral-health/healthy-foods-list-seven-best-foods-for-your-teeth
36. Top 3 fruits for teeth: https://friscominimolars.com/top-3-fruits-teeth/
2. కోవిడ్-19 నవీనీకరణ
2.1 సవరించిన కోవిడ్ కోంబోలు (గతంలో సవరింఛిన నవీకరణ సెప్టెంబర్-అక్టోబర్ 2020 వార్తాలేఖ లో ఇవ్వబడింది)
A. రోగ నిరోధకత మరియు చికిత్స కోసం: ప్రబల మవుతున్న కోవిడ్-19 వైరస్ యొక్క నూతన వైవిధ్యాల దృష్ట్యా మా పరిశోధనా బృందం ఇమ్యూనిటీ బూస్టర్ IB ని ఈ క్రింది విధంగా జాగ్రత్తగా సవరించింది:
108CC బాక్సు మాత్రమే ఉన్నవారికోసం: CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gall bladder tonic + CC9.4 Children’s diseases + CC11.3 Headaches + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic
SRHVP మిషను ఉన్నవారికోసం: BR4 Fear + BR9 Digestion + SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM40 Throat + SR272 Arsen Alb 30C + SR277 Bryonia 30C + SR291 Gelsemium 30C
మోతాదు: ఉదయమే నిద్ర లేవగానే OD, అనుమానాస్పద సంక్రమణ విషయంలో (స్వల్పంగా దగ్గు వంటి తేలిక పాటి లక్షణాలు ఉన్నవారి విషయంలో) TDS . పరీక్షించిన తరువాత పాజిటివ్ గా నిర్ధారణ ఐతే ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున ఆరు గంటల వరకు ఆ తరువాత 6TD ఆపై మెరుగుదలను బట్టి QDS - TDS - BD - OD గా తగ్గించు కుంటూ రావాలి.
B. కోవిడ్ తగ్గాక పునరుద్ధరణ కోసం: కోలుకునే టప్పుడు శరీరం మరియు మనసు తక్కువ శక్తిస్థాయిలు కలిగి ఉంటే:
108CC బాక్సు ఉపయోగిస్తున్న వారికోసం: CC9.4 Children’s diseases + CC11.3 Headaches + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.7 Throat chronic
SRHVP ఉపయోగిస్తున్న వారి కోసం: NM75 Debility + SM18 Digestion + SM24 Glandular + SM27 Infection + SM41 Uplift + SR291 Gelsemium 30C
మోతాదు: రోగి ప్రస్తుతం తీసుకుంటున్న IB మోతాదు కొనసాగిస్తూనే రాత్రి పడుకునే ముందు OD తీసుకోవాలి.
రోగులు వారి ఆరోగ్య అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించమని ప్రోత్సహించడం చాలా ముఖ్యం మరియు ఏదైనా అల్లోపతి చికిత్స తీసుకుంటున్నట్లైతే దానిని కొనసాగించమని చెప్పాలి గానీ ఆపమని నిరుత్సాహ పరచకూడదు.
C. టీకా యొక్క దుష్ప్రభావాల కోసం: SR318 Thuja 30C
108CC బాక్సు ఉన్నవారి కోసం: CC9.4 Children’s diseases
మోతాదు: టీకాలు వేయడానికి రెండు రోజుల ముందు నుండి మరియు టీకా వేసిన రోజు నుండి పది రోజులవరకు రాత్రిపూట OD గా కొనసాగించాలి. అలాగే IB ని ODగా కొనసాగిస్తూనే ఉండాలి.
2.2 ప్రపంచవ్యాప్తంగా IB తో కొన్ని అనుభవాలు
చికిత్స కంటే నివారణ ముఖ్యం 01001…యురుగ్వే
86 సంవత్సరాల మహిళ 2020 మార్చిలో తన దేశంలో మొదటి కోవిడ్ కేసు కనిపించిన నాటినుండి IB తీసుకోవడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె 57 ఏళ్ల కుమార్తె మరియు 23 ఏళ్ల మనవరాలితో నివసిస్తూ ఉంటారు. వీరిద్దరూ IB తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఒకసారి క్రిస్మస్ సందర్భంలో ఒక పుట్టినరోజు పార్టీకి వెళ్ళి వచ్చిన కొద్ది రోజులకు ఆ యువతిలో అధిక జ్వరము మరియు ఇతర కోవిడ్ లక్షణాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 30 న ఆమెకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే మిగతా ఇద్దరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా యువతి తల్లికి పాజిటివ్, వృద్ధురాలికి నెగిటివ్ గా రిపోర్టు వచ్చింది. వైబ్రియానిక్స్ IB తనను కాపాడుతూ వైరస్ కు దూరంగా ఉంచినందుకు ఆమె ఎంతో సంతోషము వ్యక్తం చేసారు.
IBవిషయంలో ఆసుపత్రి యంత్రాంగము సానుకూల స్పందన 00512…స్లొవేనియా
స్లోవేనియా యొక్క ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను ఆమోదించనప్పటికీ మా ప్రాక్టీషనర్ యొక్క ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహణ విభాగము IB ఇమ్యూనిటీ బూస్టర్ ను క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. ఈ రెమిడీ ప్రభావవంతంగా ఉండటమే కాకుండా రోగులు వేగంగా కోలుకునేటట్లు చేస్తుందని వారు నిర్ధారణ చేసుకున్నారు. ప్రాక్టీషనర్ 2020 అక్టోబర్ 26న ఆస్పత్రిలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నలుగురు రోగులకు వైబ్రియానిక్స్ రెమిడీలను ప్రసారం చేయడం ప్రారంభించారు. వారు కోవిడ్ న్యుమోనియా, తీవ్రమైన శ్వాస కోశ ఇబ్బంది ఇంకా 5-7 ఇతర సమస్యలతో బాధపడుతూ రెస్పిరేటర్లు, ఇంట్యుబేటర్ లపై ఉన్నారు. 28 రోజుల బ్రాడ్ కాస్టింగ్ చికిత్స తర్వాత ఒక రోగి యొక్క అన్ని పరీక్షలు(హేమటో లాజికల్, బయో కెమికల్, గ్యాస్ ఎనాలసిస్, ఇమ్యూనో కెమిస్ట్రీ, యూరిన్ కొయాగ్యూ లేషన్ మొదలగునవి) ఫలితాలు సాధారణమైనవి గుర్తించబడ్డాయి. అందుచేత అతనిని డిశ్చార్జి చేసారు. మరో 7 రోజుల్లో మిగతా ముగ్గురు రోగులకు కూడా అదే ఫలితం కలిగింది. డాక్టర్లు వైబ్రియానిక్స్ వ్యవస్థ యొక్క ప్రభావాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన హాస్పిటల్ యాజమాన్యమును ఎంతగానో ఆకట్టుకుని ”వైబ్రియనిక్స్ భవిష్యత్తు ఔషధం మాత్రమే కాదు వర్తమానానికి కూడా దివ్య ఔషధమే” అని పేర్కొన్నారు.
కోవిడ్ లక్షణాల నుండి వేగవంతమైన ఉపశమనం 03578…ఫ్రాన్స్
73 ఏళ్ల మహిళ రెండు నెలలుగా పొత్తికడుపులో మరియు ఆమె శరీరమంతా కీళ్ళు మరియు కండరాల నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆమెకు జ్వరం, అలసట మరియుతీవ్రమైన బలహీనత అనిపించ సాగింది. ఆమె పరీక్ష చేయించుకోవడానికి వెళ్లలేదు కానీ తనకు కోవిడ్ 19 ఉందని ఆమె భయపడసాగారు. 2020 ఏప్రిల్ 1న ఆమెకు IB ఇచ్చారు. రెండు రోజుల్లో ఆమె మెరుగుపడటం ప్రారంభించి, తర్వాత ఐదు రోజుల్లో ఆమె సాధారణ పనితీరు 100% గా పునరుద్ధరించబడింది తొమ్మిది నెలల తర్వాత కూడా వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు.
3. ఆసక్తికరమైన కథలు
3.1. కొత్తగా దత్తత తీసుకున్న కుక్కపిల్ల తో ప్రయాణం 01339...USA
2020 అక్టోబర్ 25న ఎనిమిది వారాల సూక్ష్మరూప పూడిల్ జాతి ఆడ కుక్కపిల్లను తీసుకురావడానికి ప్రాక్టీషనరు ఎనిమిది వందల మైళ్ళు ప్రయాణించారు. 3 పౌండ్ల(1.4కిలోలు) బరువు ఉన్న ఈ కుక్కపిల్ల తన తల్లి నుండి వేరు చేసి కొత్తవారితో వెళుతున్నందుకు ఒత్తిడి మరియు ఆందోళనకు గురియై ఏడుస్తుందేమో అని, అంతేకాకుండా దీన్ని ఒక పెట్టెలో బంధించి తిరుగు ప్రయాణంలో విమానంలో సీటుక్రింద 2గంటల సమయం ఉంచడం గురించి ప్రాక్టీషనరు చాలా ఆందోళన చెందారు. అందుచేత ఇంటి నుండి బయలుదేరే ముందు ఆమె క్రింది రెమిడీ తయారు చేసారు: CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders 3 ml డ్రాపర్ బాటిల్లో స్వేదన జలంలో రెమిడీ తయారుచేసారు. విమానాశ్రయములో విమానం కోసం దాదాపు ఐదు గంటల నిరీక్షణ సమయంలో ఈ చిన్న కుక్క పిల్ల ఏడుపు ప్రారంభమైంది. ఒక డ్రాపరు బాటిల్ లో రెమిడీ పూర్తిగా ఇచ్చిన తరువాత అది రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. తర్వాత ఐదు రాత్రులలో కుక్కపిల్లకు నిరాశ లేదా బాధ పొడచూపిన మరుక్షణం ఈ రెమిడీ ఇవ్వబడింది. రెమిడీ ఇచ్చిన ప్రతీసారి కుక్క పిల్ల రెండు మూడు నిమిషాలలో నిద్రపోతోంది. ఐదు రాత్రుల తర్వాత ఈ రెమిడీ అవసమే రాలేదు. బాధకారమైన పరిస్థితి నుండి ఒక చిన్న కుక్కపిల్లనుబయటకు తీసుకురావడానికి మందులేని, ఆందోళన చెందవలసిన అవసరం కల్పించని వైబ్రియానిక్స్ చక్కని సమాధానం అయ్యింది.
3.2 దివ్యత్వ పిలుపు కార్డు 03578…ఫ్రాన్స్
ప్రాక్టీషనర్ పొరుగువారు విదేశాల్లో సెలవుదినములు గడిపి తిరిగి వచ్చిన నాటినుండి రెండు వారాలుగా తీవ్రమైన అలసట విరోచనాలు మరియు వాంతులతో బాధపడుతున్నారు. ఈ జంట వారి 50 వ పడిలో సూక్ష్మ శక్తులను కొలవడానికి ఉపయోగించే ప్లేటోనిక్ ఘనపదార్ధాలు, మరియు లెషర్ యాంటీనా ఉపయోగించే బయో రెజోనెన్స్ ఉపయోగించి వైద్యం చేసే నిష్ణాతులైన ప్రాక్టీషనర్లు. ఐతే గతంలో మాదిరి కాకుండా ఈసారి వారు తమ జీవితంలో మొదటిసారిగా తమను తాము నయం చేసుకోవడంలో విఫలం అయ్యారు. అల్లోపతీ పరీక్షలు వారి శరీరంలో వ్యాధి లక్షణాలను నిర్ధారించ డానికి ఎటువంటి వ్యాధి కారకాలు లేవు అని తెలిపాయి. అతీంద్రియ జ్ఞానము బట్టి వీరి శరీరంలో దుష్ప్రభావం చూపే నెగిటివ్ ఎనర్జీ మరియు జీర్ణకోశ సమస్యలు ఉన్నట్లు తెలిసింది. 2020 మార్చి 7న ఈ జంట ప్రాక్టీషనరును కలవగా క్రింది రెమిడీ ఇచ్చారు:
CC4.6 Diarrhoea + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing ఈ కొంబో నోటిద్వారా తీసుకోవడానికి మరియు CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing ఇంటి చుట్టూ మరియు తమ మీద నీటిద్వారా పిచికారీ చేయడానికి సూచించడం జరిగింది. రెండవ ఔషధం యొక్క మొదటి స్ప్రే తోనే వీరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తూ భార్య తన శరీరం మొత్తం నుండి ఏదో అదృశ్య శక్తి బయటకు వెళ్ళిపోయినట్లు అనుభూతి చెంది ఆ రోజు హాయిగా నిద్రపోయింది. మరుసటిరోజు మేల్కొన్న తరువాత ఆమె తను ఏదో దుష్ట శక్తి నుండి విముక్తి పొందినట్లు భావించారు. భర్త పైకి బాగానే ఉన్నారు కానీ పూర్తిగా ఉపశమనం పొందలేదు.
మూడు రోజుల తర్వాత వారిద్దరికీ వ్యాధి తాలూకు శారీరక లక్షణాలు పూర్తిగా మాయమయ్యాయి. అయినప్పటికీ భార్య తను గతంలో స్పష్టంగా దర్శించ గలిగే ఆధ్యాత్మిక జ్యోతిని ఏదో నల్లని పట్టి వంటిది మూసివేస్తూ చూడనివ్వకుండా చేస్తోందని భావించారు. మార్చి 20నాటికి కేవలం రెండు వారాల చికిత్స తర్వాత వారిద్దరూ 100% కోలుకున్నారు మరియు భార్యకు అంతర్దృష్టి మెరుగయ్యింది. ఈ ఉత్సాహంతో వీరు ఇటీవల తను కనుగొన్న లెషర్ యాంటెనా చూపేటందుకు జూలై 14న ప్రాక్టీషనరును తమ ఇంటికి ఆహ్వానించారు. వైబ్రేషన్ రెమిడీ #2 అప్పటికే తన క్రమాంకనం చేసే పరికరంలో అద్భుతంగా 150,000 -180,000 బోవిస్* కి పెరిగింది. పోలికను బట్టి చూస్తే ఆరోగ్యకరమైన మానవుడు 12,500 బోవిస్ (100,000 బోవిస్ లు ఉత్తమ మైన అధ్యాత్మిక శక్తులకు సూచిక) శక్తులను సూచిస్తుంది. ఈ జంటకు స్వామి గురించి ఒక్కసారి మాత్రమే చెప్పబడింది కానీ ఈ రెమిడీ యొక్క శక్తి శ్రీసత్య సాయి బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తి వల్ల మాత్రమే అని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అలాగే ఈ స్ప్రే ని ఉపయోగించడం కొనసాగిస్తూనే ఉన్నారు.
*బోవిస్ అనేది మానవ జీవన శక్తిని కొలవడానికి ఉపయోగించే ఒక ఫ్రీక్వెన్సీ స్కేల్.
3.3 ఎముక విరుపుదల నొప్పి మందులేని బాధానివారణితో మటుమాయం 10228…ఇండియా
2021 ఫిబ్రవరి 2న ప్రాక్టీషనర్ యొక్క 92 ఏళ్ల తల్లి బాత్రూంలో పడిపోగా ఆమెను వెంటనే మంచము పైకి తరలించి ఆమె నుదుటి మీద విభూతి రాసి ప్రాక్టీషనరు CC10.1 Emergencies ను నీటిలో కలిపి ఇచ్చారు. అతడు తన తన బంధువైన ఆర్థోపెడిక్ సర్జన్ ను పిలిపించగా అతను జెరోడల్ నొప్పి నివారణి సూచించారు. అలాగే ఒక టెక్నీషియన్ కూడా ఇంటికి వచ్చి x రే తీసి ఎడమ తుంటి వద్ద ఎముక విరిగినట్లు తెలిపారు. పెద్ద వయసు కారణంగా ఆపరేషన్ చేయలేమని డాక్టరు సలహా ఇవ్వడము చేత ప్రాక్టీషనరు క్రింది రెమిడీ ఇచ్చారు: CC10.1 Emergencies + CC20.6 Osteoporosis + CC20.7 Fractures... ప్రతీ 30 నిమిషాలకు నీటిలో ఒక మోతాదు
ఇది అతని వృద్ధ తల్లికి నొప్పి నుండి ఎంతో ఉపశమనం ఇచ్చింది. సాధారణ సర్జను ఐన మరొక బంధువు నొప్పి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని చూపమని రోగిని అడిగినప్పుడు అతనిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆమె నొప్పి లేదు అని సమాధానం చెప్పారు. సాధారణంగా విరిగిన తొడ ఎముక చాలా బాధాకరంగా ఉంటుందని నొప్పి లేకుండా ఉండడానికి ఏ ఔషధం తీసుకుంటోందని అడిగారు. రోగి కేవలం వైబ్రో రెమిడీ మాత్రమే తీసుకోంటోందని చెప్పినప్పుడు ఇది చాలా శక్తివంతమైనదై ఉండాలి లేకపోతే నొప్పి లేకుండా ఉండడం అసాధ్యం అని చెప్పారు. ఆమె మంచానికి మాత్రమే పరిమితం అయినప్పటికీ ఆమె వైబ్రోతప్ప ఇతర మందులు తీసుకోక పోయినా నొప్పి లేకుండా ఉండగలుగు తున్నారు.
4. ‘సంక్లిష్ట భూభాగంలో మోహరించిన దళాలకు హ్యాపీనెస్ ఔషధం
దేశ సేవ నేపథ్యంలో తమ కుటుంబాల నుండి దూరంగా ఉంటూ శారీరక, మానసిక మరియు సంస్థాగత ఒత్తిడికి లోనవుతూ తమ జీవితంలో చాలా భాగం అత్యంత సంక్లిష్టమైన ప్రాంతాలలో నివసిస్తూ సేవలు అందిస్తున్న సిబ్బందికి సహాయపడడం కోసం ఒక అభ్యర్ధనను వైబ్రియానిక్స్ పరిపాలన విభాగము అందుకుంది.విధినిర్వహణ దృష్ట్యా ఇట్టి ప్రాంతాలలో ఒంటరిగా సుదీర్ఘమైన కాలం నివసిస్తూ తమ కళ్ల ముందే తమ సహచరులు తూటాలకు బలై మరణిస్తూ ఉంటే చావు తాలూకు భయం నీడలా వెన్నాడుతూ ఉంటుంది. ఫలితంగా ఆందోళన, భయము, ఒత్తిడి, మానసిక క్రుంగుబాటు, బాధ తాలూకు మానసిక రుగ్మత వీరిని కొన్ని సమయాల్లో ఆత్మహత్యకు పురికొల్పుతూ ఉంటుంది.
ధ్యాన సమయంలో స్వామి చేత మార్గనిర్దేశం చేయబడిన పరిశోధనా బృందం ఒక చక్కని రెమిడీ రూపొందించడానికి కృషి చేసింది: NM95 Rescue Plus + BR3 Depression + BR4 Fear + BR7 Stress + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM39 Tension + SM41 Uplift. దీనికి హ్యాపీనెస్ అని పేరు పెట్టడం జరిగింది.
2020 అక్టోబర్ 29న ప్రారంభించి ఈ సైనిక దళాల వారు “హ్యాపీనెస్” రెమిడీ సీసాలను భౌతికంగా స్వీకరించే వరకు 9మంది SVPలు కాంబోలను ప్రసారం/బ్రాడ్ కాస్టింగ్ చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ప్లాస్టిక్ బాటిళ్ళు, చక్కెర గోళీలు, 30మిల్లీ లీటర్ల ద్రవ రెమిడీ గల డ్రాపర్ బాటిళ్ళు సరఫరా చేయడం ప్రారంభించింది. 18 మంది వ్యక్తులకు వైబ్రియానిక్స్ గురించి పరిచయం చేయడానికి డిసెంబర్ 26న విర్ట్చువల్ ట్రైనింగ్ నిర్వహించారు. సేనా దళాలకు ఇవ్వడానికి ఈ రెమిడీలను ఎలా తయారు చేయాలి, రెమిడీ యొక్క మోతాదు, వాటిని తీసుకోవడానికి జాగ్రత్తలు, ఎలా నిల్వ చెయ్యాలో తెలుపుతూ ఒక ప్రదర్శన కూడా ఇవ్వబడింది. కేవలం 30 రోజుల వ్యవధిలో రెమిడీ తీసుకున్న 8013 మందిలో ప్రతీ ఒక్కరు 100% ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. రెండవ సారి కూడా వారి ప్రతిపాదన మేరకు రెమిడీల రవాణాకు సిద్ధంగా ఉండడమే కాక సైనికుల ఇతర సమస్యల కోసం డిమాండు కూడా పెరిగిందని తెలపడానికి ఆనందంగా ఉంది.
5. జ్ఞాపకార్థం
స్వామి ఆనంద తో పాటు(అగ్గర్వాల్ గారి డెస్క్ నుండి లో చూడండి) వారి మలి జీవితాన్ని వైబ్రియానిక్స్ సేవకే పూర్తిగా అంకితం చేసి ఇటు ప్రాక్టీషనర్లకు మరియు రోగులకు కూడా గొప్ప ప్రేరణగా నిలిచిన ఇద్దరు విలువైన ప్రాక్టీషనర్లకు వీడ్కోలు చెప్పడం జరిగింది. వీరిద్దరూ తమ అద్భుతమైన సేవా వారసత్వాన్ని మనకు విడిచిపెట్టి వెళ్లారు.
శ్రీ లక్ష్మీ కాంత్ శరద్ కొన్నూర్ 02836 (వీరి ప్రొఫైల్ సంపుటి 10 సంచిక 3 లో ఇవ్వబడింది). మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీ లక్ష్మి కాంత్ గారు 2020 డిసెంబరులో కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత 2021 జనవరిలో వారి 72వ జన్మదినోత్సవం నకు కొన్ని రోజుల ముందు కన్ను మూశారు. జిల్లాలోని ప్రాక్టీషనర్లు అందరూ వారి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందినవారే. పన్నెండు సంవత్సరాల క్రితం తన భర్తతో కలిసి శిక్షణ పొంది వైబ్రియానిక్స్ సాధన కొనసాగిస్తున్న వీరి శ్రీమతి ప్రాక్టీషనర్ 10648 కి మా హృదయ పూర్వక సంతాపం తెలియ చేస్తున్నాము.
శ్రీ సురేష్ చక్రవర్తి 10132 అస్సాం లో గౌహతి ప్రాంతానికి చెందిన శ్రీ సురేష్ చక్రవర్తి 2020 ఆగస్టు 18న 87 సంవత్సరాల వయసులో శాంతియుతంగా కన్నుమూసే వరకూ చురుకుగా సేవ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పదవీ విరమణ చేసిన తర్వాత సాయి సంస్థలో జిల్లా సమన్వయకర్తగా చాలా సంవత్సరాలు పనిచేశారు.