Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 12 సంచిక 2
March / April 2021
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఓం నమః శివాయ! రానున్న పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా అందరికీ దీవెనలు. స్వామి ఒకసారి ఇలా చెప్పేవారు. “ప్రజలు ఈ లోకానికి నిద్రించడానికి మరియు భుజించడానికి రాలేదు. వారు క్రమశిక్షణతో కూడిన ప్రక్రియల ద్వారా వారిలో ఉన్న దైవమును వ్యక్తీకరించడానికి వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరిని వ్యక్తి అని పిలుస్తారు. అనగా తమలో ఉన్న దివ్యశక్తి ప్రేరణ మేరకు తమ శక్తిని వ్యక్తం చేసేవారే వ్యక్తులు. ఈ దైవిక ప్రయోజనం కోసమే ప్రజలు శరీరము ధరించి దానిని నియంత్రించడానికి ఉపయోగకరమైన కార్యాచరణ మార్గాలకు  మళ్ళించడానికి అవసరమైన తెలివితేటలు కలిగి ఉన్నారు. నైతికత మరియు మంచి పనుల (ధర్మ నిష్ఠ  మరియు కర్మ నిష్ఠ) యొక్క స్థిరమైన సాధన ద్వారా మీరు దీనిని సాధించాలి- దైవ ప్రసంగము, శివరాత్రి, 1963.  

ఈ భాషణ మన ఉనికి యొక్క తత్వాన్ని మరియు ప్రయోజనాన్ని అందంగా గ్రహింప చేస్తోంది. మన జీవిత లక్ష్యాన్ని గ్రహించడంలో వైబ్రియానిక్స్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందో  మరియు మన తోటివారి సంక్షేమం కోసం మన తెలివితేటలు మరియు చర్యలను ఎలా మళ్లింప చేయవచ్చో తెలిపే ఒక చక్కని జ్ఞాపిక.  

 దైవ శక్తి యొక్క ఈ అందమైన స్పులింగాన్ని (స్పార్క్) తనలో మూర్తీభవింప చేసుకొని మానవత్వం యొక్క అభివృద్ధికి ఉపయోగించిన అటువంటి భగవదాశీర్వాద పూర్వక ఆత్మయే స్వామి ఆనంద. 84 సంవత్సరాల వయసులో జనవరి 24న సమాధి చెందిన స్వామీజీకి వీడ్కోలు పలకడం చాలా బాధగా ఉంది. స్వామి నారాయణి(మాతాజీ)తో పాటు సహరచయితగా స్వామి ఆనంద వైబ్రియానిక్స్ చికిత్సా వ్యవస్థకు ఆధారమైన అద్భుతమైన హ్యాండ్ బుక్కులను(కర పుస్తకాలను) రూపొందించారు. వారు ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతాజీకి ఆధారంగా నిలుస్తూ సరళమైన సమగ్రమైన సమర్థవంతమైన మరియు విప్లవాత్మక వ్యవస్థను దివ్య చికిత్సా ప్రకంపనాల రూపంలో రూపు దాల్చడానికి ఆమెకు మద్దతు ఇచ్చారు. ఇదే అనంతరం శ్రీసత్య సాయి బాబా వారి అపారమైన దయ మరియు ఆశీర్వాదాలతో సాయి వైబ్రియానిక్స్ గా పరిణామం చెందింది. 2014 లో మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సుకు స్వామీజీ రావడంతో మేమంతా ఆశీర్వదింప బడ్డామని భావించి ఎంతో ఆనందించాము. మరియు మూర్తీభవించిన సరళత మరియు వినయములకు ప్రతీకగా స్వామీజీని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము.

ఒక సంవత్సరం క్రితం సంస్థాగత నిర్మాణమును వ్యవస్థీకరించిన తరువాత (సంపుటి 11 సంచిక 2 మార్చి-ఏప్రిల్ 2020 లో ప్రకటించినట్టు) మేము ఇప్పుడు మాస నివేదికల సమన్వయకర్తలను ప్రాంతీయ సమన్వయ కర్తల స్థాయికి(RC) పెంచాము. మాస నివేదికలను  సేకరించడము వాటిని అప్లోడ్ చేయడం అనే పరిమిత స్థాయి నుండి ఇప్పుడు విస్తరించిన బాధ్యతలను వీరు కలిగి ఉన్నారు. వారు వైబ్రియానిక్స్ యొక్క అన్ని కార్యకలాపాల పూర్తి పర్యవేక్షణతో ఆయా ప్రాంతాలలో సంస్థ  యొక్క అభివృద్ధికి నాయకత్వం వహిస్తారు. వారు IASVP  విభాగపు డైరెక్టర్ మరియు క్రింది స్థాయిలో పనిచేసే ప్రాక్టీషనర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. భారతదేశం నుండి 24 ఆర్ సి లు తమ రెండవ నెలవారి సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారని తెలియజేయుటకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ సమావేశాలు ప్రాక్టీషనర్లు అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా వారినుండి డేటా సేకరణ, రిపోర్టింగ్ విధానాలను క్రమబద్దీకరించడం, కేస్ హిస్టరీలు వ్రాయడం, IASVP లో నమోదు మరియు ఇమ్యూనిటీ బూస్టర్ పంపిణీకి మార్గం సుగమం చేసాయి.   

IB విషయాన్ని చూసినట్లైతే ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న నివేదికల ప్రకారం మొత్తం మీద కోవిడ్-19 కేసులు తగ్గుతున్నప్పటికీ మహమ్మారి తగ్గుదల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వ్యాక్సిన్ కోసం డ్రైవ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా  ప్రారంభమైనప్పటికీ  కొత్త వైరస్ జాతుల ఆవిర్భావం మరియు వ్యాప్తి ఉధృతమవుతున్న దృష్ట్యా వ్యాక్సిన్ యొక్క ప్రభావాన్ని గురించి మనం ఇంకా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల IB పంపిణీ విషయంలో ఇదే ఒరవడి కొనసాగించడమే కాక టీకాలు వేసిన తర్వాత కూడా IB కొనసాగించడం అత్యవసరం. టీకా యొక్క దుష్ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై చాలామంది ప్రాక్టీషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మేము ఈ ఆందోళనకు సమాధానం ఈ వార్తాలేఖలోని “ప్రశ్న-జవాబు” విభాగంలోనూ మరియు “అదనంగా” అనే విభాగంలో కోవిడ్-19 కు నవీనీకరించబడిన కోంబోలతో  పాటు కోవిడ్ నివారణ మరియు చికిత్స రెండింటికీ పరిష్కారాన్ని అందించాము.

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో “స్ప్రెడ్ ద వర్డ్” ప్రచారం ప్రారంభమైనట్లు తెలపడానికి సంతోషముగా ఉంది. మన వైబ్రియానిక్స్ బృందం 2021 ఫిబ్రవరి 6న అనంతపూర్ లోని మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర అధ్యాపకులతో సమావేశం అయ్యింది. దీని తర్వాత ఐదు వందల మంది విద్యార్థులు హాజరైన సమావేశములో ప్రాక్టీషనర్లు12051 & 02696 పరిచయ/అవగాహన ప్రసంగం అందించారు. పాఠశాల అధికారుల ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 11 గురువారం విద్యార్థులకు ఫాలో అప్ ప్రసంగం కూడా అందించారు. ప్రేక్షకుల ఆసక్తి ఎంత గొప్పగా ఉందంటే మొదట పదిహేను ఇరవై నిమిషాల ప్రసంగానికి ప్రణాళిక వేసినప్పటికీ ఈ కార్యక్రమం గంటన్నర పాటు కొనసాగింది. ప్రాక్టీషనర్12051 ఆంధ్ర మరియు కర్ణాటక రెండు రాష్ట్రాలలోని ఇతర పాఠశాలలు మరియు వృద్ధాప్య గృహాలకు దీనిని విస్తరించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

  మునుపటి AVP వర్క్ షాప్ లను వర్చువల్ వర్క్ షాప్ లతో భర్తీ చేసే ప్రక్రియ ఇప్పుడు పూర్తయిందని తెలియజేయడానికి నాకు ఆనందంగా ఉంది. ఈ రిమోట్ లెర్నింగ్ ఎంపిక దూరం మరియు ప్రయాణాల నుండి ఉత్పన్నమయ్యే వ్యయ ప్రయాసలను తొలగించి  ప్రత్యక్ష బోధన ఫలితంగా అనేక మంది ఉపాధ్యాయులు తమ ప్రతిభను ఉపయోగించుకునే అవకాశాన్ని మాకు అందించింది. మా యు.ఎస్.ఎ మరియు కెనడా కోఆర్డినేటర్ మొదటి రెండు వర్చువల్ AVP వర్క్ షాప్ లను 2020లో ఏప్రిల్ నుండి జూలై మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు నిర్వహించారు. ఈ విజయాల ఫలితంగా ఆ తర్వాత భారతదేశంలో మొదటి తొమ్మిది వారాల AVP  వర్చువల్ వర్క్ షాప్ 2021 జనవరి 9న ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు ప్రారంభించారు, మరియు పుట్టపర్తిలో రెండు రోజుల ప్రాక్టికల్ వర్క్ షాప్ తో ఇది ముగుస్తుందని భావిస్తున్నాము. ఈ వర్క్ షాప్ లను సమగ్రంగా మరియు ఇంటర్ యాక్టివ్ గానూ చేసే ప్రక్రియ దిశగా అనేక ఆలోచనలు మరియు ప్రణాళికలు చోటుచేసుకున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హత గల మన ప్రాక్టీషనర్లు డెమోలు, రోల్ ప్లే, మరియు భాగస్వామ్యంతో రోగులు, జంతువులు, మరియు మొక్కలకు చికిత్స చేయడంలో వారి సుసంపన్నమైన అనుభవాలను ఈ వర్క్ షాప్ లలో పంచుకున్నారు.  

 గత కొన్ని నెలలుగా సాయి వైబ్రియానిక్స్ యొక్క సేవలో మరొక మైలురాయి వంటి సంఘటన నమోదు చేశాము.  2020 అక్టోబర్లో మంచుతో కూడిన కొండ ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో మోహరించి మానసిక, భౌతిక ఒత్తిడికి లోనవుతూ ఉన్న సుమారు పదివేల మంది సైనిక బృందాలకు రెమిడీలు అందించే అవకాశం లభించింది. మా పరిశోధన బృందం ఒక ప్రత్యేకమైన కోంబోను అభివృద్ధి చేసింది. ఈ కోంబో తీసుకున్న వారినుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉంది. కోంబో తీసుకున్న వారంతా  చక్కని శ్రేయస్సు,మరియు ఆనందకర స్థితిని నివేదించారు. మరిన్ని వివరాలు ఈ వార్తాలేఖలో “అదనంగా” అనే విభాగంలో #4 లో ఇవ్వబడ్డాయి.  

 నా ప్రియమైన సోదరీ సోదరులారా ఈ వ్యాఖ్యను ముగిస్తూ మీ అందరికీ ఆనందకరమైన మహాశివరాత్రిని కోరుకుంటున్నాను. మనమందరం శివుడిలో మునిగిపోయి మిగిలిన మన జీవిత శేషాన్ని తాత్కాలిక నివసమైన ఈ భూగ్రహం మీద ఆనందంగా గడపాలని ప్రార్థిస్తున్నాను. స్వామి వారి మాటల్లోనే “ఈ అరుదైన అవకాశాన్ని ఈ అద్వితీయమైన అదృష్టాన్ని అనేక జననాల యోగ్యతగా భావించి ఆత్మవికాసానికి ఉపయోగించుకొనండి.” దైవ ప్రసంగం, శివరాత్రి, 1965.  

  సాయికి ప్రేమపూర్వక సేవలో మీ

  జిత్ కె అగ్గర్వాల్

దీర్ఘకాలిక వెన్నునొప్పి 11595...India

72 ఏళ్ల మహిళ గత ఐదేళ్లుగా వెన్ను క్రింది భాగంలో నొప్పితో బాధపడుతున్నారు. ఆమె రోజువారీ నడక నిమిత్తం చురుకుగానే    ఉంటున్నారు కానీ ఎక్కడికైనా ప్రయాణించడానికి, నేలపై కూర్చోవడానికి, లేదా ఎక్కువ సేపు నిలబడడానికి బ్యాక్ సపోర్ట్ ధరించాల్సి వచ్చింది. ఆమె హైబిపి కోసం 20 సంవత్సరాలు గానూ మరియు హైపో థైరాయిడ్ కోసం ఒక సంవత్సరం నుండి అలోపతి మందులు తీసుకుంటున్నారు. ఈ రెండు ఔషధాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు కానీ వెన్ను నొప్పికి ఎటువంటి ఔషధం తీసుకోవట్లేదు. 2019 ఏప్రిల్ 18 న ప్రాక్టీషనర్ క్రింది రెమిడీ ఇచ్చారు:  

CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…6TD నీటిలో

మూడు వారాల్లోనే రోగికి నొప్పి విషయంలో 30% మెరుగుదల కనిపించింది. ఎనిమిది వారాల చివరి నాటికి ఆమె 80% మెరుగ్గా ఉన్నారు. మరో వారం తరువాత అనగా జూన్ 21న 100% ఉపశమనం కనిపించింది. ఆమె వెనుక భాగములో సపోర్టు కోసం బెల్ట్ వాడడం మానేసారు, అంతేకాక ఎక్కువ సేపు క్రింద కూర్ఛోవడానికి లేదా నిలబడటానికి సమస్య లేదు కాబట్టి రెమిడీ మోతాదు TDS గానూ,  రెండు వారాల తరువాత OD గానూ  కొనసాగించి 2020 ఆగస్టు 1న ఆపివేసారు. 2021 జనవరి 15 నాటికి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.  

సంపాదకుని వ్యాఖ్య: CC20.5 Spine అనే కోంబోను రికవరీని వేగవంతం చేయడానికి చేర్చవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ మెదడులో క్యాన్సర్ వ్యాప్తి 11595...India

61 ఏళ్ల ఆరోగ్యకరమైన మహిళకు ఒకరోజు  అకస్మాత్తుగా స్వల్పమైన మూర్చ వచ్చింది. ఒక వారంలోనే మళ్లీ ఇలా జరగడంతో  ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వరుస పరీక్షల అనంతరము ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్  4వ దశతో బాధ పడుతున్నట్లు అలాగే మెదడులో కూడా వ్యాప్తి చెందినట్లు తెలిసింది. ఈ విధంగా వ్యాధి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా షాక్ కు గరియయ్యారు. భగవాన్ సత్యసాయిబాబా వారి భక్తులు కావడంతో కుటుంబం యావత్తూ వారి మార్గదర్శకత్వం కోసం స్వామిని ప్రార్ధిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక బంధువు వారికి వైబ్రియానిక్స్ గురించి చెప్పి 300 కిలోమీటర్ల దూరంలో నివశిస్తున్న ప్రాక్టీషనరును సూచించారు. రోగి యొక్క కుమార్తె వెంటనే ప్రయాణమై 2019 జనవరి 3న ప్రాక్టీషనరును కలుసుకున్నారు. ఆమెకు క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:

#1. CC2.1 Cancers-all + CC2.3 Tumours & Growths + CC18.3 Epilepsy + CC19.3 Chest infections chronic ...6TD నీటితో
#2. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...TDS (వీరి కుటుంబ సభ్యులకు కూడా)
#3. CC15.6 Sleep disorders...OD రాత్రి నిద్రించే ముందు

అదనంగా రోగిని తన భర్తతో పాటు ప్రతీ రోజూ ధ్యానం చేయమని కూడా ప్రాక్టీషనరు సూచించారు.  అలా చేస్తున్నప్పుడు రోగికి కుడి ఊపిరి తిత్తిలో క్యాన్సర్ కణితి ఉన్న ప్రదేశంలో దివ్య  ప్రకంపనలను అనేకసార్లు అనుభవించారు.  ఒక వారంలోనే ఆమెకు  వైబ్రియానిక్స్ ద్వారా తను పూర్తిగా స్వస్థత పొందినట్లు ఆ విషయం అందరికీ చెపుతున్నట్లు కల వచ్చింది. అంతేకాక ఆమె కుటుంబ సభ్యులకు కూడా స్వామి కలలో కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తర్వాత మూడు నెలలలో #2 ను తీసుకుంటున్న కుటుంబ సభ్యులు మానసికంగా ఆరోగ్యంగా ఉన్న అనుభూతి పొందడమేకాక రోగి కూడా  ఈ చికిత్సతో మంచి సౌకర్యవంతంగా సానుకూలంగా ఉన్నట్లు భావించారు.  

 మూడు నెలల తర్వాత ఆమె తిరిగి పరీక్ష కోసం ఆస్పత్రికి వెళ్లారు.  ఆశ్చర్యకరంగా ఊపిరితిత్తులలో ఉన్న క్యాన్సర్ కణితి లో పెరుగుదల ఆగిపోయింది. నివారణను వేగవంతం చేయడానికి వైబ్రియానిక్స్ తో పాటు అలోపతి చికిత్స ప్రారంభించాలని సూచించారు. ఆమె ఆరు నెలల్లో ఆరుసార్లు ఖీమో థెరపీ నరాల ద్వారా తీసుకున్నారు. దీని నిమిత్తం ఆమె ప్రతీ ఒక్కసారి మూడు రోజులు ఆసుపత్రిలో చేరేవారు. అదనంగా ఆమెకు 25 రోజులకు పైగా రేడియేషన్ చికిత్స మెదడుకు ఇవ్వబడింది. రోగి ఆసుపత్రిలో ఉన్నాకూడా ఒక్కసారి కూడా వైబ్రియానిక్స్ రెమిడీ మిస్ కాలేదని ఆమె భర్త నిర్ధారించారు. ఐతే నొప్పిని నివారించ డానికి #1  క్రింది విధంగా మెరుగుపరచబడినది:    

#4. CC2.2 Cancer pain + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + #1…6TD

#2 యొక్క అవసరం లేదు. #3 ను అవసరం మేరకు తీసుకోవడం, పునర్బలనానికి:

#5. CC9.1 Recuperation + CC12.1 Adult tonic…6TD

 ఆమె పరిస్థితి క్రమంగా మెరుగుపడి తనకు తేలికగా ఉన్నట్లు భావించారు. 2019 ఆగస్టు 25న #5 యొక్క మోతాదు TDS కు తగ్గించబడింది మరియు ఖీమో మరియు రేడియేషన్ యొక్క దుష్ప్రభావాలు తొలగించడానికి అదనపు కాంబో ఇవ్వబడింది: #6CC10.1 Emergencies + CC17.2 Cleansing…TDS
2019 నవంబర్ నాటికి కణితి పరిమాణంలో తగ్గుదల ఉండడంతో ఆమెను నోటి ఖీమోథెరపీ మందులపై ఉంచినట్లు కుటుంబ సభ్యులు  తెలిపారు. ఖీమో యొక్క దుష్ప్రభావం ఎదుర్కోవడానికి నిర్దిష్ట నివారణ చేయవలసినదిగా ఈ ప్రాక్టీషనరు SVP ని సంప్రదించారు. దాని నిమిత్తం #6 ను క్రింది విధంగా మార్చడం జరిగింది:  

#7. SR559 Anti Chemotherapy…TDS

2020 మార్చిలో లాక్ డౌన్ కారణంగా ఆమె చికిత్సకు సుమారు రెండు నెలలు అంతరాయం కలిగింది, 2020 జూన్ 14న తిరిగి ప్రారంభించబడింది. అకస్మాత్తుగా ఆమెకు మధుమేహం ఏర్పడడంతో ఇది ఖీమో యొక్క దుష్ప్రభావాల వల్ల జరిగింది అని వైద్యులు తెలిపారు. అందుచేత  #5 ను మార్చి #4, #5 చేర్చి క్రింది రెమిడీ తయారుచేయడం జరిగింది:  

#8. CC6.3 Diabetes + #4 + #5…6TD

సెప్టెంబర్ 15న ఆమె రక్తంలో చక్కెర సాధారణ స్థాయికి చేరుకుంది. PET-CT స్కాన్ తీయగా మెదడులోని గడ్డ చాలావరకు తగ్గిపోగా ఊపిరి తిత్తులలో గడ్డ అతి స్వల్పంగా నిరపాయ కరంగా మారడం వైద్యులను ఆశ్చర్య పరిచింది. 4వ దశలో ఉన్న క్యాన్సర్ రోగి 16నెలలలో పూర్తిగా కోలుకోవడం ఎలా సంభవం అని వారు ఆశ్చర్యపోయారు. వారు నోటికి ఇచ్చే ఖీమో మందును నిర్వహణ మోతాదుగా తగ్గిస్తూ 24 నెలలు వేసుకొనేలా సూచించారు. 2020 అక్టోబర్ 16న వారి తదుపరి సందర్శనలో మునుపటి రెమిడీలు అన్నింటినీ ఈ క్రింది మిశ్రమము ద్వారా భర్తీ చేశారు.   

#9. CC12.4 Autoimmune diseases + #1 +# 5…TDS

2021 ఫిబ్రవరి నాటికి ఆమె ఆరోగ్యంగా ఉంటూ రెమిడీ కొనసాగిస్తూ ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులలో ఒకరికి స్వామి స్వప్నంలో కనబడి రోగిని పూర్తి ఆరోగ్యవంతురాలిని చేసానని ఆమె జుట్టు కూడా త్వరలో తిరిగి పెరుగుతుందని చెప్పారట.  

సంపాదకుని వ్యాఖ్య: వైబ్రియానిక్స్ మరియు అలోపతి రెండూ కలిసి ఒక కష్టమైన వ్యాధిని నయం చేసాయని చెప్పడానికి ఇది  ఒక  మంచి ఉదాహరణ.  

రోగి భర్త వ్యాఖ్య:  

“వైద్య అత్యద్భుతం: నేను మరియు నా కుటుంబ సభ్యులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా యొక్క భక్తులము. 61 సంవత్సరాల వయసు గల నా భార్య అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి కూడా అకస్మాత్తుగా మూర్చతో అపస్మారక స్థితిలో పడిపోవడంతో  ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. వైద్యులు అనేక పరీక్షలు చేసి చివరకు ఇది మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నివేదించారు. క్యాన్సర్ నాలుగో దశలో ఉండడంతో కుటుంబం మొత్తం ఆందోళనకు గురై స్వామి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాము.

క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కావడంతో చాలామంది వైద్యులు సెలవులో ఉన్నారు. ఎక్కడికి వెళ్లాలో ఎవరిని సంప్రదించాలో తెలియలేదు. ఆ క్షణంలో మా బంధువులు ఒకరినుండి మాకు ఫోన్ కాల్ వచ్చింది. సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుపుతూ బెంగళూరులో ఉన్న ఒక ప్రాక్టీషనరును కలవమని సూచించారు. ఇది ఆపత్సమయంలో అందిన స్వామి దివ్య సూచనగా భావించి ప్రాక్టీషనరు సూచించిన రీతిగా వైబ్రియానిక్స్ రెమిడీ మరియు స్వామి విభూతి తీసుకోవడం ప్రారంభించాము. మనస్సుకు విశ్రాంతి నివడానికి మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి “మేపోల్”  ధ్యానం కూడా చేయసాగాము. ధ్యానం చేసేటప్పుడు చాలాసార్లు నా భార్య తన ఊపిరి తిత్తులలో క్యాన్సర్ కణితి ఉన్నచోట దివ్య ప్రకంపన అనుభవించింది. ఒక వారం లోనే నా భార్యకు తన అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నట్లు మరియు వైబ్రియానిక్స్ గురించి అందరికీ చెబుతున్నట్లు కల వచ్చింది. ఈ విధంగా మాకు ఒక ఆశావహ ధృక్పధం ఏర్పడి రోజురోజుకీ అది పెరుగసాగింది. మా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అందరూ నా భార్య త్వరగా కోలుకోవాలని ప్రార్ధించడం ప్రారంభించారు.   

ఇంతలో అల్లోపతి మందులు రేడియోథెరపీ మరియు ఖీమోథెరపీ చికిత్సలు కూడా ప్రారంభించబడ్డాయి. ప్రాక్టీషనర్ సూచించినట్టు మేము ఇతర ఔషధాలతోపాటు వైబ్రియానిక్స్ కూడా కొనసాగిస్తున్నాము. అంతే గాక మన ప్రియమైన స్వామి తన అపారకృపతో ఎవరినైనా తెలియని వ్యక్తి ద్వారా లేదా కొరియర్ ద్వారా విభూతి ప్రసాదాన్ని పంపించ సాగారు. 25 రోజులు రేడియేషన్ మరియు 6 సార్లు తీసుకున్న ఖీమో తర్వాత ఫాలో అప్ కోసం PET CT స్కాన్ వైద్యులు తీసుకున్నారు. కణితి పరిమాణం తగ్గిందని వైద్యులు చెపుతూ నోటిద్వారా ఖీమో తీసుకోవలసిందిగా  వైద్యులు సూచించారు. మేము కొంచెం ఉపశమనం పొందాము కానీ ఔషధముల యొక్క దుష్ప్రభావాలను తట్టుకోవడం నా భార్యకు చాలా కష్టంగా ఉంది. ఈ దుష్ప్రభావాల నుండి తట్టుకోవడం కోసం ప్రాక్టీషనరు సలహా మరియు మార్గదర్శకత్వం మేరకు వైబ్రియానిక్స్ తిరిగి మాకు  ఇమ్యూనిటీ బూస్టర్ రూపంలో ఉపయోగపడింది.

లాక్డౌన్ సడలింపు తరువాత ఇటీవలే క్యాన్సర్ వైద్యుల సలహా మేరకు మరొక PET CT స్కాన్ చేయించగా వైద్యులు ఈ నివేదికను చూసినపుడు మెదడులోని కణితులు చాలావరకు నయం కావడం మరియు ఊపిరితిత్తుల కణితి దాని పరిమాణం లో తగ్గిపోయి నిరపాయ కరముగా మారడం గమనించారు. 4వ దశలో ఉన్న క్యాన్సర్ 16 నెలలలో ఎలా తగ్గిపోయిందని ఆశ్చర్య పడసాగారు.  ఇదంతా వైబ్రియానిక్స్ ఔషధం మరియు ప్రియమైన స్వామి వారి విభూతి మహిమ  మరియు నా భార్యకు స్వామి ప్రేమతో అందించిన ప్రత్యక్ష ఆశీర్వాదం ఫలితమే.”

 

మడమ ఎముక అదనపు పెరుగుదల 00123...India

40ఏళ్ల మహిళ గత ఆరు నెలలుగా తన కుడి చీలమండ మరియు పాదాలలో నొప్పి మరియు వాపు తో బాధపడుతూ ఉన్నారు. ఆమె వైద్యుడు దీనిని ఎముక అదనపు పెరుగుదలగా గుర్తించారు. ఈ పెరుగుదలను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకోవలసినదిగా సూచించారు. రోగి అందుకు సుముఖంగా లేనందువలన 2018 ఫిబ్రవరి 18న ప్రాక్టీషనరు సహాయం కోరగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:    

NM59 Pain + NM113 Inflammation + OM3 Bone irregularity + CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC13.1 Kidney & Bladder tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis…6TD రెండు వారాల్లో ఆమె 100% నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం పొందారు. తర్వాత చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అల్లోపతి మందులేమీ తీసుకోకుండా ఎముక పెరుగుదలలో 75శాతం తగ్గింపును గమనించిన వైద్యుడు ఆశ్చర్యపోయారు.  మే నెలలో సగ భాగం రోజులు గడిచే నాటికి ఎముక పెరుగుదల పూర్తిగా కనుమరుగు అయ్యింది. కాబట్టి మోతాదు TDS కు తగ్గించి ఒక నెల తర్వాత ఆపివేశారు. జనవరి 21 నాటికి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.  

సంపాదకుని వ్యాఖ్య: SRHVP లేదా 108 cc బాక్స్ ఏదో ఒకదానినుండి రెమిడీలు ఇస్తే సరిపోయేవి. CC3.1 Heart tonic మరియు CC13.1 Kidney & Bladder tonic అవసరం లేదు, ఎందుకంటే ఈ కోంబోలకు సంబంధించిన లక్షణాలు ప్రస్తావించ బడలేదు. అంతేకాక CC20.1 SMJ tonic & CC20.2 SMJ pain  అనేవి CC20.3 Arthritis లో చేర్చబడినందువలన వీటి అవసరం కూడా లేదు.

రక్తహీనత, ఋతుకాలంలో కండరాల తిమ్మిరి (క్రాంప్స్) 03560...India

17 ఏళ్ల బాలిక గత ఏడాది కాలంలో రుతుస్రావ సమయంలో తిమ్మిరి, రొమ్ములో మృదుత్వం, మరియు వెన్నులో స్వల్పంగా నొప్పితో బాధపడుతూ ఉపశమనం కోసం నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నది. ఆమె ఋతు సమయంలో శ్వాస కష్టంగా తీసుకోవడమే కాక త్వరగా అలసి పోతున్నది. గత మూడు నెలలుగా పుప్పొడి అలర్జీ కారణంగా ఆమె ముక్కులో అవరోధం ఏర్పడడమే కాక తుమ్ములు కూడా బాగా వస్తున్నాయి. ఇలా ప్రతీ సారి అలోపతి మందులు వాడుతున్నా ఒకటి లేదా రెండు రోజులు ఈ బాధ ఉంటున్నది. కొన్ని వారాల క్రితం చేయించుకున్న రక్త పరీక్షలో ఆమె Hb స్థాయి 8.1g/dl మాత్రమే ఉండడంతో ఈ రక్తహీనత కోసం ఐరన్ సప్లిమెంట్లు సూచింప బడ్డాయి. ఇవి మలబద్ధకం మరియు కడుపునొప్పికి కారణం అయ్యాయి. ఇటీవల కళాశాలలో చేరిన తర్వాత అక్కడ హాస్టల్ లోఉండవలసి రావడంతో అదనపు పనిభారం మరియు ఒత్తిడి కారణంగా వ్యాధి లక్షణాలు మరింత దిగజారాయి. ఆమెకు చిన్నప్పటి నుండి జంక్ ఫుడ్ తినాలనే కోరిక బాగా ఉండేది. 2018 సెప్టెంబర్ 25న ఆమెకు క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:   

#1. CC8.7 Menses frequent + CC12.1 Adult tonic…TDS, సాధారణ బహిష్టు తేదీకి 4 రోజుల ముందు నుండి బహిష్టు అనంతరం 5 రోజుల వరకు, వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 1లేదా 2 గంటల వరకూ అనంతరం 6TD.

#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.4 Eating disorders + CC18.5 Neuralgia + CC19.2 Respiratory allergies + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS

ప్రాక్టీషనర్ ఆమెను జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించి బదులుగా బలవర్ధకమైన ఆహారము ఉదాహరణకు తాజాపండ్లు, ఆకుకూరలు మరియు గింజలు మొదలైనవి తీసుకోవాలనీ, రోజువారీ వ్యాయామం మరియు ధ్యానం కూడా చేయమని సలహా ఇచ్చారు. ప్రాక్టీషనరు సలహా మేరకు అమ్మాయి ఆరోగ్యకరమైన జీవనశైలికి మారడానికి ప్రయత్నం ప్రారంభించింది దీనితో పాటు ఆలోపతి మందులు కూడా కొనసాగించింది.  

2018 అక్టోబర్ 28న ఆమె శక్తి మరియు ఒత్తిడి స్థాయిలో 80% మెరుగుదల మరియు ఋతు తిమ్మిరి, వెన్ను నొప్పి, శ్వాస తీసుకోకపోవడం, ముక్కులో అవరోధం, తుమ్ములు వంటి సమస్యల విషయంలో మూడింట ఒక వంతు మెరుగుదల కలిగింది. వైబ్రియానిక్స్ రెమిడీల వలన ఏర్పడిన పురోగతి పట్ల నమ్మకంతో ఆమె అన్ని అల్లోపతి మందులు ఆపాలని నిర్ణయించుకున్నది. 5 వారాల తర్వాత 2018 డిసెంబర్ 2 నాటికి ఋతు తిమ్మిరిలో 90% మెరుగుదల మినహా మిగతా అన్ని లక్షణాలు మాయమయ్యాయి. రక్తంలో Hb స్థాయి కూడా 12.5 g/dl సాధారణ స్థాయికి చేరుకుంది. 2019 జనవరిలో ఆమె పూర్తిగా కోలుకున్నారు మరియు  Hb  స్థాయి 14 g/dl కు పెరిగింది. అమ్మాయి మరొక నెల రోజుల పాటు రెమిడీ కొనసాగించి నిలిపి వేసింది. 2021 జనవరి సమీక్ష ప్రకారం వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు.  

సంపాదకుని వ్యాఖ్య : రోగి అధిక రక్త హీనతతో ఉన్నందున శీఘ్రమైన మెరుగుదల కోసం CC3.1 Heart tonic జోడిస్తే బాగుండేది.

నిద్రలేమి, మోకాలినొప్పి, జీర్ణాశయంలో పుండ్లు 03560...India

గత సంవత్సర కాలంగా 52 ఏళ్ల మహిళ రోజుకు మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపో గలుగుతున్నారు. దీని కారణంగా పగటిపూట ఆమె పనిలో అలసట మరియు నిస్తేజంగా అనిపించసాగింది. నిద్ర మాత్రలు తీసుకుంటే వాటికి బానిస అవుతానేమో అని భయంతో ఆమె వాటిని తీసుకోవడంలేదు. 2019 జనవరి 3న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు: 

#1. CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders… సాధారణ నిద్ర వేళకు గంట ముందు ప్రారంభించి నిద్ర పోయేవరకు ప్రతీ 30 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున తీసుకోవాలి.  

రెమిడీ తీసుకుకున్న రాత్రి రోగి 6 గంటలు నిద్ర పోయారు కానీ మూడు మోతాదులు తీసుకోవాల్సి వచ్చింది. రెమిడీ అంత వేగంగా పని చేస్తుందని ఆమె నమ్మలేక పోయారు. ఉత్సాహంతో ఆమె తన అనుభవాల్ని ప్రాక్టీషనరుకు తెలియజేశారు. రెండవరోజు రాత్రి ఆమె సాధారణ నిద్ర కోసం రెండు మోతాదులు, మూడవరోజు రాత్రి ఒక్క మోతాదు మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. ఆమె తన సంతోషాన్ని త్వరగా పంచుకోవాలనే ఆతృతతోనూ మరియు ఇతర ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ప్రాక్టీషనరు ఇంటికి చేరుకున్నారు. ఆమె వెన్నుముక భాగంలో L4/L5 ప్రాంతంలో నరాలు నొక్కివేయబడడం కారణంగా గత రెండు సంవత్సరాలుగా నడుము నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుడు సూచించిన విధంగా నొప్పి నివారణలు మరియు ఫిజియోథెరపీ తీసుకుంటున్నారు. కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందించింది. ఆమె ఇతర ఆరోగ్య సమస్యలు అనగా ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి మరియు అధిక వాయువు వంటి వాటికి గత సంవత్సర కాలంగా ఆంటాసిడ్ తీసుకుంటున్నారు. అలాగే రెండు నెలలుగా ముక్కులో అవరోధం కారణంగా శ్లేష్మ నివారిణి ఉపయోగించవలసిన అవసరం కలుగుతోంది. 2019 జనవరి 6 న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది. దీనిని ఆమె తన అల్లోపతి మందులతో పాటు తీసుకున్నారు:   

#2. CC4.5 Ulcers + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis + CC20.5 Spine…TDS. 

ఆమె ఒక వారం మాత్రమే #1ని కొనసాగించారు, ఆ తరువాత దాని అవసరం లేక పోవడంతో దాన్ని ఆపేశారు. ఫిబ్రవరి 2న నాలుగు వారాల తర్వాత ఆమె జీర్ణాశయంలో పుండ్లు, మరియు నాసికా అవరోధం విషయంలో 50% మెరుగుదల కనిపించింది. ఈ పురోగతికి సంతోషించి ఆమె అలోపతి మందులు ఆపి వేశారు కానీ ఫిజియో థెరపీ కొనసాగించారు. ఆ తరువాత ఆమె మూడు నెలలు ప్రాక్టీషనరుతో ఎటువంటి సంప్రదింపులు చేయలేదు కానీ #2 ను కొనసాగించారు. 2019 మే 16న ఆమె 90% మెరుగుదల, మరియు జూన్ 18 నాటికి ఆమె మోకాలు నొప్పితో సహా అన్ని లక్షణాలలో 100% మెరుగుదల ఉందని తెలిపారు. #2 వ మోతాదు    రెండు నెలల వరకు OD కి తగ్గించబడి ఆగస్టు 2019 చివరిలో ఆపి వేయబడింది. 2021 జనవరి నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు. వైబ్రియానిక్స్ ఆరోగ్యం మరియు జీవితంపై ఆమె దృక్పథం పూర్తిగా మార్చి వేసింది. ఆమె తన స్నేహితులు మరియు బంధువులు చాలామందికి ఈ వైద్యం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు.

ఉబ్బసం 03591...Indonesia

40 ఏళ్ల మహిళ 11 సంవత్సరాలుగా ప్రతీరోజు తీవ్రమైన శ్వాశ అవరోధం, పొడి దగ్గుతో బాధపడుతున్నారు. ఆమె ఇంటి పనులు సులువుగా చేసుకోలేరు, బహిరంగ స్థలాలలో నడకను ఆస్వాదించనూలేరు. ఆమె ఇంటి వద్ద మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఆమె లక్షణాలను మరింత తీవ్రతరం చేసింది. వైద్యుడు ఆమె పరిస్థితిని ఉబ్బసం వ్యాధిగా నిర్ధారించి ఇన్హేలర్ ను దగ్గుమందును సూచించారు. ఇది ఆమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చినప్పటికీ ఇన్ని సంవత్సరాలు రోజుకు నాలుగు సార్లు ఉపయోగిస్తూనే ఉన్నారు. ఆమె గత రెండు సంవత్సరాలుగా చేతి వణుకుడు ఎదుర్కొంటూ ఉండడంతో డాక్టర్ దీనికి కారణం ఇన్హేలర్ ను ఎక్కువ సంవత్సరాలుగా ఉపయోగించడం వలన కావచ్చునని తెలిపారు. 2020 మార్చి 22న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:   

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…6TD

మూడు రోజుల్లో దగ్గు 75% తగ్గింది, ఈ సమయంలో ఆమెకు ఒక్కసారి కూడా దగ్గు సిరప్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మరో నాలుగు రోజులలలో దగ్గు పూర్తిగా తగ్గిపోయింది, మరియు శ్వాసతీసుకోవడంలో 50% మెరుగుదల ఉంది కాబట్టి ఆమె ఇన్హేలర్ ను రోజుకు రెండుసార్లు మాత్రమే ఉపయోగించసాగారు. అందువలన మోతాదు TDS కు తగ్గించబడింది. ఏప్రిల్ 20 నాటికి ఆమెకు శ్వాశ అవరోధంలో 90% ఉపశమనం కలిగింది.  వైబ్రియానిక్స్ రెమిడీ బాగా పనిచేస్తోందని నమ్మకంతో ఇన్హేలర్ తీసుకోవడం ఆపివేశారు. మే 20న అనగా ఒక నెల తర్వాత శ్వాశ అవరోధం, అలాగే చేతి వణుకుడు పూర్తిగా తగ్గిపోయి తన ఇంటి పనులను హాయిగా చేసుకోగలగడం, మెట్లు ఎక్కడం, బయటకు వెళ్ళి నడవడం కూడా చేయగలుగుతున్నారు. మోతాదు BD  కి తగ్గించబడింది అలా అక్టోబర్ వరకు తరువాత OD గా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. 2021 జనవరి నాటికి లక్షణాలు పునరావృతం కాలేదు కానీ నిర్వహణ మోతాదుగా OD లో కొనసాగడానికి ఆమె ఇష్టపడుతున్నారు.

దీర్ఘకాలిక బ్రాంఖైటిస్ 11626...India

36 ఏళ్ల వ్యక్తి ప్రాక్టీషనర్ సోదరుడు పొడిదగ్గు, చాతిలో వత్తిడి, మరియు చిన్ననాటి నుండి తేలికపాటి ఆయాసంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నారు. సాధారణంగా వాతావరణం యొక్క మార్పులు, లేదా ధూళికి గురికావడం  కారణంగా ప్రతీ రెండు మూడు నెలలకు ఒకసారి ఇలా ఏర్పడుతున్నది. అల్లోపతీ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఇబ్బంది ఏర్పడిన ప్రతీసారీ సుమారు వారం రోజులు లక్షణాలు కొనసాగుతున్నాయి. వైద్యులు దీనిని శ్వాస నాళముల వాపు /బ్రాంఖైటీస్ గా గుర్తించి  ఎనిమిది సంవత్సరాల క్రితం అతనికి ఆస్థాలిన్ ఇన్హేలర్ సూచించగా అది అతనికి వెంటనే ఉపశమనం ఇవ్వసాగింది. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు అతను అల్లోపతీ ఇంజక్షన్ కూడా తీసుకుంటూ ఉండేవాడు. అతను వీటిమీద పూర్తిగా ఆధారపడడంతో వాటి దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందసాగారు. అతని సోదరి ప్రాక్టీషనరు అయిన వెంటనే రోగి ఆమె సహాయం కోరగా క్రింది రెమిడీ ఆమెకు పోస్ట్ చేశారు:

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic…6TD 

2020 మార్చి 7న రెమిడీ తీసుకోవడం ప్రారంభించినప్పుడు అతను పొడి దగ్గు మరియు తేలికపాటి ఆయాసంతో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. గత మూడు రోజులుగా వ్యాధి లక్షణాలు అధ్వానంగా ఉన్నప్పటికీ అతను కేవలం వైబ్రియానిక్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపినందున అల్లోపతీ ఔషధం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల తర్వాత అతను తన వ్యాధి లక్షణాలు అన్నింటి నుండి 30% ఉపశమనం పొందాడు మరియు మరో రెండు రోజుల్లో 50% వరకు ఉపశమనం కలిగి దగ్గుతున్నప్పుడు తెల్లటి కఫం బయటకు రావడం ప్రారంభ మయ్యింది. మార్చి 26న అనగా రెండు వారాల తర్వాత అతను పూర్తిగా కోరుకున్నట్లు భావించారు, కనుక మోతాదు  TDS కు తగ్గించబడింది. తన జీవితంలో మొదటి సారి అల్లోపతీ మందులు అవసరం లేకుండా ఉండడం పట్ల ఆశ్చర్యచకితుడయ్యారు. మోతాదు క్రమంగా OD కి మరియు అక్టోబర్ 25 నాటికి OW నిర్వహణ మోతాదుకు తగ్గించబడింది. 2021 జనవరి నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు. 2020 జూలై నుండి అతను కోవిడ్ నివారణ కోసం ఇమ్యూనిటీ బూస్టర్ IB, ని OD గా కూడా తీసుకొనసాగారు.

వృద్ధ శునకానికి కండరాల బలహీనత 03558...France

14 ఏళ్ల ఆడ గోల్డెన్ రిట్రీవర్ అనే జాతి కుక్కకు గత పది నెలలుగా ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అది ఆకలిని కోల్పోయింది, వేడిగా ఉన్నప్పటికీ ఏవైనా ద్రవపదార్ధాలు బలవంతంగా తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె గంటల కొద్దీ ఒకే స్థానంలో  పాక్షిక కోమా వంటి స్థితిలో పడుకొని ఉంటూ కండరాలు పట్టు కోల్పోతున్నది. పశు వైద్యులు ఈ వ్యాధిని కండరాల బలహీనతగా నిర్ధారణ చేసారు.  తీవ్రమైన అలసటతో పటుత్వం కోల్పోయి దాని వెనుక కాళ్ళు దాని బరువును మోయలేక పోతున్నాయి. గోల్డెన్ రిట్రీవర్ యొక్క ఆయుర్దాయం పది పన్నెండు సంవత్సరాలే కనుక దానిని పరిగణనలోనికి తీసుకుని వైద్యుడు ఏ ఔషధాన్ని సూచించలేదు కానీ అనాయాస మరణం కోసం మందును సూచించారు. 2019 ఆగస్టు 5న యజమాని ప్రాక్టీషనరును సంప్రదించి క్రింది రెమిడీ పొందారు:

#1. CC1.1 Animal tonic + CC3.1 Heart tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC18.4 Paralysis + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…TDS రెమిడీని కుక్క నీరు త్రాగే పళ్ళెంలో నీటిలో కలపాలి.  

ఒక వారం తర్వాత యజమాని కుక్క స్థితిలో గణనీయమైన మార్పును ఆనందంగా నివేదించడం జరిగింది. ఇకపై దానిని  తినడానికి లేదా త్రాగడానికి బలవంతం చేయవలసిన అవసరం లేదు. బయటకు విహారానికి తీసుకెళ్లినప్పుడు అది గడ్డిమీద కాళ్ళు సాగదీస్తూ పొరులుతున్నది. ఆ తర్వాత ఎనిమిది నెలల్లో మార్పు నెమ్మదిగా ఉంది కానీ స్థిరమైన మెరుగుదల ఉంది కాబట్టి యజమాని #1ని కొనసాగించారు. 2020 మార్చిలో కుక్క యొక్క ఆహారములో మార్పు చేసి పేకేజ్ చేసిన క్రాకెట్స్ మరియు పాటీస్ బదులు తాజా కూరగాయలు మరియు మాంసంతో భర్తీ చేయబడింది. ఇది కుక్క త్వరగా కోలుకొనడానికి సహాయ పడింది. ఏప్రిల్ 22న యజమాని చెప్పిన మాటలు బట్టి కుక్క అడుగులు చిన్నగా వేస్తున్నప్పటికీ వారితో పాటు వాకింగ్ చేయడము కూడా  ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ సమయంలో #1 క్రింది విధంగా మెరుగుపరచబడినది.   

#2. CC3.7 Circulation + CC20.5 Spine + #1…TDS

తర్వాత కొన్ని నెలలపాటు అభివృద్ధి కొనసాగింది. 2021 జనవరి 8న యజమాని తన కుక్కలో చైతన్యము, మరియు మునుపటి  ధైర్యము చేకూరి సాధారణ స్థితికి చేరుకున్నట్లు నివేదించారు. కనుక మోతాదు మూడు వారాల పాటు BD కి అనంతరం OD నిర్వహణ మోతాదుగా తగ్గించారు. జనవరి 2021 నాటికి 16 సంవత్సరాలు వచ్చినప్పటికీ అది ఆరోగ్యంగానే తన జీవనం సాగిస్తోంది.  

కుక్క యజమాని వ్యాఖ్య:

చికిత్స ప్రారంభించిన వారం తర్వాత యజమాని ఇలా రాశారు. “ఇది పునరుద్ధానం! దీనికి మరలా జీవనం చేకూరింది. ఆకలి పెరిగి  సాధారణంగానే అన్న పానీయాలు తీసుకుంటోంది. గడ్డి మీద సాగదీయడం మరియు చుట్టుకోవడం ద్వారా తన ఆనందాన్ని తిరిగి పొందుతోంది. అందుకోసం చేసిన చికిత్స దానికే కాదు మాకు కూడా  శ్రేయస్కరమైనది.  

కోవిడ్-19 03566...USA

ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 ఏళ్ళ మహిళా వైద్య విద్యార్థికి 2020 డిసెంబర్ 19 నుండి వళ్ళంతా నొప్పులు, 101F (38.3C)జ్వరం, విపరీతమైన అలసట మరియు వాసన రుచి ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 22న కోవిడ్  పాజిటివ్గా నిర్ధారించబడింది. ఆమె తనకు తాను కుటుంబ సభ్యులనుండి వేరుచేసుకొని ప్రతీ ఆరు గంటలకు జ్వరం కోసం టైలినాల్  తీసుకోవడం ప్రారంభించింది. లక్షణాలు తీవ్రమవుతూ డిసెంబర్ 24 నాటికి ఆమెకు దగ్గు, గొంతు మంట, ముక్కు కారడం, ఛాతీలో రద్దీ, మరియు టైలినాల్ తీసుకోని రోజు జ్వరం 103F (39.4C) కు పెరుగుతూ  ఉండేది. ఆమె తల్లి ఆందోళనతో ప్రాక్టీషనరును సంప్రదించగా డిసెంబర్ 25 న IB ని ఇంటి వద్దకు అందించారు.  

CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…6TD అలాగే ఇతర కుటుంబ సభ్యులకు ముందస్తు నివారణ నిమిత్తం ...TDS

మరునాటికి రోగి జ్వరం 100F(37C) కి తగ్గడంతో టైలినాల్ తీసుకోవడం మాని వేసారు. ఆమె వ్యాధిలక్షణాలలో 40% మెరుగుదల ఉంది కానీ ఆకలి, రుచి, మరియు వాసన విషయంలో ఏమీ మార్పులేదు.  మూడు రోజుల తర్వాత డిసెంబర్ 29న శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రాగా రుచి మరియు వాసనలో 20% మెరుగుదల ఆకలి విషయంలో 30% మరియు ఇతర లక్షణాల విషయంలో 80% మెరుగుదల కలిగింది. ఇప్పుడు ఆమె పండ్ల రసాల రుచి ఆస్వాదించ గలుగుతున్నారు. మరో రెండురోజులు తరువాత రుచి మరియు వాసన విషయంలో 50% మెరుగుదల మినహా అన్ని లక్షణాల నుండి పూర్తిగా కోలుకోవడం జరిగింది. తను ఇప్పుడు అన్నీ పదార్ధాలను తినగలుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఐసోలేషన్ లోనే కొనసాగుతున్నారు. 2021 జనవరి 1నాటికి మోతాదు TDS కు జనవరి 6 నాటికి OD కి తగ్గించారు. జనవరి 10న రుచి మరియు వాసన 80% అభివృద్ధి అయ్యాయి. జనవరి 11న ఐసోలేషన్ నుండి బయటకు వచ్చారు మరియు ఆమె మూడు నెలల నుండి రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నట్లు భావించి రెమిడీ తీసుకోవడం మానివేశారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తగ్గించిన మోతాదు OD గా కొనసాగించారు. 2021  ఫిబ్రవరి 17నాటికి ఆమె బాగానే ఉన్నారు.  

సంపాదకుని వ్యాఖ్య: బహుళ కోవిడ్-19 ఉత్పరివర్తనాల ఆవిర్భావం కారణంగా ముందస్తు మోతాదును టీకాలు వేసిన తరువాత అలాగే రోగి కోవిడ్  నుండి పూర్తిగా కోలుకున్న తరువాత కూడా కొనసాగించాలని సిఫార్సు చేయబడినది.

Respiratory allergy, loss of hearing & smell 11624...India

2020 ఏప్రిల్ 22న 56 ఏళ్ల మహిళ గత ఏడు సంవత్సరాలుగా శ్వాసకోశ ఎలర్జీతో బాధపడుతూ గొంతులో చికాకు, కఫంతో కూడిన  దగ్గు, మరియు తలనొప్పి వంటి కారణాలతో ప్రాక్టీషనరును సంప్రదించారు. వాతావరణం మారినప్పుడు సంవత్సరానికి 6-7 సార్లు (ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు మరియు శీతాకాలంలో) ఆమె ఏదైనా చల్లని పదార్ధము తిన్నప్పుడు లేదా తాగినప్పుడు ఇలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ప్రతీసారి అల్లోపతీ మందులు తీసుకోకుండా ఐదు రోజుల పాటు ఉంటుంది. వ్యాధి లక్షణాలు మరీ భరింపరానివిగా ఉంటే మాత్రమే అల్లోపతీ మందులు తీసుకుంటారు. వ్యాధి కొనసాగుతున్న ఈ కాలంలో ఆమె వాసన గ్రహించే శక్తి కోల్పోయారు. ఒక నెల క్రితం నుండి ఆమెకు ముక్కు కారడం మరియుఎడమ చెవిలో వినికిడి శక్తి కూడా కోల్పోయి చెవిలో నీరు చిక్కుకున్న అనుభూతి పొందసాగారు. పాఠశాల ఉపాధ్యాయురాలు కావడంతో ఆమె వినికిడి లోపం గురించి ఆందోళన చెంది ఒక ENT వైద్యుడిని సంప్రదించారు. ఒక వారం రోజులు యాంటీ బయోటిక్స్ తీసుకున్న తర్వాత ఆమెకు ముక్కు కారడం తగ్గిపోయింది కానీ వినబడడం విషయంలో ఎటువంటి మార్పు లేదు.  ఈ సమస్యలతోపాటు ఆమెకు గృహ సంబంధమైన వత్తిడితో  సరిగా నిద్ర పట్టడం లేదని తెలిపారు. ప్రాక్టీషనరు ఈ క్రింది రెమిడిఇచ్చారు:   

#1. CC5.1 Ear infections + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…TDS 

#2. CC15.6 Sleep disorders…OD, నిద్రించడానికి అరగంట ముందు  

మేనెల 8న ఆమె వినికిడిలో 40% మెరుగుదల మరియు చెవిలో నీరు చేరినట్లు ఉండే ఇబ్బంది నుండి 100% ఉపశమనం కలిగింది. మరో మూడు వారాల తర్వాత ఆమె వినికిడి శక్తి పూర్తిగా పొందడమే కాక ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు మరియు గదిలో ఉంచిన అగర బత్తి వాసన, ఆహార పదార్ధాల రుచిని కూడా ఆస్వాదించగలుగు తున్నారు. జూన్ 14 నాటికి ఆమెవాసన గ్రహించే శక్తి  పూర్తిగా పొందినట్లు గమనించారు. ఈ కాలంలో వాతావరణం యొక్క మార్పుచేతను  మరియు చల్లని ఆహారం తీసుకున్నప్పటికీ అలర్జీ లక్షణాలు ఏవీ ప్రేరేపించబడలేదు. #1 యొక్క మోతాదు BD కి మరో రెండు వారాల తరువాత OD కి తగ్గించబడింది. 2020 జులై చివరి నాటికి ఆమె #1 & #2 తీసుకోవడం ఆపివేశారు. 2020 ఫిబ్రవరి నాటికి వ్యాధి లక్షణాల స్థితిలో ఎటువంటి పునరావృతం లేదు. అంతేకాక శీతాకాలం మరియు వర్షాకాలంలో కూడా అనారోగ్యానికి గురి అవుతాననే భయం కూడా లేకుండా ఆమె బయటి వాతావరణాన్ని ఆస్వాదించ గలుగుతున్నారు.    

సంపాదకుని వ్యాఖ్య: నిర్వహణ మోతాదు OW గా ఇచ్చి ఉంటే బాగుండేది.

ప్రాక్టీషనర్ల వివరాలు 11595...India

ప్రాక్టీషనర్ 11595…ఇండియా ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీర్ అయిన ఈమె 8 ఏళ్లుగా తన కుటుంబానికి సంబంధించిన సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజరుగా పని చేస్తూ ఉన్నారు. సాయి భక్తుల కుటుంబంలో జన్మించడం తన భాగ్యంగా భావిస్తున్నారు. ఆరు సంవత్సరాల వయస్సు నుండి బాలవికాస్ తరగతులకు(సాయి అధ్యాత్మిక విద్య) హాజరు కావడమే కాక సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. తర్వాత వీటిని నిర్వహించడానికి ఆమె తల్లికి సహాయ పడుతూ ఉండేవారు. ఇవన్నీ తన ఆత్మవిశ్వాసం మరియు బహిరంగంగా మాట్లాడే నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతో సహాయం చేసాయని ఆమె భావిస్తున్నారు.

తన చిన్న కుమార్తె తరుచుగా వచ్చే అలెర్జీలు, అనారోగ్యాలనుండి ప్రకృతి వైద్యంతో పూర్తిగా కోలుకున్న తర్వాత తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచే సహజ మార్గాలపై ఈ ప్రాక్టీషనర్ ఆసక్తి చూపడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్య సమాచారాన్ని అన్వేషించడం మరియు ఇంటి నివారణల విషయంలో అధ్యయనం మరియు ప్రయోగాలు చేయడం మరియు ఈ జ్ఞానాన్ని కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయసాగారు. 2017 సెప్టెంబర్ లో సాయి వైబ్రియానిక్స్ గురించి ఆమె తన ధ్యానమండలి సభ్యుల ద్వారా తెలుసుకొని ఈ వైద్య వ్యవస్థకు ఆకర్షితురాలై తక్షణమే కనెక్ట్ అవడమే కాక స్వామియే తనను ఈ దిశగా నడిపిస్తున్నారని గ్రహించారు. పర్యవసానంగా 2018 ఫిబ్రవరిలో AVP మరియు 2018 అక్టోబర్ లో VP అయ్యారు.  

వీరు తన ఇంటి నుండే వైబ్రియానిక్స్ సేవ కొనసాగిస్తూ ఇప్పటి వరకు 300 మందికి పైగా రోగులకు చికిత్స చేశారు. ప్రారంభంలో దగ్గరి కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అత్యుత్తమ ఫలితాలను చూశారు. ఆమె భర్త రెండు చేతుల చిటికెన వ్రేళ్ళ జాయింట్ల వద్ద తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. బహుశా బ్యాడ్మింటన్ గాయం కారణంగా కీళ్ల మధ్య అంతరము ఉన్నట్లు X రే రిపోర్టు వెల్లడించింది. ఈ సమస్యకు శాశ్వత నివారణ లేదని నొప్పి నివారణ మందులతో మాత్రమే బాధను తగ్గించుకోవడమే పరిష్కారమని వైద్యుడు తెలిపారు.  ఇది ఆర్థరైటిస్గా అనిపించడంతో ఇతర కీళ్లకు వ్యాపించే అవకాశం కూడా ఉంది. 2018న ఫిబ్రవరి 22న అతనికి క్రింద రెమిడి ఇవ్వబడింది:  

  CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.7 Fractures...6TD. అభివృద్ధి క్రమంగా కనిపించి 2019 మార్చి నాటికి అతను పూర్తిగా నొప్పి లేకుండా ఉన్నారు. కీళ్లపై పక్షిఈక తో సమానమైన భారము కూడా విపరీతమైన నొప్పిని కలిగింప చేయునట్టి బాధనుండి ఉపశమనం కలగడం ఒక గొప్ప అద్భుతం  అని భర్త చెప్పారు. అతను ఎన్నో సంవత్సరాలు అనుభవించిన బాధ వైబ్రియానిక్స్ తో మాత్రమే పూర్తిగా కనుమరుగయ్యిందని తెలిపారు. ప్రాక్టీషనరు యొక్క 81 ఏళ్ల మామ గారు కూడా అనేక సంవత్సరాలుగా బాధించే బాధాకరమైన తిమ్మిరి నుండి పూర్తిగా ఉపశమనం పొందారు. అతను కింద పడినప్పుడు 8వ, 9వ వ పక్కటెముకలు విరిగినప్పుడు వైబ్రియానిక్స్ రెమిడీ CC10.1 Emergencies + CC20.5 Spine + CC20.7 Fractures ని అతను హాస్పిటల్ లో చేరిన 5 నిమిషాల తరువాత ఇవ్వడం ప్రారంభించారు. ఆసుపత్రిలో పక్కటెముకల పై సున్నపు పట్టీ వేయడం సాధ్యం కానందున అతనికి కేవలం నొప్పి నివారణ మందులు మాత్రమే ఇచ్చారు. వైద్యులు అతనికి 3 వారాలపాటు భరింపరాని నొప్పి ఉంటుందని తెలిపారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అతను మూడవ రోజే నడవడం ప్రారంభించారు. మూడు వారాల తర్వాత అతని పురోగతి చూసి వైద్యులు  ఆశ్చర్యపోయారు. ఆరు వారాల తరువాత అతను సాధారణంగా తీసుకునే X రే రిపోర్టు రోగికి పూర్తిగా నయమైనట్లు చూపించింది.             ఈ ప్రాక్టీషనరు కొన్ని ప్రత్యేకమైన కోంబోల కలయిక ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందారు. అలసట నుండి వేగంగా ఉపశమనం కోసం CC9.1 Recuperation + CC12.1 Adult tonic. ఉపయోగిస్తారు. ఆమె ప్రారంభంలో తన ధ్యాన గురువు కోసము దీనిని తయారు చేశారు. దీనిని తీసుకున్న వెంటనే అతను తన ఎడమ చేతితో ఏనుగును కూడా ఎత్తగలనని భావించారు. అన్ని రకాల తలనొప్పులకు CC4.10 Indigestion + CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic నే రెమిడీ చాలా ప్రభావంతంగా ఉందని నిరూపించబడింది. గొంతులో దీర్ఘకాలిక బొంగురు కోసం కోసం CC18.5 Neuralgia + CC19.7 Throat chronic  చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేరువేరు కోంబోలు ప్రయత్నించి కూడా ఆమె పెద్దగా విజయం సాధించని సందర్భంలో కేవలం CC10.1 Emergencies ఒక్కటి మాత్రమే ఆశించిన ఫలితాన్ని అందించింది. కనుక కొరియర్ లో రెమిడీ పంపించే సందర్భంలో ఆమె CC10.1 Emergencies ను ప్రత్యేక సీసాలో పంపిస్తూ ఉంటారు. దీనివలన అదనపు ప్రయోజనం ఏమిటంటే ఇతర కుటుంబ సభ్యులు అవసరమైతే దానిని ఉపయోగించవచ్చు.   

  రోగితో సంప్రదింపులు జరిపే టప్పుడు స్వామితో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం అని ప్రాక్టీషనర్ భావిస్తున్నారు. అందువలన రోగితో సరైన సంభాషణ, సరైన రెమిడీలు ఎంచుకోవడం, మరియు స్వామి నుండి స్వచ్ఛమైన ప్రేమ ప్రాక్టీషనర్ ద్వారా రోగికి ప్రవహిస్తుందని వీరి భావన. అనేక సందర్భాలలో రోగులు ప్రాక్టీషనరుతో మాట్లాడిన తర్వాత వారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందారు మరియు కొన్ని సందర్భాల్లో వారు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.  కొత్తగా AVP ఐన ప్రారంభంలో ఆమె కష్టమైన కేసుల విషయంలో రోగుల బాధలకు తీవ్రంగా ప్రతిస్పందించేవారు. కానీ ఇప్పుడు ఆమె వాటిని స్వామికి అప్పగించడం నేర్చుకున్నారు. రోగి యొక్క చరిత్రను రికార్డు చేసే టప్పుడు ఆమె వివరాల పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. ఇది కేసును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి   తద్వారా ఫాలో అప్ చేయడం సులభతరం అవుతుంది. కొత్త రోగుల విషయంలో కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండానూ అనంతరం అప్పుడప్పుడూ వారితో మాట్లాడుతూ ఉంటారు. అందువలన రోగులు క్రమానుగతంగా ప్రాక్టీషనరు తమను బాగా చూసుకుంటున్నారని వారికి సంతోషాన్ని కలిగించడమే కాకుండా వారి పురోగతిని పర్యవేక్షించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.     

 ఈ ప్రాక్టీషనర్ తన రోగులకు ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించడానికి సమయాన్ని వెచ్చిస్తారు. చాలా మంది రోగులు తగినంత నీరు తాగడం లేదని గమనించారు. ఇది వారి సమస్యను పరిష్కరించడంలో చాలా జప్యాన్ని కలిగిస్తుందని వీరి భావన.  అదేవిధంగా తాజా పండ్లు, కూరగాయలు మరియు రోజువారీ వ్యాయామంతో పాటు కొన్ని నిమిషాలు ధ్యానం రోగి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ప్రాక్టీషనర్లు కూడా రోగులకు ఆదర్శవంతమైన ఉదాహరణగా నిలవడానికి తమ శారీరక, మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఆమె అభిప్రాయం.  ఇటీవలే ఆమె ఇద్దరు AVP ల యొక్క మార్గదర్శకత్వాన్ని/మెంటరింగ్ ను చేపట్టారు. ఇది తనను అప్రమత్తంగా ఉండటానికి ప్రాక్టీషనరుగా తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని ఆమె భావిస్తున్నారు.  

  వైబ్రియానిక్స్ ద్వారా ఆమెకు లభిస్తున్న గొప్ప ప్రయోజనం ఏమిటంటే ఆమె తన సేవ చేస్తున్న ప్రతీ సందర్భంలో స్వామితో కనెక్ట్ అయి ఉంటున్నారు. రోజు గాయత్రీ జపించేటప్పుడు ఆమె తన 108cc బాక్స్ ను తన వద్దనే ఉంచుకుంటారు, తద్వారా  శక్తివంతమైన ప్రకంపనలు రెమిడీలకు ఆపాదింప బడతాయని వీరి భావన. వైబ్రియానిక్స్ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి స్వామి తనకు అందించిన శక్తివంతమైన సాధనం అని ఆమె భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులు   అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవడం, రెమిడీలను ఇవ్వడం లోనే కాకుండా రోగులకు జీవన శైలిలో మార్పులను సూచించడం, మరియు స్వచ్ఛమైన ప్రేమతో రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వైబ్రియానిక్స్ భవిష్యత్తు ఔషధం ఔతుందని వీరు ప్రగాఢంగా విశ్వశిస్తున్నారు. 

  భాగస్వామ్యం వహించిన కేసులు

ప్రాక్టీషనర్ల వివరాలు 00123...India

ప్రాక్టీషనర్ 00123…ఇండియా కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన వీరు ఒక విశ్రాంత వ్యాపారవేత్త. వివాహం అయిన వెంటనే అతని అత్తగారు కన్నుమూశారు. భార్యతో కలిసి 1969 సెప్టెంబరులో తన స్వస్థలమైన హైదరాబాదుకు వెళ్లారు. ఆ సమయంలో స్వామి తమ  నివాసం ఐన శివంను సందర్శించడం జరిగింది. వీరి భార్య స్వామి దర్శనం కోసం వెళ్ళగా స్వామి ఆమెను ఇంటర్వ్యూ కోసం పిలిచిన భాగ్యం లభించింది. అక్కడ స్వామి తాము యువకులుగా ఉన్నప్పటి ఫోటోను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ జంట ఆ ఫోటో ను ఫ్రేమ్ కట్టించి తమ దేవుడి గదిలో ఇతర ఆరాధ్య దైవాల దేవతల చిత్రాల మధ్య ఉంచి పూజించడం ప్రారంభించారు. 21 సంవత్సరాల తర్వాత 1990 లో ఈ చిత్రం నుండి విభూతి రావడం ప్రారంభమై ఆరు నెలలు ఇదే విధంగా కొనసాగింది. ఈ అద్భుతం ఈ దంపతులను స్థానిక సాయి సేవా కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రేరేపించింది. స్వామి ఇప్పుడు వారిని తమ ఫోల్డు లోనికి  తీసుకున్నారని ఒక భక్తుడు వారికి చెప్పినప్పుడు వారు ప్రతీ సంవత్సరం పుట్టపర్తికి సేవ కోసం వెళ్ళడం ప్రారంభించారు .     

  1994లో ఒక కుటుంబ స్నేహితుడి ద్వారా వీరు అప్పటిలో శైశవ దశలో ఉన్న ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఔషధ రహిత వైద్య వ్యవస్థ వైబ్రియానిక్స్ ఉందని తెలుసుకున్నారు. అతను వెంటనే దీనిని నేర్చుకునే అవకాశాన్ని అన్వేషించడం ప్రారంభించారు. ఢిల్లీలో శిక్షణ సమావేశాలకు హాజరై ప్రాక్టీషనరుగా సాధించి SRHVP మిషను పొందారు. ప్రారంభంలో అతని కుటుంబం స్నేహితులు మరియు సాయి భక్తులకు చికిత్స చేయడం ప్రారంభించారు కానీ వ్యాపార వత్తిడి కారణంగా అతను తన వైబ్రియానిక్స్ సేవను ఇతరులకు విస్తరించ లేకపోయారు. 2010లో అతను తన పెద్ద కుమారుడు నడుపుతున్న 400 మందికి పైగా పనివాళ్లు పనిచేస్తున్న రెండు స్టీల్ ఫ్యాక్టరీల నిర్వహణకు సహాయం చేయడానికి హైదరాబాద్ కు వెళ్ళారు. అతను ఈ ఉద్యోగులతో తన వైబ్రియానిక్స్ సేవ కొనసాగించారు. క్రమంగా ఈ విషయం ఇతరులకు కూడా తెలిసి రోగుల ప్రవాహాన్ని పొందడం ప్రారంభం అయింది. కానీ SRHVP మిషనుతో పెద్ద సంఖ్యలో రోగులకు చికిత్స చేయడానికి చాలా సమయం తీసుకుంటోంది. తరుచుగా పుట్టపర్తి సందర్శిస్తున్న సందర్భంలో 2011లో పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు వీరు 108CC బాక్స్ గురించి తెలుసుకొని దానిని వెంట తెచ్చుకున్నారు. ఇది తన రోగులకు మెరుగైన సేవ చేయడానికి వీలు కల్పించింది. అదనంగా వీరు స్థానిక ప్రాక్టీషనర్10831 తో తరుచూ సమీప్యంగా ఉండడంతో చాలా వరకూ పేషంట్ల వర్క్ లోడ్ అతను స్వీకరించారు. 2014లో పుట్టపర్తిలో జరిగిన 1వ అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సుకు హాజరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నారు. కార్యకలాపాల ముగింపులో వీరు ఎంతో ప్రేరణ చెంది తన పూర్తి సమయం వైబ్రియానిక్స్ సేవలోనే నిమగ్నం కావడానికి తన వ్యాపారం నుండి పూర్తిగా విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది తన జీవితంలో ఒక గొప్ప మలుపు అని వీరు భావిస్తున్నారు.    

ఈ ప్రాక్టీషనర్ ఇప్పటివరకూ 30 వేలకు పైగా రోగులకు అన్ని రకాల వ్యాధుల కోసం చికిత్స చేయగా అందులో 95% విజయవంతమైన రేటును నమోదు చేయడం స్వామి కురిపించిన ప్రత్యేక అనుగ్రహానికి చిహ్నంగా వీరు భావిస్తున్నారు. మిగిలిన 5% మంది రోగులు సూచనలను సరిగ్గా పాటించక పోవడమే కారణమని వీరు అభిప్రాయపడుతున్నారు. వీరు నెలకు సగటున 350 మంది రోగులను చూస్తారు. వీరు తమ శ్రీమతితో కలసి నిత్యమూ 500 మందితో కూడిన భగవద్గీత ఉపన్యాసాలకు హాజరవుతారు. ఇది వీరికి వైబ్రో చికిత్స చేయడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నది. అతను రోగులతో సంప్రదింపులు జరుపుతూ ప్రిస్క్రిప్షన్ వ్రాస్తూఉంటే వీరి శ్రీమతి రోగులకు సలహాలు సూచనలతో పాటు రెమిడీలు వాటిని తీసుకోవలసిన విధి విధానాలను వివరిస్తారు.  

 ప్రాక్టీషనర్ తరచూ 3 కాంబో లను ఉపయోగిస్తారు.  ఇవి వీరు ఇచ్చే 70% రెమిడీలను కవర్ చేస్తాయి. వీటిలో ప్రతీ ఒక్కదానికి వీరు బ్యాకప్ కోంబో గా పిలిచే క్రింది రెమిడీని జత చేస్తారు. బ్యాక్ అప్ కోంబో : CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + SM2 Divine Protection.

1. డైజెస్టివ్ లేదా జీర్ణ వ్యవస్థ కాంబో అజీర్ణం, ఆమ్లత్వం, అపానవాయువు, మలబద్ధకం, కడుపు నొప్పి మొదలైన వాటికి: CC4.4 Constipation + CC4.5 Ulcers + CC4.10 Indigestion

2. శ్వాసకోశ కోంబో జలుబు, దగ్గు, గొంతు సమస్యలు, ఛాతి ఇన్ఫెక్షన్ మరియు జ్వరము మొదలైనవాటికి: CC9.2 Infections acute + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic

3. ఎముకల కండరాల కాంబో మోకాలి సమస్యలు, వెన్ను నొప్పి, శరీరమంతటా నొప్పి, కీళ్ళు మరియు కండరాలు పని చేయకపోవడం మొదలైన వాటికి: CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine

మిగిలిన 30% రెమిడీలను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వీరు ఇస్తూ ఉంటారు. రోగులను కలవడం ఆచరణాత్మకం కానప్పుడు అతను సంతోషంగా వారికి కొరియర్ ద్వారా రెమిడీలు పంపుతారు. మానసిక సమస్యలతో బాధ పడే వారికి వీరు  తరచూ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా చికిత్స చేస్తారు.  

ప్రాక్టీషనర్ ఒక ఆసక్తికరమైన కేసును మనతో పంచుకుంటున్నారు. 70 ఏళ్ల మహిళ  ముఖ అర్ధభాగ చైతన్య హీనతతో  పాటు హైబీపీ, ఆందోళన, భయం మరియు నిరాశతో బాధ అనుభవిస్తూ అప్పటికే అల్లోపతి మరియు వైద్య చికిత్స తీసుకుంటున్నా కూడా     రెండు రోజులుగా నిద్రలో కూడా నిరంతరం దగ్గడం ప్రారంభమై ఆమెను అత్యంత బాధకు గురి చేసింది. ప్రాక్టీషనరుకు కొత్తదనం వలన కొంత భయానికి గురిఅయినా CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.4 Eating disorders + CC21.11 Wounds & Abrasions + Backup combo, ను కేవలం ఒక్క గ్లాసు నీటిలో తయారుచేయగా మంత్రం వేసినట్లు దగ్గు వెంటనే ఆగిపోయింది. మరొక ఎక్యూట్ కేసులో 34 ఏళ్ల మహిళకు తన బొటనవేలిపై మచ్చ ఏర్పడింది. CC10.1 Emergencies + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.5 Dry Sores + Backup combo, ను రెండు వారాలు ఇవ్వగానే ఈ గడ్డ అదృశ్యమైంది. మరొక కేసు విషయంలో చర్మ క్యాన్సర్ తో మూడేళ్లుగా బాధపడుతున్న 50 ఏళ్ల వ్యక్తి  కేవలం మూడు నెలల్లోనే క్యాన్సర్ నుండి పూర్తిగా నయమయ్యారు.  

వీరు ఇతర ప్రాక్టీషనర్ లతో కలిసి పనిచేస్తూ క్రమానుగతంగా ప్రాక్టీషనర్లతో ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహిస్తారు. వ్యక్తిగత సాధనగా ప్రాక్టీషనర్ పౌరాణిక గ్రంథాలను మరియు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఈ జ్ఞానాన్ని ఇతర సహృదయులైన వ్యక్తులతో పంచుకుంటారు. వీరు సుప్రభాతంతో తన దినచర్యను ప్రారంభించి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతీరోజూ  ఉదయాన్నే కొంతదూరం నడుస్తారు. ఈ దంపతులిద్దరూ అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ వైబ్రియానిక్స్ తో తగ్గిపోయాయి. తమ మలి వయస్సులో మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేసిన స్వామిపట్ల వారి హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. ప్రత్యేకించి ఈ అభ్యాసం వీరికి మానవత్వానికి సేవలను అందించడం ద్వారా సంతృప్తికరంగా జీవితాన్ని గడుపుతున్న అనుభూతిని అందిస్తోంది.    

భాగస్వామ్యం వహించిన కేసులు

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న1.  కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాల నుండి సహాయపడేందుకు ఏవైనా రెమెడీలు ఉన్నాయా?

జవాబు: SR318 Thuja 30C ఇవ్వండి. ఒకవేళ మీకు 108 CC బాక్స్ మాత్రమే ఉంటే CC9.4 Children’s diseases ఇవ్వండి. దీని మోతాదు: వ్యాక్సినేషన్ కు రెండు రోజుల ముందు రాత్రిపూట OD అలాగే టీకాలు వేసిన తరువాత 10 రోజుల వరకూ OD వద్ద కొనసాగిస్తూ IB ని కూడా  OD గా కొనసాగిస్తూనే ఉండాలి.

______________________________________________________________________________________________________

ప్రశ్న2. రక్షిత వాతావరణంలో ఉంచినప్పుడు మరియు తల్లి క్రమం తప్పకుండా IB తీసుకుంటున్నప్పుడు కొత్తగా పుట్టిన శిశువుకు కూడా IB ఇవ్వడం అవసరమా?  

జవాబు: అవును, బిడ్డకు ఒకే ఒక మోతాదు ఇవ్వండి. శిశువుకు మోతాదుగా నాలుకపై ఒక చుక్క నీటి నివారణ వెయ్యాలి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సాధారణంగా నవజాత శిశువుకు ఏ వైబ్రేషను ఇవ్వకూడదు. వార్తాలేఖ సంచిక 10 సంపుటి 3 ను చూడండి. తల్లి తన రోజువారీ IB.తీసుకోవడం మాత్రం కొనసాగించాలి.  

______________________________________________________________________________________________________

ప్రశ్న 3. పుట్టినప్పటి బాధను తొలగించడానికి నవజాత శిశువుకు ఏ రెమిడీ ఇవ్వవచ్చు?

జవాబు: బిడ్డకు ఒక మాసము వయసు వచ్చిన తర్వాత మీరు NM25 Shock ఇవ్వవచ్చు. కానీ మీ వద్ద 108CC బాక్సు మాత్రమే ఉంటే : CC10.1 Emergencies ఇవ్వండి.

______________________________________________________________________________________________________

ప్రశ్న 4. ప్రొస్టేట్ క్యాన్సరుకు చికిత్స చేస్తున్నప్పుడు మగ హార్మోన్ల సమక్షంలో క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయి కనుక  హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగించడమే లక్ష్యంగా అల్లోపతీ మందులు పనిచేస్తాయి. వైబ్రియానిక్స్ చికిత్సలో ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో ఉపయోగించే రెమిడీలో CC14.1 Male tonic, కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువగా మగ హార్మోన్లను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది కదా?   

జవాబు: వైబ్రియానిక్స్ అనేది వ్యాధిగ్రస్తమైన అవయవం యొక్క ఆరోగ్యకరమైన ప్రకంపన పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుంది, తద్వారా అది తనకు తానే మరమ్మత్తు చేసుకొని పునరుద్ధరించబడుతుంది. CC14.1 Male tonic శరీరానికి అవసరమైన హార్మోనుల సమతుల్యతను పునరుద్ధరించడానికి పనిచేస్తుంది. ఐతే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండడంవల్ల ఈ అవసరం తక్కువగా ఉంటుంది అందువల్ల రెమిడీ అల్లోపతీ చికిత్సను ప్రతికూలంగా ప్రభావితం చేయదు.  

______________________________________________________________________________________________________

ప్రశ్న 5. SRHVP యంత్రము యొక్క పనితీరును తనిఖీ చేయడానికి ఏవైనా ప్రమాణాలు ఉన్నాయా?

జవాబు: SRHVP యంత్రములో కదిలే భాగాలు లేవు కాబట్టి యంత్రం లోపల ఏదైనా పనిచేయక పోవడానికి జరిగే అవకాశం చాలా తక్కువ. మిషనును సున్నితంగా ఊపితే లోపల ఏ శబ్దాలు వినబడకపోతే  లోపలి భాగలేవీ విచ్ఛిన్నం కాలేదని మరియు యంత్రం మంచిస్థితిలో ఉందని అర్ధం. సాధారణంగా ఈ మిషనులో సున్నితమైన భాగమైన మీటరు మాత్రమే పనిచేయక పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీటరు బిగుసుకుపోయి స్వేచ్ఛగా తిరగదు. అట్టి సందర్భంలోనూ దానిని బలవంతం చేయకూడదు. అలా చేయడం వలన అది పూర్తిగా విరిగిపోవడమో లేదా అదుపు లేకుండా స్వేచ్ఛగా గుండ్రంగా తిరగడమో జరుగుతుంది. ఈ రెండు సందర్భాల్లో దాన్ని రిపేర్ చేయడం సాధ్యమే. ఇవి కాకుండా మరేదైనా లోపం జరిగినట్లు మేము చూడలేదు. మిషను ద్వారా ఇచ్చిన రెమిడీ  పనిచేయలేదని మీకు అనిపిస్తే అప్పుడు మీ కేసును తిరిగి అనేక కోణాలలో పరిశీలించండి. ఎందుకంటే రెమిడీ పని చెయ్యకపోవటానికి అనేక కారణాలు ఉండవచ్చు.  

______________________________________________________________________________________________________

ప్రశ్న 6. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉద్భవించిన కొత్త ఫంగస్ క్యాండిడా ఆరిస్ కు నివారణ ఉందా?  

జవాబు:  క్యాండీడా ఆరిస్ అనేది తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న ప్రజలను ప్రభావితం చేసే ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు భయపడే ఆసుపత్రి సూక్ష్మజీవులలో ఒకటి.  దీనిలో కూడా కోవిడ్-19 లక్షణాలైన జ్వరం మరియు చలి ఉంటూ  ఇవి యాంటీ బయోటిక్స్ కు ప్రభావితం కావు, మరియు ప్రభావితమైన శరీర భాగాన్ని బట్టి మారుతూ గందరగోళానికి గురిచేసే విధంగా ఉంటాయి. రెండు వ్యాధుల్లోనూ రక్తప్రవాహము గురికావడం అనేది సర్వసాధారణం. SRHVP మిషను ఉపయోగిస్తున్నట్లైతే : NM2 Blood + SM27 Infection + SR294 Hepar Sulph Calc 30C + SR298 Lachesis 30C + SR301 Mercurius + SR313 Sepia 30C + SR318 Thuja 30C + SR354 Nitric Acid 30C + SR370 Borax + SR556 Pyrogenium 30C + SR566 Fungi-Pathogenic + Myristica Sebifera 6X from homoeo store. 108 CC బాక్స్ మాత్రమే ఉంటే : CC21.3 Skin allergies + CC21.7 Fungus + CC21.11 Wounds & Abrasions. ఇవ్వండి. మోతాదు:  ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున ఒక రోజంతా ఇవ్వాలి, తర్వాత వారం వరకూ 6TD అనంతరం QDS. కాండిడా ఆల్కలీన్ పరిస్థితులలో జీవిస్తున్న దాఖలాలు లేవు కనుక రోగికి ఆల్కలిన్ ఆహారాన్ని తినమని సలహా ఇవ్వాలి.

దివ్య వైద్యుని దివ్యవాణి

ఆధ్యాత్మిక (వ్యక్తిగత) దుఃఖము అనేది మానవ శరీరం పై నివసించే లెక్కలేనన్ని సూక్ష్మజీవులు మరియు ఇతర పరాన్నజీవుల వలననే కలుగుతుంది. ఈ వ్యాధిని ప్రేరేపించే కారకాలనుండి ఎవరు తప్పించుకోలేరు. కానీ ప్రేమను వృద్ధి చేసి వ్యాప్తి చేస్తూ అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండడం,  ప్రేమ మరియు కరుణ వంటి భావాలను అభివృద్ధి పరుచుకోవడం ద్వారా ఈ దుఃఖాన్ని సులభంగా అధిగమించవచ్చు. శారీరక మరియు మానసిక అనారోగ్యం అనేది మనసులోని మాలిన్యాలు శరీరంపై ప్రతిచర్య మాత్రమే. పవిత్రమైన మనసు మాత్రమే నిరంతర ఆరోగ్యమును నిర్ధారిస్తుంది. చెడు అనేది అనారోగ్యానికి హేతువు. చెడు ఆలోచనలు, అలవాట్లు, ఆహారం దుస్సంగము, అనేవి వ్యాధిని వృద్ధి చెందించే కారకాలు.  ఆరోగ్యము  రియు ఆనందము చెట్టాపట్టాలు వేసుకొని ప్రయాణిస్తాయి.

... శ్రీ సత్య సాయి బాబా దివ్య వాణి,”మూడు దుఃఖాలు” 1980 జూలై 13                                                                      http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-51.pdf                                                                                                                    

 

సేవ చేయడంలో మీ మనస్సాక్షి యొక్క సంతృప్తి కోసం మీరు దీన్ని చేస్తున్నాని మరియు ఇతరుల మెప్పు కోసం కాదని గ్రహించాలి. ఇట్టి సేవను దైవానికి నైవేద్యంగా భావించి భక్తితో పరిపూర్ణంగా చేయండి.  మీ ప్రతీ చర్యను దేవుడు చూస్తున్నాడు అని గుర్తుంచుకోండి. మీరు చేసే పనులను పరిశీలించడానికి మీరు కాపలాదారుగా ఉండండి.  మీ ఆత్మసాక్షికి అనుగుణంగా మీ ఆచరణ ఉన్నప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కార  బాటలో సవ్యంగా ప్రయాణిస్తున్నట్లే భావించవచ్చు.”

... శ్రీ సత్య సాయి బాబా దివ్య వాణి “ప్రేమ పూర్వక సేవ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పై ఉపన్యాసం” 21 నవంబర్ 1995                                           http://www.sssbpt.info/ssspeaks/volume28/sss28-34.pdf

 

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింపబోయే వర్క్ షాపులు *

  • USA: విర్చ్యువల్ AVP పునశ్చరణ సదస్సు ** (మార్పు చోటుచేసుకున్న తేదీలు) 6-7 మార్చి 2021, రెండు అర్ధ దినములు, (వివరాలు పాల్గొనే వారికి అందించ బడతాయి) వివరాలకు సంప్రదించ వలసిన వారు సుశాన్ , వెబ్సైట్ [email protected]
  • USA: విర్చ్యువల్ AVP Workshop** వారపు తరగతులు జులై – సెప్టెంబర్ 2021 వివరాలకు సంప్రదించ వలసిన వారు సుశాన్ , వెబ్సైట్  [email protected]
  • ఇండియా పుట్టపర్తి: విర్చ్యువల్ AVP వర్క్ షాప్  వారపు తరగతులు 9 జనవరి నుండి- 7 మార్చి 2021వరకు  పుట్టపర్తిలో 2021 మార్చి 13-14 తేదీలలో జరిగే ప్రాక్టికల్ వర్క్ షాప్ తో పూర్తి అవుతుంది.(వివరాలు పాల్గొనే వారికి తెలియచేయడం జరిగింది), వివరాలకు సంప్రదించ వలసిన వారు లలిత  వెబ్సైట్ [email protected]  లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: విర్చ్యువల్ SVP పునశ్చరణ ** 22-23 మార్చి 2021, రెండు అర్ధ దినములు (వివరాలు పాల్గొనే వారికి అందించ బడతాయి) వివరాలకు సంప్రదించ వలసిన వారు హెమ్  వెబ్సైట్  [email protected]; లేదా పద్మ వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 9850412440
  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ ** 25-31 July 2021 వివరాలకు సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్  [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ ** 25 Nov-1 Dec 2021 వివరాలకు సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ ** 3-7 Dec 2021 వివరాలకు సంప్రదించ వలసిన వారు Hem వెబ్సైట్ [email protected]

* AVP మరియు SVP వర్క్ షాపులు కేవలం అడ్మిషన్ ప్రాసెస్ పొందిన వారికి మాత్రమే, అలాగే పునశ్చరణ తరగతులు ప్రస్తుతం ఉన్న ప్రాక్టీషనర్ లకు ఉంటాయి.   

** మార్పులు ఉండవచ్చు.

అదనంగా

1. ఆరోగ్య చిట్కాలు

నోటి ఆరోగ్యం- మన శ్రేయస్సుకు ఒక మంచి మార్గం!

మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నోటిని శుభ్రపరుచుకోవాలి. దంతాల లోపలి మరియు బయటి వైపు కూడా చక్కగా బ్రష్  చేయాలి. నాలు యొక్క ఉపరితలం పూర్తిగా శుభ్రం చేయాలి, ఎందుకంటే “నోరు అన్నీ వ్యాధులకు ముఖ ద్వారం లేదా ప్రవేశ ద్వారం. ఒకరితో ఒకరము మాట్లాడుకునేటప్పుడు అసహ్యకరమైన వాసన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా పరిశుభ్రత ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ”… శ్రీ సత్య సాయి బాబా1

1.  నోరు: నిర్మాణము మరియు విధులు

నోరు (బాహ్య కుహరము) పెదాలు, బుగ్గలు, అంగిలి, నాలుక, చిగుళ్ళు మరియు దంతాల తోపాటు నోరు నోటి కుహరం ఆహారం మరియు పానీయం తీసుకోవడానికి జీర్ణక్రియను ప్రారంభించడానికి గాలి పీల్చుకోవడానికి మాట్లాడటానికి మరియు పాడటానికి మరియు భావోద్వేగాన్ని చూపించడానికి ముఖ్యంగా చిరునవ్వులు చిందించ డానికి ఉపయోగపడే ప్రధాన అవయవము. కనుక దీనిని శరీరానికి అద్దము వంటిది అనడంలో అతిశయోక్తి లేదు!2

నోటి పైభాగంలో ఉండే అంగిలి ముందు భాగం గట్టిగానూ మరియు వెనుక వైపు మృదువుగానూ ఉంటుంది. మృదువైన అంగిలి చివర మాంసపు కండ వలె వ్రేలాడుతూ కొండనాలుక దానికి ఇరు వైపులా గొంతు వరకు స్తంభాల మాదిరిగా గొంతుకిరువైపులా గవదలు ఉంటాయి. ఆరోగ్యకరమైన నాలుక లేత గులాబీ రంగులో ఉండి దాని ఉపరితలంపై కొంత తెలుపు రంగుతో ఉండి రుచిని తెలుసుకోవడానికి, నమలడానికి, మ్రింగడానికి, మాట్లాడడానికి ఉపయోగ పడుతుంది. ఆహారాన్ని నమిలేటప్పుడు నోటి గోడలు మరియు క్రింది భాగంనుండి లాలాజల గ్రంధుల ద్వారా స్రవించే లాలాజలం జీర్ణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. మందముగా వ్యాపించిఉన్న చిగుళ్ళు దంతాలను కలిగి ఉండే అస్తి నిర్మాణాలు.  దంతాలు కొరకడానికి, నమలడానికి,  చప్పరించడానికి ఉపయోగపడుతూ ఒక్కొక్క దవడలో 4 కొరుకుదంతాలు, 2 కోరదంతాలు, 4 విసరు దంతాలు 4 నములు దంతాలు మరియు 2 జ్ఞాన దంతాలు కలిగి ఉండి వయోజనులలో 32 దంతాలు ఉంటాయి. నములు దంతాలకు 2-3 మూలాలు ఉండగా ఇతర దంతాలకు ఒక్కొక్క మూలం ఉంటుంది. ప్రతీ దంతము నాలుగు రకాల  కణజాలంతో తయారై ఉంటుంది. గుజ్జు (పంటిని పోషణకు ఉపయోగపడే లోపలి భాగం) దీని చుట్టూ గట్టిగా పసుపు రంగులో ఉండే డెంటిన్ మరియు రక్షిత ఎనామిల్ లేదా పింగాణి భాగము (శరీరంలో అత్యంత గట్టి పదార్ధము) మరియు దంతాన్ని చిగురు స్థానంలో సరిగా కూర్చుండ బెట్టి ఉంచే కఠినమైన భాగం సిమెంటమ్, త్రిభుజాకార(ట్రిజిమినల్) నాడి(12కపాలనాడులలో అతిపెద్దది మరియు సంక్లిష్టమైనది) ఇది నోటికి సంచలనాలను అందిస్తుంది మరియు నమలడానికి కండరాలకు ప్రేరణ ఇస్తుంది. 2,3,4,5


2. దంతాల రుగ్మతలు నోటి రుగ్మతలు: నోరు మరియు ప్రత్యేకించి నాలుకపై పూత మరియు చిగుళ్ళు మరియు దంతాల మధ్య ఆవర్తన స్థలం బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన ప్రదేశం. ఎందుకంటే దీని సగటు ఉష్ణోగ్రత 37c/98.6F మరియు ఆర్ద్రత స్థాయి 96%6.. నోరు మన జీర్ణ మరియు శ్వాశకోశ వ్యవస్థకు ప్రవేశ స్థానం. హృదయ మరియు అస్థిపంజర వ్యవస్థ దంతాలకు  అనుసంధానించబడి ఉండడం వలన నోటి ఇన్ఫెక్షన్లు శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తాయి. ప్రధాన కారణం ఆహారంలో జిగటగా ఉండే మరియు చక్కెరతో కూడిన పదార్ధాలు మరియు పానీయాలు తీసుకోవడం మరియు తగినంత నోటి పరిశుభ్రత లేకపోవడం.9

 

 

 

 

 

2.1 ఫలకము:  అనేది దంతాలపై బ్యాక్టీరియా యొక్క మృదువైన జిగట వంటి పొర. ఇది బ్రష్ చేయడం ద్వారా తొలగించవచ్చు. దానిని తొలగించకుండా అలాగే కొనసాగేలా చేస్తే “గార” ఏర్పడి దాన్ని తొలగించడానికి వైద్య పరమైన సహాయం అవసరం అవుతుంది. ఆహారంలో ఉన్న చక్కెర లేదా పిండి పదార్థాలతో కలిసి ఇది ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి దంత క్షయానికి, చిగుళ్ళ వ్యాధులకు మార్గం సుగమం చేస్తుంది.9,10

2.2 దంతక్షయం / రంధ్రాలు: ఇవి బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా దంతాలలో ఏర్పడే రంధ్రాలను తద్వారా దంతక్షయాన్ని సూచిస్తాయి. 9,10

2.3 చిగురు వాపు: ఇది దంతాల మీద రుద్దడం లేదా బ్రష్ ను మెలిపెట్టడం వంటివి చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఏర్పడి చిగుళ్ళ నుండి రక్తస్రావము కలుగుతూ ఉంటుంది. ఇది మరింత తీవ్రమై పీరియడోమ్టిస్(పైరోయియా) వ్యాధికి దారితీస్తుంది. 9,10,11,12

2.4 పీరియడొంటల్ వ్యాధి: నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ చిగుళ్ళను కూడా దాటి ఎముక మరియు కణజాలాలను ప్రభావితం చేయడానికి దిగువన వ్యాపించినప్పుడు చిగుళ్ళు దంతాలనుండి పట్టు కోల్పోవడంతో మరింత నష్టం జరిగి ఎముక వ్యాధికి గురికావడం, పళ్ళు ఊడిపోవడం వంటి ప్రమాదలకు దారితీస్తుంది. 9,10,11,12

2.5 ఓరల్ స్కిన్ ఇన్ఫెక్షన్ లు: నోటిపుండ్లు (పెదవులు మరియు నోటి చుట్టూ ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే బాధాకరమైన పుండ్లు హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల కలుగుతాయి) క్యాంకర్ సోర్స్ అనే వాటిని ఆప్తస్ అల్సర్ అని కూడా పిలుస్తారు(నోటిలో బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల సంభవించే బాధాకరమైన పుండ్లు, ఇది అంటువ్యాధి కాదు, ఆహారము సరిగా తీసుకోక పోవడం, ఇనుము, ఫోలెట్, విటమిన్ B12 లోపాలను సూచిస్తుంది). నోటిలో లైకెన్ ప్లానస్ (నాలుకపై లేస్ వలె తెల్లని గీతలు –రోగనిరోధకతకు సంబంధించిన రుగ్మత)  త్రష్(ఈస్ట్ శిలీంద్రము ఇన్ఫెక్షన్ కారణంగా నోటిలో తెల్లనిమచ్చలు)  లూకో ప్లేకియా (చిగుళ్ళు ,నాలుక లేదా బుగ్గలపై అధిక కణాల పెరుగుదల కారణంగా తెల్లని మచ్చలు, ధూమపానం చేసే వాళ్ళలో ఇది సాధారణం క్రమంగా నోటి క్యాన్సర్ గా అభివృద్ధి చెందుతాయి. 2,9,13

2.6 దుర్వాసన (హాలీటోసిస్): మీనోటి శ్వాస వాసన క్రమంగా సహించడం వల్ల మీకు చెడు శ్వాస ఉందని తెలియకపోవచ్చు.  ఆహార పదార్ధాలు పళ్లలో చిక్కుకు పోవడం వలన మరియు పంటి గార వలన దుర్వాసన కలగవచ్చు. ఇది చిగుళ్ల వ్యాధి, దంతాలలో రంధ్రాలు, పొడి నోరు, యాసిడ్ రిఫ్లెక్స్/ GERD, నోటి క్యాన్సర్ డయాబెటిస్(తీపి లేదా పండ్ల వంటి వాసన) లేదా మూత్రపిండాలు పనిచేయకపోవడం(మూత్రం చేపల వాసన లేదా అమోనియా వాసన ఉంటే) వంటి వ్యాధులకు కారణ మవుతుంది. 2,6,9,12,14

2.7 నోరు ఎండిపోవడం (జెరో స్టోమియా) తగినంత లాలాజలం లేకపోవడం వలన పెదాలు పగలడం, నోటిలో తడి ఆరిపోతున్న అనుభూతి, లేదా అధిక దాహం వేయడం వంటివి నోటి పూత, పుండ్లు ఇన్ఫెక్షన్లు, మరియు దంతక్షయానికి దారితీస్తాయి. అధిక ధూమపానం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. పొడిబారిన నోరు వత్తిడి, మందులు,  క్యాన్సర్ చికిత్స వల్ల కావచ్చు లేదా డయాబెటిస్ వ్యాధికి సంకేతం కావచ్చు. 2,14

2.8 రంగు పాలిపోవడం/ గడ్డలు ఏర్పాడడం: నోరు తెలుపు లేదా ఎరుపు రంగుకు మారడం ముఖ్యంగా వయోజనులైన మగవారిలో నోటి క్యాన్సర్ తో సహా అనేక దంత సమస్యలకు సంకేతం అని చెప్పవచ్చు. పూసిన నాలుక అజీర్ణమునకు సంకేతం. పుండ్లు, గడ్డలు, వాపులు, లేదా మందపు పొరలు ఏర్పడి నమల డానికి, మ్రింగడానికి, మాట్లాడడానికి లేదా నాలుక లేదా దవడ కదపడానికి అవరోధంగా ఉంటే, గొంతు మంట లేదా పెదాలు పగలడం వంటివి ఎక్కువకాలం తగ్గకుండా ఉంటే  వైద్య పరీక్ష అవసరం.  నోటి క్యాన్సర్లు వెంటనే నివారించక పోతే ప్రాణాంతకం అవుతాయి. 4,14

2.9 సున్నితమైన దంతాలు: సురక్షిత పంటి పింగాణి పొర పలచన అయినప్పుడు లేదా చిగుళ్లు ఇన్ఫెక్షన్ కు గురిఐనప్పుడు దంతాలు సున్నితంగా మారి ఏదైనా వేడి లేదా చల్లని, తీపి లేదా పుల్లని ఆహారం పదార్ధం తీసుకోవడం వల్ల బాధాకరము అవుతాయి. అధికంగా లేదా మోటుగా బ్రష్ చేయడం, ఆమ్లము తో కూడిన ఆహారం తినడం, మరియు పళ్లను కొరకడం, రాపిడికి గురిచేయడం వలన దంతాల యొక్క సున్నితత్వానికి దారితీయవచ్చు. 9,15

2.10 ఇతర నోటి రుగ్మతలు: క్రమబద్ధమైన వరుసలో లేని దంతాలు, ప్రభావితమైన దంతాలు (జ్ఞాన దంతాలు వలె చిగుళ్ళ నుండి బయటకు రాని దంతాలు), బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ (స్పష్టమైన కారణం లేకుండా రుచి మరియు ఇంద్రియ సంబంధ నరముల లోపము లేదా మరేదైనా వైద్య పరిస్థితి కి సంబంధించినది), జన్యుపరమైన అసాధారణతలు చీలిక అంగిలి నాలుక వంటివి ఈ కోవకు చెందుతాయి. నాలుక లేదా క్రింది పెదవి వాచినప్పుడు లేదా విస్తరించినప్పుడు, నాలుక మరియు చిగుళ్ల మీద పగుళ్ళు ఏర్పడడం లేదా పొడి బారడం, లాలాజలం తక్కువగా ఉత్పత్తి కావడం లేదా చిక్కగా రావడం, ఇవన్నీ లాలాజల రాళ్లు లేదా స్వయం ప్రతిరక్షక రుగ్మతను సూచిస్తాయి. దవడలోవాపు లేదా నొప్పి ఆర్థరైటిస్ ను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా మరేదైనా వైద్యస్థితి ఉదాహరణకు దీర్ఘకాలిక ఆమ్ల ప్రకోపం, GERD వంటివి దంతక్షయానికి దారి తీస్తాయి. మధుమేహం, HIV/AIDS , బోలు ఎముకల వ్యాధి మరియు అల్జిమీర్ వ్యాధి నోటి ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. మందులు అధికంగా తీసుకోవడం వలన లాలజలము తగ్గి వ్యాధులకు దారితీస్తుంది.2,7,8,14,16,17     

3. గృహ చిట్కాలు:

3.1 నోటి దుర్వాసన: పుష్కలంగా నీరు త్రాగండి, నారింజ ఇండియన్ గూస్ బెర్రీ మరియు నిమ్మకాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోండి. ఇవి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాని చంపడానికి తగినంత లాలాజలం ఉత్పత్తి చేస్తాయి. లవంగం, లేదా సోంపు/ సోపు గింజలు నమలండి. ఇంట్లో చేసిన లేదా సహజమైన మౌత్ వాష్ లేదా చల్లని నీటితో పుక్కిలించండి. 18,19

హెచ్చరిక: వక్క లేదా సుఫారీ కి అలవాటు పడితే అది నోటి క్యాన్సర్కు దారితీయవచ్చు.18,19

3.2 నోరు పొడిబారడం: దీనికోసం నీటిని సిప్ చేస్తూ ఉండండి కానీ అధికంగా నీరు త్రాగడం వల్ల నోటిలోని శ్లేష్మపొర తరిగి పోయి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అత్తిపండ్లను తినడం వలన అవి లాలాజల గ్రంధులను ప్రేరేపిస్తాయి. ఉపశమనం కోసం చెక్కర లేని కలకండ లేదా బబుల్ గమ్ వంటిది చప్పరించ వచ్చు. వీటిని క్జిలిటల్ తో పూత వంటిదిగా తీసుకుంటే ఇది దంతక్షయం నివారించడానికి కూడా సహాయపడుతుంది. పొడి బారిన లేదా పగిలిన పెదవుల కోసం కొబ్బరి నూనె, నెయ్యి, నూనెతో కూడిన లిప్ బామ్, లేదా విటమిన్ E తోకూడిన అయింట్ మెంట్ రాయండి. పొడి ఆహారంతో పాటు కొంత నీటిని తీసుకోండి, మరియు   ఆమ్ల పానీయాలను నివారించండి.2,14,20

3.3 ఫలకము లేదా టార్టర్ లేదా పంటి గార: వెనిగర్ ద్రావణంతో నోటిని పుక్కిలించండి, లేదా వారానికి రెండు సార్లు నారింజ పై తొక్క లేదా దాని పేస్ట్ తో రెండు మూడు నిమిషాలు రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు చిటికెడు ఉప్పుతో బ్రష్ చెయ్యండి లేదా  బేకింగ్ సోడా, కలబంద, మరియు గ్లిజరిన్ తో వారానికి ఒకసారి రుద్దండి. పక్షానికి ఒకసారి టూత్ బ్రష్ ను నిమ్మరసంలో ముంచి పళ్ళ మీద సుతారంగా రాయండి, ఒక నిమిషం తర్వాత శుభ్రం చేసుకోండి నువ్వులను బాగా నమిలి ఆపై ఈ పేస్ట్ తో బ్రష్ చేయండి. టమాటా, ఆరెంజ్, స్ట్రాబెర్రీస్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్ల తో కూడిన పేస్ట్ ను (సున్నితమైన దంతాల కోసం ఉపయోగించవద్దు) రాసుకొని ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.21

3.4 పంటి నొప్పి మరియు చిగుళ్ల వ్యాధి: వెచ్చని ఉప్పునీటితో నోరు శుభ్రం చేసుకోండి లేదా నొప్పి మంట నుండి ఉపశమనం పొందడానికి కోల్డ్ కంప్రెస్ ఉపయోగించండి. చిగుళ్ల నుండి రక్తస్రావం నిరోధించడానికి మరియు దంత ఫలకాన్ని కూడా తొలగించడానికి 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ దానికి సమానమైన నీటితో పుక్కిలించాలి. సున్నితమైన దంతాల కోసం జామ ఆకులు, లైకొరిస్ వ్రేళ్ళు (ములేతి), తాజా వెల్లుల్లి, లేదా సున్నితపు దంతాల కోసం లవంగం లమలాలి. వెల్లుల్లి లేదా పసుపు పేస్ట్   పట్టించండి లేదా లవంగం లేదా పిప్పెరమెంట్ తో మెత్తగా మసాజ్ చేయండి.22,23,24,25

3.5 ప్రమాద వశాత్తు మంట లేదా నోటిలో కాలిన గాయాలు:  మొదట చల్లని నీరు త్రాగాలి తర్వాత ఒక ఐస్ క్యూబ్ లేదా చల్లని నీరు నోటిలో పదినిమిషాలు ఉంచాలి. కొద్దిసేపు నోటి ద్వారా శ్వాస తీసుకోవాలి. నోటికి ఉపశమనం కలిగించడం కోసము కొంచెం తేనె, పెరుగు, లేదా చల్లని పాలు తీసుకోవాలి. ఉపశమనం కోసం మింట్ టూత్ పేస్ట్ మరియు కణజాల పునరుత్పత్తి కోసం విటమిన్  E నూనెను పట్టించండి. గాయం నయం అయ్యేవరకు వేడివి, గట్టిగా ఉండేవి, ఉప్పుతో కూడినవి మరియు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలి.26

4. నోటి ఆరోగ్యానికి చిట్కాలు: వ్యాధి వచ్చాక చికిత్స చేసే కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది  

దంత పరిశుభ్రత: దంత పరిశుభ్రత చాలా ముఖ్యం ఎందుకంటే ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించగలదు2,3,7,27-36

  •  రెండు నిమిషాలు చక్కగా బ్రష్ చేసుకోండి, ప్రతీ రాత్రి పడుకునే ముందు ఈ విధంగా బ్రష్ చేయడము వలన అంతకంటే కూడా ప్రతీ భోజనం తర్వాత బ్రష్ చేసుకోవడం, లేదా కనీసం ఉప్పు నీటితో నోరు శుభ్రం చేసుకోవడం మంచిది. బ్రష్ చేసుకునే సరైన విధానం ఏమిటంటే దంతాలు కలిసే ప్రదేశము, చిగుళ్ళు లక్ష్యంగా చేసుకొని బ్రష్ ను కొంత కోణంలో సున్నితంగా రుద్దండి. ప్రతీ పంటిని కొన్నిసార్లు సున్నితంగా రుద్దండి. పళ్ళకు లోపల, బయట అలాగే మీ నాలుకను కూడా  శుభ్రం చేయడం మానకండి.  అయితే శక్తివంతమైన లేదా అధికంగా బ్రెష్ చేయడం మానండి. దవడకు ముందు ఉన్న పళ్లలో లోపలి భాగాన్ని శుభ్రం చేసే సమయంలో బ్రష్ ను నిలువుగా పట్టుకోండి. బ్రష్ విషయంలో కుచ్చులు ఉండే భాగం  చిన్నదిగాను  మరియు మృదువైన కుచ్చులు ఉండేలా జాగ్రత్త వహించండి. ప్రతీ మూడు నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చండి. బఠానీ గింజంత టూత్ పేస్ట్ ఒకసారికి సరిపోతుంది. బ్రష్ చేయడం పూర్తి చేశాక ఉమ్మివేయండి, పుక్కిలించకూడదు. ఎలా బ్రష్ చెయ్యాలి, ఎలా చేయకూడదు28  అనే విషయంపై డెమో కోసం లింక్29 చూడండి 7, 27,28,29,30
  •  రోజుకు ఒకసారైనా ఫ్లాస్31 చెయ్యండి: పళ్ళు తోముకునే ముందు దంతాల మధ్య, మరియు పళ్ళకు చిగుళ్ళకు మధ్య  ఉన్న ధృఢ ప్రదేశాల నుండి బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు ఒకసారి పాచి తొలగించండి. నోటి పరిశుభ్రతకు ప్రతీరోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం చాలా మంచిది. గాయాలను నివారించడానికి పంటి పుల్ల లేదా ఇతర వస్తువులను ఉపయోగించడము మానండి.7,27,28,29,31,32
  • పొగాకుకు నో చెప్పండి: చక్కెరతో కూడిన స్నాక్స్, సంరక్షణ కారకాలతో ఉండే టెట్రా ప్యాక్ లలో ఉండే పళ్ళరసాలు,   మరియు గట్టిగా జిగురుగా ఉండే ఆహారపదార్ధాలు తినడం మానండి. 3,7,27-32
  • క్రమం తప్పకుండా దంతాలను చెకప్ చేయించుకోవడం మంచిది అలాగే ఏవైనా అసాధారణ మార్పులు ఏర్పడ్డాయేమో తెలుసుకోవడం కోసం మీ నాలుకను కూడా తనిఖీ చేయించడం మంచిది.4,7,28 బాల్యం నుండే పిల్లలకు మంచి దంత సంరక్షణ పద్ధతులను అలవాటు చేయడం ఎంతో మంచిది. 3,33,34
  • పోషకాహారం మరియు తగినంత సహజ విటమిన్-డి ఉన్న ఆహారం తీసుకోండి. ముక్కలుగా తినగలిగే ఆపిల్ వంటి పళ్ళు (దీనిలో గ్జైలిటాల్ఉంటుంది) తినడం, మరియు క్యారట్ వంటి కూరగాయలను నమలడం వలన అవి దంతాలను శుభ్రపరిచి, చిగుళ్లను గట్టిపరచడమే కాక  నోటిని శుభ్రపరచడానికి ఉపయోగపడే లాలాజలం ఉత్పత్తి చేయడానికి   ప్రేరేపిస్తుంది.35,36

5. ముగింపు: పసివారినుండి పెద్దవారి వరకు తగిన దంత సంరక్షణ తీసుకోవడం నోటిఆరోగ్యానికి ఎంతో మంచిది. సాయి వైబ్రియానిక్స్ తో వ్యాధి నిరోధకం మరియు నివారణ కోసం రెమిడీలు తీసుకోవడం మంచిది.   

రిఫెరెన్సులు మరియు వెబ్సైట్ లింకులు:

       1.      Health is wealth”, Divine Discourse, 27 May 2002, Summer Course on Indian Culture and Spirituality: https://sathyasai.org/discour/2002/d020527.pdf, page 1-2.

2.      Mouth-functions: https://medlineplus.gov/mouthdisorders.html

3.      Mouth structure & function: https://kidshealth.org/en/parents/mouth-teeth.html

4.      Tongue colour: https://medicalnewstoday.com/articles/tongue-color#healthy-color

5.      Teeth anatomy: https://www.vcdental.com.au/tooth-anatomy-education/

6.    Mouth & Bad breath (halitosis): https://verywellhealth.com/bad-breath-causes-of-halitosis-1191875

7.    Oral health: a window to your overall health: https://mayoclinic.org/healthy-lifestyle/adult-health/in-depth/dental/art-20047475

8.    Mouth reflects body health: https://healthcareinamerica.us/what-your-mouth-can-tell-you-about-the-rest-of-your-body-6ffec5989859; https://periodontal.co.uk/the-mouth-is-the-mirror-of-the-body/

9.    Mouth disorders with pic: https://www.verywellhealth.com/top-common-dental-problems-1059461

10.  Plaque, tooth decay & Gum disease: https://mayoclinic.org/diseases-conditions/gingivitis/symptoms-causes/syc-20354453

11.  Tooth decay & gum diseases: https://healthdirect.gov.au/mouth-diseases

12.  Gum diseases:Gingivitis & Periodontitis: https://medicinenet.com/gum_disease/article.htm 

13.  Oral skin disorders: https://healthhub.sg/a-z/diseases-and conditions/412/skin_disorders_in_the_mouth_lips_national_skin_centre; https://mayoclinic.org/diseases-conditions/canker-sore/symptoms-causes/syc-20370615; https://mayoclinic.org/diseases-conditions/oral-lichen-planus/symptoms-causes/syc-20350869

14.  Mouth & Breath as an indicator of health: https://keystonehealth.org/blog/mouth-can-tell-health/

15.  Causes of Sensitive teeth: https://www.everydayhealth.com/dental-health/10-biggest-causes-of-tooth-sensitivity.aspx;

16.  Burning mouth syndrome: https://mayoclinic.org/diseases-conditions/burning-mouth-syndrome/symptoms-causes/syc-20350911

17.  Oral birth defects: https://www.cdc.gov/ncbddd/birthdefects/cleftlip.html

Home remedies

18.  Prevent bad breath: https://www.healthline.com/health/home-remedies-for-bad-breath; https://www.everydayhealth.com/columns/white-seeber-grogan-the-remedy-chicks/ways-fight-bad-breath-naturally/

19.  Caution with betel nut: https://www.healthline.com/health/betel-nut-dangers; https://www.healthline.com/health/betel-nut-dangers#cancer-risk

20.  Moisten Dry mouth: https://www.mayoclinic.org/diseases-conditions/dry-mouth/expert-answers/dry-mouth/faq-20058424; https://www.colgate.com/en-us/oral-health/dry-mouth/dry-mouth-home-remedies; https://health.clevelandclinic.org/8-tips-to-relieve-your-dry-mouth/

21.  Remove plaque/tartar natural way: https://www.youtube.com/watch?v=CChuqOX449w; https://www.carefreedental.com/resources/24-your-teeth/116-19-amazing-home-remedies-for-removing-plaque-naturally 

22.  Toothache home remedies: https://www.healthline.com/health/dental-and-oral-health/home-remedies-for-toothache; https://medicalnewstoday.com/articles/320315

23.  Home remedy for gum disease: https://www.healthline.com/health/dental-and-oral-health/gingivitis-home-remedy;

24.  https://healthline.com/health/busted-lip#treatment

25.  Treat sensitive teeth: https://medicalnewstoday.com/articles/324731; https://dentalhealth.org/sensitive-teeth

26.  Treat burn in mouth: https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/home-remedies/6-natural-ways-to-treat-a-burn-on-the-roof-of-the-mouth/photostory/72243721.cms

Preventive Care:

27.   Tips: Maintain good oral health: https://www.mayoclinic.org/healthy-lifestyle/adult-health/in-depth/dental/art-20045536; https://www.betterhealth.vic.gov.au/health/ten-tips/10-tips-to-look-after-your-teeth

28.  Correct brushing of teeth: https://www.dhsv.org.au/dental-advice/general-dental-advice/how-to-brush-your-teeth; https://www.colgate.com/en-in/oral-health/brushing-and-flossing/how-to-brush; https://www.dentalcare.com/en-us/patient-education/patient-materials/manual-brushing-and-flossing

29.  Demo for brushing: https://w ww.verywellhealth.com/how-to-brush-your-teeth-1058985; https://www.youtube.com/watch?v=BapR9J86ZZw;

30.  How not to brush: https://www.webmd.com/oral-health/features/brushing-teeth-mistakes#3

31.  How to Floss video: https://youtube.com/watch?v=rm5oAAeoEnl

32.  Oil pulling for oral health: https://www.healthline.com/nutrition/6-benefits-of-oil-pulling; https://www.healthline.com/nutrition/oil-pulling-coconut-oil#TOC_TITLE_HDR_2

33.  Kids dental care: https://www.medicalnewstoday.com/articles/324708#limit-sugars-and-starches

34.  Preventive care tips for children & women: https://www.healthline.com/health/dental-oral-health-prevention; https://medicalnewstoday.com/articles/324708

35.  Best diet for oral health: https://dentistry.uic.edu/news-stories/the-best-foods-for-a-healthy-smile-and-whole-body/; https://dentistry.uic.edu/news-stories/eat-fruits-and-veggies-for-a-healthy-smile/; https://www.colgate.com/en-us/oral-health/nutrition-and-oral-health/healthy-foods-list-seven-best-foods-for-your-teeth

36.  Top 3 fruits for teeth: https://friscominimolars.com/top-3-fruits-teeth/

2. కోవిడ్-19 నవీనీకరణ

2.1 సవరించిన కోవిడ్ కోంబోలు (గతంలో సవరింఛిన నవీకరణ సెప్టెంబర్-అక్టోబర్ 2020 వార్తాలేఖ లో ఇవ్వబడింది)

A. రోగ నిరోధకత మరియు చికిత్స కోసం: ప్రబల మవుతున్న కోవిడ్-19 వైరస్ యొక్క నూతన వైవిధ్యాల దృష్ట్యా మా పరిశోధనా బృందం ఇమ్యూనిటీ బూస్టర్ IB ని ఈ క్రింది విధంగా జాగ్రత్తగా సవరించింది:  

108CC బాక్సు మాత్రమే ఉన్నవారికోసం: CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gall bladder tonic + CC9.4 Children’s diseases + CC11.3 Headaches + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic

SRHVP మిషను ఉన్నవారికోసం: BR4 Fear + BR9 Digestion +  SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM40 Throat + SR272 Arsen Alb 30C + SR277 Bryonia 30C + SR291 Gelsemium 30C

మోతాదుఉదయమే నిద్ర లేవగానే OD, అనుమానాస్పద సంక్రమణ విషయంలో (స్వల్పంగా దగ్గు వంటి తేలిక పాటి లక్షణాలు ఉన్నవారి విషయంలో) TDS . పరీక్షించిన తరువాత పాజిటివ్ గా నిర్ధారణ ఐతే ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున ఆరు గంటల వరకు ఆ తరువాత  6TD ఆపై మెరుగుదలను బట్టి QDS - TDS - BD - OD గా తగ్గించు కుంటూ రావాలి.  

B. కోవిడ్ తగ్గాక పునరుద్ధరణ కోసం: కోలుకునే టప్పుడు   శరీరం మరియు మనసు తక్కువ శక్తిస్థాయిలు కలిగి ఉంటే:

108CC బాక్సు ఉపయోగిస్తున్న వారికోసం: CC9.4 Children’s diseases + CC11.3 Headaches + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.7 Throat chronic

SRHVP ఉపయోగిస్తున్న వారి కోసం: NM75 Debility + SM18 Digestion + SM24 Glandular + SM27 Infection + SM41 Uplift + SR291 Gelsemium 30C 

మోతాదు: రోగి ప్రస్తుతం తీసుకుంటున్న IB మోతాదు కొనసాగిస్తూనే రాత్రి పడుకునే ముందు OD తీసుకోవాలి.       

రోగులు వారి ఆరోగ్య అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించమని ప్రోత్సహించడం చాలా ముఖ్యం మరియు ఏదైనా అల్లోపతి చికిత్స తీసుకుంటున్నట్లైతే దానిని కొనసాగించమని చెప్పాలి గానీ ఆపమని నిరుత్సాహ పరచకూడదు.  

C. టీకా యొక్క దుష్ప్రభావాల కోసం: SR318 Thuja 30C

108CC బాక్సు ఉన్నవారి కోసం: CC9.4 Children’s diseases

మోతాదు: టీకాలు వేయడానికి రెండు రోజుల ముందు నుండి మరియు టీకా వేసిన రోజు నుండి పది రోజులవరకు రాత్రిపూట OD గా కొనసాగించాలి.  అలాగే  IB ని  ODగా కొనసాగిస్తూనే ఉండాలి.

2.2 ప్రపంచవ్యాప్తంగా IB తో కొన్ని అనుభవాలు

చికిత్స కంటే నివారణ ముఖ్యం 01001…యురుగ్వే  

 86 సంవత్సరాల మహిళ 2020 మార్చిలో తన దేశంలో మొదటి కోవిడ్ కేసు కనిపించిన నాటినుండి  IB తీసుకోవడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె 57 ఏళ్ల కుమార్తె మరియు 23 ఏళ్ల మనవరాలితో నివసిస్తూ ఉంటారు. వీరిద్దరూ IB తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఒకసారి క్రిస్మస్ సందర్భంలో ఒక పుట్టినరోజు పార్టీకి వెళ్ళి వచ్చిన కొద్ది రోజులకు ఆ యువతిలో అధిక జ్వరము మరియు ఇతర కోవిడ్ లక్షణాలు ఏర్పడ్డాయి.  డిసెంబర్ 30 న ఆమెకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే మిగతా ఇద్దరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా యువతి తల్లికి పాజిటివ్, వృద్ధురాలికి నెగిటివ్ గా రిపోర్టు వచ్చింది. వైబ్రియానిక్స్  IB తనను కాపాడుతూ వైరస్ కు దూరంగా ఉంచినందుకు ఆమె ఎంతో సంతోషము వ్యక్తం చేసారు.  

IBవిషయంలో ఆసుపత్రి యంత్రాంగము సానుకూల స్పందన 00512…స్లొవేనియా

స్లోవేనియా యొక్క ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను ఆమోదించనప్పటికీ మా ప్రాక్టీషనర్ యొక్క ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహణ విభాగము IB ఇమ్యూనిటీ బూస్టర్ ను క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. ఈ రెమిడీ  ప్రభావవంతంగా ఉండటమే కాకుండా రోగులు వేగంగా కోలుకునేటట్లు చేస్తుందని వారు నిర్ధారణ చేసుకున్నారు. ప్రాక్టీషనర్ 2020 అక్టోబర్ 26న ఆస్పత్రిలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నలుగురు రోగులకు వైబ్రియానిక్స్ రెమిడీలను ప్రసారం చేయడం ప్రారంభించారు. వారు కోవిడ్ న్యుమోనియా, తీవ్రమైన శ్వాస కోశ ఇబ్బంది ఇంకా 5-7 ఇతర సమస్యలతో బాధపడుతూ  రెస్పిరేటర్లు, ఇంట్యుబేటర్ లపై ఉన్నారు. 28 రోజుల బ్రాడ్ కాస్టింగ్ చికిత్స తర్వాత ఒక రోగి యొక్క అన్ని పరీక్షలు(హేమటో లాజికల్, బయో కెమికల్, గ్యాస్ ఎనాలసిస్, ఇమ్యూనో కెమిస్ట్రీ, యూరిన్ కొయాగ్యూ లేషన్ మొదలగునవి) ఫలితాలు సాధారణమైనవి గుర్తించబడ్డాయి. అందుచేత అతనిని డిశ్చార్జి చేసారు. మరో 7 రోజుల్లో మిగతా ముగ్గురు రోగులకు కూడా అదే ఫలితం కలిగింది. డాక్టర్లు వైబ్రియానిక్స్  వ్యవస్థ యొక్క ప్రభావాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన హాస్పిటల్ యాజమాన్యమును ఎంతగానో ఆకట్టుకుని ”వైబ్రియనిక్స్ భవిష్యత్తు ఔషధం మాత్రమే కాదు వర్తమానానికి  కూడా దివ్య ఔషధమే” అని పేర్కొన్నారు.   

కోవిడ్ లక్షణాల నుండి వేగవంతమైన ఉపశమనం 03578…ఫ్రాన్స్

73 ఏళ్ల మహిళ రెండు నెలలుగా పొత్తికడుపులో మరియు ఆమె శరీరమంతా కీళ్ళు మరియు కండరాల నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆమెకు జ్వరం, అలసట మరియుతీవ్రమైన బలహీనత అనిపించ సాగింది. ఆమె పరీక్ష చేయించుకోవడానికి వెళ్లలేదు కానీ తనకు కోవిడ్ 19 ఉందని ఆమె భయపడసాగారు. 2020 ఏప్రిల్ 1న ఆమెకు IB ఇచ్చారు. రెండు రోజుల్లో ఆమె మెరుగుపడటం ప్రారంభించి, తర్వాత ఐదు రోజుల్లో ఆమె సాధారణ పనితీరు 100% గా పునరుద్ధరించబడింది తొమ్మిది నెలల తర్వాత కూడా వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు.  

 

3. ఆసక్తికరమైన కథలు

3.1. కొత్తగా దత్తత తీసుకున్న కుక్కపిల్ల తో ప్రయాణం 01339...USA

2020 అక్టోబర్ 25న ఎనిమిది వారాల సూక్ష్మరూప పూడిల్ జాతి ఆడ కుక్కపిల్లను తీసుకురావడానికి ప్రాక్టీషనరు ఎనిమిది వందల మైళ్ళు ప్రయాణించారు. 3 పౌండ్ల(1.4కిలోలు) బరువు ఉన్న ఈ కుక్కపిల్ల తన తల్లి నుండి వేరు చేసి కొత్తవారితో వెళుతున్నందుకు ఒత్తిడి మరియు ఆందోళనకు గురియై ఏడుస్తుందేమో అని,  అంతేకాకుండా దీన్ని ఒక పెట్టెలో బంధించి తిరుగు ప్రయాణంలో విమానంలో సీటుక్రింద 2గంటల సమయం ఉంచడం గురించి ప్రాక్టీషనరు చాలా ఆందోళన చెందారు. అందుచేత ఇంటి నుండి బయలుదేరే ముందు ఆమె క్రింది రెమిడీ తయారు చేసారు: CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders 3 ml డ్రాపర్ బాటిల్లో స్వేదన జలంలో రెమిడీ తయారుచేసారు. విమానాశ్రయములో విమానం కోసం దాదాపు ఐదు గంటల నిరీక్షణ సమయంలో ఈ చిన్న కుక్క పిల్ల ఏడుపు ప్రారంభమైంది. ఒక డ్రాపరు బాటిల్ లో రెమిడీ పూర్తిగా ఇచ్చిన తరువాత అది రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. తర్వాత ఐదు రాత్రులలో కుక్కపిల్లకు నిరాశ లేదా బాధ పొడచూపిన మరుక్షణం ఈ రెమిడీ ఇవ్వబడింది. రెమిడీ ఇచ్చిన ప్రతీసారి కుక్క పిల్ల రెండు మూడు నిమిషాలలో నిద్రపోతోంది. ఐదు రాత్రుల తర్వాత ఈ రెమిడీ అవసమే రాలేదు. బాధకారమైన పరిస్థితి నుండి ఒక చిన్న కుక్కపిల్లనుబయటకు తీసుకురావడానికి మందులేని, ఆందోళన చెందవలసిన అవసరం కల్పించని వైబ్రియానిక్స్ చక్కని సమాధానం అయ్యింది.  

3.2 దివ్యత్వ పిలుపు కార్డు 03578…ఫ్రాన్స్  

 ప్రాక్టీషనర్ పొరుగువారు విదేశాల్లో సెలవుదినములు గడిపి తిరిగి వచ్చిన నాటినుండి రెండు వారాలుగా తీవ్రమైన అలసట విరోచనాలు మరియు వాంతులతో బాధపడుతున్నారు. ఈ జంట వారి 50 వ పడిలో సూక్ష్మ శక్తులను కొలవడానికి ఉపయోగించే ప్లేటోనిక్ ఘనపదార్ధాలు, మరియు లెషర్ యాంటీనా ఉపయోగించే బయో రెజోనెన్స్ ఉపయోగించి వైద్యం చేసే నిష్ణాతులైన  ప్రాక్టీషనర్లు. ఐతే గతంలో మాదిరి కాకుండా ఈసారి వారు తమ జీవితంలో మొదటిసారిగా తమను తాము నయం చేసుకోవడంలో  విఫలం అయ్యారు. అల్లోపతీ పరీక్షలు వారి శరీరంలో వ్యాధి లక్షణాలను నిర్ధారించ డానికి ఎటువంటి వ్యాధి కారకాలు లేవు అని తెలిపాయి. అతీంద్రియ జ్ఞానము బట్టి వీరి శరీరంలో దుష్ప్రభావం చూపే నెగిటివ్ ఎనర్జీ మరియు జీర్ణకోశ సమస్యలు ఉన్నట్లు తెలిసింది. 2020 మార్చి 7న ఈ జంట ప్రాక్టీషనరును కలవగా క్రింది రెమిడీ ఇచ్చారు:      

 CC4.6 Diarrhoea + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing ఈ కొంబో నోటిద్వారా తీసుకోవడానికి మరియు CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing ఇంటి చుట్టూ మరియు తమ మీద నీటిద్వారా పిచికారీ చేయడానికి సూచించడం జరిగింది. రెండవ ఔషధం యొక్క మొదటి స్ప్రే తోనే వీరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తూ భార్య తన శరీరం మొత్తం నుండి ఏదో అదృశ్య శక్తి బయటకు వెళ్ళిపోయినట్లు అనుభూతి చెంది ఆ రోజు హాయిగా నిద్రపోయింది. మరుసటిరోజు మేల్కొన్న తరువాత ఆమె తను ఏదో దుష్ట శక్తి నుండి విముక్తి పొందినట్లు భావించారు. భర్త పైకి బాగానే ఉన్నారు కానీ పూర్తిగా ఉపశమనం పొందలేదు.

మూడు రోజుల తర్వాత వారిద్దరికీ వ్యాధి తాలూకు శారీరక లక్షణాలు పూర్తిగా మాయమయ్యాయి. అయినప్పటికీ భార్య తను గతంలో స్పష్టంగా దర్శించ గలిగే ఆధ్యాత్మిక జ్యోతిని ఏదో నల్లని పట్టి వంటిది మూసివేస్తూ చూడనివ్వకుండా చేస్తోందని  భావించారు. మార్చి 20నాటికి కేవలం రెండు వారాల చికిత్స తర్వాత వారిద్దరూ 100% కోలుకున్నారు మరియు భార్యకు అంతర్దృష్టి మెరుగయ్యింది. ఈ ఉత్సాహంతో వీరు ఇటీవల తను కనుగొన్న లెషర్ యాంటెనా చూపేటందుకు జూలై 14న ప్రాక్టీషనరును తమ ఇంటికి ఆహ్వానించారు.  వైబ్రేషన్ రెమిడీ #2 అప్పటికే తన క్రమాంకనం చేసే పరికరంలో అద్భుతంగా 150,000 -180,000 బోవిస్* కి పెరిగింది. పోలికను బట్టి చూస్తే ఆరోగ్యకరమైన మానవుడు 12,500 బోవిస్ (100,000 బోవిస్ లు ఉత్తమ మైన అధ్యాత్మిక శక్తులకు సూచిక) శక్తులను సూచిస్తుంది. ఈ జంటకు స్వామి గురించి ఒక్కసారి మాత్రమే చెప్పబడింది కానీ ఈ రెమిడీ యొక్క శక్తి శ్రీసత్య సాయి బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తి వల్ల మాత్రమే అని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అలాగే ఈ స్ప్రే ని  ఉపయోగించడం కొనసాగిస్తూనే ఉన్నారు.  

*బోవిస్ అనేది మానవ జీవన శక్తిని కొలవడానికి ఉపయోగించే ఒక ఫ్రీక్వెన్సీ స్కేల్.   

3.3 ఎముక విరుపుదల నొప్పి మందులేని బాధానివారణితో మటుమాయం 10228…ఇండియా

2021 ఫిబ్రవరి 2న ప్రాక్టీషనర్ యొక్క 92 ఏళ్ల తల్లి బాత్రూంలో పడిపోగా ఆమెను వెంటనే మంచము పైకి తరలించి ఆమె నుదుటి మీద విభూతి రాసి ప్రాక్టీషనరు CC10.1 Emergencies  ను నీటిలో కలిపి ఇచ్చారు. అతడు తన తన బంధువైన ఆర్థోపెడిక్ సర్జన్ ను పిలిపించగా అతను జెరోడల్ నొప్పి నివారణి సూచించారు. అలాగే ఒక టెక్నీషియన్ కూడా ఇంటికి వచ్చి  x రే తీసి ఎడమ తుంటి వద్ద ఎముక విరిగినట్లు తెలిపారు. పెద్ద వయసు కారణంగా ఆపరేషన్ చేయలేమని డాక్టరు సలహా ఇవ్వడము చేత  ప్రాక్టీషనరు క్రింది రెమిడీ ఇచ్చారు: CC10.1 Emergencies + CC20.6 Osteoporosis + CC20.7 Fractures... ప్రతీ 30 నిమిషాలకు నీటిలో ఒక మోతాదు

 ఇది అతని వృద్ధ తల్లికి నొప్పి నుండి ఎంతో ఉపశమనం ఇచ్చింది.  సాధారణ సర్జను ఐన మరొక బంధువు నొప్పి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని చూపమని రోగిని అడిగినప్పుడు అతనిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆమె నొప్పి లేదు అని సమాధానం చెప్పారు. సాధారణంగా విరిగిన తొడ ఎముక  చాలా బాధాకరంగా ఉంటుందని నొప్పి లేకుండా ఉండడానికి ఏ ఔషధం తీసుకుంటోందని అడిగారు. రోగి కేవలం వైబ్రో రెమిడీ మాత్రమే తీసుకోంటోందని చెప్పినప్పుడు ఇది  చాలా శక్తివంతమైనదై ఉండాలి లేకపోతే నొప్పి లేకుండా ఉండడం అసాధ్యం అని చెప్పారు. ఆమె మంచానికి మాత్రమే పరిమితం అయినప్పటికీ ఆమె వైబ్రోతప్ప ఇతర మందులు తీసుకోక పోయినా నొప్పి లేకుండా ఉండగలుగు తున్నారు.

4. ‘సంక్లిష్ట భూభాగంలో మోహరించిన దళాలకు హ్యాపీనెస్ ఔషధం 

దేశ సేవ నేపథ్యంలో తమ కుటుంబాల నుండి దూరంగా ఉంటూ శారీరక, మానసిక మరియు సంస్థాగత ఒత్తిడికి లోనవుతూ తమ జీవితంలో చాలా భాగం అత్యంత సంక్లిష్టమైన ప్రాంతాలలో నివసిస్తూ సేవలు  అందిస్తున్న సిబ్బందికి సహాయపడడం కోసం  ఒక అభ్యర్ధనను వైబ్రియానిక్స్ పరిపాలన విభాగము అందుకుంది.విధినిర్వహణ దృష్ట్యా ఇట్టి ప్రాంతాలలో ఒంటరిగా సుదీర్ఘమైన కాలం నివసిస్తూ తమ కళ్ల ముందే తమ సహచరులు తూటాలకు బలై మరణిస్తూ ఉంటే చావు తాలూకు భయం నీడలా వెన్నాడుతూ ఉంటుంది. ఫలితంగా ఆందోళన, భయము, ఒత్తిడి, మానసిక క్రుంగుబాటు, బాధ తాలూకు మానసిక రుగ్మత   వీరిని కొన్ని సమయాల్లో ఆత్మహత్యకు పురికొల్పుతూ ఉంటుంది.   

ధ్యాన సమయంలో స్వామి చేత మార్గనిర్దేశం చేయబడిన పరిశోధనా బృందం ఒక చక్కని రెమిడీ రూపొందించడానికి కృషి చేసింది:  NM95 Rescue Plus + BR3 Depression + BR4 Fear + BR7 Stress + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM39 Tension + SM41 Uplift. దీనికి హ్యాపీనెస్ అని పేరు పెట్టడం జరిగింది.

2020 అక్టోబర్ 29న ప్రారంభించి ఈ సైనిక దళాల వారు “హ్యాపీనెస్” రెమిడీ సీసాలను భౌతికంగా స్వీకరించే వరకు 9మంది SVPలు కాంబోలను ప్రసారం/బ్రాడ్ కాస్టింగ్  చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ప్లాస్టిక్ బాటిళ్ళు, చక్కెర గోళీలు, 30మిల్లీ లీటర్ల ద్రవ రెమిడీ గల డ్రాపర్ బాటిళ్ళు సరఫరా చేయడం ప్రారంభించింది. 18 మంది వ్యక్తులకు వైబ్రియానిక్స్ గురించి పరిచయం చేయడానికి డిసెంబర్ 26న విర్ట్చువల్ ట్రైనింగ్ నిర్వహించారు. సేనా దళాలకు ఇవ్వడానికి ఈ రెమిడీలను ఎలా తయారు చేయాలి, రెమిడీ యొక్క మోతాదు, వాటిని తీసుకోవడానికి జాగ్రత్తలు, ఎలా నిల్వ చెయ్యాలో తెలుపుతూ ఒక ప్రదర్శన కూడా ఇవ్వబడింది. కేవలం 30 రోజుల వ్యవధిలో రెమిడీ తీసుకున్న 8013 మందిలో ప్రతీ ఒక్కరు 100% ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.  రెండవ సారి కూడా వారి ప్రతిపాదన మేరకు రెమిడీల రవాణాకు సిద్ధంగా ఉండడమే కాక సైనికుల ఇతర సమస్యల కోసం డిమాండు కూడా పెరిగిందని తెలపడానికి ఆనందంగా ఉంది. 

5.  జ్ఞాపకార్థం

స్వామి ఆనంద తో పాటు(అగ్గర్వాల్ గారి డెస్క్ నుండి లో చూడండి) వారి మలి జీవితాన్ని వైబ్రియానిక్స్ సేవకే పూర్తిగా అంకితం చేసి ఇటు ప్రాక్టీషనర్లకు మరియు రోగులకు కూడా గొప్ప ప్రేరణగా నిలిచిన ఇద్దరు విలువైన ప్రాక్టీషనర్లకు వీడ్కోలు చెప్పడం జరిగింది.  వీరిద్దరూ తమ అద్భుతమైన సేవా వారసత్వాన్ని మనకు విడిచిపెట్టి వెళ్లారు.   

శ్రీ లక్ష్మీ కాంత్ శరద్ కొన్నూర్ 02836 (వీరి ప్రొఫైల్ సంపుటి 10 సంచిక 3 లో ఇవ్వబడింది). మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీ లక్ష్మి కాంత్ గారు 2020 డిసెంబరులో కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత 2021 జనవరిలో వారి 72వ జన్మదినోత్సవం నకు కొన్ని రోజుల ముందు కన్ను మూశారు. జిల్లాలోని ప్రాక్టీషనర్లు అందరూ వారి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందినవారే.  పన్నెండు సంవత్సరాల క్రితం తన భర్తతో కలిసి శిక్షణ పొంది వైబ్రియానిక్స్ సాధన కొనసాగిస్తున్న వీరి శ్రీమతి ప్రాక్టీషనర్ 10648 కి మా హృదయ పూర్వక సంతాపం తెలియ చేస్తున్నాము.  

శ్రీ సురేష్ చక్రవర్తి 10132 అస్సాం లో గౌహతి ప్రాంతానికి చెందిన శ్రీ సురేష్ చక్రవర్తి 2020 ఆగస్టు 18న 87 సంవత్సరాల వయసులో శాంతియుతంగా కన్నుమూసే వరకూ చురుకుగా సేవ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పదవీ విరమణ చేసిన తర్వాత సాయి సంస్థలో జిల్లా సమన్వయకర్తగా చాలా సంవత్సరాలు పనిచేశారు.