దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 12 సంచిక 2
March / April 2021
“ఆధ్యాత్మిక (వ్యక్తిగత) దుఃఖము అనేది మానవ శరీరం పై నివసించే లెక్కలేనన్ని సూక్ష్మజీవులు మరియు ఇతర పరాన్నజీవుల వలననే కలుగుతుంది. ఈ వ్యాధిని ప్రేరేపించే కారకాలనుండి ఎవరు తప్పించుకోలేరు. కానీ ప్రేమను వృద్ధి చేసి వ్యాప్తి చేస్తూ అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండడం, ప్రేమ మరియు కరుణ వంటి భావాలను అభివృద్ధి పరుచుకోవడం ద్వారా ఈ దుఃఖాన్ని సులభంగా అధిగమించవచ్చు. శారీరక మరియు మానసిక అనారోగ్యం అనేది మనసులోని మాలిన్యాలు శరీరంపై ప్రతిచర్య మాత్రమే. పవిత్రమైన మనసు మాత్రమే నిరంతర ఆరోగ్యమును నిర్ధారిస్తుంది. చెడు అనేది అనారోగ్యానికి హేతువు. చెడు ఆలోచనలు, అలవాట్లు, ఆహారం దుస్సంగము, అనేవి వ్యాధిని వృద్ధి చెందించే కారకాలు. ఆరోగ్యము మరియు ఆనందము చెట్టాపట్టాలు వేసుకొని ప్రయాణిస్తాయి.
... శ్రీ సత్య సాయి బాబా దివ్య వాణి,”మూడు దుఃఖాలు” 1980 జూలై 13 http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-51.pdf
“సేవ చేయడంలో మీ మనస్సాక్షి యొక్క సంతృప్తి కోసం మీరు దీన్ని చేస్తున్నానని మరియు ఇతరుల మెప్పు కోసం కాదని గ్రహించాలి. ఇట్టి సేవను దైవానికి నైవేద్యంగా భావించి భక్తితో పరిపూర్ణంగా చేయండి. మీ ప్రతీ చర్యను దేవుడు చూస్తున్నాడు అని గుర్తుంచుకోండి. మీరు చేసే పనులను పరిశీలించడానికి మీరు కాపలాదారుగా ఉండండి. మీ ఆత్మసాక్షికి అనుగుణంగా మీ ఆచరణ ఉన్నప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కార బాటలో సవ్యంగా ప్రయాణిస్తున్నట్లే భావించవచ్చు.”
... శ్రీ సత్య సాయి బాబా దివ్య వాణి “ప్రేమ పూర్వక సేవ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పై ఉపన్యాసం” 21 నవంబర్ 1995 http://www.sssbpt.info/ssspeaks/volume28/sss28-34.pdf