Vol 11 సంచిక 4
July/August 2020
అవలోకనం
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
డాక్టర్ అగర్వాల్ గారు గురు పూర్ణిమ సందర్భంగా స్వామితో తమకున్న మరుపురాని మధుర క్షణాలను, వైబ్రియానిక్సుకు స్వామి అందించిన ఆశీర్వచనాలను పునరావలోకనం చేసుకుంటూ మనతో అట్టి విషయాలు పంచుకున్నారు. దీనితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్లు కోవిడ్-19 నివారణ ముందస్తు చర్యలలో భాగంగా ఇమ్యూనిటీ బూస్టర్ను రోగులకు అందించడంలో వారి కృషిని అంతేకాక ఇటీవల ఏర్పడిన కొన్ని నూతన పరిణామాలను ఉదహరించారు!
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
10 ఆసక్తికరమైన, ప్రేరణాత్మకమైన రోగ చరిత్రలు ఈ లేఖలో ప్రస్తావించబడ్డాయి: వంధ్యత్వము, నోటి క్యాన్సర్, హెచ్.ఐ.వి, ద్వైపాక్షిక ధృడతర స్నాయువులు, మొటిమల రుగ్మత, ముఖముపై మంట, మోకాలి మృదులాస్థి గాయము, తొడకండరములలో గాయము, పగలు రాత్రి రోగులతో ఉన్న కారణంగా ఒక ఆరోగ్య కార్యకర్తకు సోకిన కోవిడ్-19, గర్భధారణ సమయంలో కోవిడ్-19, చిన్నప్పటి నుండీ ఆస్త్మాతో బాధ పడుతున్న రోగికి కోవిడ్-19 కలగడం, దగ్గు కోవిడ్-19 అనంతర చికిత్స, అరికాలి మంట మలబద్ధకము వంటి రోగాలు అరికట్టబడిన విధానం వివరించ బడింది.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
వైబ్రియానిక్స్ తో అద్భుతమైన ప్రేరణాత్మక మైన ఫలితాలు కనబరచిన ఇద్దరు అంకితభావంగల ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. మొదటివారు గృహిణి గా ఉంటూ ప్రేమతో సేవ చేస్తూ వెయ్యి మందికి పైగా రోగులకు వివిధ రకాల రోగాలకు ముఖ్యంగా హెచ్.ఐ.వి నివారణ, వంద మందికి పైగా రోగులకు క్యాన్సర్ నయం చేయడం, 25 మందికి డయాబెటిస్, 15 మందికి వంధ్యత్వ నివారణ గావించిన ప్రాక్టీషనర్ గురించి పేర్కొనబడింది. ఈమెకు ఇవే కాక అనేక ప్రేరణాత్మక మైన అనుభవాలు కూడా ఉన్నాయి. మరొకరు నర్సు గాను మత్తు ఇచ్చే టెక్నీషియన్ గాను నాలుగు దశాబ్దాలకు పైగా ఆస్పత్రులలో అనేక సేవలందించిన ప్రాక్టీషనర్. ఈమె వైబ్రియానిక్సును తను చేస్తున్న పనితో మిళితం చేస్తూ ఆసుపత్రులలో దాదాపు వెయ్యి మందికి పైగా రోగులకు చికిత్స చేసిన తీరు అద్భుతమైనది!
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
విషయ ఆకళింపు కోసం చదవండి: కోవిడ్-19 కోసమై ఒక వ్యక్తి ముందస్తుగా హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు అతనికి వైబ్రియానిక్స్ కూడా ఇవ్వవచ్చా, లక్షణాలేవీ కనిపించని రోగికి ముందస్తుగా ఇచ్చే రెమిడి మోతాదు పెంచితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా; ఇమ్యూనిటీ బూస్టర్లను పెద్ద మొత్తంలో తయారుచేయడానికి సులువైన విధానము; బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఒక వ్యక్తికి ఉపయోగించిన రెమిడీని అదే లక్షణాలు గల మరొక రోగికి ఉపయోగించవచ్చా; ఒకే మూత్రపిండము గల రోగిపై వైబ్రియానిక్స్ ప్రభావము; ఆటిజం మరియు ADHD గల చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులపై వైబ్రియానిక్స్ ప్రభావము !
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
ఎందుకు హితకరమైన ఆహారం తీసుకోవాలి సమాజ సేవ చేయడంలో ఉన్న ఔచిత్యం గురించి స్వామి ప్రేమతో తెలియజేశారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
భవిష్యత్తులో నిర్వహించబోయే (ఆన్లైన్) వర్కు షాపులు మరియు శిబిరాలు ప్రవేశ విధానము, మరియు ఈ-కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు 2020 లో ఇండియా, బ్రిటన్ మరియు అమెరికా లో నిర్వహింపబోయే శిబిరాల గురించి ప్రస్తావించ బడినది. పునశ్చరణ తరగతులు ప్రస్తుతం ప్రాక్టీషనర్లుగా ఉన్న వారికి మాత్రమే ఉంటాయి.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
ఆరోగ్య వ్యాసము “కన్నులు ఎంతో అమూల్యమైనవి: తగు జాగ్రత్త వహించండి” లో సాధారణ దృష్టి మరియు సాధారణ కంటి పీడనము, అనేక కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు మరియు రుగ్మతలు గురించి తెలియజేయబడినది. కంటికి గాయం అనంతరం చేయవలసిన మరియు చేయకూడనివి గురించి తెలియ చేయబడినది. కొన్ని సరళమైన కంటి అభ్యాసాల ద్వారా కంటి దృష్టి ని ఎలా పెంపొందించుకోవాలి కంటికి ఎలా విశ్రాంతిని ఇవ్వాలి అనేది తెలియజేయబడింది. ఇంకా కంటికి పుష్టికరమైన ఆహారము, కనుదృష్టి మెరుగుకు చిట్కాలు ముఖ్యంగా డిజిటల్ పరికరాలతో పనిచేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రస్తావించబడింది. ఇవేకాక కొవిడ్- 19 పై రెండు ప్రేరణాత్మక వృత్తాంతములు ప్రస్తావించబడ్డాయి. వీటిలో ఒకటి స్లోవేనియా దేశానికి చెందినది కాగా మరొకటి అమెరికాకు చెందిన నా భక్తునిపై ఇమ్యూనిటీ బూస్టర్ యొక్క ప్రభావం గురించి ప్రస్తావించబడింది. చివరిగా ఢిల్లీ ఎన్సీఆర్ వైబ్రియానిక్స్ బృందం నిర్వహించిన ఆన్లైన్ వర్క్ షాప్ గురించి ప్రస్తావింపబడింది.
పూర్తి వ్యాసం చదవండి