Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 11 సంచిక 4
July/August 2020


ప్రియమైన ప్రాక్టీషనర్లారా,

సాయి భక్తులందరికీ అత్యంత పవిత్రమైన ఈ గురుపూర్ణిమ సందర్భంలో ఈ విధంగా మీకు రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సాయి వైబ్రియానిక్స్ మిషనుకు సంబంధించి నంతవరకు ఒక మధురానుభూతిని అందించిన రోజు. స్వామి భౌతిక రూపంలో ఉన్నప్పుడు మేము వారికి వైబ్రియానిక్స్  వార్షిక పురోగతి నివేదికను సమర్పించి దానితోపాటు కేకును కూడా సమర్పించిన సందర్భంలో స్వామి ఎంతో ప్రేమతో దానిని కట్ చేసి అక్కడ ఉన్న ప్రాక్టీషనర్లకు  ప్రసాదంగా పంపిణీ చేసేవారు. శారీరక దూరం అనే నియమం ప్రశాంతి నిలయం లోకఠినంగా అమలు చేస్తూ ఉన్నఈ కాలంలో ప్రార్థనల తీవ్రత నాటకీయంగా బాగా పెరిగింది. ఆన్లైన్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారములను పెంచడం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ప్రార్థనలు మరియు ఇంటరాక్టివ్ చర్చలను మునుపెన్నడూ లేని విధంగా కలిసి చేస్తున్నారు. స్వామి ఇలా చెప్పారు మీరు భగవంతుని నామాన్ని పగలు రాత్రి అనే తేడా లేకుండా స్మరిస్తూ ఉండండి అది ఒక్కటే మిమ్మల్ని ఎప్పటికీ  రక్షిస్తూ ఉంటుంది.ఏ విధంగా ఐతే  గాలి సర్వ వ్యాప్తమై ఉందో అదేవిధంగా దేవుడు మీతో మీ చుట్టూ మీ క్రింద మీ పైన కూడా ఉన్నారు అందువల్ల మీరు నిరంతరం దైవత్వంతో కూడి ఉండాలిశ్రీ సత్య సాయి బాబా దివ్యవాణి గురుపూర్ణిమ 21-7-2005 ప్రశాంతి నిలయం. సందర్భోచితమైన ఈ విషయాన్ని అభ్యాసకులు మరియు వారి రోగులు ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని ఈ సంక్లిష్ట కాలంలో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 

మీ అందరికీ తెలుసు కోవిడ్-19 ప్రపంచమంతటా అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ రంగాల్లో వినాశనం సృష్టిస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ మహమ్మారికి ఎక్కువగా ప్రభావితం అయ్యేది ఎటువంటి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మరియు సౌకర్యాలు లేని బలహీన వర్గాలు. వీరిని ప్రాక్టీషనర్లు శారీరకంగా కలుసుకొని చికిత్స చేయడం చాలా కష్టంగా ఉన్నప్పటికీమా ఎస్ వి పి లు అందరూ బ్రాడ్ కాస్టింగ్ చేయడం ద్వారా ఈ భూ గ్రహానికి, అలాగే కొవిడ్-19 బారినపడిన రోగులకు నయం చేసే ప్రయత్నాలు కొనసాగించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇతర ప్రాక్టీషనర్లు ఎంతోమంది ఇప్పుడు వారి రోగులకు రెమిడీలను పోస్టు చేయడం ద్వారా వారి గమ్యస్థానాలకు పంపిస్తూ ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితులను బట్టి అనేకమంది ప్రాక్టీషనర్లు ఇళ్లకే పరిమితం అయిన సందర్భంలో ఇప్పుడు వర్చువల్ (ఆన్లైన్) సమావేశాల విషయంలో గణనీయమైన పెరుగుదల ఉందన్న విషయం తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే అక్కడ ప్రాక్టీషనర్లు పక్షానికి ఒకసారి ఆన్లైన్ ద్వారా కలుసుకుని తమ అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు, ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి, తమ యొక్క జ్ఞానం పెంపొందించుకోవడానికి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్తాలేఖల యొక్క గత సంచికల నుండి కేసు చరిత్రలను మరియు 108 సిసి పుస్తకం నుండి రెమిడీలను గురించి చర్చించడం ద్వారా వారు తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. మా కోఆర్డినేటర్ 12051, అభిప్రాయం ప్రకారము ఈ రెగ్యులర్ ఆన్లైన్ సమావేశాలు అభిప్రాయాలను మార్పిడి చేయడానికి, ప్రతీ అంశాన్ని వివరంగా అధ్యయనం చేయడానికి, మరియు విభిన్న కోణాల నుండి విషయాలను నేర్చుకోవడానికి ఒక చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నాయి.

ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికీ అదే సందర్భంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఒక సమాఖ్య లాగా ఏర్పడి జత అయ్యే వ్యూహాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను ప్రాక్టీషనర్లకు ధృఢంగా నొక్కి వక్కాణిస్తున్నాను. ఉదాహరణకు ఫ్రాన్స్ మరియు గ్యాబన్ దేశాలలోని ఫ్రెంచ్ మాట్లాడే ప్రాక్టీషనర్లలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్న వారిని తక్కువ భాష మరియు నిర్వాహక నైపుణ్యాలు కలిగిన ఇతరులతో జత చేస్తున్నారు. ఫ్రెంచ్ సమన్వయ కర్త వారి ఆన్లైన్ సమావేశాలను మునుపటి త్రైమాసిక సమావేశాలకు బదులుగా  ఇప్పుడు నెలవారీగా మార్చారు.

కోవిడ్19 కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రాక్టీషనర్లు పాజిటివ్ వచ్చిన పేషంట్లకు లేదా అట్టి లక్షణాలు కలిగిన రోగులకు చికిత్స ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వారి రోగ లక్షణాలు నుండి విముక్తి పొందారనే వార్తలను మన ప్రాక్టీషనర్ల నుండి నివేదికల రూపంలో స్వీకరించడం ఎంతో హృదయపూర్వక ఆనందాన్ని అందిస్తోంది. ఇమ్యూనిటీ బూస్టర్ పంపిణీ కార్యక్రమంలో హృదయపూర్వక మరియు అంకితభావంతో చేసిన కృషికి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ప్రాక్టీషనర్లు అందరూ చురుకైన విధానముతో మరియు సత్యసాయి సేవా సంస్థ యొక్క మద్దతుతో భారతదేశంలో గత నెల చివరి నాటికి 34,500 ఇమ్యూనిటీ బూస్టర్  రెమెడీలను పంపిణీ చేయడము ద్వారా 1,03,500 మందికి ప్రయోజనం చేకూర్చారు. ఇది గత రెండు నెలల పంపిణీ కంటే 40% అధికం. ఆశ్రమంలోఉన్న ప్రాక్టీషనర్ 11604 షెడ్ లో నివసించే వృద్ధులకు, ఇతర ఆశ్రమ వాసులకు, మరియు సేవాదళ్ సభ్యులకు ఈ రెమెడీలను పంపిణీ చేస్తున్నారు. ఆమె ఇటీవలే 2020 మే 27వ తేదీన 98వ ఏట స్వర్గస్తులైన తన తండ్రిఐన ప్రాక్టీషనర్ 00759 అడుగు జాడలను అనుసరిస్తున్నారు. ఇతను ఎంతో అంకితభావంతో పనిచేసే వారు మరియు అతని చివరి క్షణాల వరకూ చురుగ్గా ఉన్నారు. పుట్టపర్తిలో గత 20 ఏళ్లకు పైగా అనేక మంది రోగులకు చికిత్స చేయడంతో ఆయన గురించి మనకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి.

వైరస్ వేగంగా పరివర్తన (మ్యుటేషన్) చెందటం మరియు దాని ప్రభావిత కేంద్రాలు తరచూ మారుతూ ఉండడం వలన రాబోయే రెండు నెలలు కీలకం అవుతాయని నేను విన్నాను. ఈ వ్యాధిని తగ్గించడానికి మరియు కోవిడ్ 19 చేత ప్రభావితమైన వారికి చికిత్స చేయడానికి సమర్థవంతమైన మరియు సమయానుకూల ప్రతిస్పందన అందించాలి. మా పరిశోధనా బృందం వైరస్ యొక్క పరివర్తన మరియు వ్యాప్తికి సంబంధించిన పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నారన్న విషయం ఇక్కడ ఉదహరించాలి. కేస్ హిస్టరీ లను మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రాక్టీషనర్ల ఫీడ్బ్యాక్ అధ్యయనం చేయడం ద్వారా వారు ఈ విధంగా చేయగలుగుతున్నారు. అదే విధంగా కేసుల ఫలితాలపై నవీనీకరణలను అవి ఎంత సరళమైనవి అయినా సరే పంపడం కొనసాగించాలని ప్రాక్టీషనర్లు అందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి.

గురుపూర్ణిమ ప్రత్యేకమైన రోజు అనగా జూలై 5వ తేదీన మేము మా ప్రధాన వెబ్ సైట్ http://vibrionics.org ను కొత్త మరియు మెరుగైన హంగులతో తిరిగి ప్రారంభించబోతున్నఉత్సాహభరిత విషయాన్ని మీతో పంచుకుంటూ ముగించబోతున్నాను. ప్రాక్టీషనర్లు 03560 & 03531 యొక్క సాంకేతిక సహకారంతో ప్రాక్టీషనర్ 11964 సన్నిహితంగా పనిచేయడం ద్వారా ప్రాక్టీషనర్ 03518 తన సృజనాత్మకత, మరియు అంకితభావముతో తీర్చిదిద్దారు.  వీరి కృషిని ఎంతో అభినందిస్తున్నాము.

ప్రేమతో సాయిసేవలో మీ

జిత్ కె అగ్గర్వాల్