దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 11 సంచిక 4
July/August 2020
“ ఆహారాన్నివానప్రస్తాశ్రమ దీక్షగల భావనలో ఉన్నవారు అంత ప్రాముఖ్యత గల దానిగా పరిగణించరు. అనగా దానిపై దృష్టి పెట్టడానికి అర్హత లేని దానిగా భావిస్తారు. కానీ శరీరం మరియు మనసు పరస్పరఆధారితములు కనుక దాని పట్ల నిర్లక్ష్యం వహించడం శ్రేయస్కరం కాదు. ఆహారము బట్టి మనసు, మనసును బట్టి ఆలోచన, ఆలోచన బట్టి చర్య ఉంటుంది కనుక ఆహారం అనేది ఒక ముఖ్యమైన అంశం. ఆహారము అనేది అప్రమత్తత మరియు నిర్లక్ష్యం, ఆందోళన మరియు ప్రశాంతత, ప్రకాశము మరియు నిస్తేజమును నిర్ణయిస్తుంది. ”
... శ్రీ సత్య సాయి బాబా, “ఆహారము మరియు ఆరోగ్యము” దివ్యవాణి 21 సెప్టెంబర్ 1979 http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf
“ సేవ అనేది సమాజానికి ఏమి ఇవ్వాలి అనే అవగాహన నుండి ముందుకు సాగాలి. ఒకరి పేరు, కీర్తిప్రతిష్టలు, తాను అనుభవించే ఇతర సర్వ సౌఖ్యాలు, సమాజం నుండి ఆవిర్భవించినవే. సమాజం ద్వారానే సఫలీకృతం సాధిస్తాడు. అటువంటి స్థితిలో సమాజానికి సేవ చేయకపోతే అతను మరి ఇంకెవరికి సేవ చేయగలడు. మానవుడు అనుభవిస్తున్న అన్ని ప్రయోజనాలకు మూలం అయిన సమాజానికి సేవ చేయాలనే పరిపూర్ణ కృతజ్ఞత సమాజం కోరుతుంది. కృతజ్ఞత లేని మనిషి అడవి జంతువుల కన్నా హీనం. ”
... సత్యసాయిబాబా, “సేవ యొక్క విశిష్టత” దివ్య వాణి 1988 నవంబర్ 21 http://www.sssbpt.info/ssspeaks/volume21/sss21-31.pdf