Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 11 సంచిక 4
July/August 2020
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లారా,

సాయి భక్తులందరికీ అత్యంత పవిత్రమైన ఈ గురుపూర్ణిమ సందర్భంలో ఈ విధంగా మీకు రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సాయి వైబ్రియానిక్స్ మిషనుకు సంబంధించి నంతవరకు ఒక మధురానుభూతిని అందించిన రోజు. స్వామి భౌతిక రూపంలో ఉన్నప్పుడు మేము వారికి వైబ్రియానిక్స్  వార్షిక పురోగతి నివేదికను సమర్పించి దానితోపాటు కేకును కూడా సమర్పించిన సందర్భంలో స్వామి ఎంతో ప్రేమతో దానిని కట్ చేసి అక్కడ ఉన్న ప్రాక్టీషనర్లకు  ప్రసాదంగా పంపిణీ చేసేవారు. శారీరక దూరం అనే నియమం ప్రశాంతి నిలయం లోకఠినంగా అమలు చేస్తూ ఉన్నఈ కాలంలో ప్రార్థనల తీవ్రత నాటకీయంగా బాగా పెరిగింది. ఆన్లైన్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారములను పెంచడం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ప్రార్థనలు మరియు ఇంటరాక్టివ్ చర్చలను మునుపెన్నడూ లేని విధంగా కలిసి చేస్తున్నారు. స్వామి ఇలా చెప్పారు మీరు భగవంతుని నామాన్ని పగలు రాత్రి అనే తేడా లేకుండా స్మరిస్తూ ఉండండి అది ఒక్కటే మిమ్మల్ని ఎప్పటికీ  రక్షిస్తూ ఉంటుంది.ఏ విధంగా ఐతే  గాలి సర్వ వ్యాప్తమై ఉందో అదేవిధంగా దేవుడు మీతో మీ చుట్టూ మీ క్రింద మీ పైన కూడా ఉన్నారు అందువల్ల మీరు నిరంతరం దైవత్వంతో కూడి ఉండాలిశ్రీ సత్య సాయి బాబా దివ్యవాణి గురుపూర్ణిమ 21-7-2005 ప్రశాంతి నిలయం. సందర్భోచితమైన ఈ విషయాన్ని అభ్యాసకులు మరియు వారి రోగులు ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని ఈ సంక్లిష్ట కాలంలో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 

మీ అందరికీ తెలుసు కోవిడ్-19 ప్రపంచమంతటా అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ రంగాల్లో వినాశనం సృష్టిస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ మహమ్మారికి ఎక్కువగా ప్రభావితం అయ్యేది ఎటువంటి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మరియు సౌకర్యాలు లేని బలహీన వర్గాలు. వీరిని ప్రాక్టీషనర్లు శారీరకంగా కలుసుకొని చికిత్స చేయడం చాలా కష్టంగా ఉన్నప్పటికీమా ఎస్ వి పి లు అందరూ బ్రాడ్ కాస్టింగ్ చేయడం ద్వారా ఈ భూ గ్రహానికి, అలాగే కొవిడ్-19 బారినపడిన రోగులకు నయం చేసే ప్రయత్నాలు కొనసాగించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇతర ప్రాక్టీషనర్లు ఎంతోమంది ఇప్పుడు వారి రోగులకు రెమిడీలను పోస్టు చేయడం ద్వారా వారి గమ్యస్థానాలకు పంపిస్తూ ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితులను బట్టి అనేకమంది ప్రాక్టీషనర్లు ఇళ్లకే పరిమితం అయిన సందర్భంలో ఇప్పుడు వర్చువల్ (ఆన్లైన్) సమావేశాల విషయంలో గణనీయమైన పెరుగుదల ఉందన్న విషయం తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే అక్కడ ప్రాక్టీషనర్లు పక్షానికి ఒకసారి ఆన్లైన్ ద్వారా కలుసుకుని తమ అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు, ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి, తమ యొక్క జ్ఞానం పెంపొందించుకోవడానికి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్తాలేఖల యొక్క గత సంచికల నుండి కేసు చరిత్రలను మరియు 108 సిసి పుస్తకం నుండి రెమిడీలను గురించి చర్చించడం ద్వారా వారు తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. మా కోఆర్డినేటర్ 12051, అభిప్రాయం ప్రకారము ఈ రెగ్యులర్ ఆన్లైన్ సమావేశాలు అభిప్రాయాలను మార్పిడి చేయడానికి, ప్రతీ అంశాన్ని వివరంగా అధ్యయనం చేయడానికి, మరియు విభిన్న కోణాల నుండి విషయాలను నేర్చుకోవడానికి ఒక చక్కని వేదికగా ఉపయోగ పడుతున్నాయి.

ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికీ అదే సందర్భంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఒక సమాఖ్య లాగా ఏర్పడి జత అయ్యే వ్యూహాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను ప్రాక్టీషనర్లకు ధృఢంగా నొక్కి వక్కాణిస్తున్నాను. ఉదాహరణకు ఫ్రాన్స్ మరియు గ్యాబన్ దేశాలలోని ఫ్రెంచ్ మాట్లాడే ప్రాక్టీషనర్లలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్న వారిని తక్కువ భాష మరియు నిర్వాహక నైపుణ్యాలు కలిగిన ఇతరులతో జత చేస్తున్నారు. ఫ్రెంచ్ సమన్వయ కర్త వారి ఆన్లైన్ సమావేశాలను మునుపటి త్రైమాసిక సమావేశాలకు బదులుగా  ఇప్పుడు నెలవారీగా మార్చారు.

కోవిడ్19 కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రాక్టీషనర్లు పాజిటివ్ వచ్చిన పేషంట్లకు లేదా అట్టి లక్షణాలు కలిగిన రోగులకు చికిత్స ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వారి రోగ లక్షణాలు నుండి విముక్తి పొందారనే వార్తలను మన ప్రాక్టీషనర్ల నుండి నివేదికల రూపంలో స్వీకరించడం ఎంతో హృదయపూర్వక ఆనందాన్ని అందిస్తోంది. ఇమ్యూనిటీ బూస్టర్ పంపిణీ కార్యక్రమంలో హృదయపూర్వక మరియు అంకితభావంతో చేసిన కృషికి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ప్రాక్టీషనర్లు అందరూ చురుకైన విధానముతో మరియు సత్యసాయి సేవా సంస్థ యొక్క మద్దతుతో భారతదేశంలో గత నెల చివరి నాటికి 34,500 ఇమ్యూనిటీ బూస్టర్  రెమెడీలను పంపిణీ చేయడము ద్వారా 1,03,500 మందికి ప్రయోజనం చేకూర్చారు. ఇది గత రెండు నెలల పంపిణీ కంటే 40% అధికం. ఆశ్రమంలోఉన్న ప్రాక్టీషనర్ 11604 షెడ్ లో నివసించే వృద్ధులకు, ఇతర ఆశ్రమ వాసులకు, మరియు సేవాదళ్ సభ్యులకు ఈ రెమెడీలను పంపిణీ చేస్తున్నారు. ఆమె ఇటీవలే 2020 మే 27వ తేదీన 98వ ఏట స్వర్గస్తులైన తన తండ్రిఐన ప్రాక్టీషనర్ 00759 అడుగు జాడలను అనుసరిస్తున్నారు. ఇతను ఎంతో అంకితభావంతో పనిచేసే వారు మరియు అతని చివరి క్షణాల వరకూ చురుగ్గా ఉన్నారు. పుట్టపర్తిలో గత 20 ఏళ్లకు పైగా అనేక మంది రోగులకు చికిత్స చేయడంతో ఆయన గురించి మనకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి.

వైరస్ వేగంగా పరివర్తన (మ్యుటేషన్) చెందటం మరియు దాని ప్రభావిత కేంద్రాలు తరచూ మారుతూ ఉండడం వలన రాబోయే రెండు నెలలు కీలకం అవుతాయని నేను విన్నాను. ఈ వ్యాధిని తగ్గించడానికి మరియు కోవిడ్ 19 చేత ప్రభావితమైన వారికి చికిత్స చేయడానికి సమర్థవంతమైన మరియు సమయానుకూల ప్రతిస్పందన అందించాలి. మా పరిశోధనా బృందం వైరస్ యొక్క పరివర్తన మరియు వ్యాప్తికి సంబంధించిన పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నారన్న విషయం ఇక్కడ ఉదహరించాలి. కేస్ హిస్టరీ లను మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రాక్టీషనర్ల ఫీడ్బ్యాక్ అధ్యయనం చేయడం ద్వారా వారు ఈ విధంగా చేయగలుగుతున్నారు. అదే విధంగా కేసుల ఫలితాలపై నవీనీకరణలను అవి ఎంత సరళమైనవి అయినా సరే పంపడం కొనసాగించాలని ప్రాక్టీషనర్లు అందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి.

గురుపూర్ణిమ ప్రత్యేకమైన రోజు అనగా జూలై 5వ తేదీన మేము మా ప్రధాన వెబ్ సైట్ http://vibrionics.org ను కొత్త మరియు మెరుగైన హంగులతో తిరిగి ప్రారంభించబోతున్నఉత్సాహభరిత విషయాన్ని మీతో పంచుకుంటూ ముగించబోతున్నాను. ప్రాక్టీషనర్లు 03560 & 03531 యొక్క సాంకేతిక సహకారంతో ప్రాక్టీషనర్ 11964 సన్నిహితంగా పనిచేయడం ద్వారా ప్రాక్టీషనర్ 03518 తన సృజనాత్మకత, మరియు అంకితభావముతో తీర్చిదిద్దారు.  వీరి కృషిని ఎంతో అభినందిస్తున్నాము.

ప్రేమతో సాయిసేవలో మీ

జిత్ కె అగ్గర్వాల్

 

 

 

వంధ్యత్వము 11975...India

2018 మే 17 వ తేదీన 32-సంవత్సరముల మహిళ మరియు ఆమె 35 ఏళ్ల భర్త వివాహం చేసుకున్న గత ఎనిమిది సంవత్సరాలుగా సంతానలేమితో బాధపడుతూ ప్రాక్టీషనర్ని సందర్శించారు. భార్యకు 20 సంవత్సరాల వయసులో క్రమరహిత రుతుచక్రం ప్రారంభమై మొదట రెండు మూడు నెలలకు ఒకసారి ఇది క్రమంగా సంవత్సరానికి ఒకసారి ఏర్పడ సాగింది. నాలుగేళ్ల క్రితం వారి వైద్యుడిని సంప్రదించగా భార్యకు PCOD క్రమ రహిత ఋతు సమస్య మరియు భర్తకు వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండే సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిద్దరూ వైద్యులు సూచించిన మందులను నాలుగు సంవత్సరాలు వాడినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. సంవత్సరం క్రితం 2017లో భర్త రోజంతా అలసటతో ఉంటున్నందున తనను తాను తనిఖీ చేయించుకోగా హైపో థైరాయిడ్ (TSH 12 mlU/L ఉంది దీని సాధారణ స్థాయి 0.4 నుండి 4.0మాత్రమే) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అతను ఏ ఇతర ఔషధములు తీసుకోక ప్రత్యామ్నాయ ఔషధం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక సంవత్సరం తర్వాత అతను వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు అతని 12 ఉంది. వీరికి క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి.

భార్యకు :

#1. CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD

భర్తకు:

#2. CC6.2 Hypothyroid + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC14.3 Male infertility + CC15.1 Mental & Emotional tonic…6TD

మూడు రోజుల్లో భార్యకు (సంవత్సర విరామం తర్వాత) నెలసరి వచ్చింది ఇది తరువాత రెండు నెలలు క్రమం తప్పకుండా వచ్చింది. ఆ తరువాత ఈ జంట సురక్షితమైన గర్భధారణ కోసం ప్రాక్టీషనర్ని సందర్శించారు. కనుక #1 స్థానంలో క్రింది రెమిడి ఇవ్వబడింది:

#3. CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS

భర్తకు రెమిడీ తీసుకున్న నెలలోపే థైరాయిడ్ సాధారణ స్థాయికి (TSH 3 mlU/L) చేరడం, శక్తి స్థాయిలో మెరుగుదల ఏర్పడినందువలన #2 యొక్క మోతాదు QDSకు తగ్గించబడింది.

2018 ఆగష్టు నెలలో భార్య గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయ్యి 2019 ఏప్రిల్ 15 న చక్కని శిశువుకు జన్మ నిచ్చింది. కనుక రెండు నెలల తరువాత #3ను ఆపివేసారు. భర్తకు TSH సాధారణ స్థాయిలోనే కొనసాగడంతో #2 క్రమంగా తగ్గిస్తూ 2020 జూన్  20 న ఆపివేసారు. భార్య ప్రాక్టీషనర్తో సన్నిహితంగా ఉంటూ ప్రస్తుతం జుట్టు రాలడం తగ్గడం కోసం రెమిడీ వాడుతున్నది.

నోటి క్యాన్సరు 11975...India

2013 ఫిబ్రవరి లో 40 ఏళ్ల వ్యక్తికి నోటి క్యాన్సర్ మూడవ స్టేజి ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యి కీమోథెరపీ అనంతరం 2013 ఏప్రిల్ 24న శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ అతనికి క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో ఆరు నెలలు మించి బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పారు. వ్యాధికి బలికావడానికి మనస్కరించక తనకున్న స్వల్ప ఆర్థిక వనరులతో ముగ్గురు పిల్లలను చూసుకోవలసిన బాధ్యత ఉన్నందున 2013 ఆగస్టు 23న ప్రాక్టీషనర్ని సందర్శించారు. ఆమె AVP గా అర్హత సాధించిన ఆరు నెలల తర్వాత ఆమె మొదటి క్యాన్సర్ రోగి ఇతడే. రోగి చాలా బాధలో ఉన్నట్లు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఆమె కనుగొన్నారు. అతని నోటి నుండి చీము కారుతూ అతను స్పష్టంగా మాట్లాడ లేక పోతున్నాడు. అంతేకాక అతను 4 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో కాలు కోల్పోవడంతో కృత్రిమ అవయవముతో గడుపుతున్నట్లు తెలిపినప్పుడు అతని పరిస్థితి ఆమెను కదిలించింది. అతనికి భరోసా ఇస్తూ హృదయ పూర్వక ప్రార్థనతో క్రింది రెమిడీ ఇచ్చారు:

#1. CC2.1 Cancers-all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC10.1 Emergencies + CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD

#2. CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders…OD రాత్రి నిద్ర పోయే ముందు

అతను అల్లోపతి మందులు అన్నీ ఆపివేసి వైబ్రో వైద్యానికి ఉపక్రమించారు. చికిత్స ప్రారంభించిన 48 గంటల తరువాత అతని భార్యఫోన్ చేసి పేషెంటుకు చీము కారడం ఆగిపోయిందని నొప్పి తట్టుకోగలిగినంత స్థాయిలో ఉన్నట్లు బాగా నిద్రపోగలుగు తున్నట్లు  తెలిపారు. మూడు వారాల తరువాత అతని నొప్పి పూర్తిగా పోయినట్లు మరియు దేవునిపై తన క్షీణించిన విశ్వాసం పునరుద్ధరించబడిందనీ  తెలియజేయడానికి స్పష్టంగా మాట్లాడాడు. అతను బాగా నిద్రపోగలుగుతున్నందుకు 2013 అక్టోబరు 23న #2 ఆపివేయబడింది, మరియు #1ని 6TD వద్ద కొనసాగించడానికి పేషంటు ఇష్టపడ్డారు. ఆరు నెలల తర్వాత 2014 ఏప్రిల్ 30 న మోతాదు QDS కు తగ్గించబడింది. 2015 జూలై 8న మరో సంవత్సరం తరువాత  అతని వార్షిక పరీక్ష అతనికి క్యాన్సర్ రహితమని ప్రకటించడంతో  మోతాదు TDS కు తగ్గించబడింది. 2018 డిసెంబర్ 20న ఉపశమన కాలం ముగిసిన తర్వాత రోగి తన క్యాన్సర్ పునరావృతం కాలేదని గొప్ప ఉపశమనంతో ధ్రువీకరించారు. 2019 ఏప్రిల్ నెలలో మోతాదు ఆపడానికి ముందు OD కి తగ్గించబడింది.  2020 జూన్ 24న సంప్రదించినప్పుడు వ్యాధి పునరావృతం కాలేదని అతను ధ్రువీకరించాడు. మంచి ఆరోగ్యముతో చక్కని జీవనం గడుపుతూ స్వామికి కృతజ్ఞతతో తన ఇంట్లో నిత్యమూ భజనలు నిర్వహిస్తున్నారు, ప్రాక్టీషనర్  సలహామేరకు #1 ని OW నివారణ మోతాదుగా కొనసాగించడానికి అంగీకరించారు.

హెచ్.ఐ.వి 11975...India

55 ఏళ్ల మహిళ వ్యాధితో మంచం పట్టి ఆమె శరీర బరువు నాలుగునెలల్లో ఆమె సాధారణ బరువు 80 కిలోల నుండి 40 కిలోలకు తగ్గిపోయింది. 2000 నవంబర్ 25 వ తేదీన ఆమెకు దగ్గు, అధిక జ్వరం, మరియు తీవ్రమైన బలహీనత కారణంగా కదలలేని స్థితిలో ఉన్నందున ఆమెను ఆమె సోదరుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారించబడింది. ఆమె CD4* కౌంట్ కేవలం 77 మాత్రమే ఉంది. ఆమెకు ఈ జబ్బు 2016 నవంబర్ 6న హెచ్ఐవితో మరణించిన తన భర్త నుండి సంక్రమించింది. ఆసుపత్రిలో ఆమెకు యాంటీ బయోటిక్స్ తో చికిత్స చేయడం వలన ఆమెకు జ్వరము మరియు దగ్గు తగ్గింది కానీ తనకు హెచ్ఐవి పాజిటివ్ అనే వార్త ఆమెను చిన్నాభిన్నం చేసింది. మందులు వాడుతున్నప్పటికీ ఆమె ప్రతి రెండవ వారంలోనూ వాంతులు, విరోచనాలు, నోటిలో పుండ్లు,ఫ్లూ మరియు గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉండేది. నిరాశతో ఆమె మందులు తీసుకోవడం ఆపివేసి ఎవరైనా ఆమె జబ్బును గురించి తెలుసుకుంటారేమో అనే అనుమానంతో అన్నీ మందులు పారవేసి రిపోర్టులను కూడా చించి వేసారు. రోగి సోదరుడు తన భార్య వంధ్యత్వానికి విజయవంతంగా చికిత్స పొంది ఉన్నందున వైబ్రియానిక్స్ పై పూర్తి నమ్మకం ఉంది. పూర్తి గోప్యత మరియు భరోసాతో చివరకు ప్రాక్టీషనర్ని తాను వ్యక్తిగతంగా సందర్శించననే షరతు మీద వైబ్రోరెమిడీ తీసుకోవడానికి రోగి అంగీకరించారు.

2017 జనవరి 16 వ తేదీన సోదరుడు ఆమె కోసం క్రింది రెమిడి తీసుకున్నారు :
CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.3 AIDS - HIV + CC15.1 Mental & Emotional tonic…6TD

15 రోజుల్లో రోగి బలం పొందడం ప్రారంభించి ఇంటి చుట్టూ నడవగలుగుతున్నారు. ఆమె దగ్గరి బంధువు ఒకరు ఆమెకు పూర్తి విశ్వాసం ఉన్న ఒక వైద్యుడు వైబ్రియానిక్స్  ప్రభావాన్ని చూడటానికి మరియు ఆమె ఆశలను సజీవంగా ఉంచడానికి CD4 లెక్కింపు కోసం క్రమం తప్పకుండా పరీక్షించసాగారు.

 నెమ్మదిగా ఆమె అన్ని లక్షణాల నుండి మెరుగుపడసాగింది. 2018 అక్టోబర్ లో ఆమెకు ఉపశమనం కోసం ఆమె డాక్టర్ బంధువు ఆమె CD 4 కౌంట్ 200 లోపు ఉన్నప్పటికీ మునుపటి కంటే బాగా మెరుగు పడిందని చెప్పారు.  2019 జనవరి నాటికి ఆమెకు CD 4 కౌంట్ 200 పైగా పెరిగి ఆమె అన్ని లక్షణాల నుండి విముక్తి పొంది ప్రమాద స్థాయి నుండి బయట పడ్డారు. ఆమె బరువు 69 కిలోల వరకు పెరిగింది, ఇక అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. జనవరి 2020 నాటికి ఆమె పూర్తి సాధారణ స్థితికి చేరింది. 2020 మార్చి 20 నాటికి ఆమె CD 4 కౌంట్ 375 కి చేరడంతో ఆమెకు 100% ఉపశమనం కలిగింది. ఐతే ఆమె మోతాదు తగ్గించడానికి ఇష్టపడలేదు. అప్పుడప్పుడు ఆమె ప్రాక్టీషనర్ తో కృతజ్ఞతలు తెలపడం కోసం మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆమెను కలవడానికి లేదా తన ఆరోగ్యం గురించి ప్రశ్నించడానికి ఇంకా సిద్ధంగా లేదు. ఆమె సోదరుడు ప్రతీ నెలా ప్రాక్టీషనర్ నుండి రెమిడీలు తీసుకుంటూనే ఉన్నారు. జాతీయ లాక్ డౌన్ కారణంగా ఆమె జూన్ 2020లో చేయించుకోవలసిన పరీక్షకు వెళ్లలేకపోయింది కానీ ఆమె తన సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ శక్తివంతంగానూ, ఆత్మవిశ్వాసం తోనూ జీవిస్తున్నట్లు ఆమె సోదరుడు ధ్రువీకరించారు.

* CD4 కౌంట్ అనేది ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థ యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి  యొక్క రక్తంలో CD 4 కౌంటు 500 నుండి 1200cells/mm3 వరకు ఉంటుంది. CD4 కౌంటు ఏ వ్యక్తి కైనా 200 కన్నా తక్కువ ఉంటే ఆ వ్యక్తి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్ష చేయించు కోవలసి ఉంటుంది.

ద్వైపాక్షిక ధృడతర స్నాయువుల వ్యాధి, మొటిమల రుగ్మత, ముఖముపై మంట 03508...France

47 ఏళ్ల మహిళ తన రెండు చేతులను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పి మెడ నుండి మణికట్టు వరకు ఉంటోంది. 2011లో ఇది ద్వైపాక్షిక స్నాయువుల వ్యాధిగా నిర్ధారణ చేయబడింది. దీని నిమిత్తం ఆమెకు ప్యారాసిటమల్ మరియు ట్రమడాల్ మాత్రలు సూచించబడ్డాయి. 2014 డిసెంబర్ లో ఆమె రెండు మోకాళ్ళకు కూడా నొప్పి ఏర్పడింది. బహుశా ఎక్కువ గంటలు నిలబడి పనిచేయడం వలన కావచ్చు. 2015 ఫిబ్రవరి నాటికి పరిస్థితి మరింత దిగజారింది. ఆమె ఒకవైపుకు తిరిగి  పడుకోలేరు  అలాగే చేతులను కూడా పైకి ఎత్తలేరు. ఇది ఆమె శ్రమైక జీవితానికి సవాలుగా మారింది. దీని నిమిత్తం ఆమె డాక్టరు ఆమెకు ఇబుప్రొఫెన్ 400 mg BD గా మరియు కార్టిజోన్ 10mg OD గా తీసుకునేలా మాత్రలు ఇచ్చారు. మరియు ఫిజియోథెరపీ కూడా ప్రారంభించారు. ఆమె తగినంత ఉపశమనం లేకుండా 40 అల్ట్రాసౌండ్ చికిత్సలు చేయించుకున్నారు.

వీటికి అదనంగా ఆమె ముఖం మీద దురదతో కూడిన ఎర్రని పొక్కులు, పొలుసులు, చర్మపు మంట ఏర్పడ్డాయి. 2012లో మొటిమల రుగ్మత గా ఇది నిర్ధారింపబడింది. అప్పుడప్పుడు ఇవి వాస్తూ ఉండేవి. వీటి నిమిత్తం ఆమె కార్టిజోన్  క్రీమ్ మరియు క్యురేన్ 10mg మాత్ర OD గా  ఊపయోగించేవారు. మూడు సంవత్సరాల అల్లోపతి చికిత్స తీసుకున్నప్పటికీ ఎటువంటి మెరుగుదల లేదు.

 రోగికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తల్లిమరణం తో కలిగిన షాక్, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా ఆమె జీవితంలోని అన్ని వర్గాలనుండి దీర్ఘకాలిక ఒత్తిడితో కూడా బాధ పడుతోంది. దీని పరిష్కారానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించ నందున 2015 సెప్టెంబర్ 29న ఆమె ప్రాక్టీషనర్ని సందర్శించినప్పుడు ఆమె నిరాశ నుండి విముక్తురాలు కావడానికి మరియు సహాయం కోసం ఆశతో ఉన్నారు:

వత్తిడి మరియు మొటిమలకు :
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections…TDS

బాధాకరమైన స్నాయువుల రుగ్మతకు :
#2. CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue…QDS

ఆమె కు సూచించబడిన అల్లోపతీ మందులతోపాటు వైబ్రియానిక్స్ రెమిడీలు కూడా కొనసాగించారు. 2015 అక్టోబర్ 30న ఆమె ఒత్తిడి యాభై శాతం తగ్గినట్లు ఆంతరంగికంగా కొంత మెరుగుగా ఉన్నట్లు తెలిపారు. మొటిమల లక్షణాలలొ 40% ఉపశమనం పొందారు. 2015 నవంబర్ 26న ఆమె రేడియో మరియు ఎకోగ్రఫీ పరీక్షలు చేయించు కున్నప్పుడు గతంలో లేని  కీళ్ల కాల్సిఫికేషనును వెల్లడించింది. నాలుగు రోజుల తర్వాత నవంబర్ 30 న ఆమె మొటిమల స్థితిలో మాత్రమే కొంచెం మెరుగుదల తప్ప మరెక్కడా ఉపశమనం కలుగ లేదని తెలిపారు. దీనికి అదనంగా ఆమె ఊరికే అలిసిపోతున్నట్లు, మరియు నవంబర్ ప్రారంభం నుండి మెడనొప్పి ప్రారంభమైనట్లు తెలిపారు. ఆమెకు త్వరగా అలిసిపోవడం నుండి తగ్గించడానికి #1  క్రింది విధంగా మార్చబడింది:
#3. CC3.1 Heart tonic + #1…TDS

ఆమెకు కీళ్ల నొప్పి నుండి ఉపశమనానికి #2 క్రింది విధంగా మార్చ బడింది:  
#4. CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + #2…QDS; మరియు మెడ భుజాలు మరియు చేతులకు బాహ్య అనువర్తనం కోసం బాదం నూనెలో …BD గా ఇవ్వబడింది.

2016 ఫిబ్రవరి 5న ఆమె మెడ నొప్పి నుండి పూర్తిగా కోలుకోవడం మొటిమలకు సంబంధించిన లక్షణాలు 60% మెరుగుదల చేతులు మరియు మోకాళ్ళలో నొప్పి నుండి 70% మెరుగుదల మరియు ఆమె మానసిక స్థితిలో కూడా మెరుగుదల ఏర్పడినట్లు తెలిపారు. ఇప్పుడు ఆమె చేతులు ఎత్తగలరు కానీ పూర్తిగా కాదు కాబట్టి ఆమె ఫిజియోథెరపీ కూడా ప్రారంభించారు.

2016 ఏప్రిల్ 5న ఒక ఆసుపత్రిలో ఆపరేటింగ్ బ్లాకును శుభ్రపరిచే సాంకేతిక నిపుణులుగా పని చేసిన రోజు ప్రమాద వశాత్తూ సానిక్లేర్ అనే క్రిమిసంహారిణి ఆవిరులకు గురి అయ్యారు. ఫలితంగా ఆమె ముఖం చర్మంలో మొదటి డిగ్రీ కాలిన గాయాలు ఏర్పడి ఎర్రగా మారాయి. ఆమె దీని నిమిత్తం వైద్యుని సంప్రదించ లేదు, అలోపతి మందులు ఉపయోగించలేదు. 2016 ఏప్రిల్ 8 న #3 ఆపివేయబడింది మరియు ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

చర్మానికి :
#5. CC3.7 Circulation + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites…TDS మరియు బాహ్యంగా చర్మం పై రాయడానికి బాదం నూనెలో…BD.

ఆమె మొటిమల కోసం కార్టీకోయిడ్ క్రీం వాడటం మానేసారు ఎందుకంటే ఇది మంటను తీవ్రతరం చేసింది.

మానసిక స్థిరత్వము మరియు శారీరక బలం కోసం :
#6. CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

స్నాయువుల రుగ్మత కీళ్ల కదలికలో మెరుగుదలకు, #4 ను క్రింది విధంగా మార్చడం జరిగింది:
#7. CC20.7 Fractures + #4…TDS

నెల రోజుల్లో ఆమెకు నొప్పుల్లో 90% మెరుగుదల ఏర్పడింది. ఆమె తన రెండు చేతులను సులభంగా పైకి ఎత్తగలుగుతున్నారు. ఆమె ఫిజియోథెరపిస్ట్ ఈ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయి చికిత్సను నిలిపివేశారు. వైబ్రో చికిత్స కొనసాగించ వలసిందిగా ఆమెను   ప్రోత్సహించారు. ఇప్పుడు ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు పడుకో గలుగుతున్నారు. ఆమె ముఖం మీద కాలిన గాయాలు మరియు మొటిమల్లో అలాగే వత్తిడి మరియు నిరాశ విషయంలోనూ 80%మెరుగుదల ఏర్పడింది. ఈ మూడు రెమిడీలు #5#6 మరియు  #7 మరో మూడు నెలల పాటు TDS గా కొనసాగించ బడ్డాయి. 2016 జులై 30 వ తేదీన ఆమె తన వ్యాధి లక్షణాలు అన్నింటిలో 100% మెరుగుదల ఏర్పడి పూర్తిగా నయమైనట్లు తెలిపారు.  #5, #6, #7 లను ఆపివేసి వీటి నుంచి ఎంచుకున్న కోంబోలతో కొత్త రెమిడీ #8 ఇవ్వబడింది:

#8. CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC21.2 Skin infections + CC21.3 Skin allergies…BD గా 3 నెలలు అనంతరం OD గా 2 నెలలు.

ఈ మధ్య కాలం లోనే అనగా 2016 సెప్టెంబర్ నుండి కార్టిజోన్ 10 mg మినహా అల్లోపతి మందులు అన్నింటినీ అలోపతి వైద్యులు నిలిపివేసారు. ఇది 2017 జనవరిలో మాత్రమే సున్నాకి తగ్గించబడింది. ఈ సమయంలోనే #8 యొక్క మోతాదు  OWకు తగ్గించ బడింది.

2019 మేలో జరిగిన ఒక సమీక్షలో ఆమె కీళ్ళుఅన్నీ బలంగా ఉన్నాయనీ మరియు ఆమె భారీ వస్తువులను సులభంగా ఎత్తగలుగుతున్నట్లు తెలిపారు. ఆమె ముఖము ప్రకాశవంతమై మరియు ఆమె ముఖ చర్మం మృదువుగా తయారు కాబడింది.  రోజు వారి ఆరోగ్యసాధనలో వైబ్రియానిక్స్  సమ్మిళితము చేయబడిన తరువాత ఆమె శరీరం మరియు మనసులో చాలా చక్కగా ఉన్నట్లు అనిపించింది. 2020 మార్చి నాటికి ఆమెకు ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదు ఆయినప్పటికీ #8…OW.గా కొనసాగిస్తున్నారు.

పేషంటు వ్యాఖ్య:
4 సంవత్సరాల క్రితం నా స్నాయువు సమస్యల గురించి నా సహోద్యోగికి చెప్పాను. నా చేతులు పైకి ఎత్తడం నాకు చాలా కష్టమైంది. ఇప్పుడు నొప్పి అంటే ఏమిటో తెలియని పరిస్థితి చేకూర్చి చేతులను సులువుగా ఉపయోగించే స్థితి కల్పించిన  వైబ్రియానిక్స్ రెమిడీలకు ధన్యవాదాలు. నా దూకుడు స్వభావం సర్దుకొని ఇప్పుడు నేను మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగు తున్నాను. నేను నిజంగా మంచి అనుభూతి పొందుతున్నాను. కాంబో ఇబ్బందికరంగా ఉన్న నా ముఖ తీరును మార్చివేసింది. సహనంతో శ్రద్ధతో ఎలా చేయాలో చెప్పిన మీకు ధన్యవాదాలు. నా చేతులను మళ్ళీ ఉపయోగించగలుగుతున్నకు ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉన్నాను. ఈ అన్నిటికి కారణభూతులైన మీకు ధన్యవాదాలు.

 

మోకాలి మృదులాస్థి (కార్టిలేజ్) గాయం, తొడ కండరములలో గాయం 03508...France

2012లో 25 ఏళ్ల క్రీడాకారుడికి తన ఎడమ మోకాలిలో తేలికపాటి నొప్పి ఏర్పడింది. ఫుట్బాల్ క్రీడాకారుడు కావడంతో అతను ఏడు సంవత్సరాల వయస్సు నుండి ఆడుతూ ఉండడం వలన మోకాళ్లపైన ఎక్కువగా శ్రమ పడుతోంది. ఎంఆర్ఐ స్కాన్ కార్టిలేజ్ లో ఒక గాయమును చూపించింది. 2015 నవంబరు నుండి ఈ నొప్పి తీవ్రత ఎక్కువైనందున అతను కుంటుతూ నడవడం ప్రారంభించాడు. అతని వైద్యుడు వీరికి ప్యారాసిటమల్ 1gని  TDS గా మరియు ట్రమడాల్ 50 mgని  BD గా సూచించారు. ఈ మందులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి అతను రెండు నెలలు ఫిజియోథెరపీ మరియు మూడు సెషన్లు ఆస్టియో పతీ కూడా తీసుకున్నా ఎటువంటి మెరుగుదల కలుగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను ఫుట్బాల్ ఆడటం మానేయాల్సి వచ్చింది. 2016 మే 15న అతను ప్రాక్టీషనర్ని సందర్శించినప్పుడు అతను కుంటుతూ ఉండడమే కాకుండా తీవ్రమైన నొప్పి కూడా కలిగి ఉన్నారు. అతనికి క్రింద రెమిడీ ఇవ్వబడింది:

#1. CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…QDS గా ఒక వారం అనంతరంTDS

#2CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…BD మరియు బాహ్యంగా చర్మం పై రాయడానికి బాదం నూనెలో

అతను నొప్పి నివారణ మందులను వైబ్రో రెమిడీలతో కలిపి కొనసాగించాడు. ఒక నెల తర్వాత అతను నొప్పి మరియు కుంటుతూ నడవడంలో 50% మెరుగుదల మరియు మరొక నెలతరువాత 100% మెరుగుదల పొందారు. కాబట్టి జులై 20నుండి #1 మరియు #2 లను BDకి తగ్గించడం జరిగింది. అలోపతి నొప్పి నివారణలు రెండింటినీ ODకి తగ్గించడం జరిగింది. అంతేకాక అతని మోకాలి కీళ్ళలో కొంత గట్టిదనం ఉన్నప్పటికీ ఫుట్బాల్ ప్రాక్టీస్ తిరిగి ప్రారంభించాడు. చివరికి ఆగస్టు 31 నాటికి అతని నొప్పి నివారణ మందులు తీసుకోవడం మానివేశారు. సెప్టెంబర్ లో ఫుట్బాల్ సీజన్ ప్రారంభమైంది. అతను తన క్రీడను ఆనందంతో కొనసాగించారు. సెప్టెంబర్ 30న #1 & #2 ను OD కి తగ్గించడం జరిగింది.

నవంబరులో ఫుట్బాల్ మైదానంలో జరిగిన ప్రమాదం కారణంగా అతని ఎడమ తొడ కండరాల విచ్ఛిన్నం జరిగింది. ఆ తొడ వాచిపోయి తీవ్రమైన నొప్పి బాధించ సాగింది. ఐతే అతని కోచ్ గాయాన్ని శుభ్రపరిచి బ్యాండెజ్ తో కట్టుకట్టి పూర్తిగా విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. నవంబర్ 11 మూడు రోజుల వరకూ  #1 ని 6TD గానూ తరువాత మూడు రోజులు QDS గానూ ఆ తరువాత TDS గా తగ్గించడం జరిగింది. అలాగే  #2 మోతాదు BD కి పెంచడం జరిగింది. ఈ సమయంలో ఇతను వేరే చికిత్స తీసుకోలేదు. ఒక నెల తర్వాత వాపు అదృశ్యమైంది, నొప్పి మరియు చలనశీలత విషయంలో 80% మెరుగుదల ఏర్పడింది. కాబట్టి 2016 డిసెంబర్ 15న #1 యొక్క మోతాదు BDకి తగ్గించబడింది.

2017 జనవరి 17 న నొప్పి పూర్తిగా మాయం కావడంతో #1 మరియు #2 యొక్క మోతాదు OD కి తగ్గించడం జరిగింది. ఒక నెల తర్వాత #2 ను ఆపి వేయడమయినది. 2017 మే 10న పూర్తిగా నిలిపి వేయడానికి ముందు మార్చి 17 వ తేదీన #1ని తగ్గించడం ప్రారంభమయింది.

2019 డిసెంబర్ నాటికి అతనికి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు. ఇప్పుడు అతను రోజూ ఒక గంట పాటు పరిగెత్తుతున్నాడు. అభిరుచితో ఫుట్బాల్ ఆడటం కూడా కొనసాగిస్తున్నాడు.

కోవిడ్ -19 00512...Slovenia

నర్సుల కొరత కారణంగా దంత విభాగానికి చెందిన 45 ఏళ్ల నర్సును రోగుల విశ్రాంత గృహానికి సాధారణ నర్సింగ్ డ్యూటీ నిర్వహణ నిమిత్తం పంపించారు. కేవలం రెండు రోజులలోనే 6గురు కొవిడ్-19 సోకిన రోగులు అక్కడ చేరారు. 2020 ఏప్రిల్ 14న నాలుగు రోజుల పాటు 13 గంటలు షిఫ్ట్ చేసిన అనంతరం ఒక రోజు విశ్రాంతి తర్వాత ఆమెకు బాగా అలసిపోయినట్లు అనుభూతి కలగడం ప్రారంభ మయ్యింది. ఆరోజు మధ్యాహ్నానికి ఆమెకు చాలానీరసంగా శక్తి హీనతతో పాటు ఆమె వీపు నొప్పిగానూ  మరియు వళ్ళంతా చల్లగా అనిపించింది. అయినప్పటికీ అప్పుడు కూడా ఆమెకు అనారోగ్యం అనిపించలేదు. సాయంత్రం ఉష్ణోగ్రత 37.6C (99.68*F) గా ఉంది.

ఏప్రిల్ 15న ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీనితో  ఇన్ఫెక్షన్ తీసుకువచ్చిన ఈ వ్యాధికి ఆమె చాలా భయపడిపోయింది. ఆమె బస చేసిన రిటైర్మెంట్ హోమ్ సమీపంలో తన సహచర నర్సులు ఉంటున్న హోటల్ లో ఆమెను ఐసోలేషన్ లో ఉంచారు. ఆరోజు సాయంత్రం కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ముందస్తు నివారణగా వైబ్రియానిక్స్ రెమిడీ  తీసుకుంటున్న ఆమె సహోద్యోగి ఈ నర్సుకు కూడా అదే రెమెడీ సూచించారు. కానీ భయాందోళన స్థితిలో ఉన్నందున ఆమె నిరాకరించింది. అంతేకాక ఈ ఆందోళన ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పుతూ ఉండడంతో  సైకాలజిస్టు ఆమెకు లెక్సరిన్ అనే ఆలోపతి మందును సూచించారు.

ఆ తరువాత ఆరు రోజులు ఆమెకు ఒక పీడకలలా గడిచిపోయాయి. ఆమెకు ప్రతిరోజూ 38C (104) జ్వరం వచ్చేది. ఆమె ఎక్కువ సమయం మంచం మీదే గడిపేది. ఆమెకు తల నొప్పి మరియు తీవ్రమైన కండరాల నొప్పులు కూడా ఉన్నాయి. ఆమె ఛాతీపై ఎవరో కూర్చున్నఅనుభూతితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండేది. ఆమె వాసన మరియు రుచి యొక్క అనుభూతిని కూడా కోల్పోయింది. ఏప్రిల్ 23న ఆమె బి.పి. మరియు ఆక్సిజెన్ సంతృప్త స్థాయిలు సామాన్య స్థాయిలోనే ఉన్నప్పటికీ ఆమెకు ఛాతీలో రద్దీ, దగ్గు, జ్వరము కొనసాగుతూనే ఉన్నాయి.

మరో 11 రోజులు ఆమెకు అధిక జ్వరం, నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, దగ్గు, ఆకలి లేకపోవడం, మరియు స్వరము కోల్పోవడం వంటివి కొనసాగాయి. మే 4న చేసిన మరో పరీక్ష కూడా ఆమెకు కోవిడ్ పాజిటివ్ గానే వచ్చింది ఇప్పుడు ఆమె మరింత భయపడిపోయి వైబ్రియానిక్స్ రెమిడీలకోసం ప్రాక్టీషనర్ను సంప్రదించాలని నిర్ణయించుకుంది.

ప్రాక్టీషనర్ లోలకం ద్వారా స్వామికి కనెక్ట్ అయ్యి ఈ క్రింది వాటిని గుర్తించి 2020 మే 5న ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు.

NM2 Blood + NM6 Calming + NM45 Atomic Radiation + NM76 Dyspnoea + NM90 Nutrition + NM113 Inflammation + NM116 Malaria Extra Strength + OM15 Kidneys + OM17 Liver-Gallbladder + BR4 Fear + BR14 Lung + SM6 Stress + SM13 Cancer + SM14 Chemical Poison + SM26 Immunity + SM27 Infection + SM30 Life (AIDS) + SM31 Lung & Chest + SM40 Throat + SM41 Uplift + SR264 Silicea + SR270 Apis Mel + SR301 Mercurius + SR302 Nux Vomica + SR306 Phosphorus + SR385 Eupatorium Perf + SR406 Sabadilla + SR424 Chicory + SR477 Capillary + SR505 Lung + SR507 Lymphatic Organ + SR535 Thymus Gland…6TD గా 4 రోజుల వరకూ అనంతరంOD*

మరుసటి రోజు ఆమె పూర్తిగా ప్రశాంతంగా ఉంది. మే 7న అనగారెమిడీ ఇచ్చిన రెండవ రోజు ఆమెకు చక్కని మానసిక స్థితి కలిగి రెండుసార్లు నడక కోసం వెళ్లగలిగే శక్తిని కూడా పొందినది. ఆ తరువాత మరొక కోవిడ్ పరీక్ష జరగాగా ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ పరీక్ష నెగిటివ్ గా వచ్చింది. ఆమెను మళ్లీ పరీక్షించారు. సాయంత్రం పరీక్షలో కూడా అది నెగిటివ్ గానే ఉంది. ఆమె కుటుంబం యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆమె అదే రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది!

రోగి వ్యాఖ్య :
నా గురించి సమయాన్ని వెచ్చించడానికి మరియు ప్రతి రోజూ నాకు ఫోన్ చేసి నా పరిస్థితి గురించి ఆరా తీసిన అందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ద్వారా ఇలా జరిగి ఉండక పోతే నేను ఆ సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ గొట్టాలపై ఉండి ఉండడమో లేదా చనిపోయి ఉండడమో జరిగేది. మీరు చేసిన సహాయమునకు నేను మరియు నా కుటుంబం  మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

సంపాదకుని వ్యాఖ్య :
ప్రాక్టీషనర్ చాలా కేసులు చికిత్స చేసినమీదట కోవిడ్-19 కేసులు కేవలం రెండు రోజుల్లోనే చాలా వేగంగా నయమవుతాయనే అభిప్రాయానికి వచ్చారు.

* 108 సిసి బాక్స్ ఉన్నవారు దయచేసి ఇంతకుముందు ప్రచురించిన కోవిడ్-19 రెమిడీ  ని ఉపయోగించండి.

గర్భధారణ సమయంలో కోవిడ్ -19 03572...Gabon

33 ఏళ్ల నాలుగు నెలల గర్భిణీ ప్రాక్టీషనర్ వద్దకు వచ్చినప్పుడు ఆమె రూపం పాలిపోయినట్లుగా బాగా అలసిపోయినట్టుగా కనిపించింది. ఆమెకు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది, అలసట వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఆమె శ్వాసను కోల్పోకుండా పది మీటర్లు కూడా నడవలేక పోయేది. అంతకు ముందురోజు ఆమె తల్లిని పరీక్షించి పాజిటివ్ గా నిర్ధారించి ఆసుపత్రిలో చేర్చారు. కాబట్టి తల్లితో నివసిస్తూ అదే పడకగదిలో ఉండడంతో ఆమె ఆందోళన చెందింది. ఆమె కూడా ఆసుపత్రికి వెళ్ళింది కానీ సౌకర్యాల కొరత కారణంగా ఆమెని తిరిగి ఇంటికి పంపించివేయడంతో ఆమె నిస్సహాయంగా భావించారు. 2020 మే 24న ప్రాక్టీషనరు ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:

#1. CC4.1 Digestion tonic + CC4.8 Gastroenteritis + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున 6 గంటల వరకూ అనంతరం 6TD ఉపశమనం మేరకు TDS. 

ఈ వైరస్ గర్భస్థ శిశువును ఎలా ప్రభావితం చేస్తుందో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రాక్టీషనర్ గర్భక్షేమం కోసం  క్రింది కాంబో ఇచ్చారు.

#2. CC3.1 Heart tonic + CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sickness + CC12.1 Adult tonic…TDS 

రెండు రోజుల తర్వాత మే 26న రోగి తనకు అలసట లేదని మరియు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మాయమయ్యిందని తెలిపారు. సురక్షితంగా ఉండటానికి జూన్ చివరి వరకు రెమిడీ #1 కొనసాగించాలని తదనంతరం దేశం నుండి మహమ్మారి అదృశ్యం అయ్యేవరకు OD గా కొనసాగించాలని అలాగే #2 ను ప్రసవం వరకూ కొనసాగించాలని తెలిపారు.

కోవిడ్ -19 02799...UK

2020 మార్చి 12న 50 ఏళ్ల స్త్రీ కి చాలా తీవ్రమైన తలనొప్పి దానితో పాటు కంటి నొప్పి కనులవెంట నీరుకారడం, ప్రారంభ మయ్యింది. ఆ తర్వాత మూడు రోజుల్లో ఆమెకు ఈ లక్షణాలు మరింత అభివృద్ధి అయ్యి శారీరక నొప్పులు, స్వల్ప జ్వరం, పొడిదగ్గు, ఆకలి లేకపోవడం, రుచి మరియు వాసన కోల్పోవడం మరియు తీవ్రమైన అలసట ఏర్పడ్డాయి. చిన్నప్పటినుంచి ఆస్త్మా పేషంటు కావడం వలన ఆమెకు జలుబు మరియు దగ్గు తేలికగా వచ్చే అవకాశం ఉన్నందున ఆమె బ్రాంఖో డైలేటర్స్ పై ఆధారపడి ఉన్నారు. తనకు కోవిడ్-19 లక్షణాలు ఏర్పడినట్లు తెలుసుకుని దానికి చికిత్స లేదు కనుక ఆమె వైద్యుడిని సంప్రదించడానికి బదులుగా సోషల్ మీడియాలో సమాచారం అనుసరించి పారాసిట్మల్ ట్యాబ్లెట్ తీసుకుంది. ఇది జ్వరాన్ని  తగ్గించింది. దీనితోపాటు నిమ్మరసంతో కూడిన వేడినీరు ప్రతీ ఉదయమూ మరియు ఆయుర్వేద దినుసులు మరియూ తేనెతో  తయారు చేసిన టీ రోజంతా త్రాగుతూ ఉండేవారు. త్వరలోనే ఆమె భర్త ఇలాంటి లక్షణాలు చూపించడం ప్రారంభించాడు మరియు మార్చి16 న ఉష్ణోగ్రత 103F కు పెరిగినప్పుడు భయం మొదలైంది. ఆమె కఠినమైన అనుభూతిని పొందుతున్న స్థితిలో ఒక స్నేహితురాలు సూచన మేరకు ఆమె ప్రాక్టీషనర్కి ఫోన్ చేసారు. 24 గంటల్లోనే రెండు బాటిళ్ళను ఆమె గడప వద్దకు చేర్చడం జరిగింది.   

కోవిడ్-19 నియంత్రణకు :

#1. CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…6TD

మంటకు :

#2.Prednisolone ను 10M & CM వద్ద పోటెన్టైజ్ చేసినదిQDS 

2020 మార్చి 17న ఈ బాటిళ్లు చేరిన వెంటనే వాటిని వాడడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం నాటికి ప్రతీ లక్షణం  విషయంలోనూ ఆమెకు చాలా మెరుగుగా అనిపించింది. మార్చి 24 నాటికి ఆమె లక్షణాలు దాదాపు మాయమవడంతో 80% మెరుగుగా ఉంది. ఐతే అప్పుడప్పుడు వచ్చే పొడి దగ్గు, కొద్దిగా తల నొప్పి మరియు అలసట మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐతే వాసన మరియు రుచి భావన మాత్రం ఆమెకు 2020 ఏప్రిల్ 5 నాటివరకూ పొందలేక పోయారు. ఏప్రిల్ 10 నాటికి ఆమె 100% మెరుగయ్యారు. #1 మరియు #2 మోతాదును TDSకు తగ్గించారు. మరో రెండు వారాలలో రెమిడీలు పూర్తిగా అయిపోయినవి.    

పేషంటు వ్యాఖ్య: 24 గంటల్లో రెమిడీ బాటిళ్లను మాఇంటికి పంపిణీ చేయడంలో ఆమె చేసిన కృషికి, మరియు తక్షణ సాయమునకు  మేము ఆమెకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.  

సంపాదకుని వ్యాఖ్య: కోవిడ్-19 అనంతర చికిత్స వ్యాధి ఆ ప్రాంతం నుండి అదృశ్యమయ్యే వరకూ ODగా కొనసాగించాలి.

దగ్గు – కోవిడ్-19 అనంతర చికిత్స 11613...India

55-ఏళ్ల మహిళ 2020 ఏప్రిల్ 29 నుండి దగ్గు, తలనొప్పి, జ్వరం, మరియు రుచి కోల్పోవడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. మూడు రోజుల్లో అల్లోపతి మందులతో రుచి కోల్పోవడం మరియు సాధారణ ఆయాసము మినహా మిగతా అన్ని లక్షణాలు నుండి విముక్తి పొందారు. అనారోగ్యంతో ఉన్న వీరి పక్కింటి మహిళ పరీక్షింప బడినప్పుడు పాజిటివ్ అని రాగా ఈమె కూడా మే 6 వ తేదీన స్వయంగా పరీక్ష చేయించుకున్నప్పుడు కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చింది. వెంటనే ఖాళీగా ఉన్న ఇంట్లో ఆమెను క్వారంటైన్ లో పెట్టి ఐదు రోజులపాటు యాంటీబయాటిక్స్ మరియు యాంటీ వైరస్ చికిత్స ఇచ్చారు. ఆమె ఆరోగ్య పోషకాలు తీసుకోవడం తో పాటు సుగంధ ద్రవ్యాలు మరియు బెల్లం తో కూడిన డికాక్షన్ రోజుకు రెండు సార్లు తీసుకోవడం ప్రారంభించారు. మే 11 తేదీ నాటికి ఆమెకు దగ్గు ప్రత్యేకించి సాయంత్రం వేళ రావడంతో పాటు కుడి ప్రక్క స్వల్పంగా నొప్పి వచ్చింది. దీనికోసం ఆమె భర్త వైబ్రియానిక్స్ చికిత్స కోరారు. ప్రాక్టీషనరు దీనికి ఈ క్రింది ప్రామాణికమైన రెమిడీ నియంత్రణ మోతాదుగా ఇచ్చారు:

CC4.1 Digestion tonic + CC4.8 Gastroenteritis + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున  2 గంటల వరకూ అనంతరం 6TD గా 4 రోజుల వరకూ.

మరుసటి రోజు నుండి ఆమెకు దగ్గు తగ్గిపోయి స్వస్థత చేకూరినట్లు భావించారు. మే 15న నిర్వహించిన పరీక్ష నెగిటివ్ గా రావడంతో మోతాదును నాలుగు రోజులు TDS కి తర్వాత కోవిడ్-19 ఆ ప్రాంతంలో పూర్తిగా నియంత్రణ లోనికి వచ్చే వరకూ BD గా కొనసాగించ వలసిందిగా సూచించారు.

అరికాలి మంట, మలబద్ధకము 11613...India

44-ఏళ్ల మహిళ 2009 నుండి తీవ్రమైన మలబద్ధకంతో బాధ పడుతున్నారు. అలోపతి ఔషధం ఆమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చింది. చాలా సంవత్సరాలు ఆమె ప్రేగు కదలికల నిమిత్తం ఆయుర్వేద ఔషధం (త్రిఫల చూర్ణం) తీసుకున్నా ప్రయోజనం కలగలేదు. అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేకించి ఉదయం పూట ఆమె మడములలో నొప్పిని కలిగి ఉంది. గత నాలుగు నెలల్లో నొప్పి చాలా తీవ్రంగా మారి నడవడం కూడా కష్టంగా మారింది. వైద్యుడు దీనిని అరికాలి మంట (ఫెసైటీస్) అని నిర్ధారించారు. 2019 అక్టోబర్ 6న నొప్పి మరింత ఇబ్బంది కలిగించడంతో ప్రాక్టీషనరు క్రింది రెమిడీ ఇచ్చారు:

అరికాలి మంటకు:

#1. CC20.4 Muscles & supportive tissue…TDS

రెండు వారాల తర్వాత నొప్పి విషయంలో ఆమెకు 20% ఉపశమనము, నాలుగు వారాల తర్వాత ఇది 50 శాతానికి పెరిగింది. 2019 నవంబర్ 16న మరింత త్వరగా ఉపశమనం కలిగించడానికి ప్రాక్టీషనర్ #1ని…BDగా సూచించారు. బాహ్యంగా పై పూతగా రాయడం కోసం #1ని క్రింది విధముగా మార్చారు.

#2. CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic + #1…TDS

ఇదే సమయంలో రోగి అన్న రోగికి మలబద్ధకం తీవ్రంగా మారిందని తెలపడంతో అందుకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

మలబద్ధకానికి:

#3. CC4.4 Constipation…6TD గా 3 రోజుల వరకూ అనంతరం TDS

2019 డిసెంబర్ 20 నాటికి ఈ రెండు లక్షణాలలో 80% ఉపశమనం కలిగింది. 2020 జనవరి 18 నాటికి పూర్తిగా కనుమరుగయ్యాయి. కాబట్టి #3 యొక్క మోతాదును OD గా అనంతరం 3TW, 2TW, OW కు తగ్గించి ఫిబ్రవరి 15 న ఆపివేయడం జరిగింది. అలాగే #1 & #2 లను పక్షానికి ఒకసారి మార్చి, మార్చి 14 తేదీన ఆపివేయబడింది. 2020జూన్ నాటికి మడమ నొప్పి లేదా మలబద్ధకం పునరావృతం కాలేదు.

ప్రాక్టీషనర్ల వివరాలు 11975...भारत

ప్రాక్టీషనర్ 11975…ఇండియా , పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐన ఈ ప్రాక్టీషనర్ ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన గృహిణి. సాయి భక్తుల కుటుంబంలో జన్మించిన ఈమె తన తల్లిదండ్రుల ప్రేరణతో చిన్నతనం నుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. సేవా దృక్పథం గలిగి స్వామి నుండి అనేక వ్యక్తిగత ఆశీర్వాదలు అందుకొన్న ఆమె తండ్రి నిస్వార్థ సేవ చేయడానికి మరియు వినయపూర్వకమైన జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశం చేశారు. బాలవికాస్ తరగతులలో తన తల్లికి సహాయం చేస్తూ తానే బాలవికాస్ గురువై తన ఇంటికి సమీపంలోని బలహీన వర్గాల పిల్లలకు సహాయం చేయడానికి పూనుకున్నారు. స్థానిక సాయిసెంటర్లో చురుకుగా ఉండే ఈమె పుట్టపర్తికి వార్షిక సేవ సందర్శన నిమిత్తం లేదా బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేసే అవకాశాన్ని చాలా ఎక్కువగా పొందుతూ చాలా అరుదుగా మాత్రమే ఈ అవకాశాన్నికోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.

ఏప్రిల్ 2012లో వంశపారంపర్యంగా వచ్చినటువంటి పన్నెండేళ్ల ఆస్తమాను కేవలం ఒక మోతాదు వైబ్రో రెమిడీ నయం చేసిన  అద్భుతాన్ని ఆమె కనుగొన్నారు. వీరు సేవ చేసే సాయి సెంటరుకు వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్టు గా ఉన్న ఒక ప్రాక్టీషనర్ రావడం తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో ఉన్న ఈమెను చూడడం జరిగింది. అతను వెంటనే ఒక ఔషధాన్ని తయారు చేసి ఆమె నోటిలో మొదటి మోతాదు వేసారు. ఆమె తన ఇంట్లో స్వామి చిత్రపటానికి ముందుఈ రెమిడీ బాటిల్ ను ఉంచి దాని ధ్యాస కూడా లేకుండా మర్చి పోయింది.  మరుసటి రోజు ప్రాక్టీషనర్ ఆమె ఆరోగ్య స్థితి గురించి ఆరా తీసినప్పుడు ఆమె శ్వాస సాధారణంగా ఉందని అందువల్ల ఇక రెమిడీ అవసరం లేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కానీ అతని ఒత్తిడి మేరకు ఆమె వారంరోజులు ODగా తీసుకొని ఆపివేసింది.

తిరిగి ఈ సమస్య ఎన్నడూ పునరావృతం కాలేదు ఈ సంఘటన ఈ ప్రాక్టీషనర్ని వైబ్రియానిక్స్ వైపు మరలడానికి అవకాశం కల్పించింది. అతని సహాయంతో ఆమె కోర్సు చేయడానికి కేరళకు వెళ్లి 2012 జూలైలో AVP అయ్యారు. అయితే శ్రద్ధతో మరియు గొప్ప వినయంతో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకొనే అంకిత భావం గల ఈ ప్రాక్టీషనర్ కర్ణాటక లోని రెఫ్రెషర్ వర్క్ షాప్ లో పాల్గొన్నాక VP గా అవ్వాలన్న ప్రేరణ పొంది జూన్ 2020లో VP అయ్యారు.

గత ఎనిమిది సంవత్సరాల్లో ఈమె దాదాపు 1000 మంది రోగులకు అనేక రకాల రుగ్మతలకు ముఖ్యంగా గ్యాస్టిక్ సమస్యలు, జలుబు మరియు దగ్గు, తలనొప్పి, పంటి నొప్పి, టాన్సిల్స్, మరియు దద్దుర్లు వంటి సాధారణ వ్యాధులు,అలాగే  క్యాన్సర్, అనారోగ్య సిరలు, గుండె సమస్యలు, మధుమేహం, హైపో థైరాయిడిజం, వంధత్వం, జుట్టు రాలడం, హెచ్ఐవి, మూత్రపిండ రుగ్మత, ప్రోస్ట్రేట్ సమస్యలు, డౌన్ సిండ్రోమ్, మూర్చ, ఉబ్బసం, బొల్లి మరియు తామర వంటి దీర్ఘకాలిక రోగాలకు కూడా చికిత్స చేయడం జరిగింది. చికిత్స చేసిన రోగులలో 80 శాతం మందికి 100% నయమవ్వడం ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే వారు హృదయపూర్వకంగా ఈ రెమిడీలు తీసుకున్నారని ఆమె విశ్వసిస్తున్నారు. ఇతరులు గణనీయంగా మెరుగు పడి రావడం మానేశారు. ఆమె రోగులలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యానికి చెందినవారు. రెమిడీల కోసం సందర్శించ లేని వారికి ఆమె పోస్టు ద్వారా రెమెడీలను పంపిస్తారు. వంద మంది రోగులకు 12 రకాల క్యాన్సర్లకు చికిత్స చేశారు. వీరిలో కొంతమంది క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న వారు కూడా ఉన్నారు. వీరిలో 50 మందికి పూర్తిగా నయమైనట్లు నివేదికల ద్వారా ఋజువు చేయబడింది. ప్రస్తుతం నిర్వహణ మోతాదు కొనసాగిస్తున్నారు. ఐదుగురు వృద్ధ రోగులు శాంతియుతంగా కన్నుమూశారు. మిగిలిన వారంతా గణనీయంగా మెరుగుపడి ఆరోగ్యం చేకూరి ప్రస్తుతం వైబ్రియానిక్ రెమిడీలు కొనసాగిస్తున్నారు. మధుమేహ రోగుల విషయంలో  కూడా ఆమె మంచి ఫలితాలు సాధించారు. ఇన్సులిన్ ఆధారిత పదిమంది రోగులలో ఐదు మంది 6-8 నెలలలో ఇన్సులిన్ తీసుకోవడం మానేశారు. మిగిలిన ఐదుగురిలో ఇన్సులిన్ తీసుకోవడం సగానికి సగము తగ్గించగలిగారు. ఇతర 15మంది డయాబెటిక్ రోగులలో ముగ్గురు వారి రక్తంలో చక్కెర స్థాయి సాధారణమైనప్పటి నుండి వారి వైద్యుని సలహా మేరకు అల్లోపతి మందులు ఆపివేశారు. వారు OW నిర్వహణ మోతాదులో కొనసాగిస్తున్నారు. మిగిలిన 12 మంది రోగులలో వారిచక్కెర స్థాయి స్థిరంగా ఉన్న స్థితికి మెరుగు పడడంతో అల్లోపతి ఔషధం సగం మోతాదులో తీసుకుంటున్నారు. వంధత్వానికి చేసిన చికిత్సలో 15 జంటల్లో ఆమె 100% విజయం సాధించారు. ముగ్గురు మహిళలు 1-2 నెలల్లో గర్భము దాల్చగా మిగిలినవారు సంవత్సరం లోపు గర్భం ధరించారు. మొత్తం 15 మంది మహిళలకు సాధారణ డెలివరీ మరియు ఆరోగ్యకరమైన పిల్లలు కలిగారు. ఇద్దరు తల్లులకు స్వామి కలలో కనబడి వారిని ఆశీర్వదించడమే కాకుండా వారి పిల్లలకు పేర్లు కూడా సూచించారు.

ప్రాక్టీషనర్ తన పొరుగువారి ఆవుకు 2019 డిసెంబర్లో CC1.1 Animal tonic + CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic వైబ్రోరెమిడీతో చికిత్స చేసిన ఆసక్తి కరమైన విషయాన్ని మనతో పంచుకుంటున్నారు. ఒక నెల తర్వాత రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తున్న ఈ ఆవు 7-8 లీటర్లు ఇవ్వడం ప్రారంభించింది మరియు ఈ పాలలో  మునుపటి కంటేవెన్న ఎక్కువగానూ మరియు పాలుతియ్యగానూ ఉంటున్నాయి.ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. మరొక సందర్భంలో 20 సంవత్సరాల పాటు మూర్ఛవ్యాధిని అనుభవిస్తున్న60 ఏళ్ల వ్యక్తి పది సంవత్సరాలుగా అధిక బిపి, మరియు ఎనిమిది సంవత్సరాలు నిద్రలేమి వంటి వాటితో బాధపడుతూ అల్లోపతి మందుల నుండి ఎటువంటి ఉపశమనం పొందలేక వైబ్రో రెమిడి తీసుకోగా దీనిని ప్రారంభించిన రెండు వారాల్లోనే అతనికి మూర్చలు కలగడం  ఆగిపోయాయి. బి.పి స్థిరంగా మారింది మరియు అతను బాగా నిద్ర పోవడంకూడా ప్రారంభించాడు. కాబట్టి అతని వైద్యుడు స్లీపింగ్ టాబ్లెట్ ఆపివేసి బి.పి ఔషధ మోతాదు తగ్గించారు. చివరకు అతను మూర్ఛ సంబంధించిన ఔషధాన్ని కనీస స్థాయికి తగ్గించాడు.

ఈ ప్రాక్టీషనర్ వైబ్రోసాధన ప్రారంభంలో తన హృయము రోగుల బాధలకు అంతగా స్పందించేది కాదు అనే భావనలో ఉండేది. అయితే ఆమెకు కలిగిన కొన్ని అపూర్వమైన అనుభవాలు ఆమె తన సేవ పట్ల తాదాత్మ్యాన్ని పెంపొందించేలా చేసాయి. కొంతమంది రోగులు మైగ్రేన్ గురించి ఎందుకు ఎక్కువ ఫిర్యాదు చేస్తున్నారు అని ఆమెకు సందేహం కలిగింది. మరుసటి రోజు ఆమెకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అది రోజంతా కొనసాగింది కాబట్టి మైగ్రేన్ ఎంత బాధాకరంగా ఉంటుందో ఆమె అర్థం చేసుకోగలిగింది. మరొకసారి ప్రజలలో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఉత్పన్న మవుతాయి అని అనుమానం కలిగింది.  వారంలోనే ఆమెకు బరువు బాగా పెరిగి రోజంతా నిద్ర మరియు సోమరితనం కొనసాగాయి. థైరాయిడ్ కోసం పరీక్షించినప్పుడు ఆమెTSH 13-14 mIU/L ఉంది. సాధారణస్థాయి 0.4 నుండి 4.0. ఈ TSH సాధారణ స్థాయికి రావడానికి రెండు నెలలు పట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఇవేమీ పునరావృతం కాలేదు. మరొక సందర్భంలో ఆమె తన తల్లి మరియు అత్తగారు ఇద్దర్నీ వారి మధుమేహ సమస్య గురించి మనసులో విమర్శించేది. అయినప్పటికీ బాహ్యంగా ఆమె వారి ఆహార నియంత్రణ నిమిత్తం  మరియు రోజూ నడకను కొనసాగించవలసిందిగా ప్రేమతో సలహా ఇచ్చేది. ఆ తరువాత ఆమెకు పునరావృత UTI (మూత్ర నాళ రుగ్మత) ఏర్పడింది. ఆమె డాక్టర్ సలహా మేరకు అనేక  రకాల పరీక్షలకు గురికాగా ఆమె గ్లూకోజ్ స్థాయి 400mg/dl కంటే ఎక్కువ పెరిగిందని తెలుసుకోవడం షాక్ కు గురిచేసింది. ఆమెకు అవసరమైన మందులతో పాటు ఒక వారం ఇన్సులిన్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.అందుచేత ఆమె అలోపతి బదులు వైబ్రియానిక్స్ మీద ఆధారపడటానికి ఇష్టపడ్డారు. రెండు వారాల తర్వాత ఉపవాస చక్కెరస్థాయి  90mg/dl. మరియు యాదృచ్చికచక్కర స్థాయి 140-160 mg/dL ఉంది. రక్తంలో చక్కెర అంత త్వరగా తగ్గుతుందని వైద్యుడు నమ్మలేకపోయారు. అప్పటినుండి ఇది సాధారణ పరిధిలోనే ఉంది.

వైబ్రో ప్రాక్టీస్ ప్రారంభ సంవత్సరాల్లో తన ఇంట్లోనే రోగులను చూడటానికి ఆమె నిర్ణీత సమయం కేటాయించేవారు. 2015లో ఆమె తన కుటుంబంతో కర్ణాటక లోని తమ ఇంటికి వెళుతూ గ్రామీణ కేరళ ప్రాంతములో దారి మర్చిపోయిన సందర్భంలో ఆమెకు  కళ్ళు తెరుచుకునే అనుభవం ఎదురైంది. ఈ ప్రాంతం నుండే ఎంతోమంది రోగులు చికిత్సకోసం ఆమె వద్దకు వచ్చేవారు.  అటువంటి మారుమూల ప్రదేశం నుండి బస్సు ద్వారా 200-300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావడంలో ఉన్న ఇబ్బందులు అ పేద రోగులకు ఒక నిర్దిష్ట సమయంలో ఆమె ఉంటున్న స్థానానికి చేరుకోలేక నిరాశ చెందే పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి  ఆ రోజునుండి ఏ సమయంలో నైనా ఆమె రోగులను చూడాలని సంకల్పించించేలా చేసింది. ఆమె భర్త కూడా ఈ సేవలో ఆమెకు పూర్తి సహకారం అందించేవారు. అతను రోగులను సౌకర్యవంతంగా కూర్చునే టట్లు చేసి ఆమె వీరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నోట్స్ రాసుకుంటారు. అలాగే ఆమె పేషెంట్లను చూడటానికి సమయాన్ని ఇస్తూ ఇంటి పనులను కూడా వారే చేసుకుంటారు. ఈ ప్రాక్టీషనర్ పిల్లలు కూడా రోగులు మరియు వారి పిల్లలను సౌకర్యవంతంగా ఉంచడంలో సహాయం చేస్తారు. ఆమె తన ఇంటికి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధాప్య గృహంలో 100 మందికి పైగా రోగులకు చికిత్స చేస్తూ ఉంటారు. ఆమె మూడు నెలలలో ఒకటి కంటే ఎక్కువసార్లు వారిని సందర్శించ లేకపోవడంతో ఆమె ప్రతీ నెలా ఒక వాలంటీర్ ద్వారా లేదా పోస్టు ద్వారా వారికి రెమిడీలను పంపుతున్నారు. అదనంగా ఆమె స్థానిక సాయి సెంటర్ నిర్వహించే వార్షిక వైద్య శిబిరాలలో కూడా  పనిచేస్తున్నారు.

సాయి వైబ్రియానిక్స్ తన జీవితంలో పెద్ద పాత్ర పోషిస్తోందని మరియు తనకు అపారమైన సంతృప్తిని ఇస్తోందని ఆమె పేర్కొంటున్నారు. రెమిడీ ఇవ్వడంలో సందిగ్ధంలో ఉన్నప్పుడల్లా స్వామి తనను ఆంతరంగికంగా నడిపిస్తూ ఆశీర్వదిస్తున్నారని  ఆమె భావిస్తున్నారు. ఎప్పుడైనా కృతజ్ఞతతో మరియు ప్రేమతో కొంతమంది రోగులు తమకు  వైబ్రియానిక్స్ ద్వారా కలిగిన పిల్లలను కలవడానికి తీసుకు వచ్చినప్పుడు వారు తమ చుట్టూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉన్నారని ఆమె భావిస్తున్నారు. ఈ వైబ్రో సాధన వీరిని శాంతియుతంగా మరియు సానుకూలంగా చేసింది. ఆమెకు వేర్వేరు మతవిశ్వాసాల నుండి అనేక మంది రోగులు ఉన్నారు. మొదట్లో సంశయించినప్పటకీ వారి ఇష్ట దైవ స్మరణతోనే రెమిడీ తీసుకోవాలని ఆమె వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవ రోగులు సత్యసాయి ప్రభువులో యేసును చూశామని చెప్పేవారు. ప్రాక్టీషనర్లు తమ రోగులను పూర్తి విశ్వాసంతో వైబ్రియానిక్స్ రెమిడీలను తీసుకోమని ప్రోత్సహిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని వీరు విశ్వసిస్తున్నారు.

పంచుకున్న కేసులు:

ప్రాక్టీషనర్ల వివరాలు 03508...फ्रांस

ప్రాక్టీషనర్  03508…ఫ్రాన్స్, అనుభవం గల నర్సు గానూ మరియు మత్తు మందు ఇచ్చే టెక్నీషియన్ గా ఉన్న ఈ ప్రాక్టీషనర్కి అనస్తీషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ తోపాటు నర్సింగ్ మరియు మత్తుమందు పునర్నిర్మాణములోకూడా మాస్టర్స్ డిగ్రీలు ఉన్నవి. గత నాలుగు దశాబ్దాలుగా ఆపరేటింగ్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ మరియు ఎమర్జెన్సీ లో పని చేసిన విస్తృతమైన అనుభవం ఉన్నది. ఎంతో అంకితభావంతో ఆమె దానిని కొనసాగిస్తున్నారు. ఆమె అనేక విదేశీ భాషలు కూడా నేర్చుకుంది మరియు మానవతావాద సహాయ సంస్థలతో విదేశాల్లో పని చేయడానికి ఒక ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ కూడా పొందారు.

ఆమె తన చిన్నప్పటి నుంచి మొదటి గురువుగా భావించే ఆమె తల్లి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఆమె మార్గనిర్దేశంలో యుద్ధ కళలు మరియు బౌద్ధ తత్త్వశాస్త్రం  అభ్యసించడంలో 15 సంవత్సరాలు గడిపారు. రోగుల విషయంలో వారి బాధను అర్థం చేసుకోవడం ప్రేమ మరియు సంరక్షణ అందిస్తూ వ్యవహరించడానికి ఆమె ఎంచుకున్న వృత్తికి ఇది ఒక ఆశీర్వాదం.

స్వామి యొక్క మరుపురాని దర్శనం ఆమెకు 1990 నవంబర్ లో పుట్టపర్తిలో లభ్యమైంది. స్వామి ఆమె వద్దకు వచ్చి ఆమెను తీక్షణంగా చూసేసరికి ఆ చూపు ఆమె హృదయాన్ని కరిగించి ఆనందంతో నింపింది. అప్పటినుండి ఆమె తను చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సంకల్పించారు. 1993 లో 12 సంవత్సరాల పాప తలకు తగిలిన గాయం కారణంగా చనిపోవడం గానీ లేదా జీవితాంతం వికలాంగురాలిగా ఉండిపోతుందని తెలియడంతో ఈమె చేసిన తీవ్ర ప్రార్ధనలు మరియు విభూతి ఫలితంగా మూడు నెలల కోమా తర్వాత అనూహ్యంగా కోలుకోవడం జరిగింది. ఈ సంఘటన  ప్రాక్టీషనర్ని అల్లోపతికి ప్రత్యామ్నాయ వైద్యం కోసం అన్వేషణ ప్రారంభించేలా చేసింది. ఆమె తల్లికి తీవ్రమైన కీళ్లవాతం కారణంగా అనేక నెలలు మంచం పట్టడం జరిగింది. 1995లో కొంత ఉపశమన దశలో ఆమెను పుట్టపర్తి ఆశ్రమానికి తీసుకు రాగా అక్కడ ఆమెకు స్వామి నుండి ఆశీర్వాదం లభించింది. మరియు ఆయుర్వేద చికిత్స కూడా చేయించుకోవడంతో పూర్తి స్వస్థత పొందినది. ఈ సంఘటన విభిన్న చికిత్సల యొక్క శక్తివంతమైన అంశంపై సమాధానాలు పొందాలనే ఆమె కోరికను మరింతగా పెంచింది.

నవంబర్ 2013 లో పుట్టపర్తి సందర్శించినప్పుడు ఆమె అంతరంగంలో స్వామిని ఇలా అడిగారు. ‘అన్నీ మీ శక్తితోనే జరుగుతున్నట్లయితే మీ ఆశ్రమంలో ఎనర్జీ మెడిసిన్ ఎందుకు లేదు’ ఇది యాదృచ్చిక సంఘటన కాదు గానీ వెంటనే ఆమె డాక్టర్ అగర్వాల్ గారి క్లినిక్కును సందర్శిస్తున్న ఒక భక్తుడిని చూసారు. వైబ్రియానిక్స్ గురించి ఆమెకు పరిచయం అయిన ఈ సంఘటన  తాను ఇంటికి తిరిగి ప్రయాణ మవడానికి సరిగ్గా 48 గంటల ముందు జరిగింది. నవంబర్ 2014లో తన తదుపరి సందర్శనలో ఆమె పుట్టపర్తిలో AVP శిక్షణ మరియు ఐదు సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్ లో SVP కోర్సు పూర్తి చేసుకున్నారు.

ఆమె తనతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులతో పాటు వారి జంతువులు, మొక్కలు, తోటలు మరియు ఇళ్ళతో తన అభ్యాసాన్ని ప్రారంభించారు. ప్రాక్టీషనర్కి చెందిన చాలా మంది రోగులు దూరంగా నివసిస్తూ  ఉండడంతో వారు ఫోన్లోనే సంప్రదిస్తుంటారు. ఆమె పనిచేస్తున్నచోట సహోద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు వివిధ వ్యాధుల కోసం రెమిడీలు తీసుకొని చక్కని ఫలితాలు పొందారు.  చికిత్సా విధానాన్ని నమ్మకంగా అనుసరించిన వారు పూర్తిగా నయమయ్యి రెమిడీల కోసం ఇప్పటికీ ఆమె వద్దకు వస్తూనే ఉన్నారు. మరికొందరు తమకు రెమిడీల వల్ల నయమైనప్పటికీ బలమైన వ్యసనాల కారణంగా సూచించిన జీవనశైలిని అనుసరించలేక ఆమెను సంప్రదించడం మానేసారు. ఉదాహరణకి సొరియాసిస్తో బాధపడుతున్న సహోద్యోగికి 90% చర్మపు సోరియాసిస్ ఏర్పడగా చికిత్స తర్వాత ఆమె మోచేతుల పై మాత్రమే చారికల మాదిరిగా వ్యాధి మిగిలి ఉంది. ఈ రోగి తన జీవన శైలిలో మార్పులు చేయలేకపోవడంతో చికిత్స నిలిపివేసారు. మూడు సంవత్సరాల తర్వాత కూడా పెద్ద మచ్చలు ఏవి పునరావృతం కాలేదని ప్రాక్టీషనర్ గమనించారు.

ప్రాక్టీషనర్ 2015లో స్వామిని తను పనిచేస్తున్న ఆసుపత్రిలో తన పనిలో వైబ్రియానిక్స్ఎలా మిళితం చేయాలో తెలపమని ప్రార్ధించారు. ఆమె తన పనిచేస్తున్నచోట పరిసరాలను వైబ్రో రెమిడిలతో పరిశుభ్రం చేయాలని మార్గనిర్దేశం పొందారు. ఆ తర్వాత ప్రజలు అధికంగా గుమిగూడే ప్రదేశాలు ఉదాహరణకి రిసెప్షన్, రికవరీ రూములు, స్టాఫ్ రూములు, రోగులను మార్పిడి చేసే రూములు, మరియు ఆపరేటింగ్ థియేటర్లలో ఆమె హీలింగ్ వైబ్రేషన్స్ పిచికారీ చేయడము ప్రారంభించారు. సాంకేతిక నిపుణులు ఇట్టి రూములను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత వారి  డ్యూటీ అనంతరం రాత్రిపూట ఆమె వైబ్రో రెమిడీలను పిచికారి చేసేవారు. దీనికోసం ఆమె క్రింది రెమిడీలు ఉపయోగించారు.CC10.1 Emergencies + CC17.2 Cleansing, ఇది చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు ఆమె కనుగొన్నారు. కానీ సిబ్బంది లో అలసట, ఒత్తిడి మరియు శక్తి హీనత  సంకేతాలను ఆమె గమనించారు. కాబట్టి ఈ క్రింది కొంబోలను ఉపయోగించారు CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders. ఆ తర్వాత ఆమె ఈ రెండూ రెమిడీ లను ఒకటి తర్వాత ఒకటి మారుస్తూ ప్రాంతాలు, స్థలము, స్థితి, మరియు వ్యక్తులను బట్టి నిర్దిష్ట,పద్దతిలో  స్ప్రే చేసేవారు. ఉదాహరణకు దుర్బలంగా ఉన్న రోగులు సూక్ష్మ క్రిముల నుండి రక్షించ బడటానికి CC9.2 Infections acuteని స్ప్రే చేసేవారు.

రోగుల ప్రవర్తన మరియు లక్షణాలలో సానుకూలంగా కనిపించే మార్పులు ప్రాక్టీషనర్ని కోంబోలతో ఈ మరువరాని అభ్యాసాన్ని కొనసాగించేలా ప్రోత్సహించాయి. రోగులు మరియు సిబ్బంది ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండడం కోసం ఆపరేషన్ థియేటర్లో అనస్తీషియా ప్రారంభించే ముందు ఆమె ప్రతిరోజు ఈ రెమిడీ స్ప్రే చేసేవారు. 2015-2019 మధ్య సుమారు 1,000 మంది రోగులు ఈ స్ప్రే ద్వారా లబ్ధి పొందడం విశేషం. ఆమె తనను, తన ఇంటిని, తోటను రక్షించడానికి మరియు శుద్ధి చేయడానికి మరియు ముఖ్యమైన నియామకాలపై ఆమె ప్రయాణించేటప్పుడు ఈ స్ప్రేని ఉపయోగిస్తారు.

SVP గా ఆమె అనుభవంలో శక్తివంతమైన కార్డు వ్యవస్థను ఉపయోగించడం అరుదైన బహుమతిగా భావించారు. ఎందుకంటే ఇది చికిత్సలో ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. వివిధ స్థాయిల నొప్పికి భిన్నమైన అల్లోపతి మందులు ఎలా పని చేస్తున్నాయనే దానిపై తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆమె 1-10 స్థాయిలో నొప్పికి చికిత్స చేయడానికి వాటిని సేకరించి పోటెన్టైజ్ చేసి ఒక కిట్ లా తయారుచేసి ఆమె వాటిని ప్రభావవంతంగా మరియు ఆచరణాత్మకంగా ఉపయోగించడం ప్రారంభించారు. అలోపతి మందుల ఉపసంహరణ కారణంగా ఏర్పడే మనో మాంద్యమునకు సంబంధించి CC15.5 ADD & Autism విజయవంతంగా ఉపయోగించారు. సంక్లిష్ట కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఆమె సీనియర్ ప్రాక్టీషనరు 02499 తో పంచుకొని వారితో కలిసి పనిచేస్తూ వారిచ్చే సలహాలను అనుసరిస్తారు. రోగులతో పాటు ప్రాక్టీషనర్లకు కూడా ప్రయోజనం చేకూరే నిమిత్తం ఈ రకమైన జత ఉండాలని ఆమె సిఫార్సు చేస్తున్నారు.

వైబ్రియానిక్స్ అనేది ఒక మూసివేయబడిన ఆరోగ్య వ్యవస్థ వంటిది కాదు, నిరంతరం అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థ అని వీరి అభిప్రాయం. వివిధ రకాల వ్యక్తులకు కలిగే వ్యాధులు మరియు వాటికి గల కారణాలను అన్వేషిస్తూ వివిధ మార్గాలకు అనుమతిస్తూ ఇది స్వేచ్ఛగా విస్తరిస్తోంది. ఇది ఒక్కొక్కసారి రోగి మీద ప్రత్యక్షంగా పని చేసినట్లు అనిపించకపోయినా అది మనకు కనిపించని అవసరమైన స్థాయిలో పని చేస్తూనే ఉంటుంది. కనుక ఇది ఎప్పటికీ వైఫల్యం కాదు, ఎందుకంటే చికిత్స తాలూకు బీజం అప్పటికే శరీరంలో ప్రవేశపెట్టబడి ఉంది. కొన్ని సందర్భాల్లో సాధారణ కోంబోల కలయికలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ సేవా సాధనలో గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హృదయాన్ని ఎల్లప్పుడూ దాని మూలంతో కలపబడి ఉంచడం ఈ సాధనకు గుండె వంటిది. స్వామీయే మనద్వారా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తే వారి జ్ఞాన దృక్పథం, మార్గదర్శకత్వం ద్వారా మనకు భరోసా ఇస్తారు. ఎందుకంటే స్వామి మాత్రమే వ్యాధిని స్వస్థపరిచేవారు కనుక.

మానవాళిని స్వస్థ పరిచే మరియు వారి బాధలను పోగొట్టే ఒక దైవిక సంస్థలో పని చేయడానికి తనను స్వీకరించినందుకు ప్రాక్టీషనర్ ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. శ్రీ సత్య సాయి బాబావారు ఆశీర్వదించిన దైవ ప్రకంపనలను రోగులకు ప్రసారం చేయడం గొప్ప బాధ్యతగా ఆమె భావిస్తున్నారు. ఈ సేవ తన జీవితంలో అవసరమైన వాటిని తిరిగి పొందేలా చేసిందనీ, స్వార్ధం, స్వప్రయోజనం అనే జాడ్యాలకు లోనూ కాకుండా తనను రక్షిస్తోందని ఈమె భావిస్తున్నారు. రోగిని నయం చేయడం అంటే తనను తాను నయం చేసుకోవడమే అని చెపుతూ వీరు ముగిస్తున్నారు.  

పంచుకున్న కేసులు:

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1. మా ప్రాంతంలో కొంతమంది కోవిడ్ నివారణకు వైబ్రియానిక్స్ రెమిడీలు ముందస్తు మోతాదుగా తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ వారు ఇప్పటికీ స్థానికంగా పంపిణీ చేసిన హోమియోపతి రెమెడీలను తీసుకుంటున్నారు. వారు రెండింటినీ కలిపి తీసుకోవచ్చా?

జవాబు 1: మనకు లభిస్తున్న నివేదికల ప్రకారము నివారణ కోసం ఇస్తున్న వైబ్రియానిక్స్ రెమిడీలు అద్భుతముగా  పనిచేస్తున్న అభిప్రాయము ఉన్నందున ఇవి సమర్థవంతమైనది అని నిరూపించబడింది. కాబట్టి రోగికి సౌకర్యవంతంగా ఉంటే హోమియోపతి రెమెడీ ఆపి మూడు రోజుల తర్వాత వైబ్రియానిక్స్ రెమిడీలు ప్రారంభింపవచ్చు. మరిన్ని వివరాల కోసం వార్తాలేఖ సంపుటము 10 సంచిక 4 ను చూడవచ్చు. రెండింటినీ తీసుకోకపోవడమే మంచిది. ఇతర వివరాలకోసం సంపుటము 11 సంచిక 2 (మార్చి-ఏప్రిల్) చూడండి.

________________________________________________________________________

ప్రశ్న 2. ఇమ్యూనిటీ బూస్టర్ నివారణగా OD గా తీసుకోవలసి ఉంటుంది. ఐతే ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించని వారికి మొదటి రోజు ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకు అనంతరం OD గా తీసుకోవాల్సిందిగా సూచించవచ్చా?

జవాబు 2: లక్షణాలు ఉంటే తప్ప మొదటి రోజే ఈ విధంగా తీసుకోవడం అవసరం లేదు.

________________________________________________________________________

ప్రశ్న3.  కోవిడ్-19 ఇమ్యూనిటీ బూస్టర్ ను ఎక్కువ మొత్తంలో తయారుచేయడానికి అనువైన పద్ధతి ఏది?

జవాబు 3: ఏదైనా రెమిడీ తయారు చేయడం కోసం ఒక ప్యాకెట్ పిల్స్(అరకేజీ/16 oz)ను లోహం తో తయ్యారుకాని పాత్రలో (2/3 వంతులు మించకుండా) ఉండేటట్లుగా పోసి 15 చుక్కలు రెమిడీ వేయాలి. ఈ పాత్రను సాధారణమైన పద్ధతిలోనే 8 ఆకారంలో 9 సార్లు షేక్ చెయ్యాలి. అనంతరం చేతికి తగలకుండా చిన్న బాటిల్స్ లో వేయాలి.

________________________________________________________________________

ప్రశ్న 4.  బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఒక రెమిడీని ఒక రోగికి ఉపయోగించినప్పుడు అదే లక్షణాలు గల మరొక రోగికి ఈ రెమిడీని తిరిగి ఉపయోగించవచ్చా ?

జవాబు 4: అవును. దే లక్షణాలు గల రోగికి అటువంటి రెమిడీ ఉపయోగించవచ్చు. అయితే నోసోడ్ విషయంలో ఇలా చేయకూడదు. ఎందుకంటే నోసోడ్ అనేది ప్రతీ వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది, ఒక విషయం గుర్తుంచుకోండి ఒకసారి శాంపిల్ వెల్ లో రెమిడీ ఉంచిన తర్వాత దాని పోటెన్సీ మారుతుంది. అందువల్ల ఇది ప్రసారానికి లేదా దాని కాపీని తయారు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది

________________________________________________________________________

ప్రశ్న 5: ఒక రోగికి ఒకే మూత్రపిండం ఉంది. అతని ఇతర మూత్రపిండమును బలోపేతం చేయడానికి వైబ్రియానిక్స్  సూచించవచ్చా?

జవాబు 5: అవును వైబ్రియానిక్స్ రెమెడీ ఖచ్చితంగా ఇతర మూత్రపిండమును బలోపేతం చేయడానికి అలాగే ఫాంటమ్ కిడ్నీ ని కూడా సక్రియం చేయడానికి సహాయపడుతుంది. యాదృచ్ఛికంగా ఆరోగ్యకరమైన మూత్రపిండము ఒక వ్యక్తికి తగినంత రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ సాధారణ జీవితాన్ని గడపడానికి సరిపోతుంది.

________________________________________________________________________

ప్రశ్న 6. ఆటిజం లక్షణాలు గల పిల్లల తల్లిదండ్రులకు మేము ఏమని సలహా లేదా హామీ ఇవ్వాలి?” విశ్వాసం కలిగి ప్రార్థన చెయ్యమని” చెప్పవచ్చా?  

జవాబు6: వాస్తవానికి మనం తల్లిదండ్రులతో కరుణ మరియు సున్నితంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అయితే మొదట మీరు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడం ద్వారా లక్షణాల యొక్క విశ్లేషణాత్మక వివరణ తీసుకోవాలి. తల్లిదండ్రులను కలవడానికి ముందు నిర్దిష్ట మార్గదర్శకత్వాన్ని అందించగలిగేటందుకోసం ముందుగా  కేసును అధ్యయనం చేయండి. మరియు ఆటిజం యొక్క వివిధ కోణాల విషయంలో కొంత జ్ఞానాన్ని పొందండి. చికిత్స త్వరగా ప్రారంభించినట్లైతే వేగంగానూ మరియు  మెరుగైన ఫలితం ఉంటుందని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. మనం ఆటిజం విషయంలో సహాయం చేయలేక పోయినప్పటికీ దీని ద్వారా వచ్చే మలబద్ధకం, మూర్ఛ, నిద్రలేమి, హైపర్యాక్టివిటీ, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వంటి అనేక లక్షణాలను మనము నియత్రించవచ్చు. చివరిగా తల్లిదండ్రులకు వారు ఈ పరిస్థితిలో ఉండడం యాదృచ్చిక అవకాశం ద్వారా కాదు దానికి ఒక కారణం ఉంది అని తెలుసుకోవాలి. వారు నేర్చుకోవడానికి కొన్ని జీవిత పాఠాలు ఉన్నాయి. వారు పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకొని వారికి సహాయ పడటమే కాకుండా వారి మానసిక సంక్షోబములను నియంత్రించగలిగే సహనాన్ని  పెంపొందించుకోవాలి. ఇటువంటి స్థితిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని ఇవ్వడానికి మీరు వారికి కూడా చికిత్స చేయవచ్చు మరియు అవసరమైతే ఈ రంగంలో సలహాదారు నిపుణులను సంప్రదించి వారికి మార్గనిర్దేశం చేయవచ్చు.

________________________________________________________________________

ప్రశ్న 7. లక్షణాల ఆధారంగా రోగ నిర్ధారణ చేయడానికి మరియు వైబ్రియానిక్స్ తో పాటు అల్లోపతీ చికిత్స సిఫార్సు చేయడానికి మాకు అనుమతి ఉందా?

జవాబు 7: లేదు, మనము అర్హత కలిగిన వైద్య నిపుణులము కానందువలన మనం ఎటువంటి రోగ నిర్ధారణ చేయకూడదు. వ్యాధి లక్షణాల ఆధారంగా వైబ్రో రెమిడీలతో చికిత్స చేయాలి. ఒకవేళ పేషంటు వ్యాధికి సంబంధించిన రిపోర్టులనూ తీసుకువస్తే అది సరి అయిన కాంబోను ఎంపిక చేయడానికి సహాయపడుతుంది. రోగి విషయంలో ఏదైనా తీవ్రమైన పరిస్థితిని అనుమానించి నట్లయితే రోగిని వెంటనే అల్లోపతీ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇవ్వాలి.

 

దివ్య వైద్యుని దివ్య వాణి

ఆహారాన్నివానప్రస్తాశ్రమ దీక్షగల భావనలో ఉన్నవారు అంత ప్రాముఖ్యత గల దానిగా పరిగణించరు. అనగా దానిపై దృష్టి పెట్టడానికి అర్హత లేని దానిగా భావిస్తారు. కానీ శరీరం మరియు మనసు పరస్పరఆధారితములు కనుక దాని పట్ల నిర్లక్ష్యం వహించడం  శ్రేయస్కరం కాదు. ఆహారము బట్టి మనసు, మనసును బట్టి ఆలోచన, ఆలోచన బట్టి చర్య ఉంటుంది కనుక ఆహారం అనేది ఒక ముఖ్యమైన అంశం. ఆహారము అనేది అప్రమత్తత మరియు నిర్లక్ష్యం, ఆందోళన మరియు ప్రశాంతత, ప్రకాశము మరియు నిస్తేజమును నిర్ణయిస్తుంది.

 

...  శ్రీ సత్య సాయి బాబా, “ఆహారము మరియు ఆరోగ్యము” దివ్యవాణి 21 సెప్టెంబర్  1979                                      http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf

 

సేవ అనేది సమాజానికి ఏమి ఇవ్వాలి అనే అవగాహన నుండి ముందుకు సాగాలి. ఒకరి పేరు, కీర్తిప్రతిష్టలు, తాను అనుభవించే ఇతర సర్వ సౌఖ్యాలు, సమాజం నుండి ఆవిర్భవించినవే. సమాజం ద్వారానే సఫలీకృతం సాధిస్తాడు. అటువంటి స్థితిలో సమాజానికి సేవ చేయకపోతే అతను మరి ఇంకెవరికి సేవ చేయగలడు. మానవుడు అనుభవిస్తున్న అన్ని ప్రయోజనాలకు మూలం అయిన సమాజానికి సేవ చేయాలనే పరిపూర్ణ కృతజ్ఞత సమాజం కోరుతుంది.  కృతజ్ఞత లేని మనిషి అడవి జంతువుల కన్నా హీనం.

... సత్యసాయిబాబా, “సేవ యొక్క విశిష్టత” దివ్య వాణి 1988 నవంబర్ 21                                                                http://www.sssbpt.info/ssspeaks/volume21/sss21-31.pdf

 

ప్రకటనలు

నిర్వహింపబోయే శిబిరాలు

  • ఇండియా పుట్టపర్తి : విర్టువల్  AVP వర్క్ షాప్, వారపు సమావేశములు సెప్టెంబర్-నవంబర్  2020 (పూర్తి వివరాలు అభ్యర్ధులకు అందించ బడతాయి) వివరాల కోసం సంప్రదించ వలసినవారు లలిత ఈమెయిల్  [email protected] లేదా ఫోన్ నంబరు 8500-676-092
  • యుకె లండన్ : UK జాతీయ వార్షిక పునశ్చరణ విర్టువల్  సదస్సు  2020 సెప్టెంబర్ 20 సంప్రదించ వలసినవారు జెరమ్ పటేల్ ఈమెయిల్ [email protected]   
  • యుఎస్ఎ రిచ్మండ్ VA: విర్టువల్ AVP వర్క్ షాప్ వారపు సమావేశములు 2020 సెప్టెంబర్ –నవంబర్ (పూర్తి వివరాలు అభ్యర్ధులకు అందించ బడతాయి), సంప్రదించ వలసినవారు సుసాన్ - ఈమెయిల్ [email protected]
  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ ** 2020 నవంబర్ 25 నుండి డిసెంబర్ 1 ,సంప్రదించ వలసినవారు లలిత –ఈమెయిల్ [email protected] లేదా ఫోన్ నంబరు 8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: SVPవర్క్ షాప్ ** 2020 డిసెంబర్ 3-7  సంప్రదించ వలసినవారు హేమ – ఈమెయిల్  [email protected]

 * AVP మరియు SVP వర్క్ షాపులు అడ్మిషన్ విధానం ద్వారా ఈ కోర్సు పూర్తి చేసిన వారికే ఉంటాయి. పునశ్చరణ సదస్సులు ప్రస్తుతం ప్రాక్టీషనర్లుగా ఉన్నవారికి మాత్రమే ఉంటాయి.  

**మార్పులు చేయబడవచ్చు

 

అదనంగా

1. ఆరోగ్య చిట్కాలు

నేత్రాలు ఎంతో విలువైనవి - తగిన జాగ్రత్తలు తీసుకోండి.

చెడు చూడకు మంచినే చూడండి, అప్పుడే మీ కళ్ళు పవిత్ర శక్తిని పొందుతాయి. దీని ద్వారా మీరు దైవ విశ్వరూపాన్ని దృశ్యమానం చేయగలుగుతారు.”… సత్య సాయి బాబా1

“అన్నీ ఇంద్రియాలలో దృష్టి చాలా ప్రధానమైనది కనుక ఆనందదాయకంగా ఉండాలి. అంధుడుగా ఉండటం కంటే దారుణమైనది ఏమిటంటే బాహ్య దృష్టి ఉన్నా జ్ఞాన దృష్టి లేకపోవడమే... హెలెన్ కెల్లర్ (అమెరికాకు చెందిన బధిర, అంధ రచయిత్రి మరియు కార్యకర్త)  

1. మీ కళ్ళను గురించి తెలుసుకోండి

1.1 మానవ శరీరంలో అత్యంత దుర్బలమైన, సంక్లిష్టమైన మరియు సున్నితమైన ఇంద్రియ అవయవములైన కనులు మనకు విలువైన దృష్టిని, కాంతి యొక్క రంగు, రూపం, మరియు కదలికల భావాన్ని ఇస్తాయి, మరియు శరీరం యొక్క జీవ గడియారమును నిర్వహిస్తాయి. గూడు వంటి ఎముకల నిర్మాణములో గల రెండు కనుగ్రుడ్లు బాహ్య భాగంలో కనురెప్పలు, కనుబొమ్మలు, మరియు కన్నీటిపొర ద్వారా రక్షింపబడుతున్నాయి.  ప్రతీ కన్నుకనుగ్రుడ్డు చుట్టూ ఉన్న 6 కండరాల ద్వారా కదులుతుంది. కాంతి కిరణాలు కంటిపాప ద్వారా కార్నియా పొర మరియు కటకము (లెన్స్) ద్వారా కేంద్రీకృతమై రెటీనా మీద ఒక చిత్రాన్ని ఏర్పరుస్తాయి.

రెటీనా పొర మిలియన్ల సంఖ్యలో కాంతి ప్రతిస్పందక కణాలను కలిగి ఉంటుంది. ఇవి చిత్రాన్ని నాడీ ప్రేరణల నమూనాగా మారుస్తాయి. ఈ ప్రేరణలు దృష్టి నాడి ద్వారా మెదడుకు వ్యాపిస్తాయి. ఇక్కడ ఇవి తిరిగి ఒకే చిత్రముగా రూపొందించడానికి ప్రాసెస్ చేయబడతాయి. 2-4

1.2  సాధారణ కంటి చూపు అంటే ఏమిటి? :  “20/20” (అడుగులలో) లేదా  “6/6” (మీటర్లలో ) దృశ్య తీక్షణత పూర్తిగా సరైనది కానప్పటికీ ఇది సాధారణ కంటి చూపును సూచిస్తుంది. మొదటి సంఖ్య (పైన పేర్కొన్నది) కంటి పరీక్ష సమయంలో స్నెల్లెన్ కంటి చార్టు  ఉపయోగించి దృష్టిని పరీక్ష చేసే దూరాన్ని సూచిస్తుంది. రెండవ సంఖ్య చార్టులోని అక్షరాలను ఆరు మీటర్ల వద్ద ఎంత బాగా చదవగలరో మనకు చెబుతుంది. ఒకరికి 6/9 దృశ్య తీక్షణత ఉంటే జనులంతా సాధారణముగా 9 మీటర్ల వద్ద చూడగలిగితే అతను ఆరు మీటర్ల వద్ద ఉన్న వస్తువును మాత్రమే చూడగలడు.5,6  

1.3  కంటి సాధారణ పీడనం అంటే ఏమిటి? ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ IOP — గా పిలవబడే కంటి  పీడనము కనుగ్రుడ్డు లోని ద్రవపు పీడనము కొలిచే కొలత. సాధారణ కంటి పీడనము 15 mmHg ఉంటుంది. సాధారణ కంటి పీడనము 90% ప్రజలలో ఈ కొలత కన్నా ఎక్కువ పరిధిలో 10 మరియు 21 మధ్య ఉంటుంది.  ఇది వయస్సు, రక్తపోటు, పల్స్ రేటు, మరియు వక్రీభవన లోపం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 21 కన్నా ఎక్కువ కంటి పీడనము సాధారణంగా ప్రమాద కారకంగా పరిగణింపబడుతుంది.7,8 

1.4 కంటి వ్యాధులు ఇన్ఫెక్షన్ వలన గానీ, జన్యు పరమైన లోపాలు, లేదా పుట్టుక తోనే వచ్చే లోపాలు, పుట్టినప్పటినుండి నిర్లక్ష్యం లేదా ప్రమాదం లేదా తప్పుగా వాడడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి.

2. కంటి ఇన్ఫెక్షన్లు

2.1 హానికరమైన సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, లేదా వైరస్లు) లేదా విదేశీ కణాలు కంటిలోని ఏదైనా భాగాన్ని లేదా దాని కణజాలమును ఆక్రమించినపుడు అంటు వ్యాధులు సంభవిస్తాయి.9-13 

2.2 అంటు వ్యాధులు: సర్వసాధారణముగా వచ్చే అంటు వ్యాధి  కండ్లకల లేదా  పింక్ ఐ. ఇది సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వలన రావచ్చు.  అకస్మాత్తుగా కనిపించే సాధారణ లక్షణాలు ఎరుపుదనము, దురద, కాంతికి సున్నితత్వము, మంటగా ఉండటం, కళ్ళలో ఇసుక, గింజలు, లేదా దుమ్ము పడ్డట్టు చికాకు కలిగించే భావన. కనుల వెంట నీరు కారడం, కనురెప్పల వాపు (కొన్నిసార్లు బాధాకరమైనవిగా కూడా ఉంటాయి) మరియు అస్పష్టమైన దృష్టి ఉంటాయి.  ట్రకోమా అనేది ఇంకొక అత్యంత వేగంగా వ్యాప్తి చెందగల అంటువ్యాధి  కానీ ఇది కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చెదురుమదురుగా ఉంటుంది 9-12 .

2.3 అంటువ్యాధులు కాని ఇన్ఫెక్షన్లు : పుప్పొడి వంటి ఎలర్జీ కారకాలు, ఏదైనా రసాయన పదార్ధము చింది పడడం వలన, విషపూరిత పదార్ధము యొక్క ఆవిరి, ఏదైనా మంటను రేకెత్తించే పదార్ధము, లేదా కాంటాక్ట్ లెన్స్ ను ఎక్కువ కాలం వాడడం వంటివి. అలెర్జీ సంబంధిత కండ్లకలక విషయంలో మంట, దురద. కోసుకుపోయినట్లు బాధ అధికంగా ఉండవచ్చు. దీంతోపాటు తుమ్ములు మరియు నాసికా ఉత్సర్గము (ముక్కు నుంచి ద్రవం కారడం) ఎక్కువగా ఉంటుంది. శిలీంద్రాల ద్వారా వచ్చే (ఫంగల్) ఇన్ఫెక్షన్ చాలా అరుదు. ఇతర సాధారణముగా వచ్చే ఇన్ఫెక్షన్లు కెరటైటిస్ (బ్యాక్టీరియా, వైరస్, లేదా నీటిలో ఉన్న పరాన్నజీవుల కారణంగా ఏర్పడే కార్నియా యొక్క వాపు), యువేటిస్ (హెర్పెస్ వంటి వైరస్ కారణంగా వస్తుంది కానీ ఇతర స్వయం ప్రతి రక్షక (ఆటో ఇమ్యూన్) వ్యాధులైన రుమటాయిడ్ ఆర్థ్రైటీస్, ల్యుపస్ వంటి చర్మ వ్యాధులతో కూడి ఉంటుంది. కనురెప్పలకు ఇన్ఫెక్షన్, కంటి కురుపు (మొటిమ వలనే బాధకారమైన ఉబ్బు) మరియు చలాజియాన్ (ఉత్సర్గములు అధికం కావడంచేత ఏర్పడేది సాధారణంగా బాధ రహితమైనది) మరియు బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాల ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే కార్నియల్ అల్సర్.9,10,13 

3. కంటి సమస్యలు /లోపాలు

3.1  సాధారణ వక్రీభవన లోపాలు: మయోపియా-సాధారణంగా బాల్యము నుండి మొదలయ్యే ఈ రుగ్మత వలన సుదూర వస్తువులను చూడలేక పోవడం, హైపర్ మెట్రో పియా- చిన్న కంటి గ్రుడ్డు కారణంగా సమీపంలోని వస్తువులను చూడలేకపోవడం, ఆస్టిగ్మాటిజం- సక్రమమైన వక్రత లేని కార్నియా కారణంగా దగ్గర మరియు దూరపు వస్తువులు చెదిరి పోయినట్లుగా కనిపించడం, ప్రెస్బైయోపియా -  40 సంవత్సరాల వయసు తరువాత వస్తువులను చూడడంలో కష్టముగా ఉండడం, లేదా చేతి పొడవులోఉన్న అక్షరాలను చదవలేక పోవడం.4,15 

3.2 కంటిశుక్లం అనేది కంటి కటకం (లెన్స్) తక్కువ అనువైనదిగా, తక్కువ పారదర్శకంగా, మరియు వయసుతో మరింత దట్టంగా  మేఘం వంటిది కమ్ముకున్నట్లుగా ఒకటి లేదా రెండు కళ్ళకూ ఏర్పడి దృష్టి తగ్గుతుంది. దీని లక్షణాలు దృష్టి క్షీణించడం, రంగులు  అస్పష్టంగా లేదా పసుపు రంగులో కనబడడం, దృష్టి అస్పష్టంగా ఉండడం లేదా ద్వంద దృష్టి, కళ్ళజోడులో తరచూ మార్పులు, కాంతి చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు కనబడడం, ప్రకాశవంతమైన కాంతి చూడడంలో అసౌకర్యం, మరియు చదవడంలో, డ్రైవింగ్ చేయడంలో, లేదా రాత్రి పూట స్పష్టంగా చూడడం ఇబ్బంది వంటివి కలుగుతాయి. వయసుతో పాటు, పోషక లోపం, జన్యుపరమైన లోపాలు, డయాబెటిస్ లేదా గతములో నిర్వహించిన కంటి శస్త్ర చికిత్స వంటి కొన్ని వంటి వైద్యపరమైన పరిస్థితులు, రేడియేషనుకు గురి కావడం, దీర్ఘకాలిక స్టెరాయిడ్ల వినియోగం, గాయం లేదా వ్యసనాలు వంటివి కూడా కారణం కావచ్చు. 16

3.3 గ్లూకోమా అనేది కాంతి యొక్క సున్నితత్వం లేదా దానికి తక్కువ రక్త సరఫరా కారణంగా కంటిలో ఉండే దృష్టి నాడుల క్షీణత, మరియు దెబ్బతిన్న పరిస్థితి. కార్నియా మరియు కటకము మధ్య ఉండే సజల ద్రవము అధిక ఉత్పత్తి  లేదా అడ్డుపడడం కారణంగా ప్రవాహ నిలుపుదల వల్ల కంటిపై ఒత్తిడి పెరగడం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. కంటికి నష్టం ఎటువంటి హెచ్చరిక లేకుండా క్రమంగా ఉంటుంది. అత్యంత సాధారణ లక్షణం రెండు కళ్ళల్లోనూ తరచుగా దృష్టిని మందగింప చేసే మచ్చలు ఏర్పడి తరువాతి దశలలో సొరంగం దృష్టి ఏర్పడడం. కొన్ని సందర్భాల్లో గుర్తించదగిన లేదా అస్పష్టమైన దృష్టి, ప్రకాశవంతమైన లైట్లు చుట్టూ ఇంద్రధనస్సు రంగు వృత్తాలు కనిపించడం, తల నొప్పితో కూడిన తీవ్రమైన నొప్పి, ఎర్రటి కన్ను, వికారం లేదా వాంతి, మరియు ఆకస్మిక దృష్టి నష్టం ఏర్పడతాయి. చికిత్స లేదా శస్త్రచికిత్సతో నష్టం తిరిగి పొందడం కష్టం కాబట్టి 60 సంవత్సరాల వయసు దాటిన పెద్ద వారిలో అంధత్వానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి..17,18

3.4 రెటీనా రుగ్మతలు: ప్రధాన రెటీనా సమస్యలు మాక్యులర్ క్షీణత మరియు రెటీనా అనుసంధానం కోల్పోవడం. వీటి లక్షణాలు అనేక కొత్త ప్లోటర్లు (దారం వంటి నల్లమచ్చలు లేదా మరకలు ) ఏర్పడడం, దృశ్య క్షేత్రం యొక్క అంచు వద్ద ఆకస్మిక మరియు వేగవంతమైన మెరుస్తున్న కాంతి కనబడడం, వక్రీకృత దృష్టి మరియు కొన్నిసార్లు బూడిదరంగు తెర వంటిది దృష్టిని అడ్డుకుంటుంది. రెటీనా అనుసంధాన లోపం అనేది ఏదైనా గాయం ఏర్పడినందువల్ల తప్ప మిగతా విషయాలలో నొప్పి లేకుండా ఉంటుంది, మరియు కొన్ని గంటలు లేదా రోజుల్లో ఆకస్మికంగా సంభవిస్తుంది. అస్థిరంగా ఉండేవారికి, లేదా అధిక చక్కెర స్థాయి ఉన్న వారికి డయాబెటిక్ రెటినోపతి వచ్చే ప్రమాదం ఉంది.19,20

3.5 ఇతర కంటి రుగ్మతలు: కొన్ని అరుదైన లేదా జన్యుపరమైన లోపాలు రాత్రి అంధత్వం మరియు సాధారణ ఎరుపు-ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు నీలం పసుపు రంగులను గుర్తించి వేరు చేయలేనప్పుడు ఏర్పడేది రంగు అంధత్వం.19,21

మెల్ల కన్నుఅనేది ఒక కంటి లోపం. ఇక్కడ కళ్ళు దేనినైతే చూస్తాయో సరిగ్గా దానిపైనే సమలేఖనం చేయబడవు, మరియు వేర్వేరు ప్రదేశాలపై లగ్నం ఔతాయి, ఒకే సమయంలో ఒకే స్థలాన్ని చూడలేవు. ఈ లోపానికి ఖచ్చితమైన కారణం తెలియదు. ప్రభావితమైన కంటి నుండి మెదడు సంకేతాలు గ్రహించడంలో లోపం కారణంగా ఇది సోమరితనపు కంటికిలేదా లేజి ఐ కి దారి తీయవచ్చు.22

పొడి కళ్ళు మన కన్నీళ్లు కళ్ళను తగినంత ఆర్ద్రతగా ఉంచలేనప్పుడు మరియు వయస్సుతో పాటు ఈ సమస్య తీవ్రమవుతున్న సందర్భంలో ఈ రుగ్మత  సంభవిస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి వలన లేదా యాంటీ హిస్టామిన్ వంటి ఔషధము మరియు పొగ లేదా గాలికి గురికావడం వల్ల కూడా ఏర్పడవచ్చు. దీని లక్షణాలు గుచ్చుతున్నట్లు, లేదా మంట కంటిలో నిరంతర అసౌకర్యం లేదా నిరంతరంగా కన్నీళ్లు రావడం.23

నీరు కారే కళ్ళు నొప్పితో కూడి ధారగా నీటి చుక్కలు కారడం, దృష్టి లో మార్పు, లేదా కంటిలో ఏదో అడ్డు ఉండి అది బయటకు రాని భావన.24

మరికొన్ని సమస్యలు కనురెప్పలు వాలిపోవడం, కనులు ఉబ్బడం, విశ్రాంతి లోపం కారణంగా  కళ్ళచుట్టూ చీకటి వలయాలు, పోషకాహార లోపం, మరియు జీవనశైలి లోపం కారణంగా వస్తాయి.25,26

3.6 డిజిటల్ కంటి వత్తిడి – ఉత్పన్నమవుతున్న ప్రజారోగ్య సమస్య90% కంటే ఎక్కువ డిజిటల్ పరికర వినియోగదారులు కంటి ఒత్తిడిని అనుభవిస్తారు. అతి  సాధారణ లక్షణాలు నీరు కారడం, కంటి అలసట, పొడికళ్లు, అస్పష్టమైన దృష్టి, మండుతున్న భావన, ఎరుపుదనం, మరియు ద్వంద్వ దృష్టి. దృష్టికి సంబంధం లేని సాధారణ లక్షణాలు మెడబిగుసుకు పోవడం, సాధారణ అలసట, తలనొప్పి మరియు వెన్నునొప్పి. కనురెప్పలు వాల్చే సంఖ్య నిమిషానికి 10-16 ఐన సాధారణ స్థాయి తో పోలిస్తే నిమిషానికి 5-9 స్థాయికి తగ్గుతుంది.27-29

4. గాయాల నుండి మీ కళ్ళను సంరక్షించండి

4.1 కంటి గాయాలు: గాయాలు అయ్యేందుకు అవకాశం ఉన్న అంశాలు : కంటి పై గీతలు ; దైనా పరికరం ద్వారా లేదా పెంపుడు జంతువు ద్వారా కంటి పై గీతలు, రాపిడి, కంటి లోకి వెళ్ళే విదేశీ కారకములు, రసాయన ఆమ్లాలు, లేదా క్షారాలు కారణంగా ఏర్పడే గాయాలు, లేదా ఆవిరి, పొగల లేదా రేడియేషనుకు  ప్రత్యక్షంగా గురి కావడం, కంటికి దెబ్బ తగలడం వలన, లేదా కోసుకోవడం వలన ఏర్పడే బ్లాక్ ఐ, లేదా వాపు కలుగుతూ ఉంటాయి. సాధారణ చిహ్నాలు కంటిలో లేదా కంటి వెనుక నొప్పి, కనురెప్పల అధిక స్పందన, కంటి నుండి నిరంతరం నీరు కారడం, దృష్టి లోపం లేదా తగ్గుదల, లేదా దృష్టి కోల్పోవడం, కంటిలో రక్తం లేదా కంటిచుట్టూ రక్తస్రావ చిహ్నాలు.30

4.2  ప్రథమ చికిత్స మరియు వైద్య సంరక్షణసమస్య తీవ్రత మేరకు వెంటనే ఒక అత్యవసర కంటి ఆసుపత్రిని సందర్శించండి. కానీ దీనికి ముందు ప్రథమ చికిత్సకు సంబంధించిన క్రింది సాధారణ దశలు సహాయపడతాయి.31-33

·       కను రెప్పలు మూసి తెరవడం ద్వారా చిన్న దుమ్ము లేదా ఇసుకరేణువులను వదిలించుకోవచ్చు.

·       కనురెప్పలు మెల్లిగా తెరిచి ఏదైనా నలకలు వంటి వాటిని బయటకు తీయడానికి కళ్ళను శుభ్రమైన నీటితో కడిగి వేయండి లేదా ధారగా నీరు పోయండి. కంటి పై రెప్పను క్రింది రెప్పతో తాకించడం ద్వారా ధూళి కణాలు మెల్లగా బయటకు తొలగింపబడతాయి.

·       కంటిలో ఏవైనా రసాయనాలు పడినప్పుడు వెంటనే కాంటాక్ట్ లెన్స్ తొలగించండి. ప్రభావితమైన కంటి వైపు తలను వాల్చడం ద్వారా కళ్ళను కడిగే టప్పుడు లేదా నీటితో తడిపేటప్పుడు రసాయనాల నీరు మరొక కంటి లోనికి లేదా ముఖము పైన మరొక ప్రక్కకి పోకుండా ఉంటుంది. పదిహేను ఇరవై నిమిషాలు కంటిని శుభ్రపరిచిన తరువాత రోగిని ఆస్పత్రికి తీసుకువెళ్ళేటప్పుడు శుభ్రమైన గుడ్డను కంటిపైన ఉంచండి.

·       కంటి వద్ద తెగినా గాయం ఐనా కన్నం పడినా కంటిపై నీరు పోయవద్దు. దానికి బదులు శుభ్రమైన మృదువైన గుడ్డతో లేదా బ్యాండేజీ క్లాత్ తో నొక్కకుండా మృదువుగా రక్షణగా కంటిపై ఉంచండి.

·       కంటిపై ఏదైనా గుద్దుకున్నప్పుడు నొప్పి మరియు వాపును నిరోధించడానికి చల్లగా ఉండే మృదువైన గుడ్డతో కంటిని ఒత్తిడి లేకుండా మూసి ఉంచాలి.

4.3  గాయం తర్వాత చేయకూడనివి: తలను కదల్చకుండా నివారించండి. కనుగ్రుడ్లు తిప్పకూడదు, కంటిని వేలు లేదా పత్తితో శుభ్రపరచుకొనడం కోసం వాటిని రుద్దకూడదు. సొంత వైద్యం చేసుకోకూడదు.31-33

5. ఆరోగ్యకరమైన కళ్ళకు నివారణ చర్యలు

5.1 తరచుగా చేతులు కడుక్కోవడం, కళ్ళను రుద్దకుండా చూసుకోవడం, మరియు పరిశుభ్రమైన తువ్వాళ్ళు వాడడం వంటి మంచి ఆరోగ్య పద్ధతులు ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడంలో సహాయపడతాయి. 10-13 

5.2 మీ కళ్ళను బలోపేతం చేయండికళ్లకు విశ్రాంతి ఇవ్వడానికి మరియు విశ్రాంతి పెంచడానికి కొన్ని మార్గాలు 26,34-40

·        అరచేతులతో  మూసివేసిన కళ్లపై సున్నితంగా ఉంచుతూ, కాంతి లేకుండా నిరోధించి, హాయిగా కూర్చుని శ్వాస క్రియ పై దృష్టి కేంద్రీకరించండి. ఇలా  ఐదు నుండి పది నిమిషాలు చొప్పున రోజుకు రెండుసార్లు లేదా ఒకటి లేదా రెండు నిమిషాలు చొప్పున రోజులో అనేక సార్లు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి..34,36-38   

·       చూపుడు వ్రేళ్లతో కళ్ళను తేలికగా నొక్కుతూ కొన్ని సెకన్ల పాటు ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవండి.  కొన్ని సెకన్ల పాటు కనురెప్పలు వేయడం, తెరవడం ఇలా  రోజుకు 5 సార్లు ఇలా పునరావృతం చేయండి.  వేళ్ళతో కనుబొమ్మలకు తేలికపాటి మసాజ్ కూడా సహాయపడుతుంది..36-38

·        సూర్యరశ్మిసోకే ప్రదేశంలో  ఉదయాన్నే లేదా సాయంత్రం ఐదు నుండి పది నిమిషాలు ఎండ తక్కువగా ఉండి వేడిమి లేనప్పుడు సూర్యరశ్మి తెరిచిన కనులకు సోకే విధంగా నిలబడండి.34,36,37

·       కంటి కదలికలు పైకి కిందికి మరియు కుడి మరియు ఎడమ తర్వాత కంటి గ్రుడ్డు భ్రమణం సమీప మరియు దూరాల మధ్య దృష్టిని మార్చడం ద్వారా ఫోకస్ చేయడం, అప్పుడప్పుడూ సాధారణమైన రెప్పల కదలికలు, మరియు  ఖాళీ గోడ వైపు చూస్తూ నెమ్మదిగా రెప్పలు వాల్చి తెరవడం,-36-39 .

·       నిద్రించడానికి ముందు కూరగాయలు లేదా బాదం నూనెతో కంటి క్రింద నల్ల చారికలపై మసాజ్ చేయడం.26

·       కంటి వ్యాయామాల తర్వాత అలసినట్లు అనిపించినప్పుడు దోసకాయ లేదా ముడి బంగాళదుంప ముక్కలు లేదా వడకట్టగా మిగిలిన టీపొడి సంచులతో చల్లగా మెల్లగా కళ్లను వత్తాలి. ఉదయాన్నే లేవగానే నోటి నిండా నీరు పుక్కిలించడం,  కనురెప్పల మీద చల్లటి నీటిని చిలకరించడం, రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది .40  

·       ఈత, నడక. యోగాసనాలు, మరియు గురువుల మార్గదర్శకత్వంలో మెడ మరియు భుజాల వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. మరియు కళ్ళకు శక్తి నిస్తాయి.  

5.3  కంటికి అనుకూలమైన ఆహారం: ఎ, సి, డి, మరియు ఈ విటమిన్లు  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు జింక్ ఖనిజ లవణమును కలిగి ఉన్న సమతుల్య ఆహారం కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు, కాయలు మరియు విత్తనాలలో ఇవి పుష్కలంగా లభిస్తాయి.35,41-43

6.  కంటి సంరక్షణ కోసం చిట్కాలుమన దృష్టిని మెరుగుపర్చడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు

చురుకైన జీవనశైలి, తగినంత విశ్రాంతి, సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం. నిటారుగా కూర్చోవడం ముఖ్యంగా డిజిటల్ గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు, సాధారణ వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత. స్వచ్ఛమైన గాలి, వీటన్నింటి కన్నా కూడా శరీరం మరియు మనస్సు యొక్క విశ్రాంత స్థితి కంటి సమస్యలను నివారించడానికి ఉపయోగపడతాయి.17,34-40,44-45

·  కొన్ని సంవత్సరాల వరకూ సమగ్రమైన కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. పిల్లలకు ఆరు నెలల వయసులోనూ, మూడు సంవత్సరాల వయసులో ఆ తరువాత 6 నుండి 17సంవత్సరాల మధ్య ప్రతీ సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలి. పెద్దల విషయంలో 40 సంవత్సరాల లోపు వారికి ప్రతీ 5 నుండి 10  సంవత్సరాలకు, ఆ తరువాత 54 ఏళ్ళు వచ్చే వరకూ ప్రతీ 2-4 సంవత్సరాలకు ఒకసారి ఆపై వయసు పెరిగే కొద్దీ చాలా తరుచుగా పరీక్షలు చేయించు కోవాలి.  ప్రారంభ రోగ నిర్ధారణ మాత్రమే అంధత్వాని నిరోధించగలదు.17,44,45

·  మీ కుటుంబ చరిత్ర మరియు రానున్న ఇబ్బందులు గురించి తెలుసుకోండి. అవసరమైన చోట రక్షక అద్దాలు ధరించండి. దృశ్యమాన మార్పులపై వెంటనే శ్రద్ధ వహించి వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి. హ్రస్వదృష్టి, డయాబెటిస్, గుండె సమస్యలు ఉన్నవారు, లేదా స్ట్రోక్ కు గురి అయివారు, మరియు కాంటాక్ట్ లెన్స్ వాడేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.17,44 

·  డిజిటల్ కంటి ఒత్తిడి నివారించడానికి 20-20-20 నియమాన్ని పాటించండి.ప్రతీ 20 నిమిషాలకు విరామం తీసుకోండి మరియు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. మీకు గుర్తు చేయడానికి కంటి సంరక్షణ అనువర్తనాలను డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాక డిజిటల్ పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు కంటికి హాని కలిగించే విధంగా కాంతి లేకుండా డిస్ప్లే సెట్టింగులలోకి వెళ్ళి సర్దుబాటు చేసుకోండి.46-48

ప్రస్తావనలు, వెబ్సైట్ లింకులు:

       1.      Sathya Sai Baba, Divine Discourse on “I and You are One”, Guru Purnima day, 5 July 2001, SSS volume 34, chapter 13, page 182 http://www.sssbpt.info/ssspeaks/volume34/sss34-13.pdf

2.      https://www.merckmanuals.com/home/eye-disorders/biology-of-the-eyes/structure-and-function-of-the-eyes

3.      Structure of eye : https://byjus.com/biology/structure-of-eye/

4.      https://kidshealth.org/en/kids/eyes.html

5.      20/20 vision: https://www.allaboutvision.com/en-in/eye-exam/2020-vision/

6.      20/10 vision: https://www.nvisioncenters.com/lasik/20-10-vision/

7.      Normal eye pressure: https://www.brightfocus.org/glaucoma/question/what-considered-normal-eye-pressure

8.      Study on intraocular pressure: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5957383/

9.      Eye infections: https://www.allaboutvision.com/en-in/conditions/eye-infections/

10.  Conjunctivitis & Prevention: https://www.mayoclinic.org/diseases-conditions/pink-eye/symptoms-causes/syc-20376355

11.  Pink eye & prevention: https://www.allaboutvision.com/en-in/conditions/conjunctivitis/

12.  Trachoma: https://www.who.int/news-room/fact-sheets/detail/trachoma

13.  All eye infections & Prevention: https://www.healthline.com/health/infected-eye;  https://www.healthline.com/health/eye-health/home-remedies-for-eye-infection#overview

14.  Refractive errors: https://www.nei.nih.gov/learn-about-eye-health/eye-conditions-and-diseases/refractive-errors

15.  https://www.who.int/news-room/q-a-detail/what-is-a-refractive-error

16.  Cataract: https://www.mayoclinic.org/diseases-conditions/cataracts/symptoms-causes/syc-20353790

17.  Glaucoma: https://www.mayoclinic.org/diseases-conditions/glaucoma/symptoms-causes/syc-20372839

18.  https://www.glaucoma.org/gleams/what-are-the-symptoms-of-glaucoma.php

19.  Retinal disorders: https://www.ccteyes.com/retina-problems-warning-signs-you-may-have-a-retinal-disease/

20.  Floaters: https://www.brightfocus.org/macular/article/what-causes-eye-floaters

21.  Colour blindness: https://www.aoa.org/patients-and-public/eye-and-vision-problems/glossary-of-eye-and-vision-conditions/color-deficiency

22.  Squint & lazy eye: https://www.medicalnewstoday.com/articles/220429

23.  Dry eye: https://www.aoa.org/patients-and-public/eye-and-vision-problems/glossary-of-eye-and-vision-conditions/dry-eye

24.  Watering eyes: https://www.health.com/condition/eye-health/watery-eyes?slide=6f6f7ac5-f902-4822-ab25-fce2aad58c5a#6f6f7ac5-f902-4822-ab25-fce2aad58c5a

25.  Twitching: https://www.allaboutvision.com/en-in/conditions/eye-twitching/

26.  Dark circles: https://www.healthline.com/health/how-to-get-rid-of-dark-circles-permanently#remedieshttps://www.mapsofindia.com/my-india/health/30-best-home-remedies-to-remove-dark-circles-naturally-and-permanently

27.  Coles-Brennan, C., Sulley, A., & Young, G. (2019), Management of digital eye strain, Clinical and Experimental Optometry, 102, 18-29.

28.  Muniraju, N. M.,  Amarnath, H. K., &  Ashwini, M. J.  (2018), A review on effects of electronic Gadgets on eye, Journal of Ayurveda Physicians & Surgeons, 5(1). 

29.  Digital eye strain: https://medpharm.co.za/eye-strain-the-new-affliction-of-the-digital-generation/

30.  Eye injuries: https://www.allaboutvision.com/en-in/conditions/eye-injuries/

31.  First aid tips: https://www.aao.org/eye-health/tips-prevention/injuries

32.  First aid tips: https://www.stjohn.org.nz/first-aid/first-aid-library/eye-injuries/

33.  Washing chemical in eye: https://www.mayoclinic.org/first-aid/first-aid-eye-emergency/basics/art-20056647

34.  Guide to eye exercises & Bates method: https://seeing.org/techniques/

35.  https://www.bateseyeexercises.com/basicInformation.php

36.  Eye exercises for perfect eyesight: https://eyecare.sriaurobindoashram.org/resources/School_For_Perfect_Eyesight.pdf

37.  Dr Agarwal eye care exercises: https://www.slideshare.net/elsavonlicy/agarwal-the-complete-book-of-eye-care

38.  Rejuvenating eye exercises: https://www.lenspure.com/articles/eye-exercises-alleviate-eye-strain

39.  Prevent eye strain:  https://www.healthline.com/health/eye-health/eye-exercises

40.  Splash eyes along with mouthful water: https://www.youtube.com/watch?v=gs-x4tNIGbw

41.  Nutritive diet for eyes: https://www.aoa.org/patients-and-public/caring-for-your-vision/diet-and-nutrition

42.  Eye friendly diet: https://www.allaboutvision.com/nutrition/nutrition_summary.htmhttps://www.allaboutvision.com/en-in/conditions/cataracts/

43.  Importance of Zinc for vision: https://www.aoa.org/patients-and-public/caring-for-your-vision/diet-and-nutrition/zinc

44.  Protect eyes: https://www.allaboutvision.com/en-in/vision-by-age/ways-to-protect/

45.  Prevent blindness & care for infants: https://www.healthline.com/health/blindness

46.  Prevent digital eye strain: Follow 20-20-20 rule says a study; https://www.medicalnewstoday.com/articles/321536

47.  How to prevent eye strain from gadgets: https://gadgets.ndtv.com/laptops/features/how-to-prevent-eye-strain-when-using-a-computer-575879

48.  Prevent digital eye strain: https://www.mayoclinic.org/diseases-conditions/eyestrain/diagnosis-treatment/drc-20372403

 

2. కోవిడ్-19  వృత్తాంతాలు

#1. ప్రాక్టిషనర్ 00512…స్లొవేనియా   యొక్క ఉత్తేజకరమైన అనుభవం  

 నేను స్లోవేనియాలో ని రిటైర్మెంట్ హోమ్ లో పనిచేస్తూ కోవిడ్-19 రెమిడీ తీసుకుంటున్న నర్సును. మార్చి 27న మొదటి కేసు హోమ్ లో కనిపించి వెంటనే విస్తరిస్తూ 53 మందికి నిర్వాసితులకు సోకింది, వీరిలో 30 మంది కొన్ని వారాలలోనే మరణించారు. ఆ తరువాత నాతో పని చేయడానికి నర్సింగ్ సిబ్బంది ఎవ్వరూ లేరు. రిటైర్మెంట్ హోమ్ మొత్తం నిర్మానుష్యం అయిపోతోంది. ఐదు స్లొవేనియా ఆరోగ్య కేంద్రాలు మరియు మూడు ఆసుపత్రులు మా రక్షణకు వచ్చాయి. రెండు పట్టణాల నుండి వైద్య మరియు నర్సింగ్ విద్యార్థులు కూడా మా సహాయం కోసం వచ్చారు. దురదృష్టవశాత్తు వారిలో కొందరు వైరస్ బారిన పడ్డారు. నేను తీసుకుంటున్న ఇమ్యూనిటీ బూస్టర్ ను నా సహచరులు అందరికీ అందించడానికి ప్రయత్నించాను. కొందరు అంగీకరించి వాడి త్వరగా వైరస్ నుండి బయటపడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న అధికార యంత్రాంగం హోమ్ లో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఇమ్యూనిటీ బూస్టర్ ను వాడటానికి తిరస్కరించారు. కోవిడ్ కేంద్రంలో ఉన్న నా ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నా కుమార్తెలు, భాగస్వామి మరియు ప్రియమైన వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని సమీపంలోని హోటల్ లో బస చేయసాగాను. ఇది ఎంత కష్టమైనది అంటే నేను దాదాపు ఎనిమిది వారాల పాటు నా కుటుంబాన్ని ఫోన్ లో మాత్రమే చూశాను. ఇక్కడ నివాసితులను సందర్శించడానికి నేను వైద్యుల తో కలిసి పని చేయాల్సి వచ్చింది. సాయంత్రంవేళ నా హోటల్ నుండి నేను ఇన్కమింగ్ వైద్య సిబ్బందిని ఫోన్, టెక్స్ట్ మరియు వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షించాలని మార్గనిర్దేశం చేశారు. వీరికి ఆహారం, వసతి,  వంటి వారి అవసరములను నేను పర్యవేక్షించవలసి వచ్చింది. ఇది కష్టంగానూ, ఒత్తిడితో కూడి త్వరగా అలిసటకు గురిచేస్తూ షెడ్యూల్ మొత్తం ఒక కఠిన శిక్ష వలె ఉంది.

మొత్తం మీద ఈ దుర్భరమైన మరువరాని అనుభవం శాంతింపబడి నేను రక్షింపబడ్డాను. ఐతే నన్ను రక్షించిన నా ఆరోగ్యానికి సహకరించిన ఘనత ఇమ్యూనిటీ బూస్టర్ కే  దక్కుతుంది. నేను ఇది వ్రాస్తున్నప్పుడు ఏమేమి జరిగిందో నేను ఏ సమయంలో సహాయం కోసం ఫోన్ చేసినా ప్రాక్టీషనర్ గా మీరు  చేసిన సహాయానికి నేను కృతజ్ఞురాలిని. మీరు నాకు చేసిన ప్రతీ సహాయానికి థాంక్యూ అనే పదం సరిపోదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

#2.  వృద్ధ అమెరికన్ భక్తుడు నుండి ఈమెయిల్ స్పందన : కోవిడ్-19  కోసం ఇమ్యూనిటీ బూస్టర్ మొదటి మోతాదు తీసుకున్న తర్వాత దాని అద్భుతమైన ప్రభావముతో నేను ఆశ్చర్యపోయాను. గత ఐదేళ్లలో అనారోగ్యము తుంటి భాగము, లేదా గాయం తాలూకు అవస్థ తో బాధపడుతూ నా శరీరం లోని అన్ని ప్రాంతాల్లో వరుస అనుభూతులను స్థానాల వారీగా నేను గుర్తించాను. మూత్రాశయం, చిన్నప్రేవులు మరియు తలకు గాయం ఐన కేంద్రము ప్రధానమైనవి. ఈ భాగాలలో రెమిడీ  ప్రతి ఒక్క ప్రాంతంలోనూ విడివిడిగా చాలా నిమిషాలు పనిచేస్తూ స్వస్థత చేకూరుస్తున్న అనుభూతిని నేను స్పష్టంగా పొందాను. అన్నింటికన్నా ఆశ్చర్య పరిచిన విషయం నా మనసు పై దాని ప్రభావం. నేను రెండు శక్తివంతమైన మరియు హృదయపూర్వక భావోద్వేగముల విడుదలను అనుభవించాను. బాధాకరమైన అనుభవం యొక్క ప్రభావం ఆశాజనకంగా త్రుంచివేసుకోగలిగాను.   నిజమైన వైద్యం గురించి సమయం మాత్రమే తెలియజేస్తుంది. కానీ ఈ కాంబో నా ఆరోగ్య సమస్యలను గుర్తించి నయం చేసిన గూఢచారి అని నిరూపించబడింది.

 

3. వర్చ్యువల్ పునశ్చరణ సదస్సు 2020 మే 8-12 - ఢిల్లీ NCR వైబ్రియానిక్స్ టీం చొరవతో సాకారం

40 మంది ప్రాక్టీషనర్లు పాల్గొన్న ఈ చక్కటి వ్యవస్థీకృత వర్క్ షాప్ భారీ విజయాన్ని సాధించింది. ఈ వర్క్ షాప్ యొక్క మొదటి రోజు వైబ్రియానిక్స్ కోర్సు మొత్తాన్ని ఒక ఆసక్తికరమైన క్విజ్ రూపంలో టీచర్ 11422 సమీక్షించారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో తాజా పరిణామాలతో వినూత్నంగా ఉండడానికి  వార్తాలేఖలు అన్నింటిని చదవమని ప్రాక్టీషనర్లను కోరారు. రెండవ రోజు ఢిల్లీ-NCR  టీచర్ మరియు కోఆర్డినేటర్ 02859  నేతృత్వంలో విజయవంతమైన కేసు చరిత్రలు ప్రవేశపెట్టబడగా వైబ్రియానిక్స్ పట్ల ఒక విధమైన కృతజ్ఞత భావం సభ్యులందరిలో స్పష్టంగా కనబడింది. కేసుల నమోదు విషయంలో నిర్ణీత పద్దతి పాటించాలని, అవసరం మేరకు వ్యాధిగ్రస్తమైన శరీర భాగాన్ని ఫోటో తీయాలని, మోతాదు తగ్గింపు విధానాన్ని అనుసరించాలని నొక్కిచెప్పారు. మూడవ రోజు  ప్రాక్టీషనర్ 11964 నేతృత్వంలో సభ్యులంతా వైబ్రియానిక్స్ తమలో ఎలా పరివర్తన తెచ్చిందో తెలిపారు.

అంతేకాకుండా కేసు చరిత్ర రాయడానికి తుది సంస్కరణలకు అనుగుణంగా ప్రచురణ కోసం అందుకున్న కేసు చరిత్ర నమూనాను ఆమె ఒక వివరణాత్మకముగా అందించారు. డాక్టర్ అగర్వాల్ వైబ్రియానిక్స్ అభివృద్ధి పధంలో స్వామి ఏ విధంగా మార్గదర్శకత్వం వహించారో సభ్యులకు వివరించారు. రాబోయే రెండేళ్లలో పుట్టపర్తిలో రాబోయే రీసెర్చ్ ట్రైనింగ్ మరియు వెల్నెస్ సెంటర్ గురించి సంక్షిప్తంగా  చెప్పారు. వైబ్రియానిక్స్ కోర్స్ పుస్తకాలు, వార్తాలేఖలు,  మరియు కాన్ఫరెన్స్ పుస్తకం క్రమం తప్పకుండా చదవాలని ఆయన సభ్యులను కోరారు. ఈ వైద్య వ్యవస్థను అభ్యసించే వారిగా ఉత్తమమైన సేవను అందించ గలిగేలా ఉండేందుకు  స్వామిని ప్రార్ధించాలని ఆయన పునరుద్ఘాటించారు. స్వామి దయతో హాజరైన వారందరికీ ఈ సదస్సు ఒక గొప్ప అభ్యాస అనుభవంగా మారింది. సదస్సు కొనసాగుతూ ఉండగా వినయం, ప్రేమ మరియు సామాజిక బాధ్యత తో సేవ చేస్తూ ఎంతో మంది హృదయాలలో ఆనందం నింపిన ఉత్తమ వ్యవస్థలో భాగమైనందుకు విస్మయం వ్యక్తం చేసారు. తరువాత కొన్ని క్లిష్టమైన కేసుల గురించి చర్చించ బడింది. నాల్గవ రోజు సంస్థ యొక్క నిర్మాణము గురించి అది విస్తరిస్తున్న వైనం గురించి చర్చింప బడింది.

IASVP లో సభ్యత్వం తీసుకోవడము ఇప్పుడు తప్పనిసరి కనుక సభ్యులందరిని సభ్యత్వం తీసుకోవలసిందిగా వారిని ప్రోత్సహించారు. శ్రీమతి హేమ మరియు డాక్టర్ అగర్వాల్ ఇద్దరూ చివరిదైన ఐదవ రోజు పాల్గొన్నందుకు ఆనందం వ్యక్తం చేసారు.  శ్రీమతి హేమ కోవిడ్ పై ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తమ వ్యక్తిగత అనుభవం నుండి ఉపయోగకరమైన చిట్కాలను అందించారు.