Vol 10 సంచిక 4
July August 2019
అవలోకనం
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ఈ జూలై నెలలో రానున్న గురుపూర్ణిమ సమారోహం పురస్కరించుకొని గురువులో ఐక్యమవాలన్న 'స్వామి ' సందేశాన్ని మరొక్కమారు డా.అగ్గర్వాల్ గుర్తు చేస్తూ అందరు ప్రాక్టీషనర్లు బాబా నేర్పిన ప్రభావవంతమైన మరియు శెక్తివంతమైన ప్రేమలో లీనమయి ఈ జగత్తులో నున్న దైవశక్తిని ప్రతి వస్తువునందు అనుభూతి చెంది, ఆ ప్రేమామృతాన్ని మనకు ఎదురైన ప్రతి ఒక్కరికి అందజేయాలని కోరారు. మన నుండి వెలువడిన ప్రేమపూరిత ప్రకంపనలు మనము చికిత్స చేసే రోగులకు స్వస్థత చేకూరడంలో బాగా సహాయ పడుతాయి. కనుక ప్రాక్టీషనర్లు ప్రేమపూర్వక కంపనములతో ఉండినప్పుడే తమకు మాత్రమే కాక ప్రపంచానికి కూడా సేవ చేయగలరు. ఎక్కువ ప్రజలకు ఈ వైబ్రియానిక్స్ చికిత్స అందజేయాలంటే క్రొత్త ప్రాక్టీషనర్లు కావాల్సి వుంటుంది. అందుకై ప్రతి ఒక్క ప్రాక్టీషనర్ వారి వారి పరిధిలో క్రొత్త వారిని ప్రోత్సహించి ఈ వైబ్రియానిక్స్ సేవలో పాల్గొని ఈ సంస్థయొక్క (మిషన్) ప్రేమ రంగాన్ని విస్త్రుతం చేయాలి. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాక్టీషనర్లు తమ సేవలో ముందుకు సాగి వరిష్ఠ ప్రాక్టీషనర్లుగా (యస్.వి.పి) ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నించాలి. మరియు వరిష్ట ప్రాక్టీషనర్లంతా (యస్.వి.పి) నిర్వాహణా బాధ్యతలు స్వచ్ఛందముగా స్వీకరించి నిబద్ధతగా మరియూ అభిరుచిగా కార్యకలాపాలు నిర్వర్తించగలరనీ ఆశిస్తున్నాను.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
12 కేసుల వివరాలు ఇవ్వబడ్డాయి. అవి రైనైటిస్, బ్రాంఖైటిస్, భగందరము, గడ్డ మరియు మలబద్ధకం, గర్భస్రావం అనంతరం రక్త స్రావం, చర్మ శోధ(డెర్మటైటిస్), హైపోథైరాయిడ్, జీర్ణ వ్యవస్తకు చెందిన క్రింది అవయవాల్లో రక్త స్రావం, గాయాలు మరియు పీడకలలు, బాలుడు బటన్ బ్యాటరీని మింగిట, అడల్ట్సు స్థిల్సు వ్యాధి, ఎముక చిట్లడం వల్ల వెన్ను మరియు మోకాలు నొప్పి, మానసిక గాయం అనంతరం తీవ్రమైన భయాందోళనలు, మలేరియా అవశేషాలు అధిక లాలాజలం మరియు చెమట పట్టుట.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
ఇద్దరు ప్రాక్టీషనర్ల వివరాలు ఇందు ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఇరువురు 2018 లో ప్రాక్టీషనర్లైనారు. వీరు వైబ్రియానిక్స్ సెవయందు చాలా అభిరుచి చూపి రోగులకు చికిత్స ద్వారా అత్యున్నతముగా నయం చేసేరు. ఒకరు చిన్ననాటి నుండి సాయి సాన్నిధ్యములో ఉంది బాలవికాస్ కార్యక్రమములలో పాల్గొంటూ స్వామి ఆశీర్వచనములు అందుకున్నారు. ఆమె జాతీయం చేయబడిన ఒక బ్యాంకులో ఉన్నత అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసేరు. ఆమె దరిదాపు 650 మంది రోగులకు చికిత్స అందించారు. వాహనం చేత ఢీకొన్న ఒక కుక్కకి కూడా ఆమె మానసికంగా వైబ్రియానిక్స్ ని ప్రసారం చేసి బాగుచేసారు. రెండవ ప్రాక్టీషనర్ 'సాయీ ' భక్తుల కుటుంబములో జన్మించి సాయి సంస్థ యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఈమె మైక్రొబయాజీలో పోస్టు డాక్టరేట్ చేసి ప్రఖ్యాత వైద్య కళాశాలలో అధ్యాపకులు మరియూ పరిశొధకురాలిగా పనిచేస్తూ, పని నుండి తిరిగి వచ్చిన తర్వాతయే కాక ఆదివారములలో కూడా మామూలు రోగులే కాక విధివంచితులూ మరియూ అణగారి నిరాశకు గురియైన రోగులకు కూడా చికిత్స చేసారు. మరియూ వీరు పరిశోధన నిమిత్తం రోగుల నుండి వేరుచేయబడిన కొన్ని మల్టీడ్రగ్ రెసిస్టెంట్ పానాసోనిక్ సూక్ష్మజీవుల జాతులపై వైబ్రియానిక్స్ ఏవిధంగా సహాయపడుతుంది లేదా ప్రభావాన్ని కల్గి ఉంటుంది అనే విషయంపై పరీక్షించడానికి అధ్యయనం ప్రారంభించేరు. ఈమె ఇంతవరకు 590 రోగులకు చికిత్స చేసేరు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
వైబ్రియానిక్స్ హోమియోపతి లేదా ఆయుర్వేదం తొ కాకుండా అల్లోపతితొ పాటు ఎందుకు అనుకూలంగా పని చెస్తుందొ మనం నేర్చుకుంటాము. ఈ రెండు వైద్య వ్యవస్థలలో ఒకదానితో ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగితొ ఎలా వ్యవహరించాలి, 6TD మోతాదు TDS తొ కంటే వేగంగా నయమవుతుందా మరియు ఏ పరిస్థితిలో, మోతాదును తగ్గించడం ఎందుకు ముఖ్యం, మరియు లీటరు కంటే ఎక్కువ ద్రవాన్ని (నీటితొ కలిపి) తాగడానికి అనుమతించబడని డయాలసిస్ రొగిలో విష పదార్థాలు రోగి నుండి ఎలా బయటకు వెలుతాయి అనె విషయాలు మనం తెలుసుకుంటాము.
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్యవాణి
ఆరోగ్యకరమైన గుండె కోసం మన ఆహారపు అలవాట్లపై నియంత్రణ కలిగి ఉండాలని మరియు నిస్వార్థ సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మరియు ఇతరులకు సేవ చేయడానికి ఎప్పుడూ ఆలోచించవద్దని స్వామి ప్రేమపూర్వకంగా కోరారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
క్రొయేషియా, యూ కె, ఫ్రాన్స్ మరియు ఇండియా (పుట్టపర్తి) లొ జరుగబొవు వర్క్ షాప్ల గురించి వివరించబడింది.
పూర్తి వ్యాసం చదవండిఅదనపు సమాచారం
తలనొప్పి అంటే ఏమిటి, ఎ విధంగా ప్రాథమిక తలనొప్పి అనేది వ్యాధి మరియు ద్వితీయ తలనొప్పి అనేది వ్యాధి లక్షణం, తలనొప్పి కోసం ప్రత్యామ్నాయ చికిత్సలు, ఇంటి నివారణలు మరియు స్వీయ పర్యవేక్షణతో తలనొప్పిని ఎలా ఎదుర్కొవాలి మరియు సరైన జీవనశైలి, ప్రశాంతమైన చురుకుదనం మరియు నిటారుగా ఉండే వెన్నెముక యొక్క సరైన భంగిమతొ తలనొప్పిని నివారించడం ఎలా ముఖ్యమో మేము మా ఆరోగ్య కథనంలో పంచుకుంటాము. అలాగే, మేము తూర్పు మరియు పశ్చిమ లండన్ మరియు మిడ్‌ల్యాండ్స్, యుకె, మరియు మహారాష్ట్ర (భారతదేశం) లోని పూణేలో నిర్వహించిన రిఫ్రెషర్ వర్క్‌షాప్‌లో 3 ప్రాక్టీషనర్ల స్థానిక సమావేశాలను పంచుకుంటాము.
పూర్తి వ్యాసం చదవండి