డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 10 సంచిక 4
July August 2019
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
గురుపూర్ణిమ ఆసన్నం కావడంతో మనం అంతా కూడా ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన ప్రేమ తోటలో అందరం కలిసి ఆనందించవలసిన సమయం ఆసన్నమైంది. స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన ఆ ప్రేమ శక్తి మరెవరో కాదు మన ప్రియమైన ప్రభువు భగవాన్ బాబావారే. స్వామి ఒకసారి ఇలా చెప్పారు. ‘‘నా అనుగ్రహాన్ని వర్షించడానికి మీ హృదయ స్వచ్ఛతను మాత్రమే నేను కోరేది. మీకు నాకు మధ్య దూరాన్ని ఉంచవద్దు. మనమధ్య గురువుకు శిష్యునికి మధ్య ఉండే సంబంధం గానీ లేదా అట్టి లాంఛనాలు గానీ ఉండకూడదు. అలాగే భగవంతుడు భక్తుడు మధ్య దూరాలు, బేధాలు వంటివి కూడా జోక్యం చేసుకోకూడదు. నేను గురువునూ కాదు దేవుడినీ కాదు. నేనే మీరు, మీరే నేను అదే నిజం. మన మధ్య భేదం లేదు అలా కనిపింపచేసేది మాయ. నేను మహా సముద్రం అయితే మీరు తరంగాలు. ఇది తెలుసుకొని స్వేచ్ఛగా శాంతిగా ఉండండి. దివ్య భావనలోనే ఉండండి ’’ శ్రీ సత్య సాయి బాబా గురుపూర్ణిమ ఉత్సవం ప్రశాంతి నిలయం 1970 జూలై 19.
కనుక సోదరీ సోదరులారా స్వామి యొక్క ప్రేమలో హృదయ పూర్వకంగా మునిగిపోయి సృష్టి యొక్క ప్రతి అంశంలోనూ దైవత్వం యొక్క వ్యక్తీకరణను అనుభవించవలసిన సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ప్రేమ అనే అనంతమైన జలాశయానికి అనుసంధానింపబడి మన మార్గంలో ఎదురయ్యే ప్రతి జీవికి ఆ ప్రేమను అందించే సమయం ఇదే. మన సహజ సిద్ధమైన స్థితిలో మనం ప్రేమను పంచే కేంద్రాలము. మన హృదయాల నుండి వెలువడే విద్యుదయస్కాంత కంపనాలు ప్రబలంగానూ శక్తివంతంగానూ ఉంటాయి. ఇవి మనచుట్టూ ఉన్నవైరుధ్య కంపనాలను ప్రేమపూర్వక పౌనపున్యములోనికి మారుస్తాయి కనుక ప్రియమైన ప్రాక్టీషనర్లారా ప్రేమ పూర్వక కంపనలతో ఉండినప్పుడే మనకు మనమే కాక ప్రపంచానికి కూడా సేవ చేయడం సాధ్యపడుతుంది. తద్వారా మనం చికిత్స చేసే వారి కంపన పౌనపున్యమును పెంచి వారిలో ఈ కంపనాలు స్వస్థతను కలిగించడానికి సహాయపడుతుంది.
ఇటీవల ఒక ప్రాక్టీషనర్ ‘‘వైబ్రియానిక్స్ ద్వారా ప్రేమను పంచడానికి, సేవా పరిధిని విస్తరించటానికీ ప్రతీ ప్రాక్టీషనర్ పరిపుష్ఠి కలిగిన మరొక కొత్త ప్రాక్టీషనర్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని రాశారు. వైబ్రియానిక్స్ రెమెడీల ద్వారా లబ్ధిపొందిన వారు తాము పొందిన ఆనందాన్ని పంచుకోవడం ద్వారా వైబ్రియానిక్స్ మిషన్ యొక్క ప్రేమ రంగాన్ని విస్తృత పరచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఎవరు సుముఖత చూపిస్తారో కనుగొనటానికి తమ పరిచయాలను అలాగే నివారణలు పొందిన రోగుల జాబితా వినియోగించుకొని అటువంటి వారిని కనుగొనాలని సూచిస్తున్నాను. ప్రేరణ పొందిన ప్రాక్టీషనర్ని గుర్తించినట్లయితే మొదట్లో కొన్ని సాధారణ సేవలలో అనగా బాటిల్లో గోళీలను నింపడం, లేబుల్స్ అంటించడం, నివారణ ఎలా తీసుకోవాలో రోగులకు సూచనలు ఇవ్వడం మరియు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి సహాయపడటం ఈ విధంగా వారి సహాయం పొందుతూ ఉంటే వారిలో ప్రేరణ కలిగి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సాహం కలిగించవచ్చు. ఇలా పరిగణింపబడే వారు మీ జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు.
అంకితభావం గల ప్రాక్టీషనర్లు తమ సేవలో ముందుకు సాగి ఎస్. వి. పి. గా మారడానికి వారికి ప్రోత్సాహం అందించడానికి మా బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వైబ్రియానిక్స్ ను ముందుకు నడిపించడానికి సహకరించే ప్రాక్టీషనర్ల కోసం మేము వెతుకుతూనే ఉన్నాము. ఐతే ఎస్. వి. పి. లు నుండి మేము ఆశించే అంచనాలు ఎక్కువగా ఉన్నందు వలన ఎస్. వి. పి. కావడానికి నిర్దిష్ట సంఖ్యలో పరిపాలనా గంటలను పూర్తి చేయడం ఒక్కటే మా అభిమతం కాదు. ఇటీవల ఎస్. వి. పి. కోసం మీరు చేసుకున్న దరఖాస్తు ఆమోదింపబడక పోతే దీనికి కారణం వైబ్రియానిక్స్ లో ప్రధాన పాత్ర పోషించడానికి నిబద్ధత మరియు అభిరుచి గల ప్రాక్టీషనర్లను మేము ఆశిస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి.
పరిమితమైన మానవ వనరులు కలిగి ఉన్నందున 108 సిసి బాక్స్ రీఛార్జ్ చేయాలనుకునే వారు దానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగానూ మీ నెలవారీ నివేదిక క్రమం తప్పకుండా సమర్పించాలని కోరుతున్నాను. రీఛార్జ్ విషయంలో రెమిడీ బాటిళ్లలో చుక్కలు వేయడానికి సహాయపడే విధంగా నిర్ధారించుకుని కనీసం మరొక ప్రాక్టీషనర్ని అంగీకరింప చేసి వారిని రీఛార్జి కోసం తీసుకురవాలని కోరుతున్నాను.
చివరగా ప్రాక్టీషనర్లు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ ప్రేమతో ప్రపంచాన్ని మార్చడానికిముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. జీవిత ప్రయాణంలో పరిస్థితులను సుస్థిరం చేసుకొని ఒకే ఒక ఆలోచనతో ముందుకు వస్తే ప్రపంచాన్ని ప్రేమమయం చేయటం సుసాధ్యమే. మీరంతా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ
స్వామికి ప్రేమ పూర్వక సేవనందించే
మీ జిత్.కె. అగర్వాల్