Vol 10 సంచిక 4
July August 2019
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
గురుపూర్ణిమ ఆసన్నం కావడంతో మనం అంతా కూడా ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన ప్రేమ తోటలో అందరం కలిసి ఆనందించవలసిన సమయం ఆసన్నమైంది. స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన ఆ ప్రేమ శక్తి మరెవరో కాదు మన ప్రియమైన ప్రభువు భగవాన్ బాబావారే. స్వామి ఒకసారి ఇలా చెప్పారు. ‘‘నా అనుగ్రహాన్ని వర్షించడానికి మీ హృదయ స్వచ్ఛతను మాత్రమే నేను కోరేది. మీకు నాకు మధ్య దూరాన్ని ఉంచవద్దు. మనమధ్య గురువుకు శిష్యునికి మధ్య ఉండే సంబంధం గానీ లేదా అట్టి లాంఛనాలు గానీ ఉండకూడదు. అలాగే భగవంతుడు భక్తుడు మధ్య దూరాలు, బేధాలు వంటివి కూడా జోక్యం చేసుకోకూడదు. నేను గురువునూ కాదు దేవుడినీ కాదు. నేనే మీరు, మీరే నేను అదే నిజం. మన మధ్య భేదం లేదు అలా కనిపింపచేసేది మాయ. నేను మహా సముద్రం అయితే మీరు తరంగాలు. ఇది తెలుసుకొని స్వేచ్ఛగా శాంతిగా ఉండండి. దివ్య భావనలోనే ఉండండి ’’ శ్రీ సత్య సాయి బాబా గురుపూర్ణిమ ఉత్సవం ప్రశాంతి నిలయం 1970 జూలై 19.
కనుక సోదరీ సోదరులారా స్వామి యొక్క ప్రేమలో హృదయ పూర్వకంగా మునిగిపోయి సృష్టి యొక్క ప్రతి అంశంలోనూ దైవత్వం యొక్క వ్యక్తీకరణను అనుభవించవలసిన సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ప్రేమ అనే అనంతమైన జలాశయానికి అనుసంధానింపబడి మన మార్గంలో ఎదురయ్యే ప్రతి జీవికి ఆ ప్రేమను అందించే సమయం ఇదే. మన సహజ సిద్ధమైన స్థితిలో మనం ప్రేమను పంచే కేంద్రాలము. మన హృదయాల నుండి వెలువడే విద్యుదయస్కాంత కంపనాలు ప్రబలంగానూ శక్తివంతంగానూ ఉంటాయి. ఇవి మనచుట్టూ ఉన్నవైరుధ్య కంపనాలను ప్రేమపూర్వక పౌనపున్యములోనికి మారుస్తాయి కనుక ప్రియమైన ప్రాక్టీషనర్లారా ప్రేమ పూర్వక కంపనలతో ఉండినప్పుడే మనకు మనమే కాక ప్రపంచానికి కూడా సేవ చేయడం సాధ్యపడుతుంది. తద్వారా మనం చికిత్స చేసే వారి కంపన పౌనపున్యమును పెంచి వారిలో ఈ కంపనాలు స్వస్థతను కలిగించడానికి సహాయపడుతుంది.
ఇటీవల ఒక ప్రాక్టీషనర్ ‘‘వైబ్రియానిక్స్ ద్వారా ప్రేమను పంచడానికి, సేవా పరిధిని విస్తరించటానికీ ప్రతీ ప్రాక్టీషనర్ పరిపుష్ఠి కలిగిన మరొక కొత్త ప్రాక్టీషనర్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని రాశారు. వైబ్రియానిక్స్ రెమెడీల ద్వారా లబ్ధిపొందిన వారు తాము పొందిన ఆనందాన్ని పంచుకోవడం ద్వారా వైబ్రియానిక్స్ మిషన్ యొక్క ప్రేమ రంగాన్ని విస్తృత పరచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఎవరు సుముఖత చూపిస్తారో కనుగొనటానికి తమ పరిచయాలను అలాగే నివారణలు పొందిన రోగుల జాబితా వినియోగించుకొని అటువంటి వారిని కనుగొనాలని సూచిస్తున్నాను. ప్రేరణ పొందిన ప్రాక్టీషనర్ని గుర్తించినట్లయితే మొదట్లో కొన్ని సాధారణ సేవలలో అనగా బాటిల్లో గోళీలను నింపడం, లేబుల్స్ అంటించడం, నివారణ ఎలా తీసుకోవాలో రోగులకు సూచనలు ఇవ్వడం మరియు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి సహాయపడటం ఈ విధంగా వారి సహాయం పొందుతూ ఉంటే వారిలో ప్రేరణ కలిగి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సాహం కలిగించవచ్చు. ఇలా పరిగణింపబడే వారు మీ జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు.
అంకితభావం గల ప్రాక్టీషనర్లు తమ సేవలో ముందుకు సాగి ఎస్. వి. పి. గా మారడానికి వారికి ప్రోత్సాహం అందించడానికి మా బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వైబ్రియానిక్స్ ను ముందుకు నడిపించడానికి సహకరించే ప్రాక్టీషనర్ల కోసం మేము వెతుకుతూనే ఉన్నాము. ఐతే ఎస్. వి. పి. లు నుండి మేము ఆశించే అంచనాలు ఎక్కువగా ఉన్నందు వలన ఎస్. వి. పి. కావడానికి నిర్దిష్ట సంఖ్యలో పరిపాలనా గంటలను పూర్తి చేయడం ఒక్కటే మా అభిమతం కాదు. ఇటీవల ఎస్. వి. పి. కోసం మీరు చేసుకున్న దరఖాస్తు ఆమోదింపబడక పోతే దీనికి కారణం వైబ్రియానిక్స్ లో ప్రధాన పాత్ర పోషించడానికి నిబద్ధత మరియు అభిరుచి గల ప్రాక్టీషనర్లను మేము ఆశిస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి.
పరిమితమైన మానవ వనరులు కలిగి ఉన్నందున 108 సిసి బాక్స్ రీఛార్జ్ చేయాలనుకునే వారు దానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగానూ మీ నెలవారీ నివేదిక క్రమం తప్పకుండా సమర్పించాలని కోరుతున్నాను. రీఛార్జ్ విషయంలో రెమిడీ బాటిళ్లలో చుక్కలు వేయడానికి సహాయపడే విధంగా నిర్ధారించుకుని కనీసం మరొక ప్రాక్టీషనర్ని అంగీకరింప చేసి వారిని రీఛార్జి కోసం తీసుకురవాలని కోరుతున్నాను.
చివరగా ప్రాక్టీషనర్లు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ ప్రేమతో ప్రపంచాన్ని మార్చడానికిముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. జీవిత ప్రయాణంలో పరిస్థితులను సుస్థిరం చేసుకొని ఒకే ఒక ఆలోచనతో ముందుకు వస్తే ప్రపంచాన్ని ప్రేమమయం చేయటం సుసాధ్యమే. మీరంతా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ
స్వామికి ప్రేమ పూర్వక సేవనందించే
మీ జిత్.కె. అగర్వాల్
రైనైటిస్, బ్రాంఖైటిస్ 11601...India
44-ఏళ్ల వ్యక్తి పుట్టినప్పటి నుంచి తరచూ శ్వాస కోశ ఇబ్బందులతో( ఛాతీలో గరగర మనే శబ్దం వినిపించడం) బాధపడుతున్నారు. దీంతోపాటు ముక్కు కారడం ముక్కు రంధ్రాలు మూసుకుపోయినట్లు ఉండటం తలనొప్పి కూడా ఉన్నాయి. బాల్యంలో ఇతడి తల్లి కొంత ఉపశమనం కలిగించడానికి అతని ఛాతీ, నుదుట మరియు ముక్కు చుట్టూ విక్స్ వేపొరబ్ రుద్దుతూ ఉండేది. పెద్దయ్యాక తనే స్వయంగా చేసుకోవడం నేర్చుకున్నారు. శ్వాసకు కష్టం కలిగించే పెయింట్లు పెట్రోల్ మొదలైన వాటి దగ్గరకు వెళ్లడం మానుకున్నాడు. రెండువేల సంవత్సరంలో ఈ లక్షణాలు భరించలేక ఒక నిపుణుడిని సంప్రదించగా అతని పరిస్థితి ఎలర్జీ మరియు బ్రాంకైటిస్ అని నిర్ధారించబడగా మందులు తీసుకోవడం ప్రారంభించారు. గత 12 సంవత్సరాలుగా డాక్టర్ సలహా మేరకు ప్రతి రోజూ నాసల్ స్ప్రే ఉపయోగిస్తున్నారు. ఈ చికిత్స అతని రోజు వారి జీవిత నిర్వహణకు సహాయపడింది కానీ అతనికి పూర్తి ఉపశమనం ఇవ్వలేదు కనుక ప్రత్యామ్నాయ చికిత్స కోసం వెతకడం ప్రారంభించాడు.
2019 జనవరి 13న రోగి అభ్యాసకురాలిని సంప్రదించగా క్రింది నివారణ ఇచ్చారు:
#1. CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకూ అనంతరం 6TD
ఈ నివారణతో పాటు వీరు అల్లోపతి మందులు కూడా కొనసాగించారు. నాలుగు వారాల తర్వాత అతను అభ్యాసకుని వద్దకు వచ్చినప్పుడు కొంచెం నిస్పృహతో ఉన్నట్లు అనిపించింది. కారణమేమిటంటే ఇచ్చిన నివారణ వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదు అయినప్పటికీ రోగి వైబ్రో మందులు కొనసాగించడానికి నిశ్చయించుకున్నాడు. అభ్యాసకుడు #1 ని క్రింది విధంగా మెరుగుపరచడం జరిగింది:
#2. CC15.1 Mental & Emotional tonic + #1…6TD
ఒక నెల తర్వాత మార్చి 10వ తేదీన తన తదుపరి సందర్శనలో రోగి తన వ్యాధి లక్షణాలన్నీ క్రమంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. గత వారం రోజులుగా అతని శ్వాసలో శబ్దాలు, ముక్కు కారడం నాసికా రంధ్రాలు మూసుకు పోవడం, తలనొప్పి వంటివి ఏమీ లేవని అందువలన నాసల్ స్ప్రే తో సహా అలోపతి మందులను ఆపేశారు. ఇతను ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా ఊపిరి పీల్చుకోవడం అభ్యాసకురాలు గమనించారు. అయినప్పటికీ మోతాదు 6TD గానే కొనసాగించ బడింది.
2019 ఏప్రిల్ 21 న అనగా 6 వారాలు తరువాత #2 ను వ్యాధినిరోధక శక్తిని పెంచే మోతాదుగా మార్చడం జరిగింది:
#3. CC12.1 Adult tonic + #2…TDS
3 వారాల తర్వాత పేషెంటుకు పూర్తి ఉపశమనం కలగడంతో మోతాదు #3 ను OD. కి తగ్గించడం జరిగింది. 2019 జూన్ 16 నాటికి, #3 ను పూర్తిగా ఆపివేయడం జరిగింది. మరియు #2 ను 3TW గా తిరిగి ప్రారంభించడం జరిగింది. దీన్ని నెమ్మదిగా OW కు తగ్గించడం జరుగుతుంది.
అభ్యాసకుడు క్రింది మోతాదును కూడా కలవడం జరిగింది:
#4. CC12.1 Adult tonic…TDS ఒక నెల వరకు దీనిని #5 CC17.2 Cleansing, తో రీప్లేస్ చేస్తూ సంవత్సరం వరకు ఈ మోతాదులు తీసుకోవడం ప్రారంభించారు.
సంపాదకుని వ్యాఖ్య : 6TD is అనేది వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఇచ్చే మోతాదు కనుక #2 ను రోగి మార్చి 10వ తారీఖు వచ్చినప్పుడు TDS గా తగ్గించి ఉంటే బాగుండేది.
భగందరము, గడ్డ మరియు మలబద్ధకం 11601...India
2018 నవంబర్ 2వ తేదీన 27 సంవత్సరాల యువకుడు అభ్యాసకుని వద్దకు రాగా అతడు చాలా కష్టంతో నెమ్మదిగా తన రెండు కాళ్ళు ఎడంగా వుంచి నడవడం అభ్యాసకుడు గమనించారు. రోగి సౌకర్యవంతంగా కూర్చోలేక పోయాడు. 2 నెలల క్రితం రోగి యొక్క ఆసన భాగంలో ఒక అంగుళం వ్యాసం కలిగిన బాధాకరమైన గడ్డ ఏర్పడింది. దీనివలన అతనను ఆఫీసులో కూర్చుని పనిచేయడం చాలా కష్టతరం అయ్యింది. సంవత్సరం క్రితం అతనికి మూత్రపిండములో ఏర్పడిన గడ్డకోసం ఆపరేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత అతనికి ఆసనభాగంలో గడ్డ ఏర్పడింది. దీని నిమిత్తం సుమారు ఆరు నెలలు అల్లోపతి మందులు తీసుకున్నాడు కానీ నొప్పి పునరావృతం కావడం, మలద్వారం చుట్టూ మంట, ఎరుపుదనం, వాపు నుండి ఉపశమనం లేకపోవడంతో మందులు అపి వేయడం జరిగింది. అతను ఒక సంవత్సరానికి పైగా తీవ్రమైన మలబద్ధకంతో బాధ పడుతున్నాడు మలాన్ని జారీ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం అతను ఎటువంటి ఇతర మందులు తీసుకోవడం లేదు
రోగికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC4.4 Constipation + CC10.1 Emergencies + CC13.2 Kidney & Bladder infections + CC15.1 Mental & Emotional tonic…ప్రతీ పదినిమిషాలకూ ఒక మోతాదు చొప్పున గంట వరకూ అనంతరం 6TD
మూడు వారాలలో అతని వ్యాధి లక్షణాలు అన్నీ ఒక్కొక్కటిగా మాయమయ్యాయి అతని గడ్డ కూడా పరిమాణం తగ్గుతూ అనమాలు కూడా లేకుండా మాయమైంది. కనుక 2018 నవంబర్ 21వ తేదీన మోతాదును TDS కి తగ్గించడం జరిగింది. మరో నెల తర్వాత అనగా 2018 డిసెంబర్ 5వ తేదీన మలబద్ధకంతో సహా లక్షణాలు ఏవి పునరావృతం కాలేదని రోగి ధృవీకరించారు. నొప్పి లేదు కనుక సౌకర్యవంతంగా కూర్చోవటం, నడవగలగడమే కాక రోజంతా తన కార్యాలయంలో ఎటువంటి సమస్య లేకుండా పని చేయగలుగుతున్నాడు. మోతాదు OD కి తగ్గించి నెల రోజులు కొనసాగించి తర్వాత మానివేశాడు. 2019 జూన్ నాటికి రోగ లక్షణాలు ఏవి పునరావృతం కాలేదని తెలిపాడు. అయితే రోగ నిరోధక శక్తి మరియు రక్షణ చక్రాన్ని తీసుకోవడానికి రోగిని ఒప్పించ లేక పోవడం జరిగింది.
చర్మశోథ (డెర్మటైటిస్) 11594...India
2018 ఏప్రిల్ 20వ తేదీన ఏడు సంవత్సరాల బాలుడిని అతని తల్లి అభ్యాసకుని వద్దకు తీసుకువచ్చారు. అతని శరీరమంతా సుమారు పది గాయాలు ఒక్కొక్కటి రెండు మూడు సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నాయి. ఇవి కాళ్లు చేతులు మరియు శరీరం వెనుక భాగంలో విస్తరించి ఉన్నాయి. అంతకు ముందు రోజు బాలుడు ఒక విందులో పాలకూర మరియు పాలక్ పన్నీరు కూర తిన్నాడు. వెంటనే కడుపు నొప్పి వచ్చినట్టు తెలిపాడు. మరుసటి రోజు ఉదయం అతని శరీరంపై పొక్కులు ఏర్పడడం తల్లి చూసింది అతనికి ఇప్పటివరకు డస్ట్ అలెర్జీ లేదా ఎటువంటి ఆహారమూ తిన్నా అలెర్జీ కలగలేదని ఆమె చెప్పారు.
బాలుడికి క్రింది నివారణ ఇవ్వబడింది :
CC4.10 Indigestion + CC21.3 Skin allergies…ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ అనంతరం 6TD, నివారణ కలిపిన నీటిని బాహ్యంగా శరీరం మీద ఉపయోగించే మోతాదు…6TD.
రెండు గంటల్లోనే వాపు, ఎరుపుదానం, అలాగే దురద 40 శాతం తగ్గాయి. మరుసటి రోజు కడుపు నొప్పి తగ్గిపోయింది రెండు రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 23న బాలుడు అభ్యాసకుడిని సందర్శించినప్పుడు ఎటువంటి పొక్కులు, ఎరుపుదనం, లేదా దురద వంటివి లేవు. మోతాదును మూడు రోజులు TDS అనంతరం మరోరెండు రోజులు OD గా తీసుకొని తర్వాత ఆపేశారు. 2019 జూన్ 14 బాలుడికి పొక్కులు గానీ, కడుపు నొప్పి గానీ, ఎలర్జీ గానీ పునరావృతం కాలేదు. బాలుడు పాలకూరతో సహా అన్నీ ఆహార పదార్ధాలు ఎటువంటి అలెర్జీ లేకుండా సాధారణ ఆహారంగా తీసుకొంటున్నాడు.
గర్భస్రావం అనంతరం రక్తస్రావం 11601...India
2018 అక్టోబర్ లో 34 ఏళ్ల మహిళ తన ఊపిరితిత్తులు చుట్టూ ఉన్న పొరల ప్రదేశంలో ద్రవం తగ్గిపోయినందువలన కలిగిన అనారోగ్య పరిస్థితి కారణంగా గర్భ విచ్ఛిత్తి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆమెకు యోని నుండి రక్త స్రావం మరియు వాంతులు ఏర్పడి మూడు నెలలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ ఇది తగ్గలేదు. ఇంతేకాక ఆమె ఆమె గర్భధారణ సమయం నుండి చీలమండలు మరియు కాళ్లలో నొప్పులు, గురక మరియు నిద్రలేమి కూడా ఏర్పడ్డాయి. వాపు మరియు గురక నిమిత్తం అల్లోపతి మందులు తీసుకుంటున్నారు.
2019 జనవరి 19న దయనీయ స్థితిలో ఈమె తల్లి రోగిని అభ్యాసకుని వద్దకు తీసుకొని వచ్చారు. ఇద్దరు అక్కడికి వచ్చే నాటికి చాలా నిరాశకు గురై ఉన్నారు. అభ్యాసకురాలు వీరిని హృదయపూర్వకంగా స్వాగతించారు, వారి బాధలను ఓర్పుతో విని అర్ధం చేసుకొని ప్రస్తుతం ఆమె ఎటువంటి మందులు తీసుకోకుండా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి క్రింది సమస్యకు నివారణలు ఇవ్వడం జరిగింది:
రక్తస్రావం,వాంతులు,మరియు మానసిక వత్తిడి:
#1. CC3.1 Heart tonic + CC4.10 Indigestion + CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ తరువాత ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున 3 రోజులు అనంతరం 6TD.
40 రోజుల తర్వాత రోగికి రక్తస్రావం ఆగిపోయింది కానీ ఇతర రోగ లక్షణాలు అలాగే ఉన్నాయి. అందువల్ల ఆమె సరిగా తినకపోవడం, నిద్రపోలేకపోవడం, మరియు నోరు తడి ఆరిపోవడం, ఇంకా బలహీనత కూడా కలిగి ఉన్నారు. రోగిని సమీక్షించిన తర్వాత #1 ని క్రిందరెమిడీతోభర్తీ చేయడం జరిగింది:
రక్త హీనత, నోరు తడి ఆరిపోవడం, కీళ్ల వాపు మరియు గురక:
#2. CC3.1 Heart tonic + CC8.1 Female tonic + CC8.9 Morning sickness + CC11.5 Mouth infections + CC13.1 Kidney & Bladder tonic + CC19.3 Chest infections…6TD
నిద్ర లేమికి:
#3. CC15.6 Sleep disorders…రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక మోతాదు.
5 వారాల తర్వాత ఆమెకు వాంతులు తగ్గిపోయి నోరు తడి ఆరిపోవడం కూడా తగ్గిపోయింది, రక్తస్రావం ఏర్పడలేదు అంతే గాక ఆమె చక్కగా తిరగగలుగు తున్నారు, నిద్ర కూడా సరిగానే పడుతోంది. అయితే కాలి మడమలో వాపు, గురక మాత్రం అలాగే ఉన్నాయి.
2019 మార్చి 1 వ తేదీన #3 నుఆపివేసి #2 ను క్రింది రెమిడీ తో భర్తీ చేయడం జరిగింది:
#4. CC3.1 Heart tonic + CC8.1 Female tonic + CC13.1 Kidney & Bladder tonic + CC19.3 Chest infections…6TD
మూడు వారాల తర్వాత రోగి అల్లోపతి మందులు తీసుకోవడం మానేశారు. మరో నెల తర్వాత అనగా 2019 ఏప్రిల్ 22న ఆమె అభ్యాసకుడికి సంప్రదించినప్పుడు మడమ లో స్వల్పంగా వాపు తప్ప అన్ని లక్షణాల నుండి విముక్తి పొందడంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. #4 ను నెలరోజుల పాటు TDS గా తీసుకొని తర్వాత ఆపివేయడం జరిగింది. 2019 జూన్ నాటికి వ్యాధి లక్షణాలు ఎటువంటి పునరావృతం లేకుండా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.
అభ్యాసకుని వ్యాఖ్య : వాంతులు తగ్గక పోవడంతో అభ్యాసకుడు తన అంతర్దృష్టి ఆధారంగా CC8.9 Morning sickness ను #2 కు చేర్చడం జరిగింది.
సంపాదకుని వ్యాఖ్య : 6TD is అనేది వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దశలో ఇచ్చేది కనుక ను మార్చి 1వ తేదీన రోగి సందర్శించినప్పుడు #4 ను TDS కి తగ్గించి ఆ తర్వాత OD గా చేసి ఉంటే బాగుండేది.
హైపోథైరాయిడ్ 11594...India
20 సంవత్సరాల యువతికి మూడు నెలల క్రితం కళ్ళ కింద చీకటి వలయాలు ఏర్పడ్డాయి. గత రెండు నెలలలో బరువు 51 కేజీలకు పెరిగింది. ప్రతిరోజు జ్వరం వచ్చినట్లుగా ఉండడమే కాక జుట్టు రాలడం కూడా ఎక్కువగానే ఉంది. 2018 మే 28వ తేదీన థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవలసిందిగా అభ్యాసకుడు సూచించారు. రెండు రోజుల తర్వాత ఆమె తన వైద్య నివేదిక తో వచ్చింది సీరం టి.ఎస్.హెచ్ 12.5 ఎమ్.ఐ. యు/ఎల్ . ఉంది. ఇది సాధారణ 0.4 -5.4 కంటే ఎక్కువ. చిన్నప్పటినుంచి స్వీట్లంటే చాలా ఇష్టం అని కూడా చెప్పారు. ఆమె వైబ్రియానిక్స్ తప్ప మరే చికిత్సను ఎంచుకోలేదు.
ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC6.2 Hypothyroid + CC15.4 Eating disorders…6TD
ఒక నెల తర్వాత అనగా 2018 జూలై 3న ఆమె వైద్య నివేదిక ప్రకారం సీరం టి.ఎస్.హెచ్ 5.8 ఎమ్ఐ. యు/ ఎల్ . అనగా కొంచం మెరుగు పడ్డప్పటికీ ఇది సాధారణం కంటే కొంచెం ఎక్కువ. ఒక కిలో బరువు కోల్పోయింది, జుట్టు రాలడం 60 శాతం కంటే తక్కువ అయ్యింది. అలాగే జ్వరం రావడం పూర్తిగా తగ్గిపోయింది. కానీ కంటి క్రింద నల్ల చారికలు మాత్రం అలానే ఉన్నాయి మరియు గత రెండు రోజులుగా తలపోటు వస్తున్నట్లు చెప్పారు. ఆమె హిమోగ్లోబిన్ స్థాయి కనిష్టంగా ఉండవలసిన స్థాయి 12 g/dl. కన్నా కొంచం తక్కువగా 10.1 g/dl ఉంది.
రెమిడీ #1 క్రింది విధంగా మెరుగుపరచబడింది:
#2. CC3.1 Heart tonic + CC11.3 Headaches + #1…6TD
మూడు వారాల తర్వాత 2018 జూలై 29 న నివేదిక సాధారణ టి.ఎస్.హెచ్ 5.3 mIU/L గా చూపించింది. ఆమె బరువు 52 కిలోల వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ జుట్టు రావడం తలపోటు తగ్గిపోయి కంటిక్రింద నల్ల చారికలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి సారించడంతో స్వీట్లుమీద ఆమె కోరిక గణనీయంగా తగ్గి పోయింది. రోగి మోతాదును 6TD గా కొనసాగించడానికి ఆసక్తి చూపినప్పటికీ QDS కు తగ్గించడం జరిగింది. టి ఎస్ హెచ్ సాధారణ పరిధిలోనే ఉన్నప్పటికీ ప్రతి నెల శ్రద్ధగా రీఫిల్ కోసం ఆమె అభ్యాసకుని వద్దకు వచ్చేవారు. హీమోగ్లోబిన్ స్థాయి 12.3 పెరిగింది. వైబ్రియో నివారణలతో పాటు అదనంగా ఐరన్ సప్లిమెంట్ కూడా తీసుకున్నారు తప్ప ఇతర అల్లోపతీ మందులు ఏమీ తీసుకోలేదు. తర్వాత 11 నెలల వరకూ ఆమె పరిస్థితి స్థిరంగా ఉంది. ఆమె ఆరోగ్యం గురించి నమ్మకం ఏర్పరచుకున్న తరువాత మోతాదు తగ్గించడం జరిగింది:
#3. CC3.1 Heart tonic + #1…TDS
రోగి సౌకర్యం మేరకు క్రమంగా మోతాదును OW స్థాయికి తగ్గించడం జరుగుతుంది.
జీర్ణ వ్యవస్థ కు చెందిన క్రింది అవయవాల్లో రక్తస్రావం 11594...India
64-సంవత్సరాల వృద్ధుడు గత 30 సంవత్సరాలుగా పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి (వారసత్వంగా వచ్చిన మూత్రపిండ రుగ్మత) తో బాధపడుతూ గత ఆరు నెలలుగా వారానికి ఒకసారి డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారు. అతను పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తూ గత మూడు వారాలుగా ప్రతి రోజూ మలంలో రక్తం పడుతున్నది. ఇది జీర్ణ అవయవాల క్రింది భాగంలోని రక్తస్రావం అని నిర్ధారింప బడింది. 2018 మార్చి 22 వ తేదీన అతని కొలనోస్కోపీ నివేదికలో పెద్ద ప్రేవు మీద రక్తస్రావం కలిగించే బొబ్బలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని హిమోగ్లోబిన్ స్థాయి 7.1 g/dl కు తగ్గింది. అయితే గత 30 సంవత్సరాలుగా ఇది 8 నుండి 9 g/dl గానే ఉంటుందని రోగి చెప్పాడు. అతనిని కొలెక్టమీ (పెద్దప్రేగుకు ఆపరేషన్) చేయించుకో వలసిందిగా సూచించి మందులు ఏమీ ఇవ్వలేదు. రోగి డయాలసిస్ కారణంగా ఇంచుమించు మంచానికి పరిమితమయ్యారు. అంతేకాక మరోసారి ఆపరేషన్ అంటేనే చాలా భయపడుతున్నారు. 2018 మార్చి 25 వ తేదీన రోగి అభ్యాసకుని కలవగా వారు రక్తస్రావం మరియు నొప్పి నివారణకు క్రింది నివారణ ఇచ్చారు:
#1. CC4.4 Constipation + CC4.5 Ulcers + CC4.6 Diarrhoea + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…ప్రతీ పదినిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ అనంతరం 6TD
వారం రోజుల్లో రోగి పొత్తికడుపులో నొప్పి మాయమైంది మరియు అతని మలంలో రక్తం పడటం కూడా తగ్గిపోయింది. మోతాదును TDS కి తగ్గించారు. మరో నాలుగు రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 4వ తేదీన మోతాదును OD కి తగ్గించారు. ఆ విధంగా రెండు వారాలు తీసుకున్న తర్వాత రోగి తనకు పూర్తిగా తగ్గిందని నొప్పి ఏమీ లేదని మలంలో రక్తం పడటం లేదని తెలపడంతో మోతాదును తీసుకోవడం ఆపివేశారు. ఇతని హిమోగ్లోబిన్ స్థాయి 8.4 గ్రాములు పరిధి వరకు పెరిగింది. అతను తన వైద్యుడు సూచించినరీతిగా విటమిన్లు, ఖనిజలవణాలతో కూడిన ఆహారం తినడం తోపాటు వారానికి ఒకసారి డయాలసిస్ మరియు నెలకొకసారి రక్తమార్పిడి చేయించుకుంటున్నారు. రోగి కుమార్తె అభ్యాస కుని తో కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ తన తండ్రికి 2019 జూన్ 23న అభ్యాస కుని వద్దకు వచ్చి వారానికి ఒకసారి డయాలసిస్ చేయడం కారణంగా తన తండ్రి నీరసం తగ్గడానికి నివారణలు ఇమ్మని కోరారు. అంతేకాక తన తండ్రికి పొత్తికడుపులో నొప్పి అలాగే రక్తస్రావం కూడా పునరావృతం కాలేదని ధ్రువీకరించారు.
అభ్యాసకుడు క్రింది రెమిడి ఇచ్చారు:
#2. CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC12.4 Auto immune diseases + CC13.4 Kidney failure + CC15.1 Mental & Emotional tonic…TDS
రోగి ఇప్పటికీ #2 ను వాడుతూనే ఉన్నారు.
గాయాలు పీడకలలు 03546...France
మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం 2017 నవంబర్ లో 35 ఏళ్ల వ్యక్తి ఐవరీ కోస్ట్ నుంచి బయలుదేరి ట్యునీషియా వెళ్లారు. నాటకీయ పరిస్థితులలో సముద్రం దాటిన తర్వాత అతను 9 నెలలు గర్భవతి అయిన తన భార్యకు దూరంగా వలస వచ్చిన వారి క్యాంపులలో లిబియా, ఇటలీ మరియు ఫ్రాన్స్ లలో ఉండవలసి వచ్చింది. 2018 సెప్టెంబర్ లో ఇటలీలోని ఒక శిబిరంలో ఉన్నప్పుడు అతని మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ఇద్దరు దొంగలు అతని రెండు కాళ్లను బాగా ఎడం చేసి దాడి చేశారు. అతని శరీరం యొక్క దిగువ భాగం తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో అతను ఎటువంటి వైద్య సహాయం పొందలేకపోయాడు మరియు తీవ్రమైన నొప్పితో చాలా కాలం పీడకల వంటి పరిస్థితుల్లో గడపవలసి వచ్చింది. అతను తన భార్యను కూడా కనుగొను లేకపోవడం వలన చాలా ఆందోళన తో వున్నాడు.
2019 జనవరి ప్రారంభంలో అతను తన భార్య నుకలుసుకొని కొత్తగా పుట్టిన బిడ్డను చూశారు. జనవరి 6వ తేదీన అభ్యాసకుడు రోగిని చూసే నాటికి-ఎడమ గజ్జలు, తొడ, మరియు మోకాలి వద్ద తీవ్రమైన నొప్పిమరియు పీడకలలతో బాధపడుతూ ఉన్నారు. అతనికి ఈ క్రింది ఇవ్వబడింది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures...6TD
వారం తర్వాత అతనికి నొప్పి, భయము మరియు పీడకలల నుండి 100% ఉపశమనము కలగడంతో మోతాదును TDS కు తగ్గించడం జరిగింది మరో పది రోజుల తర్వాత అనగా జనవరి 23న మోతాదును BD కి వారం తరువాత OD కి తగ్గించి వారం తరువాత నిలిపివేయబడింది. అభ్యాసకుడు పేషంటు కుటుంబం తో సన్నిహితంగా ఉండటం వలన 2019 జూన్ నాటికి రోగి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చక్కగా ఉన్నట్లు తెలిసింది.
బాలుడు బటన్ బ్యాటరీని మింగుట 11607...India
4-సంవత్సరాల బాలుడు రెండు నెలలుగా ప్రతిరోజూ కడుపు నొప్పి బాధపడ సాగాడు. అతనికి ఆకలి ఉండటం లేదు మరియు సన్నగా బలహీనంగా ఉన్నాడు. రోగి మలంలో పురుగులు ఉండడంతో బాబు తల్లి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళింది. వైద్యులు ఇచ్చిన మందులు పనిచేయక పోవడంతో బాబు తల్లిదండ్రులు సిద్ధ చికిత్సను కొంతకాలం ఇచ్చారు. అవి కూడా పనిచేయలేదు. సెలవలలో వారు చెన్నై వచ్చినప్పుడు అదే భవనం లో నివసిస్తున్న అభ్యాసకుని కలుసుకొని విషయం చెప్పారు. 2019 మార్చి 25న బాలునికి ఈ క్రింద రెమిడీఇవ్వబడింది:
#1. CC4.6 Diarrhoea + CC4.10 Indigestion…TDS
మొదటి మోతాదును ఇచ్చిన వెంటనే బాలునికి అధిక జ్వరం వచ్చింది మరుసటి ఉదయం నాటికి అతనికి కడుపునొప్పి కూడా పెరిగింది మరియు ఆగకుండా తుమ్ములు కూడా ప్రారంభమయ్యాయి బాలుడి తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక చిన్న బటన్ బ్యాటరీ (ఫోటోను చూడండి) బాలుడి ముక్కు రంధ్రాల నుండి తుమ్మినప్పుడు బయటపడింది.
అప్పుడప్పుడు చిన్న చిన్న వస్తువులు నోట్లో పెట్టుకునే అలవాటు ఈ అబ్బాయికి ఉంది. కనుక ఆడుకునే హైటెక్ ఆట వస్తువుల నుండి బ్యాటరీని గ్రహించి మింగి ఉంటాడని భావించారు. ఆ తర్వాత వారు తిరిగి తమ స్వస్థలానికి వెళ్ళి ఆటవస్తువులను పరిశీలించినప్పుడు అదే నిజమని ఋజువైంది. మెల్లిగా అతని జ్వరము కడుపు నొప్పి తగ్గడం ప్రారంభించాయి. మరునాటి నుండి ఆడుకోవడం ప్రారంభించాడు. భోజనం కూడా సంతృప్తిగా తింటున్నాడు మరియు అతని మలంలో పురుగులు కూడా కనిపించలేదు. అందువల్ల అతన్ని #1 ని TDS గా ఒక వారం వరకు ఆ తర్వాత OD గా మరొక వారం తీసుకొని ఆపివేయమని చెప్పడం జరిగింది. ఈ కుటుంబము ఊరువదిలి వెళ్లిపోవడం వల్ల ఆ తర్వాత అబ్బాయికి కడుపు నొప్పి మరియు కడుపులో మంట ప్రారంభమై ఏప్రిల్ ఒకటో తేదీన చిన్నపిల్లల వైద్యునికి చూపించారు. రిపోర్టులను బట్టి అతనికి కడుపులో అల్సర్ తో కూడిన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిసింది దానికి వారు అల్లోపతి మందులు వాడారు. అయితే అభ్యాసకుడు సూచించిన #1 వాడుతూనే ఉన్నారు.
అయినప్పటికీ అబ్బాయికి కడుపులో మంట వస్తూనే ఉంది కనుక బాబు తల్లిదండ్రులు చెన్నై వచ్చినప్పుడు 2019 మే 1న అభ్యాస కలిశారు అబ్బాయిని #1 ఆపి క్రింది రెమిడీ వాడవలసిందిగా సూచించారు.
#2. CC4.2 Liver & Gallbladder tonic + CC4.5 Ulcers…TDS
పది రోజుల తర్వాత కడుపులో మంట తగ్గిపోగానే అలోపతి మందులు తీసుకోవడం ఆపివేశారు. అబ్బాయి మే 20 వరకు #2 ని తీసుకొని కడుపులో మంట పూర్తిగా తగ్గడము ఇతర వ్యాధి లక్షణాలు పునరావృతం కాకపోవడంతో ఆపేసాడు. 2019 జూన్ 19 నాటికి అబ్బాయికి ఎటువంటి వ్యాధి లక్షణాలు పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడని వారి తల్లిదండ్రులు చెప్పారు.
అడల్ట్స్ స్టిల్స్ వ్యాధి 02799...UK
25-సంవత్సరాల మహిళ 2012 లో ఆటో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ యొక్క అరుదైన రూపమైన అడల్ట్ వ్యాధి తో బాధపడుతున్నారు. ఆమెకు కీళ్ళ వాపుతో పాటు శరీరమంతా కండరాల నొప్పితో బాధపడుతున్నారు. కొన్ని నెలలు స్టెరాయిడ్స్ పై ఉండటం వల్ల కొంత ఉపశమనం కలిగింది. 2014 అక్టోబర్ లో ఆమె పరిస్థితి పూర్తిగా దిగజారడం తో ఆమె మూడు వారాల పాటు ఆస్పత్రిలో చేరింది. తరువాత నొప్పి తట్టుకోవడం కోసం స్టెరాయిడ్లు మరియు మార్ఫిన్ లతో సహా అధిక మోతాదు గల మందులు తీసుకోవడం జరిగింది. చికిత్స పొందుతూ ఉన్నప్పుడు 2015 మార్చిలో ఆమెకు బోలు ఎముకల వ్యాధి మరియు నడుముకు క్రింది భాగంలో వెంట్రుక మందం గల పగుళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎముక పగులు నయం చేయటానికి మరియు ఆమెకు గల తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి విశ్రాంతి కోసం ఆమెకు కాల్షియం మరియు విటమిన్ డి మందులు ఇవ్వబడ్డాయి. ఈ పరిస్థితి అంతటికీ కారణం స్టెరాయిడ్స్ దీర్ఘకాలిక వినియోగం. మందులు తీసుకున్నప్పటికీ ఆమె సరిగా నడవలేక శరీరమంతా పూర్తిగా బాధతో మరియు అలసటతో ఉండేది. ఇటువంటి పరిస్థితిలో 2015 మే 10వ తేదీన ఆమె అభ్యాసకుని సంప్రదించారు. ఆమె యొక్క ESR స్థాయి 75 (సాధారణ స్థాయి 1-20 mm/hr) ఉంది.
ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది.
కీళ్ల వాతం మరియు బోలుఎముకల వ్యాధి:
#1. CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis + CC20.7 Fractures...QDS
మంటకు:
#2. NM45 Atomic Radiation + NM113 Inflammation + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR324 X-ray + SR348 Cortisone...QDS.
ఆమె అల్లోపతి మందులు అన్నిటితో పాటు వైబ్రియానిక్స్ నివారణలు కూడా కొనసాగించారు. ఆమెకు శక్తి చేకూరినట్లుగా అనుభూతి పొందడంతోపాటు రెండు వారాల్లో ఆమె అన్ని రకాల నొప్పినుండి 50 శాతం ఉపశమనం పొందారు. మరియు ఆమె ESR స్థాయి 28 కి తగ్గింది. ఆమె శక్తి స్థాయి 50 శాతానికి పైగా పెరిగింది మరియు ఆమె తన రోజువారీ పనులను చాలా తేలికగా చేసుకోగలుగు తున్నారు. మరో ఆరు వారాల తర్వాత ESR స్థాయి 28 కి చేరింది. ఆమె, మెతోట్రెక్సెట్ (methotrexate) 20mg, తప్ప అన్ని అల్లోపతి మందులు ఆపేసారు. అది కూడా తన పరిస్థితి మెరుగుపరచుకోవడానికి వారానికొకసారి మాత్రమే తీసుకుంటున్నారు. 2015 సెప్టెంబర్ నాటికి ఆమె 90% ఫిట్ గా తయారయ్యారు. ESR స్థాయి 25కు చేరింది. నొప్పులు మాయం కావడంతో చక్కగా వేగంగా నడవగలుగుతున్నారు మరియు తన పనిని తిరిగి ప్రారంభించ గలిగారు. మెతోట్రెక్సెట్ మోతాదు 12 mgకి తగ్గించబడడం తో పాటు #1 మరియు #2 మోతాదులను ఆరు నెలలు TDS ఆ తర్వాత 2016 మార్చి నుండి BD కి తగ్గించారు. ఏప్రిల్ 4 నాటికి ఆమెకు అన్ని నొప్పుల నుండి 100% ఉపశమనం కలిగిందని తెలిపారు. మరో 6 నెలలు తర్వాత 2016 అక్టోబర్ నాటికి ఆమె ESR స్థాయి 7 వద్ద స్థిరంగా ఉండటంతో ఆమె చాలా కాలంగా తీసుకుంటున్న Methotrexate తీసుకోవడం పూర్తిగా ఆపివేశారు. 2019 ఏప్రిల్ నాటికి ఎటువంటిపునరావృతం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఏప్రిల్ 4 నాటికి #1 & #2 ను BD గా మెరుగైన ఆరోగ్యం కోసం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని కూడా అనుసరిస్తున్నారు. అంతేగాక గతంలో కుటుంబ జీవనం అసాధ్యమనుకున్న దానిని ఈ సంవత్సరం వివాహం చేసుకొని సుసాధ్యం చేయాలని భావిస్తున్నారు.
108CC బాక్సు నుండి ఇచ్చేటట్లయితే #2: CC20.1 SMJ tonic…QDS
ఎముక చిట్లడం వల్ల వెన్ను మరియు మోకాలు నొప్పి 11585...India
2015 డిసెంబర్ లో 34 ఏళ్ల మహిళ తను పని చేసే ప్రదేశానికి వెళుతూ ప్రమాద వశాత్తు కింద పడిపోవడం వల్ల నడుము వద్ద ఫ్రాక్చర్ అయ్యింది. ఇది 6 నెలలలో తగ్గిపోయింది కానీ ఆమెకు తీవ్రమైన వెన్ను నొప్పి మరియు మోకాలినొప్పి ఏర్పడ్డాయి. అదే సమయంలో ఆమె భర్త ఒక ప్రమాదంలో చనిపోవడంతో ఆమెకు మానసికంగా కుంగుబాటుకు గురైంది. 2015 ఆమె జీవన ఉపాధి కోసం ఎంతో కష్టపడాల్సి రావడంతో ఆమె కష్టాలు రెట్టింపయ్యాయి. రోజువారీ పనుల కోసం ఆమె తన కుటుంబ సభ్యుల పై ఆధారపడవలసి వచ్చింది. అలోపతి మందులు సంవత్సరం పాటు తీసుకున్నప్పటికీ ఆమెకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగలేదు కనుక వాటిని మానేసారు. నొప్పి భరింప రానిదిగా ఉన్నప్పుడు అల్లోపతీ నొప్పి నివారణల మీదే ఆధారపడాల్సి వచ్చేది. 2017 మార్చి 24న ఆమె చికిత్సా నిపుణుని సంప్రదించగా వీరికి ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.5 Spine + CC20.7 Fractures…TDS
కేవలం రెండు వారాలలోనే రోగికి మోకాలు మరియు నడుం నొప్పి విషయంలో 50 శాతం మెరుగుదల కనిపించింది. ఆమె నొప్పికి వాడే అల్లోపతి బాధ నివారణలను వేసుకోవడం మానేసారు. ఎటువంటి ఆసరా లేకుండానే తన పనులు తాను చేసుకోగలగా సాగారు. మరో రెండు వారాల్లో ఆమెకు మోకాలి నొప్పి మరియు నడుము నొప్పి నుంచి 100% ఉపశమనం కలిగింది. మోతాదును మెల్లిగా తగ్గిస్తూ నెలరోజులపాటు OW గా తీసుకున్నారు.
మరో నెల రోజుల తర్వాత 2017 జూన్ 22న రోగి పూర్తి ఆరోగ్యంగా ఉన్నందువల్ల నివారణ తీసుకోవడం మానేసినట్లు తెలిపారు. ఉద్యోగం కూడా వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాల గడిచిపోయినప్పటికీ సమస్య పునరావృతం కాలేదు తాను చాలా ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నానని ఆమె తెలిపారు.
మానసిక గాయం అనంతరం తీవ్రమైన భయాందోళనలు 03533...UK
2015 డిసెంబర్లో లైంగిక దాడి తర్వాత 23 ఏళ్ల స్వతంత్ర, మరియు బహిర్ముఖ ప్రతిపత్తి గల్గిన యువతి ప్రతిరోజు భయాందోళనకు గురి కావడం ప్రారంభించింది. ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆకస్మిక వణుకు, దడ, తీవ్ర ఆందోళన, ముఖం పాలిపోవడం వంటి లక్షణాలు ఏర్పడుతున్నాయి. ఈ లక్షణాలు తలెత్తుతున్న స్థితిలో బయటకు వెళ్లాలన్నా భయం కలుగుతోంది. సిగ్గు మరియు తనపై తనకు కలిగిన అసహ్య భావం కారణంగా స్నేహితులను కలవడం కూడా మానేసింది. గత జ్ఞాపకాలు మరి ఆమె భావోద్వేగాలను ఎదుర్కోలేక దాడికి ముందు ఆమె చేస్తున్నటువంటి డిగ్రీ కోర్సును కూడా నిలిపివేసింది. వైద్యుడిని సంప్రదించి నప్పటికీ ఆ మందులు వాడకుండా 2016 జూలై 27న అభ్యాసకుని సంప్రదించినప్పుడు క్రింది ఇవ్వబడింది:
27 జూలై 2016 న రోగి చికిత్సా నిపుణుని సంప్రదించగా క్రింది కాంబో ఇవ్వబడింది:
CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities…TDS
నాలుగు వారాల తర్వాత రోగి పరిస్థితి గణనీయంగా మెరుగు పడింది. ఆమె క్రమంగా దాడి తాలూకు మానసిక ఆందోళన నుండి దూరమై ఆత్మవిశ్వాసం పొందటం ప్రారంభించింది. అయితే అప్పుడప్పుడు ఆ సంఘటన తాలూకు భయం ఆమెను వణికి పోయేలా చేస్తోంది.
మరో నాలుగు వారాల తర్వాత మోతాదు BD కి తగ్గించబడింది. ఎందుకంటే ఆమె అన్ని విధాలుగా 80% ఉపశమనం పొందింది ఆమెను వణికిస్తున్న భయం కూడా తగ్గింది. అక్టోబర్ 24 నాటికి 100% ఉపశమనం పొందారు. భయాందోళనలు ఏమాత్రం లేవని ఆమె చెప్పారు. ఆమె ఆత్మవిశ్వాసం పెరిగి చదువును కూడా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. మోతాదు OD కి తగ్గించబడింది. నెల తర్వాత అనగా2016 నవంబర్ 25 న నివారణ తీసుకోవడం ఆపివేసారు. 2017 సెప్టెంబర్ లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం కూడా పొందారు. 2019 ఏప్రిల్లో రోగితో చివరిసారిగా సంప్రదింపులు జరిగినప్పుడు వ్యాధి లక్షణాలు ఏమీ పునరావృతం కాలేదని తన ఉద్యోగంలో సాఫీగా కొనసాగగలుగు తున్నానని తెలిపారు.
అభ్యాసకుని వ్యాఖ్య : CC4.2 ను ఆమెపై దాడి చేసిన వ్యక్తుల పట్ల ఉన్న కోపాన్ని అధిగమించడానికి CC13.1 ను తీవ్రమైన భయంవల్ల అది మూత్రపిండాలపై ప్రభావం చూపకుండా ఉండడానికి ఇవ్వబడింది.
మలేరియా అవశేషాలు అధిక లాలాజలం మరియు చెమట 03546...France
2014 లో పోషకాహార లోపంతో బాధపడుతూ కేవలం తొమ్మిది కేజీల బరువు మాత్రమే ఉన్న మూడేళ్ల పాప ఆఫ్రికాలో దత్తత తీసుకోబడి ఫ్రాన్స్ కు తీసుకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆమెకు మలేరియా ఉందని నిర్ధారణ కావడంతో నోటి ద్వారా వేసే క్వినైన్ మాత్రలతో మూడు నెలలు చికిత్స చేయగా జ్వరం మరియు తలనొప్పి నుండి ఉపశమనం లభించింది. కానీ ఆమె శరీరం ఎప్పుడు తాకినా వేడిగా ఉండడమే కాక ఆ పాప అధిక ఉష్ణోగ్రతను భరించలేక విలవిల లాడేది. ఆమెకు విపరీతమైన చెమటలు ఏర్పడుతూముక్కుతో శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది కలిగేది. ఆమె గొంతునుండి శ్వాస తీసుకునేటప్పుడు ఒక రకమైన ధ్వని వచ్చేది. ఆమె టాన్సిల్స్ కూడా విస్తరించాయి. రాత్రి సమయాల్లో ఆమె అధిక లాలాజలం ఉత్పత్తి చేయడంతో అది ఉదయానికి నోటి చుట్టూ ఎండిపోయి కనిపించేది.
శ్వాసలో ఇబ్బంది తొలగించడానికి 2015 లో శస్త్రచికిత్స ద్వారా అడెనాయిడ్లు తొలగించబడ్డాయి కానీ ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. ఆమె శ్వాసకోశ ఇబ్బందులు వారి ఇంట్లో ఉన్న కీటకాలు లేదా తలలో పేలు వలన ఏర్పడుతున్నట్లు భావించి ఎన్నో నెలలు డీసెన్సిటైజేషన్(గ్రాహతను తగ్గించేందుకు చాలాకాలం వైద్యం చేసే విధానము) చికిత్స కూడా తీసుకుంది. అది కూడా గణనీయమైన మెరుగుదల ఇవ్వలేదు.
2018 ఆగస్టు 8వ తేదీన పాప కుటుంబ సభ్యులు ఈ లక్షణాలన్నీ అభ్యాసకునికి వివరించి పోస్టు ద్వారా క్రింది నివారణలు పొందారు.
CC3.1 Heart tonic + CC9.1 Recuperation + CC11.5 Mouth infections + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis…TDS
చికిత్స సమయంలో పాప వేరే ఇతర మందులు ఏమీ తీసుకోలేదు. ప్రాక్టీషనర్ ఇచ్చిన నివారణలు తీసుకున్న వారం తర్వాత ఆమె ముక్కుతో స్వల్పంగా గాలి పీల్చుకోవడం ప్రారంభించింది. శరీరము యొక్క వేడి మరియు చమట అప్పటికంటే కొంచెం తక్కువ అయ్యింది. అధిక ఉష్ణోగ్రతను భరించే సామర్ధ్యం కూడా పెరిగింది. మొత్తం మీద ఆమెకు 20 శాతం ఉపశమనం కలిగింది. అయితే నోటిలో లాలాజలం విషయంలో 50 శాతం పెరుగుదల కనిపించింది. మరొక మూడు వారాల తర్వాత ఆమెకు అన్ని లక్షణాల్లో 50 శాతం మెరుగుదల కనిపించింది. లాలాజలం పూర్తిగా ఆగిపోయింది. 2018 అక్టోబరు 24వ తేదీ నాటికి కేవలం 11 వారాల్లో ఆమె వ్యాధి లక్షణాలు పూర్తిగాపోయి సాధారణ స్థాయిలో గాలి పీల్చుకోవడం ప్రారంభించింది. లాలాజలం స్రవించడం ఆగిపోయింది. శరీర ఉష్ణోగ్రతలు తగ్గటమే కాకుండా అధికంగా చెమట పట్టడం కూడా తగ్గింది. రోగికి టాన్సిల్స్ వలన నొప్పి లేదా అసౌకర్యం లేదు కనుక దానికి చికిత్స ఏమీ ఇవ్వలేదు కనుక అవి ఇంకా స్వల్పంగా విస్తరించే ఉన్నాయి.
నివారిణి మరొక నెల రోజుల పాటు అనగా 2018 నవంబర్ 24 వరకు TDS స్థాయిలో కొనసాగింది. 2018- 19 శీతాకాలంలో పాప ఆరోగ్యంగా ఉండడమే కాక కనీసం జలుబు కూడా లేదు. అలాగే 2019 జూన్ 16 నాటికి పాప పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇరవై రెండు కేజీల బరువు కూడా ఉంది. అయితే ఫోన్ ద్వారా వినడంలో అవగాహనా లోపం కారణంగా మోతాదు తగ్గించే విధానము కొనసాగలేదు.
సాధకురాలి వివరములు 11601...India
ప్రాక్టీషనర్ 11601...ఇండియా చిన్న నాటి నుండి సాయి ఫోల్డ్ లో ఉన్న ఈ అభ్యాసం రాలిని అనేకసార్లు స్వామి ఆశీర్వదించారు. ముఖ్యంగా 1973 లో వైట్ ఫీల్డ్ లో జరిగిన మొదటి బాలవికాస్ ర్యాలీలో ఆమె స్వామి సన్నిధిలో ప్రసంగించే అవకాశం పొందారు. 1977లో సమ్మర్ కోర్స్ లో పాల్గొనడానికి స్వామి చేత ఆమె వ్యక్తిగతంగా ఎన్నుకోబడ్డారు. వీరికి 16 సంవత్సరాల వయసులో వచ్చిన ఒక చర్మరుగ్మత నివారణ కోసం బాధకారమైన ఇంజెక్షన్ లను ప్రతీ రోజూ తీసుకుంటూ 48 రోజులు అనంతరం కూడా ఏమాత్రం ఉపశమనం ఇవ్వనప్పుడు స్వామి తమ యొక్క దైవిక స్పర్శ మరియు విభూతితో నివారణ చేశారు. సైన్స్ లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు కానీ దానికి రాజీనామా చేసి స్వామి యొక్క సూచన ప్రకారం బ్యాంకింగ్ రంగంలో చేరారు. ఆ తర్వాత ఆమె ప్రొఫెషనల్ బ్యాంకర్ గా అర్హత సాధించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే ఆమె జాతీయ సామాజిక సేవలో చురుగ్గా ఉండేవారు. కెరీర్ కు సంబంధించిన వత్తిడి మరియు సంప్రదాయ కట్టుబాట్లు ఉన్నప్పటికీ వారాంతపు సెలవులు మరియు ప్రత్యేక సెలవులలో సాయి సంస్థ యొక్క సేవా కార్యక్రమాలలో ఆమె తన సేవలను కొనసాగించారు.
జాతీయం చేయబడిన ఒక బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవి విరమణ చేసిన వెంటనే రామకృష్ణ మిషన్ లో ఉన్న ఒక సన్యాసితో జరిపిన సాధారణ సంభాషణ ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు. సేవ పట్ల ఆమెకున్న అభిరుచి మరియు ఉత్సాహం వలన త్వరలోనే ఆమె మరిన్ని వివరాలు సంపాదించి కోర్సులో చేరారు 2018 జులై లో ఎ.వి.పి. గా నవంబర్ లో వి.పి గా మారారు.
వీరు ఇప్పటి వరకు 650 మంది రోగులకు చికిత్స అందించారు. చాలామంది రోగులు సంక్లిష్ట సమస్యలతో ఉన్నవారే. వీరి ద్వారా విజయవంతంగా చికిత్స పొందిన కేసులలో అనారోగ్య సిరలు, దీర్ఘకాలిక ఆమ్లత్వం, ఆనల్ ఫిస్టులా, మూలశంక, హెర్నియా, గర్భ ధారణ లో ఆలశ్యం, పి.ఎస్.ఒ.డి. , ట్రామా, సిస్టమిక్ లుపస్ ఎరితెమో టోసస్, మూత్రం ఆపుకోలేని తనము, కటి ప్రాంతంలో ఇన్ఫ్లమేటరీ వ్యాధులు, వెర్టిగో లేదా తలత్రిప్పుడు, గురక, ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ ( టి. ఐ. ఎ. మెదడుకు తగినంత రక్తం సరఫరా లేకపోవడంతో ఆక్సిజన్ అందకపోవడం వల్ల వచ్చే న్యూరలాజికల్ స్ట్రోక్), గర్భస్రావం వలన దీర్ఘకాలిక రక్తస్రావం, శ్వాసకోశ వ్యాధులు, మరియు సోరియాసిస్.
ఎముకలకు, చర్మానికి సంబంధించిన నొప్పులు మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు సత్వర ఉపశమనం కోసం మరియు సమయోచిత బాహ్య అనువర్తనం కోసం ఆలివ్ నూనెతో నివారణలు తయారుచేసి ఇస్తూ ఉంటారు. రోగులు అటువంటి సమస్యలకు అపాయింట్మెంట్ తీసుకొన్నప్పుడు ఒక చిన్న బాటిల్ ఆలివ్ నూనె తీసుకురావలసిందిగా ప్రోత్సహిస్తారు. మరియు నోటి ఇన్ఫెక్షన్ కోసంఇవ్వబడిన నివారణి ఒక చెంచా మందు నోట్లోకి తీసుకొని పుక్కిలించి ఉమ్మి వేసిన తరువాతే మందును వాడే విధానము అనుసరించాలని చెబుతుంటారు. దీనివల్ల రోగి త్వరగా కోలుకుంటారని ఆమె కనుగొన్నారు.
ప్రతీ రోగీ తన జీవితంలో ఏదో ఒక రకమైన మానసిక విచారము (ట్రామా)ఎదుర్కొంటారని ఆమె నమ్ముతూ ఉన్నందువల్ల ఎవరైనా రోగి చికిత్స కోసం మొదటి సారి ఆమెను సందర్శించినప్పుడు ఆమె వారికి CC10.1 Emergencies ఇస్తారు. క్లిష్టమైన కేసుల విషయంలో ఆమె గందరగోళానికి గురి అయిన ప్రతీసారి మార్గదర్శకత్వం కోసం మరియు వారికి నయం చేయడంలో సహాయం చేయమని స్వామిని తీవ్రంగా ప్రార్థిస్తారు. నవంబర్ 2018 లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కు వెళ్లినప్పుడు రోడ్డుకు అవతల ఒక కుక్క వాహనం చేత ఢీకొన్న విషయాన్ని గమనించారు. ఆ కుక్క కుంటుతూ బాధతో అరుస్తూ ఉంది. వెంటనే ఈ అభ్యాసకురాలు స్వామిని ప్రార్థిస్తూ CC10.1 Emergencies + 15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures. మానసికంగా బ్రాడ్కాస్టింగ్ చేయడం ప్రారంభించారు. ఆ కుక్క నెమ్మదిగా రోడ్డు దాటి షాపింగ్ కాంప్లెక్స్ వైపు వచ్చింది. ఆ తరువాత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మామూలుగా నడుచుకుంటూ ప్రాక్టీషనర్ ఉన్న వైపు వచ్చింది. షాపు యజమాని ఇచ్చిన బిస్కెట్లను ఆస్వాదించి సులువుగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అటువంటి అనుభవాలను ఈ అభ్యాసకురాలు ఎన్నో పొంది ఉన్నారు. ఈ నమ్మకమే ఆమెకు వైబ్రియానిక్స్ పట్ల నమ్మకం పెంచి హృదయ పూర్వకంగా సేవ చేయడానికి సంసిద్ధులు అయ్యేటట్లుగా చేసింది.
ఈమె తన చిన్నతనం నుండి అలవాటుపడిఉన్న బెంగళూరులో ఉన్న సాయిసమితికి వచ్చే భక్తుల కోసం నెలకు ఒకసారి వైబ్రియానిక్స్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అలాగే నెలకు రెండు సార్లు తన ఇంటికి దగ్గరగా ఉన్న షిర్డీసాయి ఆలయంలో రోగులకు చికిత్స కూడా చేస్తున్నారు. రానున్న కాలంలో ప్రతి సాయి సెంటర్ ఒక వైబ్రియానిక్స్ క్లినిక్కును ఏర్పాటు చేసే విధంగా స్వామి దీవించాలని ఆమె కోరుకుంటున్నారు. కాలాంతరంలో ఇది ప్రతి ఇంటి వారు కోరుకునే, ఇష్టపడే చికిత్స విధానం అవుతుందని వీరి నమ్మకం.
ఈ అభ్యాసకురాలు తన అడ్మిన్ సేవలో భాగంగా వార్తాలేఖను ఫార్మాటింగ్ లేదా ఆక్రూతీకరించే పరిపాలన సేవలు కూడా నిర్వహిస్తున్నారు. 87 సంవత్సరాల వయసుగల వీరి తల్లిగారు కూడా తన యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు అభ్యాసకురాలి వద్ద నివారణలు తీసుకోవడమే కాక ప్లాస్టిక్ బాటిళ్లలో గోళీలు వేయడం, వాటికి లేబుల్స్ అంటించడం వంటివి చేస్తూ వీరికి సహాయకురాలిగా ఊంటున్నారు. ఈ అభ్యాసక రాలు స్వామికి, ఆమె తల్లికి, ఆమె గురువు 12051 కూ, మరియు తనకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు వారు చేసిన సహాయానికి అందించిన మార్గదర్శకత్వాకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు.
స్వామితో ఈ అభ్యాసకులు అనుభవించిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ తను స్వామికి ఎంతో రుణపడి ఉన్నానని తన చివరి శ్వాస వరకు అన్ని జీవులలో ఉన్న స్వామికి సేవ చేస్తానని ఎందుకంటే స్వామి చెప్పిన వాక్యం ‘’పరోపకారార్ధం ఇదం శరీరం ‘’ భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది ఇతరులకు సేవ చేయడానికే అనే మాటలు నిజం చేస్తూ సేవలో జీవితం సార్థకం చేసుకుంటానని చెబుతున్నారు. నిస్వార్ధంగా జరిగే ఈ వైబ్రియానిక్స్ సేవ ఎక్కడ జరిగినా అక్కడ స్వామి ఖచ్చితంగా ఉంటారని ఆమె ప్రగాఢమైన విశ్వాసం. వైబ్రియానిక్స్ సేవ ఆమెను స్వామితో మరింత గాఢంగా అనుసంధానంనింపజేసి జంతువులు మొక్కలతో సహా సర్వజీవులలో ఉన్న స్వామి ఒక్కరే అనే ఏకత్వాన్ని అనుభవించేట్టుగా చేసింది. ఆమె రోజువారీ ప్రార్ధనలో సమస్త విశ్వం యొక్క సంక్షేమం కోసం ‘సమస్త లోకా సుఖినోభవంతు’ అని ప్రార్థిస్తూ ఉంటారు.
పంచుకున్న కేసుల వివరాలు:
సాధకురాలి వివరములు 11594...India
ప్రాక్టీషనర్ 11594…ఇండియా మైక్రో బయాలజీలో పోస్ట్ డాక్టరేట్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత వైద్య కళాశాలలో అధ్యాపకులు రాలిగా మరియు పరిశోధకురాలిగా ఉన్న వీరు 34 పరిశోధనా ప్రచురణలకు కారణభూతురాలు. ఈమె 12 జాతీయ మరియు అంతర్జాతీయ శాస్త్రీయ మరియు వైద్య పరిశోధనా పత్రికల సంపాదక మండలి సభ్యులుగా మరియు ప్రచురించిన వ్యాసాల సమీక్షకురాలిగా కూడా ఉన్నారు.
సాయి భక్తుల కుటుంబంలో జన్మించిన ఈ అభ్యాసకురాలు చిన్నతనం నుండి సాయి సంస్థ యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2017 లో వీరి సహచరులు11567&11590 నుండి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని తన దీర్ఘకాలిక వ్యాధులకు నివారణ తీసుకోవడం ప్రారంభించారు. వారిచే ప్రేరణ పొంది ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకొని ఫిబ్రవరి 2018 లో ఎ.వి.పి. గా అర్హత సాధించి సెప్టెంబర్ 2018 లో వి.పి. అయ్యారు.
ఆమెకు ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ రోగులకు చికిత్స చేయడానికి ఆమె ఆదివారాలలో స్థానిక సాయి కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ఆమె పని నుండి తిరిగి వచ్చిన వెంటనే ప్రతి సాయంత్రం ఇంట్లో కూడా రోగులకు సేవ చేస్తున్నారు. గత 15 నెలలుగా 590 మంది రోగులకు చికిత్స చేశారు. వీరు చికిత్స చేసిన వ్యాధులలో క్రోన్స్ వ్యాధి, పి.సి.ఒ.డి., జుట్టురాలడం, దీర్ఘకాలిక కండరాల ఎముకల వ్యాధులు, శ్రద్ధ లోపించడం, సోరియాటిక్ రుమటాయిడ్ ఆర్ధ్రైటిస్, ఊపిరితిత్తులలో నిమ్ము, సోరియాసిస్ మరియు చర్మ వ్యాధులలో అద్భుతమైన ఫలితం పొందారు. క్యాన్సర్, డయాబెటిస్, మూత్రపిండాల వైఫల్యం మరియుశారీరక ఎరితేమోటోసిస్ తో బాధపడుతున్న రోగులు గణనీయంగా మెరుగు పడ్డారు. డెంగ్యూరోగులు త్వరగా కోలుకున్నారు. పాత రోగుల చేత సూచింపబడిన చాలామంది సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం సంప్రదించగా నివారణలు పోస్టు ద్వారా పంపుతుంటారు.
ఈ చికిత్సానిపుణురాలు తన రోగులకు తగినంత సమయం ఇస్తూ శ్రద్ధగా వారు చెప్పే విషయాలను విని అవగాహన చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇది వారిని నిస్పృహ నుండి అనారోగ్య స్థితి నుండి బయటకు తీసుకు రావడానికి మరియు నివారణను వేగవంతం చేయడానికి సహాయ పడిందని ఆమె తెలుపుతున్నారు. ఈమె రోగులలో నిరాశ్రయులు మరియు వృద్ధులు కూడా ఉన్నారు. ఒంటరిగా ఉంటూ నిరాశకు గురైన వారికి CC15.2 Psychiatric disorders ఇస్తారు. దీనివలన వారు త్వరగా కోలుకొని తమ మనసులో ఉన్న భావాలను సమస్యలను ఒక కుటుంబ సభ్యురాలి వలనే భావించి అభ్యాసకురాలికి తెలుపుతారు. నివారణ ఇచ్చేముందు బాటిల్ ను దేవుడిగదిలో స్వామి యొక్క మండపంలో లేదా వారి ఫోటో ముందు ఉంచి సాయి గాయత్రి మరియు మృత్యుంజయ మంత్రాన్ని మూడుసార్లు జపించి ఇస్తారు. ఒకవేళ రోగి బాధ ఎక్కువగా ఉంటే నయం చేసే ఊదా రంగు కాంతిలో రోగి ఉన్నట్టుగానూ ఆ రోగికి పూర్తిగా నయం అయినట్టుగా భావిస్తూ స్వామిని ధ్యానిస్తూ ఉంటారు.
వైబ్రియానిక్స్ అనేది విజ్ఞాన శాస్త్రాన్ని, అధ్యాత్మికతనూ కలిపే ఒక చికిత్సా విధానము అని వీరి భావన. ఇది పరిశోధనకు ఒక ఉత్తేజకరమైన విషయంగా భావించి తదనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. పరిశోధన నిమిత్తం రోగుల నుండి వేరు చేయబడిన కొన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పానాసోనిక్ సూక్ష్మ జీవుల జాతులపై ఎంచుకున్న వైబ్రియానిక్స్ నివారణలు యొక్క యాంటీ మైక్రోబయల్ చర్య లేదా ప్రభావాన్ని పరీక్షించడానికి ఆమె అధ్యయనం ప్రారంభించారు. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు సాధారణంగా ఉపయోగించే యాంటీ బయాటిక్స్ కు స్పందించవు. ప్రాథమిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఖచ్చితమైన ఫలితాలు వచ్చేవరకు పరిశోధన కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు.
అభ్యసకురాలు వైబ్రియానిక్స్ తో తన ప్రయాణం మనోహరంగా ఉత్తేజకరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. తన జీవితంలో ఇతరులకు సహాయం చేయాలనే తీరని వాంఛను తీరుస్తూ జీవితంలో ఏర్పడిన లోటును భర్తీ చేసిందని పేర్కొంటున్నారు. రోగికి ప్రేమతో దయతో స్వాంతన చేకూర్చే మాటలతో నివారణ ఇవ్వడం అద్భుతమైన ఫలితాలను నిజమైన సంతృప్తిని ఇస్తుందని వీరి భావన. రోగులను వారి బాధలనుంచి విముక్తి చేస్తూ వారి నిరాశ, ఆందోళన దూరం చేస్తూ వారి మానసిక స్థితిని పెంపొందిస్తూ ఆనందకరంగా జీవించేలా చేసే స్వామి యొక్క ఉన్నతమైన పనిముట్టుగా ఉండాలనేదే వీరి యొక్క ఆశయం.
పంచుకున్న కేసులు:
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1. వైబ్రియానిక్స్ విధానము అలోపతి మందులతో అనుకూలంగా ఉంటుందని హోమియోపతి లేదా ఆయుర్వేదం తో అనుకూలంగా ఉండదని ఎందుకు చెప్పబడింది? చికిత్సా నిపుణుని వద్దకు వచ్చే నాటికి ఈ వైద్య విధానాల్లో ఏదో ఒకదాని పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగితో మనం ఎలా వ్యవహరించాలి?
జవాబు: వైబ్రియానిక్స్ చికిత్సా విధానం మొదట వ్యాధి ప్రారంభమయ్యే సూక్ష్మ రంగాలలో శక్తులను సమతుల్యం చేయడం ద్వారా పనిచేస్తుంది. ఈ విధానం సూక్ష్మస్థాయిలో వ్యాధికి గురైన అవయవాన్ని పునరుత్పత్తి చేస్తుంది. దీని ప్రభావం భౌతిక స్థాయిలో కనిపించి శారీరక అంగము యొక్క ఆరోగ్యం పునరుద్ధరింప బడుతుంది.
అల్లోపతి విధానము భౌతిక స్థాయిలో పని చేస్తుంది. అయితే ఈ విధానం కొన్నిసార్లు శరీరంలోని ఇతర భాగాలపై ప్రతికూలంగా పనిచేసి తలనొప్పి, దద్దుర్లు, మగత మొదలైన లక్షణాలకు కారణం అవుతుంది( వీనిని దుష్ప్రభావాలు అంటారు).వైబ్రియానిక్స్ విధానం వైబ్రేషన్ లేదా సూక్ష్మ స్థాయిలో పని చేస్తుంది కనుక అల్లోపతి మందులతోపాటు ఇచ్చినప్పుడు భౌతిక స్థాయిలో అల్లోపతి మందుల పనిలో ఇది జోక్యం చేసుకోదు. అదనంగా ఇది అల్లోపతి మందుల దుష్ప్రభావాలు నివారిస్తుంది లేదా ఆ దుష్ప్రభావాలను పోగొడుతుంది. అంతర్గత సూక్ష్మ శక్తులను సమతుల్యం చేయడం తద్వారా వేగంగా మరియు మరింత స్థిరమైన వైద్యం రోగికి అందించబడుతుంది.
హోమియోపతి విధానం కూడా వైబ్రేషన్ స్థాయిలో పని చేస్తుంది. కొన్ని హోమియోపతి నివారణలు మరికొన్ని ఇతరహోమియోపతి నివారణలకు విరోధిగా లేదా విరుగుడుగా పనిచేస్తాయని విస్తృతంగా నమ్ముతారు కాబట్టి హోమియోపతి చికిత్సా నిపుణులు దీనిని దృష్టిలో ఉంచుకొని రోగులకు చికిత్స సూచిస్తారు. కనుక హోమియోపతి చికిత్స పొందుతున్న రోగి మనల్ని సందర్శిస్తే అతనికి చికిత్స చేయడానికి నిరాకరిస్తాము. ఎందుకంటే రోగి ఏ హోమియో పతి నివారణ తీసుకుంటున్నాడో మనకు తెలియదు కనుక మనం ఇచ్చే రెమిడీ వారు తీసుకుని నివారణకు విరుగుడు లేదా విరుద్ధమైన విధంగా పని చేయవచ్చు. కనుక రోగికి హోమియోపతి చికిత్స బాగా పని చేస్తూ కూడా వైబ్రియో వైద్య చికిత్స కోసం మన వద్దకు వస్తే రోగి హోమియోపతి మాత్రమే కొనసాగించడం ఉత్తమం అని సలహా ఇస్తాము. రోగి తనకు హోమియోపతి చికిత్స బాగా పనిచేయడం లేదని హోమియోపతి నివారణతో పాటు వైబ్రియానిక్స్ చికిత్స కూడా తీసుకోవాలి అని మన వద్దకు వస్తే తన స్వయం నిర్ణయం మేరకు మొదట హోమియోపతిని ఆపమని చెప్పి అలా చేసిన మూడు రోజుల తర్వాత వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించాలి.
ఆయుర్వేదం భారతీయ ప్రాచీన సాంప్రదాయ ఔషధ శాస్త్రం. ప్రకృతి నియమాలకు అనుగుణంగా వ్యాయామం, ధ్యానం, శ్వాసక్రియ నియంత్రణతో పాటు ప్రతీ వ్యాధికి ఆహారమునకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మూలికల వంటి సహజ పదార్థాల ఆధారంగా అందించే చికిత్సా విధానం. అందువలన ఇది ఒక సంపూర్ణ చికిత్సా విధానం కనుక ఆయుర్వేదంతో పాటు ఇతర విధానాల నివారణలు ఇవ్వక పోవడమే మంచిది. అయితే ఆయుర్వేద టానిక్ లు ఆహార పదార్థాల వంటివి కనుక వైబ్రోనివారణలకు అంతరాయం కలిగించవు కనుక వీటిని తీసుకోవచ్చు.
________________________________________
ప్రశ్న 2. ప్రామాణిక TDS మోతాదు బదులుగా వేగంగా నయం చేయడానికి 6TD మోతాదుతో చికిత్స ప్రారంభించవచ్చా?
జవాబు: వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణ ప్రతిస్పందన లభించడానికి 6TD వద్ద చికిత్స ను ప్రారంభించడం సహాయపడుతుంది వ్యాధి తగ్గుదల మీద ఆధారపడి మోతాదు తగ్గించవచ్చు (కొంతమంది అభ్యాసకులు QDS కు తగ్గించి మరింత మెరుగయ్యాక TDS మోతాదు ఇస్తారు). ఈ మోతాదులో రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత BD, తరువాత OD గా వ్యాధి పూర్తిగా తగ్గిపోయే వరకూ కొనసాగించడం మంచిది.
దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ముఖ్యంగా రోగ లక్షణాలు తీవ్రంగా లేనప్పుడు పుల్లౌట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు TDS గానే మోతాదు ప్రారంభించడం మంచిది. రోగ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఒకటి లేక రెండు రోజులపాటు నివారణ యొక్క శక్తి శరీరంలో త్వరగా చేరడానికి వీలుగా 6TD గా ఇస్తారు.
వ్యాధి లక్షణాలు కనిపించకుండా పోయినప్పుడు మోతాదును క్రమంగా తగ్గిస్తూ OW నిర్వహణ మోతాదుకు తీసుకు వస్తాము. వ్యాధి లక్షణాలు తిరిగి వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి నివారణను అకస్మాత్తుగా ఆపకూడదు.
________________________________________
ప్రశ్న 3. వైబ్రియానిక్స్ వైద్యముతో మెరుగైన స్థిరత్వాన్ని పొంది రోగి బీపీ లేదా థైరాయిడ్ వంటి వ్యాధుల కోసం జీవితాంతం TDS గా కొనసాగించాలను కుంటే అటువంటివారికి మోతాదును ఎలా తగ్గించాలి?
జవాబు: అటువంటి సందర్భాల్లో రోగికి రెమిడీని అలాగే కొనసాగించడం వల్ల కొన్నాళ్లకు అది స్పందించకపోవచ్చు అనే విషయం పైన అవగాహన కల్పించడం మంచిది. మానవ శరీరానికి తనకు తాను స్వస్థత కలిగించుకునే శక్తులు అపారంగా ఉన్నాయి. వైబ్రియానిక్స్ విధానం ఈ స్వస్థత కలిగించే శక్తులను ప్రభావితం చేసి వ్యాధి నివారణ ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు శరీరం తనంతట తానే రిపేర్ చేసుకోవడానికి వీలుగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒకసారి పునరుజ్జీవనం పొందిన తర్వాత కణాలు శరీరాన్ని దాని సహజ ఆరోగ్యమైన స్థితికి తీసుకురావడానికి తగిన అంతర్నిర్మిత మేధస్సును లేదా మేధాశక్తిని కలిగి ఉంటాయి. కనుక మోతాదును OW అనే నిర్వహణ స్థాయికి నెమ్మదిగా తీసుకు రావడం చాలా ముఖ్యం. ఆ తరువాత ఒకవేళ అల్లోపతి మందులు కూడా జీవితకాలం సూచించబడిన సందర్భాల్లో వైబ్రియానిక్స్ నివారణలు కూడా OW నిర్వహణ మోతాదులో జీవితకాలం అందింపపడాలి. బిపి, థైరాయిడ్ లేదా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా ఇది వర్తిస్తుంది. చిన్న వారిలోవారి యొక్క స్థాయిని బట్టి కొంత కాలం తర్వాత నివారణను ఆపవచ్చు.
________________________________________
ప్రశ్న 4. నేను నా పేషెంట్లకు 2-3 లీటర్ల నీరు తాగాలని సూచిస్తాను. అయితే డయాలసిస్ రోగులకు నీటితో సహా రోజుకు ఒకలీటరు కంటే ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకో కూడదనే నియమం ఉంటుంది కనుక వారి శరీరం నుండి టాక్సిన్స్ బయటకు ఎలా వస్తాయి.?
జవాబు: శరీరానికి సరిపడని విషపదార్థాలు శ్వాస, చెమటతో సహా అనేక రూపాలుగా బయటకు వెళ్లిపోతాయి. ఎక్కువగా నీరు తీసుకునే వ్యక్తికి మూత్రపిండాలద్వారా విష పదార్థాలు నీటి రూపంలో బయటకువెళ్ళిపోతాయి. డయాలసిస్లో ఉన్న రోగికి ఆ ప్రక్రియ ద్వారానే విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అటువంటి రోగులు జీర్ణ వ్యవస్థ ద్వారా విషపదార్థాలు బయటికి పోయే విధంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని వారికి సూచించాలి. వారు ఉప్పును అధికంగా తినకూడదు ఇది నీటిని నిలుపుదల అయ్యేలా చేసి దాహాన్ని ప్రేరేపిస్తుంది. రోజులో అనేకసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం ముఖ్యంగా ఉదయాన్నే ఈ విధంగా చేయడం కూడా శరీరంలో ఉన్న హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో తోడ్పడుతుంది. భోజనానికి ముందు లేదా వెనుక ఉదరంలో పదార్థాలు ఏమి లేక ఖాళీగా ఉన్నప్పుడు ముఖ్యంగా చెట్లు మొక్కలు వంటివి పుష్కలంగా ఉండి స్వచ్ఛమైన గాలిని అందించే ప్రదేశాల్లో కనీసం అరగంట దీర్ఘమైన శ్వాస తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది.
దివ్య వైద్యుని దివ్యవాణి
"అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల బకాయం వస్తుంది మరియు తత్ఫలితంగా, రక్తం పంప్ చేయడానికి గుండె ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంది. రక్తం ప్రతిరోజూ శరీరంలో 12,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. బకాయం పెరగడంతో, రక్త ప్రసరణ మరియు తత్ఫలితంగా, గుండె పనితీరు బలహీనపడుతుంది. అందువల్ల, ఒకరి ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉండాలి. "
...సత్య సాయిబాబా, దివ్యవాణి 10 సెప్టెంబర్ 2002
http://www.sssbpt.info/ssspeaks/volume35/sss35-16.pdf
"మీరు నిస్వార్థ సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల చేత సేవ చేయబడాలని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. ఈ వయస్సులో మీకు శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క బలం ఉంది, అందువల్ల మీరు ఇప్పుడే ఇతరులకు సేవ చేయాలి. మీరు వృద్ధాప్య సేవ చేయాలి , ఆకలితో మరియు బలహీనమైన ప్రజలు. అలాంటి సేవను మీరు దేవుని సేవగా పరిగణించాలి. మరోవైపు, ఎవరైనా మీకు సేవ చేస్తారని మీరు హించినట్లయితే, మీ జీవితం చీకటి మార్గంలో వెళుతుంది. "
... సత్యసాయి బాబా, “మానవ సేవయే మాధవ సేవ” వేసవి జల్లులు, బృందావనం,1973
http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf
ప్రకటనలు
రాబోయే వర్క్‌షాప్‌లు
❖ ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 17-22 జూలై 2019, వివరాలకి లలిత గారిని [email protected] ద్వారా లేదా 8500-676-092 కి ఫోను ద్వారా సంప్రదించవచ్చును.
❖ ఇండియా పుట్టపర్తి: SVP రెఫ్రెషర్ శిక్షణా శిబిరం 24-25 జూలై 2019, వివరాలకి హేమ్ గారిని [email protected]ద్వారా సంప్రదించవచ్చును.
❖ క్రొయేషియా జగ్రెబ్: AVP శిక్షణా శిబిరం 5-8 సెప్టెంబర్ 2019, వివరాలకి దున్జ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.
❖ ఇంగ్లండ్ లండన్ : జాతీయవార్షికరిఫ్రెషర్సెమినార్22 సెప్టెంబర్ 2019, వివరాలకి జెరమ్ గారిని [email protected] ద్వారా లేదా 020-8551 3979కి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చును.
❖ ఫ్రాన్సు అలేస్ - గార్డ్ : SVP శిక్షణా శిబిరం 20-24 అక్టోబర్ 2019, వివరాలకి డేనియల్ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.
❖ ఫ్రాన్సు అలేస్ - గార్డ్ : AVP శిక్షణా శిబిరం & రెఫ్రెషర్ సెమినార్ 26-28 అక్టోబర్ 2019, వివరాలకి డేనియల్ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.
❖ ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 17-22 నవంబర్ 2019, వివరాలకి లలిత గారిని [email protected] ద్వారా లేదా 8500-676-092 కి ఫోను ద్వారా సంప్రదించవచ్చును.
❖ ఇండియా పుట్టపర్తి: SVP శిక్షణా శిబిరం 24-28 నవంబర్ 2019, వివరాలకి హేమ్ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.
❖ ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 12-18 ఫిబ్రవరి 2020, వివరాలకి లలిత గారిని [email protected] ద్వారా లేదా 8500-676-092 కి ఫోను ద్వారా సంప్రదించవచ్చును.
అదనపు సమాచారం
1. ఆరోగ్యం పై ప్రత్యేక వ్యాసం
తలనొప్పి - దాని నివారణ & తీసుకోవలసిన జాగ్రతలు
ఈ రోజులలో మనిషికోరికలకు పరిమితిలేదనిపిస్తోంది. మానవులు జీవితమంతా ఈ కోరికల ముసుగులో గడుపుతున్నారు. ప్రతిక్షణం తృప్తిపరచలేని కోరికలతో నిండిఉంటోంది. మనిషి యొక్క బుర్ర ఈకోరికలతోనిండిఉంటుంది. కావున బుర్రను పవిత్రమైన ఆలోచనలతో నింపితే, అదిపవిత్రంగా మారుతుంది”
1. తలనొప్పిఅంటేఏమిటి?
తల లేదా మెడ ఎగువప్రాంతంలో నొప్పిగా అనిపిస్తుంది మరియు దీనినే అసలైన “మెడలో వచ్చే నొప్పి”అంటారు. ఇదివాస్కులర్, న్యూరోలాజికల్, ఎక్సెర్షనల్, మస్క్యులోస్కెలెటల్లేదాబ్రైణ్ డిజార్డర్(మెదడుకు సంబందించిన రోగం)కావచ్చు. ఇదిఒకరిజీవితం యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీసి బలహీన పరిచేదిగా ప్రభావితం చేయవచ్చు. ఇదిప్రపంచంలో మూడవ అత్యంత ప్రబలమైన అనారోగ్యంగా పరిగణించబడుతోంది, ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది.2,3,4,5
2. తలనొప్పియొక్కరకాలు, స్వభావంమరియుకారణాలు
నిజానికి తలనొప్పి అనేది దాని యొక్క మూలం లేదా వచ్చే కారణాల బట్టి ప్రాధమిక లేదా ద్వితీయ శ్రేణి తలనొప్పిగా నిర్ధారిస్తారు.
ఏ. ప్రాధమిక తలనొప్పి అనేది తల మరియు మెడ యొక్క సున్నితమైన రక్తనాళాలు, కండరాలు మరియు నరాలలో ఏమైనా సమస్య లేదా అధికశ్రమ కారణంగా నేరుగా సంభవించే అనారోగ్యం. ఇదికొన్నిపరిస్థితుల ప్రభావం వల్ల వస్తుంది కాని ఇది నిరపాయమైనది అలాగే ఇది ప్రత్యేకమైన సమస్యలను కానీ శారీరక మార్పులని కానీ తీసుకురాదు. వీటిలో మైగ్రేన్(పార్శ్వపుతలనొప్పి), క్లస్టర్ల తలనొప్పిక్లస్టర్తలనొప్పి, ఒత్తిడి వల్ల వచ్చే (టెన్షన్)తలనొప్పి వంటివి ఉన్నాయి.5,6,7
-
పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్) అనేది ఒక మోస్తరు నుండితీవ్రంగా పునరావృతమయ్యేతలనొప్పి, తలకి ఒకవైపుతరచుగా వచ్చే ఈ నొప్పి కొన్ని గంటల నుంచి 3 రోజులవరకు ఉంటుంది. దీనితో పాటు సాధారణంగావికారం, వాంతులు, చేతులు చల్లపడటం,వాసన, శబ్దంమరియుకాంతి పడకపోవడం లేదా మన చుట్టూ వుండే కాంతి వలయం(ఆరా)లో హెచ్చుతగ్గులు లేదా హార్మోన్స్ లో మార్పు వస్తున్నపుడు ఇదిప్రేరేపింప బడుతుంది. నాడీకణాలమధ్యసమాచార సంబంధాలకి లకి అవసరమైన సెరోటోనిన్ అనే రసాయనం రక్తనాళాలను సన్నగా చేయడం వల్ల కూడా మైగ్రేన్వస్తుంది. 8ఇది ఒత్తిడి, నిద్రలేకపోవడం, ఆకలి, అలసట, వాతావరణ మార్పులు మరియు ఋతుస్రావం వంటిజన్యుమరియు పర్యావరణ కారణాలకారకాల ఫపలితంగా వస్తుంది.
-
క్లస్టర్ల తలనొప్పి క్లస్టర్తలనొప్పి అనేది నరాల రుగ్మత కారణంగా వచ్చే చాలా బాధాకరమైన తలనొప్పి. ఇది తల యొక్క ఒకవైపు మరియుకళ్ళ చుట్టూ విపరీతమైన నొప్పిని ఇస్తుంది,దీనితో పాటు ముక్కు దిబ్బడ, కళ్ళనుంచి నీరు కారడం మరియు కళ్ళచుట్టూ వాపు కూడా వస్తాయి. నిద్రలోనొప్పిమొదలయ్యి కొన్ని గంటలు,రోజులురోజూలు, వారాలు లేదా నెలలు వుండి, తరువాత ఒక సంవత్సరం పాటు అదృశ్యమవుతుంది. ఇది 20-50 సంవత్సరాల మధ్య ముఖ్యంగా మగ వారికి వస్తుంది,దానిని పొరపాటున మైగ్రేన్లేదా ముక్కులో మంటగా భావిస్తారు. ఇది దేనివల్ల వస్తుందో ఖచ్చితంగాతెలియదు, కానీ హైపోథాలమస్ (భావోధ్రేకానికి సంబంధించిన మెదడు భాగం)మరియు ట్రిజెమినల్(త్రిధారానాడి)నరాల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నిసార్లుఇదిపొగాకుపొగ, మద్యంలేదాతీవ్రమైనవాసనల వల్ల కావచ్చు5,6,7
-
“ఒత్తిడి తలనొప్పి” అనేది తలయొక్కవెనుకబాగం,మెడ, కళ్ళు మరియు ఇతర కండరాలద్వారా మందకొడిగావచ్చే ఈ తలనొప్పి,సాధారణంగా తల యొక్క రెండువైపులా వుంటుంది. ఇది వచ్చిన వారికి తన తల చుట్టూ గట్టిగా పట్టి కట్టినట్లుగా అనిపిస్తుంది. ఇది అప్పుడప్పుడు లేదా తరచుగాలేదాదీర్ఘకాలికంగా వచ్చి దానితో పాటు కొంత వికారం గా కూడా వుండి, ఈ తలనొప్పి కొన్నినిమిషాలు నుంచి గంటలు, రోజులు, నెలలు లేదా సంవత్సరాలు కూడా ఉంటుంది. చాలా సార్లు వస్తున్నప్పటికి, ఈ తల నొప్పి పై తక్కువ పరిశోధనచేయబడినది. 9ఇది ఎక్కువగా ఒత్తిడి, పేలవమైన భంగిమలవల్ల, నిద్రలేమి, దాగి పెట్టుకున్న భావోద్రేకాలు, కండ్ల పై ఒత్తిడి మరియు కండరాల కణజాల సమస్యలు మొదలైన వాటి వల్ల సంభవిస్తుంది.5,6,7,9
B. ద్వితీయశ్రేణి తల నొప్పులు,ముక్కులో మంట (సైనసిటిస్), నరాల బలహీనత/రుగ్మత (వాస్కులర్డిజార్డర్), మెదడు లేదా తలకి గాయం, లేదా మెదడులో కణితి వంటి కారణాలు లేదా పరిస్థితులు ఉన్నప్పుడు తలయొక్క సున్నితమైన నరాలద్వారా నొప్పికల్గించడం వలన వస్తుంది. ఇంకొక మాటలోచెప్పాలంటే, ప్రాధమిక తలనొప్పికి భిన్నంగా ద్వితీయశ్రేణి తలనొప్పి అనేది తెలిసిన లేదా తెలియని వ్యాధి లేదా సమస్య యొక్క లక్షణం. 5,6,7,10
-
సైనస్ తలనొప్పిసైనస్తలనొప్పిముక్కు ప్రాంతంలో,ముఖ్యంగా ముక్కు, చెంప ఎముకలు మరియు నుదిటిభాగంలో నొప్పిని ఇస్తుంది, తరచుగా ముఖం వాచడం, చెవుల లోపల ఒత్తిడి మరియు జ్వరం వస్తుంది. ఇదిఎలెర్జీ లేదా అంటువ్యాది (ఇన్ఫెక్షన్) కారణంగా మంట మరియు ముక్కు దిబ్బడ వల్ల కావచ్చు. ఇది ముక్కు రంద్రాలని వేరు చేసే ఎముక సైనసిటిస్‌కు పోయే సైనస్నాళాలను అడ్డుకోవడం వల్ల కూడా కావచ్చు. ఇది తరచుగా ప్రాధమిక తల నొప్ప్పులలో ఒకటిగా పొరబడటం జరుగుతుంది. 5,6,7
-
మెదడు లోని కణితి వల్ల వచ్చే నెప్పి క్రమ క్రమంగా క్షీణిస్తూ దానితో పాటుగా త్రీవ్రమైన వాంతులు, ధృష్టి లోపం, మాట లేదా శారీరక మార్పులు, మానసిక సమతుల్యం కోల్పోవడం, సరిగ్గా నడవలేకపోవడం, లేదా సమన్వయ లోపం మరియు మూర్ఛలు వస్తాయి. ఇది చాలా అరుదైన పరిస్థితి. 5,6,7
-
పిడుగుపాటు (థండర్ క్లాక్లాప్)తలనొప్పి కూడా తీవ్రమైనది, దీనిని జీవితంలో వచ్చే అత్యంత చెత్త తలనొప్పిగా అభివర్ణింస్తారు, ఎందుకంటే ఇది అకస్మాత్తుగా ప్రారంభమై తీవ్ర స్థాయికి ఒక నిమిషం లోపు చేరి 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉంటుంది. ఇది మెదడులో రక్తస్రావం (సెరిబ్రల్హెమరేజ్)లేదా రక్తం గడ్డ కట్టడం (థ్రోంబోసిస్)లేదా మెనింజైటిస్ కాకారణంగా ప్రాణాంతకంమైనది అందువల్ల వెంటనే వైద్య సహాయం అవసరం
-
ఋతుస్రావ తలనొప్పి అనేది సాధారణంగా ఋతుస్రావం రావడానికి ముందు లేదా వచ్చిన సమయంలో లేదా అయిన తరువాత, లేదా ఋతుస్రావానికి రెండు వారాల ముందు హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది.
-
జీవనశైలి తలనొప్పి అనేది కఠినమైన డైటింగ్, భోజనం సరిగ్గా తినకపోవడం, అధిక ఆమ్ల ఉత్పత్తి చేసే ఆహారంతినడం, ఆలస్యంగా నిద్రపోవడం,మొబైల్స్ లేదా టీవీ చూడటం లేదా ఎక్కువ నిద్రపోవడం లాంటి వల్ల సంభవించవచ్చు. భోజన సమయానికి ముందు ఆకలివల్ల తలనొప్పిరావచ్చు (అది వెంటనే పోతుంది); మద్యం అతిగా త్రాగడం వల్ల హ్యాంగోవర్ తతలనొప్పిలనొప్పి; మరియు కెఫిన్మీద ఆధారపడటం వలన తలనొప్పి తిరిగి రావడం లేదా పోవడం5,6,7ఉదాహరణకు, కెఫిన్ ను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల మెదడులోని రక్తనాళాలను బిగపెడతాయి అందువల్ల శరీరందానిని మామూలుగా తీసుకురవానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ కెఫిన్ని సమయానికి తీసుకోకపోయినా లేదా అకస్మాత్తుగా ఆపివేసినా, రక్తనాళాలుఎక్కువగాపెద్దవి అవ్వడం వల్లతలనొప్పివస్తుంది. వాటిని యధాస్థితికి తేవడానికి శరీరానికి కొంతసమయంపడుతుంది; అప్పటివరకుకెఫిన్తీసుకోవడంద్వారా ఆ తలనొప్పినినయంచేయవచ్చు-నిజానికి ఒక అసాధారణ పరిస్థితి! 1
-
ఇతర రకాల తలనొప్పులు పుప్పొడి లాంటి వాటి వల్ల ఎలర్జీ తో పాటు ముక్కు దిబ్బడ,కళ్ళలో నీరు కారడం; అధిక బిపి వల్ల సాధారణమైన లేదా తల బిరుసు లాంటివి,నొప్పి ఉదయం చాలా తీవ్రంగాగామొదలయ్యి రోజుగడిచే కొద్దీ తగ్గడం (బిపికి తలనొప్పికి గల పరస్పర సంబంధం నిరూపించబడలేదు); మందుల అధికవినియోగం; అలసట,కండరాలబలహీనత కారణంగా కండ్లపై ఒత్తిడి లేదా దృష్టి లోపం; మరియు నిరాశ లాంటివిలాటి వల్ల వస్తాయి.
3. తలనొప్పికి చికిత్స!
తలనొప్పికి నివారణఉందా? ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలలో పరిశోధనలు జరుగుతున్నాయి, ముఖ్యంగా మైగ్రేన్ మీదకోసం. కానీ ఖచ్చితంగా దీనిని ఆపడానికి, అదుపులో పెట్టడానికి లేదా తగ్గించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు.
మందు లేకుండా మైగ్రేన్చికిత్స! మైగ్రేన్ పై జరిపిన ఒకపరిశోధనలో మెదడులోని నరాలు సంకోచించబడటం వల్ల రక్తం సరఫరా సరిగా లేక మెదడుకు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేక పోవడంవల్ల తలనొప్పి సంభవిస్తుందనివెల్లడించింది, 2016-17లో ఒక సంవత్సరం పాటు శరీర సహజ అణువులు, కార్బన్డయాక్సైడ్మరియు ఆక్సిజన్‌లను ఉపయోగించి తయారు చేసిన“ఇన్హేలర్”ను ఉపయోగించి మైగ్రేన్‌మిగ్రేన్ దాడుల నుంచి స్వీయ రక్షణ పై ఒక ప్రాధమిక అధ్యయనంచేశారు. ఇన్హేలర్రక్తనాళాలనుపెద్దవి చేయడం ద్వారా , ఇదిమెదడుకుతగినంతఆక్సిజన్‌నుసరఫరాచేసింది. ఇన్హేలర్వాడిన ప్రతి సారి నొప్పి నుంచి ఉపశమనం గణనీయంగా పెరిగిందని కనుగొనబడింది12
హైపోగ్లైకేమిక్ / కెటోజెనిక్డైట్: చాలా ఏళ్లగా మైగ్రేన్‌తో బాధపడుతున్న ఒక పరిశోధకుడు, రక్తంలో చక్కెరస్థాయిలను తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రోటీన్లగల భోజనంబోజనం (హైపోగ్లైకేమిక్డైట్) ముఖ్యంగా ఉదయాన్నే చాలా సార్లు తిన్నడం, మరియు సాధారణ పిండిపదార్థాలను తగ్గిచడం ద్వారా మైగ్రేన్‌ను పోగొట్టవచ్చని చెప్పారు.
ఒక అధ్యయనంలో 90% మంది రోగులలో,సమతుల్యమైన ప్రోటీన్, తక్కువ పిండి పదార్ధాలు(కార్బోహైడ్రేట్లు)మరియు అధిక కొవ్వు మరియు నూనెలతో కూడిన కెటోజెనిక్ ఆహారం (కొబ్బరినూనె నుండి ఉత్తమంగా పొందబడుతుంది) ద్వారా మైగ్రేన్ తతరచుగా రావడాన్ని తగ్గిస్తుందని కనుగొనబడింది.
చిరోప్రాక్టిక్థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ లావంటిప్రత్యామ్నాయ భౌతిక చికిత్సలు కూడా వాడుకలోఉన్నాయి. కొన్నిక్లినికల్ట్రయల్స్లో చిరోప్రాక్టిక్వెన్నెముకమానిప్యులేషన్ద్వారా మందులు మరియుశస్త్రచికిత్సలేకుండా వెన్నెముకను సరి చేసే ప్రక్రియలో తలనొప్పి కూడా గణనీయంగా తగ్గుతోందని తేలింది. చిరోప్రాక్టిక్థెరపీలో కీళ్ళు మరియు కండరాల సమస్యలను,నొప్పిని నేర్పుతో కూడిన పద్ధతులద్వారా చికిత్సచేస్తారు. అదే ఫిజియోథెరపీలో అయితే కదలికల పద్ధతులను ఉపయోగిస్తారు.16ఆక్యుప్రెషర్మరియుఆక్యుపంక్చర్వంటి ఇతర చికిత్సలు కూడామైగ్రేన్మరియు టెన్షన్ తలనొప్పి నుండి ఉపశమనం ఇవ్వడంలో బాగా పనిచేస్తున్నాయి
యోగాసనాలు, ప్రాణాయామాల ద్వారా మైగ్రేన్ మరియు తలనొప్పిని తగ్గించడంతో పాటు నయం చేస్తాయి.
వైబ్రియోనిక్స్:శ్రీసత్యసాయిబాబా ఆశీర్వదించిన సాయివైబ్రియోనిక్స్ మమందులు తీసుకోవడంద్వారా చాలామందిఉపశమనం మరియు నయమైనట్లు కనుగొన్నారు. CC11.3 తలనొప్పి, CC11.4 మైగ్రేన్లు, CC15.1 మెంటల్&ఎమోషనల్టానిక్, CC18.5 న్యూరల్జియా, CC20.5 వెన్నెముక లేదా 108CC బాక్స్నుండి తగినకాంబో; NM5 బ్రెయిన్TS, NM44 ట్రిజిమినల్న్యూరల్జియా, NM59 నొప్పి, NM85 తలనొప్పి- BP, SM6 ఒత్తిడి, SM39 టెన్షన్ లేదా 576 కార్డులనుండి తగిన కలయిక ద్వారాతలనొప్పిని నివారించవచ్చు మరియు రాకుండా ఎదుర్కోవచ్చు.
4. తలనొప్పి నిర్వహణ
ప్రతి ఒక్కరికి చికిత్స చేయించుకోగలిగే సౌకర్యం లేదా అవకాశం ఉండకపోవచ్చు, కానీ తలనొప్పి ప్రారంభమైన తర్వాత దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవచ్చో తెలుసుకోవాలి.
ఉపశమనంకోసంకొన్నిఇంటిచిట్కాలు:
- ఆపిల్పళ్ళరసం యొక్క వెనిగర్(యాపిల్ సైడర్వెనిగర్) మరియు నీటి మిశ్రమాన్నిసమాన పరిమాణంలో మరిగించి తర్వాత ఆవిరిని పీల్చుకోండి
- పుధినా (పిప్పరమింట్), లావెండర్, థైమ్,రోజ్ మేరీరోజ్మేరీ, తులసి, లేదా పొడి చేసిన లవంగాలు వంటి ముఖ్యమైన సహజ నూనెల వాసనచూడండి లేదా పీల్చుకోండి; వేయించిన సొంపు లేదా నల్లజీలకర్రను మృదువైన గుడ్డలో కట్టివాసన చూడండి. 15,21,22
- నుదుటి పై దాల్చినచెక్క లేదా అల్లంపేస్ట్ రాసికాసేపు ఉంచి విశ్రాంతి తీసుకోండి
- కొద్దిగా ఉప్పు చల్లిన ఆపిల్ ముక్కతిని, ఆపై కొంచెం వెచ్చని నీరుత్రాగాలి; ఇది సైనస్ తలనొప్పినుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది
- అల్లంరసాన్ని నిమ్మకాయతో కలిపి కొంచెం వెచ్చ చేసి త్రాగండి; తలనొప్పి మందుల తయారీలో ఉపయోగించే ఫీవర్‌ఫ్యూ మరియు బటర్‌బర్ వంటి ఒత్తిడి తగ్గించే మూలికల సారం తీసుకోండి; మైగ్రేన్ తగ్గడానికి సహాయపడటంలో అవి బాగా పని చేస్తున్నాయని ఒక అధ్యయనంలో తెలిసింది.
- నుదిటిపై ఒక చల్లని ప్యాక్ పెట్టుపేతుకోడంద్వారా కండరాల నొప్పులు మరియు మంటను తగ్గించుకోవచ్చు; మెడ వెనుక భాగంలోవేడిప్యాక్లేదా వేడినీళ్ళ తో స్నానం కూడా సహాయ పడతాయి; సుతి మెతనైన మసాజ్ ద్వారా కూడా తగ్గుతుంది.
- తగిన దిండుతో విశ్రాంతి తీసుకోండి లేదా నిద్రించండి.
స్వీయపర్యవేక్షణ: మీ ఆహారం మరియు జీవన విధానం కొరకు డైరీని పెట్టుకోండి; తలనొప్పిని ఏది ప్రేరేపిస్తోంది, ఎప్పుడు ప్రారంభమయి నొప్పి పెరుగుతోంది,ఎంతసేపు వుంటుంది మరియు ఎలాతగ్గింది అనేవి జాగ్రతగా పరిశీలించి రాయండి.తలనొప్పి మొదలవ్వుతున్న సూచన తెలుసుకోవడం ఉత్తమం, మీకు ఇది అనుభవంతో తెలుస్తుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉన్నపుడు,దానిని తట్టుకోవడం కోసం నొప్పి తగ్గించే మందులు వాడవచ్చు; తలనొప్పి మొదలై, ముఖ్యంగా అది మైగ్రేన్ అయితేదానిని తగ్గించడానికి ఇది సహాయపడకపోవచ్చు
5.తలనొప్పి నివారణ
తలనొప్పిని నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో మనం చూపే విచక్షణ బట్టి వుంటుంది
- తృణధాన్యాలు, పప్పులు (వేరుశెనగ, జీడి పప్పు వగైరా), తాజా పండ్లు,తాజా కూరగాయలు, తగినంత నీరుతీసుకోవడం, వ్యాయామం, ప్రతి రోజు సూర్యోదయం వేళ స్వచ్ఛమైన గాలిలోనడవడం, నిశ్శబ్దంగా కూర్చోవడం, సమయానికి నిద్రపోవడం, కానీ అతిగా నిద్రపోకుండా వుండటం వంటి జీవనశైలిని అలవరచుకోవాలి. ప్రశాంతమైన మనసు మరియు చురుకుగా వుండటం ద్వారా ఒకవ్యక్తిలో తలనొప్పిని వారించుకోవచ్చు
- ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను క్రమబద్దీకరించడం (4 సెకన్లపాటు గుండె నిండా గాలి పీల్చుకోని, 4 సెకన్లపాటు పూర్తిగా గాలిని వదలండి. ఇలా ఒక నిమిషం పాటు కొనసాగించండి) .14
- సరైన గాలి వెలుతురు లేని చోట ఎక్కువసేపు పనిచేస్తుంటే, మధ్య మధ్యలో కొంత విరామం తీసుకోని చిన్న చిన్న వ్యాయామం, కొద్దిగా నడవడం లాంటివి చేస్తుండాలి
- తలనొప్పులను కలిగించే వాటికి దూరంగా వుండాలి. ఎవరైనా తలనొప్పి బారిన పడుతుంటే, అతను కాఫీ, టీ, కోలా, చాక్లెట్, లేదా నాన బెట్టిన గింజలు వంటి పానీయాలను వాడకుండా ఉండాలి. “కెఫిన్ని తరిమికొట్టండి”అనే ఉత్తమ నియమాన్ని పాటించండి .11
- వెన్నెముక నిటారుగా ఉండునట్లుగా సరైన భంగిమను అలవరచుకోవాలి; ప్రశాంతంగా ఉండటం చాలాముఖ్యం. సరిపడని భంగిమవల్ల తలనొప్పితో పాటుమెడనొప్పికి దారితీస్తుంది. యోగవిజ్ఞానంప్రకారం, నిటారుగా ఉన్న భంగిమ ద్వారా ప్రాణ శక్తి వెన్నెముక గుండా సులువుగా ప్రవహిస్తుంది మరియు లోపల సమతుల్యతను పాటిస్తుంది. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు, ముఖ్యంగా కండరాలు మరియు ఎముకలు సరిగ్గా ఉంటాయి మరియు బలహీనపడవు.
సూచనలు మరియు లింకులు:
- Sathya Sai Speaks on Head and Heart, vol 25,1992, chapter 9: http://www.sssbpt.info/ssspeaks/volume25/sss25-09.pdf
- What is headache: https://migraineresearchfoundation.org/about-migraine/migraine-facts/
- https://www.ninds.nih.gov/Disorders/All-Disorders/Migraine-Information-Page
- https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5587613/
- Types of headache: https://hmccentre.com/5-common-types-of-headaches-types-causes-diagnosis-treatment/
- https://www.medicalnewstoday.com/articles/73936.php
- https://headaches.org/resources/the-complete-headache-chart/
- https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/headache/how-a-migraine-happens
- Tension headache, least studied:https://www.migrainerelief.com/migraine/conditions/tension-headaches/
- Secondary headache is a symptom: https://www.mayoclinic.org/symptoms/headache/basics/causes/sym-20050800
- Avoid caffeine: https://www.livescience.com/35949-caffeine-causes-cures-headaches.html
- Migraine can be treated without medicine: https://www.sciencedaily.com/releases/2018/10/181004110050.htm
- Diet to eliminate migraine: http://www.consciouslifestylemag.com/migraine-diet-foods-to-prevent-headaches/
- Eliminate migraine: https://www.migrainekey.com/blog/8-ways-to-eliminate-migraines-forever/
- Chiropractic spinal care: https://draxe.com/natural-headache-remedies-relief/
- Chiropractor/physiotherapist: https://waldegraveclinic.co.uk/should-you-see-a-chiropractor-or-physiotherapist/
- Alternative therapy acupuncture:https://www.ncbi.nlm.nih.gov/pubmed/1253662
- Acupressure therapy: https://www.ncbi.nlm.nih.gov/pubmed/20128040
- Yoga for headache: https://www.artofliving.org/in-en/yoga/health-and-wellness/yoga-for-migraine
- Yoga & Pranayama for cure: https://www.youtube.com/watch?v=9xL-15RsQxo; https://www.youtube.com/watchv=I6HDvqjOkPw; https://www.youtube.com/watch?v=yJcX0hLcwoQ
- Home Remedies: https://food.ndtv.com/health/10-natural-home-remedies-for-headaches-that-actually-work-1215616
- https://www.medindia.net/homeremedies/headache.asp
- https://www.spine-health.com/blog/tips-relieve-headache-with-neck-pain
- Erect spine important: https://isha.sadhguru.org/in/en/wisdom/article/the-importance-of-a-good-posture
2. రిఫ్రెషర్ సెమినార్, పూణే, మహారాష్ట్ర, ఇండియా, 15 జూన్ 2019
ఆడపిల్లల పాఠశాల హాస్టల్‌లో 16 మంది ప్రాక్టిశ్నర్స్ ఎంతో ఉత్సాహంతో కలిసి సీనియర్ వైబ్రియోనిక్స్ టీచర్10375 చే నిర్వహించిన చాలా ఇంటరాక్టివ్ రిఫ్రెషర్‌లో పాల్గొన్నారు, వీరు వైబ్రియోనిక్స్ అంశంపై లోతుగా పరిశోధించడానికి మరియు వారిఅనుభవాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు వారిని ప్రేరేపించారు.
చర్చ యొక్క ప్రధాన అంశాలు: తీవ్రమైన మరియు దీర్ఘకాలిక కేసులను సరిగ్గా ఎలా గుర్తించడం, సరి అయిన కాంబోలను ఇవ్వడం, ఎప్పుడు కాంబోనుమార్చాలి, మోతాదును తగిన సమయంలో ఏలా తగ్గించాలి తగిచాలి, రోగి రికార్డులను పూర్తి వివరాలతో ఉంచడం, రోగులకు ప్రేమతో సలహాఇవ్వడం మరియు ప్రక్షాళనను ప్రారంభించడం - రోగులకు మరియు వారి కుటుంబాలకు రోగనిరోధకశక్తి పెంచడం. ఆ సమావేశంలో పాల్గొనేవారుఈ సమావేశం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారని తెలియచేసారు. వైబ్రియోనిక్స్ సేసేవవాను తమజీవితలక్ష్యంగా చేసుకోవడం మరియు వైబ్రియోనిక్స్నుముందుకు తీసుకెళ్లడంలో ఎక్కువ బాధ్యత తీసుకోవటానికి వారుతమ నిబద్ధతను పునరుద్ఘాటించారు
యూకే లో స్థానిక సమావేశాలు
1. వెస్ట్ లండన్ 6 ఏప్రిల్ 2019
సీనియర్ప్ రప్రాాక్టీషనర్02799ఇంట్లో 13 మంది ప్రాక్టిశ్నర్స్ హాజరై అత్యంత పరస్పర అవగాహన సమావేశం జరిగింది. ఆమె అంతకు ముందు చర్చించిన పైన్ కాంబో, అడ్రినల్పనిచేయకపోవడం, డైట్ మరియు క్యాన్సర్, డయాబెటిస్మరియు హృదయ సంబంధవ్యాధులకు సంబందించిన జీవన విధానం మరియు నోసోడ్లవాడకం గురించిన విషయాలని తిరిగి ఒకసారి మననం చేశారు. తన అనుభవాలను మరియు విజయవంతమైన కేసులను పంచుకునేటప్పుడు, తన రోగులలో చాలామంది నివారణలు ఎలాతీసుకున్నారో మరియు సలహా ఇచ్చినట్లుగా ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలాఅనుసరించారో ఆమె చెప్పింది. ఎందుకంటే, ఆమె సూచనలను పాటిస్తేనే వారికి చికిత్సచేస్తామని ఆమెప్రారంభంలోనే తనరోగులకు చెబుతారు
పాల్గొనేవారు వారి విజయవంతమైన మరియు కష్టమైన కేసులను పంచుకున్నారు, మరియు CC1.2 ప్లాంట్ టానిక్ + CC17.2 ప్రక్షాళన + CC21.7 ఫంగస్ స్ప్రేగా రూపాంతరం చెందిన తోటలుగా ఉపయోగించబడుతుంది మరియు మురికి వైపు అల్లేవేలను మరియు షెడ్లలోని అచ్చును క్లియర్ చేస్తుంది. జుట్టు సమస్యలకు “హెయిర్ నోసోడ్స్” మరియు బోలు ఎముకల వ్యాధికి “శక్తివంతమైన అలెండ్రోనిక్ యాసిడ్” యొక్క సమర్థతపై పరిశోధన చేయడానికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఒక అభ్యాసకుడు అనేక సందర్భాల్లో పంచుకున్నాడు, అక్కడ అతను అద్భుతమైన ఫలితాలతో రోగులకు నివారణలను ప్రసారం చేశాడు.
2. మిడ్లాండ్స్ 27 ఏప్రిల్ 2019
లీసెస్టర్‌లో సీనియర్ప్ప్రారాక్టీషనర్02802నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు కొత్త ప్రాక్టిశ్నర్ల ల తో సహా 8 మంది పాల్గొన్నారు, కొత్తవారు వారి యొక్క దరఖాస్తు ప్రక్రియ, కరస్పాండెన్స్ కోర్సు, పుట్టపర్తిలో వారం రోజుల ప్రాక్టికల్ వర్క్‌షాప్,తరువాత మార్గదర్శకత్వం (మెంటరింగ్)గురించి తమ అనుభవాలన్ని పంచుకున్నారు. ఆ సమావేశంలో వారి సందేహాలు తొలగించుకుని, కొన్ని కేసులగురించి చర్చించుకున్నారు. కొంతమంది ప్రాక్టీషనర్స్ప్రాక్టిశ్నర్స్ వేసవి సెలవలలో జీర్ణసంబంధిత రోగాలు మరియు అధిక వేడి వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి మరియు శీతాకాలంలో జలుబు, గొంతునొప్పి మరియు ఫ్లూవంటి వాటి కోసంముందేగానే తయారుచేసి పెట్టుకున్న కాంబోలనువిజయవంతంగాఉపయోగించిన విషయాలని పంచుకున్నారు, దానిని అందరు మెచ్చుకున్నారు. సమావేశం ముగించే ముందు, వచ్చిన వారుఅంధరు స్థానికదేవాలయాలుమరియుసమాజకేంద్రాలనుసంప్రదించడంద్వారాఆయాప్రాంతాలలోవైబ్రియోనిక్స్పై అవగాహనకార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
3. ఈస్ట్ లండన్ 5 మే 2019
UK కోఆర్డినేటర్02822నివాసంలో జరిగిన సమావేశంలో ఏడుగురు ప్రాక్టిశ్నర్స్ (స్కైప్‌లో 3 గురితోసహా) సంభాషించారు. కొత్త ప్రాక్టిశ్నర్స్ కాంకాంబోల గురించి బాగా తెలుసుకొని ఉండాలనికోరారు, తద్వారా వారు శిబిరాలలో పాల్గొన్న సమయంలో త్వరగా మందులను తయారు చేయగలరు. వారికి కావలసిన సామాగ్రిని పొందడం, క్రమం తప్పకుండా కాంబోబాటిళ్లను తయారు చేసుకోవడం, కాంబో బాక్సుల నుండి ఆల్కహాల్ ఆవిరైపోవడాని తగ్గించడం వంటి కొన్ని ఆచరణాత్మక సమస్యలకి పరిష్కారం చెప్పారు. కేసుల గురించి మాట్లాడుకున్నపుడు శరీరంపై భాగంలో వాడే బాహ్య మందులలో నీరు/విభూతిని మాధ్యమంగా వాడటం గురించి మరియు స్వచ్ఛమైన నీటితో తయారుచేసిన కంటిచుక్కలను ఉపయోగించడం గురించి చర్చించబడ్డాయి. కొత్తరోగులనుఎలాపొందాలి, IASVP యొక్కలోగోతోకాంటాక్ట్ వివరాలతో తయారుచేసిన విజిటింగ్ కార్డ్ ద్వారా వారి స్నేహితులు మరియు రోగులకు ఇవ్వడం మరియు వైబ్రియోనిక్స్ గురించి అవగాహనను ఎలావ్యాప్తి చేయాలి అనేదాని పై సమన్వయకర్త చిట్కాలు ఇచ్చారు
ఓంశ్రీసాయిరామ్!