ప్రశ్నలు జవాబులు
Vol 10 సంచిక 4
July August 2019
ప్రశ్న 1. వైబ్రియానిక్స్ విధానము అలోపతి మందులతో అనుకూలంగా ఉంటుందని హోమియోపతి లేదా ఆయుర్వేదం తో అనుకూలంగా ఉండదని ఎందుకు చెప్పబడింది? చికిత్సా నిపుణుని వద్దకు వచ్చే నాటికి ఈ వైద్య విధానాల్లో ఏదో ఒకదాని పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగితో మనం ఎలా వ్యవహరించాలి?
జవాబు: వైబ్రియానిక్స్ చికిత్సా విధానం మొదట వ్యాధి ప్రారంభమయ్యే సూక్ష్మ రంగాలలో శక్తులను సమతుల్యం చేయడం ద్వారా పనిచేస్తుంది. ఈ విధానం సూక్ష్మస్థాయిలో వ్యాధికి గురైన అవయవాన్ని పునరుత్పత్తి చేస్తుంది. దీని ప్రభావం భౌతిక స్థాయిలో కనిపించి శారీరక అంగము యొక్క ఆరోగ్యం పునరుద్ధరింప బడుతుంది.
అల్లోపతి విధానము భౌతిక స్థాయిలో పని చేస్తుంది. అయితే ఈ విధానం కొన్నిసార్లు శరీరంలోని ఇతర భాగాలపై ప్రతికూలంగా పనిచేసి తలనొప్పి, దద్దుర్లు, మగత మొదలైన లక్షణాలకు కారణం అవుతుంది( వీనిని దుష్ప్రభావాలు అంటారు).వైబ్రియానిక్స్ విధానం వైబ్రేషన్ లేదా సూక్ష్మ స్థాయిలో పని చేస్తుంది కనుక అల్లోపతి మందులతోపాటు ఇచ్చినప్పుడు భౌతిక స్థాయిలో అల్లోపతి మందుల పనిలో ఇది జోక్యం చేసుకోదు. అదనంగా ఇది అల్లోపతి మందుల దుష్ప్రభావాలు నివారిస్తుంది లేదా ఆ దుష్ప్రభావాలను పోగొడుతుంది. అంతర్గత సూక్ష్మ శక్తులను సమతుల్యం చేయడం తద్వారా వేగంగా మరియు మరింత స్థిరమైన వైద్యం రోగికి అందించబడుతుంది.
హోమియోపతి విధానం కూడా వైబ్రేషన్ స్థాయిలో పని చేస్తుంది. కొన్ని హోమియోపతి నివారణలు మరికొన్ని ఇతరహోమియోపతి నివారణలకు విరోధిగా లేదా విరుగుడుగా పనిచేస్తాయని విస్తృతంగా నమ్ముతారు కాబట్టి హోమియోపతి చికిత్సా నిపుణులు దీనిని దృష్టిలో ఉంచుకొని రోగులకు చికిత్స సూచిస్తారు. కనుక హోమియోపతి చికిత్స పొందుతున్న రోగి మనల్ని సందర్శిస్తే అతనికి చికిత్స చేయడానికి నిరాకరిస్తాము. ఎందుకంటే రోగి ఏ హోమియో పతి నివారణ తీసుకుంటున్నాడో మనకు తెలియదు కనుక మనం ఇచ్చే రెమిడీ వారు తీసుకుని నివారణకు విరుగుడు లేదా విరుద్ధమైన విధంగా పని చేయవచ్చు. కనుక రోగికి హోమియోపతి చికిత్స బాగా పని చేస్తూ కూడా వైబ్రియో వైద్య చికిత్స కోసం మన వద్దకు వస్తే రోగి హోమియోపతి మాత్రమే కొనసాగించడం ఉత్తమం అని సలహా ఇస్తాము. రోగి తనకు హోమియోపతి చికిత్స బాగా పనిచేయడం లేదని హోమియోపతి నివారణతో పాటు వైబ్రియానిక్స్ చికిత్స కూడా తీసుకోవాలి అని మన వద్దకు వస్తే తన స్వయం నిర్ణయం మేరకు మొదట హోమియోపతిని ఆపమని చెప్పి అలా చేసిన మూడు రోజుల తర్వాత వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించాలి.
ఆయుర్వేదం భారతీయ ప్రాచీన సాంప్రదాయ ఔషధ శాస్త్రం. ప్రకృతి నియమాలకు అనుగుణంగా వ్యాయామం, ధ్యానం, శ్వాసక్రియ నియంత్రణతో పాటు ప్రతీ వ్యాధికి ఆహారమునకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మూలికల వంటి సహజ పదార్థాల ఆధారంగా అందించే చికిత్సా విధానం. అందువలన ఇది ఒక సంపూర్ణ చికిత్సా విధానం కనుక ఆయుర్వేదంతో పాటు ఇతర విధానాల నివారణలు ఇవ్వక పోవడమే మంచిది. అయితే ఆయుర్వేద టానిక్ లు ఆహార పదార్థాల వంటివి కనుక వైబ్రోనివారణలకు అంతరాయం కలిగించవు కనుక వీటిని తీసుకోవచ్చు.
________________________________________
ప్రశ్న 2. ప్రామాణిక TDS మోతాదు బదులుగా వేగంగా నయం చేయడానికి 6TD మోతాదుతో చికిత్స ప్రారంభించవచ్చా?
జవాబు: వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణ ప్రతిస్పందన లభించడానికి 6TD వద్ద చికిత్స ను ప్రారంభించడం సహాయపడుతుంది వ్యాధి తగ్గుదల మీద ఆధారపడి మోతాదు తగ్గించవచ్చు (కొంతమంది అభ్యాసకులు QDS కు తగ్గించి మరింత మెరుగయ్యాక TDS మోతాదు ఇస్తారు). ఈ మోతాదులో రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత BD, తరువాత OD గా వ్యాధి పూర్తిగా తగ్గిపోయే వరకూ కొనసాగించడం మంచిది.
దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ముఖ్యంగా రోగ లక్షణాలు తీవ్రంగా లేనప్పుడు పుల్లౌట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు TDS గానే మోతాదు ప్రారంభించడం మంచిది. రోగ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఒకటి లేక రెండు రోజులపాటు నివారణ యొక్క శక్తి శరీరంలో త్వరగా చేరడానికి వీలుగా 6TD గా ఇస్తారు.
వ్యాధి లక్షణాలు కనిపించకుండా పోయినప్పుడు మోతాదును క్రమంగా తగ్గిస్తూ OW నిర్వహణ మోతాదుకు తీసుకు వస్తాము. వ్యాధి లక్షణాలు తిరిగి వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి నివారణను అకస్మాత్తుగా ఆపకూడదు.
________________________________________
ప్రశ్న 3. వైబ్రియానిక్స్ వైద్యముతో మెరుగైన స్థిరత్వాన్ని పొంది రోగి బీపీ లేదా థైరాయిడ్ వంటి వ్యాధుల కోసం జీవితాంతం TDS గా కొనసాగించాలను కుంటే అటువంటివారికి మోతాదును ఎలా తగ్గించాలి?
జవాబు: అటువంటి సందర్భాల్లో రోగికి రెమిడీని అలాగే కొనసాగించడం వల్ల కొన్నాళ్లకు అది స్పందించకపోవచ్చు అనే విషయం పైన అవగాహన కల్పించడం మంచిది. మానవ శరీరానికి తనకు తాను స్వస్థత కలిగించుకునే శక్తులు అపారంగా ఉన్నాయి. వైబ్రియానిక్స్ విధానం ఈ స్వస్థత కలిగించే శక్తులను ప్రభావితం చేసి వ్యాధి నివారణ ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు శరీరం తనంతట తానే రిపేర్ చేసుకోవడానికి వీలుగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒకసారి పునరుజ్జీవనం పొందిన తర్వాత కణాలు శరీరాన్ని దాని సహజ ఆరోగ్యమైన స్థితికి తీసుకురావడానికి తగిన అంతర్నిర్మిత మేధస్సును లేదా మేధాశక్తిని కలిగి ఉంటాయి. కనుక మోతాదును OW అనే నిర్వహణ స్థాయికి నెమ్మదిగా తీసుకు రావడం చాలా ముఖ్యం. ఆ తరువాత ఒకవేళ అల్లోపతి మందులు కూడా జీవితకాలం సూచించబడిన సందర్భాల్లో వైబ్రియానిక్స్ నివారణలు కూడా OW నిర్వహణ మోతాదులో జీవితకాలం అందింపపడాలి. బిపి, థైరాయిడ్ లేదా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా ఇది వర్తిస్తుంది. చిన్న వారిలోవారి యొక్క స్థాయిని బట్టి కొంత కాలం తర్వాత నివారణను ఆపవచ్చు.
________________________________________
ప్రశ్న 4. నేను నా పేషెంట్లకు 2-3 లీటర్ల నీరు తాగాలని సూచిస్తాను. అయితే డయాలసిస్ రోగులకు నీటితో సహా రోజుకు ఒకలీటరు కంటే ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకో కూడదనే నియమం ఉంటుంది కనుక వారి శరీరం నుండి టాక్సిన్స్ బయటకు ఎలా వస్తాయి.?
జవాబు: శరీరానికి సరిపడని విషపదార్థాలు శ్వాస, చెమటతో సహా అనేక రూపాలుగా బయటకు వెళ్లిపోతాయి. ఎక్కువగా నీరు తీసుకునే వ్యక్తికి మూత్రపిండాలద్వారా విష పదార్థాలు నీటి రూపంలో బయటకువెళ్ళిపోతాయి. డయాలసిస్లో ఉన్న రోగికి ఆ ప్రక్రియ ద్వారానే విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అటువంటి రోగులు జీర్ణ వ్యవస్థ ద్వారా విషపదార్థాలు బయటికి పోయే విధంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని వారికి సూచించాలి. వారు ఉప్పును అధికంగా తినకూడదు ఇది నీటిని నిలుపుదల అయ్యేలా చేసి దాహాన్ని ప్రేరేపిస్తుంది. రోజులో అనేకసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం ముఖ్యంగా ఉదయాన్నే ఈ విధంగా చేయడం కూడా శరీరంలో ఉన్న హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో తోడ్పడుతుంది. భోజనానికి ముందు లేదా వెనుక ఉదరంలో పదార్థాలు ఏమి లేక ఖాళీగా ఉన్నప్పుడు ముఖ్యంగా చెట్లు మొక్కలు వంటివి పుష్కలంగా ఉండి స్వచ్ఛమైన గాలిని అందించే ప్రదేశాల్లో కనీసం అరగంట దీర్ఘమైన శ్వాస తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది.