Vol 10 సంచిక 2
March/April 2019
అవలోకనం
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
“ప్రయత్నం” యొక్క ప్రాముఖ్యతపై స్వామి సందేశాన్ని ఉటంకిస్తూ, డాక్టర్ అగర్వాల్ దీనిని ప్రాక్టీషనర్లు ఆచరణలో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ప్రాక్టీషనర్ల నాణ్యతను మరియు మా సంస్థాగత సామర్థ్యాలను పెంచే దిశగా ఆయన సాధించిన ప్రగతిని ఆయన ఎత్తిచూపారు. స్థానిక వైబ్రియోనిక్స్ సమావేశాల యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన అతను, వాటిని సులభతరం చేయడానికి అన్ని విధాలా సహాయం మరియు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రాక్టీషనర్లు వెబ్‌సైట్‌ను పరిశీలించి, జిడిపిఆర్‌పై క్లిక్ చేసి, వ్యక్తిగత డేటా రక్షణ కోసం అక్కడ సూచించిన వాటిని చేయమని ఆయన ప్రాక్టీషనర్లందరిని కోరుతున్నారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
ఈ సంచికలో 12 కేసులు పంచుకోబడ్డాయి: క్యాన్సర్, గర్భాశయంలోని పాలిప్స్, మెడపై కణితి, చర్మ అలెర్జీలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం మరియు వెన్నునొప్పి, అండాశయ తిత్తులు, రైనిటిస్, మైగ్రేన్ మరియు అధిక ర రుతుస్రావం , అరికాలి ఫాసైటిస్, మోకాలి నొప్పి మరియు ఫ్లోరైడ్ విషపూరితం మరియు నిద్రలొ పక్క తడపడం/ఎన్యూరెసిస్.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
మేము ఇద్దరు ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. మొదటి వ్యక్తి వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయుడు. 1990 నుండి సాయి సేవలో చాలా చురుకుగా ఉంటున్న అతను జిల్లా సమన్వయకర్త మరియు సాయి సాహిత్యం యొక్క అనువాదకుడు. కలలో స్వామి ఆశీర్వదించిన ఒక సీనియర్ ప్రాక్టీషనర్గా, అతను వైబ్రియోనిక్స్ గురించి అవగాహన పెంచుకున్నారు మరియు వైబ్రియోనిక్స్ పుస్తకాలు మరియు వార్తాలేఖలను ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువదించారు. రెండవ వ్యక్తి హెచ్‌ఆర్ ప్రొఫెషనల్ మరియు జ్యోతిష్కుడు. స్వామి దర్శనాలతో మైమరచిపోయిన అతను 1979 నుండి సాయి సేవలో ఉన్నాడు. అతను జూలై 2017 నుండి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్గా ప్రేమ మరియు కరుణతో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
ఈ సంచికలో మనం “8” ఆకారంలో 9 సార్లు రెమెడీ బాటిల్‌ను ఎందుకు కదిలించాలొ, ప్రాక్టీషనర్ రోగి యొక్క నోటిలో మొదటి మాత్రను ఎందుకు ఉంచాలొ, రోగికి తన మనస్సులో భయాందోళనలు లెకుండా రెమెడీలను రెడియెషన్ మూలాల నుండి దూరంగా ఉంచమని ఎలా సలహా ఇవ్వాలొ? రెమెడీలు తడిసిపొకుండా ఎలా నిరోధించాలొ తెలుసుకుంటాము. అంతెకాకుండా, 20 మి.లీ బాటిల్ లొని పిల్ల్స్ కు ఒక చుక్క కాంబో సరిపోతుందా మరియు SRHVP ద్వారా ప్రసారం చేయడానికి ముందు రోగి అనుమతి తీసుకోవడం తప్పనిసరా మొదలైన విషయాలు తెలుసుకుంటాము.
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
శారీరక మరియు మానసిక రుగ్మతలను నయం చేయడానికి ధర్మాన్ని ఎలా ఆచరించాలో మరియు అతను అందరిలొ ఉన్న దేవునికి సేవ చేస్తున్నాననే నమ్మకంతో సేవలను ఎలా చేయాలో స్వామి మనకు ప్రేమతో బోధించారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
ఫ్రాన్స్ మరియు యుఎస్ఎలో మరియు పుట్టపర్తి, డీల్లీ - ఎన్సిఆర్ మరియు భారతదేశంలోని భిల్వారా రాజస్థాన్లలో జరగబొవు వర్క్ షాపులు వివరించబడ్డాయి.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
మా ఆరోగ్య వ్యాసంలో “దగ్గును ఎలా నివారించాలో మరియు ఎదుర్కోవాలో” మనం తెలుసుకుంటాము. UK లోని వెస్ట్ లండన్‌లో జరిగిన రిఫ్రెషర్ సెమినార్ మరియు భారతదేశంలోని ముంబైలోని ధర్మక్షేత్రంలో నిర్వహించిన వర్క్‌షాప్ గురించి కూడా మనం తెలుసుకుంటాము.
పూర్తి వ్యాసం చదవండి