దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 10 సంచిక 2
March/April 2019
“మానవుడు శారీరకము మరియు మానసికము అనే రెండు రకాల అనారోగ్యాల తో బాధపడుతూ ఉంటాడు . ఒకటి శరీరంలోని వాత, పిత్త, కఫములు మూడింటి యొక్క సమత్వము లేకపోవడం వలన, మరొకటి సత్వ , రజో, తమో గుణాల అసమతుల్యం వలన అస్వస్థత కలుగుతుంది. ఈ రెండు రకాల అనారోగ్యాల కు సంబంధించిన ఒక చిత్రమైన వాస్తవం ఏమిటంటే మంచి గుణాలు అలవరచుకోవడం ద్వారా ఈ రెండు వ్యాధులను నయం చేసుకోవచ్చు. శారీరక ఆరోగ్యం , మానసిక ఆరోగ్యానికి ఒక అవసరం కాగా మానసిక ఆరోగ్యం , శారీరక ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది ! దుఃఖము మరియు నష్టము స్థానంలో ఔదార్యము, కృతజ్ఞత, ధైర్యము మరియు మంచి చేయాలని ఉత్సాహం ప్రదర్శించడం, ఉత్తమ సామర్థ్యంతో సేవచేయడం ఇవి మనసుతో పాటు శరీరానికి కూడా ఆరోగ్యాన్నిస్తాయి. సేవ నుండి పొందిన ఆనందం శరీరంపై ప్రేరణ చూపి వ్యాధి నుండి విముక్తి చేస్తుంది. "
...సత్యసాయిబాబా , “ఆలయం » దివ్యవాణి 9 సెప్టెంబర్ 1959
http://www.sssbpt.info/ssspeaks/volume01/sss01-23.pdf
"ఎక్కడ సేవ చేసినా ఎవరికి సేవ చేసినా అది భగవంతునికే చెందుతుంది. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి అనే నమ్మకం పెంచు కోవాలి అటువంటి సేవ మాత్రమే నిజమైన సాధన".
... సత్యసాయిబాబా, “ది యోగా ఆఫ్ సెల్ఫ్ లెస్ సర్వీస్ ” దివ్యవాణి 24 నవంబర్ 1990
http://www.sssbpt.info/ssspeaks/volume23/sss23-35.pdf