డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 10 సంచిక 2
March/April 2019
ప్రియమైన వైబ్రో ప్రాక్టీషనర్లారా,
ఈ మహాశివరాత్రి పవిత్ర సమయంలో మీకు ఇలా వ్రాస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. శివశక్తి స్వరూపులు, ప్రేమ స్వరూపులైన మనప్రియతమ భగవాన్ బాబా వారు ఈ విధంగా తెలిపారు. ‘‘ప్రయత్నం”- ఇదే ప్రధానమైన విషయం. మానవులందరికీ పురుష ప్రయత్నం అని చెప్పదగినది ఇదే. భగవంతుడు అంటే విశ్వాసం లేని వారు కూడా ప్రాపంచిక బాధలతో కన్నీళ్లతో వారి హృదయాలు కరిగినప్పుడు ఆధ్యాత్మిక బాటన నడవడానికి ఏదో ఒక నాడు ప్రయత్నం చేసి తీరుతారు. మోక్షం సాధించే దిశలో మానవుడు ఏ కొంచం ప్రయత్నం చేసినా భగవంతుడు దానికి వందరెట్లు సహాయం చేసి మిమ్మల్ని గమ్యం చేరుస్తాడు. ఈ శివరాత్రి మీకు అటువంటి ఆశను కలిగించాలని ఆశీర్వదిస్తున్నాను’’. శ్రీ సత్యసాయిబాబా దివ్యవాణి మహాశివరాత్రి ప్రశాంతి నిలయం, 4 మార్చి 1962. నేను ప్రాక్టీషనర్లను కోరేది ఏమిటంటే ఈ సందేశాన్ని మీ హృదయానికి తీసుకొని నిజ జీవితంలో అన్ని రంగాల్లో పట్టుదలతో అమలు పరచండి. ఇది మీవైబ్రియానిక్స్ ప్రాక్టీస్లో అపూర్వమైన విజయాన్ని అందిస్తుంది.
వైద్యచికిత్సా నిపుణుల నాణ్యత నైపుణ్యాలను పెంచడానికి సంస్థ పరంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈప్రయత్నాలు ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పటానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. అటువంటి వాటిలో కొన్నింటిని మీతో పంచుకుంటాను.
పరిపాలన సంబంధిత మూలాన్ని బలోపేతం చేయడానికి మనం ఎంతో మంది రిపోర్టింగ్ కోఆర్డినేటర్స్ లేదా నివేదికల సమన్వయకర్తలను కొత్తగా నియమించాము. ఫలితంగా రిపోర్టింగ్ అనేది గణనీయంగా మెరుగుపడింది. వాస్తవానికి కొంతమంది అభ్యాసకులు నివేదికలు పంపించడంలో ఆలశ్యం చేస్తుండడంతో ఈ రిపోర్టర్లు వారికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి వారి యొక్క నివేదికలను ఫోన్ ద్వారా సేకరిస్తూ అదే సమయంలో ఆయా చికిత్సా నిపుణుల సేవా గంటలను పూర్తి చేసుకోవడానికి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ చర్య ఎంతో సత్ఫలితాన్ని ఇచ్చి 100% రిపోర్టింగ్ పొందడానికి చేయూతనిచ్చిందని ప్రకటించడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది.
మనం నిర్వహిస్తున్న రిఫ్రెషర్ వర్క్ షాప్ లు చక్కటి ఊపందుకున్నాయి. దూరాన్ని తగ్గించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది ఎందుకంటే ఇప్పుడు మనం స్కైప్, ఇంటర్నెట్ ఆధారిత వీడియో కాన్ఫరెన్స్ వంటివి నిర్వహించడం ద్వారా దూర ప్రాంతంలో ఉన్న ప్రాక్టీషనర్ లను ఒక చోట చేర్చి వివిధ అంశాలపై అత్యంత ఫలవంతమైన చర్చలు జరపడానికి ఇవి ఎంతో సౌలభ్యంగా ఉన్నాయి. మన యూఎస్ కోఆర్డినేటర్01339 గత ఐదు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెలా నిర్వహిస్తున్న టెలిఫోన్ కాన్ఫరెన్సులు ఎంతో ప్రాచుర్యం పొందటంతో పాటు గొప్ప విజయాన్ని సాధించాయి.
వివిధ రకాలవర్క్ షాపుల యొక్క సంఖ్య పెరగటంతో పాటు దీనిలో పాల్గొనే అభ్యాసకుల సంఖ్య కూడా పెరిగి వారంతా నూతనోత్సాహంతో ఈ శిబిరాలలో పాల్గొనడం హృదయపూర్వక ఆనందాన్నిస్తోంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన వర్క్ షాప్ (ఎడిషన్ #3లో చూడండి) కొంతమంది కోఆర్డినేటర్ లను ఉత్సాహపరచడంతో అటువంటి స్థానిక శిబిరాలను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించింది. అటువంటి శిబిరాలకు ఏర్పాటు చేయడానికి నిర్వహకులకు మా వంతుగా పూర్తిసహాయ సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాము. ఇటువంటి శిబిరాన్ని పొందికగా అందంగా నిర్వహించేందుకు ముందుగానే ఎజెండాను సిద్ధం చేసుకుని పాల్గొనే వారందరికీ ఈ మెయిల్ ద్వారా తెలియజేయడం మంచిది. ప్రతీ సమావేశము నిర్ధారించుకున్న ఒక అంశంపై దృష్టి సారించి దాని యొక్క సిద్ధాంతము మరియు నూతన పోకడలు వంటివి వార్తాలేఖలు నుండి సమీకరించు కొని ఇంకా దీనినిర్వహణలో ఏమైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా సమావేశంలో చర్చించడం మంచిది. ఈ అంశానికి సంబంధించిన విజయవంతమైన కేసులు ప్రచురింపబడినా లేదా ప్రచురణకు సిద్ధంగా ఉన్నా అలాగే క్లిష్టమైన కేసులలో సవాళ్లను ఎదుర్కొనే సందర్భాలు వంటివి చర్చించడం మంచిది.
సమాచారం విప్లవాత్మకమైన మార్పులుచోటు చేసుకుంటున్న ఈ దశలో సమాచార పరిరక్షణ కూడా అత్యంత ఆవశ్యకమైనది మరియుచర్చనీయాంశమైనది. ఈ సందర్భంలోఅభ్యాసకులు తాజా నిబంధనలను తెలుసుకోవడం ద్వారా ఉత్తమ పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం. ఈ దిశలోమన వెబ్సైట్ https://practitioners.vibrionics.org లో అవసరమైన మార్పులు చేసాము. వెబ్సైట్ లోనికి వెళ్ళి దిగువన ఎడమ మెనూ లో GDPR పైన క్లిక్ చేసి మీ అభిరుచి మేరకు లేదా ఎంపిక మేరకు ఫారం పూర్తి చేసి సమర్పించండి. అందరికీ వారి వ్యక్తిగత డేటా రక్షణ కోసం ఇది తప్పనిసరి. మీ అందరికీ ఆనందకరమైన శివరాత్రి శుభాకాంక్షలు అందిస్తూ!
స్వామి సేవలో
మీజిత్ కె అగర్వాల్