Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 10 సంచిక 2
March/April 2019
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన వైబ్రో ప్రాక్టీషనర్లారా,

ఈ మహాశివరాత్రి పవిత్ర సమయంలో మీకు ఇలా వ్రాస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. శివశక్తి స్వరూపులు, ప్రేమ స్వరూపులైన  మనప్రియతమ భగవాన్ బాబా వారు ఈ విధంగా తెలిపారు. ‘‘ప్రయత్నం”- ఇదే ప్రధానమైన విషయం. మానవులందరికీ పురుష  ప్రయత్నం అని చెప్పదగినది ఇదే. భగవంతుడు అంటే విశ్వాసం లేని వారు కూడా ప్రాపంచిక బాధలతో కన్నీళ్లతో వారి హృదయాలు కరిగినప్పుడు ఆధ్యాత్మిక బాటన నడవడానికి ఏదో ఒక నాడు ప్రయత్నం చేసి తీరుతారు. మోక్షం సాధించే దిశలో మానవుడు ఏ కొంచం ప్రయత్నం చేసినా భగవంతుడు దానికి వందరెట్లు సహాయం చేసి మిమ్మల్ని గమ్యం చేరుస్తాడు. ఈ శివరాత్రి మీకు అటువంటి ఆశను కలిగించాలని ఆశీర్వదిస్తున్నాను’’. శ్రీ సత్యసాయిబాబా దివ్యవాణి మహాశివరాత్రి ప్రశాంతి నిలయం, 4 మార్చి 1962. నేను ప్రాక్టీషనర్లను కోరేది ఏమిటంటే ఈ సందేశాన్ని మీ హృదయానికి తీసుకొని నిజ జీవితంలో అన్ని రంగాల్లో పట్టుదలతో అమలు పరచండి. ఇది మీవైబ్రియానిక్స్ ప్రాక్టీస్లో అపూర్వమైన విజయాన్ని అందిస్తుంది.

వైద్యచికిత్సా నిపుణుల నాణ్యత నైపుణ్యాలను పెంచడానికి సంస్థ పరంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈప్రయత్నాలు ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పటానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. అటువంటి వాటిలో కొన్నింటిని మీతో పంచుకుంటాను.

పరిపాలన సంబంధిత మూలాన్ని బలోపేతం చేయడానికి మనం ఎంతో మంది రిపోర్టింగ్ కోఆర్డినేటర్స్ లేదా నివేదికల సమన్వయకర్తలను కొత్తగా నియమించాము. ఫలితంగా రిపోర్టింగ్ అనేది గణనీయంగా మెరుగుపడింది. వాస్తవానికి కొంతమంది అభ్యాసకులు నివేదికలు పంపించడంలో ఆలశ్యం చేస్తుండడంతో ఈ రిపోర్టర్లు వారికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి వారి యొక్క నివేదికలను ఫోన్ ద్వారా సేకరిస్తూ అదే సమయంలో ఆయా చికిత్సా నిపుణుల సేవా గంటలను పూర్తి చేసుకోవడానికి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ చర్య ఎంతో సత్ఫలితాన్ని ఇచ్చి 100% రిపోర్టింగ్ పొందడానికి చేయూతనిచ్చిందని  ప్రకటించడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది.

మనం నిర్వహిస్తున్న రిఫ్రెషర్ వర్క్ షాప్ లు చక్కటి ఊపందుకున్నాయి. దూరాన్ని తగ్గించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది ఎందుకంటే ఇప్పుడు మనం స్కైప్, ఇంటర్నెట్ ఆధారిత వీడియో కాన్ఫరెన్స్ వంటివి నిర్వహించడం ద్వారా దూర ప్రాంతంలో ఉన్న ప్రాక్టీషనర్ లను ఒక చోట చేర్చి వివిధ అంశాలపై అత్యంత ఫలవంతమైన చర్చలు జరపడానికి ఇవి ఎంతో సౌలభ్యంగా ఉన్నాయి. మన యూఎస్ కోఆర్డినేటర్01339 గత ఐదు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెలా నిర్వహిస్తున్న టెలిఫోన్ కాన్ఫరెన్సులు ఎంతో ప్రాచుర్యం పొందటంతో పాటు గొప్ప విజయాన్ని సాధించాయి.

 వివిధ రకాలవర్క్ షాపుల యొక్క సంఖ్య పెరగటంతో పాటు దీనిలో పాల్గొనే అభ్యాసకుల సంఖ్య కూడా పెరిగి వారంతా  నూతనోత్సాహంతో ఈ శిబిరాలలో పాల్గొనడం హృదయపూర్వక ఆనందాన్నిస్తోంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన వర్క్ షాప్ (ఎడిషన్ #3లో చూడండి) కొంతమంది కోఆర్డినేటర్ లను ఉత్సాహపరచడంతో అటువంటి స్థానిక శిబిరాలను  తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించింది. అటువంటి శిబిరాలకు ఏర్పాటు చేయడానికి నిర్వహకులకు మా వంతుగా పూర్తిసహాయ సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాము. ఇటువంటి శిబిరాన్ని పొందికగా అందంగా నిర్వహించేందుకు ముందుగానే ఎజెండాను సిద్ధం చేసుకుని పాల్గొనే వారందరికీ ఈ మెయిల్ ద్వారా తెలియజేయడం మంచిది.  ప్రతీ సమావేశము నిర్ధారించుకున్న ఒక అంశంపై దృష్టి సారించి దాని యొక్క సిద్ధాంతము మరియు నూతన పోకడలు వంటివి వార్తాలేఖలు నుండి సమీకరించు కొని ఇంకా దీనినిర్వహణలో ఏమైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా సమావేశంలో చర్చించడం మంచిది. ఈ అంశానికి సంబంధించిన విజయవంతమైన కేసులు ప్రచురింపబడినా లేదా ప్రచురణకు సిద్ధంగా ఉన్నా అలాగే క్లిష్టమైన కేసులలో సవాళ్లను ఎదుర్కొనే సందర్భాలు వంటివి చర్చించడం మంచిది.

   సమాచారం విప్లవాత్మకమైన మార్పులుచోటు చేసుకుంటున్న ఈ దశలో సమాచార పరిరక్షణ కూడా అత్యంత ఆవశ్యకమైనది మరియుచర్చనీయాంశమైనది. ఈ సందర్భంలోఅభ్యాసకులు తాజా నిబంధనలను తెలుసుకోవడం ద్వారా ఉత్తమ పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం. ఈ దిశలోమన వెబ్సైట్  https://practitioners.vibrionics.org లో అవసరమైన మార్పులు చేసాము. వెబ్సైట్ లోనికి వెళ్ళి దిగువన ఎడమ మెనూ లో GDPR పైన క్లిక్ చేసి మీ అభిరుచి మేరకు లేదా ఎంపిక మేరకు ఫారం పూర్తి చేసి సమర్పించండి. అందరికీ వారి వ్యక్తిగత డేటా రక్షణ కోసం ఇది తప్పనిసరి. మీ అందరికీ ఆనందకరమైన శివరాత్రి శుభాకాంక్షలు అందిస్తూ!

 స్వామి సేవలో

మీజిత్ కె అగర్వాల్

కేన్సర్ 11585...भारत

మంచానికి పరిమితమైన న 91 సంవత్సరాల మహిళకు కుడి మూత్రపిండానికి పైన పెద్ద కణితి ఉందని ఇది క్యాన్సర్ కు సంబంధించినది అని 6 నెలల క్రితం (నవంబర్ 2016) నిర్ధారణ చేయబడింది. గత రెండు నెలలుగా ఈమెకు ఉదరానికి దిగువన కటి ప్రాంతంలో కుడివైపు తీవ్రమైన నొప్పిఉంది. ప్రాక్టీషనర్ ను కలవడానికి ఒక వారం ముందు డాక్టర్లు ఈమె వారం కంటే ఎక్కువ బ్రతకడం కష్టమని నిర్ధారించారు. ఈమె క్యాన్సర్ కు అల్లోపతి మందులు ఏమాత్రం సహాయం చేయడం లేదని తీసుకోవడంఆపివేసారు. కానీ దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు అధిక బీపీ కి మందులు తీసుకోవడం కొనసాగించారు. 28 ఏప్రిల్ 2017 న ఆమెకుటుంబ సభ్యులు రోగిని సందర్శించ వలసిందిగా అభ్యాసకుని అభ్యర్థించారు. అభ్యాసకుడు ఆమెను చూసే నాటికి ఆమె గొంతులో బాధాకరమైన వాపు కారణంగా గత వారం రోజులుగా ఆమె ఏమి తినడం లేదు. ఇది మెడ ప్రాంతంలో ఒక చిన్న నిమ్మకాయ పరిమాణంలో బయటకు పొడుచుకొని వచ్చింది. ఆమె గత వారం రోజులుగా మలవిసర్జన కూడా చేయలేదు. ఆమెకు గత రెండు వారాలుగా కుడి కన్నుఎర్రగా ఉండి వాపు కలిగి ఉండి ద్రవాన్ని స్రవిస్తోంది. ఆమె ఎంతో భక్తిపూర్వకంగా అభ్యాసకుడు ఇచ్చిన క్రింది రెమిడీ లను తీసుకున్నారు:

#1. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

#2. CC4.4 Constipation + CC7.3 Eye infections + CC13.2 Kidney & Bladder infections…TDS

ఆమెకు వారం రోజుల్లోనే మలబద్ధకం నుండి 100% ఉపశమనం లభించింది మరియు మృదువైన ఆహార పదార్థాలను హాయిగా తినడం ప్రారంభించారు. ఆమెకు ఇతర లక్షణాల విషయంలో కొంత మేరకు మాత్రమే ఉపశమనం లభించింది. మరొక నెల తర్వాత అభ్యాసకుడు రోగి యొక్క అల్లుడి ద్వారా పొందిన సమాచారం ప్రకారము ఆమె యొక్క అన్ని రోగ లక్షణాలు దాదాపుగా విముక్తి పొందినట్టుగా వారు చెప్పారు. ఒక వారం తర్వాత అభ్యాసకుడు14 జూన్ 2017 న రోగిని సందర్శించి ఆమె సాధారణ ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె గొంతు నొప్పి మరియు వాపు మాయమైనట్లు ఆమె కన్ను పూర్తి ఆరోగ్య కరమైనటువంటి స్థితిలో ఉన్నట్లు ఆమె శరీరంలో ఎక్కడా నొప్పి అనేది లేనట్లు నిర్ధారించుకున్నారు. ఆమె నివారణలను కొనసాగించి 21 సెప్టెంబర్ 2017 న శాశ్వతంగా ప్రశాంతంగా కన్నుమూశారు.

సంపాదకుని వ్యాఖ్య: ఈ అభ్యాసకుడు అర్హత సాధించిన వెంటనే అటువంటి సంక్లిష్టమైన కేసును ప్రేమ, దయ తో చూడడం హృదయాన్ని కరిగిస్తుంది. ఈ వృద్ధ రోగి ఆమె జీవితంలో చివరి మూడు నెలలు పూర్తిగా నొప్పి లేకుండా బాధ లేకుండా జీవించ గలిగారు. వాస్తవానికి మోతాదు ఒకటే కనుక ఈ కోంబోలు అన్నింటిని ఒకే బాటిల్లో ఇవ్వవచ్చు. రోగలక్షణాలు పరస్పర సంబంధం లేకుండా ఉన్నట్లు అనిపించినప్పటికీ ఇవన్నీ కూడా కాన్సర్ నుండి ఉత్పన్నమైనటువంటివే.

గర్భాశయంలో ఆర్శనములు (పాలిప్స్) 11585...भारत

37-సంవత్సరాల మహిళకు 3 నెలలుగా మూత్ర విసర్జన సమయంలో రక్తస్రావం జరుగుతూ ఉంది. వైద్య పరీక్షలలో ఆమె గర్భాశయంలో 7 సెంటీమీటర్ల పొడవు గల గర్భాశయ ఆర్శనము లేదా పిలక వంటిది ఉన్నట్లుగా తెలిసింది. శస్త్రచికిత్స ద్వారా దీన్ని తొలగించినప్పటికీ అది పునరావృతమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. రోగి హోమియోపతి మరియు అలోపతి చికిత్స మూడు నెలలు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం కనిపించలేదు. రోగి భర్త  ఫోన్ ద్వారా అభ్యాసకుని సంప్రదించారు. క్రింది నివారణ కొరియర్ ద్వారా వారికి పంపగా 19 జూన్ 2017తేదీన దానిని ప్రారంభించారు: 
#1. CC2.3 Tumours & Growths + CC3.7 Circulation + CC8.4 Ovaries & Uterus + CC12.1 Adult tonic…TDS

రోగి అప్పటికే మిగతా మందులు అన్నీ ఆపేసి ఈ రెమిడీ మాత్రమే తీసుకోసాగారు. నివారణ తీసుకున్న తర్వాత కొంత ఉపశమనం కలిగించినప్పటికీ రక్తస్రావం ఆగలేదు. ఎస్ ఆర్ హెచ్ వి పి ఉపయోగించి మరింత నిర్ధిష్టమైన నివారణలు పొందడం కోసం సీనియర్ ప్రాక్టీషనర్ 11562 సంప్రదించవలసినదిగా వారికి అభ్యాసకుడు సూచించారు. అభ్యాసకుడు రోగి గురించి అన్ని వివరాలు ఈ సీనియర్ ప్రాక్టీషనర్ కు ఇచ్చారు. వీరు 24 ఆగస్టు 2017 న , #1 ని క్రింది నివారణతో రీప్లేస్ చేయడం జరిగింది:
#2. CC2.1 Cancers - all + CC8.4 Ovaries & Uterus + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD వారం వరకు అనతరం TDS

#3. SR249 Medorrhinum -  ప్రతీ మూడు రోజులకు ఒక మోతాదు చొప్పున నెల వరకు

ఎటువంటి మార్పు లేకపోవడంతో పూర్తి నిరాశా నిస్పృహతో వారు 26 సెప్టెంబర్ 2017న అభ్యాసకుడిని సంప్రదించారు తమ యొక్క పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యాసకుడు ప్రశాంతంగా వారిని ఓదార్చి పూర్తి విశ్వాసంతో సహనంతో #2ను కొనసాగించమని మరియు వారి హృదయపు లోతుల్లోనుండి స్వామిని ప్రార్థించమని చెప్పాను. ఈ అభ్యాసకుడు మరొక అభ్యాసకుడు11592

 తో పాటు తమ ప్రార్థనలు కొనసాగించారు. సెప్టెంబర్ 28న సీనియర్ ప్రాక్టీషనర్ రోగి యొక్క మానసిక స్థితిని పరిగణన లోనికి తీసుకొని  #2 స్థానంలోక్రింది నివారణ ఇచ్చారు :
#4. SR249 Medorrhinum + SR274 Aurum Mur Nat 200C + SR318 Thuja 200C…OD

#5. CC2.3 Tumours & Growths + CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + #2…6TD వారం తరువాత TDS

నాలుగు రోజుల తర్వాత అక్టోబర్ రెండో తేదీన ప్రాక్టీషనర్ రోగి యొక్క భర్త నుండి ఒక వాట్సాప్ మెసేజ్ అందుకున్నారు కొన్ని నిమిషాల క్రితం రోగి యొక్క గర్భాశయం నుండి ఒక పెద్ద పాలిప్ మరియు కొన్ని చిన్నవి బయటికి వచ్చాయని మెసేజ్ పంపారు (ఫోటోచూడండి). 

మరుసటి రోజు రక్తస్రావం ఆగిపోయింది. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష జరిగింది. ఆమె యొక్క గర్భాశయంలో ఎటువంటి పోలిప్స్ లేకుండా సాధారణ స్థితిలో ఆరోగ్యంగా ఉన్నట్లు గైనకాలజిస్ట్ నిర్ధారించారు. రోగి#5 ను TDS గా రెండు వారాల పాటు మరో నెల ODగా కొనసాగించి 2017 నవంబర్ 4న ఆపివేశారు. 2019 ఫిబ్రవరి నాటికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు

ఈ సంఘటన ద్వారా ప్రేరణ పొంది స్వామి పట్ల ప్రగాఢమైన విశ్వాసం మరియు కృతజ్ఞత తో నిండిన రోగి యొక్క భర్త వెంటనే ఎ.వి.పి. కోర్సు కోసం ప్రవేశం పొంది ఫిబ్రవరి 2018 లో ఎ.వి.పిఅయ్యారు. మరియు తర్వాత వి.పి.11593 అయ్యారు. వీరి నిబద్ధత ఎంత గొప్పది అంటే 250 కిలోమీటర్లు రానూ, పోనూ ప్రయాణించి ప్రతి నెలలో ఒక ఆదివారం వారి సొంత ఊరిలో ఉన్న సాయి సెంటరులో వైబ్రియానిక్స్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

సంపాదకుని వ్యాఖ్య: ప్రాక్టీషనర్ సలహా ప్రకారం 2019 ఫిబ్రవరి 15 నుండి  రోగి తన భర్త నుండి CC17.2 Cleansing…TDS ఒక నెల వరకూ దాని స్థానంలో CC12.1 Adult tonic...TDSఒక సంవత్సరం పాటు ప్రత్యామ్నాయ పద్ధతిలో కొనసాగిస్తున్నారు.

108CC బాక్సు నుండి ఇస్తున్నట్లయితే  #4 ను మానివేసి  CC8.4 Ovaries & Uterus ఇచ్చిన తరువాత #5 ఇస్తే చాలు.

మెడ పైన కణితి 11585...भारत

66-ఏళ్ల వ్యక్తికి గత నాలుగు సంవత్సరాలుగా మెడ పైన కణితి ఉంది. దాని వలన నొప్పి ఏమీ లేక పోవడంతో ఎటువంటి మందులు తీసుకోవడం లేదు. వైబ్రియానిక్స్ నివారణ తీసుకున్న నెల రోజుల లోనే ఒక యువతికి కణితి అదృశ్యమైనట్లు తెలుసుకొని 19 జులై 2018 న రోగి అభ్యాసకుని సంప్రదించారు అతనికి ఈ క్రింది నివారణ ఇవ్వబడింది:  
#1. CC2.3 Tumours & Growths + CC3.7 Circulation…TDS  

నెల రోజుల తర్వాత భజన నిమిత్తం ప్రాక్టీషనర్ వద్దకు వెళ్లి అదే అవకాశంగా తన మెడపైన గడ్డ స్థితిలో ఎటువంటి మార్పు లేదని నిరాశ వ్యక్తం చేశారు. భజన అనంతరం నివారణ మార్చి ఇస్తానని ప్రాక్టీషనర్ అతనికి హామీ ఇచ్చారు. భజన జరిగిన వెంటనే రోగి తన మెడను చూపిస్తూ కణితి పరిమాణం కూడా ఏమాత్రం తగ్గలేదు మెత్తగా కూడా అవలేదు అని నొక్కుతూ చెపుతుండగా మరుక్షణమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కణితి చితికి చీము బయటకు రావడం ప్రారంభమైంది. అవాక్కయిన రోగి ఎంతో విశ్వాసంతో రీఫిల్ తీసుకొని మౌనంగా వెళ్ళిపోయాడు. ఒక వారంలో ఇది పూర్తిగా అదృశ్యం అయింది. మరియు గాయం కూడా మానిపోయింది మోతాదు OD.తగ్గించబడింది. తగ్గించిన మోతాదు ఒక నెల పాటు తీసుకున్న తర్వాత 21 సెప్టెంబర్ 2018న నివారణను తీసుకోవడం మానివేశారు.

ఫిబ్రవరి 2019 నాటికికణితి విషయంలో ఎటువంటి పునరావృతం లేకుండా రోగి ఆరోగ్యంగా ఉన్నారు. అభ్యాసకుడు క్రింది రెమిడిని పునరావృతం కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిందిగా సూచించారు:
#1…OW ముందు జాగ్రత్త కోసం

#2. CC12.1 Adult tonic + CC17.2 Cleansing…TDS సాధారణ ఆరోగ్యం కోసం

చర్మ ఎలర్జీ లు 11587...भारत

72-సంవత్సరాల వయసు గల వ్యక్తి ఒక మురికి వాడలో అనారోగ్య పరిస్థితుల్లో నివసిస్తూ గత 12 సంవత్సరాలుగా తన కుడి పాదం మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నారు. చర్మం యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. సుమారు 3 అంగుళాల వ్యాసం కలిగిన నల్లని మచ్చ చీమును స్రవిస్తోంది. అతనికి భయంకరమైన దురద మరియు నొప్పి కూడా ఉండి సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు. అతను కార్యాలయంలో తన విద్యుక్త ధర్మాన్ని కూడా నిర్వర్తించ లేక తరచుగా సెలవలు పెడుతున్నారు. కొంతకాలం క్రితం ఆసుపత్రిలో చేరినప్పుడు కొంతఉపశమనం లభించింది. ఫార్మసీ నుండిగాయానికి లేపనం మందులు తెచ్చుకుని రాస్తూ ఉండేవారు. ఇతను 2017 జులై 19న అభ్యాసకుని సందర్శించినప్పుడు ఎటువంటి ఔషధం తీసుకోవడం లేదు. అతనికిక్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC21.7 Fungus + CC21.11 Wounds & Abrasions…QDS

#2. CC21.2 Skin infections + #1BD విభూతితో కలిపి మచ్చ పైపూతగా రాయడానికి.

వారం రోజుల్లో చీము కారడం ఆగిపోయింది. మరో పది రోజుల్లో దురద మరియు నొప్పి తగ్గి పోయాయి. అతను అసౌకర్యం లేకుండా నడవగలుడమే కాక తన కార్యాలయ విధులను తిరిగి  ప్రారంభించుకో గలిగారు. అయినప్పటికీ నల్లనిమచ్చఅలాగే కొనసాగింది. అయితే రోగి ఆరు వారాల తర్వాత రీఫిల్ కోసం వచ్చేటప్పటికి ఈ మచ్చఅదృశ్యమైంది. మోతాదును #1 ని TDS కు తగ్గించినప్పటికీ  #2మాత్రం BD. గానే కొనసాగింపబడింది. ఒక నెల తరువాత అతనికి బాగానే ఉన్నట్లు చెప్పాడు కానీ రీఫిల్ కోసం రాలేదు. కనుక  అభ్యాసకుడు ఉద్దేశించిన విధంగా మోతాదును మార్చడం సాధ్యం కాలేదు. రోగి అభ్యాసకుని నివాసానికి సమీపంలోనే ఉండడం వలన  ఫిబ్రవరి 2019 నాటికి సమస్య పునరావృతం కాలేదని తెలుసుకున్నారు.

కడుపు ఉబ్బరం 11587...भारत

49-ఏళ్ల వయసు గల వ్యక్తి కడుపు ఉబ్బరం, బరువు మరియు నొప్పితో గత ఆరు సంవత్సరాలుగా బాధపడుతున్నారు. అతను రెస్టారెంట్లో తినడానికి ఇష్టపడుతుంటారు. మరియు అతిగా తినడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. అంతేగాక ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు అంటే చాలా ఇష్టం. అనేక మంది వైద్యులను సంప్రదించి ఆయుర్వేదం మరియు హోమియోపతి తో సహా వివిధ రకాల వైద్య విధానాలను ప్రయత్నించినా ఎటువంటి ఫలితం లేదు. ఇవేమీ అతనికి నివారణ ఇవ్వలేదని ఒక విధమైన నిరాశలో ఉన్నారు.  

 2018 ఫిబ్రవరి 1 న అతనికి క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది:  
CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.4 Eating disorders…ప్రతీ పది నిమిషాలకి ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ అనంతరం 6TD

రెండు వారాలలో కడుపు ఉబ్బరం గణనీయంగా తగ్గింది, కడుపు భారం పూర్తిగా పోయింది మరియు నొప్పి కూడా లేదు. మోతాదును TDS కి తగ్గించారు. మరో ఆరు వారాల తర్వాత అన్ని లక్షణాలు మాయమయ్యాయి. రోగి మోతాదును TDSగా మరో మూడు నెలలు కొనసాగించాలని ఎంచుకున్నారు. తన శారీరక వ్యవస్థ కు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లను సవరించుకోవాలసినదిగా అభ్యాసకుడు  సూచించారు. రోగి ఆ తర్వాత తగ్గించిన మోతాదును OD. గా తీసుకున్నారు. అభ్యాసకుడు అమెరికా నుండి భారతదేశానికి తిరిగి రావడంతో రోగిని అమెరికాలో ఉన్న మరొక అభ్యాసకుని వద్దనివారణ తీసుకోవలసిందిగా సూచించారు. డిసెంబర్ 2018 నాటికి రోగి  ముందు జాగ్రత్త కోసం OD గా తీసుకుంటున్నారు. సమస్య పునరావృతం కాలేదు.

మలబద్ధకం మరియు వెన్ను నొప్పి 11587...भारत

63-ఏళ్ల వయసు గల అమెరికన్ మహిళ దీర్ఘకాలంగా వెన్ను దిగువన నొప్పితో బాధ పడుతూ ఏడు సంవత్సరాల క్రితం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. శస్త్ర చికిత్స తరువాత కూడా నొప్పి కొనసాగింది. ఆమెకు సూచింపబడిన నొప్పి నివారణలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి. దీనికి తోడు తీవ్రమైన మలబద్ధకం కూడా మొదలైంది అయితే ఆమెకు చేసిన ఆపరేషన్ తో మలబద్దకానికి ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ చెప్పారు. ఆమె మలబద్ధకం కోసం గృహ చిట్కాలను ఆశ్రయించింది కానీ అంతగా ఉపశమనం కలవలేదు. ఆమె 2017 మార్చి 22 న అభ్యాసకుడిని సంప్రదించగా ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది:  
CC4.4 Constipation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC20.5 Spine + CC20.7 Fractures…ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ అనంతరం 6TD.

పది రోజుల తర్వాత ఆమె కోడలు తన అత్తగారికి మలబద్ధకం మరియు వెన్ను నొప్పి అద్భుతంగా 80 శాతం వరకూ తగ్గిపోయాయని చెప్పారు. కనుక మోతాదు TDSకు తగ్గించడం జరిగింది. మరో పది రోజుల తర్వాత ఆమె ఈ రెండు లక్షణాల నుండి 100% ఉపశమనం పొందారు. మోతాదు OD కి తగ్గించబడింది ఈ విధంగా ఆమె ఆరు నెలలు మోతాదును కొనసాగించారు. అభ్యాసకుడు  2018 అక్టోబర్ లో అందుకున్న తాజా సమాచారం ప్రకారం ఆమె వ్యాధి లక్షణాలు ఏమీ పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నారు.

అండాశయ కణుతులు 03524...यूएसए

23-సంవత్సరాల మహిళ గత పది సంవత్సరాలుగా రుతుక్రమంలో భారీ రక్తస్రావం మరియు నొప్పితో బాధపడుతూ వున్నారు. జూన్ 2015 లో ఆమె ఎడమ అండాశయంలో 2 మిల్లీమీటర్ల కణితి ఉన్నట్లు మెడికల్ రిపోర్టులను బట్టి నిర్ధారణ అయ్యింది. ఆమె రెండు నెలలు అల్లోపతి మందులు తీసుకుని మెరుగుదల లేకపోవడంతో మానేసారు. డిసెంబర్లో ఆమె మరొక అండాశయంలో కూడా అదే పరిమాణంలో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

2016ఫిబ్రవరి 16వ తేదీన ఆమె తల్లి సలహా మేరకువైబ్రియనిక్స్ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అభ్యాసకుడు ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వడం జరిగింది:
CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities…TDS

రెండు వారాల్లోనే రోగి యొక్క తల్లి తమ కుమార్తె ఇప్పుడు మరింత ప్రశాంతంగా నమ్మకంగా నివారణాలను కొనసాగించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అభ్యాసకుడికి తెలియజేశారు. ఆరు వారాల తర్వాత ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష జరిగింది. రెండు అండాశయములలోనూ తిత్తులు మాయమయ్యి సాధారణ స్థితిలో ఉన్నట్లు రిపోర్టు ద్వారా తెలిసింది. ఆమెకు కడుపు నొప్పి రక్తస్రావం 50 శాతం తగ్గింది. ప్రతి పీరియడ్ కు ఆమెకు పరిస్థితి మెరుగుపడుతూ జూలై నాటికి 75% ఉపశమనం కలిగింది. మరో మూడు నెలలు నివారణ కొనసాగించిన తర్వాత బాధాకరమైన పీరియడ్స్ నుండి పూర్తిగా కోలుకున్నారు. మోతాదు మరో రెండు వారాల పాటు ODకి, తర్వాత రెండు వారాల పాటు 3TW గానూ, మరో వారానికి 2TW, ఆ తరువాత OWగానూ తగ్గించ బడింది. రెమిడీ తీసుకోవడం 2016 డిసెంబర్ లో నిలిపివేయబడింది. 2018 ఫిబ్రవరిలో చివరిసారిగా సంప్రదించినప్పుడు రోగి అండాశయం లో తిత్తులు పునరావృతం కాలేదని మరియు నొప్పి లేకుండా రుతుస్రావం సాధారణంగా సక్రమంగా వస్తోందని ధృవీకరించారు.

రైనైటిస్ 03572...गैबॉन

29 ఏళ్ల మహిళ ఎంతో కాలంగా ఉదయాన్నే తలనొప్పి మరియు చిగుళ్లలో నొప్పితో ( నెలకు సగటున రెండు సార్లు) పాటు తుమ్ములతో బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య ఆమెకు బాల్యంలోనే ప్రారంభమయ్యింది కానీ రెండేళ్ల క్రితమే ఆమె ఇ.ఎన్.టి. స్పెషలిస్టుకు చూపించగా ఇది దీర్ఘకాలిక రైనైటిస్ అని నిర్ధారించారు. ఆమె అల్లోపతి మందులు తీసుకుంటున్నారు కానీ ఇది ఆమెకు రెండు మూడు రోజులు మాత్రమే ఉపశమనం ఇస్తూ ఆ తర్వాత వ్యాధి లక్షణాలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఆమె వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అభ్యాసకుని సంప్రదించడానికి 3 రోజుల క్రితం ప్రారంభమైన తీవ్రమైన తలనొప్పి మరియు చిగుళ్ళ నొప్పితో ఆమె 31 ఆగస్టు 2018 న అభ్యాసకుని సందర్శించారు.(ఈమెకు ఏడు సంవత్సరాల వయస్సు నుండి హస్వదృష్టి కూడా ఉంది మరియు ఆమె తన దృష్టిని మెరుగుపరుచుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు).

ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వబడింది:
CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies...ప్రతి పది నిమిషములకు ఒకసారి ఒక గంట వరకు ఆ తరువాత 6TD

ఈ నివారణ తీసుకునే సమయంలో ఆమె అలోపతి మందులు తీసుకోవడం పూర్తిగా మానివేశారు. పదిరోజుల తర్వాత ఆమెకు పులౌట్ ఏర్పడి ఆమెకు తలనొప్పి మరియు తుమ్ముల తో బాధ భరింపరానిదిగా ఉంది. కానీ ఆమె దీనిని త్వరగా అధిగమించాలని  మోతాదును 6TD గానే కొనసాగించారు. ఈ పులౌట్ రెండు రోజులు మాత్రమే ఉండి అ తరువాత ఆమె యొక్క పరిస్థితి మెరుగు పడడం ప్రారంభించింది. మూడు రోజుల తర్వాత ఆమెకు అన్ని వ్యాధి లక్షణాల నుండి 90% ఉపశమనంకలుగగామూడు రోజుల అనంతరం 17 సెప్టెంబర్ నాటికి వ్యాధిలక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. మోతాదును ఒక వారం పాటు TDSకు ఆ తర్వాత మరొక వారం OD కి తగ్గించి చివరగా 30 సెప్టెంబర్ నాటికి పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఆమె యొక్క కంటి దృష్టి మెరుగు పడటానికి ఒక ప్రత్యేకమైన కాంబో ఇవ్వడం జరిగింది. 2019 ఫిబ్రవరి నాటికి ఆమెకు వ్యాధి లక్షణాలు పునరావృతం కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.

మైగ్రేన్, నెలసరిలో అధిక రక్తస్రావం (మెనోరేజియా) 11602...भारत

2018 జులై 26వ తేదీన 32 ఏళ్ల మహిళ బహుళ ఫిర్యాదులతో అభ్యాసకుడిని సంప్రదించారు. ఆమెకు తలనొప్పి తో పాటు వికారం గత ఐదు సంవత్సరాలుగా నెలకి ఒకటి లేదా రెండు సార్లు వస్తోంది. ఇది ఆమెకు నుదుటి ఎడమభాగాన ప్రారంభమై ఆమె ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు లేదా ప్రకాశవంతంగా ఉండే కాంతికి గురి అయినప్పుడు ఎక్కువవుతోంది. ఈమెకు గత మూడు సంవత్సరాలుగా నెలవారీ బహిష్టు సక్రమంగానే సరైన సమయంలోనే వస్తున్నప్పటికీ ఆ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటోంది. కొన్నిసార్లు ఇది బాధాకరంగా కూడా ఉంటోంది. ఈమె గత రెండు సంవత్సరాలుగా అలసట మరియు శక్తి హీనత తో బాధపడుతున్నారు. అయితే గత రెండు నెలలుగా ఇది మరింత ఎక్కువగా ఉంది. ఈమె చూడటానికి పాలిపోయినట్లుగా ఉండి డాక్టర్లను సంప్రదించాలన్నాఆస్పత్రికి వెళ్లాలన్న భయపడుతున్నారు.

ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC3.1 Heart tonic + CC8.7 Menses frequent + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

ఆమె తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ మరియు ఆకుకూరలు చేర్చుకోవాలని, తగినంత నీరు తాగాలని అభ్యాసకుడు ఇచ్చిన సలహాను ఆమె అనుసరించారు. ఒక వారం రోజుల్లోనే ఆమెకు శక్తివంతంగా సంతోషంగా అనిపించడం ప్రారంభించింది. మరో వారంలో ఆమె శక్తి స్థాయిలో 90 శాతం పెరుగుదల కనిపించింది. అలా నెల రోజులుగా మోతాదు కొనసాగిస్తూ ఉండగా 2018 సెప్టెంబర్ 10 ఉదయం ఆమెకు తలనొప్పి ఎక్కువగా ఉండడంతో అభ్యాసకుడిని సంప్రదించారు. అభ్యాసకుడు ప్రశ్నించిన మీదట ఆమెకు తలపోటు తగ్గిపోవడంతో గత రెండున్నర వారాలుగా మోతాదును తీసుకోవడం లేదని అంగీకరించారు. కనుక ఆమెను నివారణను TDSగా తిరిగి ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఒక వారం తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన ఆమె చాలా శక్తివంతంగా ఉన్నట్లు బహిష్టు సమయంలో నొప్పి గాని అధిక రక్తస్రావం గాని ఏమీ లేవని అలాగే అధిక వత్తిడి గాని తలపోటు గాని లేవని చెప్పడం జరిగింది ఆమె తన పని ఆనందంగా చేసుకోవడంతోపాటు పిల్లలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా చక్కగా నిర్వహించ గలుగుతున్నారు. మోతాదును ODకి, రెండు వారాల తర్వాత OW స్థాయికి తగ్గించడం జరిగింది. 2019ఫిబ్రవరి 21 నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాకపోవడంతో ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. మోతాదును ముందస్తు జాగ్రత్త కోసం OW గా కొనసాగిస్తున్నారు.   

అరికాళ్ళ పాదాల శోధము (ప్లాంటర్ ఫెసైటీస్) 11601...भारत

42 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ గత నాలుగు సంవత్సరాలుగా తన అరికాళ్ళ పాదాలపై నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఈ పాదాలకు లోతైన పగుళ్లు కూడా ఉన్నాయి. గత నాలుగు నెలలుగా నొప్పి చాలా తీవ్రంగా ఉండి ఆమె నిలబడలేక నడవలేక అవస్థ పడుతున్నారు. ఆలోపతి మందులు తీసుకున్నప్పటికీ అవి ఏమాత్రం సహాయం చేయకపోగా అరికాళ్లపై మంట కూడా ప్రారంభమైంది. అందుచేత వారం తర్వాత ఆమె ఆ మందులను ఆపివేశారు.

2018 అక్టోబర్ 7న ఈమె భర్త అభ్యాసకుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆమెకు క్రింది ఇవ్వడం జరిగింది.

#1. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.5 Dry Sores…ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున ఒక వారం వరకూ ఆ తరువాత 6TD

#2. CC21.5 Dry Sores…OD బాహ్యంగా రాయడం కోసం ఆలివ్ ఆయిల్ లో చేసి ఇవ్వడం జరిగింది.

రెండు వారాల తర్వాత ఆమె సమస్యల విషయంలో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ నొప్పి మరియు మంట ఇంకా బాధిస్తూనే ఉన్నాయి. ఆమె కుటుంబ విషయాలు తెలుసుకున్న అభ్యాసకుడు గృహ సంబంధ సమస్యలు ముఖ్యంగా ఆమె యొక్క వికలాంగుడైన కొడుకు గురించి ఆమె మధనపడుతూ ఉన్నట్లుగా తెలుసుకున్నారు.

2018 అక్టోబర్ 23 వ తేదీన కొంబో  సంప్రదింపులు సలహాల విభాగాన్ని సంప్రదించిన తర్వాత #1 మరియు #2 స్థానంలో క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది:

#3. CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.5 Dry Sores…6TD

#4. CC20.1 SMJ tonic + CC20.4 Muscle & Supportive tissue + CC21.5 Dry Sores…OD బాహ్యంగా రాయడం కోసం ఆలివ్ ఆయిల్ లో చేసి ఇవ్వడం జరిగింది.

రెండు నెలల వ్యవధిలో నొప్పి క్రమంగా తగ్గి ఆమె హాయిగా నడవడం ప్రారంభించారు. మరో రెండు వారాల తర్వాత అనగా 2019 జనవరి 10 నాటికి ఆమెకు నొప్పితో పాటు కాలి మంట కూడా తగ్గిందని మరియు పగుళ్లు కనిపించకుండా పోయి పాదాలు మృదువుగా మరాయని తెలిపారు. #3 యొక్క మోతాదు TDSకి మరియు మరొక వారం తర్వాత ODకి తగ్గించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 24 నాటికి ఆరోగ్యంగా ఉండి సమస్యలు పునరావృతం కాకుండా ఉండడానికి #3 మరియు  #4…లను OD గా కొనసాగిస్తున్నారు. రోగి యొక్క సౌకర్యాన్నిపరిగణన లోనికి తీసుకొని మోతాదు తగ్గించడం జరుగుతుంది.

అభ్యాస కుని సూచన: SMJ  దానితో పాటు మెంటల్ ఎమోషనల్ టానిక్ ఈ కేసు విషయంలో అద్భుతంగా పనిచేయడంతో ఇది సరియైన  కలయిక అని నిరూపించబడింది.

మోకాలినొప్పి, ఫ్లోరైడ్ టాక్సిసిటీ 11578...भारत

50-ఏళ్ల మహిళకు గత రెండు సంవత్సరాలుగా కుడి మోకాలి వద్ద విపరీతమైన నొప్పి ఉంది. ఈ మోకాలి చుట్టూ వాపు కూడా ఉంది. రోగి నివసించిన గ్రామానికి సంబంధించిన నీటిలో ఫ్లోరైడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది కనుక ఫ్లోరైడ్ ప్రభావము వలననే ఈ నొప్పి వస్తున్నట్లుగా అభ్యాసకుడు భావించారు. రోగి యొక్క దంతాలు రంగు కూడా మారిపోయి ఉన్నట్లు అభ్యాసకుడు గమనించారు.

2018 డిసెంబర్ 10వ తేదీన ఆమె యొక్క సమస్యలకు అనుగుణంగా క్రింది నివారణ ఇవ్వడం జరిగింది:  
#1. SR253 Calc Flour...6TD

#2. CC3.7 Circulation + CC20.1 SMJ tonic + CC20.6 Osteoporosis...6TD

కేవలం రెండు రోజుల్లోనే నొప్పి మరియు వాపు మాయమైంది. నాలుగు రోజుల తరువాత మోతాదును TDS కి తగ్గించారు. ఆమెకిచ్చిన రెమిడీ మూడు వారాల్లోనే అయిపోయింది కానీ అత్యవసర పని నిమిత్తం ఆమె తన గ్రామానికి వెళ్ళడంతో రీఫిల్ కోసం అభ్యాసకుని సందర్శించ లేక పోయారు. ఏడు వారాల తర్వాత 2019 ఫిబ్రవరి 18న ఆమె అభ్యాసకుని సందర్శించినప్పుడు ఆమెకు అంతా బాగానే ఉందని అంతేగాక గత రెండు నెలల్లో ఆమె సమస్యలు పునరావృతం కాలేదని చెప్పారు. ఆమెకు #1 మరియు  #2 ను ODగా తిరిగి ప్రారంభించడం జరిగింది. అంతేగాక రోగి నివసిస్తున్న గ్రామంలో నీటిలో అధిక ఫ్లోరైడ్ ఉన్నందున ముందు జాగ్రత్త కోసం ఈ మోతాదును కొనసాగించాలని అభ్యాసకుడు  భావించారు.

సంపాదకులు వ్యాఖ్య: సరియయిన కారణం గుర్తించి నివారణ ఇవ్వడం వలన రెండు సంవత్సరాల సమస్యకు రెండు రోజుల్లో పూర్తి ఉపశమనం కలగడం ఒక ఉత్తేజకరమైన సందర్భం. ఇది వైబ్రీయనిక్స్ యొక్క అద్భుతమైన శక్తిని వెల్లడిస్తోంది.

108CC బాక్స్ ఉపయోగిస్తున్నట్లయితే  #2 ను మాత్రమే ఇస్తే సరిపోతుంది ఎందుకంటే దీనిలో SR253 Calc Flour. ఉంటుంది.

ప్రక్క తడపటం / ఆధీనంలో లేని మూత్ర విసర్జన (ఎన్యురేసిస్) 11568...भारत

స్వతహాగా సిగ్గుపడే స్వభావం కల 13 సంవత్సరాల బాలుడు గత పది సంవత్సరాలుగా పక్క తడిపే సమస్యతో బాధపడుతున్నాడు. ఈ బాలుని తల్లి అతడు నిద్రపోయే ముందు మూత్రం పోసుకొని వచ్చేటట్లుగా చేస్తున్నప్పటికీ బాలుడు నిద్రపోయిన మూడు గంటల్లోనే సుమారు ఒంటిగంట ప్రాంతంలో పక్కతడుపుతున్నాడు. అంతేగాక శీతాకాలంలో బాలుడు సాయంత్రం పూట ఎక్కువ నీళ్లు తాగకుండా ఉండేలాగా ఆమె జాగ్రత్త వహిస్తున్నప్పటికీ సమస్య కొనసాగుతూనే ఉంది. బాలుడికి రెండు నెలలపాటు అలోపతి చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు కనుక ఆ మందును ఆపివేయడం జరిగింది. ఈ సమస్య బాలుని మానసికంగా కుంగదీసి ఆత్మ విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది. పాఠశాల కు సంబంధించిన విహార యాత్రలో రాత్రిపూట వేరొకచోట ఉండవలసిన పరిస్థితి ఉన్నట్లయితే కనీసం అటువంటి వాటి గురించి ఆలోచించే సాహసం కూడా బాలుడు చేయలేకపోతున్నాడు. అలాగే సెలవులలో బంధువుల ఇంటికి వెళ్లడం కూడా మానేశాడు.

 2018 సెప్టెంబర్ 29వ తేదీన అభ్యాసకుడు బాలుడికి క్రిందిరెమిడీ ఇచ్చారు:
CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…TDS

 పడుకోవడానికి నిద్రించడానికి గంటముందు మంచినీళ్లు తాగవద్దు అని అభ్యాసకుడు సూచించారు. రెండు వారాల్లో పక్క తడపడం సగానికి తగ్గాయి. 15 రోజుల తర్వాత  వారానికి ఒకసారి పక్కతడిపే పరిస్థితి వచ్చింది. బాలుడు మోతాదును మరో రెండు నెలలు TDS గా తీసుకున్నాడు. ఈ సమయంలో పక్క తడపడం 15 రోజులకు ఒకసారి వచ్చేది. 2019 జనవరి 5 నాటికి మోతాదును BDకి తగ్గించడం జరిగింది. ఆ తర్వాత పక్కతడిపే పరిస్థితి ఏర్పడలేదు. ఫిబ్రవరి5 నాటికి మోతాదును OD కి ఆ తర్వాత మెల్లగా OWకి తగ్గించడం జరుగుతుంది. 2019 ఫిబ్రవరి 23 నాటికి సమస్య పునరావృతం లేకుండా బాలుడికి పక్కతడపడం అనే సమస్య పూర్తిగా తగ్గిపోయింది.  

సంపాదకుని వ్యాఖ్య: సీనియర్ ప్రాక్టీషనర్ లు NM65 Bedwetting కార్డులు ప్రయత్నించ వలసిందిగా సూచన. అయితే ఇది ఎన్నో కేసులలో సత్వర ఫలితాన్ని ఇచ్చింది.

సాధకుని వివరములు 11585...India

ప్రాక్టీషనర్ 11585...ఇండియా వృత్తి రీత్యా వీరు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు. 1990లో వీరు స్వామి ఫోల్డ్  లోకి వచ్చి త్వరలోనే సత్యసాయి సంస్థలో యాక్టివ్ సేవాదళ్ గా మారారు. ప్రస్తుతం వీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. వీరు స్వామి వారి ఆంగ్ల పుస్తకాలను అలాగే స్వామి యొక్క అధ్యాత్మిక మాస పత్రిక సనాతన సారథి లోని ఆంగ్ల వ్యాసాలను తెలుగు లోనికి అనువదిస్తూ ఉంటారు. వీరు సెప్టెంబర్ నెలలో ఒక సీనియర్ ప్రాక్టీషనర్ ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని వెంటనే ప్రవేశం పొందారు. వీరు మార్చి 2017 లో ఏ.వి. పి. గా అర్హత పొంది పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత దొరికే సమయంలోనూ మరియు సెలవు దినములలో వైబ్రియానిక్స్ సేవలో మునిగిపోయేవారు. వీరు 2017 సెప్టెంబర్ లో వి. పి. గా మరియు 2018 నవంబర్లో ఎస్.వి. పి. గా అయ్యారు. ఎస్.వి.పి. వర్క్ షాప్ లో పాల్గొనడానికి పుట్టపర్తికి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు వీరికి వచ్చినటువంటి అద్భుతమైన కలను ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నారు. ఈ కలలో వీరు 108 సి సి బాక్స్ నుండి నివారణలు తయారు చేస్తూ ఉండగా హఠాత్తుగా వీరి పక్కనే స్వామి నిలబడి ఉండటంతో అది చూసి విస్మయంతో లేచి నిలబడ్డారు. మనోహరమైన చిరునవ్వుతో స్వామి వీరిని ఆలింగనం చేసుకొని ఎంతో ప్రేమపూర్వక ప్రశంసలతో తెలుగులో’‘నీవు నా కోసం పని చేస్తున్నావు’’అన్నారు. ఈ కల వీరిలో  ప్రగాఢ అనుభూతిని ఉత్తేజాన్ని కలిగించింది. వైబ్రియానిక్స్ పని స్వామి సేవగా భావించి కొనసాగించడానికి  ధైర్యన్నీ, నమ్మకాన్నీ చేకచేకూర్చింది. వీరు  ఇతర వైబ్రియానిక్స్ అభ్యాసకులతో కలిసి వారాంతపు సెలవులలో క్యాంపులు నిర్వహిస్తూ నివారణలు ఇవ్వడమే కాకుండా అక్కడ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉపయోగించి వైబ్రియానిక్స్ గురించి అవగాహన కూడా పెంచుతున్నారు. వీరు ఆ విధంగా తాను నివసించే జిల్లాలోని ఏడు సాయి కేంద్రాల్లో మరియు ప్రక్క జిల్లాలోని ఒక సాయి కేంద్రంలో ఇటువంటిఅవగాహనా సదస్సులు ఏర్పాటు చేశారు. వీరికి సత్యసాయి సేవా సంస్థలకు చెందిన రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న సమావేశము లో వైబ్రియానిక్స్ గురించి ఛేప్పే అవకాశం లభించింది. వచ్చిన వారంతా ఎంతో మనస్పూర్తిగా దీనిని స్వీకరించి ఈ వైద్య విధానాన్ని ప్రశంసించడం జరిగింది.

వీరు ఇప్పటివరకు 1100కు పైగా రోగులకు చికిత్స చేయడమే కాక ప్రతీ ఒక్క కేసు విషయంలోనూ స్వామీ యెుక్క అదృశ్య హస్తం స్వామి కృప ఉందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక చిరస్మరణీయమైన కేసు వివరాలను మనతో పంచుకుంటున్నారు. 50 సంవత్సరాల మహిళ గొంతులో క్యాన్సర్ వ్యాధితో నాలుగు నెలలుగా బాధపడుతున్నారు. ఈమె ఖీమోథెరపీ చేయించుకున్నప్పటికీ కణితి కరిగి పోలేదు. ఆమె అల్లోపతి మందులు తీసుకోవటం మానేసి 2017 అక్టోబర్ లో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వీరు ఈమెకు క్రింది రెమిడీ ఇచ్చారు. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS. నాలుగు నెలల కాలంలో ఈ కణితి పూర్తిగా అదృశ్యం అయింది. గత పది నెలలుగా ఏ సమస్యా లేకుండా మోతాదును తగ్గించినస్థాయిలో OD గా ఈమె కొనసాగిస్తున్నారు. దాన్ని క్రమంగా OWకి తగ్గించాలని అభ్యాసకుడు యోచిస్తున్నారు.

ఎస్ వి పి ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు వీరికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురయింది. 2వేరు వేరు సందర్భాల్లో రోగి మొదటి మోతాదు ను తీసుకుని వెళ్లిన వెంటనేరోగియొక్క లక్షణాలను అరగంట సేపు వీరు అనుభవించారు. ఆ తర్వాత వర్క్ షాప్ లో డాక్టర్ అగర్వాల్ గారు రోగి చికిత్సకు రాకముందే రోగి యొక్క నొప్పి మరియు లక్షణాలను అనుభవించిన కొందరు అభ్యాసకులు గురించి ప్రస్తావించడంతో వీరు ఈ రకమైన అనుభవం సాధ్యమేనని నిర్ధారణకు వచ్చారు. ఇది వీరిలో స్వామి చెప్పిన సూక్తి అందరూ ఒకటే అనే అనుభవాన్ని ప్రతిబింబించేలా చేసింది. ఎ. వి. పి. గా వైబ్రియానిక్స్ యొక్క ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం మరియు వ్యక్తిగత మార్పుకు లేదా పరివర్తన పైన దృష్టి పెట్టగా ఎస్. వి. పి. గా స్వామి మాటలను ఆచరణలో పెట్టడానికి స్వామి చెప్పిన వాక్యం ‘‘వైబ్రియానిక్స్ భవిష్యత్తు ఔషధం’’ అనే మాటలను నిజం చేస్తూ ఒక గురుతరమైన బాధ్యత తో వైబ్రియానిక్స్ ను ముందుకు తీసుకువెళ్లడానికి బాధ్యత వహించేలా చేసింది.

సేవ చేయాలనే వీరి తపన వైబ్రియానిక్స్ పట్ల వీరికి ఉన్న నిబద్ధత ఎనలేనిది. ఇప్పటివరకు 27 న్యూస్ లెటర్లను మరియు ఎ.వి.పి.   మాన్యువల్ ను ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికోసం తెలుగులో వర్క్ షాప్ లు మరియు మెంటరింగ్ ను సులభతరం చేయడానికి 2019కి చెందిన నూతన 108 సిసి పుస్తకాన్ని తెలుగు లోనికి అనువాదం చేయడం కూడా పూర్తి కావస్తోంది. వైబ్రియానిక్స్ ద్వారా ప్రేమను సేవను అందించడానికి  ప్రతీ ఒక్క అభ్యాసకుడు మరొక కొత్తవారిని ఈ రంగం లోనికి తీసుకు రావలసిన సమయం ఆసన్నమైందని వీరు అభిప్రాయపడుతున్నారు. వీరికి గల దృఢమైన నమ్మకం ఈదిశలో మనం ఒక అడుగు వేస్తే స్వామి మన వైపు వంద అడుగులు వేస్తారు. అప్పుడు స్వామి ఆశించిన భవిష్యత్ ఔషదమ్ అనే గొప్ప కల వాస్తవ రూపం దాలుస్తుంది. ఈ ప్రాక్టీషనర్ తన ప్రార్థన మరియు కృతజ్ఞతలు స్వామికి తెలియజేయడానికి ఒక పద్యాన్ని కంపోజ్ చేశారు.  ప్రియమైన ప్రభూ మీ  సర్వవ్యాపిత రూపాన్ని ప్రేమించడం ద్వారా మిమ్మల్ని ప్రేమించే మార్గాన్ని చూపించారు.

 మీ సర్వవ్యాప్త రూపాన్ని సేవించడం ద్వారా మిమ్మల్నే సేవించే మార్గం చూపించారు.

 ప్రియమైన ప్రభూ మీ పిల్లలను ప్రేమించడం ద్వారా నా హృదయం మిమ్మల్నే ప్రేమించేలా చేయండి.

మీ పిల్లలకు సేవ చేయడం ద్వారా నా చేతులు మీ సేవలోనే పునీత మయ్యేలా చేయండి.

నా ప్రార్థన పూర్వక పూర్వక కన్నీళ్లు మీ పిల్లల బాధాతప్త కన్నీళ్లను తుడిచేలా చేయండి.

ప్రియమైన స్వామీ చివరకు నాదంటూ ఏమీ లేకుండా నీ దివ్య పాదపద్మాలచెంత నన్ను ఆత్మసమర్పణ చేసుకోనివ్వండి.

 

పంచుకున్న కేసులు :

 

 

సాధకుని వివరములు 11587...India

ప్రాక్టిషనర్  11587…ఇండియా  వీరు లేబర్ వెల్ఫేర్ మరియు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ పట్టా కలిగి ఉన్నారు. వీరు ఆధ్యాత్మిక చింతన గల కుటుంబంలో జన్మించి బాల్యం నుండి సమాజసేవలో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. వీరు నివసిస్తున్న తమ పరిసర ప్రాంతాల్లో క్రమంతప్పకుండా జరుగుతున్న భజనల ద్వారా 1974లో స్వామి వైపు ఆకర్షితులు అయ్యారు. వీరు 1979లో బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత పుట్టపర్తి మరియు వైట్ ఫీల్డ్ లో వీరికి లభించిన స్వామి యొక్క అద్భుత దర్శనాలు వీరిని మంత్రముగ్ధులను చేశాయి. క్రమంగా వీరు సెలవలలో మరియు ప్రత్యేక సందర్భాలలో  సాయి సంస్థలో  జరిగే సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. 2001లో పదవి విరమణ చేసిన తరువాత పూర్తిగా  సాయి సంస్థ కార్యక్రమాల్లో మునిగిపోయారు.

జ్యోతిష శాస్త్రంలో వీరికి గల అభిరుచి వలన గత 30 సంవత్సరాలుగా ఉచితసేవలు అందించేలా చేసింది. చిన్నతనంలోనే కోల్పోయినటువంటి తండ్రిగారి నుంచి వీరు ఈ జ్యోతిష శాస్త్రంలోపరిజ్ఞానాన్ని పొందారు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల పరిష్కారాల కోసం తనను సంప్రదించే ప్రజలకు సహాయం చేయాలని తపనతో వీరు నడిపించ పడ్డారు. వీరు రికీ అనే చికిత్సా పద్ధతి కూడా నేర్చుకున్నారు. వీరు1993- 94లో హోమియోపతిలో ఒక కోర్సు చేశారు కానీ ఇంట్లో పరిస్థితుల కారణంగా పరీక్షకు హాజరు కాలేదు. వీరు తన అల్లుడి ద్వారా స్ఫూర్తి పొంది వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని మార్చి 2017 వర్క్ షాప్ కు హాజరు కావడం కోసం ఆన్లైన్ ఈ కోర్సు పూర్తి చేశారు. అయితే అదే వర్క్ షాప్ కు హాజరు కావాలసి ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు వీరి అల్లుడు మరణించడంతో భావోద్వేగ పరంగా ఏర్పడిన ఈ విషాదాన్ని తట్టుకుని 2017 జులై లోఎ.వి.పి. కోర్సు పూర్తి చేశారు. ఫిబ్రవరి 2018 లో వి.పి గా అయ్యారు. అప్పటి నుండి ఇతర చికిత్సా విధానాలు అన్నింటినీ వదిలి వైబ్రో వైద్యం మాత్రమే చేస్తున్నారు. దానితోపాటు తను నేర్చుకున్నజ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సలహాలు కూడా ఇస్తూనే ఉన్నారు.

ఎ.వి.పి. అయిన వెంటనేవీరు తన సాధారణ సందర్శనలో భాగంగా ఒక సంవత్సరం పాటు తనకుమారుని వద్ద అమెరికాలో ఉన్నారు. ప్రారంభంలో వీరికి భారతీయ పరిచయస్తులతో సహా స్థానిక నిర్వాసితులకు వైబ్రో వైద్యాన్ని పరిచయం చేయడం దుర్భరంగా ఉండేది. వీరియొక్క మెంటర్ 10375మరియు యు.ఎస్. &కెనడా కోఆర్డినేటర్01339యొక్క మార్గదర్శకత్వంలో 120 మంది రోగులకు చికిత్స చేయగలిగారు.

 2018 జూన్ లో భారతదేశం వచ్చారు. అప్పటినుండీ తనను ఇంటివద్ద సందర్శించే రోగులకు రెమిడీలు ఇవ్వటంతో పాటు దూరంగా ఉన్నటువంటి పేషెంట్లకు పోస్టు ద్వారా కూడా వీరు మందులు పంపిస్తున్నారు. వీరికి దగ్గరలో ఉన్న రెండు ఆధ్యాత్మిక కేంద్రములతో పాటు ఒక గ్రామాన్ని కూడా సందర్శిస్తూ అక్కడ ప్రతీ వారం రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. వీరు విజయవంతంగా చికిత్స చేసిన కేసులలో అజీర్ణం, జలుబు, దగ్గు, మరియు జ్వరం వంటి వ్యాధులు అలాగే దీర్ఘకాలిక జీర్ణకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ లు, పంటి నొప్పులు మరియు తీవ్రమైన కీళ్ల నొప్పులు కూడా ఉన్నాయి. వీరు తయారు చేసిన చెవిలో వేసే చుక్కల మందు ద్వారా పది రోజులుగా బాధపడుతున్న టినిటస్ వ్యాధి నాలుగు రోజుల్లో CC5.3 Meniere’s disease, one drop in 30 ml of olive oil…BDఇవ్వడం ద్వారా తగ్గిపోయింది. వీరు క్యాన్సర్ పేషెంట్లు తమ బాధను పోగొట్టుకునే విధంగానూ ఆస్త్మా రోగులు మరియు మైగ్రేన్ బాధితులు తమ యొక్క బాధలను తగ్గించుకునే విధంగానూ ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. రోగులు రీఫిల్ కోసం మరలా మరలా అభ్యాసకులను సందర్శిస్తూ ఉన్నట్లయితే ఎంతోమందికి ఈ చికిత్సా విధానం ద్వారా లబ్ధి చేకూరుతుంది అని భావిస్తున్నారు. చాలా మంది రోగులు వైబ్రియానిక్స్ మందులు తీసుకున్న తర్వాత గణనీయమైన ఉపశమనం లభించినప్పటికీ  ఆ తర్వాత నివారణలను కొనసాగించడానికి ముందుకు రావడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వీరు భారతదేశం తిరిగి వచ్చినప్పటి నుంచి సుమారు 275 మంది రోగులకు చికిత్స చేశారు.

ఎ.వి.పి. వర్క్ షాప్ లో ఇచ్చిన సూచన మేరకు వీరు ఎక్కడికి వెళ్ళినా వెల్నెస్ కిట్టును తనతో పాటు తీసుకొని వెళుతుంటారు. ఇది వారికి ఆత్మ విశ్వాసం మరియు ఎప్పుడయినా ఎదురయ్యే అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవాల్సిన బాధ్యతను వీరికి గుర్తు చేస్తుంది.  వీరు ఎప్పటికప్పుడు వార్తాలేఖలను చదువుతూ తనకు తెలిసిన విషయాలను నవీనీకరిగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే అభ్యాసకుల డేటాబేస్ను నవీనికరించే జట్టులో కూడా వీరుచురుకైన సభ్యుడిగాఉన్నారు. వైబ్రియానిక్స్ ద్వారా తన సాధనను మెరుగుపరచుకోవడానికి సువర్ణ అవకాశం కల్పించిన స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. తను వేసే ప్రతీ  అడుగులోనూ స్వామి చేత మార్గనిర్దేశం చేయబడుతున్నట్లుగా వీరు భావిస్తున్నారు. అలాగే తన మెంటర్ యొక్క సమయానుకూల మార్గదర్శకత్వం అభ్యాసకుడుగా తన ఎదుగుదలకు కారణమైందని పేర్కొంటున్నారు. వైబ్రియానిక్స్ తనలో అన్ని స్థాయిల్లో పరివర్తన తెచ్చిందని వీరు భావిస్తున్నారు. రోగులకు చికిత్స చేయడానికి ముందు వీరు భగవంతుని ప్రార్ధిస్తూ ఓపిగ్గా ప్రేమగా వారు చెప్పే విషయాలను వింటారు. రోగుల పట్ల మనం కనబరిచే ప్రేమ మరియు కరుణ ఒక విధమైన మాయాజాలం సృష్టిస్తుందని అది రోగి యొక్క సమస్యను లేదా రుగ్మతను సగ భాగం మాయమయ్యేలా చేస్తుందని వీరు భావిస్తున్నారు. తన దగ్గరకు వచ్చే రోగులకు సరైన ఆహారం, తగినంత మంచినీరు తీసుకోవాలని సమయానుకూలంగా నిద్రపోవాలని చెప్పటం మాత్రం మరిచిపోరు. ఇలా చెప్పడం ద్వారా వారు త్వరగా కోలుకుంటారని వీరి భావన.

పంచుకున్న కేసులు :

ప్రశ్నలు జవాబులు

1. ప్రశ్న: రెమిడీ బాటిల్ను” 8 “ ఆకారంలోనే తొమ్మిది సార్లు ఎందుకు కదిలించాలి ?

జవాబు: 8 ఆకారము అనంతత్వము, శాశ్వతత్వం మరియు ఎప్పటికీ అంతం కాని అవకాశాలను సూచిస్తుంది. ఇది బైబిల్ ప్రకారము పునరుద్ధానము మరియు పునరుత్పత్తి ని సూచిస్తుంది. ఇది కదిపే ప్రక్రియకు ఆధ్యాత్మికతను జోడిస్తుంది.

భౌతిక స్థాయిలో చూసినట్లయితే 8 అంకెలో రెండు సున్నాలు ఉంటాయి. వృత్తాకార కదలికలో మాత్రలు కదిలినప్పుడు ఉత్పత్తి చేయబడిన సెంట్రిఫ్యుగల్ ఫోర్స్ మాత్రలు ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయేలా చేస్తుంది. నివారణ చుక్క నుండి వచ్చే వైబ్రేషన్ ప్రతీ  మాత్రకు విస్తరిస్తుంది. అలా చేయకపోతే భూమి యొక్క గురుత్వాకర్షణ కారణంగా కింది స్థాయిలో ఉన్న మాత్రలే వైబ్రేషన్ సేకరిస్తాయి. కదపటం అంత ప్రభావవంతంగా ఉండదు. మాత్రలు బాగా కలపడానికి తొమ్మిదిసార్లు సరిపోతుంది. 9 అనేది ఎప్పటికీ దివ్యమైన సంఖ్యగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే ఇది ఎప్పటికీ తగ్గిపోదు.

________________________________________

2. ప్రశ్న: అభ్యాసకుడు రోగి యొక్క నోటిలో మొదటి మాత్రను ఎందుకు ఉంచాలి ?

జవాబు: అభ్యాసకుడు వైబ్రియానిక్స్ పట్ల 100% విశ్వాసం కలిగి ఉంటాడు మరియు తన రోగులను ప్రేమ మరియు కరుణతో చూస్తాడు. రోగి అనారోగ్యంతో ఉన్నప్పుడు నయం చేసే కంపనాలను స్వీకరించే ఆ విశ్వాసం లేదా గ్రహణ శక్తి అతడు కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. మొదటి మాత్ర రోగి నోట్లో పెట్టినప్పుడు వైద్య ప్రక్రియ  ప్రారంభించబడుతుంది. రోగి అభ్యాసకుడు మరియు దైవం మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఒక త్రిభుజం ఏర్పడుతుంది. దైవం నుండి ఈ నయం చేసే శక్తి  రోగికి అభ్యాసకుడి ద్వారా ప్రవహిస్తుంది. రోగి మొదటి మోతాదు ను తీసుకోవడానికి ఇష్టపడితే మాత్రం రెమిడీ బాటిల్ మూతలో వేసి రోగికి ఇవ్వవచ్చు. ఇక్కడ రోగి యొక్క సౌకర్యము మరియు సౌలభ్యాన్ని పరిగణన లోనికి తీసుకోవడం చాలా ముఖ్యం. రెమిడీ పోస్టు ద్వారా పంపబడితే రోగి ప్రాక్టీషనర్ కు రింగ్ చేయవలసి ఉంటుంది. అభ్యాసకుడు ప్రార్థన చేస్తూ దైవానికి అనుసంధానింపబడి రోగిని మొదటి మాత్ర తీసుకోవాల్సిందిగా సూచిస్తారు.

________________________________________

3. ప్రశ్న: రోగి మనసులో భయాందోళనలు రేకెత్తకుండా రేడియేషన్ మూలాలు అయిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి దూరంగా ఉండవలసిందిగా ఎలా సలహా ఇవ్వగలను?

జవాబు: మనం ఇచ్చే నివారణపై రేడియేషన్ యొక్క తటస్థీకరణ ప్రభావం గురించి హెచ్చరించడం అత్యవసరం అనడంలో సందేహం లేదు. అయితే ఇది రేడియేషన్ మూలంతో ప్రత్యక్ష సంబంధం లో ఉండకూడదని కొంత దూరం (సుమారు 30 సెంటి మీటర్లు లేదా పన్నెండు అంగుళాలు దూరం )ఉండేలా జాగ్రత్త వహించమని ఆ వ్యక్తికి సున్నితమైన, స్నేహపూర్వక మైన విధానంలో చెప్పాలి. తటస్థీకరణ అనే పదాన్ని ఉపయోగించకుండా ప్రభావాన్ని తగ్గించడం అని చెప్పవచ్చు. నివారణ సురక్షితంగా ఉంచడానికి వివిధ సరళమైన మార్గాలు సూచించడం మంచిది. ఉదాహరణకు మొబైల్ ను, రెమిడీ ని వేరు వేరుగా జేబుల్లోఉంచడం, ఇంట్లో అయితే దేవుడు ఉండే గదిలో లేదా పూజ మందిరంలో ఉంచమని చెప్పవచ్చు.

________________________________________

4. ప్రశ్న: 108 సీసీ బాక్స్ నుండి కే బాటిల్ లో ఉన్న మాత్రలకు అనేక చుక్కలు జోడించాలి అనుకున్నప్పుడు మాత్రలు ముద్దగా కాకుండా లా నిరోధించగలము?

జవాబు:: మాత్రలు ముద్దుగా కాకుండా ఉండటానికి బాటిల్ ను కలుపుతూ చివరి చుక్క వేసిన తర్వాత 8 ఆకారంలో బాటిల్ ను కదపాలి. మరొక పద్ధతి ఏమిటంటే ఒక కాళీ బాటిల్ లో మనం ఉపయోగించ తలచిన చుక్కలన్నింటినీ వేసి దాని నుండి ఒక చుక్కను వేసుకోవడం. అయితే మా పరిశోధన విభాగం వారు పదే పదే నొక్కి చెప్పిన ఈ విషయాన్ని బట్టి రోగి యొక్క వ్యాధి లక్షణాలకు  చికిత్స చేయడానికి ఎంచుకునే రెమిడీ ల సంఖ్యను పరిమితం చేయడం ద్వారానూ మరియు ఈ వ్యాధి పరిస్థితి మూలకారణమైన సమస్యను గుర్తించి దాని చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మరింత వేగంగా నివారణ జరుగుతుంది. చికిత్స కోసం రోగికి సహాయపడతాయేమో అని ఆశించి ఎక్కువ రెమిడీ లను చేర్చడం, వ్యాధి నివారణ ప్రక్రియను ఆలశ్యం చేస్తుంది. ఎందుకంటే అవి  నిజంగా అవసరమయ్యే కాంబో యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి.

________________________________________

5. ప్రశ్న : నేను 10 మిల్లీ లీటర్ల  బాటిల్ కు, ఎంచుకున్న కాంబో నుండి ఒక చుక్కను కలుపుతాను. ఒకవేళ 20 మిల్లీలీటర్ల బాటిల్ లో కాంబో చేర్చవలసి నప్పుడు బాటిల్ లో రెండు చుక్కలు వేయడం అవసరమా ?

జవాబు:  20 మిల్లీలీటర్ల బాటిల్ లోని మాత్రలకు కూడా ఒక చుక్కను జోడిస్తే సరిపోతుంది. వైబ్రేషన్ అనేది ప్రాధమికంగా స్వచ్ఛమైన శక్తి. ఇది గుణాత్మక స్థాయిలో పని చేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ చుక్కలు పొరపాటున దానిలో పడినందువలన పరిహారం ప్రభావితం కాదు.  ప్రతి మాత్రకు తగిన వైబ్రేషన్ పొందడానికి వీలుగా బాటిల్ కదపడం అనేది ప్రధానమైన అంశం.

________________________________________

6. ప్రశ్నఎస్ ఆర్ హెచ్ వి పి ద్వారా కంపనాలు ప్రసారం చేయడానికి ముందుగా రోగి యొక్క అనుమతి తీసుకోవడం విధిగా అవసరమా?

జవాబు: స్వామి ఆశీర్వదించినపోటెంటైజర్ ను మనం ఉపయోగిస్తున్నందు వలన ఇది తప్పనిసరి అని మేము భావించము. ఈ పోటెన్తైజర్ ఎల్లప్పుడూ దైవిక ప్రకంపనలు (రోగికి స్వస్థత చేకూర్చే సానుకూల ప్రకంపనలు)మాత్రమే ప్రసారం చేస్తుందని స్వామి చెప్పారు. ఈ ప్రసార ప్రక్రియ అనేది స్వచ్ఛమైన హృదయం నుండి ఆవిర్భవించిన ప్రార్థనతో సమానము. అభ్యాసకుని యొక్క సంకల్పము అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినఅంశము. చికిత్సను సులభతరం చేయడము కోసం అభ్యాసకుడు తన ఉద్దేశం రోగికి (లేదా అతని సంరక్షకుడికి) తెలిపినప్పుడు వైద్యకంపనాలను స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉంటారు.

 

దివ్య వైద్యుని దివ్య వాణి

మానవుడు శారీరకము మరియు మానసికము అనే రెండు రకాల అనారోగ్యాల తో బాధపడుతూ ఉంటాడు . ఒకటి శరీరంలోని వాత, పిత్త, కఫములు మూడింటి యొక్క సమత్వము లేకపోవడం వలన, మరొకటి సత్వ , రజో, తమో గుణాల అసమతుల్యం వలన అస్వస్థత కలుగుతుంది. ఈ రెండు రకాల అనారోగ్యాల కు సంబంధించిన ఒక చిత్రమైన వాస్తవం ఏమిటంటే మంచి గుణాలు అలవరచుకోవడం ద్వారా ఈ రెండు వ్యాధులను నయం చేసుకోవచ్చు. శారీరక ఆరోగ్యం , మానసిక ఆరోగ్యానికి ఒక అవసరం కాగా మానసిక ఆరోగ్యం , శారీరక ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది ! దుఃఖము మరియు నష్టము స్థానంలో ఔదార్యము, కృతజ్ఞత, ధైర్యము మరియు మంచి చేయాలని ఉత్సాహం ప్రదర్శించడం, ఉత్తమ సామర్థ్యంతో సేవచేయడం ఇవి మనసుతో పాటు శరీరానికి కూడా ఆరోగ్యాన్నిస్తాయి. సేవ నుండి పొందిన ఆనందం శరీరంపై ప్రేరణ చూపి వ్యాధి నుండి విముక్తి చేస్తుంది. "    

...సత్యసాయిబాబా , “ఆలయం » దివ్యవాణి 9 సెప్టెంబర్ 1959
http://www.sssbpt.info/ssspeaks/volume01/sss01-23.pdf                          

 

 

"ఎక్కడ సేవ చేసినా ఎవరికి సేవ చేసినా అది భగవంతునికే చెందుతుంది. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి అనే నమ్మకం పెంచు కోవాలి అటువంటి సేవ మాత్రమే నిజమైన సాధన".

... సత్యసాయిబాబా, “ది యోగా ఆఫ్ సెల్ఫ్ లెస్ సర్వీస్ ” దివ్యవాణి  24 నవంబర్ 1990
 http://www.sssbpt.info/ssspeaks/volume23/sss23-35.pdf

                                                                                                                                                                                                                                         

ప్రకటనలు

Forthcoming Workshops

  • ఇండియా పుట్టపర్తి: AVP  వర్క్ షాప్ 6-10 మార్చి 2019, సంప్రదించవలసిన వారు లలిత వెబ్సైట్  [email protected] లేదా ఫోన్ నెంబర్ 8500-676 092
  • ఫ్రాన్స్ డోర్డాంగ్: SVP వర్క్ షాప్ & రిఫ్రెషర్ సెమినార్ 16-20 మార్చి 2019, సంప్రదించవలసిన వారు డేనియల్ [email protected]
  • ఇండియా ఢిల్లీ-ఎన్సిఆర్: రిఫ్రెషర్ సెమినార్ AVP/VP/SVP - 23 మార్చి 2019, సంప్రదించవలసిన వారు డాక్టర్ సంగీత శ్రీవాత్సవ ఈమెయిల్ [email protected] లేదా  ఫోన్ నెంబర్ 9811-298-552
  • ఇండియా భిల్వారా రాజస్థాన్: VPల కోసం సెమినార్  13-14 ఏప్రిల్ 2019, సంప్రదించవలసిన వారు మనిష్ గుప్తా లేదా ఫోన్ నెంబర్  8209-370-500
  • యు.ఎస్.ఎ రిచ్మండ్ విఏ: AVP వర్క్ షాప్ 26-28 ఏప్రిల్  2019, సంప్రదించవలసిన వారు సుసాన్ ఈమెయిల్  [email protected]
  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 17-21 జులై  2019, సంప్రదించవలసిన వారు లలిత ఈమెయిల్  [email protected]  లేదా ఫోన్ నెంబర్  8500-676 092
  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 18-22 నవంబర్  2019, సంప్రదించవలసిన వారు లలిత ఈమెయిల్  [email protected] లేదా ఫోన్ నెంబర్  8500-676-092
  • ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్  24-28 నవంబర్  2019, సంప్రదించవలసిన వారు హెమ్ ఈమెయిల్ [email protected]

 

అదనంగా

1.  ఆరోగ్య వ్యాసము

దగ్గుని నివారించడం మరియుఎదుర్కోవడం

మన శరీరంలో ప్రతి అవయవము మరియు శరీర భాగము అది నిర్వహించవలసిన పని యొక్క పరిమితి మరియు సమతుల్యత ఉన్నాయి. తక్కువ ఆహారం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం ఈ సమతుల్యతను ప్రమాదంలో పడేస్తోంది అప్పుడప్పుడు వచ్చే దగ్గు ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి మరియు వ్యర్థ పదార్థాలు బయటకు పంపించడానికి సహాయపడుతుంది కానీ అనుకూలంగా వచ్చే దగ్గు అనారోగ్యం యొక్క సంకేతాలను సూచిస్తుంది. మితంగా తినండి ఎక్కువ కాలం జీవించండి... శ్రీ సత్య సాయి బాబా. 1

1.  దగ్గు అంటే ఏమిటి?

దగ్గు అనేది మనశరీరంలో ఉన్న గొంతు, వాయు మార్గాలను మలిన రహితంగా చేయటానికి మరియు ఇన్ఫెక్షన్ను నివారించడానికి సహజసిద్ధంగా ఏర్పడిన అసంకల్పిత చర్య. అప్పుడప్పుడు వచ్చే దగ్గు సాధారణమైనది గా మరియు ఆరోగ్యకరమైనదిగా పరిగణింపబడుతుంది. ఇది మనకు చికాకు కలిగించేదిగా ఉండవచ్చు కానీ శరీరం తనకు తానే స్వస్థ పరచు కోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది అలాగే కొనసాగుతూ ఉంటే వెంటనే దాన్ని తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి.2,3,4 

2.  ప్రకృతి, కారణాలు మరియు దగ్గులో రకాలు

దగ్గు తీవ్రమైనది మరియు దీర్ఘకాలిక మైనది అనే రెండు రకాలు. దగ్గు అకస్మాత్తుగా ప్రారంభమై రెండు నుండి మూడు వారాల వరకు ఉంటే అది తీవ్రమైనదిగా పరిగణింప బడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఎనిమిది వారాల వరకు ఉంటుంది. పెద్ద వారిలో ఎనిమిది వారాల కంటే ఎక్కువ మరియు పిల్లల్లో నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే దగ్గు దీర్ఘకాలిక వ్యాధిగా పిలవబడుతుంది.4

తీవ్రమైన దగ్గుకు కారణాలు: పొగ, పుప్పొడి వంటి అలర్జెన్స్, తేమ లేదా ఫంగస్ ఉపరితల నీళ్లపై మరియు చుట్టూ కనిపించే కొన్ని రకాల స్పోర్ట్స్ ఇంకా దుమ్ము వంటివి వాయు మార్గాల లోని నరాల చివరకు చేరి చికాకు కలిగిస్తుంది. ఇది సాధారణ జలుబు వల్ల లేదా ఫ్లూ వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల కలిగే శ్వాస కోశ సంక్రమణ వ్యాధి వల్ల కూడా కలగవచ్చు.2-7

దీర్ఘకాలిక దగ్గుకు కారణాలు: ఇది గ్యాస్ట్రో ఇసు పాగల్ రిఫ్లెక్స్(GERD)వ్యాధివలన, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు అయినటువంటి ఆస్త్మా లేదా బ్రాంకైటిస్ వలన గాని దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD) వలన కూడా సంభవించవచ్చు. వృద్ధాప్యంలో దీర్ఘకాలిక దగ్గు ఎక్కువగా జీర్ణకోశం లోని ఆమ్లం గొంతులోనికి రావడం లేదా యాసిడ్ రెఫ్లెక్స్2 వలన ఏర్పడుతుంది. ఇది కొన్ని రకాల ఔషధ సేవనం వల్ల కూడా కలగవచ్చు.2-7

మొండి దగ్గులు అని పిలవబడే దీర్ఘకాలిక దగ్గులు మానసిక సంబంధమైన కారణాలు అనగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ప్రతికూల భావనలు, అవగాహన రాహిత్యమూ, అలసట వంటి వాటి వల్ల కూడా కలుగుతుందితుంది.8

స్థూలంగా చెప్పాలంటే దగ్గులు రెండు రకాలు6 పొడి దగ్గు--తడి దగ్గు :

 పొడి దగ్గు దీనికి ప్రధాన కారణంపొగ త్రాగడం, మందులు,  ప్రారంభదశలో ఉన్న శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు లేదా పల్మౌనరీ ఫైబ్రోసిస్ వంటి ప్రగతిశీల ఊపిరితిత్తుల వ్యాధులు మొదలగునవి.  పొడి దగ్గు లో కఫం ఉత్సర్గం ఉండదు.6,7

 తడి దగ్గు లేదా ఛాతీ తగ్గు దీనినే ఉత్పాదక దగ్గు అని కూడా పిలుస్తారు. ఇది తరచుగా గొంతు ఇన్ఫెక్షన్తో పాటు జలుబును  అనుసరిస్తుంది. అంతేగాక శ్వాస కోశాలలో ఇన్ఫెక్షన్, న్యుమోనియా,క్షయ లేదా ఊపిరి తిత్తులలో కఫం చేరడంతో గుండె ఆగిపోవడం వంటి వాటివలన కూడా ఏర్పడవచ్చు. ఇది శ్లేష్మాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. గ్రంథుల ద్వారా క్రమం తప్పకుండా ప్రతీరోజూ ఇది  ఉత్పత్తి అవుతూ ముక్కు మరియు సైనస్, నోరు, గొంతు, ఊపిరితిత్తులు మరియు ముఖ్యమైన వాయు మార్గాలను తడి ఆరిపోకుండా ఉంచుతుంది. ఇది కొన్నిరకాల సూక్ష్మ జీవుల వంటివి, అలాగే కొన్ని రకాల ఇరిటెంట్స్ ఊపిరి తిత్తుల లోనికి ప్రవేశించకుండా ఒక వల లాగా ఉపయోగపడుతుంది. అంతేగాక ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్రతిరోధకాలు మరియు ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. అనారోగ్య సమయంలో మాత్రమే దీనిని మనం గమనించవచ్చు. అనారోగ్య సమయంలో శ్వాసకోశ వ్యవస్థ యొక్క దిగువ వాయు మార్గం నుండి దగ్గు ద్వారా బహిష్కరింపబడిన దీనిని కఫము లేదా శ్లేష్మం అంటారు. వైద్య పరిభాషలో పరీక్ష కోసం దీనిని తీసుకున్నప్పుడు శ్లేష్మం అనే పిలవబడుతుంది. ఇది జిగురుగా ఉండి అంటుకునే స్వభావం కలిగి ఉంటే డీ హైడ్రేషన్ లేదా అనార్ద్రత ను లేదా ఇన్ఫెక్షన్ పురోగమిస్తూ ఉన్నట్లు సూచిస్తుంది. దీని రంగు అంతర్లీనంగా ఉన్న అనారోగ్యమును సూచిస్తుంది. ఐతే  దీని రంగు ఒక రోజులో మారిపోయే అవకాశం కూడా ఉంది. 6,7,9-11  

కఫం యొక్క రంగులు: మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయనంతవరకు పల్చగా ఉండి పారదర్శకంగా ఉన్నటువంటి కఫము సాధారణమైనది మరియు ఆరోగ్యకరమైనది అని భావించాలి. ముక్కుకు సంబంధించిన ఎలర్జీ, గవత జ్వరం, వైరల్ బ్రాంకైటిస్, న్యుమోనియా వలన కఫం ఏర్పడుతుంది. జలుబు, సైనుసైటిస్, బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా ఉన్నపుడు కఫం యొక్క రంగు పసుపు రంగులో ఉండి ఆకుపచ్చ రంగులోకి చేరుకుంటూ ఉంటే ఇది పెరుగుతున్న ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది. తెల్లని కఫము అలర్జీలు, ఆస్త్మా లేదా సిఓపిడి(COPD), వైరల్ ఇన్ఫెక్షన్లు(GERD) లేదా గుండె జబ్బు వల్ల వస్తుంది. సిమెంట్ రంగు, లేదా నల్లని కఫం ఫంగల్ ఇన్ఫెక్షన్ ను లేదా బ్యాక్టీరియల్ సంబంధించిన ఊపిరితిత్తుల వ్యాధిని సూచిస్తుంది. ఇది పొగ త్రాగేవారు లేదాబొగ్గు గనుల్లో పనిచేసే వారికి వస్తూ ఉంటుంది. రస్టీ రంగు (లేదా పాత రక్తపు రంగు) అనేది దీర్ఘకాలిక వూపిరి తిత్తుల వ్యాధిని సూచిస్తుంది. ఎరుపు రంగు ఇన్ఫెక్షన్ లేదా కేన్సర్ వంటి రోగాన్ని సూచిస్తుంది .12,13 

గ్గులలో అంటువ్యాధులు  :

క్రూప్ అనేది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో వచ్చే వైరల్ కు సంబంధించిన సంక్రమణ వ్యాధి. ఇది వాయునాళం, స్వరపేటిక మరియు వాయు మార్గాల వాపు కారణంగా మొరిగి నట్లుగా ధ్వనితో వచ్చే దగ్గు, మరియు ధ్వనితో కూడిన శ్వాస ఏర్పడుతూ ఉంటుంది. రాత్రి సమయాల్లో పరిస్థితి అధ్వాన్నంగాఉంటుంది. సాధారణంగా 2 నుండి 5 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ  కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు.14,15

 కోరింత దగ్గు: ఇదిబ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన అత్యంత అంటుకునే స్వభావం కల శ్వాసకోశ సంక్రమణ వ్యాధి. ఇది ఫ్లూ వంటి  లక్షణాలతో కూడి 6 నుంచి 8 వారాల వరకు ఉంటుంది. టీకాల ద్వారా దీనిని నివారించవచ్చు. టీకాలు వేయడానికి ముందు పసిపిల్లల్లో ఇది వస్తుంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా లేదా క్షీణించిన వాళ్లలో లేదా వృద్ధాప్యము ఉన్న వాళ్లలో ఇది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. 16,17 

3. దగ్గుకి చికిత్స

దగ్గు అనేది వ్యాధి కాదు ఇది అంతర్లీనంగా ఉన్న శ్వాసకోశ వ్యవస్థ యొక్క రుగ్మత యొక్క సాధారణ లక్షణము.18  తీవ్రమైన దగ్గు పక్కటెముకలు మరియు ఛాతిలో నొప్పికలిగించడం, నిద్రలేమి, తలనొప్పి, వాంతులు ఇంకా మూత్రం ఆపుకోలేని స్థితిని కలిగిస్తుంది. దగ్గు తీవ్రంగా ఉండి మూడు వారాల కన్నా ఎక్కువ కాలం కొనసాగినా కఫంలో రక్తం పడుతున్నా, గాలి తక్కువగా పీల్చుకుంటున్నా లేదా ఊపిరి తీసుకోవడంలో కష్టం ఉన్నా, ఛాతీలో నొప్పి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.4-6   అభ్యాసకుడు వ్యాధికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేసి దగ్గు గురించి నిర్ధారణకు రావాలి. 18    

కొన్ని గృహ చిట్కాలు:

  • తడి దగ్గు నివారణకు ఆవిరిపట్టడం, ఉప్పు నీటిని పుక్కిలించి వేయడం ద్వారా గొంతుకు ఉపశమనం కలుగుతుంది. అలాగే తగినంత నీరు తీసుకోవడం ద్వారా లోనున్న టాక్సిన్స్ బహిర్గతమవుతాయి. 21

  • అల్లం రసాన్ని గోరువెచ్చగా చేసి దానిలో తేనె కలుపుకుని తాగడం ద్వారా ఇది సహజ సిద్ధమైన హెర్బల్ కాఫ్ సిరప్ గా పనిచేస్తుంది.19

  • థైమ్ మరియు ఐవి ఆకుల నుండి తయారైన హెర్బల్ దగ్గు సిరప్ తీవ్రమైన బ్రోన్కైటిస్ కుప్లేసిబో సిరప్ కంటేకూడా వేగంగా ఉపశమనం ఇస్తుందని కనుగొనబడింది. 21 థైమ్ అనేది జర్మనీ లో అధికారికంగా ఆమోదింపబడిన దగ్గు చికిత్సా నివారిణి22 . మార్ష్ మాలో వేరును ఈ దగ్గు సిరప్ కు జోడించడం ద్వారా మరింత సమర్థవంతంగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుందని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. అయితే ఈ వేరు కారణంగా తేలికపాటి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎక్కువ ద్రవాలు తీసుకోవడం ద్వారా దీన్ని సులభంగా నివారించవచ్చు. 21

  • నల్లమిరియాలు (½  స్పూను) నేతితో కలిపి భోజనం చేసిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు సేవించడం ద్వారా ఛాతీలో ఉండే ఒత్తిడి నివారించవచ్చు. 20

  • తులసి ఆకుల మరియు అల్లం రసానికి కొంచెం తేనె చేర్చి హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా త్వరగా రికవరీ అవడానికి తులసి ఆకులను నోటిలో వేసుకొని రసాన్నిరోజంతా మింగుతూ ఉండవచ్చు.19

  • ప్రతీ ఒక్కటి  ¼ టీ స్పూన్చొప్పున ములతీ, దాల్చిన చెక్క,లవంగాల పొడి మరియు తేనె అన్నీ కలిపి దేనితో తయారు చేసిన గోరువెచ్చని టీ రోజుకు రెండుసార్లు సేవిస్తే అది అద్భుతాలు సృష్టిస్తుంది. 20

  • తేనె మరియు నిమ్మరసం తో కూడిన ఆవిశ గింజల టీ కూడా చాలా బాగా పనిచేస్తుంది.2

  • పెన్ స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ వారు 2007లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ కన్నా తేనె అత్యంత ఉత్తమమైనది.20 ముడి తేనె దగ్గుకు చాలా ఉత్తమ ఔషధంగా పరిగణింప బడుతుంది. తేనెను గోరువెచ్చని ద్రవాలతో మాత్రమే  ఉపయోగించాలి. బాగా వేడిగా ఉన్న నీటితో లేదా వేడి పాలతో ఉపయోగించకూడదు. 23  

చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్ర ద్ధ : దగ్గు అనేది చిన్న పిల్లల విషయంలో సాధారణమైన సమస్య అయితే దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పిల్లలలో ఆరు సంవత్సరాలు వచ్చే వరకూ లక్షణాల రీత్యా దగ్గు ఉపశమనం కోసం మందులు వాడాలి. ఈ విషయంలో చేయబడిన అధ్యయనాలు పైవిషయానికి మద్దతు ఇవ్వడం లేదు. యాంటీబయాటిక్స్  వైరల్ ఇన్ఫెక్షన్స్ పై ప్రభావం చూపు తాయి. పైగా అవి కలిగించే సైడ్ ఎఫెక్ట్లు దగ్గు కన్నా కూడా మరింత బాధకలిగించే దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కనుక ఈ విషయంలో ఖచ్చితమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ఆవశ్యకం. 18,24,25   

పిల్లల కోసం కొన్ని నిర్దిష్ట గృహ సంరక్షణ చిట్కాలు :

  • ఆవిరి చికిత్స చేయడం తర్వాత విశ్రాంతిని ఇవ్వడం అనేది ఉత్తమమైన ఎంపిక .27

  • అర కప్పు దానిమ్మ రసంలో పిప్పలి లేదా పొడవైన మిరియాలు మరియు అల్లం లేదా మిరియాల పొడి కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా అద్భుత నివారణగా పనిచేస్తుంది.20

  • ఆపిల్ సైడర్ వెనిగర్ తో అల్లాన్ని చితక్కొట్టి చేసిన రసం దగ్గును చక్కగా నయం చేస్తుంది. నిమ్మకాయ ముక్కను పీల్చడం వలన కూడా ఉపశమనం ఇస్తుంది. 27

  • పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల దిండు ను పైకి ఉంచి తలను కొంచెం ఎత్తుగా ఉండేట్లు చేయవచ్చు. అయితే ఒకటిన్నర సంవత్సరం లోపు పిల్లల విషయంలో దిండు లేకుండానే నిద్రించటం అనేది అవసరం.28

  • సంవత్సరం దాటిన పిల్లల విషయంలో దగ్గు కోసం తేనెను 2.5 మిల్లీ లీటర్లు వారు నిద్రించడానికి ముందు సింగిల్ డోస్ గా ఇవ్వడం అనేది చక్కని ఉపశమనం ఇచ్చే  సిఫార్సు చేయబడిన ఔషధంగా స్వీకరించవచ్చు. 26 అయితే సంవత్సరంలోపు పిల్లలకు, శిశువులకు  ఇవ్వడం బోటులిజం అనే బ్యాక్టీరియా సంక్రమణకు కారణం అవుతున్నందున  వీరికి ఇవ్వకుండా ఉండటం మంచిది. 27,28

4. నివారణ మరియు జాగ్రత్తలు

త్వరగా జలుబు మరియు దగ్గుకు గురి అయ్యే లక్షణాలు గల వ్యక్తి ప్రారంభం నుండి కూడా దాని తీవ్రతను నివారించడానికి తగిన గృహ చిట్కాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది .

  •  సహజమైన యాంటీబయాటిక్ గా చెప్పబడే పసుపు లేదా తేనెతో కలిపిన వెచ్చని పాలు లేదా నీళ్ళు నిద్రించడానికి ముందు సేవించడం. ఒక టీస్పూన్ పసుపు పొడి తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు సేవించవచ్చు.19  

  • ప్రతీ ఉదయం హార్ట్ – లీవుడు మూన్ సీడ్ (గిలోయి) రసం నీటితో రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అలాగే ఆయుర్వేదం లో చెప్పబడిన వాత, పిత్త, కఫ అనబడే మూడు దోషాలను సమతుల్యం చేయటానికి పయోగపడుతుంది.20 

 సాధారణ జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం కోసం మునుపటి వార్తా పత్రికలో ఇచ్చినటువంటి గృహ చిట్కాలను అనుసరించ వచ్చు.29 వయసు మళ్ళిన వారిలో దగ్గుకు ప్రధాన కారణం ఎసిడిటీ లేదా ఆమ్లత్వం. సరైన జీవనశైలి, సరైన ఆహారం మరియు  వ్యాయామం ద్వారా దీనిని నిరోధించవచ్చు. 30

ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా నివారణ : సరైన  పరిశుభ్రతా అలవాట్ల ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేయకుండా నిరోధించవచ్చు. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు మందమైన టిష్యూ పేపర్ లేదా కాటన్ క్లాత్ ఉపయోగించాలి మరియు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.29 టిస్యూ పేపరయితే వదిలివేయాలి, పునర్వినియోగ వస్త్రాన్నివాడితే దానిని శుభ్రంగా ఉతకాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే అతి తక్కువ సమయంలో జలుబుకు సంబంధించిన తుంపర్ల ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా అజాగ్రత్త కారణంగానే జలుబు, దగ్గు వేగంగా వ్యాపిస్తాయి..

ముందస్తు చర్యల్లో భాగంగా అనారోగ్యంతో ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు నివారించడం, అనారోగ్య సమయంలో ఇంట్లోనే ఉండటం, ముక్కు మరియు నోటిని బట్టతో కప్పి ఉంచుకోవడంమంచిది. కళ్ళు, ముక్కు , నోరు వంటివి క్లాత్ వంటివి ఏమీ లేకుండా తాకకుండా ఉండటం మంచిది. అలాగే తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ధూమపానం చేసే వారు మద్దతు సమూహాలు లేదా నెట్వర్క్ ల సహాయంతో ఆ అలవాటును మానివేయవచ్చు.

సాయి వైబ్రియానిక్స్వైబ్రియానిక్స్ రెమిడీ ల ద్వారా  దగ్గు తీవ్రతను తగ్గించవచ్చు లేదా రాకుండా నివారించ వచ్చు. CC4.10     Indigestion, CC9.2 Infections acute, CC19.1 Chest tonic, CC19.2 Respiratory allergies, CC19.6 Cough chronic, CC19.7 Throat chronic, లేదా 108 CC బాక్సు నుండి తగిన నివారణ  NM8 Chest, NM9 Chest TS, NM37 Acidity, NM46 Allergy-2, NM54 Spasm, NM62 Allergy-B, NM70 CB9, NM71 CCA, NM73 Croup, NM76 Dyspnoea, NM92 Post Nasal Drip, లేదా 576 కార్డుల నుండి తగిన కార్డుల ను ఎంపిక చేయవచ్చు.31

రిఫెరెన్స్ కోసం వెబ్సైట్ లింకులు:

  1. http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf Sathya Sai Speaks,vol.15,21 Good health and goodness, 30 Sept.1981
  2. What is cough & its nature: https://www.nhlbi.nih.gov/health-topics/cough;https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2532915/
  3. https://medlineplus.gov/cough.html     
  4. https://www.mayoclinic.org/symptoms/cough/basics/definition/SYM-20050846https://www.mayoclinic.org/diseases-conditions/chronic-cough/symptoms-causes/syc-20351575?p=1
  5. Causes of cough: https://www.health.com/health/gallery/0,,20358279,00.html
  6. Types of cough: https://www.health24.com/Medical/Cough/Overview/Types-of-cough-20120721
  7. https://www.nhsinform.scot/illnesses-and-conditions/lungs-and-airways/cough
  8. Psychological cause of cough: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5357770/
  9. Mucus, phlegm, sputum:  https://www.medicinenet.com/what_is_mucus/article.htm
  10. https://www.everydayhealth.com/cold-flu/everything-you-ever-wondered-about-mucus-and-phlegm.aspx
  11. https://en.wikipedia.org/wiki/Phlegm
  12. Colour of phlegm: https://www.healthline.com/health/green-phlegm
  13. https://wexnermedical.osu.edu/blog/what-does-the-color-of-your-phlegm-mean
  14. Croup cough in children: https://www.healthline.com/health/croup#symptoms  
  15. https://www.mydr.com.au/respiratory-health/croup-symptoms-and-treatments
  16. Whooping cough: https://www.mayoclinic.org/diseases-conditions/whooping-cough/symptoms-causes/syc-20378973
  17. https://www.nhs.uk/conditions/whooping-cough/
  18. Pertinent questions on cough: https://www.ncbi.nlm.nih.gov/books/NBK359/
  19. Home remedies for dry cough from online information guide launched by the Government of India:http://vikaspedia.in/health/ayush/ayurveda-1/ayurveda-for-common-disease-conditions/is-dry-cough-keeping-you-awake-find-relief-through-ayurveda
  20. Home remedies: https://food.ndtv.com/health/6-best-home-remedies-for-cough-to-give-you-instant-relief-1445513
  21. https://www.medicalnewstoday.com/articles/322394.php
  22. https://www.rd.com/health/wellness/natural-cough-remedies/
  23. https://www.slideshare.net/BhimUpadhyaya/food-body-by-sadhguru
  24. 2011 study on Handling cough of children: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3056681/
  25. 2017 study on chronic cough in children: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5427690/
  26. Honey for cough in children:  https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4264806/
  27. Specific home care for children: https://parenting.firstcry.com/articles/35-safe-home-remedies-for-cough-in-children/
  28. https://www.healthline.com/health/parenting/toddler-cough-remedy#home-remedies
  29. Sai Vibrionics Newsletter, Precautions and Home remedies for Combating Common Cold, paras 4 & 5, Vol 9 Issue 6
  30. Sai Vibrionics Newsletter, Health Tips on Acidity – Nip it in the bud, Vol 8 Issue 4.
  31. Soham Series of Natural Healing, Volume 5, The Diseases, Coughs, p.79. Also refer to volume 3, and Vibrionics 2018, p.116

 

2.  రిఫ్రెషర్ సెమినార్, వెస్ట్ లండన్, యుకె, 6 జనవరి 2019

15మంది సభ్యులు పాల్గొన్న ఈ సదస్సు ఉత్సుకత వాతావరణంలో కొనసాగించడానికి వీలుగా ఒక చిన్న ధ్యాన ప్రక్రియతోనూ, ప్రార్ధన తోనూ ప్రారంభం అయింది. ప్రాక్టీషనర్  02799 విలువలతో కూడిన పంట పండించడానికి స్వామికి పూర్తిగా శరణాగతి చేయాలని నొక్కి చెబుతూ సదస్సును ప్రారంభించారు. ఎస్.వి.పి. కోర్సు చేయడానికి మరిన్ని ఎక్కువ చికిత్స విధానాల అవకాశాలను ఎలా అందిస్తుందో ఆమె వివరించారు. ఉదాహరణకి శరీరంలోని ద్రవాలు ఉపయోగించి నోసొడ్ల తయారీ ఎన్నో చోట్ల తయారీ అలర్జెన్స్ఉపయోగించి వ్యక్తిగత నివారణలు తయారీ అల్లోపతిమందుల దుష్ప్రావాల నివారణకు పోటెన్టైజ్చేయడం వంటివి వివరింపబడ్డాయి. ఎస్.వి.పి. కోర్సు దరఖాస్తుదారులు పరిపాలన విధులను చేపట్టడం ద్వారా వైబ్రియానిక్స్ పట్ల మరింత ఎక్కువ నిబద్ధత ప్రదర్శించాల్సిఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఒకే సమయంలో ఒకే వ్యాధికి చికిత్స చేయడం యొక్క ప్రాముఖ్యత చెప్పబడింది. విజయవంతమైన కేసులను పంచుకునేటప్పుడు కేస్ హిస్టరీ పూర్తి వివరాలతో సమర్పించవలసిన అవసరం గురించి కూడా చెప్పబడింది. 108 సి సి బాక్స్ లోని ద్రవ నివారణలు మబ్బుగా లేదా మేఘావృతం అయినట్టుగా ఉంటుందని బహుశా శీతల వాతావరణం కారణంగా ఇలా ఉండవచ్చని గుర్తించబడింది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోడానికి ఎలా సిద్ధమవవ్వాలో గుర్తించడం జరిగింది.

సదస్సులో పాల్గొన్న వారు తాము తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరాన్ని చర్చించారు. అప్పుడు మాత్రమే ఒక అభ్యాసకుడు రోగులకు తగు విధంగా మార్గ నిర్దేశం చేయగలడు. తాజా పండ్లు మరియు కూరగాయలు మరియు వాటి రసాలు మరియు మొరింగా (మునగ)  వంటి ఆకుకూరలపైన ఆధారపడాలని సూచింపబడింది. మాంసాహార ఆహారాలకు దూరంగా ఉండటం మరియు ఐదు తెల్లని పదార్ధాలు శుద్ధి చేసిన బియ్యం, పాలు, రిఫైన్ఉప్పు, మైదాపిండి, పంచదార అనే  ఈ ఐదు పదార్థాల నుంచి దూరంగా ఉండి ప్రత్యామ్నాయాలతో వీటిని భర్తీ చేసుకోవడం ద్వారా జీర్ణకోశ ఇబ్బందులు నొప్పులు మరియు క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందని గుర్తించబడింది. ప్రాక్టీషనర్ 03541 తన అనుభవాన్ని వివరిస్తూ ఈ ఐదు పదార్ధాలను పూర్తిగా వదలడం వల్ల తను దంతాల నొప్పి నుండి నివారణ అవడమే కాక ఒక వారంలోనే జీర్ణ వ్యవస్థ మెరుగుపడింది మరియు  దీర్ఘకాలిక వెన్నునొప్పి దాదాపుగా మాయమైంది అని చెప్పారు. 108 సి సి బాక్స్ రీఛార్జి చేసిన తర్వాత తారీకు నమోదు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సు స్వామికి హారతి సమర్పించడంతో ముగిసింది.

 

 

 

 

 

 

 

 

 

3. ధర్మక్షేత్ర, ముంబై, ఇండియా లో  రిఫ్రెషర్ వర్క్ షాప్, 9 ఫిబ్రవరి 2019

36 మంది అభ్యాసకులు హాజరైన  అత్యంత విలువైన సమాచారం మరియు ఇంటర్ యాక్టివ్ కోర్సుఅందించే సదస్సు సీనియర్    వై బ్రియానిక్స్ టీచర్ 10325. ఆధ్వర్యంలో ప్రారంభం అయింది. కొత్తగా వచ్చినటువంటి ఎ. వి. పి. మాన్యువల్‌ ప్రతి అధ్యాయాన్ని స్పృశిస్తూ ఇటీవల వచ్చిన నవీ నీకరణలను నొక్కి చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన అభ్యాసకులకు మార్గ దర్శకత్వం వహించడం వంటి కార్యక్రమం గురించి పాల్గొన్నవారికి తెలియజేయడం జరిగింది. కొన్ని ముఖ్య సూచనలు ( టేక్ హోమ్ పాయింట్లు) క్రింది విధంగా ఇవ్వబడినవి. తక్కువ పనులకు కట్టుబడి ఎక్కువ పని చేయడం లేదా తక్కువ పనులను ఎంచుకొని సమర్థవంతంగా నిర్వహించడం, వైబ్రియానిక్స్ విషయంలో స్వామికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండడం. వైబ్రియానిక్స్ కొoబోలు చాలా  శక్తివంతమైనవి కాబట్టి చికిత్స వేగవంతం చేయడానికి తగిన కొంబోలను ఇవ్వాలి. ఎక్కువగా కాకుండా నిర్దేశించిన కొంబోలను మాత్రమే ఇవ్వాలి. వ్యాధి నివారణ తర్వాత క్రమ పద్ధతిలో మోతాదును తగ్గించడం, అలాగే ప్రక్షాళన, ఇమ్యూనిటి కొంబొలు నియమ బద్ధంగా రోగికి ఇవ్వడం (అయితే ఈ విషయంలో మొదట ప్రాక్టీషనర్ అనుసరించాలి). రోగి యొక్క రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించడం, వివరాలను వెంటనే నివేదించడం, అలాగే విజయవంతమైన కేసులు ప్రచురణ కోసం నివేదించడం మరియు వైబ్రియానిక్స్ సoస్థను బలోపేతం చేయడానికి పరిపాలన బాధ్యతలు తీసుకోవాలని ఈమె అభ్యాసకులకు సూచించారు.

పుట్టపర్తి నుండి డాక్టర్ అగర్వాల్ గారు వాట్సాప్ ద్వారా చేసిన ప్రసంగంలో ఇటీవల వైబ్రియానిక్స్ పెరుగుదల గురించి మాట్లాడుతూ స్వామి ఏ విధంగా 2007వ సంవత్సరం పుట్టపర్తి బయట మొట్ట మొదటి సారిగా మహారాష్ట్ర నుండి ప్రారంభించిన సదస్సులను ప్రేరేపించి  ఆశీర్వదించారు మరియు మార్గనిర్దేశం చేశారు అనేది తెలియచేశారు. ప్రేమ మరియు కరుణ సేవకు రెండు స్తంభాల వంటివని అవి రోగులకు ఉత్తమ ఫలితాలు ఇస్తాయని చెప్పారు.

మహారాష్ట్రలోని సాయి సంస్థ యొక్క గత మరియు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుల మద్దతు పొందటం, విశేషమనిచెప్పారు. అభ్యాసకులు చేసిన అమూల్యమైన సేవలు అభినందిస్తూ తమ రాష్ట్రంలో వైబ్రియూనిక్స్ ను ముందుకు తీసుకువెళ్లడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసిన విషయం చెప్పారు. పునరుద్ధరించిన ఉత్సాహంతో సేవలను అందించడానికి సదస్సు, అభ్యాసకులను ఎంతో ప్రేరేపించింది.

 

 

 

 

 

 

 

 

Om Sai Ram