ప్రశ్నలు జవాబులు
Vol 10 సంచిక 2
March/April 2019
1. ప్రశ్న: రెమిడీ బాటిల్ను” 8 “ ఆకారంలోనే తొమ్మిది సార్లు ఎందుకు కదిలించాలి ?
జవాబు: 8 ఆకారము అనంతత్వము, శాశ్వతత్వం మరియు ఎప్పటికీ అంతం కాని అవకాశాలను సూచిస్తుంది. ఇది బైబిల్ ప్రకారము పునరుద్ధానము మరియు పునరుత్పత్తి ని సూచిస్తుంది. ఇది కదిపే ప్రక్రియకు ఆధ్యాత్మికతను జోడిస్తుంది.
భౌతిక స్థాయిలో చూసినట్లయితే 8 అంకెలో రెండు సున్నాలు ఉంటాయి. వృత్తాకార కదలికలో మాత్రలు కదిలినప్పుడు ఉత్పత్తి చేయబడిన సెంట్రిఫ్యుగల్ ఫోర్స్ మాత్రలు ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయేలా చేస్తుంది. నివారణ చుక్క నుండి వచ్చే వైబ్రేషన్ ప్రతీ మాత్రకు విస్తరిస్తుంది. అలా చేయకపోతే భూమి యొక్క గురుత్వాకర్షణ కారణంగా కింది స్థాయిలో ఉన్న మాత్రలే వైబ్రేషన్ సేకరిస్తాయి. కదపటం అంత ప్రభావవంతంగా ఉండదు. మాత్రలు బాగా కలపడానికి తొమ్మిదిసార్లు సరిపోతుంది. 9 అనేది ఎప్పటికీ దివ్యమైన సంఖ్యగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే ఇది ఎప్పటికీ తగ్గిపోదు.
________________________________________
2. ప్రశ్న: అభ్యాసకుడు రోగి యొక్క నోటిలో మొదటి మాత్రను ఎందుకు ఉంచాలి ?
జవాబు: అభ్యాసకుడు వైబ్రియానిక్స్ పట్ల 100% విశ్వాసం కలిగి ఉంటాడు మరియు తన రోగులను ప్రేమ మరియు కరుణతో చూస్తాడు. రోగి అనారోగ్యంతో ఉన్నప్పుడు నయం చేసే కంపనాలను స్వీకరించే ఆ విశ్వాసం లేదా గ్రహణ శక్తి అతడు కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. మొదటి మాత్ర రోగి నోట్లో పెట్టినప్పుడు వైద్య ప్రక్రియ ప్రారంభించబడుతుంది. రోగి అభ్యాసకుడు మరియు దైవం మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఒక త్రిభుజం ఏర్పడుతుంది. దైవం నుండి ఈ నయం చేసే శక్తి రోగికి అభ్యాసకుడి ద్వారా ప్రవహిస్తుంది. రోగి మొదటి మోతాదు ను తీసుకోవడానికి ఇష్టపడితే మాత్రం రెమిడీ బాటిల్ మూతలో వేసి రోగికి ఇవ్వవచ్చు. ఇక్కడ రోగి యొక్క సౌకర్యము మరియు సౌలభ్యాన్ని పరిగణన లోనికి తీసుకోవడం చాలా ముఖ్యం. రెమిడీ పోస్టు ద్వారా పంపబడితే రోగి ప్రాక్టీషనర్ కు రింగ్ చేయవలసి ఉంటుంది. అభ్యాసకుడు ప్రార్థన చేస్తూ దైవానికి అనుసంధానింపబడి రోగిని మొదటి మాత్ర తీసుకోవాల్సిందిగా సూచిస్తారు.
________________________________________
3. ప్రశ్న: రోగి మనసులో భయాందోళనలు రేకెత్తకుండా రేడియేషన్ మూలాలు అయిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి దూరంగా ఉండవలసిందిగా ఎలా సలహా ఇవ్వగలను?
జవాబు: మనం ఇచ్చే నివారణపై రేడియేషన్ యొక్క తటస్థీకరణ ప్రభావం గురించి హెచ్చరించడం అత్యవసరం అనడంలో సందేహం లేదు. అయితే ఇది రేడియేషన్ మూలంతో ప్రత్యక్ష సంబంధం లో ఉండకూడదని కొంత దూరం (సుమారు 30 సెంటి మీటర్లు లేదా పన్నెండు అంగుళాలు దూరం )ఉండేలా జాగ్రత్త వహించమని ఆ వ్యక్తికి సున్నితమైన, స్నేహపూర్వక మైన విధానంలో చెప్పాలి. తటస్థీకరణ అనే పదాన్ని ఉపయోగించకుండా ప్రభావాన్ని తగ్గించడం అని చెప్పవచ్చు. నివారణ సురక్షితంగా ఉంచడానికి వివిధ సరళమైన మార్గాలు సూచించడం మంచిది. ఉదాహరణకు మొబైల్ ను, రెమిడీ ని వేరు వేరుగా జేబుల్లోఉంచడం, ఇంట్లో అయితే దేవుడు ఉండే గదిలో లేదా పూజ మందిరంలో ఉంచమని చెప్పవచ్చు.
________________________________________
4. ప్రశ్న: 108 సీసీ బాక్స్ నుండి ఒకే బాటిల్ లో ఉన్న మాత్రలకు అనేక చుక్కలు జోడించాలి అనుకున్నప్పుడు మాత్రలు ముద్దగా కాకుండా ఎలా నిరోధించగలము?
జవాబు:: మాత్రలు ముద్దుగా కాకుండా ఉండటానికి బాటిల్ ను కలుపుతూ చివరి చుక్క వేసిన తర్వాత 8 ఆకారంలో బాటిల్ ను కదపాలి. మరొక పద్ధతి ఏమిటంటే ఒక కాళీ బాటిల్ లో మనం ఉపయోగించ తలచిన చుక్కలన్నింటినీ వేసి దాని నుండి ఒక చుక్కను వేసుకోవడం. అయితే మా పరిశోధన విభాగం వారు పదే పదే నొక్కి చెప్పిన ఈ విషయాన్ని బట్టి రోగి యొక్క వ్యాధి లక్షణాలకు చికిత్స చేయడానికి ఎంచుకునే రెమిడీ ల సంఖ్యను పరిమితం చేయడం ద్వారానూ మరియు ఈ వ్యాధి పరిస్థితి మూలకారణమైన సమస్యను గుర్తించి దాని చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మరింత వేగంగా నివారణ జరుగుతుంది. చికిత్స కోసం రోగికి సహాయపడతాయేమో అని ఆశించి ఎక్కువ రెమిడీ లను చేర్చడం, వ్యాధి నివారణ ప్రక్రియను ఆలశ్యం చేస్తుంది. ఎందుకంటే అవి నిజంగా అవసరమయ్యే కాంబో యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి.
________________________________________
5. ప్రశ్న : నేను 10 మిల్లీ లీటర్ల బాటిల్ కు, ఎంచుకున్న కాంబో నుండి ఒక చుక్కను కలుపుతాను. ఒకవేళ 20 మిల్లీలీటర్ల బాటిల్ లో కాంబో చేర్చవలసి నప్పుడు బాటిల్ లో రెండు చుక్కలు వేయడం అవసరమా ?
జవాబు: 20 మిల్లీలీటర్ల బాటిల్ లోని మాత్రలకు కూడా ఒక చుక్కను జోడిస్తే సరిపోతుంది. వైబ్రేషన్ అనేది ప్రాధమికంగా స్వచ్ఛమైన శక్తి. ఇది గుణాత్మక స్థాయిలో పని చేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ చుక్కలు పొరపాటున దానిలో పడినందువలన పరిహారం ప్రభావితం కాదు. ప్రతి మాత్రకు తగిన వైబ్రేషన్ పొందడానికి వీలుగా బాటిల్ కదపడం అనేది ప్రధానమైన అంశం.
________________________________________
6. ప్రశ్న: ఎస్ ఆర్ హెచ్ వి పి ద్వారా కంపనాలు ప్రసారం చేయడానికి ముందుగా రోగి యొక్క అనుమతి తీసుకోవడం విధిగా అవసరమా?
జవాబు: స్వామి ఆశీర్వదించినపోటెంటైజర్ ను మనం ఉపయోగిస్తున్నందు వలన ఇది తప్పనిసరి అని మేము భావించము. ఈ పోటెన్తైజర్ ఎల్లప్పుడూ దైవిక ప్రకంపనలు (రోగికి స్వస్థత చేకూర్చే సానుకూల ప్రకంపనలు)మాత్రమే ప్రసారం చేస్తుందని స్వామి చెప్పారు. ఈ ప్రసార ప్రక్రియ అనేది స్వచ్ఛమైన హృదయం నుండి ఆవిర్భవించిన ప్రార్థనతో సమానము. అభ్యాసకుని యొక్క సంకల్పము అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినఅంశము. చికిత్సను సులభతరం చేయడము కోసం అభ్యాసకుడు తన ఉద్దేశం రోగికి (లేదా అతని సంరక్షకుడికి) తెలిపినప్పుడు వైద్యకంపనాలను స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉంటారు.