Vol 17 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2026
అవలోకనం
డా. జిత్ అగ్గర్వాల్ డెస్కు నుండి
డాక్టర్ జిత్ అగర్వాల్ శతజయంతి సంవత్సరంలో సాధించిన ముఖ్యమైన మైలురాళ్లు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అలాగే భక్తి నవవిధ మార్గాలలో అత్యంత ముఖ్యమైనదైన సేవ పట్ల మన రోజువారీ అంకితభావం ద్వారా స్వామి ప్రేమను ఎలా వ్యక్తపరచవచ్చో హృదయపూర్వక కృతజ్ఞతతో వివరిస్తున్నారు. అదనంగా, SRHVP మరియు 108 కామన్ కాంబో (108CC) పెట్టెల కోసం ప్రవేశపెట్టిన కొత్త నంబరింగ్ విధానం గురించి, అలాగే జనవరి 26ను వైబ్రియానిక్స్ దినోత్సవంగా అర్థవంతంగా ఎలా ఆచరించాలో కూడా వివరించారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
తలనొప్పి, మసక దృష్టి; పాదాలలో నొప్పి, వాపు, రంగు మారడం; చేతుల్లో నొప్పి, మొద్దుబారడం, GERD; మోకాళ్లు, కాలి పిక్కల కండరాలలో నొప్పి; మలబద్ధకంతో కూడిన ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్; మద్యపాన వ్యసనం; అల్ప రుతుస్రావం (హైపోమెనోరియా), అండాశయ తిత్తి; మోకాళ్ల ఆస్టియోఆర్థ్రైటిస్; మరియు శ్వాసకోశ అలర్జీకి సంబంధించిన తొమ్మిది ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
ప్రేరణనిచ్చే ఇద్దరు ప్రాక్టీషనర్ల అనుభవాలను చదవండి. మొదటివారు స్లోవేనియాకు చెందినవారు. 2002 నుండి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్‌గా సేవలందిస్తూ, సేవాభావంలో నిలకడగా నిలిచి, అపారమైన ధైర్యానికి ప్రతిరూపంగా, స్వామి అనంత ప్రేమపై అచంచల విశ్వాసంతో, ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను మరియు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ సాగిన తన వైబ్రియానిక్స్ ప్రయాణాన్ని స్మరించుకుంటున్నారు. రెండవవారు భారతదేశానికి చెందినవారు. ఇంజినీర్‌గా ప్రారంభించి రైతుగా మారిన ఆయన, వైబ్రియానిక్స్‌పై తన విశ్వాసంతో కూడిన స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని పంచుకుంటున్నారు. పంటలు, పశువులు, కరుణ కలిసే పొలాల్లో 2023లో ప్రారంభమైన తన హృద్యమైన సేవా ప్రయాణాన్ని ఆయన మనతో పంచుకుంటున్నారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
ఈ సంచికలో తెలుసుకోండి: రోగి ఇప్పటికే నోటి ద్వారా తీసుకునే రెమెడీలు వాడుతున్నప్పుడు, అదే సమయంలో ఆ రెమెడీని బ్రాడ్‌కాస్ట్ చేయడం వల్ల స్వస్థత ప్రక్రియ మరింత బలపడుతుందా; బాబా చిత్రపటం నుండి ప్రత్యక్షమైన అమృతం లేదా తేనెను తనకు లేదా ఇతరులకు స్వస్థత కోసం పొటెన్టైజ్ చేయవచ్చా; వైబ్రియానిక్స్‌లో రోజుకు మూడు సార్లు (TDS) ఇచ్చే మోతాదు, 1M లేదా 10M వంటి అధిక పొటెన్సీలో తయారైన రెమెడీకి చాలా ఎక్కువా, సురక్షితమా, లేక అవసరమైనదా; రోగుల పట్ల గాఢమైన సానుభూతి కలిగి, వారి బాధను తామే అనుభవించే (Sympathetic Resonance) సున్నిత స్వభావం గల ప్రాక్టీషనర్లు, రోగులను కలిసే ముందు, కలుస్తున్న సమయంలో, మరియు తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి; అలాగే వేపింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ఎలా నివారించాలి, రోగిని ఆ వ్యసనం నుండి ఎలా బయటపడేయాలి, వేపింగ్ ఆవిరిని పొటెన్టైజ్ చేయవచ్చా, చేస్తే ఎలా?
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
స్వామి, మనం ఆహారాన్ని ఎందుకు గౌరవంగా స్వీకరించాలి, దానిని ఎలా ఆదరించి భుజించాలి, అలాగే సేవలో నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటో ప్రేమపూర్వకంగా బోధిస్తున్నారు!
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో జరగనున్న ప్రాక్టీషనర్ల గ్రూప్ సమావేశం, అలాగే భారతదేశంలోని పుట్టపర్తిలో నిర్వహించబడనున్న వర్క్‌షాప్‌ల వివరాలు.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
“ఆరోగ్యాన్ని ఉన్నత స్థితికి చేర్చడంలో ఎసెన్షియల్ ఆయిల్స్ పాత్ర” అనే ఆరోగ్య వ్యాసం ఉంది. ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, ప్రయోజనాలు, క్యారియర్ ఆయిల్స్ పాత్ర, సురక్షిత వినియోగానికి మార్గదర్శకాలు, అలాగే వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ల కోసం ఆచరణాత్మక సూచనలు మరియు జాగ్రత్తలు వివరించబడ్డాయి. • నవంబర్ 2025లో నిర్వహించిన AVP వర్క్‌షాప్ సంక్షిప్త నివేదిక, అలాగే భగవాన్ శతజయంతి సందర్భంగా మా సమిష్టి ప్రత్యేక సమర్పణలైన మూడు పుస్తకాలు, పుట్టపర్తి ప్రశాంతి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన 10 రోజుల సేవా శిబిరం, హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు శిబిరాల వివరాలు మరియు చిత్రాలు ఉన్నాయి. • అనుభవాలు: డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి “రెండు రోజుల్లో జ్ఞాపకశక్తి పునరుద్ధరణ – ఒక వైబ్రియానిక్స్ అద్భుతం”, అలాగే “IB – మా జీవితాల్లో తాజా గాలి” అనే అనుభవ కథనం.
పూర్తి వ్యాసం చదవండి