Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 17 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2026


1. ఆరోగ్య వ్యాసము

ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మౌలికమైన నూనెల పాత్ర!

విశ్వమంతా భగవంతుని శరీరమే. దానిలోని ప్రతి అణువు, ప్రతి కణం భగవంతునితో, ఆయన మహిమతో, శక్తితో మరియు అవర్ణనీయమైన దివ్యత్వంతో నిండి ఉంది. మానవుడికి మరియు సృష్టికి మధ్య అసలు ఎటువంటి విరోధం లేదు. శిశువుకు తల్లి పాలపై ఎంత హక్కు ఉందో, తేనెటీగకు పువ్వుల తేనెపై ఎంత హక్కు ఉందో, అలాగే ప్రకృతి వనరులను అనుభవించడానికి మానవుడికీ హక్కు ఉంది. అయితే మితిమీరిన వినియోగం ఉండకూడదని మనిషి గ్రహించాలి.” శ్రీ సత్యసాయిబాబా¹                

1. మౌలికమైన నూనెలు లేదా ఎసెన్షియల్ ఆయిల్స్

ఎసెన్షియల్ ఆయిల్స్ (ఇకపై ఈ-ఆయిల్స్ అని సూచించబడతాయి) అనేవి మొక్కల నుండి పొందే సంక్లిష్టమైన సేంద్రియ సమ్మేళనాలు. ఇవి సహజసిద్ధంగా ఫైటోకెమికల్స్ ను (మొక్కలలో ఉండే జీవక్రియాశీల రసాయనాలు) సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ ఫైటోకెమికల్స్ వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్‌లు), మరియు పరాన్నజీవులు (పరాసైట్లు) వంటి హానికర సూక్ష్మజీవులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా వీటిని ఆవిరి స్వేదన పద్ధతి ద్వారా వెలికితీస్తారు. ఈ ప్రక్రియలో చాలా ఎక్కువ పరిమాణంలో మొక్కల పదార్థం అవసరమవుతుంది, అయితే తుది ఉత్పత్తిగా చాలా తక్కువ పరిమాణంలో నూనె మాత్రమే లభిస్తుంది. ఉదాహరణకు: సుమారు 25 కిలోల లావెండర్ పూలు కేవలం 100 గ్రాముల నూనె మాత్రమే ఇస్తాయి. అదే పరిమాణంలో నూనె పొందడానికి దాదాపు 500 కిలోల గులాబీ రేకులు లేదా లెమన్ బామ్ మొక్కలు అవసరమవుతాయి.

ఎసెన్షియల్ ఆయిల్స్ అత్యంత సాంద్రీకృతమైనవి, సుగంధభరితమైనవి కనుక ఇవి శక్తివంతమైన వృక్షాధార ఔషధాలుగా పరిగణించబడతాయి. ఇవి ఉత్పన్నమైన మొక్కల కంటే మరింత ఘనమైన సువాసనను కలిగి ఉంటాయి. అలాగే, వాటిలోని క్రియాశీల పదార్థాల సాంద్రత కూడా అధికంగా ఉంటుంది. చాలా చిన్న పరిమాణంలోని అణువులతో రూపొందినందున, ఇవి చర్మం ద్వారా సులభంగా శరీరంలోకి శోషించబడతాయి మరియు రక్తప్రవాహంలోకి వేగంగా ప్రవేశించి, శరీర స్వస్థత ప్రక్రియలకు తోడ్పడతాయి. సాధారణంగా ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నేరుగా తీసుకోవడం లేదా త్రాగడం కోసం మంచిదికాదు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా వాటిని తీసుకోవడం విషపూరిత ప్రభావాలను కలిగించవచ్చు.  వాటి అత్యంత సురక్షితమైన మరియు సాధారణ వినియోగ పద్ధతులు: బాహ్య వినియోగం తగిన విధంగా పలుచన చేసి చర్మంపై ఉపయోగించడం. అరోమాథెరపీ ప్రపంచంలో అత్యంత పురాతన సహజ చికిత్సా విధానాలలో ఒకటిగా పరిగణించబడే సుగంధ చికిత్స. ఈ రెండు పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీర-మనస్సుల సమతుల్యతను పెంపొందించడంలో సహాయపడతాయని భావించబడుతున్నాయి.¹⁻⁵

2. ఎసెన్షియల్ ఆయిల్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు మానవ శరీర నిర్మాణం  

సర్వ పదార్థాలు, మొక్కలు, జంతువులు మరియు మానవ శరీరం అన్నీ పరమాణువులు మరియు అణువులుతో నిర్మితమై ఉంటాయి. ఇవి నిర్దిష్టంగా కొలవగలిగే ఫ్రీక్వెన్సీల వద్ద కంపిస్తుంటాయి. వీటిని మాలిక్యులర్ వైబ్రేషన్స్ అని పిలుస్తారు. ఇవి హెర్ట్జ్ (Hz) లేదా సెకనుకు చక్రాలు (Cycles per Second) అనే ప్రమాణంలో కొలవబడతాయి. ఈ ఫ్రీక్వెన్సీలలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే, అది శారీరక లేదా రసాయనిక కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తారు.6-8

2.1 మానవ శరీరం యొక్క భౌతిక ఫ్రీక్వెన్సీ

భౌతికంగా కొలవగలిగే స్థాయిలో, ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రఫీ (EEG) అనే పద్ధతిని ఉపయోగించి మెదడు తరంగాల కార్యకలాపాలను పరిశీలిస్తారు. ఈ అధ్యయనాల ప్రకారం, మానవ శరీరం సాధారణంగా 4 నుండి 13 హెర్ట్జ్ (Hz) లేదా అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేస్తుంది. ఇది శరీర భాగం, భంగిమ మరియు శారీరక పరిస్థితిని బట్టి మారవచ్చు. మెదడు తరంగాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: డెల్టా  (0.1–3.5 Hz): గాఢ నిద్ర సమయంలో కనిపించే మెదడు తరంగాలు. థీటా  (4–8 Hz): ప్రశాంతమైన ధ్యానం మరియు ప్రార్థన సమయంలో కనిపించే తరంగాలు. ఆల్ఫా (8–12 Hz): ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉన్న స్థితిని సూచించే తరంగాలు. బీటా (13–30 Hz) ఆలోచనా మరియు జాగ్రదావాస్థ స్థితి.

పరిశోధనల ప్రకారం, అభ్యాసనము  లేదా శ్రద్ధ  సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులలో మెదడులోని కొన్ని ప్రాంతాల్లో 13 Hz బీటా తరంగాల కార్యకలాపం తగ్గి ఉండవచ్చు. దీని వల్ల క్రమబద్ధీకరణ సామర్థ్యం మరియు గణిత సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం  ప్రభావితమవుతాయి..6-8

2.2   కణస్థాయి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మరియు ఎసెన్షియల్ ఆయిల్స్

సహచర సమీక్ష జరపని కొన్ని అధ్యయనాలు ఎసెన్షియల్ ఆయిల్స్ అత్యంత అధిక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. వాటి ఫ్రీక్వెన్సీ 52 నుండి 320 మెగాహెర్ట్జ్ (MHz) వరకు ఉండవచ్చని పేర్కొనబడింది. ఈ ఫ్రీక్వెన్సీలు వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు మరియు ప్రతికూల భావోద్వేగాలు అభివృద్ధి చెందడానికి అనుకూలం కాని పరిస్థితులను సృష్టించవచ్చని భావింప బడుతున్నాయి. శ్వాస ద్వారా లేదా చర్మంపై రాసుకోవడం ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఎసెన్షియల్ ఆయిల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన వైబ్రేషనల్ స్థితిని ప్రోత్సహించవచ్చని భావిస్తున్నారు. ఉదాహరణకు:

గులాబీ నూనెకు సుమారు 320 MHz ఫ్రీక్వెన్సీ ఉందని తరచుగా ప్రస్తావిస్తారు. ఇది అరోమాథెరపీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, గులాబీ నూనె సువాసనను పీల్చడం వల్ల మెదడులోని గ్రే మ్యాటర్  పరిమాణం పెరిగినట్లు గమనించారు. ఇది జ్ఞాపకశక్తి మరియు మేధో సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని, అలాగే డిమెన్షియా లేదా మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించబడింది.7-10

2.3   వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మరియు ఆరోగ్యం

శరీరంలోని వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే, వ్యాధులకు గురయ్యే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఆరోగ్యవంతమైన మానవ శరీరంలోని సగటు కణస్థాయి ఫ్రీక్వెన్సీ సుమారు 62–72 MHz మధ్య ఉండవచ్చు. అది 58 MHz వరకు తగ్గితే, జలుబు మరియు ఫ్లూ వంటి సాధారణ అంటువ్యాధులకు గురయ్యే అవకాశం పెరుగుతుందని పేర్కొనబడింది. ఇంకా తగ్గిన ఫ్రీక్వెన్సీలు సిద్ధాంతపరంగా మరింత తీవ్రమైన వ్యాధులతో సంబంధం కలిగి ఉండవచ్చని భావిస్తారు. ఎసెన్షియల్ ఆయిల్స్ మొక్కలలోని రక్షణాత్మక మరియు ప్రయోజనకరమైన లక్షణాలను ఉపయోగించి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా  గుర్తుంచుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం ద్వారా మానవ కణాల లేదా శరీర వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ నేరుగా పెరుగుతుందని నిర్ధారించే బలమైన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. అందువల్ల ఈ అంశాలను శాస్త్రీయంగా నిర్ధారించబడిన వాస్తవాలుగా కాకుండా, పరిశోధనలో ఉన్న సిద్ధాంతాలు మరియు అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించాలి.7,8,11

3. జెన్షియల్ ఆయిల్స్ ప్రయోజనాలు

 అనేకరకాలైన ఎసెన్షియల్ ఆయిల్స్ వాపును తగ్గించడం, వికారం (నాజియా) మరియు నొప్పిని ఉపశమింప చేయడం, ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం, తలనొప్పులను తగ్గించడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మనోభావాలను ఉల్లాసపరచడం, పనిలో అప్రమత్తత మరియు పనితీరును మెరుగుపరచడం,   అలాగే ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించడం వంటి లక్షణాల కోసం గుర్తింపు పొందాయి. అయితే, ఈ ప్రయోజనాలు ఆయిల్స్‌ను ఎలా ఉపయోగిస్తున్నామన్న దానిపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. సరైన విధంగా ఉపయోగించినప్పుడు ఇవి సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అయినప్పటికీ, ఎసెన్షియల్ ఆయిల్స్ అత్యంత సాంద్రీకృతమైన వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్  మిశ్రమాలు. అందువల్ల విచక్షణారహితంగా ఉపయోగిస్తే చర్మ దురద, అలర్జీ లేదా ఇతర ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతాయి. ఒక్క చుక్క కూడా శక్తివంతమైన ప్రభావాన్ని చూపగలదు. కాబట్టి గరిష్ఠ ప్రయోజనాలను పొందేందుకు మరియు ప్రమాదాలను తగ్గించేందుకు సరైన డైల్యూషన్ లేదా పలుచబరిచే ప్రక్రియ అత్యంత అవసరం.2,5,12

4. క్యారీయర్ ఆయిల్స్ పాత్ర

క్యారియర్ ఆయిల్స్  అనేవి మొక్కల విత్తనాలు, గింజలు లేదా గుజ్జు భాగాల నుండి పొందబడే కొవ్వు పదార్థాలు. వీటిని ఎసెన్షియల్ ఆయిల్స్‌ను చర్మంపై ఉపయోగించే ముందు పలుచబరచడానికి ఉపయోగిస్తారు. ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మంలో శోషించబడడాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ దురద, మంట లేదా అలర్జీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మం మరియు తలపై సురక్షితంగా ఉపయోగించేందుకు సహాయపడతాయి.

మనకు లభ్యమయ్యే అనేక నూనెలలో సాధారణంగా ఉపయోగించే కొన్ని క్యారియర్ ఆయిల్స్: బాదం నూనె, ఆర్గాన్ నూనె, ఆర్నికా నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె,  ద్రాక్ష గింజల నూనె, జోజోబా నూనె, వేప నూనె, ఆలివ్ నూనె, రోజ్‌హిప్ నూనెలు ముఖ్యమైనవి.  ప్రతి నూనెకు చర్మం మరియు జుట్టుకు సంబంధించిన ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి..5,13-14

5. సాధారణంగా ఉపయోగించే జెన్షియల్ అయిల్స్

ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్స్ వాటి అరుదైన వైద్య చికిత్సా లక్షణాల కోసం ప్రసిద్ధి చెందాయి.  ప్రధానంగా అంటువ్యాధుల నియంత్రణకు, నొప్పి ఉపశమనానికి, చర్మ సమస్యల నివారణకు, నాడీ వ్యవస్థ సమతుల్యతకు, భావోద్వేగ ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని: బెర్గమాట్, కామొమైల్, క్లారీ సెేజ్, లవంగం, యూకలిప్టస్, ఫ్రాంకిన్సెన్స్, అల్లం, లావెండర్, నిమ్మ, పెప్పర్‌మింట్, గులాబీ, రోజ్‌మేరీ, గంధం, టీ ట్రీ, థైమ్.  ప్రతీ ఆయిల్‌కు ప్రత్యేకమైన శారీరక మరియు భావోద్వేగ ప్రయోజనాలు ఉన్నాయి.2,5,15

6. భద్రతా మార్గ దర్శకాలు

7. ఆరోమాథెరపీ

ఎసెన్షియల్ ఆయిల్స్ వినియోగంలో అత్యంత సాధారణ పద్ధతి అరోమాథెరపీ. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పరిశోధనలలో ఎక్కువ భాగం వ్యక్తిగత ఆయిల్స్‌పై కేంద్రీకృతమై ఉంది. అనేక వోలటైల్ రసాయనాలను కలిపినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఫార్మాల్డిహైడ్ వంటి ద్వితీయ కాలుష్య పదార్థాలు ఏర్పడవచ్చు. ఇవి: ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు వంటి భాగాలలో చికాకు కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, “For Aromatherapy Use” ఆరోమా థెరపీ కి మాత్రమే అని స్పష్టంగా లేబుల్ చేయబడిన నూనెలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.

మరింత సురక్షితమైన పద్ధతులు: గాలి ప్రసరణ బాగా ఉండే గదుల్లో డిఫ్యూజర్ ద్వారా వినియోగించడం పత్తిపై చుక్కలు వేసి ఆవిరి చెందేలా చేయడం, స్వల్పముగా ఆవిరి పీల్చడం, ఉత్తమమైనవి. సీసా నుండి నేరుగా లోతుగా పీల్చడం ముఖ్యంగా ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి అధిక సాంద్రతలో ఎక్కువసేపు వాసన పీల్చడం గుండె లేదా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అలాగే, డిమెన్షియా లేదా వాసన గుర్తించే శక్తి కోల్పోయిన వ్యక్తులకు అరోమాథెరపీ సరిపోకపోవచ్చు.2,17--23

8. ఆచరణత్మక సూచనలు

   ఎసెన్షియల్ ఆయిల్స్ కొనుగోలు చేసేసమయంలో గుర్తుంచుకోవాల్సిన  అంశాలు                                                                     

• అవి స్వచ్ఛమైన సుగంధ మొక్కల నూనెలేనని నిర్ధారించుకోండి.

• కేవలం సువాసన కోసం తయారుచేసిన ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ పట్ల  జాగ్రత్తగా ఉండండి.

• ఉత్పత్తిలో ఉపయోగించిన పదార్థాల జాబితాను తప్పనిసరిగా చదవండి.

• ఎసెన్షియల్ ఆయిల్స్ స్వచ్ఛతను నిర్ధారించడానికి అవసరమైన  పరీక్షలు చేయండి లేదా ధృవీకరించండి.

• ధరలను పోల్చి చూసి నాణ్యతకు అనుగుణమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోండి.

9. సాయి వైబ్రియా నిక్స్  ప్రాక్టీషనర్లకు ముఖ్య గమనిక

ఎసెన్షియల్ ఆయిల్స్‌కు బలమైన సువాసన ఉంటుంది. ఈ సువాసనలు సాయి వైబ్రియానిక్స్ మందుల సూక్ష్మ వైబ్రేషన్లపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఎసెన్షియల్ ఆయిల్స్‌ను వైబ్రియానిక్స్ మందుల నుండి తగినంత దూరంలో ఉంచాలి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించిన తరువాత లేదా ఉపయోగించే ముందు కనీసం ఒక గంట వ్యవధి ఉండేలా చూడాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా వైబ్రియానిక్స్ మందుల సూక్ష్మ శక్తి ప్రభావం యథావిధిగా కొనసాగుతుంది.

రిఫెరెన్సె లు వాటికి అనుగుణమైన లింక్ లు

  1. Sathya Sai Speaks: https://saisarathi.com/mid-atlantic-region/treat-nature-reverence/#
  2. Essential oils (E-oils): https://health.clevelandclinic.org/essential-oils-101-do-they-work-how-do-you-use-them
  3. Phytochemicals: chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://www.annexpublishers.com/articles/JBB/3103-Recent-Advances-of-Phytochemicals.pdf
  4. E-oils extraction: https://www.medicalnewstoday.com/articles/326732
  5. Power of e-oils: https://draxe.com/essential-oils/essential-oil-uses-benefits/
  6. Physical frequency and Brain waves: https://nhahealth.com/brainwaves-the-language/
  7. E-oils vibrational frequency: https://naturalnicheperfume.com/blog/do-essential-oils-raise-your-frequency/#
  8. https://www.scribd.com/document/508919722/Essential-Oils-Frequency
  9. Effect of rose oil: https://pubmed.ncbi.nlm.nih.gov/38331299/
  10. https://www.vice.com/en/article/rose-oil-brain-study/
  11. Body frequency and health: https://drkezchirolab.com/blogs/news/raising-vibrational-frequency-naturally#
  12. Benefits of essential oils: https://www.mdpi.com/1420-3049/28/4/1809
  13. Guide to carrier oils: https://mycamia.com/blogs/news/a-comprehensive-guide-to-carrier-oils-and-essential-oils-your-ultimate-resource
  14. https://www.vinevida.com/blogs/carrier-oils/best-carrier-oils-for-essential-oils
  15. Common essential oils: https://nikura.com/blogs/discover/most-popular-essential-oils-and-their-benefits
  16. Blending Before Therapy: https://kaizenhealthgroup.com/9-essential-oils-uses-and-side-effects/
  17. Patch test method: https://www.healthline.com/health/are-essential-oils-safe#
  18. Dilution & safety guidelines: https://www.healthline.com/health/are-essential-oils-safe#general-precautions
  19. https://achs.edu/blog/aromatherapy-essential-oil-dangers-and-safety/
  20. How to use a diffuser https://www.health.com/condition/stress/essential-oil-mistakes#
  21. Dos and Don’ts of essential oils: https://www.webmd.com/skin-problems-and-treatments/ss/slideshow-essential-oils
  22. Care Tips: https://www.hopkinsmedicine.org/health/wellness-and-prevention/aromatherapy-do-essential-oils-really-work
  23. How to take care: https://www.healthywa.wa.gov.au/Articles/A_E/Essential-oils

______________________________________________________________________________________

2. వర్క్ షాప్ లు మరియు శిబిబిరాలు 

AVP వర్క్ షాప్ 26-28 నవంబర్ 2025, SVIRT ఆఫీస్ పుట్టపర్తి

 భారతదేశం నుండి పదకొండు మంది, అమెరికా నుండి ఒకరు మొత్తం పన్నెండు మంది AVPలుగా* అర్హత సాధించి, నవంబర్ 27న స్వామి సన్నిధిలో భక్తి, శ్రద్ధలతో తమ ప్రమాణ స్వీకారం చేశారు. 2025 ఆగస్టులో ప్రారంభమైన ఈ అభ్యాస ప్రయాణంలో తమ ఈ-కోర్స్ ఉపాధ్యాయులు మరియు ఇద్దరు సీనియర్ శిక్షకుల మార్గదర్శకత్వం లభించినందుకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్ష శిక్షణా శిబిరంలో నిర్వహించిన ప్రత్యక్ష క్లినిక్‌లు వారికి అమూల్యమైన ప్రాయోగిక అనుభవాన్ని, అలాగే వివిధ మాధ్యమాలలో వైబ్రియానిక్స్ ఔషధాలను తయారు చేసే విధానంలో ప్రత్యక్ష శిక్షణను అందించాయి. రోగులతో నేరుగా సంభాషించే అవకాశం లభించడం, వారితో విశ్వాసపూర్వక అనుబంధాన్ని ఏర్పరచుకోవడం, సున్నితంగా కేసు వివరాలను సేకరించడం, చికిత్సా ప్రణాళిక రూపొందించడం, తగిన కాంబోలను ఎంపిక చేయడం, పూజాభావంతో రెమిడీలను అందించడం, అలాగే రోగుల రికార్డులను శ్రద్ధగా నిర్వహించడం వంటి అంశాలలో విలువైన అనుభవాన్ని పొందినందుకు పాల్గొనేవారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

సమారోపణ వాలిడిక్టరీ కార్యక్రమంలో వ్యవస్థాపకులు మార్గదర్శక మరియు ప్రేరణాత్మక సందేశాలను అందించారు. డాక్టర్ అగర్వాల్, వైబ్రియానిక్స్ సేవ యొక్క అసలు ఉద్దేశ్యం స్వీయ పరివర్తన అని నొక్కి చెబుతూ, ప్రేమ, వినయం, ఆలోచన–మాట–చర్యల పవిత్రత, అలాగే అహంకారానికి సంపూర్ణంగా దూరంగా ఉండే మనోభావం ద్వారానే నిజమైన స్వస్థత ప్రసరిస్తుందని గుర్తు చేశారు. స్వస్థపరచేది స్వామియే; ప్రాక్టీషనర్ కేవలం ఆయన చేతిలో ఒక సాధనం మాత్రమేనని, రెమిడీతో పాటు నిజాయితీ, విశ్వాసం, కరుణను కూడా సమర్పించాల్సిన అవసరాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

గాఢమైన ప్రేరణ పొందిన వీరంతా తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసి, ఈ కోర్సు ద్వారా కలిగిన ఉత్సాహాన్ని నిరంతరం కొనసాగించాలని సంకల్పించారు. వారిలో ఒకరు ఈ బ్యాచ్ కోసం ప్రతి నెల సమావేశాలను సమన్వయం చేసే బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించగా, ఆ సమావేశాలకు క్రమం మారుతూ మెంటర్లు మార్గనిర్దేశం చేయనున్నారని తెలిపారు.

   *Regn nos. 11674 to 11684 and 03625

 

 

 

                                           


 

______________________________________________________________________________________

3. స్వామికి మా సామూహిక శతాబ్ది కానుక

మన ప్రియతమ భగవంతుని శతజయంతి సందర్భంగా సమర్పించదగిన కానుక ఏమిటనే నిర్ణయం తీసుకోవడం మాకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎంతో ఆలోచన, ప్రార్థనల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైబ్రియానిక్స్ సేవకులు అందించిన సేవా విశేషాల సంకలనాన్ని స్వామికి కానుకగా సమర్పించాలని నిర్ణయించుకున్నాము. ఈ ఆలోచనను మొదటగా 2024 మార్చి/ఏప్రిల్ వార్తాలేఖలో ప్రతిపాదించగా, వచ్చిన రచనలను సేకరించడం, మెరుగుపరచడం, సంపాదకీయం చేయడం కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రపంచంలోని సాధ్యమైనంత ఎక్కువ మంది వైబ్రియానిక్స్ సేవకుల సేవా అనుభవాలను ఈ గ్రంథంలో ప్రతిబింబింపజేయాలనే మా హృదయపూర్వక సంకల్పం. 

ప్రారంభంలో వ్యాసాలు చాలా తక్కువగా వచ్చాయి. అయితే, బృంద సభ్యులు సేవకులను వ్యక్తిగతంగా సంప్రదించి, తమ అనుభవాలను పంచుకోవాలని ప్రోత్సహిస్తూ అలుపెరుగని కృషి చేయడంతో కొద్దికొద్దిగా రచనలు రావడం ప్రారంభమైంది. అయినప్పటికీ, అవి మా లక్ష్యానికి ఇంకా తక్కువగానే ఉన్నాయి. చివరకు అన్ని గడువులు దాటిన తర్వాత, 2025 అక్టోబర్ చివరి వారంలో ఒక్కసారిగా అనేక రచనలు అందాయి. వాటిని సమయానికి ప్రచురణకు సిద్ధం చేయడానికి బృందాలు అనేక రాత్రులు నిద్రలేకుండా శ్రమించాయి.

ఈ ప్రయాణంలో పుస్తకాల రూపకల్పన, ముద్రణ గడువులు దాటిపోవడం వంటి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, సంపూర్ణ విశ్వాసంతో భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన చివరి క్షణంలో అద్భుతంగా జోక్యం చేసుకుంటారనే అనుభవాన్ని  మేము మరోసారి పొందాము. చివరకు నవంబర్ 19న తుది ప్రతిని ముద్రణ కోసం పంపించగా, నవంబర్ 23న మొదటి విడత పుస్తకాలు పుట్టపర్తికి చేరుకున్నాయి. అనంతరం, భక్తులతో కిటకిటలాడుతున్న ఆశ్రమంలో వాహనాల ప్రవేశం దాదాపు లేకపోయినా, ఆ భారీ పుస్తకాల పార్శిళ్లను లోపలికి తీసుకురావడం మరో సవాలుగా నిలిచింది. అదృష్టవశాత్తూ, SVIRT గవర్నర్లలో ఒకరైన SVP 02696 సమయానికి చేరుకుని, ఆ పుస్తకాలను విజయవంతంగా S4-B1కు చేర్చేందుకు సహకరించారు. అక్కడ కృతజ్ఞతా కానుకగా వాటిని వేదికపై సమర్పించి, అనంతరం డాక్టర్ అగర్వాల్ మరియు యూకే సమన్వయకర్త ఆధ్వర్యంలో కేక్ కట్ చేసే కార్యక్రమం జరిగింది. ఆ కేకును AVP శిక్షణా శిబిరానికి హాజరైనవారితో పాటు విచ్చేసిన భక్తులందరికీ పంచిపెట్టారు.

నవంబర్ 25న స్వామి సన్నిధిలో ఈ పుస్తకాలను సమర్పించే భాగ్యం మాకు లభించింది. పురుషుల వైపు నుండి డాక్టర్ అగర్వాల్ ఈ గ్రంథాలను సమర్పించగా, మహిళల వైపు నుండి హేమ అగర్వాల్ మరియు VTలు 10375, 11422 ఈ పవిత్ర సమర్పణ చేసే అదృష్టాన్ని పొందారు. ఈ దివ్య కార్యం విజయవంతంగా పూర్తికావడానికి గత సంవత్సరం పొడవునా తమ వ్యాసాలతో సహకరించిన ప్రతి ఒక్కరికీ, అలాగే ఈ ప్రాజెక్టుకు వివిధ విధాలుగా తోడ్పడిన వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా, సాయి వైబ్రియానిక్స్‌కు వెలుపల ఉన్నప్పటికీ మా అత్యవసర గడువులను చేరుకోవడానికి నిస్వార్థంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక  ధన్యవాదాలు. ఈ సమస్త కార్యం భగవంతుని అనంత కృప, అనుగ్రహాల ఫలితమని మేము కృతజ్ఞతతో స్మరిస్తున్నాము.

 

 

 

 

 

 

 

 

______________________________________________________________________________________

    4. వైబ్రియానిక్స్ వైద్య శిబిరాలు మరియు క్లినిక్ లు

    4.1 గాయత్రి విద్యాలయ నేరేడ్మెట్ట హైదరాబాద్ తెలంగాణ 2025 నవంబర్ 3

ప్రాక్టీషనర్ 11627 చొరవతో మరియు సైనిక్‌పురి సమితి సేవా సమన్వయకర్త సహకారంతో, 2025 నవంబర్ 3న గాయత్రీ విద్యాలయలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. 1999లో స్థాపించబడిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 198 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సాయి వైబ్రియానిక్స్ ప్రయోజనాలు మరియు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిపి సుమారు 70 మంది హాజరయ్యారు.

తదనంతరం నిర్వహించిన వైబ్రియానిక్స్ ఆరోగ్య శిబిరంలో ప్రాక్టీషనర్లు 11563, 11614 మరియు 11627 మొత్తం 32 మంది రోగులకు సేవలు అందించారు. ప్రధానముగా మధుమేహం, కీళ్ల మరియు శారీరక నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్రలేమి, అలెర్జీలు, మైగగ్రేన్, చర్మ, కంటి మరియు చెవి సమస్యలు, ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, వంటి వ్యాధులకు చికిత్స నందించడం జరిగింది.కార్యక్రమం నిర్వహణ లో పాఠశాల సిబ్బంది హృదయపూర్వక సహకారాన్ని అందించారు.ఈ ప్రారంభ శిబిరం విజయవంతమైన స్పూర్తితో , అదే సేవాభావంతో ఉన్న పైన పేర్కొన్న ప్రాక్టీషనర్లు ప్రతి నెల మొదటి మరియు మూడవ సోమవారాల్లో పక్షానికి ఒకసారి ఈ శిబిరం క్రమం తప్పకుండా  కొనసాగిస్తున్నారు

 

 

 

 

4.2 ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ లో వైబ్రియానిక్స్  సేవ: శతజయంతి సందర్బంగా ప్రత్యేక సమర్పణ.  

2009 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో వైబ్రియానిక్స్ వైద్య శిబిరం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. స్వామివారి శతజయంతి సంవత్సర వేడుకల సందర్భంగా ఈ వినమ్ర సేవను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించారు. సాధారణంగా మూడు రోజుల పాటు జరిగే శిబిరాన్ని ఈసారి 2025 నవంబర్ 15 నుండి 24 వరకు వరుసగా పది రోజుల పాటు నిర్వహించారు.

SVP 01228 నాయకత్వంలో, పది మంది ప్రాక్టీషనర్లతో కూడిన సేవా బృందం* మొత్తం 3,325 మంది రోగులకు సేవలందించింది. మొత్తం 234 సేవా గంటలు అంకితమయ్యాయి. ఉదయమే అనేక రైళ్లలో స్టేషన్ కు చేరుకున్న భక్తులను ప్రేమతో స్వాగతించి, వారి ఆరోగ్య సమస్యలను ఓపికగా విని, తగిన వైబ్రియానిక్స్ మందులను అందించారు. అత్యధికంగా చికిత్స అందించిన వ్యాధులు జలుబు,  ఫ్లూ, జీర్ణ సంబంధిత సమస్యలు, మరియు శరీరక నొప్పులు.

ఈ శిబిరం సందర్భంగా ప్రాక్టీషనర్లు స్వామివారి రెండు ఫోటోల నుండి అనేక రోజుల పాటు విభూతి ప్రత్యక్షమవుతూ ఈ దివ్య అనుభవం చివరి రోజు వరకు కొనసాగడం గమనించారు. ఈ సంఘటనను అందరూ స్వామివారి నిశ్శబ్ద ఆశీర్వాదంగా మరియు శతజయంతి సమర్పణను ఆయన స్వీకరించిన సంకేతంగా భావించారు. నిరంతరం వచ్చే రోగులకు సేవలందించడంలో నిమగ్నమై ఉండటంతో ఫోటోలు చాలా తక్కువగా మాత్రమే తీసుకోగలిగారు. అయినప్పటికీ, విభూతి యొక్క మాధుర్యం మరియు ఆ దివ్య క్షణాల పవిత్రత వాటిని చూసిన వారందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రియతమ స్వామీ! మీ సన్నిధిలో సేవ చేసే ఈ అరుదైన పవిత్ర అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు, మరియు మీ స్పష్టమైన సాన్నిధ్యంతో ఈ సేవను ఆశీర్వదించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.* రిజిస్ట్రేషన్ నంబర్లు: 01228, 11660, 11658, 11623, 11650, 11587, 10782, 11659, 11624, 01448.

ప్రాక్టీషనర్ కాకపోయినా బ్రిజిట్ టెస్సైర్ ఏడు రోజుల పాటు ప్రేమతో సేవ చేశారు. విశాఖపట్నం ప్రాక్టీషనర్లు పిల్స్ తో నింపిన సీసాలను ముందుగానే పంపించి శిబిరానికి సహకరించారు.

 

 

 

 

4.3 అల్కపురి సమితి RK పురం హైదరాబాద్ తెలంగాణ లో వైబ్రియానిక్స్ క్యాంపు ప్రారంభం 28 డిసెంబర్ 2025

2025 నవంబర్ 23న పుట్టపర్తి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన వైబ్రియానిక్స్ శిబిరంలో సేవ చేస్తున్నప్పుడు, ప్రాక్టీషనర్ 11587 అల్కాపురి సమితికి చెందిన ఒక భక్తుని పరిచయం పొందారు. ఆయన శిబిరానికి విలువైన సహకారం అందించడమే కాకుండా అనేక రోగులను కూడా సూచించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత, సమితి కన్వీనర్‌ను సంప్రదించి సమితి ప్రాంగణంలో సాయి వైబ్రియానిక్స్ శిబిరం ప్రారంభించాలనే ప్రతిపాదన చేశారు. ఇప్పటికే అక్కడ ప్రతి గురువారం మరియు ఆదివారం హోమియోపతి మరియు అలోపతి శిబిరాలు జరుగుతున్నందున, ఈ ప్రతిపాదనను కన్వీనర్ సంతోషంగా ఆమోదించారు.

2025 డిసెంబర్ 28న ఉదయం 9:30 గంటలకు సమితి కన్వీనర్ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రాక్టీషనర్ 11587 సుమారు 50 మంది పాల్గొన్న సమావేశంలో వైబ్రియానిక్స్ గురించి సమగ్ర అవగాహన కల్పించారు. మొత్తం 26 మంది రోగులకు ఈ క్రింది సమస్యల కోసం చికిత్స అందించబడింది. కీళ్ల మరియు వెన్నునొప్పులు, రక్తపోటు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, చర్మ అలెర్జీలు, సాయి సేవాదళ్ సభ్యులు అత్యుత్తమ సహకారం మరియు ఆతిథ్యాన్ని అందించి శిబిరం విజయవంతంగా జరిగేలా చేశారు. కార్యక్రమం మధ్యాహ్నం 2:30 గంటలకు ముగిసింది. ఇకపై ఈ శిబిరం ప్రతి నెల నాల్గవ ఆదివారం నిర్వహించబడుతుంది.

______________________________________________________________________________________

5. అనుభవాలు

5.1 డాక్టర్ జిత్ అగర్వాల్ గారి డైరీ నుండి- రెండు రోజుల్లోనే జ్ఞాపకశక్తి పునరుద్ధరణ ఒక వైబ్రియానిక్స్ అద్భుతం

1995 మే నెలలో, నా స్నేహితుడు రాబిన్ ఆక్స్‌ఫర్డ్‌లో జరిగే మా వారాంతపు సాయి భజనలకు వచ్చి ఒక కలవరపరిచే వార్త చెప్పాడు. అతని 47 సంవత్సరాల భార్య ఆన్, గుర్రం నుండి పడిపోవడం వల్ల తీవ్రమైన ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం తరువాత ఆమె పూర్తిగా జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆసుపత్రి వైద్యులు పరిస్థితి ఆశాజనకంగా లేదని జ్ఞాపకశక్తి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని, వచ్చినా రెండు సంవత్సరాల వరకు పట్టవచ్చని హెచ్చరించారు.

ఆ సమయంలో రాబిన్ కొత్తగానే మా బాబా భక్తుల బృందంలో చేరాడు. నేను ప్రశాంతి నిలయం నుండి తిరిగి వచ్చిన ప్రతిసారీ అక్కడి వార్తలను ఆసక్తిగా అడిగేవాడు. ఆ సందర్భంలో నేను ఇటీవల కనుగొన్న వైబ్రియానిక్స్ (అప్పుడు వైబ్రియో *పతి) గురించి ఎంతో ఉత్సాహంగా వివరించాను. స్వామివారు స్వయంగా ఈ వైద్య విధానానికి మార్గదర్శకత్వం వహించారని, నేను తయారు చేసిన సాయి రామ్ హీలింగ్ వైబ్రేషన్ పొటెన్సైజర్ నమూనాను ఆశ్రమానికి తీసుకెళ్లి ఆయన ఆశీర్వాదం పొందానని చెప్పాను.

కొంత సందేహం ఉన్నప్పటికీ, చివరి ఆశగా రాబిన్ ఈ చికిత్సను ప్రయత్నించేందుకు అంగీకరించాడు. నేను NM25 Shock మందును తయారు చేసి ఇచ్చాను. ఆ సమయంలో ఆ మందుపై నాకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. మా ఆశ్చర్యానికి హద్దుల్లేకుండా, కేవలం రెండు రోజుల తరువాత రాబిన్ ఫోన్ చేసి, పూర్తిగా ఆశ్చర్యంతో:ఆన్ జ్ఞాపకశక్తి పూర్తిగా తిరిగి వచ్చింది!” అని చెప్పాడు. నిజం చెప్పాలంటే ప్రారంభ దశలో, అంత అద్భుతమైన ఫలితాన్ని చూసి నేనూ ఆశ్చర్యపోయాను. ఈ రోజు వరకు కూడా, తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడల్లా రాబిన్ వైబ్రియానిక్స్ వైపే తిరుగుతాడు.

5.2. IB – మాజీవితాలలో నవ వసంతం నింపిన మందు

ప్రాక్టీషనర్ 11669...భారతదేశం

తన పరిసర ప్రాంతంలో నివసించే ఒక దంపతులతో (వయస్సులు 60 మరియు 54) మోర్నింగ్ వాక్ కి వెళ్లే సమయంలో ఆరోగ్యం మరియు జీవనశైలి విషయాలపై తరచూ చర్చించేవారు. 2024 డిసెంబర్‌లో, ఉదయపు నడక మిస్ అయిన రోజుల్లో తన శక్తి మరియు ఉత్సాహం తగ్గిపోతున్నాయని భర్త పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రాక్టీషనర్ కొత్తగా AVP అర్హత పొందారు. శీతాకాలం సమీపిస్తున్నందున, బెంగళూరులో వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యే సమయం కావడంతో, ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకోవాలని సూచించారు. ఆ దంపతులు వెంటనే అంగీకరించారు. తదుపరి మూడు వారాల్లో వచ్చిన ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. శక్తి స్థాయిలు పెరిగాయి. నిద్ర నాణ్యత మెరుగుపడింది. మొత్తం ఆరోగ్యంమెరుగు పడింది. అంటువ్యాధులు కూడా రాలేదు.

రోగుల మాటల్లో:

“మా స్నేహితుడి ద్వారా ఇమ్యూనిటీ బూస్టర్ గురించి తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. కేవలం 20 రోజులపాటు తీసుకున్న తర్వాత ఫలితాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. మాలో కొత్త ఉత్సాహం, శక్తి పెరిగాయి. జీవక్రియ (Metabolism) మెరుగుపడింది. నిద్ర బాగా వస్తోంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకుంటున్నాము. శారీరక ప్రయోజనాలతో పాటు మానసికంగా కూడా ప్రశాంతత, తక్కువ ఒత్తిడి, తక్కువ ఆందోళన మరియు మరింత సమతుల్య దృక్పథం కలిగాయి.ఈ మార్పులను మేమే కాదు, మా చుట్టూ ఉన్నవారు కూడా గమనించారు.

”ఈ చిన్నదైనా శక్తివంతమైన అనుభవం, పెద్దగా అనారోగ్యం లేని వ్యక్తులలో కూడా IB శారీరక రోగనిరోధక శక్తిని మరియు భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడంలో ఎంత ఉపయోగకరమో తెలియజేస్తుంది