Vol 17 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2026
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా. జిత్ అగ్గర్వాల్ డెస్కు నుండి
ప్రియమైన ప్రాక్టీషనర్లకు
శతజయంతి ఉత్సవాలు మరియు క్రిస్మస్ సందర్భంగా ప్రశాంతి నిలయంలో గడిపిన సమయం ఎంతో హృదయానందకరంగా అనిపించింది. ప్రతీ ప్రార్థనలోనూ, ఆత్మను తాకే సంగీతంలోనూ, ప్రతీ సేవా కార్యక్రమంలోనూ, ప్రతి నిశ్శబ్ద క్షణంలోనూ స్వామివారి సాన్నిధ్యాన్ని అనుభస్తూ వారి సేవ చేయగలిగే భాగ్యం కలిగినందుకు మా హృదయాలు గాఢమైన కృతజ్ఞతతోనూ వినమ్రతతోనూ నిండాయి. ఆ పవిత్ర అనుభవమే ఇప్పుడు ఈ వార్తాపత్రిక తయారీలో స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వామివారి ప్రేమ కేవలం ఉత్సవాలలోనే కాదు, సేవ చేయాలనే మన నిత్య సంకల్పంలో, రోగులను స్వస్థపరచే కర్తవ్యబోధలో, ఆయన చూపిన మార్గంలో నడవాలనే అంకితభావంలో వ్యక్తమవుతుందని అది మనకు గుర్తు చేస్తోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి సంవత్సరం సాయి వైబ్రియానిక్స్‌కు అత్యంత ప్రాముఖ్యమైన ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. స్వామివారి ప్రత్యక్ష ఆశీర్వాదంతో ప్రారంభమైన ఈ వినయపూర్వక వైద్య విధానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్ల నిస్వార్థ సేవ మరియు ఆయన కృప వల్ల తన పరిధి, విశ్వసనీయత మరియు ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకుంది.
ఈ శతజయంతి సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి మూడు గ్రంథాలనూ విజయవంతముగా పూర్తి చేసి, 2025 నవంబర్ 25న పవిత్రమైన సాయి కుల్వంత్ సభామండపంలో భగవాన్ బాబా వారి పదపద్మాలకు సమర్పించడం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు “అదనంగా” (In Addition) విభాగంలో ఇవ్వబడ్డాయి. ఈ కార్యాన్ని సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో అంకితభావంతో కృషి చేసిన ప్రతీఒక్క ప్రాక్టీషనర్, సమన్వయకర్త, సంపాదకుడు మరియు స్వచ్ఛంద సేవకులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా, అసాధారణ అనుభవాలు (Extraordinary Experiences) గ్రంథానికి ప్రోత్సాహకరమైన ముందుమాటను అందించిన సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి, అలాగే రోగ చరిత్రలు (ase Histories) గ్రంథానికి ముందుమాటను అందించిన అఖిల భారత అధ్యక్షులు శ్రీ నిమీష్ పాండ్యా గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ గ్రంథాలను పొందదలచిన ప్రాక్టీషనర్లు [email protected] కు వ్రాయవచ్చు.
2025 సంవత్సరంలో పూర్తిగా సాయి వైబ్రియానిక్స్ కార్యకలాపాలు వివిధ ప్రాంతాలకు మరింత విస్తరించాయి. వందలాది మంది ప్రాక్టీషనర్లు రోగుల సేవలో చురుకుగా పాల్గొనగా, వెల్‌నెస్ శిబిరాలు మరియు క్లినిక్‌ల సంఖ్యతో పాటు వాటి సేవా పరిధి కూడా గణనీయంగా పెరిగింది. ఈ అభివృద్ధిని 100 క్యాంపులు మరియు శిబిరాలు (100 Camps and Clinics) గ్రంథంలో స్పష్టంగా ప్రతిబింబించబడింది. ఆ గ్రంథ ప్రచురణ అనంతరం నిర్వహించిన శిబిరాలు మరియు క్లినిక్‌లకు సంబంధించిన తాజా రోగుల గణాంకాలు, అలాగే ఇటీవల తీసిన ఫోటోలను ప్రాక్టీషనర్లు మాకు పంపాలని కోరుతున్నాము.
సంస్థాగత స్థాయిలో, పుట్టపర్తిలోని సాయి వైబ్రియానిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SVIRT) ను మరింత బలోపేతం చేసి, సుస్థిరపరచడానికి నిరంతర కృషి కొనసాగింది. పరిపాలనా బృందం సాధకుల డేటాబేస్‌ను నవీకరించడం, సంస్థ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడం, మరియు కార్యకలాపాలలో మరింత స్పష్టతను తీసుకురావడంపై దృష్టి సారించింది. ఈ క్రమబద్ధీకరణలో భాగంగా, SRHVP యంత్రాలు మరియు 108CC బాక్సులకు సంఖ్యా విధానం (Numbering System) ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా మెరుగైన ప్రమాణీకరణ మరియు దీర్ఘకాలిక పర్యవేక్షణ సాధ్యమవుతుంది. 2025 డిసెంబర్ 2న ప్రశాంతి నిలయంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సంవత్సరపు పురోగతిని సమీక్షించడమే కాకుండా, రాబోయే నెలల్లో దశలవారీగా అమలులోకి వచ్చే పలు ప్రతిపాదనలను కూడా చర్చించడం జరిగింది. ఇవి రాబోయే సంవత్సరానికి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.
ఈ సంచికతో, ప్రాక్టీషనర్ వివరాలు (Practitioner Profiles) స్థానంలో ప్రాక్టీషనర్ కార్నర్ (Practitioners Corner) అనే కొత్త విభాగాన్ని పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ విభాగం పరస్పర అభ్యాసం మరియు ప్రేరణకు వేదికగా ఉండేలా రూపొందించబడింది. ఇందులో సాయి వైబ్రియానిక్స్‌తో తమ ప్రయాణం, క్లిష్టమైన కేసులలో మార్గనిర్దేశం చేసిన గురువుల గురించి వివరణ, గురువుల పర్యవేక్షణలో నిర్వహించిన కేసులు, పోటెంటైజ్ (Potentise) చేసి విజయవంతంగా ఉపయోగించిన వినూత్న నివారణలు, అలాగే వైబ్రియానిక్స్ ద్వారా ప్రత్యేకమైన రీతిలో లేదా అనూహ్యంగా పొందిన అద్భుతమైన ఫలితాలు లేదా అనుభవాలు వంటి అంశాలను పంచుకోవచ్చు.
జనవరి 26ను “వైబ్రియానిక్స్ డే” గా నిర్ణయించడం జరిగింది. ఇది సమిష్ఠి అంకితభావం, సేవా తత్వం మరియు నిస్వార్థ వైద్యసేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజును అర్థవంతంగా నిర్వహించడానికి ప్రాక్టీషనర్లు శిబిరాలు నిర్వహించడం, రోగుల సమావేశాలు ఏర్పాటు చేయడం, స్థానికంగా అనుభవాలను పంచుకోవడం, సాయి సమితులు లేదా కమ్యూనిటీ కేంద్రాలలో అవగాహన ప్రసంగాలు ఇవ్వడం, లేదా ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా ప్రాక్టీషనర్ల శిక్షణ కోసం నిజాయితీ గల అభ్యర్థులను దరఖాస్తు చేయమని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. వైబ్రియానిక్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల నివేదికలు మరియు ఫోటోలను [email protected] కు పంపవచ్చు. తద్వారా ఈ సమిష్టి సేవా కార్యక్రమాలను భవిష్యత్ సంచికలలో పంచుకునే అవకాశం కలుగుతుంది.
శ్రవణం (భగవంతుని మహిమలను వినడం), కీర్తనం (భగవన్నామ సంకీర్తనం), విష్ణుస్మరణం (భగవంతుని నిరంతరం స్మరించడం), పాదసేవనం (దివ్య పాదాలను సేవించడం), వందనం (నమస్కరించడం), అర్చనం (ఆరాధించడం), దాస్యం (భగవంతుని సేవకునిగా భావించడం), స్నేహం (దైవంతో స్నేహభావం కలిగి ఉండడం), ఆత్మనివేదనం (సంపూర్ణ శరణాగతి) అనే నవవిధ భక్తి మార్గాలన్నీ పవిత్రమైనవే, అయితే, వీటిలో సేవకే అత్యున్నత స్థానం ఉందని స్వామి మనకు గుర్తుచేస్తున్నారు. భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ శరీరం కేవలం జీవించడానికే కాదు, ఇతరులకు సేవ చేయడానికే ఉద్దేశించబడింది అని స్వామి మనకు గుర్తు చేస్తూ ఉంటారు. “సేవ ద్వారా లభించే ఫలితాలే శాశ్వతమైనవి... మానవ సేవకన్నా గొప్పది మరొకటి లేదు. మానవ సేవయే మాధవ సేవ. మానవాళికి సేవ చేయడం ద్వారానే మహనీయులందరూ తమ జీవితాలను పవిత్రం చేసుకున్నారు. కాబట్టి, కనీసం ఇప్పటి నుంచైనా మానవసేవను ప్రారంభించండి. భజనలకన్నా, ఇతర ఆధ్యాత్మిక సాధనలకన్నా సేవే ముఖ్యమైనది.”— శ్రీ సత్యసాయి ప్రసంగాలు, సంపుటి 37, 1 జనవరి 2004 https://sssbpt.info/ssspeaks/volume37/sss37-01.pdf
ఈ శతజయంతి సంవత్సరం మనకు సమిష్టి సంకల్పం, క్రమశిక్షణ మరియు భక్తి కలిసినప్పుడు ఎంతటి గొప్ప ఫలితాలను సాధించవచ్చో చూపించింది. ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం మరిన్ని శిబిరాలను విస్తరిస్తూ, సాధనను మరింత గాఢంగా చేసుకుంటూ, ఉదారంగా మార్గనిర్దేశం చేస్తూ సేవా అనుభవాలను నిజాయితీగా లిఖితపరచుకుందాం. అలా చేయడం ద్వారా వైబ్రియానిక్స్ స్వామివారి దివ్య వైద్య ప్రేమకు ఒక వినమ్ర సాధనంగా కొనసాగగలదు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందకరమైన, ఆరోగ్యవంతమైన, సేవాస్ఫూర్తితో నిండిన 2026 సంవత్సర శుభాకాంక్షలు!
సాయికి ప్రేమపూర్వక సేవలో,
జిత్ కె. అగర్వాల్
తలపోటు, మసక చూపు 11634...भारत
17 సంవత్సరాల వయస్సు గల ఒక బాలుడు 2012 నుండి, అంటే గత 13 సంవత్సరాలుగా, తరచూ వచ్చే తలనొప్పులతో బాధపడుతున్నాడు. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఈ తలనొప్పులు ప్రేరేపించబడేవి. తల మొత్తం నలిగిపోతున్నట్లుగా అనిపించే తీవ్రమైన ఒత్తిడి భావనతో ఈ నొప్పులు ఉండేవి. ఈ దాడులు నెలకు సుమారు మూడు సార్లు వచ్చేవి మరియు సాధారణంగా రాత్రి నిద్రపోయే వరకు కొనసాగేవి. ఎక్కువ సందర్భాల్లో నొప్పి ఒక మోస్తరు స్థాయిలో (1 నుండి 10 స్కేల్‌లో 5 వరకు) ఉండేది. అందువల్ల అతను తన దైనందిన కార్యకలాపాలను కొనసాగించగలిగేవాడు. అయితే కొన్ని సందర్భాల్లో నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుడు సూచించిన నొప్పి నివారణ మందు తీసుకోవాల్సి వచ్చేది. ఆ మందు తీసుకున్న గంటలోపే తాత్కాలిక ఉపశమనం కలిగేది.
అదనంగా, గత మూడు సంవత్సరాలుగా అతను ఒత్తిడి పరిస్థితుల్లో, ముఖ్యంగా పరీక్షల సమయంలో, మసక చూపు సమస్యను కూడా అనుభవిస్తున్నాడు. ప్రతి సారి ఈ సమస్య సుమారు రెండు గంటలపాటు కొనసాగేది. ఆ సమయంలో చదవడానికి, దృష్టిని కేంద్రీకరించడానికి అతను అదనపు శ్రమ చేయాల్సి వచ్చేది. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న బాలుడి తల్లి ఒక ప్రాక్టీషనర్ ను సంప్రదించగా వారు సూచించిన క్రింది రెమిడీని 2025 మే 27 నుండి తీసుకోవడం ప్రారంభించాడు:
CC11.4 Migraines + CC15.1 Mental & Emotional Tonic + CC18.5 Neuralgia … TDS
అదనంగా, 2025 జూన్ 1 నుండి ఒక నెలపాటు వైద్యుడు సూచించిన ఐరన్ సప్లిమెంట్లను కూడా తీసుకున్నాడు. మసక చూపుకు కారణం ఐరన్ లోపమని వైద్యుడు భావించారు.
చికిత్స పురోగతి :
- 18 జూన్ 2025 : ఇటీవల జరిగిన పరీక్షల సమయంలో కూడా తలనొప్పి లేదా మసక చూపు సమస్య ఒక్కసారి కూడా రాలేదు. వైబ్రియానిక్స్ మందు ప్రారంభించినప్పటి నుండి అలోపతి నొప్పి నివారణ మందు అవసరం కాలేదు.
- 30 ఆగష్టు 2025 : మందు పూర్తిగా అయిపోవడంతో వైబ్రియానిక్స్ చికిత్స నిలిపివేయబడింది
2025 డిసెంబర్ నాటికి, బాలుడు పూర్తిగా లక్షణరహితంగా కొనసాగుతున్నాడు. ప్రతి నెలా తలనొప్పి దాడులతో బాధపడే రోగిగా ఉన్న అతను, ఇప్పుడు వరుసగా ఆరు నెలలపాటు ఒక్కసారి కూడా తలనొప్పి రాకుండా ఉండటం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాడు. గత 13 సంవత్సరాలలో ఇది అతనికి మొదటిసారి లభించిన అనుభవం.
పాదంలో నొప్పి, వాపు, రంగులో మార్పు 11646...भारत
98 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు శారీరకంగా మరియు మానసికంగా అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటూ ఎవరిపైనా ఆధారపడకుండా పూర్తిగా స్వతంత్రంగా జీవిస్తూ, కర్ర సహాయం లేకుండానే నడవగలిగేవారు. 2024 సంవత్సరం చివరి భాగంలో, ఆయనకు రెండు పాదాలలో వాపు మరియు నిరంతరాయమైన నొప్పి ప్రారంభమైంది. కుడి పాదంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండేది. దీనికి తోడు శరీరమంతా నొప్పి కూడా ఉండేది. విశ్రాంతి తీసుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోగా, క్రమంగా మరింత తీవ్రమై ఆయన నడవలేని స్థితికి చేరుకోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. కాలక్రమేణా రెండు పాదాల చర్మం గోధుమ-నలుపు (Brownish-Black) రంగులోకి మారింది. శారీరములో చురుకుదనం పూర్తిగా నిలిచిపోయి ఆందోళన కారణంగా ఆకలి మందగించింది. రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన కోసం లేవాల్సి రావడంతో నిద్ర కూడా భంగమయ్యేది. ఈ లక్షణాలు ప్రారంభమయ్యేంత వరకు ఆయన ప్రతీరోజూ సాయంత్రం నడకకు వెళ్లగలిగేఅంత చురుకైన జీవనశైలిని కొనసాగించేవారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం ఆయనకూ, ఆయన భార్యకూ తీవ్రమైన ఆందోళన కలిగించింది. 2003 సంవత్సరంలో ఆయనకు కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (Coronary Artery Bypass Graft – CABG) శస్త్రచికిత్స జరిగినప్పటికీ ఆ తరువాత కూడా అనేక సంవత్సరాల పాటు ఆయన ఆరోగ్యంగా, చురుకుగా జీవించారు.
2025 జనవరిలో ఆయన పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ సభ్యులు ఒక వైద్యుడిని సంప్రదించారు. వృద్ధాప్యమే ప్రధాన కారణమని భావించిన వైద్యుడు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్టాటిన్ (Statin) మందులు మరియు శరీరంలో అదనపు ద్రవాన్ని తగ్గించేందుకు డయూరెటిక్ (Diuretic) మందులు సూచించారు. రెండు నెలలకుపైగా చికిత్స తీసుకున్నప్పటికీ, కేవలం 10% మాత్రమే మెరుగుదల కనిపించింది. తిరిగి సమీక్షించినప్పుడు, చికిత్స కొనసాగించినప్పటికీ ఇకపై గణనీయమైన మెరుగుదల ఆశించలేమని వైద్యుడు రోగి కుమారునికి తెలిపారు. దీంతో తీవ్రంగా కలత చెందిన కుమారుడు స్వామిని ప్రార్థించగా దైవానుగ్రహంతో తన ప్రాంతంలో నివసిస్తున్న ఒక వైబ్రియానిక్స్ సాధకుడిని కలిసే అవకాశం లభించింది. ప్రాక్టీషనర్ రోగిని పరిశీలించినప్పుడు, ఆయన ఆందోళనతో పాటు భయభ్రాంతులకు గురై ఉన్నట్లు కనిపించారు. వైద్యుని నిర్ధారణను ఆధారంగా చేసుకుని, 2025 మార్చి 30న ఆయనకు ఈ క్రింది వైబ్రియానిక్స్ రెమిడీ ఇవ్వబడింది:
NM76 Dyspnoea + NM91 Paramedic Rescue + OM7 Heart + BR4 Fear + BR5 Heart + SM26 Immunity + SR265 Aconite + SR271 Arnica + SR278 Cactus + SR286 Crataegus + SR304 Oxygen + SR413 Sumbul + SR455 Artery + SR461 Brain (Medulla) + SR462 Brain (Pons) + SR473 CN10: Vagus + SR477 Capillary + SR483 Coronary Artery Left + SR484 Coronary Artery Right + SR494 Haemoglobin + SR495 Heart + SR496 Heart Valves + SR539 Vein + SR541 Adonis Ver…నీటిలో రోజంతా చప్పరించే విధంగా*
అల్లోపతీ మందులు కొనసాగింప బడ్డాయి.
చికిత్స లో పురోగతి :
- 7 ఏప్రిల్ 2025: నొప్పి మరియు వాపు 10% మేర తగ్గాయి.
- 3 మే 2025: నొప్పి మరియు వాపు 50% వరకు తగ్గాయి. పాదాల చర్మరంగు కూడా గణనీయంగా మెరుగై, మునుపటి నలుపు-గోధుమ రంగు తగ్గి స్పష్టంగా తేలికపడింది (ఫోటోలు చూడండి).
- 5 జూన్ 2025: అన్ని లక్షణాలు పూర్తిగా తొలగిపోయాయి. రోగి మళ్లీ సాధారణ షూలు ధరించి నడవడం ప్రారంభించారు. అంతకుముందు ఆయన చెప్పులు (slippers) మాత్రమే ధరించగలిగేవారు. ఈ విశేషమైన మార్పును చూసి రోగి అపార ఆనందానికి గురయ్యారు. అంతటి మార్పును నమ్మలేకపోయారు. ఈ దశలో రెమిడీ మోతాదును TDS కు తగ్గించారు.
- 30 ఆగష్టు 2025: మోతాదును క్రమంగా తగ్గిస్తూ చివరకు మందును పూర్తిగా నిలిపివేశారు.
2025 డిసెంబర్ నాటికి, లక్షణాలు మళ్లీ తిరిగి రాలేదు.



చికిత్స కు ముందు – 30 మార్చి 2025 3 మే 2025 5 జూన్ 2025
*సంపాదకుని సూచన: ఇదే మోతాదును అనేకమంది ప్రాక్టీషనర్లు ఉపయోగిస్తూ మంచి ఫలితాలు పొందుతూన్నట్లు వ్యక్తమవుతోంది.
కుమారుని అనుభవపూర్వక వ్యాఖ్యానం (30 జూన్ 2025):
నా 98 సంవత్సరాల తండ్రి గత మూడు నెలలుగా అలోపతి మందులు తీసుకుంటున్నప్పటికీ, ఆయన తీవ్రమైన శరీర నొప్పులతో పాటు, (రక్తప్రసరణ సమస్యల కారణంగా) పాదాలలో అధిక వాపు మరియు నల్లటి రంగు మార్పుతో బాధపడుతున్నారు. అయితే, అలోపతి మందులతో పాటు సాయి వైబ్రియానిక్స్ మందులను కేవలం 64 రోజుల పాటు తీసుకున్న తరువాత, ఆయన శరీరంలోని వివిధ భాగాలలో ఉన్న నొప్పులు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగే పాదాలలోని వాపు మరియు రంగు మార్పు కూడా చాలా వరకు తొలగిపోయాయి. ఆయన ఆరోగ్యంలో వచ్చిన ఈ అద్భుతమైన సానుకూల మార్పుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు స్వీకరించండి.
ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైన శ్రీ సత్యసాయి బాబాకు, సాయి వైబ్రియానిక్స్ వైద్య విధానానికి, అలాగే ముఖ్యంగా మా తండ్రి ఆరోగ్యంలో ఈ అద్భుతమైన మార్పును తీసుకురావడానికి సాయి మాత ఎంపిక చేసిన దివ్య సాధనంగా సేవలందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరోసారి, మీరు చేస్తున్న మహోన్నత సేవకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వశక్తిమంతుడైన సాయి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం మరియు అనుగ్రహాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
చేతుల్లో నొప్పి, మొద్దుబారడం (నంబ్నెస్), GERD (గ్యాస్ట్రో-ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి) 18009...भारत
46 సంవత్సరాల వయస్సు గల ఒక పురుషుడు 2021 నుండి, అంటే గత నాలుగు సంవత్సరాలుగా, చేతుల్లో జలదరింపు, రాత్రి వేళల్లో మొద్దుబారడం, అలాగే మణికట్టుల్లో ఎడతెగని నొప్పితో బాధపడుతున్నాడు. అధిక శారీరక ఒత్తిడి లేదా ఎక్కువ పని చేసినప్పుడు ఈ లక్షణాలు మరింత తీవ్రమయ్యేవి. అతని ఉద్యోగంలో నిరంతరంగా మరియు పునరావృతంగా లీవర్లతో (levers) పని నిర్వహించాల్సి ఉండటం వల్ల ఈ సమస్య అతనికి మరింత ఆందోళన కలిగించేది.
అదనంగా, 2023 జనవరి నుండి, అంటే గత రెండు సంవత్సరాలుగా, భోజనం చేసిన తరువాత పొత్తికడుపులో మంటను కూడా అనుభవిస్తున్నాడు. దీనికి తోడు రోజంతా గ్యాస్ వలన త్రేనుపులు సమస్య కూడా ఉండేది. షిఫ్ట్ విధుల్లో పనిచేయడం వల్ల అతని భోజన సమయాలు క్రమబద్ధంగా ఉండేవి కావు. తరచుగా బయట ఆహారం తీసుకునే అలవాటు కూడా ఉండేది. ప్రారంభంలో ఈ అజీర్ణ సమస్యలు వారానికి రెండు మూడు సార్లు వస్తు మజ్జిగ తీసుకోవడం ద్వారా తగ్గిపోయేవి. కానీ గత ఎనిమిది నెలలుగా కడుపులో మంట భోజనం చేసిన ప్రతిసారి రావడం మొదలై మజ్జిగ తాగిన కూడా తగ్గని పరిస్థితి ఏర్పడింది. అంతేకాక అతని పేగు కదలికలలో కూడా ఇబ్బంది ఏర్పడి దుర్వాసనతో కూడిన వాయువు రావడం ప్రారంమైనట్లు కూడా తెలిపాడు. అతను ఎటువంటి అల్లోపతి మందులు స్వీకరించక యోగా ద్వారా తన పరిస్థితి క్రమబద్ధం చేసుకోగలుగుతున్నారు 8 మార్చి 2025, 2025 మార్చి 8న, తన యోగా తరగతులలో పరిచయమైన ఒక వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించగా, అతనికి ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic…6TD
#2. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + CC20.7 Fractures + Bitter leaf* Potentised 1M…6TD
అదనంగా, ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా ఆకుకూరలు మరియు మజ్జిగను ఆహారంలో చేర్చాలని, అలాగే బయట ఆహారం తినకుండా ఉండేందుకు ఇంటి నుండి భోజనం తీసుకెళ్లాలని ఆయనకు సూచించబడిందితదుపరి కొన్ని వారాల పాటు, తన తండ్రి ఆసుపత్రిలో చేరడంతో ఆయన యోగా తరగతులకు హాజరు కాలేకపోయారు. అందువల్ల ఆ కాలంలో చికిత్సకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
చికిత్స పురోగతి:
Ø 1 జూన్ 2025: అన్ని లక్షణాలలో 100% ఉపశమనం లభించింది. మందు మోతాదును TDS కు తగ్గించారు.
Ø 1 జులై 2025: మోతాదును OD (రోజుకు ఒకసారి) కి తగ్గించడం జరిగింది.
Ø 25 ఆగస్టు 2025: మోతాదును క్రమంగా తగ్గిస్తూ మందులను పూర్తిగా నిలిపివేశారు.
2025 డిసెంబర్ నాటికి, సమస్యలు మళ్లీ తిరిగి రాలేదు. రోగి ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా సాధనతో సమతుల్యమైన జీవనశైలిని ఆనందంగా కొనసాగిస్తున్నారు.
* దీని వృక్షశాస్త్రీయ నామం వెర్మోనియా ఎమిగ్డలిన
మోకాళ్ళు మరియు కాలి కండరాలలో నొప్పి 11632...भारत
47 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ 2020 ఆగస్టు నుండి, అంటే ఎనిమిది నెలలుగా, రెండు మోకాళ్లలో మరియు కాలి కండరాలలో నొప్పితో బాధపడుతున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు, కూర్చునేటప్పుడు లేదా లేచేటప్పుడు, అలాగే నేలపై ఐదు నిమిషాలకంటే ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి మరింత పెరుగుతుండేది. ఆమె ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు కావడంతో, బహుళ అంతస్తుల పాఠశాల భవనంలో రోజుకు అనేకసార్లు మెట్లు ఎక్కాల్సి వచ్చేది.
అదనంగా, ఆమె రోజుకు రెండుసార్లు ఒక్కోసారి గంటపాటు నేలపై కూర్చొని ధ్యానం చేసే అలవాటు కలిగి ఉండేవారు. అయితే నొప్పి పెరుగుతుండటంతో ఆ సాధనను కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యతో చాలాకాలం ఇబ్బంది పడిన తర్వాత, వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. 2021 మార్చి 21న, వారు ఆమెకు ఈ క్రింది రెమిడీని ఇచ్చారు:
#1. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue...TDS అదే మందును ఆవాల నూనెలో కలిపి బాహ్యంగా రాయడానికి…BD
చికిత్స పురోగతి:
- 22 మార్చి 2021: S రెండు కాళ్ల కాలి కండరాలలో రాత్రంతా తీవ్రమైన నొప్పి అనుభవించారు. ఇది బహుశా “పుల్లౌట్” అయి ఉండవచ్చని భావించారు.
- 23 మార్చి 2021: నొప్పి 50% తగ్గింది. కాళ్లు మడిచి 15 నిమిషాలపాటు కూర్చోగలిగారు.
- 15 జూన్ 2021: నొప్పి 75% తగ్గింది. నేలపై కూర్చోవడం మరియు లేవడం పెద్దగా అసౌకర్యం లేకుండా చేయగలిగారు.అదే సమయంలో, గత ఎనిమిది నెలలుగా శారీరక శ్రమ చేసినప్పుడు అలసట కూడా ఉంటుందని ఆమె వెల్లడించారు. అందువల్ల మౌఖిక మందును ఈ విధంగా మెరుగుపరిచారు: #2. CC12.1 Adult tonic + #1…TDS.
- 18సెప్టెంబర్ 2021: నొప్పి 90% తగ్గింది. అలసట పూర్తిగా తొలగిపోయింది.
- 28 డిసెంబర్ 2021: నొప్పి పూర్తిగా నయమైంది. ఆమె తన దైనందిన కార్యకలాపాలన్నింటినీ తిరిగి ప్రారంభించారు. బాహ్యంగా రాసే మందును నిలిపివేశారు. #2 మోతాదును OD (రోజుకు ఒకసారి) కు తగ్గించారు .
- 30 జూన్ 2022: మోతాదును క్రమంగా తగ్గిస్తూ రెమిడీ ని పూర్తిగా నిలిపివేశారు.
2025 డిసెంబర్ నాటికి, సమస్య మళ్లీ తిరిగి రాలేదు మరియు ఆమె తన వృత్తిపరమైన పనులు, ధ్యాన సాధన మరియు దైనందిన కార్యకలాపాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నారు.
మలబద్ధకంతో కూడిన ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ 11583...भारत
63 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి చిన్ననాటి నుంచే గట్టి మలవిసర్జన, పూర్తిగా మలవిసర్జన కాలేదనే భావన, అలాగే ఛాతీ మరియు గొంతులో మంటతో పాటు తరచూ డక్కులు (burping) రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. 1999లో, 35 సంవత్సరాల వయస్సులో, ఆయనకు రక్తస్రావంతో కూడిన మూలవ్యాధి (bleeding piles) ఏర్పడింది. 2004లో శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు ఆయనకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యులు సూచించిన యాంటాసిడ్లు మరియు వారానికి ఒకసారి తీసుకునే విరేచన మందులతో సమస్యను నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, కేవలం పాక్షిక ఉపశమనం మాత్రమే లభించింది. 2022లో మూలవ్యాధి మళ్లీ తిరిగి వచ్చింది. దీనికి తోడు పొత్తికడుపులో మంట, ఉబ్బరం (bloating), బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా ప్రారంభమయ్యాయి. వారానికి రెండుసార్లు గట్టి మలవిసర్జన కారణంగా బాధాకరమైన రక్తస్రావం జరిగేది. సాధారణ వైద్య చికిత్స ద్వారా కేవలం 50% మాత్రమే ఉపశమనం లభించింది. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తరువాత, 2025 మే 29న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఆయనకు ఈ క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:
#1. CC4.4 Constipation…OD 40 రోజుల పాటు నిద్రకు ముందు కొబ్బరి నూనెలో కలిపి నాభిపై రాయడానికి.
#2. CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + #1…6TD
చికిత్స పురోగతి :
Ø 6 జూన్ 2025: మలం మృదువుగా మారింది. రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. పూర్తిగా మలవిసర్జన కాలేదనే భావన తొలగిపోయింది. పొత్తికడుపులో మంట, బరువుగా అనిపించడం మరియు ఉబ్బరం 50% వరకు తగ్గాయి. వైద్యులు సూచించిన మందులు ఇక అవసరం.
Ø 24 జులై 2025: అన్ని లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి. #2 మోతాదును TDS కు తగ్గించారు.
2025 డిసెంబర్ నాటికి, రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే, తనకు లభించిన ప్రయోజనాల దృష్ట్యా #2 మందును దీర్ఘకాలం కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు.
మద్యపాన వ్యసనము 11632...भारत
58 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి 1993 నుండి, అంటే 30 సంవత్సరాలుగా మద్యపాన వ్యసనానికి బానిసయ్యారు. ఆయన వృత్తిపరమైన మరియు సామాజిక జీవితం తరచూ విందులు, సమావేశాలతో కూడి వుండేది. అలాంటి సందర్భాల్లో మద్యం సేవించడం సాధారణ విషయంగా మారింది. 2003 జనవరిలో ఆయనకు ఒక తీవ్రమైన ప్రమాదం జరిగింది. దాని ఫలితంగా అనేక ఎముకలు విరిగిపోయాయి, మెదడులో రక్తగడ్డ ఏర్పడింది, మరియు జ్ఞాపకశక్తి గణనీయంగా దెబ్బతింది. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మూడు సంవత్సరాల పాటు ఇంటికే పరిమితమయ్యారు. అయినప్పటికీ, ఆయనను తరచూ కలిసే స్నేహితుల సహాయంతో మద్యపాన వ్యసనం కొనసాగుతూనే ఉంది. 2006 ఏప్రిల్ నాటికి ఆయన క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి వచ్చారు. వైబ్రియానిక్స్ ద్వారా ప్రయోజనం పొందిన ఆయన భార్య, వారానికి కనీసం ఐదు రోజులైనా మద్యం సేవిస్తున్న తన భర్తకు సహాయం చేయమని సాధకుడిని సంప్రదించారు. 26 నవంబర్ 2023, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది.
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.3 Addictions…TDS కానీ అతని భార్య సూచనతో OD గా తీసుకున్నారు.
చికిత్స పురోగతి:
- 24 డిసెంబర్ 2023: ఆయనలో శక్తి పెరిగిన భావన కలగడంతో స్వచ్ఛందంగా మోతాదును TDS కు పెంచుకున్నారు.
- 18 ఫిబ్రవరి 2024: మద్యం సేవించడం వారానికి రెండు రోజులకు తగ్గింది. ఎలాంటి ఉపసంహరణ లక్షణాలు (withdrawal symptoms) కనిపించపోగా దీనికి విరుద్ధంగా, ఆయన మరింత ప్రశాంతంగా మరియు మానసికంగా స్థిరత్వంతో ఉండసాగారు.
- 28 Apr 2024: వ్యసనం పూర్తిగా తొలగిపోయింది. ఒక నెలపాటు ఆయన మద్యం అస్సలు సేవించలేదు.
- 23 June 2024: మోతాదును క్రమంగా తగ్గించిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు.
2025 డిసెంబర్ నాటికి, ఆయన పూర్తిగా మద్యపానానికి దూరంగా ఉన్నారు. తన భర్తను 30 సంవత్సరాల వ్యసనం నుండి విముక్తి చేసినందుకు ఆయన భార్య సాయి వైబ్రియానిక్స్ పట్ల గాఢమైన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
ఋతుస్రావంలో తరుచుదనం అండాశయంలో కణితి 10375...भारत
46 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళా ప్రాక్టీషనర్ 2014 ఏప్రిల్ నుండి అసమాన మరియు తక్కువ రుతుస్రావం సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా నాలుగు రోజులపాటు ఉండే రుతుస్రావం, 5 నుండి 7 రోజుల ఆలస్యంతో వచ్చి కేవలం 2 నుండి 3 రోజులే కొనసాగేది. కొన్ని సందర్భాల్లో కేవలం స్వల్ప చుక్కల రూపంలో మాత్రమే ఉండేది. 2014 ఆగస్టు 28న నిర్వహించిన పెల్విక్ స్కాన్‌లో కుడి అండాశయంలో 38 × 29 మి.మీ. పరిమాణం గల సాధారణ కణితి ఉన్నట్లు, అలాగే గర్భాశయం స్వల్పంగా పెద్దదిగా ఉన్నట్లు తేలింది. గత పది రోజులుగా స్వల్ప యోని దురద కూడా ఉండేది. దీంతో ఆమె వెంటనే ఈ క్రింది రెమిడీ తయారు చేసుకుని తీసుకోవడం ప్రారంభించారు –
#1. CC8.4 Ovaries & Uterus + CC8.5 Vagina & Cervix + CC8.6 Menopause + CC12.1 Adult tonic…TDS; మరే ఇతరమైన మందులు వాడలేదు.
చికిత్స పురోగతి:
- 7 సెప్టెంబర్ 2014: యోని దురద పూర్తిగా తగ్గిపోయింది; #1 ని క్రింది విధంగా మెరుగు పరిచారు #2. SM39 Tension + CC8.4 Ovaries & Uterus + CC8.6 Menopause + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic…TDS.
- 9 మార్చ్ 2015: ఒక ఆయుర్వేద వైద్యుడు నాడి పరీక్ష ఆధారంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఉండవచ్చని సూచించారు. అందువల్ల మందును ఈ విధంగా మార్చారు: #2 to #3. NM16 Drawing + SM2 Divine Protection + SM39 Tension + SR264 Silicea 30C + SR274 Aurum Mur Nat 6X + SR318 Thuja 30C + SR537 Uterus + SR555 Lilium Tig…TDS.
2015 జూలై నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆమె ఉద్యోగం మరియు కుటుంబ పరమైన కారణాల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
- 29 సెప్టెంబర్ 2015: 17 రోజులపాటు పెద్ద రక్తగడ్డలతో కూడిన అధిక రుతుస్రావం జరిగింది. #3 మోతాదును 6TD కు పెంచారు.
- 5 నవంబర్ 2015: మరోసారి ఐదు రోజులపాటు అధిక రుతుస్రావం జరిగింది.
- 10 నవంబర్ 2015: పెల్విక్ స్కాన్ నిర్వహించగా, రేడియాలజిస్ట్ ఆశ్చర్యపోయారు. గర్భాశయం పూర్తిగా సాధారణ స్థితిలో ఉందని, దానిని “పాఠ్యపుస్తకంలో ఉండే ఆదర్శ గర్భాశయం గా అభివర్ణించారు. కుడి అండాశయంలో కణితి జాడ కూడా కనిపించలేదు..
- 15 నవంబర్ 2015: మోతాదును TDS కు తగ్గించారు.
- 27 డిసెంబర్ 2015: సాధారణ రుతుచక్రం తిరిగి ప్రారంభమైంది.
- 25 మే 2016: రుతుచక్రం సాధారణంగానే కొనసాగింది. క్రమంగా మోతాదును తగ్గిస్తూ #3 మందును నిలిపివేశారు.
2018 మార్చిలో చివరి రుతుస్రావం అనంతరం, ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజంగా మెనోపాజ్ దశలోకి ప్రవేశించారు. ఈ మొత్తం ప్రయాణంలో లభించిన దివ్య అనుగ్రహానికి ఆమె స్వామివారి పట్ల గాఢమైన కృతజ్ఞతతో ఉన్నారు.
మోకాళ్ళ లో నొప్పి 11654...भारत
64 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి 2013 నుండి, అంటే పది సంవత్సరాలుగా, రెండు మోకాళ్లలో నొప్పితో బాధపడుతున్నారు. ఎడమ మోకాలు కుడి మోకాలుతో పోలిస్తే మరింత తీవ్రంగా ప్రభావితమైంది. ప్రారంభంలో నడిచేటప్పుడు నొప్పి స్వల్పంగా ఉండేది. అయితే మెట్లు ఎక్కేటప్పుడు అది గణనీయంగా పెరిగేది. ఆయన ఒక ఉక్కు కర్మాగారంలో పనిచేసేవారు. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా 54 మీటర్ల ఎత్తు గల క్రేన్‌పై తరచుగా ఎక్కాల్సి వచ్చేది. ఈ పని తన సమస్య మరింత తీవ్రమవడానికి ప్రధాన కారణమైందని ఆయన భావించారు.
2016లో వైద్యుడు మోకాళ్ల కీళ్ల అరిగిపోవడం వల్ల ఈ నొప్పి వస్తోందని నిర్ధారించి, స్టెరాయిడ్ మరియు నొప్పి నివారణ మందులను సూచించారు. వైద్యుడి సలహా మేరకు ఆయన క్రేన్ ఎక్కే పనిని నిలిపివేసి వేరే విభాగానికి మారారు. అయినప్పటికీ మందులు ఆపిన వెంటనే నొప్పి తిరిగి వచ్చేది. 2021 నుండి అవసరమైనప్పుడు మాత్రమే నొప్పి నివారణ మాత్రలపై ఆధారపడసాగారు. కాలక్రమేణా నొప్పి మరింత పెరిగింది. 2023 నాటికి ఇంట్లో మెట్లు ఎక్కడం కూడా కష్టంగా మారింది. నడిచేటప్పుడు మరియు మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ల కాప్స్ ధరించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలగలేదు.
2023 ఆగస్టు 21న సాధకుడిని సంప్రదించినప్పుడు, రెండు రోజులుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. సాధారణ నొప్పి నివారణ మందు కూడా తక్కువ ఉపశమనమే ఇస్తోంది. తన పరిస్థితి గురించి ఆయన స్పష్టంగా ఆందోళనతో కనిపించారు. ఆయనకు ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…6TD అదే మందును ఆవాల నూనెలో కలిపి బాహ్యంగా రాయడానికి రోజుకు రెండుసార్లు (BD) ఇచ్చారు. నొప్పి నివారణ మాత్రలను అవసరమైనప్పుడు కొనసాగించేందుకు అనుమతించారు
చికిత్స పురోగతి:
- 20 సెప్టెంబర్ 2023: రెండు మోకాళ్ల నొప్పి 30% తగ్గింది. మోకాళ్ల కాప్స్ ధరించి స్వల్ప నొప్పితో మెట్లు ఎక్కగలిగారు. #1మందును ఈ విధంగా మెరుగుపరిచారు #2. CC18.5 Neuralgia + #1.
- 5 నవంబర్ 2023: నొప్పి 50% తగ్గింది. మోకాళ్ల కాప్స్‌తో సౌకర్యంగా మెట్లు ఎక్కగలగడం రోగికి ఎంతో ఆనందాన్ని కలిగించింది.
- 24 డిసెంబర్ 2023: నొప్పి నివారణ మాత్రలు ఇక అవసరం కాలేదు.
- 23 Jజనవరి 2024: 70% మెరుగుదల కనిపించింది. మోకాళ్ల కాప్స్ లేకుండానే సౌకర్యంగా నడవగలిగారు.; #2 మందును మరింత మెరుగుపరిచారు: #3. CC13.1 Kidney & Bladder tonic + CC20.6 Osteoporosis + #2.
- 7 జులై 2024: నొప్పి కేవలం 10% మాత్రమే మిగిలింది.
- 24 Sept 2024: నొప్పి పూర్తిగా తొలగిపోయింది. మోకాళ్ల కాప్స్ లేకుండానే సౌకర్యంగా నడవడం, మెట్లు ఎక్కడం ప్రారంభించారు. #3 మోతాదును మౌఖిక మందు – TDS బాహ్యంగా రాసే మందు – OD కి తగ్గించారు:
- 23 నవంబర్ 2024: బాహ్యంగా రాసే మందును నిలిపివేశారు. మౌఖిక మందును క్రమంగా తగ్గిస్తూ పూర్తిగా ఆపివేశారు.
2025 డిసెంబర్ నాటికి, ఆయన ఎలాంటి అసౌకర్యం లేకుండా నడవగలుగుతున్నారు, మెట్లు ఎక్కగలుగుతున్నారు మరియు మోకాళ్ల నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు.
శ్వాసకోశ ఎలర్జీ 11634...भारत
10 సంవత్సరాల వయస్సు గల ఒక బాలుడు 2021 జూన్ నుండి, అంటే ఐదు నెలలకుపైగా, తరచూ తుమ్ములు, ముక్కు మూసుకుపోవడం, కొన్నిసార్లు తలనొప్పితో కూడిన శ్వాసకోశ అలెర్జీ సమస్యతో బాధపడుతున్నాడు. దుమ్ము, సుగంధ ద్రవ్యాలు వంటి బలమైన వాసనలకు గురైనప్పుడు ఈ లక్షణాలు ప్రేరేపించబడేవి. సాధారణంగా నెలకు మూడు లేదా నాలుగు సార్లు ఈ సమస్య వచ్చేది. ప్రతి సారి దాదాపు రెండు రోజులపాటు కొనసాగేది. అదనంగా, ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే 6 నుండి 8 సార్లు తుమ్మేవాడు. అలెర్జీ కారకాలకు 30 నిమిషాలకంటే ఎక్కువసేపు గురైతే, ముక్కు పూర్తిగా మూసుకుపోయి రోజంతా అలాగే ఉండేది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది.
ఈ సమస్యలు కోవిడ్-19 ఆంక్షల సమయంలో ప్రారంభమయ్యాయి. ఆ కాలంలో బాలుడు ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. అంతకు ముందు అతను ఆరోగ్యంగా ఉండి, బహిరంగ క్రీడల్లో చురుకుగా పాల్గొనేవాడు. కుటుంబంలో కూడా శ్వాసకోశ అలెర్జీ చరిత్ర ఉంది. ఆవిరి పట్టడం మరియు గోరువెచ్చని నీరు తాగడం వల్ల కొంత ఉపశమనం లభించి ముక్కు మూసుకు పోవడం సాధారణంగా సాయంత్రం లేదా రాత్రికి తగ్గిపోయేది. కుటుంబ సభ్యుల సహాయంతో తెలిసిన అలెర్జీ కారకాలను వీలైనంతవరకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడు. అతను ఎలాంటి ఇతర చికిత్స పొందడం లేదు. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తరువాత, తల్లిదండ్రులు తమ ప్రాంతంలో నివసిస్తున్న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. 2021 నవంబర్ 12న, ఆయన ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC19.2 Respiratory allergies…TDS; లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, 2 గంటలపాటు తరువాత మూడు రోజులపాటు 6TD
చికిత్స పురోగతి:
- 28నవంబర్ 2021: తలనొప్పి ప్రారంభమైంది. అందువల్ల: #2 CC11.3 Headaches … BD కొబ్బరి నూనెలో కలిపి బాహ్యంగా రాయడానికి ఇచ్చారు. కొన్ని రోజులు ఉపశమనం లభించగా, కొన్ని రోజులు మళ్లీ లక్షణాలు కనిపించాయి.
- 7 Dec 2021: తలనొప్పి రెండు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. #2 నిలిపివేశారు. #1 ను ఈ విధంగా మెరుగుపరిచారు:#3 CC9.2 Infections Acute + CC12.2 Child Tonic + #1 … 6TD గత మూడు రోజులుగా చెవుల్లో దురద ఉండటంతో: #4 CC5.1 Ear Infections … OD కొబ్బరి నూనెలో కలిపి చెవిలో చుక్కలుగా వాడమని ఇచ్చారు.
- 12 Dec 2021: చెవి దురద 75% తగ్గింది. #3 మోతాదును TDS కు తగ్గించారు..
- 26 జనవరి 2022:ఉదయం నుండి ముక్కు మూసుకు పోవడం కనుక ఇచ్చారు.
- 8 ఫిబ్రవరి 2022: తుమ్ములు, చెవి దురద, కంటి దురద పూర్తిగా తగ్గిపోయాయి; #4 మరియు #6 నిలిపివేశారు. #5 మరియు #7 మోతాదును TDS కు తగ్గించారు
- 25 ఏప్రిల్ 2022: మధ్యమధ్యలో ముక్కు మూసుకుపోవడ గురించి ఫిర్యాదు చేయడంతో: #1 ను కొబ్బరి నూనెలో కలిపి ముక్కు చుక్కలుగా ఇచ్చారు.
- 10 మే 2022: అన్ని లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి. ముక్కులో వేసే చుక్కలను 25 జులై 2022.న నిలిపివేశారు
- 30 సెప్టెంబర్ 2022: #5 మందును క్రమంగా తగ్గిస్తూ నిలిపివేశారు. #7 ను నిర్వహణ మోతాదుగా OD కు తగ్గించారు..
2025 డిసెంబర్ నాటికి, వ్యాధి లక్షణాలు పునరావృతం లేకుండా బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు.
ప్రాక్టీషనర్ల విభాగము 02308...स्लोवेनिया
గిజెలా ఖాన్ 02308…స్లొవేనియా 2002 ఆగస్టులో డా. అగర్వాల్ నిర్వహించిన ఏడు రోజుల ప్రాథమిక వైబ్రియానిక్స్ కోర్సును పూర్తి చేసి ప్రాక్టీషనర్ గా మారారు. ఆ క్షణం నుండి సేవ ఆమె జీవితానికి కేంద్రబిందువుగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా ఆమె తనను
తాను స్వస్థత పరుచు కోవడమే కాకుండా అనేకమంది రోగులను కూడా స్వస్థపరచడంతో ఈ సాధన పట్ల ఆమెకున్న గాఢమైన భక్తి, అంకితభావానికి ఆదర్శ ప్రతీకగా నిలిచింది. ఆరోగ్య సమస్యలు మరియు కంటి చూపు తగ్గిపోవడం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆమె ఎన్నో సంవత్సరాల పాటు సాయి వైబ్రియానిక్స్ న్యూస్‌లెటర్‌కు అధికారిక స్లోవేనియన్ అనువాదకురాలిగా సేవలందిస్తూ 2024 మధ్యకాలం వరకు ఈ సేవను నిరంతరంగా కొనసాగించారు. హృదయాన్ని స్పృశించే ఈ అనుభవ వర్ణనలో, ఆమె తన సేవా ప్రయాణాన్ని మరియు అంకితభావాన్ని మనతో పంచుకుంటున్నారు.
నా జీవితమంతా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఎలా నన్ను నడిపించారు, రక్షించారు, స్వస్థపరిచారు వారి కృపకు వైబ్రియానిక్స్ ఒక మృదువైనదైనా శక్తివంతమైన సాధనంగా ఎలా నిలిచింది, అనే ఈ అనుభవాన్ని గాఢమైన కృతజ్ఞతతో మీతో పంచుకుంటున్నాను.
2002లో నేను ప్రాక్టీషనర్ గా మారిన కొద్దికాలానికే, స్వామి జన్మదినం అనంతరం నాకు తీవ్రమైన ఫ్లూ వచ్చింది. నేను ఎంతో బలహీనంగా మారిపోయాను. ఆసుపత్రిలో పరీక్షలు మరియు ఇన్ఫ్యూషన్ చికిత్స తీసుకున్నప్పుడు అది అంతర్గతంగా ఒక గొప్ప శుద్ధి ప్రక్రియలాగా అనిపించింది. దాదాపు 10 కిలోల బరువు తగ్గినప్పటికీ, నేను నూతన ఉత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాను. 2003 ఫిబ్రవరిలో నేను స్లోవేనియాకు తిరిగి వెళ్లినప్పుడు, ఆస్తమా స్పెషలిస్ట్ డాక్టర్ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. రెండు నెలలుగా నాకు ఒక్కసారి కూడా ఆస్తమాతో ఇబ్బంది రాలేదు, అంతేకాక నేను అన్ని మందులు పూర్తిగా నిలిపివేశాను. దాదాపు పది సంవత్సరాల పాటు ప్రతి రాత్రి దగ్గుతో బాధపడుతూ, అనేక సైనస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న నేను, ఆస్తమా నుండి పూర్తిగా విముక్తి పొందాను. అప్పటి నుండి నాకు ఆస్తమా పూర్తిగా తగ్గిపోయి తిరిగి మరలా రాలేదు.
2007 జనవరిలో నాకు గ్రేడ్-III రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 24 లింఫ్ నోడ్లలో 13 ప్రభావితమయ్యాయి. 2007 ఫిబ్రవరి 28న శస్త్రచికిత్స జరిగింది. అనంతరం కీమోథెరపీ ప్రారంభమైంది. అయితే గుండె సంబంధిత సమస్యల కారణంగా రెండు సెషన్ల తర్వాత దానిని నిలిపివేయాల్సి వచ్చింది. 2007 ఆగస్టు నుండి 2008 జూలై వరకు నేను బయోలాజికల్ థెరపీ మరియు రేడియేషన్ చికిత్స పొందాను. ఈ మొత్తం కాలంలో, వైబ్రియానిక్స్ మందులను నా అల్లోపతీ చికిత్సకు తోడ్పాటుగా ఉపయోగించాను. ముఖ్యంగా, డా. అగర్వాల్ మార్గదర్శకత్వంలో కీమోథెరపీ మందులలో మిగిగిలిన భాగంతో తయారుచేసిన ఒక నోసోడ్‌ను ఉపయోగించాను. ఇది చికిత్స దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించడంలో ఎంతో సహాయపడింది.
చికిత్స పూర్తయిన కొద్దికాలానికే, 2008 జూలైలో ముంబైలో నిర్వహించిన 42 రోజుల మానవ విలువల సెమినార్‌లో పాల్గొనే అపూర్వ అవకాశాన్ని స్వామి ప్రసాదించారు. అనారోగ్యం తాలూకా ఆలోచనలను అన్నింటిని వదిలివేసి సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక అధ్యయనంలో పూర్తిగా లీనమై మరింత బలంగా, ఉత్సాహంగా, ఉన్నత లక్ష్యంతో నిండిన వ్యక్తిగా మారాను.
సంవత్సరాలు గడిచేకొద్దీ, నేను అన్ని అలోపతి మందులను క్రమంగా నిలిపివేశాను. అయితే వైద్యుల పర్యవేక్షణలో నిరంతర పరీక్షలు 2023 వరకు కొనసాగాయి. నేటికీ నివారణ చర్యగా, వారానికి ఒకసారి CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths మరియు SM13 Cancer మందులను మాత్రమే తీసుకుంటున్నాను. ఈ మొత్తం ప్రయాణంలో నేను డా. అగర్వాల్ గారితో నిరంతర సన్నిహిత బాంధవ్యాన్ని కొనసాగించాను. ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం, ధైర్యం మరియు భరోసా నాకు అమూల్యమైనవి.
నాకు క్యాన్సర్ నిర్ధారణ అయ్యి పదిహేడు సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత, నేను గతాన్ని ఎంతో వినమ్రతతో, గాఢమైన కృతజ్ఞతతో తిరిగి చూసుకుంటూఉంటే ఆస్తమా నుండి విముక్తి పొందడం నుండి క్యాన్సర్‌ను అధిగమించడం వరకు, సాయి వైబ్రియానిక్స్ నేర్చుకోవడం నుండి దాని ద్వారా సేవ చేయడం వరకు, ప్రతి దశలో స్వామి నా అచంచల సహచరుడిగా, శక్తి ప్రదాతగా నిలిచారు. నా ఈ ప్రయాణం ఇతరులకు కూడా ప్రేరణగా నిలవాలని నేను ఆశిస్తున్నాను. ఇది వారి విశ్వాసాన్ని మరింత బలపరచాలని, ధైర్యాన్ని పెంపొందించాలని, అలాగే ఆయన అపారమైన ప్రేమ మరియు స్వస్థపరిచే శక్తిపై అచంచలమైన నమ్మకాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రాక్టీషనర్ల విభాగము 11653...भारत
జె. దేవనాధన్ 11652…ఇండియా , వీరికి స్వస్థపరిచే సేవ ఒక క్లినిక్‌లో ప్రారంభం కాలేదు – అది పంట పొలాల్లో ప్రారంభమైంది. విద్యాపరంగా ఆయన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ అయినప్పటికీ జీవితం ఒక అనుకోని మలుపు తిరిగి తనకు
ఎంతో సంతృప్తినిచ్చే సేంద్రీయ వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుని, పంటలు పండించడంతో పాటు సాంప్రదాయిక చెక్క గానుగ నూనెలను తయారు చేయడం ప్రారంభించడమ్ వరకు కొనసాగింది. ఆ జీవిత దశలోనే వీరికి సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖ పరిచయమైంది. వైబ్రియానిక్స్ వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలకన్నా, అది పూర్తిగా ఉచిత సేవగా వేలాది మందికి చేరుతూ, అనేక స్వస్థత కథలను సృష్టిస్తున్న విధానం ఆయనను ఎక్కువగా ఆకర్షించింది. ఆ సేవాస్ఫూర్తి ఆయన హృదయాన్ని తాకగా నిశ్శబ్దంగా ప్రేరణ పొంది ఆయన, ఈ పవిత్ర సేవలో భాగస్వామి కావాలని నిర్ణయించుకుని, 2023 ఏప్రిల్ నుండి AVPగా సేవలందిస్తున్నారు. చిన్నదే అయినప్పటికీ ప్రభావవంతమైన తన సేవా ప్రయాణాన్ని ఆయన మనతో ఇలా పంచుకుంటున్నారు.
నేను ఇంకా వైబ్రియానిక్స్‌లో కొత్తవాడినే ఐనప్పటికీ అతి కొద్దిమంది మానవ రోగులకే చికిత్స చేసినప్పటికీ, ఆ అనుభవాలు నా మనసుపై చెరగని ముద్ర వేశాయి. దాదాపు పది సంవత్సరాలుగా తీవ్రమైన, పునరావృతమయ్యే తలనొప్పులతో బాధపడుతున్న నా బంధువుల్లో ఒకరికి CC11.3 Headaches + CC12.1 Adult Tonic ఒక్క మోతాదు ఇచ్చాను. ఆమెకు వెంటనే ఉపశమనం లభించింది. ఆమె ఒక నెలపాటు ఆ మందును కొనసాగించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెకు తలనొప్పి తిరిగి రాలేదు. మరో సందర్భంలో, నిరంతర వాంతులతో బాధపడుతున్న ఒక రోగికి CC4.6 Diarrhoea + CC15.1 Mental & Emotional Tonic ఒక్క మోతాదు ఇచ్చాను. అతనికి తక్షణ ఉపశమనం లభించింది. ఈ అనుభవం నా విశ్వాసాన్ని మరింత బలపరిచింది.
నేను పెంచుకొనే ఆవుల్లో ఒకటి దాదాపు మూడు సంవత్సరాలుగా గర్భం దాల్చలేదు. ఎంతో సహనంతో ప్రార్ద్ధిస్తూ CC1.1 Animal Tonic + CC8.2 Pregnancy Tonic మందులను దానికి ఇచ్చాను. కొన్ని నెలల్లోనే ఆ ఆవు గర్భం దాల్చి, 2025 ఫిబ్రవరిలో ఆరోగ్యవంతమైన దూడకు జన్మనిచ్చింది. ఇప్పుడు అది మళ్లీ సూడితో ఉంది. 2026 ఫిబ్రవరిలో రెండవ దూడకు జన్మనివ్వనుంది. నాకు ఇది యాదృచ్ఛికం కాదు – ఇది స్వామి కృప కార్యరూపం దాల్చిన దృష్టాంతం. జంతువులంటే నాకు ఎంతో ప్రేమ. అందుకే నా ఆవులను ఎంతో శ్రద్ధగా పోషిస్తూ, సంరక్షిస్తూ ఉంటాను. అవి ఇక దూడలను కనలేని స్థితికి చేరినప్పుడు సాధారణంగా ఎదుర్కొనే వధశాలల దురదృష్టకరమైన గమ్యాన్ని తప్పించగలిగితే ఎంతో సంతోషంగా భావిస్తాను.
నా పొలాలు కూడా స్వస్థతకు సంబంధించిన తమదైన నిశ్శబ్ద కథను వినిపిస్తాయి. పాలకూర, వంకాయ వంటి పంటలకు CC1.2 Plant Tonic + CC21.7 Fungus మందులను, సేంద్రీయ ఎరువులు మరియు సహజ పురుగుమందులతో కలిసి క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నాను. అలాగే, పశువుల పేడ్లలో చీమలు మరియు ఈగలను నియంత్రించడానికి CC21.4 Stings & Bites మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ మందును నీటిలో కలిపి పశువులపై చల్లడం ద్వారా ఈగలు మరియు పేనుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గమనించాను.
నా పంటల మధ్య, నా పశువుల మధ్య నిలబడి ఉన్నప్పుడు నేను ఎంతో వినమ్రతను అనుభవిస్తాను. స్వామియే నిజమైన వైద్యుడు, స్వస్థపరిచేవారు ఆని పరిపూర్ణంగా విశ్వశిస్తాను. నేను కేవలం ఒక సాధనం మాత్రమేనని భావిస్తాను. మానవులకు, జంతువులకు, అలాగే నిశ్శబ్దంగా జీవనాధారాన్ని అందించే మొక్కలకు కూడా అవసరమైన చోట స్వాంతన మరియు స్వస్థతను అందించే అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి కృతజ్ఞుడిగా ఉంటాను.

ప్రశ్నలు జవాబులు
Q1. : ఒక రోగి ఏదైనా వ్యాధికి వైబ్రియానిక్స్ మాత్రలు తీసుకుంటున్నప్పుడు, స్వస్థత ప్రక్రియను బలపరచేందుకు అదే మందును బ్రాడ్‌కాస్ట్ చేయవచ్చా?
A. లేదు. ఒక రోగి ఇప్పటికే ఒక నిర్దిష్ట వ్యాధికి వైబ్రియానిక్స్ మాత్రలు తీసుకుంటున్నట్లయితే, అదే సమస్యకు ఒకేసారి బ్రాడ్‌కాస్టింగ్ చేయకూడదు. అయితే, వేరే వ్యాధికి ప్రత్యేకంగా తయారు చేసిన మందుతో బ్రాడ్‌కాస్ట్ చేయవచ్చు. ఇది వైబ్రేషన్ల స్పష్టతను కాపాడుతుంది మరియు వైబ్రియానిక్స్, రేడియోనిక్స్ మూలసూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మాత్రలు ఇవ్వడం సాధ్యం కానప్పుడు లేదా రోగి వాటిని తీసుకోలేని పరిస్థితిలో మాత్రమే బ్రాడ్‌కాస్టింగ్ ఉపయోగించాలి. ఒక స్పష్టమైన, ఏకైక వైబ్రేషనల్ సంకేతం అత్యంత స్థిరమైన ఫలితాలను ఇస్తుంది. అదనంగా, ఒకే విధమైన చికిత్సా మార్గాన్ని ఉపయోగించినప్పుడు, సాధకుడు రోగి పురోగతిని స్పష్టంగా అంచనా వేసి అవసరమైన మార్పులు చేయగలుగుతాడు.రెండు విధాలుగా ఒకేసారి చికిత్స అందించడం వల్ల వైబ్రేషనల్ సందేశం అస్పష్టంగా మారవచ్చు. ముఖ్యంగా సున్నితమైన రోగులలో ఇది అధిక ప్రభావాన్ని కలిగించవచ్చు.
_____________________________________________________________________________________________________
Q2. కొన్నిసార్లు బాబా ఫోటో నుండి అమృతం లేదా తేనె ప్రత్యక్షమవుతుంది. దానిని SRHVP ద్వారా పొటెన్సైజ్ చేసి వైద్యం కోసం లేదా ఇతరుల ఆరోగ్య ప్రయోజనాల కోసం పంచుకోవచ్చా?
A. విభూతి, అమృతం లేదా తేనె వంటి దివ్య ఆవిర్భావములు, వాటిని స్వీకరించిన వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక లేదా శారీరక అవసరాలకు ప్రత్యేకంగా అనుగుణంగా ఉండవచ్చు. బాబా మీ ప్రస్తుత పరిస్థితికి అనుగుణమైన ప్రత్యేక శక్తిని వాటిలో నింపి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వాటిని మీ స్వీయ సాధన మరియు స్వస్థత కోసం మాత్రమే ఉపయోగించాలి. వాటిని పొటెన్సైజ్ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం శక్తి పరంగా సరిపోకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో బాబా అలాంటి దివ్య ప్రసాదాన్ని ఇతరులతో పంచుకోవాలని సంకల్పిస్తారు. అప్పుడు సాధారణంగా మీకు చాలా స్పష్టమైన అంతరంగ ప్రేరణ లేదా పునరావృత బాహ్య ధృవీకరణ లభిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆ శక్తి విశ్వవ్యాప్తమైనదిగా ఉంటుంది. దివ్య పదార్థం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడు దానిని సాధారణ శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసం ఉదారంగా పంచుకోవచ్చు.
_____________________________________________________________________________________________________
Q3. హోమియోపతీలో 1M, 10M వంటి అధిక పొటెన్సీలను నెలకు ఒకసారి మాత్రమే ఇస్తారు. కానీ వైబ్రియానిక్స్‌లో అదే పొటెన్సీకి TDS సూచిస్తారు. ఇది చాలా ఎక్కువ మోతాదు కాదా?
A. హోమియోపతీలో 1M లేదా 10M వంటి అధిక పొటెన్సీలు రోగి ప్రాణశక్తిని బలంగా ప్రేరేపిస్తాయి. అందువల్ల తరచుగా ఇవ్వడం వల్ల అగ్రవేషన్ (లక్షణాల తాత్కాలిక తీవ్రత) సంభవించవచ్చు కనుక వాటిని అరుదుగా ఇస్తారు. వైబ్రియానిక్స్‌లో కూడా ఇలాంటి పొటెన్సీ సంఖ్యలు ఉపయోగించినప్పటికీ, వాటి పని విధానం భిన్నంగా ఉంటుంది. వైబ్రియానిక్స్ రెమిడీ ఒక మృదువైన వైబ్రేషనల్ సంకేతం మాత్రమే. అది ప్రతిచర్యను ప్రేరేపించే ఉద్దీపన కాదు. అందువల్ల TDS వంటి తరచు మోతాదులు ఇవ్వడం ద్వారా సరిచేసే వైబ్రేషన్‌ను శరీరంలో నిలుపుకోవచ్చు. ఎందుకంటే ఈ వైబ్రేషన్లు ఎక్కువకాలం శరీరంలో నిలిచి ఉండవు. కాబట్టి వైబ్రియానిక్స్‌లో తరచుగా మందు ఇవ్వడం సురక్షితమైనది మరియు అవసరమైనది. హోమియోపతీలో మాత్రం అధిక పొటెన్సీలను అరుదుగా ఇవ్వడం అత్యవసరం.
_____________________________________________________________________________________________________
Q4. కొంతమంది ప్రాక్టీషనర్ని రోగుల బాధ లను లోతుగా అనుభూతి చెందుతారు. కొన్నిసార్లు సంప్రదింపుల అనంతరం అదే లక్షణాలు తమలో కూడా అనుభవిస్తారు. అటువంటి పరిస్థితిలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
A..రోగుల పట్ల గాఢమైన సానుభూతి కలిగిన సాధకులు కొన్నిసార్లు “సింపతటిక్ రెసొనెన్స్” అనే తాత్కాలిక ప్రతిబింబ ప్రభావాన్ని అనుభవించవచ్చు. ఇది కరుణకు సంకేతమైనప్పటికీ, వారిలో శక్తి ప్రసారానికి దారితీస్తుంది. కనుక ఈ సూచనలను పాటించండి: సమావేశానికి ముందు: ముందుగా దైవ రక్షణ కోసం ఇలా ప్రార్థించండి. మీరు బంగారు కాంతితో కూడిన ఒక శంఖువులో కూర్చుని ఉన్నట్లు, దాని అడుగు భాగం నీలి కాంతి వలయంతో రక్షించబడినట్లు ఊహించుకోండి. “నేను కేవలం ఒక సాధనం మాత్రమే; స్వస్థత నాలోనుంచి కాదు, నా ద్వారా ప్రవహిస్తుంది” అని గుర్తుచేసుకోండి.
సమావేశం సమయంలో: లక్షణాలను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సమాచారంగా మాత్రమే చూడండి. రోగి పరిస్థితిని మాటల ద్వారా గుర్తించండి; అవగాహన లేకుండా దానిని మీలో ప్రతిబింబించనివ్వకండి. బాధను స్వీకరించడం కాదు, సానుభూతితో వినడం నేర్చుకోండి.
సమావేశం అనంతరం: చేతులు, ముఖం కడుక్కోండి. నీటిని శక్తి శుద్ధి సాధనంగా భావించండి. బయటకు వెళ్లి మూడు లోతైన శ్వాసలు తీసుకోండి. కొద్దిసేపు చెప్పులు లేకుండా నేలపై నడవండి. మీ పాదాల నుండి భూమిలోకి శక్తి ప్రవహిస్తూ ప్రతికూల శక్తిని విడుదల చేస్తున్నట్లు ధ్యానించండి. దైవానికి కృతజ్ఞతలు తెలియజేసి మిగిలిన శక్తిని విడిచిపెట్టండి. మీ భావోద్వేగాలను పరిశీలించండి. వాటిని మీతో తీసుకెళ్లవద్దు. అవసరమైతే: CC15.1 Mental & Emotional Tonic వంటి సరైన మందును స్వయంగా తీసుకోవచ్చు.
బాబా పలుమార్లు నొక్కి చెప్పినట్లుగా, వైద్యులు మరియు సాధకులు దివ్యశక్తికి కేవలం సాధనాలు మాత్రమే. వారు మూలశక్తి కాదు. అందువల్ల సేవ చేస్తూనే వైరాగ్యం, వినమ్రతలను పెంపొందించుకోవాలి.
_____________________________________________________________________________________________________
Q5. సిగరెట్లకు బదులుగా వేపింగ్ (Vaping) సురక్షితమని భావించి చాలా మంది యువత దానిని ఉపయోగిస్తున్నారు. కానీ వాటి ఆవిరిలో నికోటిన్ మరియు ఇతర హానికర రసాయనాలు ఉంటాయి. వాటి ప్రభావాన్ని తగ్గించే మందు ఏదైనా ఉందా? అలాగే వేపింగ్ వ్యసనాన్ని ఎలా తొలగించవచ్చు?
A. వేపింగ్ వల్ల కలిగే హానికర ప్రభావాలను తగ్గించేందుకు, ఆ ఆవిరినే పొటెన్సైజ్ చేయవచ్చు. దీనికోసం ఆవిరిని దూది ఉండపై ఘనీభవింపజేసి సీసాలో ఉంచండి, లేదా స్ట్రా ద్వారా నీరు ఉన్న సీసాలోకి ఊది తర్వాత దానిని 1M పొటెన్సీలో పొటెన్సైజ్ చేయండి. ఈ మందు వేపింగ్ వల్ల కలిగే హానికర ప్రభావాలను, అలాగే పరోక్షంగా ఆ ఆవిరిని పీల్చుకునే వారిపై పడే ప్రభావాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
వ్యసన నివారణ కోసం అదే మందును 200C పొటెన్సీలో తయారు చేయవచ్చు. ఇది కోరికలను తగ్గించి, ఆధారపడే స్వభావాన్ని క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, ఈ మందు ఉత్తమ ఫలితాలను ఇవ్వాలంటే వ్యక్తిలో మానేయాలనే దృఢ సంకల్పం మరియు ఆరోగ్యకర జీవనశైలి కూడా అవసరం.
దివ్య వైద్యుని దివ్య వాణి
“సమయానికి భోజనం చేయండి. తగినంతగా తినండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి మీకు అందిస్తున్న ఆహారాన్ని ఆనందంగా స్వీకరించండి. దానిలో లోపాలు వెతకకండి, తిరస్కరించకండి. ప్రేమతో తింటే అది మీ శరీరాన్ని బాగా పోషిస్తుంది. అప్పుడు మీ శరీరం ఎంతటి పనినైనా చేయగలదు.”
...శ్రీ సత్య సాయి బాబా ఆరోగ్యమే మహాభాగ్యం దివ్య ప్రసంగము సమ్మర్ షవర్స్ https://sssbpt.info/summershowers/ss2002/ss2002d12.pdf
““సేవలో మొదటి పాఠం కుటుంబంలోనే నేర్చుకోవాలి. తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు—ఈ చిన్న కుటుంబ వలయంలో ప్రేమతో కూడిన సేవను ఆచరించాలి. అది ఇంటి వెలుపల ఎదురుచూస్తున్న విశాలమైన సేవకు సిద్ధం చేస్తుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుని వ్యక్తిత్వమే ఆ కుటుంబ శాంతి, శ్రేయస్సును నిర్ణయిస్తుంది. ప్రతి కుటుంబపు స్వభావమే గ్రామం లేదా సమాజం యొక్క ఆనందానికి పునాది. దేశ ప్రగతి కూడా ఆ సమాజాల బలం, సంతోషాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశం మరియు ప్రపంచ శ్రేయస్సు కోసం సేవాభావం, ఉత్సాహం, సృజనాత్మక ఆలోచన, పవిత్రమైన ఉద్దేశ్యం కలిగి ఉండాలి.
… శ్రీ సత్య సాయి బాబా సేవ సాధనపై బోధనాంశాలు 19 నవంబర్ 1981, సేవాదళ్ కాన్ఫరెన్స్ https://www.ssssahitya.org/discourses/1981/lessons-on-seva-sadhana
ప్రకటనలు
భవిష్యత్తులో నిర్వహించబోయే శిక్షణా శిబిరాలు
- UK లండన్ : వైబ్రి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ ల మిడ్ ల్యాండ్ గ్రూప్ మీటింగ్ 18 జనవరి 2026, సంప్రదించవలసినవారు [email protected]
- India పుట్టపర్తి : AVP* ముఖాముఖి వర్క్ షాప్ 15-19 July 2026**, సంప్రదించవలసినవారు [email protected]
- India పుట్టపర్తి : SVP* వర్కుషాప్ 21-25 July 2026** సంప్రదించవలసినవారు [email protected]
- India పుట్టపర్తి: AVP* ముఖాముఖి వర్క్ షాప్ 26-30 నవంబర్ 2026**, సంప్రదించవలసినవారు [email protected]
- India పుట్టపర్తి SVP follow-up1-2 Dec 2026** సంప్రదించవలసినవారు [email protected]
*ప్రవేశ ప్రక్రియ మరియు ఈ-కోర్సప్రవేశ ప్రక్రియ మరియు ఈ-కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే.
** తేదీలు మార్పులకు లోబడి ఉంటాయి.
అదనంగా
1. ఆరోగ్య వ్యాసము
ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మౌలికమైన నూనెల పాత్ర!
“ఈ విశ్వమంతా భగవంతుని శరీరమే. దానిలోని ప్రతి అణువు, ప్రతి కణం భగవంతునితో, ఆయన మహిమతో, శక్తితో మరియు అవర్ణనీయమైన దివ్యత్వంతో నిండి ఉంది. మానవుడికి మరియు సృష్టికి మధ్య అసలు ఎటువంటి విరోధం లేదు. శిశువుకు తల్లి పాలపై ఎంత హక్కు ఉందో, తేనెటీగకు పువ్వుల తేనెపై ఎంత హక్కు ఉందో, అలాగే ప్రకృతి వనరులను అనుభవించడానికి మానవుడికీ హక్కు ఉంది. అయితే మితిమీరిన వినియోగం ఉండకూడదని మనిషి గ్రహించాలి.” శ్రీ సత్యసాయిబాబా¹
1. మౌలికమైన నూనెలు లేదా ఎసెన్షియల్ ఆయిల్స్
ఎసెన్షియల్ ఆయిల్స్ (ఇకపై ఈ-ఆయిల్స్ అని సూచించబడతాయి) అనేవి మొక్కల నుండి పొందే సంక్లిష్టమైన సేంద్రియ సమ్మేళనాలు. ఇవి సహజసిద్ధంగా ఫైటోకెమికల్స్ ను (మొక్కలలో ఉండే జీవక్రియాశీల రసాయనాలు) సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ ఫైటోకెమికల్స్ వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్‌లు), మరియు పరాన్నజీవులు (పరాసైట్లు) వంటి హానికర సూక్ష్మజీవులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా వీటిని ఆవిరి స్వేదన పద్ధతి ద్వారా వెలికితీస్తారు. ఈ ప్రక్రియలో చాలా ఎక్కువ పరిమాణంలో మొక్కల పదార్థం అవసరమవుతుంది, అయితే తుది ఉత్పత్తిగా చాలా తక్కువ పరిమాణంలో నూనె మాత్రమే లభిస్తుంది. ఉదాహరణకు: సుమారు 25 కిలోల లావెండర్ పూలు కేవలం 100 గ్రాముల నూనె మాత్రమే ఇస్తాయి. అదే పరిమాణంలో నూనె పొందడానికి దాదాపు 500 కిలోల గులాబీ రేకులు లేదా లెమన్ బామ్ మొక్కలు అవసరమవుతాయి.
ఎసెన్షియల్ ఆయిల్స్ అత్యంత సాంద్రీకృతమైనవి, సుగంధభరితమైనవి కనుక ఇవి శక్తివంతమైన వృక్షాధార ఔషధాలుగా పరిగణించబడతాయి. ఇవి ఉత్పన్నమైన మొక్కల కంటే మరింత ఘనమైన సువాసనను కలిగి ఉంటాయి. అలాగే, వాటిలోని క్రియాశీల పదార్థాల సాంద్రత కూడా అధికంగా ఉంటుంది. చాలా చిన్న పరిమాణంలోని అణువులతో రూపొందినందున, ఇవి చర్మం ద్వారా సులభంగా శరీరంలోకి శోషించబడతాయి మరియు రక్తప్రవాహంలోకి వేగంగా ప్రవేశించి, శరీర స్వస్థత ప్రక్రియలకు తోడ్పడతాయి. సాధారణంగా ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నేరుగా తీసుకోవడం లేదా త్రాగడం కోసం మంచిదికాదు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా వాటిని తీసుకోవడం విషపూరిత ప్రభావాలను కలిగించవచ్చు. వాటి అత్యంత సురక్షితమైన మరియు సాధారణ వినియోగ పద్ధతులు: బాహ్య వినియోగం తగిన విధంగా పలుచన చేసి చర్మంపై ఉపయోగించడం. అరోమాథెరపీ ప్రపంచంలో అత్యంత పురాతన సహజ చికిత్సా విధానాలలో ఒకటిగా పరిగణించబడే సుగంధ చికిత్స. ఈ రెండు పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీర-మనస్సుల సమతుల్యతను పెంపొందించడంలో సహాయపడతాయని భావించబడుతున్నాయి.¹⁻⁵
2. ఎసెన్షియల్ ఆయిల్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు మానవ శరీర నిర్మాణం
సర్వ పదార్థాలు, మొక్కలు, జంతువులు మరియు మానవ శరీరం అన్నీ పరమాణువులు మరియు అణువులుతో నిర్మితమై ఉంటాయి. ఇవి నిర్దిష్టంగా కొలవగలిగే ఫ్రీక్వెన్సీల వద్ద కంపిస్తుంటాయి. వీటిని మాలిక్యులర్ వైబ్రేషన్స్ అని పిలుస్తారు. ఇవి హెర్ట్జ్ (Hz) లేదా సెకనుకు చక్రాలు (Cycles per Second) అనే ప్రమాణంలో కొలవబడతాయి. ఈ ఫ్రీక్వెన్సీలలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే, అది శారీరక లేదా రసాయనిక కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తారు.6-8
2.1 మానవ శరీరం యొక్క భౌతిక ఫ్రీక్వెన్సీ
భౌతికంగా కొలవగలిగే స్థాయిలో, ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రఫీ (EEG) అనే పద్ధతిని ఉపయోగించి మెదడు తరంగాల కార్యకలాపాలను పరిశీలిస్తారు. ఈ అధ్యయనాల ప్రకారం, మానవ శరీరం సాధారణంగా 4 నుండి 13 హెర్ట్జ్ (Hz) లేదా అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేస్తుంది. ఇది శరీర భాగం, భంగిమ మరియు శారీరక పరిస్థితిని బట్టి మారవచ్చు. మెదడు తరంగాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: డెల్టా (0.1–3.5 Hz): గాఢ నిద్ర సమయంలో కనిపించే మెదడు తరంగాలు. థీటా (4–8 Hz): ప్రశాంతమైన ధ్యానం మరియు ప్రార్థన సమయంలో కనిపించే తరంగాలు. ఆల్ఫా (8–12 Hz): ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉన్న స్థితిని సూచించే తరంగాలు. బీటా (13–30 Hz) ఆలోచనా మరియు జాగ్రదావాస్థ స్థితి.
పరిశోధనల ప్రకారం, అభ్యాసనము లేదా శ్రద్ధ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులలో మెదడులోని కొన్ని ప్రాంతాల్లో 13 Hz బీటా తరంగాల కార్యకలాపం తగ్గి ఉండవచ్చు. దీని వల్ల క్రమబద్ధీకరణ సామర్థ్యం మరియు గణిత సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం ప్రభావితమవుతాయి..6-8
2.2 కణస్థాయి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మరియు ఎసెన్షియల్ ఆయిల్స్
సహచర సమీక్ష జరపని కొన్ని అధ్యయనాలు ఎసెన్షియల్ ఆయిల్స్ అత్యంత అధిక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. వాటి ఫ్రీక్వెన్సీ 52 నుండి 320 మెగాహెర్ట్జ్ (MHz) వరకు ఉండవచ్చని పేర్కొనబడింది. ఈ ఫ్రీక్వెన్సీలు వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు మరియు ప్రతికూల భావోద్వేగాలు అభివృద్ధి చెందడానికి అనుకూలం కాని పరిస్థితులను సృష్టించవచ్చని భావింప బడుతున్నాయి. శ్వాస ద్వారా లేదా చర్మంపై రాసుకోవడం ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఎసెన్షియల్ ఆయిల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన వైబ్రేషనల్ స్థితిని ప్రోత్సహించవచ్చని భావిస్తున్నారు. ఉదాహరణకు:
గులాబీ నూనెకు సుమారు 320 MHz ఫ్రీక్వెన్సీ ఉందని తరచుగా ప్రస్తావిస్తారు. ఇది అరోమాథెరపీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, గులాబీ నూనె సువాసనను పీల్చడం వల్ల మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణం పెరిగినట్లు గమనించారు. ఇది జ్ఞాపకశక్తి మరియు మేధో సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని, అలాగే డిమెన్షియా లేదా మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించబడింది.7-10
2.3 వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ మరియు ఆరోగ్యం
శరీరంలోని వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే, వ్యాధులకు గురయ్యే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఆరోగ్యవంతమైన మానవ శరీరంలోని సగటు కణస్థాయి ఫ్రీక్వెన్సీ సుమారు 62–72 MHz మధ్య ఉండవచ్చు. అది 58 MHz వరకు తగ్గితే, జలుబు మరియు ఫ్లూ వంటి సాధారణ అంటువ్యాధులకు గురయ్యే అవకాశం పెరుగుతుందని పేర్కొనబడింది. ఇంకా తగ్గిన ఫ్రీక్వెన్సీలు సిద్ధాంతపరంగా మరింత తీవ్రమైన వ్యాధులతో సంబంధం కలిగి ఉండవచ్చని భావిస్తారు. ఎసెన్షియల్ ఆయిల్స్ మొక్కలలోని రక్షణాత్మక మరియు ప్రయోజనకరమైన లక్షణాలను ఉపయోగించి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం ద్వారా మానవ కణాల లేదా శరీర వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ నేరుగా పెరుగుతుందని నిర్ధారించే బలమైన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. అందువల్ల ఈ అంశాలను శాస్త్రీయంగా నిర్ధారించబడిన వాస్తవాలుగా కాకుండా, పరిశోధనలో ఉన్న సిద్ధాంతాలు మరియు అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించాలి.7,8,11
3. ఎజెన్షియల్ ఆయిల్స్ ప్రయోజనాలు
అనేకరకాలైన ఎసెన్షియల్ ఆయిల్స్ వాపును తగ్గించడం, వికారం (నాజియా) మరియు నొప్పిని ఉపశమింప చేయడం, ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం, తలనొప్పులను తగ్గించడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మనోభావాలను ఉల్లాసపరచడం, పనిలో అప్రమత్తత మరియు పనితీరును మెరుగుపరచడం, అలాగే
ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించడం వంటి లక్షణాల కోసం గుర్తింపు పొందాయి. అయితే, ఈ ప్రయోజనాలు ఆయిల్స్‌ను ఎలా ఉపయోగిస్తున్నామన్న దానిపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. సరైన విధంగా ఉపయోగించినప్పుడు ఇవి సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అయినప్పటికీ, ఎసెన్షియల్ ఆయిల్స్ అత్యంత సాంద్రీకృతమైన వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మిశ్రమాలు. అందువల్ల విచక్షణారహితంగా ఉపయోగిస్తే చర్మ దురద, అలర్జీ లేదా ఇతర ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతాయి. ఒక్క చుక్క కూడా శక్తివంతమైన ప్రభావాన్ని చూపగలదు. కాబట్టి గరిష్ఠ ప్రయోజనాలను పొందేందుకు మరియు ప్రమాదాలను తగ్గించేందుకు సరైన డైల్యూషన్ లేదా పలుచబరిచే ప్రక్రియ అత్యంత అవసరం.2,5,12
4. క్యారీయర్ ఆయిల్స్ పాత్ర
క్యారియర్ ఆయిల్స్ అనేవి మొక్కల విత్తనాలు, గింజలు లేదా గుజ్జు భాగాల నుండి పొందబడే కొవ్వు పదార్థాలు. వీటిని ఎసెన్షియల్ ఆయిల్స్‌ను చర్మంపై ఉపయోగించే ముందు పలుచబరచడానికి ఉపయోగిస్తారు. ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మంలో శోషించబడడాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ దురద, మంట లేదా అలర్జీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మం మరియు తలపై సురక్షితంగా ఉపయోగించేందుకు సహాయపడతాయి.
మనకు లభ్యమయ్యే అనేక నూనెలలో సాధారణంగా ఉపయోగించే కొన్ని క్యారియర్ ఆయిల్స్: బాదం నూనె, ఆర్గాన్ నూనె, ఆర్నికా నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె, ద్రాక్ష గింజల నూనె, జోజోబా నూనె, వేప నూనె, ఆలివ్ నూనె, రోజ్‌హిప్ నూనెలు ముఖ్యమైనవి. ప్రతి నూనెకు చర్మం మరియు జుట్టుకు సంబంధించిన ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి..5,13-14
5. సాధారణంగా ఉపయోగించే ఎజెన్షియల్ అయిల్స్
ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్స్ వాటి అరుదైన వైద్య చికిత్సా లక్షణాల కోసం ప్రసిద్ధి చెందాయి. ప్రధానంగా అంటువ్యాధుల నియంత్రణకు, నొప్పి ఉపశమనానికి, చర్మ సమస్యల నివారణకు, నాడీ వ్యవస్థ సమతుల్యతకు, భావోద్వేగ ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని: బెర్గమాట్, కామొమైల్, క్లారీ సెేజ్, లవంగం, యూకలిప్టస్, ఫ్రాంకిన్సెన్స్, అల్లం, లావెండర్, నిమ్మ, పెప్పర్‌మింట్, గులాబీ, రోజ్‌మేరీ, గంధం, టీ ట్రీ, థైమ్. ప్రతీ ఆయిల్‌కు ప్రత్యేకమైన శారీరక మరియు భావోద్వేగ ప్రయోజనాలు ఉన్నాయి.2,5,15
6. భద్రతా మార్గ దర్శకాలు
- ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నేరుగా చర్మంపై లేదా నాలుకపై ఎప్పుడూ ఉపయోగించకండి.
- ఎల్లప్పుడూ పలుచబరచిన దానినే ఉపయోగించండి. సురక్షిత పరిమాణం: 0.5% – 2.5%
(సుమారు 30 మి.లీ. క్యారియర్ ఆయిల్‌లో 3–5 చుక్కలు) - పూర్తి వినియోగానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. గాయపడిన లేదా అత్యంత సున్నితమైన చర్మంపై ఉపయోగించకండి.
- కళ్ళు, నోరు మరియు వ్యక్తిగత అవయవాల నుండి దూరంగా ఉంచండి.
- చిన్నపిల్లలు మరియు పెంపుడు జంతువులకు అందకుండా, ముదురు రంగు గాజు సీసాలలో నిల్వ చేయండి.
- వాసన, రంగు లేదా గాఢత్వం మారితే వెంటనే పారవేయండి.2,5,13-23
7. ఆరోమాథెరపీ
ఎసెన్షియల్ ఆయిల్స్ వినియోగంలో అత్యంత సాధారణ పద్ధతి అరోమాథెరపీ. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పరిశోధనలలో ఎక్కువ భాగం వ్యక్తిగత ఆయిల్స్‌పై కేంద్రీకృతమై ఉంది. అనేక వోలటైల్ రసాయనాలను కలిపినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఫార్మాల్డిహైడ్ వంటి ద్వితీయ కాలుష్య పదార్థాలు ఏర్పడవచ్చు. ఇవి: ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు వంటి భాగాలలో చికాకు కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, “For Aromatherapy Use” ఆరోమా థెరపీ కి మాత్రమే అని స్పష్టంగా లేబుల్ చేయబడిన నూనెలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.
మరింత సురక్షితమైన పద్ధతులు: గాలి ప్రసరణ బాగా ఉండే గదుల్లో డిఫ్యూజర్ ద్వారా వినియోగించడం పత్తిపై చుక్కలు వేసి ఆవిరి చెందేలా చేయడం, స్వల్పముగా ఆవిరి పీల్చడం, ఉత్తమమైనవి. సీసా నుండి నేరుగా లోతుగా పీల్చడం ముఖ్యంగా ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి అధిక సాంద్రతలో ఎక్కువసేపు వాసన పీల్చడం గుండె లేదా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అలాగే, డిమెన్షియా లేదా వాసన గుర్తించే శక్తి కోల్పోయిన వ్యక్తులకు అరోమాథెరపీ సరిపోకపోవచ్చు.2,17--23
8. ఆచరణత్మక సూచనలు
- మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఆయిల్స్‌ను ఎంపిక చేసుకోండి. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా లేదా మందులు వాడుతున్నా, ముందుగా వైద్య నిపుణుడిని సంప్రదించండి.
- ఆయిల్స్‌ను నిరంతరం కాకుండా, తక్కువ పరిమాణంలో మరియు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి.
- పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
- గడువు ముగిసిన లేదా సరిగా నిల్వ చేయని ఆయిల్స్‌ను ఉపయోగించవద్దు2,17-23
ఎసెన్షియల్ ఆయిల్స్ కొనుగోలు చేసేసమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు
• అవి స్వచ్ఛమైన సుగంధ మొక్కల నూనెలేనని నిర్ధారించుకోండి.
• కేవలం సువాసన కోసం తయారుచేసిన ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
• ఉత్పత్తిలో ఉపయోగించిన పదార్థాల జాబితాను తప్పనిసరిగా చదవండి.
• ఎసెన్షియల్ ఆయిల్స్ స్వచ్ఛతను నిర్ధారించడానికి అవసరమైన పరీక్షలు చేయండి లేదా ధృవీకరించండి.
• ధరలను పోల్చి చూసి నాణ్యతకు అనుగుణమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోండి.
9. సాయి వైబ్రియా నిక్స్ ప్రాక్టీషనర్లకు ముఖ్య గమనిక
ఎసెన్షియల్ ఆయిల్స్‌కు బలమైన సువాసన ఉంటుంది. ఈ సువాసనలు సాయి వైబ్రియానిక్స్ మందుల సూక్ష్మ వైబ్రేషన్లపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఎసెన్షియల్ ఆయిల్స్‌ను వైబ్రియానిక్స్ మందుల నుండి తగినంత దూరంలో ఉంచాలి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించిన తరువాత లేదా ఉపయోగించే ముందు కనీసం ఒక గంట వ్యవధి ఉండేలా చూడాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా వైబ్రియానిక్స్ మందుల సూక్ష్మ శక్తి ప్రభావం యథావిధిగా కొనసాగుతుంది.
రిఫెరెన్సె లు వాటికి అనుగుణమైన లింక్ లు
- Sathya Sai Speaks: https://saisarathi.com/mid-atlantic-region/treat-nature-reverence/#
- Essential oils (E-oils): https://health.clevelandclinic.org/essential-oils-101-do-they-work-how-do-you-use-them
- Phytochemicals: chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://www.annexpublishers.com/articles/JBB/3103-Recent-Advances-of-Phytochemicals.pdf
- E-oils extraction: https://www.medicalnewstoday.com/articles/326732
- Power of e-oils: https://draxe.com/essential-oils/essential-oil-uses-benefits/
- Physical frequency and Brain waves: https://nhahealth.com/brainwaves-the-language/
- E-oils vibrational frequency: https://naturalnicheperfume.com/blog/do-essential-oils-raise-your-frequency/#
- https://www.scribd.com/document/508919722/Essential-Oils-Frequency
- Effect of rose oil: https://pubmed.ncbi.nlm.nih.gov/38331299/
- https://www.vice.com/en/article/rose-oil-brain-study/
- Body frequency and health: https://drkezchirolab.com/blogs/news/raising-vibrational-frequency-naturally#
- Benefits of essential oils: https://www.mdpi.com/1420-3049/28/4/1809
- Guide to carrier oils: https://mycamia.com/blogs/news/a-comprehensive-guide-to-carrier-oils-and-essential-oils-your-ultimate-resource
- https://www.vinevida.com/blogs/carrier-oils/best-carrier-oils-for-essential-oils
- Common essential oils: https://nikura.com/blogs/discover/most-popular-essential-oils-and-their-benefits
- Blending Before Therapy: https://kaizenhealthgroup.com/9-essential-oils-uses-and-side-effects/
- Patch test method: https://www.healthline.com/health/are-essential-oils-safe#
- Dilution & safety guidelines: https://www.healthline.com/health/are-essential-oils-safe#general-precautions
- https://achs.edu/blog/aromatherapy-essential-oil-dangers-and-safety/
- How to use a diffuser https://www.health.com/condition/stress/essential-oil-mistakes#
- Dos and Don’ts of essential oils: https://www.webmd.com/skin-problems-and-treatments/ss/slideshow-essential-oils
- Care Tips: https://www.hopkinsmedicine.org/health/wellness-and-prevention/aromatherapy-do-essential-oils-really-work
- How to take care: https://www.healthywa.wa.gov.au/Articles/A_E/Essential-oils
______________________________________________________________________________________
2. వర్క్ షాప్ లు మరియు శిబిబిరాలు
AVP వర్క్ షాప్ 26-28 నవంబర్ 2025, SVIRT ఆఫీస్ పుట్టపర్తి
భారతదేశం నుండి పదకొండు మంది, అమెరికా నుండి ఒకరు మొత్తం పన్నెండు మంది AVPలుగా* అర్హత సాధించి, నవంబర్ 27న స్వామి సన్నిధిలో భక్తి, శ్రద్ధలతో తమ ప్రమాణ స్వీకారం చేశారు. 2025 ఆగస్టులో ప్రారంభమైన ఈ అభ్యాస ప్రయాణంలో తమ ఈ-కోర్స్ ఉపాధ్యాయులు మరియు ఇద్దరు సీనియర్ శిక్షకుల మార్గదర్శకత్వం లభించినందుకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్ష శిక్షణా శిబిరంలో నిర్వహించిన ప్రత్యక్ష క్లినిక్‌లు వారికి అమూల్యమైన ప్రాయోగిక అనుభవాన్ని, అలాగే వివిధ మాధ్యమాలలో వైబ్రియానిక్స్ ఔషధాలను తయారు చేసే విధానంలో ప్రత్యక్ష శిక్షణను అందించాయి. రోగులతో నేరుగా సంభాషించే అవకాశం లభించడం, వారితో విశ్వాసపూర్వక అనుబంధాన్ని ఏర్పరచుకోవడం, సున్నితంగా కేసు వివరాలను సేకరించడం, చికిత్సా ప్రణాళిక రూపొందించడం, తగిన కాంబోలను ఎంపిక చేయడం, పూజాభావంతో రెమిడీలను అందించడం, అలాగే రోగుల రికార్డులను శ్రద్ధగా నిర్వహించడం వంటి అంశాలలో విలువైన అనుభవాన్ని పొందినందుకు పాల్గొనేవారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
సమారోపణ వాలిడిక్టరీ కార్యక్రమంలో వ్యవస్థాపకులు మార్గదర్శక మరియు ప్రేరణాత్మక సందేశాలను అందించారు. డాక్టర్ అగర్వాల్, వైబ్రియానిక్స్ సేవ యొక్క అసలు ఉద్దేశ్యం స్వీయ పరివర్తన అని నొక్కి చెబుతూ, ప్రేమ, వినయం, ఆలోచన–మాట–చర్యల పవిత్రత, అలాగే అహంకారానికి సంపూర్ణంగా దూరంగా ఉండే మనోభావం ద్వారానే నిజమైన స్వస్థత ప్రసరిస్తుందని గుర్తు చేశారు. స్వస్థపరచేది స్వామియే; ప్రాక్టీషనర్ కేవలం ఆయన చేతిలో ఒక సాధనం మాత్రమేనని, రెమిడీతో పాటు నిజాయితీ, విశ్వాసం, కరుణను కూడా సమర్పించాల్సిన అవసరాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
గాఢమైన ప్రేరణ పొందిన వీరంతా తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసి, ఈ కోర్సు ద్వారా కలిగిన ఉత్సాహాన్ని నిరంతరం కొనసాగించాలని సంకల్పించారు. వారిలో ఒకరు ఈ బ్యాచ్ కోసం ప్రతి నెల సమావేశాలను సమన్వయం చేసే బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించగా, ఆ సమావేశాలకు క్రమం మారుతూ మెంటర్లు మార్గనిర్దేశం చేయనున్నారని తెలిపారు.
*Regn nos. 11674 to 11684 and 03625


______________________________________________________________________________________
3. స్వామికి మా సామూహిక శతాబ్ది కానుక
మన ప్రియతమ భగవంతుని శతజయంతి సందర్భంగా సమర్పించదగిన కానుక ఏమిటనే నిర్ణయం తీసుకోవడం మాకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎంతో ఆలోచన, ప్రార్థనల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైబ్రియానిక్స్ సేవకులు అందించిన సేవా విశేషాల సంకలనాన్ని స్వామికి కానుకగా సమర్పించాలని నిర్ణయించుకున్నాము. ఈ ఆలోచనను మొదటగా 2024 మార్చి/ఏప్రిల్ వార్తాలేఖలో ప్రతిపాదించగా, వచ్చిన రచనలను సేకరించడం, మెరుగుపరచడం, సంపాదకీయం చేయడం కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రపంచంలోని సాధ్యమైనంత ఎక్కువ మంది వైబ్రియానిక్స్ సేవకుల సేవా అనుభవాలను ఈ గ్రంథంలో ప్రతిబింబింపజేయాలనే మా హృదయపూర్వక సంకల్పం.
ప్రారంభంలో వ్యాసాలు చాలా తక్కువగా వచ్చాయి. అయితే, బృంద సభ్యులు సేవకులను వ్యక్తిగతంగా సంప్రదించి, తమ అనుభవాలను పంచుకోవాలని ప్రోత్సహిస్తూ అలుపెరుగని కృషి చేయడంతో కొద్దికొద్దిగా రచనలు రావడం ప్రారంభమైంది. అయినప్పటికీ, అవి మా లక్ష్యానికి ఇంకా తక్కువగానే ఉన్నాయి. చివరకు అన్ని గడువులు దాటిన తర్వాత, 2025 అక్టోబర్ చివరి వారంలో ఒక్కసారిగా అనేక రచనలు అందాయి. వాటిని సమయానికి ప్రచురణకు సిద్ధం చేయడానికి బృందాలు అనేక రాత్రులు నిద్రలేకుండా శ్రమించాయి.
ఈ ప్రయాణంలో పుస్తకాల రూపకల్పన, ముద్రణ గడువులు దాటిపోవడం వంటి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, సంపూర్ణ విశ్వాసంతో భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన చివరి క్షణంలో అద్భుతంగా జోక్యం చేసుకుంటారనే అనుభవాన్ని మేము మరోసారి పొందాము. చివరకు నవంబర్ 19న తుది ప్రతిని ముద్రణ కోసం పంపించగా, నవంబర్ 23న మొదటి విడత పుస్తకాలు పుట్టపర్తికి చేరుకున్నాయి. అనంతరం, భక్తులతో కిటకిటలాడుతున్న ఆశ్రమంలో వాహనాల ప్రవేశం దాదాపు లేకపోయినా, ఆ భారీ పుస్తకాల పార్శిళ్లను లోపలికి తీసుకురావడం మరో సవాలుగా నిలిచింది. అదృష్టవశాత్తూ, SVIRT గవర్నర్లలో ఒకరైన SVP 02696 సమయానికి చేరుకుని, ఆ పుస్తకాలను విజయవంతంగా S4-B1కు చేర్చేందుకు సహకరించారు. అక్కడ కృతజ్ఞతా కానుకగా వాటిని వేదికపై సమర్పించి, అనంతరం డాక్టర్ అగర్వాల్ మరియు యూకే సమన్వయకర్త ఆధ్వర్యంలో కేక్ కట్ చేసే కార్యక్రమం జరిగింది. ఆ కేకును AVP శిక్షణా శిబిరానికి హాజరైనవారితో పాటు విచ్చేసిన భక్తులందరికీ పంచిపెట్టారు.
నవంబర్ 25న స్వామి సన్నిధిలో ఈ పుస్తకాలను సమర్పించే భాగ్యం మాకు లభించింది. పురుషుల వైపు నుండి డాక్టర్ అగర్వాల్ ఈ గ్రంథాలను సమర్పించగా, మహిళల వైపు నుండి హేమ అగర్వాల్ మరియు VTలు 10375, 11422 ఈ పవిత్ర సమర్పణ చేసే అదృష్టాన్ని పొందారు. ఈ దివ్య కార్యం విజయవంతంగా పూర్తికావడానికి గత సంవత్సరం పొడవునా తమ వ్యాసాలతో సహకరించిన ప్రతి ఒక్కరికీ, అలాగే ఈ ప్రాజెక్టుకు వివిధ విధాలుగా తోడ్పడిన వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా, సాయి వైబ్రియానిక్స్‌కు వెలుపల ఉన్నప్పటికీ మా అత్యవసర గడువులను చేరుకోవడానికి నిస్వార్థంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమస్త కార్యం భగవంతుని అనంత కృప, అనుగ్రహాల ఫలితమని మేము కృతజ్ఞతతో స్మరిస్తున్నాము.

______________________________________________________________________________________
4. వైబ్రియానిక్స్ వైద్య శిబిరాలు మరియు క్లినిక్ లు
4.1 గాయత్రి విద్యాలయ నేరేడ్మెట్ట హైదరాబాద్ తెలంగాణ 2025 నవంబర్ 3
ప్రాక్టీషనర్ 11627 చొరవతో మరియు సైనిక్‌పురి సమితి సేవా సమన్వయకర్త సహకారంతో, 2025 నవంబర్ 3న గాయత్రీ విద్యాలయలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. 1999లో స్థాపించబడిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 198 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సాయి వైబ్రియానిక్స్ ప్రయోజనాలు మరియు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిపి సుమారు 70 మంది హాజరయ్యారు.
తదనంతరం నిర్వహించిన వైబ్రియానిక్స్ ఆరోగ్య శిబిరంలో ప్రాక్టీషనర్లు 11563, 11614 మరియు 11627 మొత్తం 32 మంది రోగులకు సేవలు అందించారు. ప్రధానముగా మధుమేహం, కీళ్ల మరియు శారీరక నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్రలేమి, అలెర్జీలు, మైగగ్రేన్, చర్మ, కంటి మరియు చెవి సమస్యలు, ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, వంటి వ్యాధులకు చికిత్స నందించడం జరిగింది.కార్యక్రమం నిర్వహణ లో పాఠశాల సిబ్బంది హృదయపూర్వక సహకారాన్ని అందించారు.ఈ ప్రారంభ శిబిరం విజయవంతమైన స్పూర్తితో , అదే సేవాభావంతో ఉన్న పైన పేర్కొన్న ప్రాక్టీషనర్లు ప్రతి నెల మొదటి మరియు మూడవ సోమవారాల్లో పక్షానికి ఒకసారి ఈ శిబిరం క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు

4.2 ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ లో వైబ్రియానిక్స్ సేవ: శతజయంతి సందర్బంగా ప్రత్యేక సమర్పణ.
2009 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో వైబ్రియానిక్స్ వైద్య శిబిరం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. స్వామివారి శతజయంతి సంవత్సర వేడుకల సందర్భంగా ఈ వినమ్ర సేవను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించారు. సాధారణంగా మూడు రోజుల పాటు జరిగే శిబిరాన్ని ఈసారి 2025 నవంబర్ 15 నుండి 24 వరకు వరుసగా పది రోజుల పాటు నిర్వహించారు.
SVP 01228 నాయకత్వంలో, పది మంది ప్రాక్టీషనర్లతో కూడిన సేవా బృందం* మొత్తం 3,325 మంది రోగులకు సేవలందించింది. మొత్తం 234 సేవా గంటలు అంకితమయ్యాయి. ఉదయమే అనేక రైళ్లలో స్టేషన్ కు చేరుకున్న భక్తులను ప్రేమతో స్వాగతించి, వారి ఆరోగ్య సమస్యలను ఓపికగా విని, తగిన వైబ్రియానిక్స్ మందులను అందించారు. అత్యధికంగా చికిత్స అందించిన వ్యాధులు జలుబు, ఫ్లూ, జీర్ణ సంబంధిత సమస్యలు, మరియు శరీరక నొప్పులు.
ఈ శిబిరం సందర్భంగా ప్రాక్టీషనర్లు స్వామివారి రెండు ఫోటోల నుండి అనేక రోజుల పాటు విభూతి ప్రత్యక్షమవుతూ ఈ దివ్య అనుభవం చివరి రోజు వరకు కొనసాగడం గమనించారు. ఈ సంఘటనను అందరూ స్వామివారి నిశ్శబ్ద ఆశీర్వాదంగా మరియు శతజయంతి సమర్పణను ఆయన స్వీకరించిన సంకేతంగా భావించారు. నిరంతరం వచ్చే రోగులకు సేవలందించడంలో నిమగ్నమై ఉండటంతో ఫోటోలు చాలా తక్కువగా మాత్రమే తీసుకోగలిగారు. అయినప్పటికీ, విభూతి యొక్క మాధుర్యం మరియు ఆ దివ్య క్షణాల పవిత్రత వాటిని చూసిన వారందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రియతమ స్వామీ! మీ సన్నిధిలో సేవ చేసే ఈ అరుదైన పవిత్ర అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు, మరియు మీ స్పష్టమైన సాన్నిధ్యంతో ఈ సేవను ఆశీర్వదించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.* రిజిస్ట్రేషన్ నంబర్లు: 01228, 11660, 11658, 11623, 11650, 11587, 10782, 11659, 11624, 01448.
ప్రాక్టీషనర్ కాకపోయినా బ్రిజిట్ టెస్సైర్ ఏడు రోజుల పాటు ప్రేమతో సేవ చేశారు. విశాఖపట్నం ప్రాక్టీషనర్లు పిల్స్ తో నింపిన సీసాలను ముందుగానే పంపించి శిబిరానికి సహకరించారు.

4.3 అల్కపురి సమితి RK పురం హైదరాబాద్ తెలంగాణ లో వైబ్రియానిక్స్ క్యాంపు ప్రారంభం 28 డిసెంబర్ 2025
2025 నవంబర్ 23న పుట్టపర్తి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన వైబ్రియానిక్స్ శిబిరంలో సేవ చేస్తున్నప్పుడు, ప్రాక్టీషనర్
11587 అల్కాపురి సమితికి చెందిన ఒక భక్తుని పరిచయం పొందారు. ఆయన శిబిరానికి విలువైన సహకారం అందించడమే కాకుండా అనేక రోగులను కూడా సూచించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత, సమితి కన్వీనర్‌ను సంప్రదించి సమితి ప్రాంగణంలో సాయి వైబ్రియానిక్స్ శిబిరం ప్రారంభించాలనే ప్రతిపాదన చేశారు. ఇప్పటికే అక్కడ ప్రతి గురువారం మరియు ఆదివారం హోమియోపతి మరియు అలోపతి శిబిరాలు జరుగుతున్నందున, ఈ ప్రతిపాదనను కన్వీనర్ సంతోషంగా ఆమోదించారు.
2025 డిసెంబర్ 28న ఉదయం 9:30 గంటలకు సమితి కన్వీనర్ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రాక్టీషనర్ 11587 సుమారు 50 మంది పాల్గొన్న సమావేశంలో వైబ్రియానిక్స్ గురించి సమగ్ర అవగాహన కల్పించారు. మొత్తం 26 మంది రోగులకు ఈ క్రింది సమస్యల కోసం చికిత్స అందించబడింది. కీళ్ల మరియు వెన్నునొప్పులు, రక్తపోటు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, చర్మ అలెర్జీలు, సాయి సేవాదళ్ సభ్యులు అత్యుత్తమ సహకారం మరియు ఆతిథ్యాన్ని అందించి శిబిరం విజయవంతంగా జరిగేలా చేశారు. కార్యక్రమం మధ్యాహ్నం 2:30 గంటలకు ముగిసింది. ఇకపై ఈ శిబిరం ప్రతి నెల నాల్గవ ఆదివారం నిర్వహించబడుతుంది.
______________________________________________________________________________________
5. అనుభవాలు
5.1 డాక్టర్ జిత్ అగర్వాల్ గారి డైరీ నుండి- రెండు రోజుల్లోనే జ్ఞాపకశక్తి పునరుద్ధరణ ఒక వైబ్రియానిక్స్ అద్భుతం
1995 మే నెలలో, నా స్నేహితుడు రాబిన్ ఆక్స్‌ఫర్డ్‌లో జరిగే మా వారాంతపు సాయి భజనలకు వచ్చి ఒక కలవరపరిచే వార్త చెప్పాడు. అతని 47 సంవత్సరాల భార్య ఆన్, గుర్రం నుండి పడిపోవడం వల్ల తీవ్రమైన ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం తరువాత ఆమె పూర్తిగా జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆసుపత్రి వైద్యులు పరిస్థితి ఆశాజనకంగా లేదని జ్ఞాపకశక్తి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని, వచ్చినా రెండు సంవత్సరాల వరకు పట్టవచ్చని హెచ్చరించారు.
ఆ సమయంలో రాబిన్ కొత్తగానే మా బాబా భక్తుల బృందంలో చేరాడు. నేను ప్రశాంతి నిలయం నుండి తిరిగి వచ్చిన ప్రతిసారీ అక్కడి వార్తలను ఆసక్తిగా అడిగేవాడు. ఆ సందర్భంలో నేను ఇటీవల కనుగొన్న వైబ్రియానిక్స్ (అప్పుడు వైబ్రియో *పతి) గురించి ఎంతో ఉత్సాహంగా వివరించాను. స్వామివారు స్వయంగా ఈ వైద్య విధానానికి మార్గదర్శకత్వం వహించారని, నేను తయారు చేసిన సాయి రామ్ హీలింగ్ వైబ్రేషన్ పొటెన్సైజర్ నమూనాను ఆశ్రమానికి తీసుకెళ్లి ఆయన ఆశీర్వాదం పొందానని చెప్పాను.
కొంత సందేహం ఉన్నప్పటికీ, చివరి ఆశగా రాబిన్ ఈ చికిత్సను ప్రయత్నించేందుకు అంగీకరించాడు. నేను NM25 Shock మందును తయారు చేసి ఇచ్చాను. ఆ సమయంలో ఆ మందుపై నాకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. మా ఆశ్చర్యానికి హద్దుల్లేకుండా, కేవలం రెండు రోజుల తరువాత రాబిన్ ఫోన్ చేసి, పూర్తిగా ఆశ్చర్యంతో:“ఆన్ జ్ఞాపకశక్తి పూర్తిగా తిరిగి వచ్చింది!” అని చెప్పాడు. నిజం చెప్పాలంటే ప్రారంభ దశలో, అంత అద్భుతమైన ఫలితాన్ని చూసి నేనూ ఆశ్చర్యపోయాను. ఈ రోజు వరకు కూడా, తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడల్లా రాబిన్ వైబ్రియానిక్స్ వైపే తిరుగుతాడు.
5.2. IB – మాజీవితాలలో నవ వసంతం నింపిన మందు
ప్రాక్టీషనర్ 11669...భారతదేశం
తన పరిసర ప్రాంతంలో నివసించే ఒక దంపతులతో (వయస్సులు 60 మరియు 54) మోర్నింగ్ వాక్ కి వెళ్లే సమయంలో ఆరోగ్యం మరియు జీవనశైలి విషయాలపై తరచూ చర్చించేవారు. 2024 డిసెంబర్‌లో, ఉదయపు నడక మిస్ అయిన రోజుల్లో తన శక్తి మరియు ఉత్సాహం తగ్గిపోతున్నాయని భర్త పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రాక్టీషనర్ కొత్తగా AVP అర్హత పొందారు. శీతాకాలం సమీపిస్తున్నందున, బెంగళూరులో వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యే సమయం కావడంతో, ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకోవాలని సూచించారు. ఆ దంపతులు వెంటనే అంగీకరించారు. తదుపరి మూడు వారాల్లో వచ్చిన ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. శక్తి స్థాయిలు పెరిగాయి. నిద్ర నాణ్యత మెరుగుపడింది. మొత్తం ఆరోగ్యంమెరుగు పడింది. అంటువ్యాధులు కూడా రాలేదు.
రోగుల మాటల్లో:
“మా స్నేహితుడి ద్వారా ఇమ్యూనిటీ బూస్టర్ గురించి తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. కేవలం 20 రోజులపాటు తీసుకున్న తర్వాత ఫలితాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. మాలో కొత్త ఉత్సాహం, శక్తి పెరిగాయి. జీవక్రియ (Metabolism) మెరుగుపడింది. నిద్ర బాగా వస్తోంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకుంటున్నాము. శారీరక ప్రయోజనాలతో పాటు మానసికంగా కూడా ప్రశాంతత, తక్కువ ఒత్తిడి, తక్కువ ఆందోళన మరియు మరింత సమతుల్య దృక్పథం కలిగాయి.ఈ మార్పులను మేమే కాదు, మా చుట్టూ ఉన్నవారు కూడా గమనించారు.
”ఈ చిన్నదైనా శక్తివంతమైన అనుభవం, పెద్దగా అనారోగ్యం లేని వ్యక్తులలో కూడా IB శారీరక రోగనిరోధక శక్తిని మరియు భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడంలో ఎంత ఉపయోగకరమో తెలియజేస్తుంది