Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దివ్య వైద్యుని దివ్య వాణి

Vol 17 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2026


“సమయానికి భోజనం చేయండి. తగినంతగా తినండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి మీకు అందిస్తున్న ఆహారాన్ని ఆనందంగా స్వీకరించండి. దానిలో లోపాలు వెతకకండి, తిరస్కరించకండి. ప్రేమతో తింటే అది మీ శరీరాన్ని బాగా పోషిస్తుంది. అప్పుడు మీ శరీరం ఎంతటి పనినైనా చేయగలదు.”

 ...శ్రీ సత్య సాయి బాబా ఆరోగ్యమే మహాభాగ్యం దివ్య ప్రసంగము సమ్మర్ షవర్స్                                                         https://sssbpt.info/summershowers/ss2002/ss2002d12.pdf

 

““సేవలో మొదటి పాఠం కుటుంబంలోనే నేర్చుకోవాలి. తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు—ఈ చిన్న కుటుంబ వలయంలో ప్రేమతో కూడిన సేవను ఆచరించాలి. అది ఇంటి వెలుపల ఎదురుచూస్తున్న విశాలమైన సేవకు సిద్ధం చేస్తుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుని వ్యక్తిత్వమే ఆ కుటుంబ శాంతి, శ్రేయస్సును నిర్ణయిస్తుంది. ప్రతి కుటుంబపు స్వభావమే గ్రామం లేదా సమాజం యొక్క ఆనందానికి పునాది. దేశ ప్రగతి కూడా ఆ సమాజాల బలం, సంతోషాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశం మరియు ప్రపంచ శ్రేయస్సు కోసం సేవాభావం, ఉత్సాహం, సృజనాత్మక ఆలోచన, పవిత్రమైన ఉద్దేశ్యం  కలిగి ఉండాలి. 

… శ్రీ సత్య సాయి బాబా సేవ      సాధనపై బోధనాంశాలు  19 నవంబర్ 1981, సేవాదళ్ కాన్ఫరెన్స్                                                         https://www.ssssahitya.org/discourses/1981/lessons-on-seva-sadhana