వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 7 సంచిక 1
January/February 2016
“ఈ రోజుల్లో గణాంకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రిపోర్టులు పెరిగిపోతూ వస్తున్నాయి. సంఖ్య పెరగాలనో లేక ఏర్పరుచుకున్న లక్ష్యం త్వరగా చేరాలని ఇట్టి విషయాలు గురించి పట్టించుకోకండి. నాకు క్వాలిటీ కావాలి గానీ క్వాంటిటీ తో అవసరం లేదు. నిజాయితీగా అంకిత భావంతోనూ భక్తితోనూ కొన్ని గ్రామాలకు చేసిన సేవే అత్యంత ఫలప్రదమైనది తప్ప మెహర్బానీ కోసం ఎక్కువ మందికి చేసే సేవలు నిష్పలం.”
…సత్యసాయిబాబా, “ సేవకు సన్నద్ధత ” దివ్య భాషణము, 21 నవంబర్ 1986
http://www.sssbpt.info/ssspeaks/volume19/sss19-25.pdf
“మన ఆహారపు అలవాట్లలోనూ, పనిలోనూ, నిద్రించే సమయంలోను మితము హితము అనేది అత్యవసరము. వాస్తవానికి ఇదే ఆనందానికి రాచబాట. ఆధునిక మానవుడు దీనిని ప్రతీ విషయంలోనూ అపహాస్యం చేస్తూ తనఆరోగ్యానికి, క్షేమానికి ముప్పు తెచ్చుకుంటున్నాడు. మానవుడు తీసుకునే ఆహారము సక్రమమైనది గానూ, పవిత్రమైనదిగానూ, సమగ్రమైనది గానూ ఉండాలి. కానీ ఈనాడు ఎప్పుడయినా,ఎ క్కడయినా, ఏది దొరికితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి ఆహారానికి ఎంతోప్రాధాన్యత ఉంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధాలు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అవి మనశారీరక, మానసిక ఆరోగ్యాలు రెండింటికీ మంచివి కావు. మధ్యపానం, మాంస భక్షణం మనిషిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు కలుగ జేస్తాయి.”
…సత్యసాయిబాబా, “ఆహారము, హృదయము మరియు మనసు” దివ్య వాణి, 21జనవరి1994