అదనంగా
Vol 15 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2024
1. ఆరోగ్య కధనం
ఆరోగ్యానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు గల విటమిన్లు సమృద్ధిగా ఉండే సంపూర్ణ ఆహారం తీసుకోండి !
“సమతుల్యంగా మరియు సంపూర్ణంగా ఉండే శాఖాహారం, క్యారెట్ వంటి కూరగాయల్లో లభించే విటమిన్ సి మరియు విటమిన్ ఈ, లను పుష్కలమైన మోతాదులలో కలిగి ఉండాలి. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తి సంపదను అనుభవించలేడు. ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది వ్యక్తికి శారీరక మరియు మానసిక బలాన్ని ఇస్తుంది” ..సత్య సాయి బాబా1
మా వార్తా లేఖ మునుపటి సంచికలో మేము సమతుల్య ఆహారం కోసం మాక్రో న్యూట్రియెంట్ల గురించి తెలియ జేసాము. ఈ కథనం అవసరమైన సూక్ష్మ పోషకమైన విటమిన్లను గురించి తెలుపుతుంది.
1. విటమిన్ల యొక్క ప్రాముఖ్యత
1.1 ఆరోగ్యానికి ఎంతో కీలకం : విటమిన్లు మరియు మినరల్స్ అనేవి శరీరానికి జీవించటానికి మరియు
ఆరోగ్యంగా ఉండటానికి తక్కువ మొత్తంలో అవసరమైన రెండు ముఖ్యమైన పోషకాలు వాటిని సమిష్టిగా సూక్ష్మ పోషకాలు మైక్రోలు అని అంటారు. అవి మాక్రో లను అంటే స్థూల సూక్ష్మ పదార్థాలను జీవక్రియ ద్వారా శోషణం చేసి శక్తిని పొందేలా చేస్తాయి. మైక్రోలు చాలా కీలకమైనవి, వీటి లోపం శక్తిస్థాయి, మానసిక స్పష్టత మరియు మొత్తం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇవి గుర్తింపబడదగిన పరిణామంలో ఉండక పోవచ్చు కానీ మనల్ని వ్యాధికి గురిచేసి ఆ తర్వాత అది తీవ్రమైన అనారోగ్య పరిస్థితిలకు దారితీసి ప్రాణాపాయ స్థితిని కలిగించ వచ్చు.2
1.2 కీలకమైన పాత్ర మరియు వైవిధ్యం : విటమిన్లు అనేవి మొక్కలు మరియు జంతువులచే తయారు చేయబడిన సేంద్రియ పదార్థాలు మరియు జీవించడానికి
ఆహారము నుండి పొందబడతాయి. ఇవి కార్బన్ మూలకాన్ని కలిగి ఉండి భూమిపై జీవితాన్ని ప్రారంభించేలా చేసి మన శరీరం లోని ప్రతీ అవయవం యొక్క పనితీరులో తమ పాత్ర కలిగి ఉంటాయి. కొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత 1948 నాటికి విటమిన్ల ఆవిష్కరణ జరిగి కొన్ని వ్యాధులు విటమిన్ లోపం వల్లనే వస్తాయని, ఇన్ఫెక్షన్లు మరియు టాక్సిన్స్ వల్ల కాదని తెలిసింది. స్థూలంగా 13 విటమిన్లు ఉన్నాయి- A, C, D, E, K, మరియు 8 B కాంప్లెక్స్ విటమిన్లు. B1(థైయామిన్), B2(రైబోఫ్లోవిన్), B3 (నియాసిన్), B5 (పాన్టోతేనిక్ యాసిడ్), B6( పైరడాక్సిన్), B7(బయోటిన్ విటమిన్ హెచ్ అని కూడా పిలుస్తారు), B9(ఫోలిక్ యాసిడ్) మరియు B12 (కోబాల్మిన్). ఇవికాక మిగిలిన B4, B8, B10, & B11 విటమిన్లు గా పరిగణింపబడవు. ఇవన్నీ శరీరానికి జన్యు సంబంధిత మరియు జీవ రసాయన విశిష్ట లక్షణాల ఆధారంగా వివిధ పరిమాణల్లో అవసరమవుతాయి.3-6
1.3 విటమిన్లు వినియోగం యొక్క స్వభావం : విటమిన్లు A, E, D, & K కొవ్వులో కరిగేవి. ఆహారంలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజ లవణాలు ఈ విటమిన్లు శరీరం లోకి ప్రవేశించడానికి ఉపయోగ పడతాయి, మరియు కాలేయం మరియు కొవ్వు కణజాలంలో ఇవి నిల్వ చేయబడతాయి, కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకోవలసిన అవసరం లేదు. విటమిన్ C మరియు B విటమిన్లు నీటిలో కరిగేవి, శరీరంలో కొద్దికాలం నిలువ ఉంటాయి, అందుచేత వీటిని తరుచుగా శరీరంలో భర్తీ చేసుకుంటూ ఉండాలి. కానీ విటమిన్ B12 మాత్రం కాలేయంలో మూడు నుండి ఐదు సంవత్సరాలు పాటు నిల్వ ఉంటుంది, ఏదైనా అదనపు పరిమాణం ఉంటే సాధారణంగా అది మూత్రంలో విసర్జింపబడుతుంది.7,8
2. కొవ్వులో కరిగే విటమిన్లు
2.1 విటమిన్ A : వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్తో పోరాడటానికి కళ్ళు, చర్మం, మరియు రోగనిరోధక వ్యవస్థకు
విటమిన్ A చాలా ముఖ్యమైనది. ఇది ఊపిరి తిత్తుల యొక్క పొరలను, పేగులు మరియు మూత్ర నాళాలను తగిన ఆకృతిలో ఉంచుతుంది. బాహ్య మరియు అంతర్లీన మొటిమల నివారణకు, మరియు చికిత్సకు గాయాలను నయం చేయడానికి విటమిన్ A ఎంతో ఉపయోగ పడుతుంది. ఫ్రీ ఫార్మ్డ్ విటమిన్ A లేదా రెటినాల్ సహజంగా గుడ్లు మరియు పాలతో సహా జంతు ఉత్పత్తుల్లో లభిస్తుంది. ప్రో విటమిన్ A లేదా కెరోటినాయిడ్ (సాధారణముగా బీటా కెరోటిన్ గా లభ్యమయ్యేది) అనేది శరీరం విటమిన్ A గా మార్చే పోషకం. ఇది ప్రకాశవంతమైన రంగులలో కనిపించే అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలలో కనిపిస్తుంది. కూరగాయలను ఆరోగ్యవంతమైన కొవ్వుతోపాటు ఉడికించి తినేటప్పుడు మన శరీరం విటమిన్లను బాగా ఉపయోగించుకుంటుంది. 9-12
విటమిన్ A లోపం ఉన్నప్పుడు అలసట, పొడి కళ్ళు (కన్నీళ్లు ఉత్పత్తి చేయలేకపోవడం మొదటి సంకేతాల్లో ఒకటి) దృష్టి కోల్పోవడం, చీకట్లో చూడలేకపోవడం రాత్రి అంధత్వమునకు దారి తీస్తుంది. పొడిబారిన, దురద తో కూడిన, లేదా కఠినమైన ఎగుడు దిగుడు చర్మం, వంధత్వం, మరియు పిల్లల్లో పెరుగుదల మరియు అభివృద్ధి ఆలస్యం అవ్వడం వంటివి ఏర్పడ వచ్చు. లోపం తేలికపాటిది ఐనా లేదా తీవ్రమైనది ఐనా ఇన్ఫెక్షన్ ముఖ్యంగా చాతి మరియు గొంతులోఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.9-11
2.2 విటమిన్ D (సూర్య రశ్మి విటమిన్/కాల్సి ఫెరాల్): మనకు అవసరమైన పోషక పదార్థం మరియు
శరీరం ఉత్పత్తి చేసె హార్మోన్ గా విటమిన్ డి, కీలకమైన ఖనిజాలను గ్రహించి నిలుపుకోవడం ద్వారా ఎముకలను నిర్మించడంలో సహాయపడేందుకు, క్యాన్సర్ కణాల పెరుగుదల నివారణకు, వాపు మరియు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, అంతేకాక నాడీ వ్యవస్థను పటిష్ట పర్చడానికి, హృదయ నాడీ వ్యవస్థను, ఎండోక్రిన్ వినాళ వ్యవస్థను పటిష్ట పరచడానికి ఇది ఎంతో ముఖ్యమైనది. దాని పాత్ర గురించి వివరాలు కోసం సూర్యరశ్మి మరియు ఇతర వనరుల నుండి దాన్ని ఎలా తీసుకోవాలి మరియు దాని లోపం వల్ల వచ్చే వ్యాధులు గురించి మన వార్తా లేఖ సంపుటి 3 సంచిక 4 జులై- ఆగస్టు 2012, మరియు సంపుటి 5 సంచిక 1 జనవరి- ఫిబ్రవరి 2014 మరియు క్రింద పేర్కొన్న లింకులను చూడండి. 13-19
ఈ విటమిన్ లోపానికి సూచికలు తక్కువ కాల్షియం స్థాయిలు (హైపో కాల్సేమియా) అతి చురుకైన పారా థైరాయిడ్ గ్రంధులు( హైపర్ పారా థైరాయిడిజం), ఎముకలలో ఖనిజ లోపం (డి మినరలైజేషన్) మరియు మృదువైన ఎముకలు, పిల్లల్లో ఎముకలు మరియు కీళ్లలో వైకల్యం (రికెట్స్ వ్యాధి), కండరాల బలహీనత, తిమ్మిరి, తరచుగా పడిపోవడం, నడవడంలో ఇబ్బంది, అలసట మరియు నిరాశ వంటివి ఉంటాయి. కనుక ఈ లక్షణాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. 16
2.3 విటమిన్ E : సహజంగా పళ్ళు, కాయలు, గింజలు మరియు ఆకుకూరల్లో ప్రత్యేకించి గోధుమ పొట్టు నుండి
తీసిన నూనె (చాలా ఎక్కువ స్థాయి), పొద్దుతిరుగుడు విత్తనాలు మరియు బాదం లో ఇది లభిస్తుంది. శరీరానికి విటమిన్ K ను ఉపయోగించుకోవడంలో ఇది సహాయపడుతుంది. బలమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ E మేధస్సు, అభిజ్ఞా మరియు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది, ధమనులలో రక్తం గడ్డ కట్టడం నిరోధానికి, వయస్సు సంబంధిత దృష్టి మాంద్యం, న్యూరో డిజనరేటివ్ వ్యాధులు మరియు క్యాన్సర్ను నివారిస్తుంది. ఇది చర్మం జుట్టు మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 8 వారాలపాటు ప్రతీరోజు విటమిన్ సి మరియు ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలతో కలిపి తీసుకున్నప్పుడు ఋతునొప్పి, తిమ్మిరి, నుండి ఉపశమనం కలుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విటమిన్ E యొక్క తైలము చర్మం, గోర్లు, మరియు వెంట్రుకలపై పూయడానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణింపబడుతుంది, అలాగే మచ్చలు, చర్మం పొడిబారడం, మరియు మొటిమలను కూడా తొలగిస్తుంది.20-23
దీని లోపం యొక్క సంకేతాలు రెటీనా పాడవడం, పరిధియ నరాల వ్యాధి. శరీర కదలికలలో నియంత్రణ కోల్పోవడం మరియు రోగ నిరోధక శక్తి తగ్గటం.20-23
2.4 విటమిన్ K : బిజీ న్యూట్రియెంట్ గా పేరుగాంచిన ఇది రక్తము గడ్డ కట్టడానికి, గుండె ఆరోగ్యానికి, బలమైన
ఎముకలకు, మరియు గాయాలను నయం చేయడానికి అవసరమైన కొన్ని ప్రోటీన్లను తయారుచేస్తుంది. అతి సాధారణ మైన K 1 విటమిన్ ఆకుపచ్చ మరియు క్రూసిఫెరస్ కూరగాయలలో, బ్లూబెర్రీస్ మరియు అత్తిపండ్ల వంటి పళ్ళలో మరియు తక్కువ మొత్తంలో తృణధాన్యాలు మరియు పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. అరుదుగా K2 విటమిన్ జంతు ఉత్పత్తులు మరియు పులియబెట్టబడిన ఆహారాల్లో కనుగొనబడుతుంది మరియు గట్ లేదా జీర్ణశయ బ్యాక్టీరియా ద్వారా కూడా ఉత్పత్తి చేయబడుతుంది. శరీరంలో K1 కంటే ఎక్కువ సేపు నిలువ ఉండి శరీరానికి ప్రయోజనాలు పెంచుతుంది. ఎవరికైనా విటమిన్ D లోపిస్తే, కాల్షియం ను ఎముకల వైపు మళ్ళించడం ద్వారా K2 కాల్సిఫికేషన్ను నిరోధిస్తుంది. విటమిన్ D తో పాటు K2 ను ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలు విరగడాన్ని నివారించడం, ధమనులలో పలకల నివారణ, ఆర్థరైటిస్ మరియు డెమిన్షియ ప్రమాదాలు కూడా తగ్గింప బడతాయి. 24-28
దీని లోపం యొక్క చిహ్నాలు వేళ్ళ గోళ్ళ కింద చిన్న గాయాలు, రక్తం గడ్డ కట్టడంలో ఆలస్యం, ఆనియంత్రిత రక్తస్రావం, చిగుళ్ళు మరియు ముక్కు నుండి రక్తస్రావం, రక్తంతో తడిసిన నల్లటి మలం, రక్తస్రావం, ఆస్టియోపేనియా లేదా ఆస్టియో పోరోసిస్, బోలు ఎముకల వ్యాధి వంటివి ఏర్పడ వచ్చు. బ్లడ్ తిన్నర్స్ తీసుకునే వారు K సప్లిమెంట్ తీసుకోకూడదు, వారి డాక్టర్ సూచించిన విధంగా ఆహారం నుండి K విటమిన్ తీసుకోవడం కోసం ప్లాన్ చేసుకోవాలి. శిశువుల విషయంలో సాధారణంగా వారి శరీరంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్ K తో పుట్టినప్పుడు రక్తస్రావం నిరోదించడానికి పుట్టినప్పుడు విటమిన్ K యొక్క ఒక ఇంట్రా మస్కులర్ ఇంజెక్షన్ సిఫారసు చేయబడింది.24-29
3. నీటిలో కరిగే విటమిన్లు
3.1 విటమిన్ C (ఆస్కార్బిక్ యాసిడ్) : నీటిలో కరిగే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ ఐన ఈ విటమిన్ రోగ
నిరోధక వ్యవస్థను మరియు కణజాల ఆరోగ్యాన్ని బలపరచడం ద్వారా తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, జలుబు మరియు ఫ్లూ యొక్క తీవ్రతలు తగ్గించడం, కళ్ళు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇది ఇనుము శరీరం లోకి ప్రవెశించడాన్ని సులభతరం చేసి గాయాలు, కోతలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు ఇండియన్ గూస్ బెర్రీ (ఉసిరి), చెర్రీస్, స్ట్రాబెర్రీ, సిట్రస్, కివి, జామ, బొప్పాయి, పెర్సిమోన్స్, గ్రీన్ ప్లమ్స్, పసుపు రంగు బెల్ పెప్పర్స్, టమాటాలు, కృసిఫెరస్ కూరగాయలు తాజా పార్స్లీ మరియు తెల్ల బంగాళదుంపలు. 30-33
ఈ విటమిన్ లోపం యొక్క హెచ్చరిక సంకేతాలు, రక్తనాళాల నుండి రక్తస్రావం లేదా గాయాల వలన చర్మము పై మచ్చలు, చిగుళ్ల వాపు లేదా రక్తస్రావం వలన చివరికి దంతాల నష్టం, జుట్టు రాలడం, గాయాలు మానడంలో ఆలశ్యము, అలసట మరియు ఇనుము లోపం కారణంగా రక్తహీనత వంటివి ఏర్పడుతూ ఉంటాయి. స్కర్వి అనేది తీవ్రమైన లోపం యొక్క ముఖ్య లక్షణం. 30-33
హెచ్చరిక: ప్రజలు విటమిన్ సి సప్లిమెంట్లను విరివిగా తీసుకుంటూ ఉంటారు. నీటిలో కరిగేది అయినప్పటికీ అదనంగా తీసుకోవడం వలన తలనొప్పి, ఉబ్బరం, అతిసారం, ఎర్రబడిన చర్మం, మరియు తిమ్మిరి, మూత్రపిండల్లో రాళ్లు, మరియు వైఫల్యానికి కూడా దారి తీయవచ్చు. ఇది ఐరన్ ఓవర్ లోడ్ కారణంగా గుండె, కాలేయం, మరియు ప్యాంక్రియాస్ ను పాడు చేయవచ్చు. 30-33
3.2 B-విటమిన్లు :
మొత్తం ఎనిమిది B విటమిన్లు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి, మంటను తగ్గిస్తాయి, హార్మోన్ల పనితీరుకు మద్దతు
ఇస్తాయి, ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చేస్తాయి, మరియు ఆరోగ్యకరమైన జీవక్రియ మరియు జీర్ణవ్యవస్థను నిర్ధారిస్తాయి. వీటి పాత్రలు మరియు రసాయన లక్షణాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్రతీ విటమిన్ తన దైన తీరులో పనిచేస్తూ అలసట, రక్తహీనత, భావాందోళన రుగ్మతలు, మరియు జ్ఞాపకశక్తి లోపాన్ని నిరోధించడానికి దాని ప్రత్యేక పనితీరును కలిగి ఉంటుంది. వీటిలో అన్నింటి (బి కాంప్లెక్స్) కలయిక ఉత్తమంగా ఉంటుంది ఎందుకంటే ఇవి కలసికట్టుగా పనిచేస్తాయి. 7,34,35
3.2.1 విటమిన్ B1: తృణ ధాన్యాలు, అనేక రకాల గింజలు, నల్ల చిక్కుళ్ళు, పచ్చిబఠానీలు, చింతపండు, మరియు పెరుగులో సహజంగా లభిస్తుంది. ఇది జీవక్రియ మరియు నరాల పనితీరులో కీలక పాత్ర కలిగి ఉంటుంది. టీ మరియు కాఫీ థయామిన్ శోషణాన్ని అడ్డుకుంటాయి. తీవ్రమైన లోపం బెరి బెరి వ్యాధిని కలిగించి అసంకల్పిత చర్యలు, కండర పనితీరును దెబ్బతీస్తుంది. దీనివలన కండరాల రుగ్మత మరియు చేతుల మరియు కాళ్లలో శక్తి లేనట్లు అనుభూతి (పరదీయ నరాల వ్యాధి), మేధస్సు (అభిజ్ఞా) క్షీణత, పక్షవాతం, మరియు గుండె ఆగిపోవడం వంటివి ఏర్పడవచ్చు..34,36-38
3.2.2 విటమిన్ B2 : పెరుగు, పాలు, వెన్న, ఓట్లు, క్వినోవా, మరియు బాదంపప్పులో ఉత్తమంగా లభిస్తుంది. ఆపిల్, పాలకూర, టమోటాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, కిడ్నీ బీన్స్, మరియు జీర్ణాశయ బ్యాక్టీరియా లో తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం మరియు కళ్ళకు ఇది అవసరం. ఇది ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇనుము మరియు ఇతర B విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపించడం వలన కలిగే లక్షణాలు పెదవులలో పగుళ్లు, గొంతు నొప్పి, చర్మంపై దద్దుర్లు, దురద తో కూడిన ఎర్రని కళ్ళు, తీవ్రమైన సందర్భాల్లో కంటి శుక్లము, మరియు ఇనుము లోపం కారణంగా రక్తహీనత కలుగుతాయి. దీర్ఘకాలిక లోపం పార్శ్వపు నొప్పి, మెదడు మరియు గుండె లోపాలు, మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు కారణం కావచ్చు. అధికముగా తీసుకున్నప్పుడు మూత్రం ప్రకాశవంతమైన పసుపు రంగులోనికి మారుతుంది. 4,6,39-41
3.2.3 విటమిన్ B3 : ఇది బ్రౌన్ రైస్ వంటి ధాన్యాల్లో, గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు, మరియు అరటిలో లభిస్తుంది. మొక్కజొన్నలో సహజంగా B3 ఎక్కువగా ఉంటుంది అయితే దానిని ఉడికించి మెత్తగా చేస్తే తప్ప శోషింపబడదు. అరుదైనదైనప్పటికీ దీని యొక్క తీవ్రమైన లోపం పెల్లాగ్రా వ్యాధికి అనగా సూర్యరశ్మికి గురైన చర్మప్రాంతాలపై ముదురు రంగు దద్దుర్లు ఏర్పడడం, నాలుక ప్రకాశవంతమైన ఎరుపు రంగుకు మారడం, అతిసారం, నిరాశ, మరియు చిత్త వైకల్యం వంటి వాటికి దారి తీయవచ్చు. 42,43
3.2.4 విటమిన్ B5 : ఇది క్యాబేజీ, బ్రోకలీ, తెలుపు మరియు ఎరుపు చిలకడ దుంపలు, అవకాడో, బ్రౌన్ రైస్, ఓట్స్, పొద్దుతిరుగుడు గింజలు, మరియు పాల ఉత్పత్తుల్లో ఉంటుంది. కొద్ది మొత్తంలో జీర్ణాశయ బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడుతుంది. ఈ విటమిన్, B2 విటమిన్ ను మన శరీరం సమర్ధవంతంగా ఉపయోగించు కోవడంలో సహాయ పడుతుంది. అంతేకాక తామర, విషపూరిత మొక్కల వల్ల ఏర్పడే చర్మ రుగ్మత, కీటకాల కాటు, డైపర్ వలన ఏర్పడే దద్దుర్లు, వంటి వ్యాధుల నిర్మూలనకు ఉపయోగ పడుతుంది. అంతేకాక చర్మం మరియు జుట్టును పొడిబారకుండా తేమగా ఉంచడం వంటి వివిధ చర్మ పరిస్థితులను నయం చేయడానికి సౌందర్య సాధనాల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ విటమిన్ లోపం యొక్క లక్షణాలు అలసట, చిరాకు, న్యూరో సమస్యలు, మరియు ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటివి. తీవ్రమైన లోపం చాలా అరుదు కానీ తేలికపాటి లోపం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.44-46
3.2.5విటమిన్ B6 : ఇది సహజంగా చిక్ పీస్ లో (ఒక కప్పు మన రోజువారి అవసరాలు 65% తీరుస్తుంది) మరియు ఇతర చిక్కుళ్ళు, అవకాడో, పృన్స్, అరటి పళ్ళు, పిస్తా పప్పులు, ముదురు రంగు ఆకుకూరలు, పచ్చి బఠానీలు, క్యారెట్లు, మరియు చిలకడదుంపల్లో లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుంది, మెదడు మరియు నరాలను రక్షిస్తుంది, గర్భిణీ స్త్రీలలో వ్యాధులను మరియు మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం ఇస్తుంది. B12 మరియు పోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా దీని లోపం ఏర్పడుతుంది. తేలికి పాటి లోపం గుర్తింప దగిన లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు కానీ తీవ్రమైన లోపం రక్తహీనత, నిరాశ, గందరగోళం, మరియు రోగనిరోధక శక్తి లోపం వంటివి చూపుతుంది. అధిక మోతాదులవల్ల పరధీయ నాడీవ్యాధులు, శరీర కదలికలపై నియంత్రణ కోల్పోవడం, వికారం, మరియు వెలుతురికి (కాంతికి) సున్నితత్వం ఏర్పడవచ్చు. అయితే అధిక మోతాదు ఆపిన వెంటనే ఈ లక్షణాలు కూడా తగ్గిపోతాయి. 47-49
3.2.6 విటమిన్ B7 : దీనికి మంచి ఆహార వనరులు అవకాడో, చిలకడ దుంప, పొత్తు తిరుగుడు విత్తనాలు, గింజలు, చిక్కుళ్ళు, మరియు పుట్టగొడుగులు. దీని లోపంవలన జుట్టు రాలడం, చర్మంపై దద్దుర్లు, మరియు గోర్లు పెళుసుగా మారడానికి దారి తీస్తుంది. సప్లిమెంట్ల యొక్క ప్రయోజనాలు ఆకర్షణీయంగా మరియు జనాదరణ పొందినప్పటికీ ప్రస్తుతం అనిశ్చితమైన అధ్యయనాలే ఆధారం. హెచ్చరిక పచ్చి గుడ్లు తినేవారికి దీనిలో ఉండే అడ్విన్ అనే ప్రోటీన్ B7 యొక్క శోషణాన్ని నిరోధిస్తుంది, కనుక ఉడికించినవి సురక్షితం.50,51
3.2.7 విటమిన్ B9 (ఫోలిక్ యాసిడ్) : ప్రోటీన్ జీవక్రియ, జన్యుపదార్థాల ఉత్పత్తి, మరియు ఆరోగ్య కరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధిలో ఇది చాలా కీలకం. ఉత్తమ ఆహారాలు ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, ఎక్కువ పోలేట్లను నిలుపుకోవడానికి పచ్చిగా లేదా కొద్దిసేపు ఆవిరిలో ఉడికించినవి ఉత్తమమైనవి. బీన్స్, వేరుశనగ, పొద్దు తిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు, మరియు చింతపండు. ఇతర ఆహార వనరుల నుండి పోలేట్ రూపంలో (కేవలం 50%) కంటే సప్లిమెంట్ల నుండి పోలిక్ యాసిడ్ రూపంలో(85%) బాగా గ్రహించబడుతుంది. అధిక మొత్తంలో తీసుకుంటే B12 లోపాన్నికప్పి ఉంచే అవకాశం ఉంది. రక్తహీనత, అలసట, సక్రమంగా లేని హృదయ స్పందన, ఊపిరి ఆడక పోవడం, జుట్టు రాలడం, మరియు నోటి పుండ్లు వంటివి ఈ విటమిన్ లోపం యొక్క లక్షణాలు.52
3.2.8 విటమిన్ B12 : ఇది నరాల పనితీరు, డీఎన్ఏ ఉత్పత్తి, మరియు ఎర్ర రక్త కణాల అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. విటమిన్ B12 యొక్క ప్రయోజనాలు, అది లభించే మూలాల గురించి, అది ఎలా షోషింపబడుతుంది, దీని లోపం యొక్క లక్షణాలు, రోగనిర్ధారణ మరియు చికిత్స గురించి వార్తాలేఖ సంపుటి 4 సంచిక 6 నవంబర్- డిసెంబర్ 2013 లోని కథనం నుండి తెలుసుకోండి. జీర్ణాశయ బ్యాక్టీరియా B12 ని తయారు చేయగలదు కానీ గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి రుగ్మతలు ఈ ప్రక్రియను అడ్డుకుంటాయి.53-55
4. విటమిన్ల నష్టాన్ని నిరోధించండి
మన ఆహారంలో చాలా కాలం పాటు తగినంత విటమిన్లను తీసుకోక పోయినా లేదా మనం సంపూర్ణ ఆహారం తీసుకోక పోయినా అప్పుడు లోపము ఏర్పడుతుంది. ముసలితనం లేదా అనారోగ్యం, అనారోగ్య కరమైన జీవనశైలి ముఖ్యంగా మద్యపానం వంటి అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం నుండి విటమిన్లను శరీరం గ్రహించకుండా చేస్తాయి. అలాగే మనం తీసుకునే యాంటీబయటిక్స్ ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను తుడిచివేస్తాయి లేదా విటమిన్ K మరియు విటమిన్ B వంటి పోషకాలను క్షీణింప చేస్తాయి. కాంతికి గురి కావడం(అల్ట్రా వైలెట్ UV లైట్) A, D, E, K, B2, B7 వంటి విటమిన్లను నాశనం చేస్తుంది లేదా క్రియారహితం చేస్తుంది. వేడి A, C, B1, B9, B12; విటమిన్లను నాశనం చేస్తుంది. గాలి D, E, K, C, B9, B12 విటమిన్లను నాశనం చేస్తుంది.5,34,36,56,57
ఫ్లేవనాయిడ్ లతో కూడిన విభిన్నమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అన్ని విటమిన్లను గరిష్టంగా వినియోగించగలుగుతాము. ఫ్లేవనాయిడ్లు అనేవి మొక్కల ఉత్పత్తుల్లో లభించే సహజ పదార్థాల సమూహం- పండ్లు (బెర్రీలు, చెర్రీలు, నిమ్మ జాతి పండ్లు) మరియు ఆకుపచ్చ కూరలు ధాన్యాలు (నలుపు, ఊదా, ఎరుపు, రంగులవి), చిక్కుళ్ళు, కాయలు, గింజలు, బెరడు, వేర్లు, కాండం పువ్వులు (ఎండిన పార్సిలీ, ఓరిగానో, చెమోమిలే, పిప్పరమెంటు మరియు ఎర్ర మిరియాలు) మరియు తెలుపు, ఆకుపచ్చ, ఊలాంగ్ మరియు బ్లాక్ టీ, డార్క్ చాక్లెట్ వంటి కొన్ని పానీయాలు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. 58
కూరగాయల్లో కొన్ని పోషకాలు వండినప్పుడు మాత్రమే శరీరం లోకి గ్రహించబడతాయి. ఉదాహరణకు పూర్తి క్యారెట్లు (చర్మం మరియు ముక్కలు చేయనివి), పాలకూర, టమోటాలు, బెల్ పెప్పర్స్. కానీ తగినంత విటమిన్ C పొందటానికి కొన్నిటిని పచ్చిగా తీసుకోవాలి. B1, B2, B3, B6, మరియు C విటమిన్లు వంట చేస్తున్నప్పుడు వంట ద్రవం లోకి వచ్చేస్తాయి కనుక మిగిలిన ద్రవాన్ని పులుసుగా ఉపయోగించడం మంచిది. 5,12
5. విటమిన్ల నుండి ఉత్తమ ఫలితాలు పొందటానికి చిట్కాలు
- కొన్ని విటమిన్ లను తయారు చేసే మీ జీర్ణాశయం మరియు విటమిన్లను నిల్వ ఉంచే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోండి7,8,59
- అన్ని విటమిన్లను పొందటానికి మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూరగాయలు (వండినవి మరియు పచ్చివి) పండ్లు, తృణ ధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు, చిక్కుళ్ళు, బీన్స్, కాయ ధాన్యాలు మరియు పాల ఉత్పత్తులతో కూడిన సమతుల్య ఆహారంపై ఆధారపడండి. పాలిష్ చేసిన మరియు శుద్ధి చేసిన పిండి పదార్థాలను నివారించండి.6,36
- కేవలం అవసరమైనంత నీరు మరియు సరైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఆహారాన్ని వండాలి. 5,12
- తప్పనిసరి అయితే తప్ప చక్కెర జోడించబడని బలవర్ధకమైన ఆహారం ఎంచుకోండి, ఎందుకంటే అవి సాధారణంగా ప్రాసెస్ చేయబడతాయి.60 .
- మీకు విటమిన్ లోపానికి సంబంధిత లక్షణాలు ఉంటె తప్ప లేదా మీ వైద్యుడు సలహా ఇస్తే తప్ప సప్లిమెంట్లను ఎంచుకోవద్దు. ఆహారం ద్వారా విటమిన్ ల అధిక వినియోగం వలన భయం లేదు. అదనపు సప్లిమెంట్లు దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. అధిక మోతాదులో తీసుకోవలసి ఉంటే సాధారణ పర్యవేక్షణ ముఖ్యం. 6,34,61
- సంపూర్ణ శోషణం కోసం కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న తర్వాత కొవ్వులో కరిగే విటమిన్లు A, E, D, & K సప్లిమెంట్లను తీసుకోండి. ఉదాహరణకు కొవ్వుతో వండిన ఆహారం మరియు కొద్ది మొత్తంలో పెరుగు. నీటిలో కరిగే విటమిన్లు C మరియు B12 తీసుకోవడానికి ఉత్తమం సమయం భోజనానికి ముందు ఖాళీ కడుపుతో ప్రధానంగా ఉదయం లేదా భోజనం పూర్తి ఐన తర్వాత 2-3 గంటలు అనంతరం. అలాగే 1-2 గంటల విరామంలో నీరు మరియు కొవ్వులో కరిగే విటమిన్లను విడిగా తీసుకోండి. వివిధ రకాల విటమిన్ తో కూడిన మల్టీ విటమిన్లు శరీరానికి సవాలుగా మారవచ్చు, వాటిని విడిగా తీసుకోవడం మంచిది. 62
చివరి మాట : ఆహారం ఔషధంగా స్వీకరించండి, అలాగే ఔషధమును మీ ఆహారంగా ఉండనివ్వండి... ఆధునిక వైద్య పితామహుడు హిపోక్రటీస్.5,63
రిఫరెన్సులు మరియు లింకులు
- Divine Discourse of 21 Jan 1994 on “Food, the heart and the mind”: https://www.ssbpt.info/ssspeaks/vol27/sss27-03.pdf
- What are micros: https://www.who.int/health-topics/micronutrients#tab=tab_1
- https://www.nia.nih.gov/health/vitamins-and-supplements/vitamins-and-minerals-older-adults
- RDA for Micros: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamins/
- Nature of Vitamins: https://www.bodybuilding.com/fun/vitamins.htm
- https://www.foodunfolded.com/article/vitamins-in-food-why-do-we-need-vitamins
- Vitamins profile: https://extension.colostate.edu/topic-areas/nutrition-food-safety-health/water-soluble-vitamins-b-complex-and-vitamin-c-9-312/
- Healthy fats: https://news.vibrionics.org/en/articles/419
- Vit A deficiency: https://my.clevelandclinic.org/health/diseases/23107-vitamin-a-deficiency
- https://www.healthline.com/nutrition/vitamin-a-deficiency-symptoms
- https://patient.info/healthy-living/vitamin-a-deficiency-leaflet
- Veg best cooked: https://theconversation.com/nine-vegetables-that-are-healthier-for-you-when-cooked-182723
- Vitamin D: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-d/#
- Enhanced role of vitamin D: https://ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4399494/
- https://consultqd.clevelandclinic.org/understanding-the-endocrine-impact-of-vitamin-d-calcium-deficiency-in-the-elderly/#
- D deficiency: https://my.clevelandclinic.org/health/diseases/15050-vitamin-d-vitamin-d-deficiency
- Source sunshine: https://news.vibrionics.org/en/articles/133
- https://news.vibrionics.org/en/articles/167
- https://www.goodreads.com/quotes/tag/vitamins
- Vitamin E: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-e/
- https://www.healthline.com/health/all-about-vitamin-e#3.-May-benefit-those-with-nonalcoholic-fatty-liver-disease-(NAFLD)
- https://ufhealth.org/conditions-and-treatments/vitamin-e
- https://www.lybrate.com/question/1095904873/hey-i-bought-evion-400-capsule-can-i-have-it-what-are-the-uses-of-it-in-skin-and-hair
- Vitamin K: https://health.clevelandclinic.org/vitamin-k
- https://health.clevelandclinic.org/vitamin-k2
- https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-k/#
- https://www.healthline.com/health/vitamin-k
- https://www.usatoday.com/story/life/health-wellness/2023/03/27/what-vitamin-k-benefits-body-who-needs-it-k-2-explained/11548498002/
- Vitamin K at birth: https://www.cdc.gov/breastfeeding/breastfeeding-special-circumstances/diet-and-micronutrients/vitamin-k.html
- Vitamin C: https://health.clevelandclinic.org/vitamin-c
- https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-c/
- https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4648887/
- https://www.healthline.com/nutrition/vitamin-c-foods
- Vitamin B: https://www.betterhealth.vic.gov.au/health/healthyliving/vitamin-b
- https://draxe.com/nutrition/vitamin-b/
- Vitamin B1: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-b1/
- https://tools.myfooddata.com/nutrient-ranking-tool/thiamin-b1/nuts-and-seeds/highest
- https://www.healthline.com/nutrition/thiamine-deficiency-symptoms
- Vitamin B2: https://ods.od.nih.gov/factsheets/Riboflavin-HealthProfessional/
- https://draxe.com/nutrition/vitamin-b2/
- https://www.hsph.harvard.edu/nutritionsource/riboflavin-vitamin-b2/
- Vitamin B3: https://www.hsph.harvard.edu/nutritionsource/niacin-vitamin-b3/
- https://my.clevelandclinic.org/health/diseases/23905-pellagra
- Vitamin B5: https://www.hsph.harvard.edu/nutritionsource/pantothenic-acid-vitamin-b5/
- https://www.healthline.com/health/vitamin-watch-what-does-b5-do#food-sources
- https://draxe.com/nutrition/top-10-vitamin-b5-foods-pantothenic-acid/
- Vitamin B6: https://www.hsph.harvard.edu/nutritionsource/vitamin-b6/
- https://health.clevelandclinic.org/vitamin-b6
- https://ods.od.nih.gov/factsheets/VitaminB6-HealthProfessional/
- Vitamin B7: https://www.hsph.harvard.edu/nutritionsource/biotin-vitamin-b7/
- https://www.medicinenet.com/11_foods_that_have_the_highest_biotin/article.htm
- Vitamin B9: https://medicalnewstoday.com/articles/287677
- Vitamin B12: https://news.vibrionics.org/en/articles/164
- https://my.clevelandclinic.org/health/diseases/22831-vitamin-b12-deficiency
- Vitamin B12 stored: https://www.merckmanuals.com/home/disorders-of-nutrition/vitamins/vitamin-b12-deficiency#
- Nutritional deficiency causes: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC9710417/#
- Antibiotics affect gut bacteria: https://my.clevelandclinic.org/health/body/25201-gut-microbiome
- Flavonoids: https://www.healthline.com/health/what-are-flavonoids-everything-you-need-to-know#sources
- Role of gut bacteria: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3144392/#
- Choose fortified foods: https://www.healthline.com/health/food-nutrition/fortified-and-enriched-foods#Bottom-line
- Supplements: https://www.pennmedicine.org/updates/blogs/health-and-wellness/2020/february/the-truth-about-supplements#
- Best time for vitamins: https://health.clevelandclinic.org/the-best-time-to-take-vitamins
- Food as medicine: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC318470/
______________________________________________________________________________
2. వర్క్ షాప్ లు మరియు శిబిరాలు
1. AVP వర్క్ షాప్: వర్చ్యువల్ నవంబర్ 1-18 తదనంతరం పుట్టపర్తి లో ముఖాముఖీ వర్క్ షాప్ 2023 నవంబర్ 25-27
భారతదేశం నుండి అయిదుగురు మరియు గ్వాటిమాలా నుండి ఒక్కరూ AVP లు గా అర్హత సాధించి ప్రమాణ
స్వీకారం చేశారు. వైబ్రియానిక్స్ ఉపాధ్యాయులుగా లేదా అడ్మిన్ బృందంలో భాగం కావాలనుకునే వారితో సహా పలువురు ప్రాక్టీషనర్లు కూడా వర్క్ షాప్ లో పరిశీలకులుగా పాల్గొన్నారు. ఈ మూడు రోజుల ప్రాక్టికల్ సెషన్లో పాల్గొన్నవారు మునిపటి ఆరునెల ఆన్లైన్ కోర్సులో నేర్చుకున్న వాటిని పునరా లోకనం చేసుకోవడమే కాకుండా రోగులతో వాస్తవంగా ముఖాముఖి సంభాషన ద్వారా ఆచరణాత్మక అనుభవాన్ని కూడా పొందడం తో అందరూ ఈ ప్రక్రియను అభినందించారు. డాక్టర్ జెకె అగర్వాల్ తన ముగింపు ప్రసంగంలో వైబ్రియానిక్స్ యొక్క అపారమైన సామర్థ్యాన్ని నొప్పి చెప్పారు. కొత్తగా అర్హత పొందిన ప్రాక్టీషనర్లకు సూచనలు ఇస్తూ ఇప్పుడు వైబ్రియానిక్స్ లో అనేక అడ్వాన్స్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నందున వారి ప్రయాణంలో AVP అర్హతను ఒక సోపానంగా చూడాలని వారిని ప్రోత్సహించారు. ఐతే తగినంత జ్ఞానం మరియు అనుభవం లేకుండా వైబ్రియానిక్స్ పై ప్రసంగములు చేయవద్దని హెచ్చరించారు. కొందరు ప్రాక్టీషనర్లు గతంలో ఈ తప్పులు చేశారని చెప్పారు. రోగులను పరిశీలించినప్పుడు మరియు విజయవంతమైన రికవరీ ఉన్నప్పుడు (ఇది అహంకారానికి ఆజ్యం పోస్తుంది) ఫలితాలతో సంబంధం లేకుండా నిరాడంబరంగా ఉండాలని మరియు ఫలితాలు ఆశించినంతగా లేకుంటే నిరుత్సాహ పడవద్దని ఎందుకంటే స్వస్థత అనేది భగవంతుని సంకల్పము అని వారికి సలహా ఇచ్చారు. మొత్తం మీద ఈ ప్రాక్టికల్ వర్క్ షాప్ కొత్త AVP లలో సేవా భావాన్ని మరియు అంకిత భావాన్ని రేకెత్తించగా వారు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
______________________________________________________________________________
2. AVP & రిఫ్రెషర్ వర్క్ షాప్: పెరిగ్యూక్స్ ఫ్రాన్స్ 2023 నవంబర్ 9-13
ఫ్రెంచ్ కోఆర్డినేటర్ 01620 ముగ్గురు AVP ల కోసం ఈ రిఫ్రెషర్ మరియు వర్క్ షాప్ నిర్వహించారు. వీరిలో
ఒకరు కొత్త అభ్యర్థి కాగా మరొకరు రెండేళ్ల క్రితం శిక్షణ పొంది రెఫ్రెషర్ అవసరమని భావించి హాజరైన వారు. మూడవ వారు 2004లో వైబ్రియానిక్స్ చేపట్టి కుటుంబ కట్టుబాట్ల కారణంగా కార్యకలాపాలు తగ్గడంతో ఇప్పుడు తన సేవను పున ప్రారంభించడం కోసం ఉత్సాహంగా హాజరయ్యారు. ఆమె కోఆర్డినేటర్ తో కలసి చాలా నెలలుగా ఈ కోర్స్ ద్వారా వర్క్ షాప్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తను కలిగి ఉన్న SRHVP కి అదనంగా 108CC బాక్సు ఉపయోగించడానికి ఎదురుచూస్తున్నారు. పాల్గొన్న ముగ్గురూ తమ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణులై ప్రమాణ స్వీకారం చేశారు. జూమ్ ద్వారా డాక్టర్ అగర్వాల్తో కాంటాక్ట్ కావడం ద్వారా మౌఖిక, బాహ్య అనువర్తన, లేదా మరేదైనా పద్ధతిలో రెండు రెమెడీల మధ్య ఆదర్శవంతమైన విరామం ఎంత ఉండాలి, వంటి తమ సందేహాలను స్పష్టంగా నివృత్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేసారు. ప్రాక్టీషనర్లు తమ సేవలో నమ్మకంగా ముందుకు సాగడానికి సంసిద్ధులయ్యారు.
______________________________________________________________________________
3. ఢిల్లీ లోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్ లో 2023 డిసెంబర్ 10 వ తేదీన నిర్వహింప బడిన సమావేశము
SVIRT గవర్నర్11964 ఆధ్వర్యంలో ఢిల్లీ NCR నుండి ప్రాక్టీషనర్లు డాక్టర్ మరియు శ్రీమతి అగర్వాల్తో నిర్వహించిన ఒక పూట ఇంటరాక్టివ్ సమావేశము ఫలవంతముగా ముగిసింది. తక్కువ సమయంలో వెల్లడించి నప్పటికీ 20 మంది ప్రాక్టీషనర్లు హాజరు కావడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. రెమిడీ లు పంచిపెట్టేటప్పుడు స్వామితో కనెక్ట్ అవడం మరియు అహంకారము మరియు ఆపేక్ష లేకుండా నిస్వార్థ సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. డాక్టర్ అగర్వాల్ లిబరేషన్ -ముక్తి యొక్క నిజమైన అర్ధాన్ని విశ్లేషణాత్మకంగా లోతుగా వివరిస్తూ ఆచరణాత్మక ఉదాహరణలను ఇవ్వడం ద్వారా పాల్గొన్న వారి ప్రశ్నలకు చక్కని సమాధానములు ఇచ్చారు. ప్రాక్టీషనర్లు తమ వంతుగా వైబ్రియానిక్స్ యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని వివరిస్తూ అనేక విజయవంతమైన అద్భుతమైన కేసులను పంచుకున్నారు. వైబ్రియానిక్స్ కమ్యూనిటీ ప్రయోజనం కోసం అటువంటి కేసులన్నిటిని పంపమని వారిని ప్రోత్సహించారు. ఢిల్లీ NCR రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు స్వామి కాలేజీ పూర్వ విద్యార్థి వైబ్రియానిక్స్ పట్ల గొప్ప ఆసక్తిని కనబరుస్తూ సభను ఉద్దేశించి ప్రసంగించారు, ఇది వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది.

______________________________________________________________________________
3. క్యాంపులు మరియు క్లినిక్కులు
స్వామివారి 98వ జన్మదినోత్సవం పురస్కరించుకొని 2023 నవంబర్ లో SVIRT ఆధ్వర్యంలో జరిగిన శిబిరాలు
నవంబర్ నెలలో భారతదేశంలోని 12 రాష్ట్రాల నుంచి అనగా AP, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, మరియు పశ్చిమ బెంగాల్ నుండి 33 మంది ప్రాక్టీషనర్లు 1-3 రోజుల వ్యవధిలో 30 క్యాంపులు నిర్వహించి 1634 మంది రోగులకు చికిత్స అందించి 1668 IB బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ వేదికలలో భాగంగా పాఠశాలలు, మారుమూల గ్రామాలు, పబ్లిక్ మరియు మతపరమైన ప్రదేశాలు మరియు స్థానిక సాయి కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉదహరించ దగినది పుట్టపర్తి రైల్వే స్టేషన్లో నవంబర్ 21 నుంచి 23 వరకు ప్రాక్టీషనర్01228 ద్వారా నిర్వహింపబడిన 15వ వార్షిక శిబిరానికి మరో ముగ్గురు మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోదగిన సేవ. రోగుల నిరంతర ప్రవాహం నలుగురు ప్రాక్టీషనర్లను విశ్రాంతికి అవకాశం లేకుండా వారి కాలిపై నిలబడేటట్లు ఉంచగా ఉత్సాహభరితమైన ఈ బృందం 913 మంది రోగులకు రెమిడీలు అందించారు. గత సంవత్సరాల మాదిరిగానే చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సమీపములోని పెనుగొండ కాలేజీకి చెందిన 300 మంది విద్యార్థుల బృందం వారి పరీక్షలు మరియు శీతాకాల విరామం తర్వాత మన బృందాన్ని ఆహ్వానించి తమ విద్యార్ధులకు మెడికల్ క్యాంపు నిర్వహించాలని అంతేకాక ఇది నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు.



______________________________________________________________________________
4. పర్యావరణ అనుకూల ప్రయత్నం
ప్రేమతరు మొక్కల పెంపకం కార్యక్రమం ఊపందుకుంది!
ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లోని స్టీల్ ప్లాంట్ సహకారంతో సత్య సాయి సంస్థ జపనీస్ మియా వాకిటెక్నిక్ ని ఉపయోగించి అడవుల పెంపకం కార్యక్రమం చేపట్టింది. 2023 సెప్టెంబర్ 27న 3200 మొక్కలు నాటారు. ప్రాక్టీషనర్11634…ఇండియా ఈ మెగా ఈవెంట్ లో భాగంగా మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఈ క్రింది రెమిడీ అందించారు:
CC1.2 Plant tonic + NM67 Calcium + SM1 Removal of Entities + SM5 Peace & Love Alignment
అటవీశాఖ సిబ్బంది సహాయంతో మొక్కలను పర్యవేక్షించడానికి పెద్ద మొత్తంలో రెమిడీ తయారు చేసే విధానాన్ని వివరించారు.
మరో ప్రదేశం డొంకడ్ కాలనీలో మూడు ఎకరాల స్థలంలో 14,500 స్థానిక పండ్ల జాతుల మొక్కలను నాటుతున్నారు. సీనియర్ ప్రాక్టీషనర్11567…ఇండియా ఆధ్వర్యంలో 17 మంది స్థానిక వైజాగ్ ప్రాక్టీషనర్లు ఈ సేవ కోసం వివిధ ఆధ్యాత్మిక సంస్థలతో చేతులు కలిపారు.
ఢిల్లీ NCR లో నోయిడా లోని పక్షి అభయారణ్యం సిటీ ఫారెస్ట్ లో కొత్తగా నాటిన 1600 పళ్ళు, పువ్వులు, ఇతర మొక్కలపై ప్లాంట్ టానిక్ పిచికారి చేయడానికి ప్రాక్టీషనర్11437 చొరవ తీసుకున్నారు.


______________________________________________________________________________
5. కధానిక
సరైన స్థలం లో సరైన సమయంలో 11570...ఇండియా
2023 మార్చి 8 తన పరిసరాల్లో హోలీ పండుగ జరుపుకుంటున్నప్పుడు సహాయం కోసం ఎవరో పెద్దగా కేకలు వేయడం ప్రాక్టీషనర్ విన్నారు. ఒక యువకుడు తన వాటర్ గన్ తో సమీపంలో చెట్టుపై ఉన్న పెద్ద తేనెతుట్టను కొట్టినట్లు ఆమె కనుగొన్నారు. కలవరపడిన తేనెటీగలు అమాయక ప్రేక్షకుడి పై దాడి చేశాయి. 45 ఏళ్ల ఈ నిస్సహాయ వ్యక్తిని తల, మెడ, మరియు చేతులపై కుట్టడం ప్రారంభించాయి. ప్రాక్టీషనర్ ఇంటికి పరిగెత్తి CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions నీటిలో తయారుచేసి తేనె టీగలు కుట్టిన వాటిపై స్ప్రే చేశారు. అదే రోజు సాయంత్రం అతనిని కలిసినప్పుడు తను ఇంటికి తిరిగి వచ్చి కొన్ని గంటలు పడుకున్నానని మేల్కొన్నప్పుడు నొప్పి లేకపోవడం, వాపు కూడా చాలా తక్కువగా ఉండడం చూసి తను నమ్మలేకపోయానని చెప్పారు. మరుసటి రోజు ఉదయం అతను పూర్తిగా నయమై ఉల్లాసంతో యధావిధిగా తన పనికి వెళ్లారు. ప్రాక్టీషనర్ తనను సరైన సమయంలో సరైన స్థలంలో నిలిపి ఉంచినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
______________________________________________________________________________
6. జ్ఞాపకార్ధం
కేతరీనా రైటర్ 02713…ఆస్ట్రియా మన వైబ్రియానిక్స్ వార్తా లేఖలను జర్మన్ భాష లోనికి అనువదించే అత్యంత విలువైన పెన్నిధి అంకిత భావానికి ప్రతిరూపం ఐన 59 ఏళ్ల కేతరీనా రైటర్ 2023 సెప్టెంబర్ లో స్వామి పాదాల చెంత చేరుకున్నందుకు మేము సంతాపం తెలియజేస్తున్నాము. ఆమె భర్త ఇలా రాశారు. “మా అధ్యాత్మిక ప్రయాణంలో మా ప్రియమైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రతీ క్షణం మాకు తోడుగా మార్గ నిర్దేశం చేశారు. కేతరీనా తన నశ్వరమైన శరీరాన్ని విడిచిపెట్టి పరిపూర్ణ ప్రశాంత స్థితి లోనికి చేరిపోయారు” ఆమెను ఎల్లప్పుడూ గుర్తుంచు కోదలచిన వారందరూ తమ హృదయ నిశ్శబ్దంలో ప్రశాంత స్థితిని అనుభవించాలని భగవంతుని అమూల్యమైన దర్శనంలో ఆమెను శాశ్వతంగా చేర్చుకోవాలని ఆమె కోరిక. ఆమె ఎడబాటు యొక్క తుఫాను అలలలో ఆమెను గాఢంగా ప్రేమించే ఆమె భర్త బాబా మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ “ఆమె ఎక్కడికి వెళ్ళగలదు, ఎక్కడికీ లేదు ఆమె ఇప్పుడు ఇక్కడ శాశ్వతమైన స్థితిలో ఉంది.
అక్టోబర్ 22న మేము పోగొట్టుకున్న మరో సాయి ఆభరణం 77 ఏళ్ల రోజలిజా మారోల్ట్ 02243…స్లొవేనియా చాలాకాలంగా అస్వస్థత తో ఉంటూ క్లాసిక్ లింఫోసైట్ లుకేమియాతో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. కానీ ఇతరులకు సేవ చేయడంలో, దాదాపు ఆమె చివరి రోజు వరకు ఆమె నెలవారి నివేదికలను సమర్పించడం లో ఆమెకు గల దక్షతను ఈ వ్యాధి నిలువరించ లేకపోయింది. తన స్థానిక సాయి సెంటర్లో నిత్యం పాల్గొనేవారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ, ఎప్పుడు తప్పులెన్నని మరొక వైబ్రియానిక్స్ ఆభరణం స్వామి మధురమైన ప్రేమలో సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.