Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనముగా

Vol 8 సంచిక 6
November/December 2017


ఆరోగ్య చిట్కాలు

జీవితాంతం సాధారణ రక్తపోటు (BP)తో జీవించడానికి సులువైన మార్గాలు!

1. ప్రధానమైన బి.పి .యొక్క నిర్మాణము  1-5 : మన గుండె కొట్టుకున్న ప్రతీసారి అది ప్రాణవాయువు తో కూడిన రక్తాన్ని ధమనుల లోనికి సరఫరా చేస్తుంది. సహజంగా అప్పుడు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది దీనిని సిస్టోలిక్ ప్రెజర్ అంటారు.అలాగే రెండు హృదయ స్పందనాలకు మధ్య విరామం లో రక్తపోటు తక్కువ ఉంటుంది దీనిని డయాస్టోలిక్ ప్రెజర్ అంటారు.  మన దేహంలో గుండె, రక్తనాళాలు,మూత్ర పిండాలు,రక్తపోటు ను సమ స్థితిలో ఉంచేందుకు పరస్పరం సహకరించుకుంటూ  ఉండే యంత్రాంగం ఉండి దేహానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. ఇట్టి సరఫరా లేకపోతే శరీర మనుగడకు కావలసిన ప్రాణవాయువు అందదు.

బి.పి. ని సాధారణంగా సంఖ్యా పరంగా సిస్టోలిక్ ముందు దానికింద డయాస్టోలిక్ ఉండేవిధంగా సూచిస్తారు. సాధారణ అవగాహన కోసం 120/80 (mm of Hg) ని సాధారణ రక్తపోటు అంటారు.ఔషద పరంగా వాడుకలో 119/79 ని సాధారణ రక్తపోటు గా వ్యవహరిస్తారు.140/90 అంతకంటే ఎక్కువ ను అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అంటారు. సిస్టోలిక్ 120 నుండి 139 మధ్య,డయాస్టోలిక్ 80 నుండి 89 మధ్య ఉంటుంటే దీనిని ప్రాధమిక రక్తపోటు అని దీని పట్ల మందే జాగ్రత్త పడకపోతే ఇదే హై బి.పి. గా పరిణమిస్తుంది. 

అధిక రక్తపోటు రక్తము యొక్క వత్తిడి రక్త నాళాల పైన అధికముగా ఉన్నప్పుడు కలుగుతుంది. ఇది గుండె పైన వత్తిడి కలిగించి అధిక శ్రమకు గురి అయ్యేలా చేసి హార్ట్ ఎటాక్,మూత్రపిండాలు పనిచెయ్యక పోవడం, దృష్టి లోపము కలిగేటట్లు త్వరగా నివారణ చేపట్టక పొతే  చివరికి మరణము కూడా పొందేలా చేస్తుంది. అలాగే ఇది మన ప్రజ్ఞా పాటవములను క్షీణత పొందేలా చేయడం.చిత్తవైకల్యము,మెదడు క్షీణత (అల్జిమిర్స్ డిసీజ్) పొందేలా కూడా చేస్తుంది.

2. హై బి,పి.లక్షణాలు 3-12: అధిక రక్తపోటుకు సంబంధించినంత వరకూ ఒక ప్రమాదకరమైన అంశము ఏమిటంటే అది తమలో ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు.ఎందుకంటే దీనికంటు  ప్రత్యేకమైన వ్యాధి లక్షణాలేమి ఉండవు. ఐతే ప్రాధమిక స్థాయిలో ఉన్నప్పుడు మన తలను క్రిందికి వంచినపుడు మైకము లాగా అనిపిస్తుంది.  అందరూ అనుకున్నట్లు తలపోటు రావడం,ముక్కువెంబడి రక్తం కారడం ఉండకపోవచ్చు. ఐనా వ్యాధి లక్షణాలు బయట పడేదాకా వేచిఉండడం జీవితంతో ఆడుకోవడమే. కొన్ని వ్యాధి లక్షణాలు ఏమిటంటే విపరీతమైన తలపోటు,మసకబారిన దృష్టి,విపరీతమైన అలసట.అయోమయం,శ్వాశ తీసుకోవడంలో ఇబ్బంది,ఛాతీలో నొప్పి,అస్తవ్యస్తమైన హృదయ స్పందన.ఛాతిలో,మెడ,చెవులలో పోటు,ఒక్కొక్క సారి శరీరంలో అంతర్లీనంగా ఉన్న వ్యాధి లక్షణం మేరకు మూత్రంలో రక్తము జారీ అవడం ఇటువంటి వన్నీ బి.పి.ని అనుమానించే టందుకు ఆస్కారం కలిగించేవే. బి.పి. ని మౌనంగా చంపేసే వ్యాధిగా ముద్ర వేసినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నివారించవచ్చు .

3. అధిక రక్తపోటుకు అనుమానింప దగిన కారణాలు 3-13: అధిక రక్తపోటు సాధారణంగా వయసు పెరగడం బట్టి వచ్చే వ్యాదని భావిస్తూ ఉంటారు కానీ అనేక అధ్యయనాల ప్రకారం ఇది సంవత్సరాల తరబడి మాంసాహార సేవనము,నూనెలు,నిల్వ చేసిన ఆహారము అరియు అధికమైన ఉప్పు తీసుకోవడం వలన కలుగుతుందని సూచిస్తున్నాయి. కొవ్వుతో కూడిన పలకాలు రక్తనాళాల గోడలకు పేరుకుపోవడంతో కొంత కాలము తర్వాత రక్తనాళాలు ఇరుకుగానూ బిరుసుగాను  ఐపోయి  వాటి సాగుడు గుణాన్ని కోల్పోతాయి ఇది  అనూహ్యంగా రక్తపోటు పెంచేందుకు పరోక్ష సహాయకారి ఔతుంది .  

స్టార్చ్ ఎక్కువగా ఉన్న పదార్ధలయిన రొట్టె, పాస్తా ముద్ద  మొక్కజొన్న,అన్నము,ఆలుగడ్డలు  ఇటువంటివి రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని పెంచుతాయి. ఇవీ శరీరంలోని సోడియం శాతాన్ని పెంచి మెగ్నీషియం ను బయటకు పంపిస్తాయి. దీనివలన రక్తనాళాలు నొక్కివేయబడి నట్లుగా అయ్యి రక్తపోటును పెంచుతాయి. ఇతర కారణాలను పరిశీలిస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం,చిన్నతనంలో పోషకాహార లోపము, ధ్వని,తరుచుగా గాలి కాలుష్యానికి గురికావడం(దీని వలన సీసము కూడా ఎక్కువపాళ్ళలోనే శరీరంలో చేరుతుంది),ధూమపానము,మద్యపానము,నిద్రలేమి, జన్యు పరంగానో ఇతరకారణాల వలన గుండెజబ్బు,మధుమేహము ఉన్న వారితో చేరి ఉండడం, ఊబకాయము, శారీరక శ్రమ లేకపోవడం ,అధిక బరువు ఇంకా వీటితోపాటు మానసిక ఆందోళన,వత్తిడి, ఇవన్నీ కారణమవుతాయి.దురదృష్టవశాత్తూ గతంలో డాక్టర్లు ఈ ప్రధాన కారణాలను విస్మరించారు. 

4 . బి.పి. యొక్క తప్పుడు సూచి కంగారు పెడుతుంది. 3,11,16 : రక్తపోటు యొక్క కొలత రోజు రోజు కు ఇంకా చెప్పాలంటే గంటగంటకు మారుతూ ఉంటుంది . కనుక ఇది ఒక్కొక్కసారి ఎక్కువ సూచిస్తున్నప్పటికినీ  కంగారు పడవలసిన అవసరం లేదు. కనుక బి.పి. చూపించుకునే ముందు ఎవరయినా సరే ప్రశాంతంగా ఉండగలగడం లేదా దీర్ఘంగా శ్వాశ తీసుకోవడం ఇలా చేయడం వలన బి.పి. రీడింగు తప్పుగా చూపబడే ఆస్కారం ఉండదు. మొదటి సారి తీసుకున్న కొంత విరామం తరవాత రెండవసారి తీసుకోవడం వలన సరియైన రీడింగు చూపబడే ఆస్కారం ఉంటుంది. ఆందోళన, చొక్కా మడత సరిగా లేకపోవడం,చేతిని సరియయిన స్థితిలో (శరీరానికి లంబకోణంలో చెయ్యి ఉండాలి)ఉంచకపోవడం ఇవన్నీ మన బి.పి ని 10%ఎక్కువ చూపించే ఆస్కారం ఉంది . రెండు చేతుల నుండి కూడా బి.పి రీడింగు తీసుకోవడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఒకవేళ ఇలా తీసుకునప్పుడు ఈ రెండు రీడింగుల మధ్య వ్యత్యాసము ఎక్కువగా ఉంటే రక్తప్రసరణ వ్యవస్థలో సమస్యలు ఉన్నట్లు భావించాలి. అలాగే శరీరము యొక్క వివిధరకాల భంగిమలు కూడా (కూర్చోవడంలో గానీ విశ్రాంతి తీసుకోవడంలో గానీ )బి.పి. రీడింగు లో వ్యత్యాసాన్ని సూచిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

బి.పి. దీర్ఘకాలికంగా ,స్థిరమైన విధంగా ఎక్కువ రీడింగు చూపిస్తూ ఉంటేనే అనారోగ్య సమస్యలు ఉత్పన్న మవుతాయి తప్ప మరోవిధంగా కాదు. కొన్ని వారాల వ్యవధిలో కనీసం మూడు హై బి.పి.రీడింగు లను సూచిస్తే అప్పుడు బి.పి. గురించి ఆందోళన చెందాలి కానీ  మరో విధంగా భయపడవలసిన అవసరం లేదు. ఐతే బి.పి.కి సంబంధించినతవరకూ ఏదయినా అసౌకర్యము ఏర్పడితే వెంటనే చూపించుకోవడం ఉత్తమం. అలాగే ఇంట్లోనే బి.పి.ని చెక్ చేసుకునేందుకు వీలుగా దానికి సంబంధించిన ప్రమాణాలు,విధానము ప్రతీ ఒక్కరు తెలుసుకోవడం ఉత్తమం. 16.

5. హై  BP మనలను అప్రమత్తులను చేస్తుంది 3,13అధిక రక్తపోటు అనేది మన శరీరంలో రక్తనాళాలు దెబ్బతిన్నాయని,రక్త ప్రసరణ వ్యవస్థ అనారోగ్యకరంగా ఉన్నదనీ ఆలశ్యం చేయకుండా దీనిని ఎదుర్కోవాలనీ తెలపడానికి ఒక సూచన. ఇది వ్యాధి కాదు కానీ శరీరము లోపల ఉన్నఅనారోగ్య  సమస్యను ప్రకటించే ఒక సూచన వంటిదే.ఐతే దీనికి కొందరు మందులు వాడడం ప్రారంభించి బాహ్యంగా ఉండే లక్షణాలు తొలగాగానే ప్రశాంతంగా ఉంటారు కానీ లోలోపల అది వృద్ధి ఔతునే ఉంటుంది.  

6. అధిక రక్తపోటు యొక్క సూక్ష్మ అంశాలు 17-18,41ఇన్ఫెక్షన్ వలె రక్తపోటు బయట నుంచి వచ్చేది కాదు. శరీరము లోపలే సృష్టింపబడుతుంది . మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది శరీరములోని  ప్రతీ కణము ఆరోగ్యము గా జీవింప బడేలా సృష్టింప బడితే మరి రోగము అనేది ఎందుకు వస్తుంది. అనగా ప్రాధమిక స్థాయిలో అనగా కణము స్థాయిలోనే ఏదో సమతౌల్యము  దెబ్బతిన్నది అని భావించ వలసి వస్తుంది. ఏవిధంగా ఐతే సమస్య శరీరము లోపలే సృష్టింపబడిందో దాని పరిష్కారము కూడా లోపలే ఉందని గ్రహించాలి. ఆధ్యాత్మిక గురువులు,మతగ్రంధాలు ప్రకారము మన శరీరం లోనే ఒక ప్రత్యేక విభాగము ఇట్టి కణాలను బాగుచేయడానికి మరియు తిరిగి ఆరోగ్యము సంతరించుకోవడానికి పని చేస్తూ ఉంటుంది.  ఐతే ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహజ సిద్ధమైన శరీరము-మనసు-శ్వాస ,ఆహారము ఉండాలి తప్ప కృత్రిమ పద్ధతులు,మందులు ఇవి శరీరములో ఉండవలసిన ఖనిజ లవణాలు ఇటువంటి వన్నింటిని బయటకు పంపడం వలననే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.  సాయివై బ్రియానిక్స్ రెమిడిలు రక్తంలో చెక్కర శాతాన్ని సమపాళ్ళలో ఉంచడం ద్వారా బిపి.ని తగ్గించడం ద్వారా ఎంతో మంది డాక్టర్లకు  తమ పేషంట్లు మందుల మీద అధారపడడం నిరోధించాయి.

7. లో బి.పి. 19-20: 90/60 లేదా అంతకన్నా తక్కువ గా రక్తపోటు యొక్క రీడింగు సూచిస్తూ ఉంటే అది లో బి.పి. లేదా హైపో టెన్షన్ ను సూచిస్తుంది. వ్యాధి లక్షణాలు లేకుండా కేవలం రీడింగు మాత్రమే లో బి.పి. ని సూచిస్తూ ఉంటే అది వ్యాధి కాదు అని గ్రహించాలి.కొంతమందికి ఈ రీడింగు ఏ లక్షణాలు చూపకుండా  90/50 కూడా ఉండవచ్చు. అంతేకాక  హై బి.పి. తో ఉన్నవారు కూడా అనగా 100/60. ఉన్నవారు కూడా లో బి.పి.ని పొందేఅవకాశం ఉంది.  ఐతే హైబి.పి. వలె కాకుండా లో బి.పి. లో రక్త నాళాలలో రక్త ప్రవాహము నెమ్మదిగా ఉంటుంది .ఐతే ఇది మరీ నెమ్మదిస్తే అత్యంతమౌలికమైన మెదడు,గుండె,మూత్రపిండాలు,వంటి వాటికి  ప్రాణవాయువు మరియు పోషకాల సరఫరా మందగించడం వలన అది తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఈ అవయవాల పనితీరును పాడుచేసే అవకాశం ఉంది.  

8. లో బి.పి. కి కారణాలు మరియు దాని లక్షణాలు 19-20ఎవరికైనా సరే జ్వరం వచ్చినప్పుడూ,నీళ్ళవిరోచనాలు, వాంతులు, స్త్రీల కయితే నెలసరి సమయాల్లో ఎక్కువగా రక్తం పోయినప్పుడు ఇటువంటి సందర్భాలలో సాధారణంగా లో బి.పి. ఏర్పడుతూ ఉంటుంది తర్వాత తగ్గిపోతూ ఉంటుంది కనుక దాని గురించి అందోళన అవసరం లేదు.  మనం చేసే పనిని బట్టి, ఆందోళన,వాతావరణ మార్పులు,ఆహారము,జీవన విధానము వీటన్నిటి  వలన రక్తపోటు సాధారణంగా మారుతూ ఉంటుంది.  ఐతే స్థిరంగా లో బి.పి కనుక రికార్డవుతూ  ఉంటే దానికి కారణం గుర్తించి వెంటనే నివారణ చేపట్టాల్సిందే. సాధారణంగా జన్యు పరంగానూ,వయసును బట్టి, మనం తీసుకునే మందుల ప్రభావము,అనార్ద్రత ,పోషక విలువలు లేని ఆహారము,గుండె పనితీరు, నరాలకు సంబంధించిన రుగ్మతలు,హార్మోన్ లోపము,గాయము లేదా షాక్ తినడము వీటివలన లో బి.పి. ఏర్పడుతూ ఉంటుంది. అలాగే

తల వాలిపోతూ ఉండడం,కండ్లు తిరగడం,తలపోటు,మూర్చ పోవడం,నీరసం,అస్పష్టమైన దృష్టి,ఆందోళన, గుండెదడ, స్థిమితంగా లేకపోవడం,దాహంగా ఉండడం, లేచినప్పుడుగానీ  ,కూర్చున్నప్పుడుగానీ లేదా శరీర భంగ

గిమ మార్చుకున్న సమయంలో గానీ  వికారము అనిపిస్తే  మెదడుకు సరిపడినంత రక్తం అందడంలేదని  దానికి తగివిధంగా ప్రతిస్పందించాలని సూచన. 

9. సహజ సిద్ధంగా BP ని నార్మల్ గా ఉంచుకునే విధానము 3,21-40:
(i) సోడియం ను మరియు సోడియం తో కూడిన పదార్ధాలను (ఎక్కువ ఉప్పు ఉన్న ఏ పదార్ధన్నయినా) దూరంగా ఉంచండి .
సోడియం   మనశరీరంలో ద్రవ పదార్ధాలు,సమపాళ్ళలో ఉంచడానికి,కండరాలు,నరాలు చక్కగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. కానీ ఎక్కువ పాళ్ళలో ఈ సోడియం తీసుకుంటే ఇది  రక్తంలో నీటి శాతాన్ని పెంచి తద్వారా ఘనపరిమాణం పెరగడంతో బి.పి.కూడా సహజంగానే పెరిగిపోతుంది.  సోడియం  యొక్క ప్రధానమైన ఆధారము సాధారణ ఉప్పు. ఇది రొట్టెలు, పిండి వంటలు,వెన్న,ఫాస్ట్ ఫుడ్,సాస్ లు,సలాడ్ లు, మసాలాలు,పచ్చళ్ళు, వండిన ఆహారంలోనూ ఇది ఉంటుంది. మనకు కావలసిన సోడియం పళ్ళు,కూరగాయలు, పాలఉత్పత్తులూ, పప్పుధాన్యాలు లో ఉంటుంది కనుక సోడియం  ఎక్కువ తీసుకుంటున్నామనే భయం ఏమీ లేకుండా వీటిని తీసుకోవచ్చు.  

(ii) సోడియం స్థానంలో పొటాసియం ను చేర్చుకోండి . 
పొటాసియం  కొబ్బరిననీటిలోను, పెరుగులోను,పుల్లని పండ్లలోనూ,అరటిపళ్ళు,దానిమ్మ పండ్లు, ఉసిరి కయలోను,జల్దారు పండ్లలోనూ ,ఎండుద్రాక్ష ,ఖర్జూరం  అల్బకరా పండ్లలోనూ,ఆకుపచ్చని కూరగాయలు,కేరట్లు,చిలకడ దుంపలు,టమాటాలు, బటానీలు ,చిక్కుడు  ఇంకా ధాన్యాలన్నింటిలోనూ ఇది లభ్యమవుతుంది. ఎక్కువ పొటాసియం కలిగిన పదార్ధాలు రక్త నాళాల గోడల పైన వత్తిడి తగ్గించి  బి.పి .ని నార్మల్ లో ఉంచడమే కాక రక్తం లో ఉన్న సోడియం ను సమతౌల్యం చేయడం ద్వారా  మూత్రం ద్వారా బయటకు పంపివేయబడుతుంది. అలాగే బి.పి. కి సంబంధించిన  అన్ని ఖనిజ లవణాలను సమపాళ్ళలో ఉంచి గుండె, మూత్రపిండాల సమస్యలను తగ్గిస్తుంది.   

(iii) మెగ్నీషియం&కాల్షియం,మరియు  B3, C, E, K, & D విటమిన్లతో అనుబంధ ఆహారము :
మెగ్నీషియం   మన శరీరంలో రక్తపోటు,రక్తంలో చక్కెర శాతము,ఎముకల పెరుగుదల వంటి అనేక వ్యవస్థల నియంత్రణలో సహాయకారిగా ఉంటుంది. ఇది ఆకుపచ్చని కూరగాయల లోనూ ధాన్యముల పొట్టు, పప్పు ధాన్యాల లోనూ లభిస్తుంది. కాల్షియం  రక్త పోటు నియంత్రణ కోసం రక్త నాళాలు బిగింపు,వదులు అవడంలో సహాయకారిగా ఉంటుంది. ఇది పాల ఉత్పత్తులూ,ముదురు ఆకుపచ్చని కాయగూరలలోను ,బాదాం,నువ్వులు, తోటకూర,గోంగూర,గసగసాలు వంటి వాటిలో సమృద్ధిగా లభిస్తుంది.

విటమిన్ B3 ఆకుకూరలలోను, ధాన్యాల లోనూ దొరికే  ఈ విటమిన్ రక్త కణాలను శక్తివంతం గాను, మృదువుగాను చేయడం వలన  గుండెజబ్బులు వచ్చే ప్రమాదాలను దూరం చేస్తుంది.  విటమిన్  C   ధమనులలో ఫలకాలు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇది అరటిపళ్ళు,అవోకడో పండు,జామ,పుచ్చకాయ,బెర్రీ పండు, నిమ్మ జాతి పండ్లు,రేగుపండ్లు ,క్యాబేజీ,బ్రోకలీ, టమాటాలు,ఆలుగడ్డలు, ఎర్రని పిప్పలి దుంపలు ఇవన్నీ అధిక మొత్తంలో C విటమిన్ కలిగి ఉంటాయి.   విటమిన్ E అనేది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బాదాం,హాజెల్ పండు గింజలు,పొద్దుతిరుగుడుగింజలు, ఆకుకూరలు,ధాన్యాలు,చిలకడ దుంపలు,అవకడో పండు,బొప్పాయి,మరియు నీలి బెర్రీ పండ్లలో సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ K1 అనేది రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది ఇది ఆకుపచ్చని కూరగాయలయినట్టి  పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు,వెల్లుల్లి, క్యాబేజీ,కాలిఫ్లవర్ లాంటి కూరగాయలు,తెల్ల ఉల్లిపాయలు, కొంత మేరకు పులియబెట్టిన డైరీ  ఉత్పత్తులూ, దోసకాయలు,మొలకెత్తిన విత్తనాలు, ప్రునె పండ్లు, తులసి  వీటిలో కూడా లభిస్తుంది. విటమిన్ K2  అనేది చిన్న ప్రేవుల గోడలవద్ద ఉన్న బ్యాక్టీరియా ద్వారా K 1 నున్దిఉత్పత్తి చేయబడుతుంది. K2 అనే విటమిన్ శరీరంలో కాల్షియం ను ఉండవలసిన స్థాయిలో ఉంచడంద్వారా ఎముకలకు పుష్టిని కలుగచేసి (ఆస్టియోపోరోసిస్ ) ఎముకల బోలుతనాన్ని నివారిస్తుంది.

విటమిన్ D అనేది శరీరంలో కాల్షియం ని గ్రహించడానికి అత్యవసరము. ఈ విటమిన్ ను సూర్యరశ్మి నుండి గ్రహించడం ఎంతో శ్రేయస్కరం. ఇండియా లో జరిపిన ఒక సర్వే ప్రకారము మధ్యాహ్నం  11 నుండి 2 గంటల వరకూ ఎండకు  గురయి నపుడు మన శరీరము అధిక మొత్తంలో విటమిన్ D౩ ని గ్రహిస్తుందని తెలిపింది.  ఒక సూచన ప్రకారము వారానికి రెండు లేదా మూడు సార్లు 20 నిమిషాల పాటు ఈ సమయంలో చేతులు,ముఖము,కాళ్ళకు ఏ ఆచ్చాదనా లేకుండా నిలబడితే మన శరీరానికి కావలసిన విటమిన్ D పూర్తిస్థాయిలో అందుతుందని తేలింది. సూర్యరశ్మి అందుబాటులో లేనివారు K2 ను సప్లిమెంటు గా తీసుకోవడమే ఉత్తమం .

iv) కెఫీన్ ( ఇది కాఫీ లో ఉంటుంది) తీసుకోవడం తగ్గించండి .ఎందుకంటే ఇది రక్తప్రసరణ వ్యవస్థను ఉత్తేజ పరిచి ఎడ్రినలిన్ వంటి హానికరమైన హార్మోన్ లను ఉత్పత్తి చేయడంతో అవి రక్తంలో కలిసి హృదయ స్పందనను  అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి.  

(v) కొన్ని సరళమైన గృహ చిట్కాలను పాటించండి.

ఒక చెంచాడు తేనెను వేడి నీటితో తీసుకుంటే అది రక్తపోటును సమం చేస్తుంది.ఒక గ్లాసు సొరకాయ రసం రోజుకు రెండు సార్లు తీసుకుంటే అది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఆయుర్వేదం  ప్రకారం  అర చెంచా దాల్చిన చెక్క చూర్ణము ,లేదా  ఒక చెంచాడు ధనియాలు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయమే తీసుకుంటే  అది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. వెన్నుపూస పైన ఐసు ముక్కలతో మెల్లగా రాయడం వలన కూడా బిపి తగ్గితుంది. అలాగే ప్రధమ చికిత్స మాదిరిగా వెంటనే అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉంగరపు వ్రేలును కొంచెం సేపు నొక్కడం ద్వారా .ఉపయోగం ఉంటుంది. 

(vi) బి.పి. నిమిత్తం కొన్ని నిర్మాణాత్మక సూచనలు

  • తగినంత నీరు త్రాగుతూ శరీరాన్ని ఆర్ద్రంగా ఉంచుకోవడం,శ్వాశ కు సంబంధించిన పద్ధతులు అనుసరించడం,యోగా,ధ్యానము వంటివి శిక్షణ పొందిన వ్యక్తి వద్ద నేర్చుకొని అనుసరించడం ద్వారా మనో శరీరాలను సమ స్థితిలో ఉంచవచ్చు.  అలగే ఏదయినా బృందంలో భాగమయ్యి కార్యక్రమాలు నిర్వహించడం, నిస్వార్ధ సేవలు చేయడం అలవాటుగా మార్చుకోవడం ద్వారా భావోద్వేగాలను ఆందోళన ను అరికట్టవచ్చు. మానవ జీవిత లక్ష్యాన్ని పదే పదే మననం చ్సుకోవడం ద్వారా  కూడా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది .
  • కంప్యుటర్ లో  వీడియో గేం ఆడే పిల్లలు  తరుచూ అశాంతికి గురి ఔతున్నరంటే వారు భవిష్యత్తులో రక్తపోటు సమస్యలు ఎదుర్కొంటారు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను శారీరకంగా బయట అదే ఆటలను ఆడడం,అటువంటి కృత్యాలు నిర్వహించేందుకు ప్రోత్సాహ పరచాలి. అలాగే కృత్రిమంగా బాటిల్ తో పాలు త్రాగేవారికన్నా తల్లి పాలు త్రాగే పిల్లల లో రక్తపోటు సమస్యలు తక్కువ వచ్చే అవకాశం ఉంది .
  • శరీర బరువును అదుపులో ఉంచుకోండి BP ఉన్న కుటుంబ నేపథ్యం విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి.

చివరగా అసలు విషయం ఏమిటంటే మనం తీసుకునే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు42  అనగా ప్రకృతి సిద్ధంగా మన జీవన శైలిని మార్చుకోవడం, సహజ సిద్ధమైన సమపాళ్ళలోని ఆహారం, అప్పుడప్పుడూ పరీక్షల చేయించుకోవడం ద్వారా నిర్ధారించుకోవడం సమయానుకూలంగా చికిత్స చేయించుకోవడం ఇవి బి.పి. నుండి మనలను దూరంగా ఉంచుతాయి..

References and Links

  1. https://medlineplus.gov/highbloodpressure.html
  2. https://www.nhlbi.nih.gov/health/health-topics/topics/ms
  3. http://media.mercola.com/assets/pdf/ebook/high-blood-pressure-special-report.pdf
  4. https://wonderopolis.org/wonder/why-is-blood-pressure-important  
  5. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/AboutHighBloodPressure/What-is-HighBloodPressure_UCM_301759_Article.jsp#.Wd-xDCN97rk
  6. https://www.nhlbi.nih.gov/health/resources/heart/latino-hbp-html/learn
  7. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/UnderstandSymptomsRisks/What-are-the-Symptoms-of-High-Blood-Pressure_UCM_301871_Article.jsp#.Wd86WCN97rk
  8. https://www.webmd.com/hypertension-high-blood-pressure/guide/hypertension-symptoms-high-blood-pressure
  9. http://isha.sadhguru.org/blog/yoga-meditation/demystifying-yoga/is-honey-good-for-you/
  10. https://www.medicinenet.com/high_blood_pressure_symptoms_and_signs/symptoms.htm
  11. https://articles.mercola.com/sites/articles/archive/2016/11/30/how-to-lower-blood-pressure.aspx
  12. https://www.youtube.com/watch?v=Rjex2fLWWww
  13. https://www.drcarney.com/blog/entry/high-blood-pressure-a-symptom-not-a-disease
  14. http://onlinelibrary.wiley.com/doi/10.1111/j.1365-2702.2005.01494.x/abstract;jsessionid=68DE84D2914C89DEB51A0D9BD8415F1C.f02t01
  15. https://www.health.harvard.edu/blog/different-blood-pressure-in-right-and-left-arms-could-signal-trouble-201202014174
  16. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/KnowYourNumbers/Monitoring-Your-Blood-Pressure-at-Home_UCM_301874_Article.jsp#.WgAIuCN97e0
  17. http://isha.sadhguru.org/blog/video/handle-chronic-ailments-like-diabetes-hypertension/
  18. http://www.ishafoundation.org/us/blog/world-health-day-meditation-and-health/
  19. https://www.medicinenet.com/low_blood_pressure/article.htm
  20. https://www.webmd.com/heart/understanding-low-blood-pressure-basics#1
  21. https://www.livestrong.com/article/482968-what-is-the-rda-of-sodium/
  22. https://www.fda.gov/food/resourcesforyou/consumers/ucm315393.htm
  23. https://newsinhealth.nih.gov/2016/01/blood-pressure-matters
  24. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/MakeChangesThatMatter/How-Potassium-Can-Help-Control-High-Blood-Pressure_UCM_303243_Article.jsp#.WfGTFCN97v0
  25. https://www.drwhitaker.com/potassium-benefits-include-lower-blood-pressure
  26. https://www.health.harvard.edu/heart-health/key-minerals-to-help-control-blood-pressure
  27. https://articles.mercola.com/sites/articles/archive/2012/12/16/vitamin-k2.aspx
  28. http://www.nutritionalmagnesium.org/calcium-vitamin-k2-and-vitamin-d-must-be-balanced-with-magnesium/
  29. https://draxe.com/top-10-vitamin-k-rich-foods/
  30. https://www.vitamindcouncil.org/about-vitamin-d/how-do-i-get-the-vitamin-d-my-body-needs/
  31. https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/Decoded-How-much-sun-you-need/articleshow/51406650.cms
  32. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3897581/
  33. http://icmr.nic.in/ijmr/2008/march/0301.pdf
  34. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3942730/
  35. http://clinical-nutrition.imedpub.com/vitamin-d-deficiency-in-indians-prevalence-and-the-way-ahead.pdf
  36. https://articles.mercola.com/sites/articles/archive/2009/10/10/vitamin-d-experts-reveal-the-truth.aspx
  37. https://www.youtube.com/watch?v=498dM508orQ
  38. https://www.youtube.com/watch?v=KHNk-gIIMyc
  39. https://www.youtube.com/watch?v=loLgad2EMjs
  40. https://www.youtube.com/watch?v=x9Ui2tHOhXg
  41. https://www.sathyasai.org/organize/idealHealth.html
  42. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202012-05%20May-Jun.pdf
  43. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202012-07%20Jul-Aug.pdf
  44. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202014-01%20Jan-Feb-H.pdf
  45. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202014-07%20Jul-Aug%20H.pdf

Om Sai Ram