అదనంగా
Vol 8 సంచిక 4
July/August 2017
ఆరోగ్య చిట్కాలు
ఎసిడిటీ ఉందా - ఐతే మొగ్గలోనే తుంచివేయండి !!
1. ఎసిడిటీ అంటే ఏమిటి 1,2,3
ఎసిడిటీ లేదా ఆమ్లత్వము అనేది మన కడుపులో అవసరానికి మించి ఆమ్లము తయారయ్యి అసౌకర్యానికి గురిచేయడం గా పేర్కొనవచ్చు. మన జీర్ణాశయం లో ఉన్న జీర్ణ గ్రంధులు ఆహారాన్ని జీర్ణం చేయడానికి వివిధ రకాల స్రావాలను ఉత్పత్తి చేస్తూ హానికరమైన బాక్టీరియా ను కూడా నశింప జేస్తూ ఉంటాయి. ఒక వయోజనుడయిన వ్యక్తి యొక్క జీర్ణాశయం రోజుకు 1.5. లీటర్ల జీర్ణ రసాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. జీర్ణాశయం లో ఉన్న మ్యుకస్ పొర ఉత్పత్తి చేసే బైకార్బోనేట్లు ఆమ్లము యొక్క తినివేసే స్వభావమును తటస్థీకరిస్తాయి. ఈ పొర జీర్ణాశయంలో ఎక్కువ ఆమ్లము ఉత్పత్తి ఐనా దానికి తట్టుకునే విధంగా దీని నిర్మాణం ఉంటుంది. ఆమ్ల గుణము కలిగిన ఆహారము తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డిహైడ్రేషన్ వల్ల, మానసిక వత్తిడి వల్ల ఎక్కువ ఆమ్లము ఉత్పత్తి అవడం ద్వారా ఈ స్వయం నియంత్రణ వ్యవస్థలో సమస్య వచ్చినప్పుడు అది లోపల ఉన్న మ్యుకస్ పొరను దెబ్బతీస్తుంది.
2. ఎసిడిటీ యొక్క లక్షణాలు3,4,9
కడుపులోగాని గొంతులో గానీ ఇంకా చాతిభాగం లోగాని చాతి క్రింది భాగంలోగానీ భోజనం చేసిన తర్వాత మంటగా అనిపించడం అసిడిటీ యొక్క సాధారణ లక్షణం. ఇతర లక్షణాలు చూసినట్లయితే ఆగకుండా ఎక్కిళ్ళు రావడం, నోటిలో పుల్లని రుచిగా అనిపించడం, పుల్లని తేనుపులు, బరువుగా అనిపించడం, తలపోటు, వళ్ళంతా వేడిగా అనిపించడం, ద్రవాహారము కడుపులోనుండి పైకి ఎగదన్నినట్లు అనిపించడం, ఒక్కొక్కసారి అన్నం అరగక పోవడం, కడుపులో వాయువు చేరిక ఈ లక్షణాలున్నట్లు అనిపిస్తే లోపల అంతర్లీనంగా ఉన్నఅసిడిటీని అది సూచిస్తుంది.
అసిడిటీకి సంభందించి మరికొన్ని లక్షణాలు చూసినట్లయితే ఎప్పుడూ అలసటగ ఉండడం, ఊపిరి అందనట్లు అనిపించడం, తరుచుగా మూలుగుతూ ఉండడం, కొంచం దూరం నడవగానే కండరాలు నొప్పిగా అనిపించడం లేదా తిమ్మిరులు రావడం, ఊపిరి అందన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కణజాలంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం అనేది అసిడిటీ ఉన్నవారికి సాధారణము కనుక వీరు 20 సెకన్లకన్నా మించి ఉపిరిని ధారణ చేయలేరు.
3. ఎసిడిటీ కి కారణాలు3,5,8
ఆహార సంబంధిత కారణాలు: బాగా వేడిగా ఉన్న, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్ధాలు, వేపుళ్ళు, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్ధాలు, మిఠాయిలు, కల్తీ చేయబడిన, పులియ బెట్టిన పదార్ధాలు, కూల్ డ్రింకులు, నిలవ చేయడానికి రసయనాలు ఎక్కువగా వాడిన పదార్ధాలు, చాక్లెట్లు ఎక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లి, కాఫీ, టీ లు ఎక్కువగా తీసుకోవడం, అధికంగా తీసుకునే భోజనం, నిద్రించే ముందు తీసుకునే అల్పాహారం, మాంసాహారము, మద్యపానము.
ఇతర కారణాలలో చూసినట్లయితే వత్తిడి ప్రధమ స్థానం లో ఉంది. అధిక శ్రమ వలన భౌతిక పరమైన వత్తిడి ఇంకా తొందరపాటు, విచారము, భయము, కోపము, మొదలగు వాని వల్ల మానసికమైన వత్తిడి కలుగుచున్నవి. ఎసిడిటీ కేసులు ఎక్కువగా భావోద్వేగాలు ఎక్కువగా ఉండేవారికి, ఎప్పుడూ నెర్వస్ గా ఉండేవారి విషయంలోనూ నమోదవుతున్నాయి. ఇంకా ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారిలోనూ, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలోను కూడా మానసిక వత్తిడి ఎక్కువగా ఉంటోందని నిర్ధారణ అయ్యింది. ఇతర కారణాల విషయంలో ఎక్కువగా ఎండలో పని చేసేవారికి, ఆస్పిరిన్, ఇంకా మంటకు సంబంధించిన మందులు వాడే వారిలోనూ, మంచినీరు తక్కువ తాగేవారిలోనూ, ఎక్కువగా పొగ త్రాగేవారిలోను ఎసిడిటీ ఎక్కువగా ఉంటోందని నిర్ధారణ అయ్యింది.
4. అసిడిటీ మరియు జీర్ణకోశ అసౌకర్యము ఒకటికావు.6
కొంతమంది తమ జీర్ణకోశ సంబధిత వ్యాధిని అసిడిటీ గా భావిస్తారు. సాధారణంగా వాయువు నోటినుండి మరియు పురీషనాళము నుండి బయటకు రావడం సహజము. ఐతే ఇది పెద్దవాళ్ళలో త్రేన్పుల రూపంలో చిన్నపిల్లలలో ఒకవిధమైన గాలి శబ్దము రూపంలోనూ వస్తుంది. ఇంకా మనం భోజనం చేసేటప్పుడు గాలి కూడా లోపలికి వెళుతుంది కనుక భోజనం పూర్తయిన తర్వాత కూడా గాలి బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చే వాయువు పుల్లటి వాసనతో కూడినదయితే అది అజీర్ణమును లేదా మలము పూర్తిగా విసర్జింప బడలేదనే విషయాన్ని తెలుపుతుంది. ఇలా వాయు సంబంధితమైన కొన్ని అంశాలు క్రమేణా ఎసిడిటీ అనే రుగ్మతకు దారితీస్తాయి.
5. ఆమ్లము పైకి ఎగదన్నడం4,5,7
సాధారణంగా ఆహారము అన్నవాహిక నుండి క్రిందికి ఆహార పటలము ద్వారా జీర్ణాశయం చేరుతుంది. ఇక్కడ ఉన్న గ్యాస్ట్రో ఎసోఫోగల్ స్పింక్టర్ అనబడే కొన్ని రకాల కండరాల సముదాయం ఒక రకమైన బంధకము వాల్వ్ వలె పనిచేస్తూ ఆహారాన్ని ఉదరము లోనికి పంపిస్తూ వెంటనే అది తిరిగి వెనకకు రాకుండా మూసుకుపోతుంది. ఎప్పుడయితే ఈ వాల్వ్ బలహీనమైనా పాడయి పోయినా ఇది ఆహారము తిరిగి అన్నవాహిక లోనికి రాకుండా నిరోదించలేక పోతుంది. దీనినే ఆసిడ్ రిఫ్లక్స్ అంటారు, ఇది ఒక సాధారణ సమస్య.
దీనియొక్క ముఖ్య లక్షణం గుండెలో మంట అనిపించడం, చాతి ఎముకల వెనుక భాగంలో మంట గా అనిపించడం ఒక్కొక్కసారి ఇది గొంతు వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. వాస్తవానికి గుండె మంట అని పేరుకే పిలుస్తారు కానీ దీనికి గుండెకి ఏ సంభందము లేదు. ఐతే ఒక్కొక్క సారి ఈ బాధ గుండెనొప్పి మాదిరి గాతీవ్రంగా ఉంటుంది. తరుచుగా (అనగా వారానికి రెండు సార్లు)ఇది వస్తూ ఉన్నట్లయితే ఇది ఆంత్ర మూలానికి సంబధిత అల్సర్ గా ‘’గ్యాస్ట్రో ఎసోఫోగల్ రిఫ్లక్స్ డిసీజ్,GERD గా రూపు దిద్దుకుంటుంది. పిల్లలలో తరుచుగా వచ్చే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అతిగా ఉంటున్న ఎసిడిటీ వల్లనే వస్తుంది.
ఆసిడ్ రిఫ్లక్స్ అనగా ఆమ్ల ఉద్గారత అనేది ఆహార కుహరపు మూలము నుండి మెల్లిగా పొట్టలోని భాగాలకు అనగా ఉదరము లో ఉన్నఆహారపటలము దాటి చాతి మధ్య భాగమునకు చేరుతుంది. దీనివల్ల నోటి వెనుక భాగం లో పుల్లని రుచిగాను, గుండె లో మంటగాను, ఎదైనా మింగడానికి చాలా ఇబ్బందిగానూ లేదా ఛాతీ లో నొప్పి గానూ ఉంటుంది.
6. ఎసిడిటీ యొక్క విస్తృత శాఖలు4,7,10,11
ఎసిడిటీ అనేది అజీర్తికి దారితీస్తుంది, దీనివల్ల ఆహారము తినగానే పొట్ట పై భాగంలో అసౌకర్యము, మంట, నొప్పి ఇలాంటివి మొదలవుతాయి. ఇది ఒక జబ్బుగా పరిగణింపబడనప్పటికీ కడుపు ఉబ్బరం, వికారము, వాంతులు, త్రేనుపులు ఇలాంటి లక్షణాలన్నీ ప్రారంభమవుతాయి. జీర్ణాశయం లోని ఆమ్లాలు మ్యుకస్ పొరకు హాని కలిగించినపుడు అది చికాకు, కడుపులో మంట రూపంలో బయటపడుతుంది. ఇదే అజీర్ణముగా ఒక్కొక్కసారి గ్యాస్త్రిక్ సమస్యగానూ ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్కసారి ఈ లక్షణాలు రోజంతా బాధించే అవకాశం కూడా ఉంది. ఇంతేకాక గుండెమంట గా అనిపించడం కూడా అజీర్ణము యొక్క లక్షణం గా చెప్పవచ్చు.
7. ఎసిడిటీ యొక్క గొలుసు కట్టు ఫలితాలు 8
ఇటలీ లోని బ్యారీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన ఒంట్లో పుట్టే కణుతులు, గడ్డలు వీటన్నిటికి మూలము ఎదైనా గానీ అవి రావడానికి ప్రధాన కారణం ఎసిడిటీ నే అని ఇదే క్యాన్సర్ కి దారితీస్తుందని కనుగున్నారు. డాక్టర్ కెలిచి మొరిషిత గారి ప్రచురణ వ్యాసం ‘’కేన్సర్ వెనుక దాగిన సత్యం’’ ప్రకారం మన శరీరము ఆమ్ల పదార్ధాలను, సాధారణంగా వ్యర్ధాలను మన రక్తం స్వల్పంగా క్షార యుతంగా ఉండడానికి జీవకణాలలోనే ఉంచుతుంది. ఐతే ఈ వ్యర్ధాలు కణాలను మరింత అమ్లయుతంగా హానికరంగా తయారుచేస్తాయి. దీని ఫలితంగా కణాలలో ఆక్సిజన్ స్తాయి పడిపోవడం ఇది శ్వాశ సంబంధిత స్రావాలను చివరకు DNA కూడా నాశనమవడానికి కారణ మవుతున్నది. ఎసిడిటీ వల్ల కొన్ని జీవకణాలు చనిపోతే మరికొన్ని అసాధారణంగా తయారవడమే కాక అసంఖ్యాకంగా పెరిగిపోతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం తరుచుగా జీర్ణాశయం నుండి ఆమ్లము పైకి ఎగచిమ్మడం అనేది అన్నవాహిక క్యాన్సర్ కు కారణమవడమేకాక దీనిని నిరోదించక పొతే క్యాన్సర్ గా పరిణమిస్తుంది.
ఇంతేకాక ఆమ్లయుత వాతావరణము బ్యాక్టీరియ, వైరస్, ఫంగస్ వంటి పరాన్నజీవులకు అనుకూలమైన వాతావరణమును సృష్టించి అవి పెరిగిపోవడానికి కారణ మవుతుంది. అలాగే గుండెజబ్బులకు, చెక్కర వ్యాధికి, బోలుఎముకల వ్యాధికి కూడా ఈ వాతావరణం సహకరిస్తుంది. ఎసిడిటీని నిరోధించక పొతే అది అధిక అమ్లతకు దారితీయడమే కాక జీర్ణాశయమార్గంలో ఉన్న రక్షణ కవచాన్ని పాడుచేసి పుండ్లు ఏర్పడడానికి, ప్రేవులు పాడయిపోవడానికి కారణమవుతుంది. ఈ విధంగా ఎసిడిటీ అనేది మన జీవన శైలిలో అనేక వ్యాధులకు ఒక వేదిక కావడమేకాక క్యాన్సర్ ని క్యాన్సర్ కూడా కలిగిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
8. మీ ఎసిడిటీ స్థాయిని ఇలా తెలుసుకోండి1,9,12
మన దేహంలో ఉన్న అసిడిటీ స్థాయి తెలుసుకొనడానికి pH గురించి తెలుసుకొనడం ప్రధానమైనది. pH అనగా పొటెన్షియల్ ఫర్ హైడ్రోజెన్ అనగా ఇది మన శరీరంలో ఉన్న హైడ్రోజెన్ అణువుల సాంద్రతను తెలియజేస్తుంది. అసిడిటీ స్థాయి స్కేల్ పైన 0 నుండి 14 వరకు సూచింప బడుతుంది. pH స్థాయి 7 ఉండడం అమ్లత్వమును సూచిస్తుంది. 0 ఉండడం అతి ఆమ్లత్వాన్నిసూచిస్తుంది.pH 7 కన్నా ఎక్కువ ఉండడము క్షారత్వాన్ని,14 ఉండడం అతి క్షారత్వాన్ని సూచిస్తుంది . 7అనేది తటస్త స్థాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మన దేహంలో pH స్థాయి 7.4 కు దగ్గరగా ఉండాలి అనగా తటస్థ స్థాయి నుండి కొంచం క్షారత్వం వైపు మొగ్గు చూపిస్తూ ఉండాలి. మన శరీరం ఈ pH స్థాయి లో ఎక్కువ హెచ్చుతగ్గులు చూపిస్తూ ఉంటే మన శరీరంలో స్రవించే వివిధరకాల జీర్ణ రసాల పనితీరు దెబ్బతింటుంది. మనిషి శరీరంలోని రక్తం pH స్థాయి అతిదగ్గరగా అనగా 7.35 నుండి 7.45.వరకూ మాత్రమే ఉంటుంది.
pH స్థాయి మనం తీసుకునే ఆహారము, వత్తిడి, నిద్ర, హార్మోన్లు, ఇంకా ఇతర కారణాలవల్ల శరీరములో మారుతూ ఉన్నప్పటికీ ఆరోగ్యవంతమైన మానవునిలో ఉన్న లాలాజలం లో Phస్థాయి 6.5 మరియు 7.0.మధ్య ఉండాలి. దీనికన్నాతక్కువగా ఉండడం మనశరీరంలో అసిడిటీ కి గురి ఐనట్లు సూచిస్తుంది. జీర్ణాశయం మాదిరి కాకుండా (Ph స్థాయి 1-3 ) Ph స్థాయి 7 ఉండిన ఆహార పటలము ఎక్కువ ఎసిడిటీ వాతావరణము తట్టుకునే విధంగా నిర్మితమయి లేదు. Ph స్థాయి 4 కన్నా తక్కువ ఉన్నట్లయితే సహజంగా మనకు కడుపులో మంట మొదలవుతుంది.
అసిడిటీ కి సంభందించి ఏ లక్షణాలు కనిపించినా వారు Ph స్థాయిని పరీక్ష చేయిచుకొని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. Ph స్ట్రిప్పులు ఫార్మసి షాపులలో లభిస్తూ ఉంటాయి. మన ఆహార శైలిని, జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఈ Ph స్థాయిని సమపాళ్ళలో ఉంచుకోవచ్చు .
9. అసిడిటీ నిరోధించుటకు సోపానాలు3,5,23,24
మన శరీరంలో ఆమ్ల, క్షార స్థితిని సమపాళ్ళలో ఉంచడానికి ఎంజయిములు చక్కగా స్రవించడానికి నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. నీటి యొక్క Ph దాని సహజ స్థితిలో 7 ఉంటుంది. మ్యుకస్ పొర ద్వారా ప్రవహించే నీరు దానిని సంరక్షించడమే కాక కొంత నీటిని ఆమ్లముయొక్క ప్రభావమునకు గురికాకుండా అవసరం మేరకు ఉపయోగించే దానికోసం కొంత దాచి ఉంచుతుంది. ఎందుకంటే మ్యుకస్ లో 98% నీరు కాగా మిగతా 2% ఈ నీటిని పట్టి ఉంచే నిర్మాణము తో కూడిఉన్నది.
మనం తీసుకునే ఆహారము తాజా పళ్ళు, కూరగాయలు, సలాడ్లు, మొలకలతో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగానూ శరీరానికి హితము చేకూర్చే విధంగానూ ఉండాలి. వండిన ఆహారము ఎప్పటికప్పుడు తాజాగా వండినది గానూ వీలయినంత తక్కువ మషాలలతోనూ ఉండాలి. ఆహారాన్ని నియమిత కాలమానము ప్రకారము శాంతియుతమైన ప్రార్ధనా పూర్వకమైన వాతావరణములో తినాలి. ఆహారాన్ని తొందరపాటుగా కాక నిదానంగా బాగా నమిలి మింగాలి. బుక్వీట్ మరియు చిరుధాన్యాలు తప్ప అన్ని ఆహార ధాన్యాలు నానబెట్టి తినక పొతే ఇవన్నీ అసిడిటీ ని కలిగించేవే. టేబుల్ సాల్ట్ బదులుగా హిమాలయా రాతి ఉప్పు లేదా సహజంగా లభించిన సముద్రపు ఉప్పు వాడడం మంచిది.
ప్రతీ రోజూ వ్యాయామము చేయడం సరిపడినంత నిద్ర పోవడం అత్యవసరం. ప్రతిరోజూ కొంత దూరం నడవడం యోగా చేయడం ద్వారా జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడమే కాక నిద్ర కూడా బాగా పడుతుంది. సహజంగా జరగవలసిన ప్రకృతి సిద్ధమైన క్రియలు, వాంతులు, అపాన వాయువు విడుదుల మలవిసర్జన ఇటువంటివాటికి ఆపుకోకుండా ఉండడం చాలా ముఖ్యం.
10. ఎసిడిటీ కి గృహవైద్యము 3,13-22
ఎసిడిటీని నిరోధించేందుకు డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ మందులు ఎక్కువ కాలం వాడడం వల్ల అనివార్యంగా ఇతర హానికరమైన ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్ లు)వచ్చే అవకాశం ఉంది. కనుక మన ఇంటిలో దొరికే సాధారణ, ప్రకృతి సిద్ధమైన నివారణలను శీఘ్ర ఉపశమనము కోసమే కాక నివారణ నిమిత్తము కూడా ప్రయత్నించడం ఉత్తమమైన సాధన. ఐతే ఎవరూ కూడా అధికారికంగా పలానా మందు బాగా పనిచేస్తుందని చెప్పలేరు. కనుక ఎవరికి యోగ్యమైన నివారణను వారు అనుసరించడం మేలు. మన ఇంటిలోనే సులభంగా లభ్యమయ్యే సుగంధ ద్రవ్యాలు, మూలికల వివరములు క్రింద ఇవ్వబడ్డాయి. వీటిగురించి పూర్తి వివరాలకోసం క్రింద ఇవ్వబడ్డ వెబ్సైటు లింక్ ను చూడగలరు.
- సుగంధ ద్రవ్యాలు
ఫిరంగి పండ్ల గింజలచూర్ణమునకు చిన్నమెత్తు నల్ల ఉప్పును జోడించిఇవ్వడం(మలబద్ధకం ఉన్నవారికి,అల్సర్ తో బాధ పడుతున్నవారికి ఇది పనికి రాదు )సోపుగింజలు, జీలకర్ర ల చూర్ణం, ప్రత్యేకంగా దీనిని ఫిరంగి గింజల పొడి కొంచం అల్లం రసం తో కలిపి తీసుకోవడం, సత్వర ఉపశమనం కోసం కొంచం యాలుకలు, లవంగాలను నోటిలో వేసుకొని కొరికి నోటిలోనే ఉంచుకొని ఆ రసం మింగుతూ ఉండడం. ఇంతేకాక కొంచం పసుపు ను గోరువెచ్చని నీటిలో వేసుకొని సేవించడం. ఇవిఎసిడిటీ కి అనుభవ వైద్యాలు
- మూలికలు
ఎండిన చేమంతి పూవు రేకలు, పుదీనా, తులసి ఆకులతో చేసిన తేనీరు బాగా ఉపయుక్తంగా ఉంటుంది.
- పండ్లు,కూరగాయలు,మరియు పండ్ల రసాలు
అరటి పండు- పండిన /మిగల పండినది; ఆపిల్, అనాస, పుచ్చకాయ, బొప్పాయి, ద్రాక్ష: కేరట్, కేబేజీ జూస్, తాజా అల్లం రసం, దోసకాయ లేదా దాని జ్యూస్, అలోవిరా జ్యూస్, లేత కొబ్బరి నీరు మరియు దాని కొబ్బరి
- ఇతర నివారణలు
నానబెట్టిన బాదం నీళ్ళను త్రాగడం, కొత్తిమీర జ్యూస్ తో కలిపిన మజ్జిగ లేదా తాజా పెరుగు, ఉసిరికాయ పౌడర్ కానీ లేదా ఉసిరికాయ ను తినడం, నీటిలో మరిగించిన గంధపుచెక్క నీరు, ఫిల్టర్ చేయని వినిగెర్ కలిపిన సేంద్రియ ఆపిల్ రసం, బేకింగ్ సోడా మరియు నీరు కలిపిన నిమ్మరసమును బాధ భరింపరానిదిగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం లో వస్తున్న బుడగలు ఆగిపోక ముందే వెంటనే త్రాగేయాలి. (హై.బి.పి. ఉన్నవారికి, ఉప్పు తీసుకోవడం మానివేసిన వారు దీనిని తీసుకొన రాదు), చెక్కెర లేని చ్యుయింగ్ గమ్ము
11. ఎసిడిటీ మరియు సంబంధిత సమస్యలకు వైబ్రియోనిక్స్ రెమిడిలు25-27
మీరు SRHVP ని గానీ లేక108CC బాక్స్ గానీ ఏది ఉపయోగిస్తున్నా పేషంటు యొక్క రోగ లక్షణాలను బట్టి ఎన్నో రెమిడి లు ఉన్నాయి. వీటిగురించి ‘వైబ్రియోనిక్స్ 2016’మరియు ‘108 కామన్ కొమ్బోస్ ’పుస్తకాలలో చక్కని వివరణ ఉన్నది.
References and Links for Acidity (1-12) and Remedies (13-27):
- https://www.eno.co.in/what-is-acidity/
- https://en.wikipedia.org/wiki/Gastric_acid
- http://www.healthsite.com/diseases-conditions/acidity/001/
- http://www.healthline.com/health/gerd/acid-reflux-symptoms#overview1
- http://www.medicalnewstoday.com/articles/146619.php
- A Treatise on Home Remedies, Dr S Suresh Babu, Pustak Mahal Publication, India 2005
- http://www.webmd.com/heartburn-gerd/guide/what-is-acid-reflux-disease#1
- http://www.naturalhealth365.com/ph-oxygen-levels-dna-damage-stop-cancer-1383.html
- https://www.drdavidwilliams.com/proper-ph-balance
- http://www.webmd.com/digestive-disorders/digestive-diseases-gastritis#1
- http://newsnetwork.mayoclinic.org/discussion/distinguishing-between-bile-reflux-and-acid-reflux-can-be-difficult/
- https://simple.wikipedia.org/wiki/PH
- http://www.wholesomeayurveda.com/2017/03/16/ajwain-carom-seeds-benefits-acidity-indigestion/
- https://wikihomenutrition.com/home-remedies-acid-reflux/
- http://articles.mercola.com/home-remedies-heartburn-acid-reflux-ulcer.aspx
- https://www.youtube.com/watch?v=k5j-Zvjqnr0 Natural method to cure acidity - Baba Ramdev
- http://www.thehealthsite.com/diseases-conditions/10-home-remedies-for-acidity-that-really-work/
- http://www.thehealthsite.com/diseases-conditions/drink-coconut-water-to-get-quick-relief-from-acidity-and-heartburn-t915/
- http://www.ayushveda.com/homeremedies/acidity.htm
- http://www.homeremedyfind.com/12-remedies-for-acidity/
- http://everydayroots.com/heartburn-remedies
- http://easyayurveda.com/2014/12/11/sandalwood-benefits-how-to-use-side-effects-research/
- http://articles.mercola.com/sites/articles/archive/2009/04/25/news-flash-acid-reflux-caused-by-too-little-acid-not-too-much.aspx
- Water for Health, for Healing, for Life -- You are Not Sick, You’re Thirsty! by F. BatmanghelidjMD Warner Books 2003
- Sairam Healing Vibrations,108 Common Combos - 2011
- Soham Series of Natural Healing volume 3, Swami Narayani and Swami Ananda.
- Vibrionics 2016, A Practical Guide for the Users of Sai Ram healing Vibration Potentiser
ఓం సాయి రామ్