అదనంగా
Vol 4 సంచిక 5
September/October 2013
సాయి వైబ్రియనిక్స్ ఆరోగ్య సమాచారం మరియు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే ఆరోగ్య వ్యాసాలను అందిస్తుంది; ఈ సమాచారం వైద్య సలహా వంటిదని అర్థం కాదు. మీ రోగులకు వారి నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుడుని సంప్రదించమని మీరు సూచించవచ్చు.
ఒత్తిడి ప్రభావాలు మరియు నిరోధక చర్యలు
అన్నిటి మీద అవగాహన
- మనకు ప్రతి ఒక్కటీ భారమై లేదా ఎక్కువైనట్లు తోచినప్పుడు మనము సాధారణంగా "ఒత్తిడి" అనే పదాన్నిఉపయోగిస్తాము. ఒక్కసారి ఇ ఈ భారం అధికమైనప్పుడు మనము నిజంగా ఈ వత్తిడి తట్టుకోగమా అనే ఆశ్చర్యం కలుగుతుంది.
- మన క్షేమానికి ఏదైనా ముప్పు వాటిల్లే పరిణామము లేదా ఒక సవాలు ఏర్పడినప్పుడు దానిని ఒత్తిడిగా పరిగణిస్తాం. కొన్ని ఒత్తిడులు మనలను ముందుకు సాగి పోయేలాగా చేస్తాయి అది అవసరం కూడా. నిజానికి, ఒత్తిడి లేకుండా పోతే జీవితము విసుగు పుట్టించేదిగా మరియు ఒక లక్ష్యమంటూ లేనిదిగా కనిపిస్తుంది . ఏమైనప్పటికీ ఒత్తిడి మనసు మరియు శరీర ఆరోగ్యానికి హాని కలిగించేది అయితే అది మంచిది కాదు .
శాస్త్రీయ అధ్యయనాలు
హన్స్ సిలే అనే, హంగేరియన్ మూలము గల ఆస్ట్రియన్- కెనడియన్ అంతస్స్రావ గ్రంథుల నిపుణుడు, ప్రయోగశాల జంతువుల పై కొనసాగించిన అనేక ప్రయోగాలు ద్వారా కొన్ని భిన్నమైన శారీరక మరియు భావోద్వేగ ఉద్దీపనలు (తీవ్రమైన కాంతి, చెముడు కలిగించే వంటి భీకర శబ్దాలు, తీవ్రమైన వేడి లేదా చలి, శాశ్వత నిరాశా వాతావరణము)కల్పించినప్పుడు ఒకే విధమైన లక్షణాలు అనగా ఉదరంలో వ్రణోత్పత్తి, శోసరస కణజాల మరియు అడ్రినల్ గ్రంధుల విస్తరణ వంటివి ఏర్పడ్డాయి. అంతేకాక నిరంతర వత్తిడి ఏర్పడినప్పుడు ఈ జంతువులకు కూడా మానవుల వలె గుండెపోటు, లేదా స్ట్రోక్, మూత్రపిండ వ్యా దులు మరియు కీళ్ల నొప్పులు వంటి వివిధ జబ్బులు ఏర్పడినట్లు ప్రదర్శన ద్వారా ఈ శాస్త్రవేత్త నిరూపించారు.
పైన విశదీకరించబడిన విధంగా ఒత్తిడి పెరిగినప్పుడు అది ఉత్పాదనలో ఒక అంత్య స్థాయికి చేరి ఆ తర్వాత ప్రతికూల పరిస్థితులు ప్రభావం కారణంగా వేగంగా గ్రాఫ్ కిందికి దిగి నట్లు సూచిస్తోంది. అయితే ఇది మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. ఏమైనప్పటికీ లక్షణాలు ఆధారంగా వత్తిడి మనపై ప్రతికూల ప్రభావం కలిగించి ఇలా కిందికి నెట్టి వేస్తోందనేవిషయాన్ని గ్రహించి జాగరూకతతో వ్యవహరించాలి. మరొక విషయం ఏమిటంటే ఈ వత్తిడివలన వ్యాధి కలగ బోతోందని చూపే సంజ్ఞలు కూడా వివిధ రకాలుగా ఉండి అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే వాటిని గుర్తించే లోపే పరిస్థితి చేయి దాటి పోతుంది.
ఒత్తిడికి సంబంధించి ఆరోగ్యకరమైన మానవ స్పందనలు మూడు విషయాలకు లోబడి ఉంటాయి
- మెదడు(కల్పించుకొని) తక్షణ ప్రతిస్పందనను నిర్వహిస్తుంది. ఈ ప్రతిస్పందన అడ్రినల్ మెడుల్లా ను ఎపినెఫ్రిన్ మరియు నూర్పినేఫ్రిన్ విడుదల చేయడానికి సూచిస్తుంది
- హైపోథాలమస్(మెదడులో ఒక కేంద్ర ప్రాంతం) మరియు పిట్యుటరీ గ్రంధి ఎడ్రినల్ కార్టెక్స్ సిగ్నలింగ్ ద్వారా కార్టీసాల్ మరియు ఇతర హార్మోన్ల నిర్వహణ నెమ్మదిగా కొనసాగడాన్ని ప్రారంభిస్తుంది(లేదా ప్రేరేపిస్తుంది)
- అనేక నాడీ కేంద్రాలు ప్రవర్తనా ప్రతిస్పందనలో పాల్గొంటాయి. ఈ ప్రతిస్పందన ప్రేరణాత్మక(చురుకుదనం,చైతన్యం), దృష్టి కేంద్రీకరణ, ఆకలి, మరియు పునరుత్పత్తి ప్రవర్తన, నొప్పి భావనా తగ్గింపు, మరియు ప్రవర్తనా మార్పులకు దారి తీస్తుంది.
ఒత్తిడి కారణాలు
మన జీవితంలోని ఒత్తిడి స్థాయి మన శారీరక ఆరోగ్యం, వ్యక్తుల మధ్య సంబంధాల నాణ్యత, మనం నిర్వహిస్తున్న బాధ్యతలు మరియు కట్టుబాట్లు మనపై ఆధారపడ్డ ఇతరుల అంచనాలు, మన ఆపేక్షలు, మనకు ఇతరుల నుండి లభించే మద్దతు, మన జీవితంలో జరిగిన మార్పుల సంఖ్య లేదా మన జీవితంలో ఇటీవల సంభవించిన బాధాకరమైన సంఘటనలు వంటివి ప్రభావితం చేస్తాయి
అలాగే అనేక ఇతర అంశాలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి- భౌతిక పరమైనవి (ఏదైనా ప్రమాదకరమైనది చూసినప్పుడు భయము) నుండి భావోద్వేగపరమైనవి (విచారము కుటుంబము ఉద్యోగము మొదలగునవి) వరకూ ఒత్తిడిని ఎదుర్కోడానికి ఏవైతే మనకు ఒత్తిడిని కలిగిస్తుందో దాన్ని గుర్తించడం మొదటి సోపానము. మనకు ఒత్తిడిని కలిగించే మరికొన్ని సాధారణ అంశాలు:
మనుగడ కోసం ఒత్తిడి- మీరంతా ఒక సామెత “పోరాడు లేదా పారిపో “అనేది వినే ఉంటారు. ఎవరైనా లేదా ఏదైనా శారీరకంగా మిమ్మల్ని బాధిస్తుందని మీరు భయపడినప్పుడు, మీశరీరం సహజంగా శక్తి విస్ఫోటనంతో స్పందిస్తుంది(పోరాటం), తద్వారా మీరు ప్రమాదకరమైన పరిస్థితిని తట్టుకోగలుగుతారు. లేదా అక్కడి నుండి తప్పించుకుంటారు (పారిపోవడం).
అంతర్గత ఒత్తిడి-మీరు ఎప్పుడైనా మీ వల్ల సాధ్యం కాని లేదా మీరు ఏమీ చేయలేని విషయాల గురించి లేదా ఎటువంటి కారణం లేకుండా చింతిస్తున్నారా అయితే ఇదే అంతర్గత ఒత్తిడి. ఇది మనం అర్థం చేసుకొని నిర్వహించగలిగే ఒత్తిడి లలో ముఖ్యమైనది. ప్రజలు తమంతట తామే మనం నియంత్రించలేని విషయాల గురించి ఆందోళన చెందుతున్న ప్పుడు లేదా ఇలా జరుగుతుందని మనకు తెలియని పరిస్థితికి మరలింప బడినప్పుడు ఈ ఒత్తిడి ఏర్పడుతుంది. కొంతమంది ఒత్తిడికి గురికావడం వల్ల ఏర్పడే తొందరపాటు కారణంగా ‘ఉద్రిక్తతా జీవనశైలికి’ బానిసలు అవుతారు. ఈ అలవాటు చొప్పున ఒత్తిడి లేని విషయాల గురించి ఒత్తిడిని అనుభవిస్తూ అటువంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తారు.
పర్యావరణం ఒత్తిడి: శబ్దము రద్దీ మరియు కుటుంబం లేదా పని నుండి ఏర్పడే ఒత్తిడిని కలిగించే అంశాలు చుట్టూ ఉన్నప్పుడు దానికి ప్రతిస్పందనగా ఏర్పడే ఒత్తిడి ఇది ఈ పర్యావరణ వృత్తిని గుర్తించి దానిని నివారించడం లేదా ఎదుర్కోవడం నేర్చుకోవడం ద్వారా ఈ వ్యక్తి యొక్క స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అలసట మరియు అధిక శ్రమ: ఈ రకమైన ఒత్తిడి చాలా కాలం పాటు మన శరీరంపై క్రమంగా పెరుగుతూ ఆ తర్వాత ఇది శరీరంపై తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఉద్యోగం లేదా పాఠశాల లేదా ఇంటి వద్ద అవసరమైనదానికంటే ఎక్కువ కష్టపడి చేయడం వల్ల సంభవిస్తుంది. ఇది టైం మేనేజ్మెంట్ తెలీకపోవడం వల్ల లేదా విశ్రాంతి తీసుకోకపోవడం లేదా విశ్రాంతి కోసం సమయం కేటాయించడం తెలియకపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది మన నియంత్రణలో ఉండదని చాలా మంది భావిస్తూ ఉండటంవల్ల ఇది కష్టతరమైన ఒత్తిళ్లలో ఒకటిగా నిర్ణయించారు.
వత్తిడి యొక్క ప్రభావాలు
- అధిక, వత్తిడి వివిధ రకాల భావోద్వేగ, ప్రవర్తన మరియు శారీరక లక్షణాలుగా కూడా కనిపిస్తుంది. ఈ వత్తిడి యొక్క లక్షణాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణ శారీరక(భౌతిక)లక్షణాలు :
o నిద్రాభంగం
o కండరాల ఒత్తిడి
o కండరాల నొప్పులు
o తలనొప్పి
o జీర్ణశయాంతర ఆటంకాలు
o అలసట - భావోద్వేగ మరియు ప్రవర్తనా లక్షణాలు:
o నెర్వస్ నెస్(చికాకు)
o ఆందోళన
o అతిగా తినడంతో సహా ఆహారపు అలవాట్లలో మార్పులు
o ఉత్సాహం లేదా శక్తి కోల్పోవడం
o చిరాకు మరియు నిస్పృహ వంటి
మానసిక స్థితిలో మార్పులు
ఒత్తిడి తో బాధపడుతున్న వ్యక్తులు అనారోగ్యకరమైన ప్రవర్తన వైపు ప్రేరేపించబడి మద్యము మరియు మాదకద్రవ్యాల వినియోగం, సిగరెట్ ధూమపానము, వ్యాయామం లేకపోవడం, పోషకాహార ఎంపికలలో లోపము ఇటువంటి వాని విషయంలో తక్కువ ఒత్తిడి గల తమ తోటి వారి కంటే ఎక్కువ దురభ్యాసాలకు లోనై వత్తిడి యొక్క తీవ్రతను మరింత పెంచుకొనడంతో ఇది తరచుగా సమాజహితం కానీ ఒక అనారోగ్య ప్రవర్తన తాలూకు “దుర్మార్గపు చక్రానికి” దారితీస్తుంది .
వత్తిడి యొక్క అదనపు ప్రభావాలు:
• రక్త పోటు పెరుగుతుంది
• శ్వాస మరింత వేగంగా అవుతుంది
• జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది
• హృదయ స్పందన రేటు(పల్స్) పెరుగుతుంది.
• రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది
• కండరాలు సున్నితత్వం కోల్పోవడం
• ఎల్లప్పుడూ అప్రమత్తత(నిద్ర పోలేము)
• మనము “ఎదిరించు లేదా పారిపో” అనే ప్రతిస్పందన స్థితిలో ఉన్నప్పుడు
అనావశ్యక శరీర విధులు అనగా జీర్ణ మరియు వ్యాధి నిరోధక వ్యవస్థ వంటివి నెమ్మదిస్తాయి.
అన్ని వనరులను వేగంగా శ్వాసించడం, రక్త ప్రవాహం, అప్రమత్తత మరియు కండరాల వాడకంపై కేంద్రీకరించ వచ్చు.
నివారణ చర్యలు
భావోద్వేగ మరియు నాడీ అనుభూతి లేదా నిద్రకు ఇబ్బంది పడడం మరియు తినడానికి ఇబ్బంది పడటం ఇవన్నీ ఒత్తిడికి సాధారణ ప్రతిచర్యలు. ఆరోగ్యకరమైన కార్యకలాపాలలో పాల్గొనడం, మరియు సరైన సంరక్షణ మరియు సహాయం పొందడం, ద్వారా సమస్యలను తొలగించి ఒత్తిడితో కూడిన భావాలు కొన్ని రోజులు లేదా వారాల్లో తగ్గు ముఖం పట్టేలా చేస్తాయి. మంచి అనుభూతి పొందడానికి కొన్ని ప్రారంభ చిట్కాలు :
చురుకుగా ఉండడం
వాస్తవానికి శారీరక శ్రమ ఒత్తిడి తగ్గించే విధంగా పనిచేస్తుంది. మీరు క్రీడాకారుడు కాకపోయినా, మీ శరీరాకృతి సరైన స్థితిలో లేకపోయినా, వ్యాయామం ఇప్పటికీ ఒక మంచి వత్తిడి తొలగించే కారకం.
శారీరక శ్రమ మీ అనుభూతి కి సంబంధించిన మంచి ఎండోర్ఫిన్లు మరియు ఇతర సహజ నాడి రసాయనాలను పెంచుతుంది ఇవి మీకు శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ వ్యాయామం మీ శారీరక కదలికలతో పాటు మీ మనసును కేంద్రీకరిస్తుంది. దాంతో మీ మానసిక స్థితి మెరుగవడమే కాక రోజూ మీరు పడే చికాకులు తగ్గిపోవడానికి సహాయపడుతుంది.
మరింతగా నవ్వుతూ
హాస్యచతురత అనేది రోగాలను నయం చేయకపోవచ్చు కానీ ఒకవేళ మీకు కోపం కారణంగా పరిస్థితి అనుకూలంగాలేక బలవంతపు నవ్వు నవ్వవలసి వచ్చినప్పుడు కూడా ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు నవ్వినప్పుడు ఇది మీ మానసిక భారాన్ని తేలిక పరచడమే కాక మీలో సానుకూల శారీరక మార్పులకు కారణం అవుతుంది. హాస్యం మీ ఒత్తిడి ప్రతిస్పందనను పెంచి వెంటనే చల్లబరుస్తుంది. .
ఇతరులతో సంబంధాలు పెంచుకోవడం
మీరు ఒత్తిడికి గురైనప్పుడు మరియు చిరాకుగా ఉన్నప్పుడు మీ ప్రవృత్తి మిమ్మల్ని ముడుచుకుని కూర్చునేలా చేసేది అయి ఉండవచ్చు. దానికి బదులుగా మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సామాజిక సంబంధాలు పెంచుకోవడం ద్వారా ఒత్తిడికి దూరం కావచ్చు.
సామాజిక సంబంధం ఒత్తిడి తగ్గించే మంచి సాధనం. ఎందుకంటే ఇది పరాధ్యానాన్నీ అనగా సమస్యను మరిచి వేరే విషయం గురించి ఆలోచించే స్థితినీ, సహాయాన్ని అందిస్తుంది, మరియు జీవితం యొక్క ఆటుపోట్లను తట్టుకునే శక్తినీ అందిస్తుంది.
యోగ ప్రయత్నం
వరుస భంగిమలు మరియు నియంత్రిత శ్వాస వ్యాయామాలతో కూడిన యోగ చక్కటి ఒత్తిడి నివారణి. శరీరము మరియు మనసు యొక్క ప్రశాంతత సాధించడానికి 'యోగ' శరీరము మరియు మనసు లను సమ్మిళితం చేస్తుంది. తగినంత విశ్రాంతి నిచ్చి ఒత్తిడి మరియు ఆందోళనను పోగొడుతుంది.
తగినంత నిద్ర పొందడం
మీరు చేయవలసిన పని ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిద్రకు ఇబ్బంది కలుగుతుంది అయితే మనం నిద్రించేటప్పుడు మాత్రమే శరీరము మరియు మెదడు చక్కటి విశ్రాంతి పొందుతుంది. నిద్ర యొక్క నాణ్యత మానసిక స్థితి, శక్తి స్థాయి, ఏకాగ్రత మరియు మొత్తం పనితీరును ప్రభావితం చేస్తుంది.
ఎక్కువ పని చేసినప్పుడు మరియు ఎక్కువ ఆలోచించినప్పుడు మీకు సరిగా నిద్ర పట్టదు కానీ సమయానికి నిద్రపోవాలి. అదే మీ మెదడు కు శక్తినిస్తుంది .
మీరు పొందే నిద్ర నాణ్యత మీ మానసిక స్థితి, శక్తి స్థాయి, ఏకాగ్రత మరియు మొత్తం పనితీరుపై ప్రభావము చూపుతుంది.
సంగీతాన్ని వినడం మరియు సృజనాత్మక
మీరు సంగీతం వినడం లేదా ప్లే చేయడం వత్తిడి నివారించే చక్కటి సాధనం. ఎందుకంటే అది ఇది మీ మనసుకు హాయినీ, కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. ఒత్తిడి కలిగించే హార్మోనులను తగ్గిస్తుంది. వాల్యూమ్ తగినంతగా ఉంచుకొని మీ మనసు సంగీతంలో లీనమయ్యేటట్లు చేయండి.
సంగీతం పట్ల మీకు అభిరుచి లేకపోతే తోటపని, కుట్టుపని, బొమ్మలు వేయడం, ఇంకా మీరు ఆనందించే మీకు అభిరుచి ఉన్న దాని వైపు దృష్టిని మరల్చండి. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అనే దానిపై కన్నా ఏం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టడం ఉత్తమం.
మూలములు;
http://www.medicalnewstoday.com/articles/145855.php
http://www.stress.org/what-is-stress/
http://www.medicinenet.com/stress/article.htm
http://www.mtstcil.org/skills/stress-definition-1.html
http://www.cdc.gov/violenceprevention/pub/coping_with_stress_tips.html
http://www.mayoclinic.com/health/stress-relievers/MY01373/NSECTIONGROUP=2
అనారోగ్య సిరలతో జీవించడం
అనారోగ్య సిరలు చర్మం కింద కనిపించే వాపు మరియు వక్రీకృత సిరలు. ఇవి సాధారణంగా కాళ్లలో సంభవిస్తాయి కానీ శరీరంలో ఇతర భాగాల్లో కూడా ఏర్పడవచ్చు.
హృదయము ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని బృహద్దమని అని పిలువబడే పెద్ద ధమని లోకి పంపుతుంది. బృహద్దమని రెండు ప్రధాన భాగాలుగా విభజింపబడి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని అందించే చిన్న ధమనులుగా విడిపోతుంది. ఆక్సిజన్ పంపిణీ అయిన తరువాత సిరలు ఆ రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేస్తాయి. ధమనుల మాదిరిగా కాకుండా సిరలు రక్తాన్ని పంపిణీ చేస్తూనే తిరిగి వెనుకకు మరలకుండా ఉండటానికి వన్ వే కవాటాల పై ఆధారపడి ఉంటాయి. కాలి కండరాలు ఈ రక్తాన్ని పైకి పంపు చేయడానికి ఉపయోగపడతాయి. వన్ వే కవాటాలు రక్తం తిరిగి కాళ్ళవైపు రాకుండా సక్రమమైన స్థితిలో మూసుకుపోతే రక్తం వెనక్కి రాకుండా ముందుకి కదులుతుంది. పక్కనున్న చిత్రంలో రక్త ప్రవాహాన్ని కవాటాలు వెనక్కి రాకుండా ఎలా ఆపుతున్నాయో అలాగే మరొక చిత్రంలో కవాటాలు దగ్గరకు రాకపోవడం వల్ల రక్తము వెనుకకు మరలుతూ సిరలను ఉబ్బి పోయేటట్లు ఎలా చేస్తున్నాన్నాయో(లీకేజ్) గమనించండి. ఈ కారణంగా సిరల్లో ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా అవి ఉబ్బి అనారోగ్య సిరలు గా మారుతాయి. ఈ పెరిగిన ఒత్తిడి చీలమండలు లేదా కాళ్లవాపు, తీవ్రమైన నొప్పి, అలసిపోయిన కాళ్లకు సంబంధించిన ఫిర్యాదులు, చర్మపు మార్పులు, వ్రణోత్పత్తి మరియ ఫ్లెబి టిస్ ఇంకా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. రక్తం తగిన రీతిగా ప్రవహించ నందున సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గట్టి ముద్దగా ఏర్పడి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. దీనిని సూపర్ ఫిషియల్ ఫ్లెబిటిస్ అంటారు. ఇది డాక్టర్లు భయపడే గుండెకు ఊపిరితిత్తులకు లేదా మెదడుకు రక్తం ద్వారా చేరే గడ్డ కాదు. నొప్పి లేదా వాపు లేకుండా అనారోగ్య సిరలు ఉండటం సాధ్యమే. వాటిని సరిదిద్దాల్సిన అవసరం కూడా లేదు. అనారోగ్య సిరలు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి, అలాగే వారి యొక్క వయసుకు సంబంధించిన పౌనఃపుణ్యంతో పెరుగతాయి. పెద్దలలో 30% నుండి 60% వరకు అనారోగ్య సిరల సమస్యలు ఉన్నాయని ఒక అంచనా.
అనారోగ్య సిరలు రావడానికి గల కారణాలు
ఒక వ్యక్తికి అనారోగ్య సిరలు ఏర్పడడానికి అనేక కారణాలు తోడ్పడుతూ ఉంటాయి అవి
- వంశ పారంపర్యం (తల్లిదండ్రులు నుండి పిల్లలకు జన్యువుల ద్వారా సంక్రమించే వి )
- చికిత్స చేయకపోవడం( పెద్ద సిర లోపం)
- ట్రామా, శస్త్రచికిత్స
- శ్వాస సంబంధిత వ్యాయామాలు, పరిగెత్తడం, బరువులు మోయడం లో శిక్షణ వంటి వాటి ప్రభావం వల్ల
- అధిక సూర్యరశ్మి కి గురికావడం వల్ల కలిగే నష్టం
- నిశ్చల జీవన విధానము , అధిక బరువు
- వేడి నీటి తొట్టెలు పాదాలకు చేసే చికిత్స సిరలు విడిపోవడానికి కారణం అవుతాయి,
- ఎక్కువ సేపు నిలబడడానికి ఆస్కారం కల్పించే ఉద్యోగాలు- నర్సులు, ఉపాధ్యాయులు, ఫ్యాక్టరీ కార్మికులు, హెయిర్ స్టైల్ నిపుణులు
- ఊబకాయం
- గర్భధారణ, యుక్త వయస్సు, మరియు రుతువిరతి సమయంలో హార్మోన్ల ప్రభావం
- జనన నియంత్రణ మాత్రలు వాడకం
- రుతుక్రమం ఆగిపోయిన హార్మోన్ల పునః స్థాపన
- రక్తం గడ్డకట్టే వ్యాధి చరిత్ర కలిగి ఉండటం
- కణుతులు, మలబద్ధకం మరియు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం.
- ఇంకా ఇతర కారణాలు చూసినట్లయితే ట్రామా, చర్మానికి గాయాలు మునుపటి సిరల చికిత్స అతినీలలోహిత కిరణాలకు గురికావడం
మహిళలు తరచుగా గర్భధారణ సమయంలో అనారోగ్య సిరలను గమనిస్తారు. ఈ సమయంలో రక్త పరిమాణం 50 శాతం పెరుగుతుంది. పెరిగిన రక్త పరిమాణం ద్వారా సిరలు అధిక ఒత్తిడికి గురి అవుతాయి. మరియు అనారోగ్య సిరలుగా అవి వ్యక్తమవుతాయి. డెలివరీ తర్వాత రక్త పరిమాణం సాధారణస్థితికి వచ్చినప్పటికీ సిరలు విస్తరించే ఉంటాయి. ఎందుకంటే గర్భధారణ సమయంలో సాగతీత ద్వారా భరించిన నాడీ యంత్రాంగమునకు తిరిగి కుంచించుకుపోయి నిర్మాణం లేదు అలాగే ప్రతి స్త్రీ గర్భధారణ లోనూ వెరికోసిటీలు తీవ్రమవుతున్నాయని కొందరు స్త్రీలు పేర్కొంటున్నారు.
నివారణ చర్యలు
అనారోగ్య సిరుల పురోగతిని మందగింప చేయడంలో మరియు ఇతర సమస్యలతో సంబంధం ఉన్న అసౌకర్యాన్ని తగ్గించడంలో గుండె వైపు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడే చర్యలు ఉపయోగపడతాయి.
వ్యాయామం చేయడం, బరువు తగ్గడం, విశ్రాంతి తీసుకునేటప్పుడు మీ కాళ్ళను పైకి లేపడం, కూర్చున్నప్పుడు క్రాస్డ్ లెగ్ లేదా బాసీమఠం వేసుకుని కూర్చోకపోవడం వంటివి అనారోగ్య సిరలు అధ్వానం కాకుండా ఉండటానికి సహాయపడుతాయి. వదులుగా ఉండే దుస్తులు ధరించడం మరియు ఎక్కువసేపు నిలబడకుండా ఉండడం కూడా సహాయపడతాయి. అనారోగ్య సిరలు బాధాకరంగా ఉంటే లేదా అది కనిపించే తీరు మీకు నచ్చకపోతే మీ వైద్యుడు వాటిని తొలగించే విధానాలను సిఫారసు చేయవచ్చు.
కాళ్లకు సరిపోయే విధంగా మేజోళ్ళు ధరించడం: సాంప్రదాయక విధానంలో కాళ్ళకు సరిపోయే విధంగా మేజోళ్ళు ధరించడం ముఖ్యంగా సిరలు బాధాకరమైన లేదా అసౌకర్య లక్షణాలు కలిగించినప్పుడు ఈ మేజోళ్లను ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఏదైనా శస్త్రచికిత్స దుకాణంలో మరియు కొన్ని మందుల దుకాణాల్లో కూడా ఈ మేజోళ్లను కొనుగోలు చేయవచ్చు. అవి మోకాలి క్రింద, మోకాలు పైన, మరియు పాంటీ హోస్ శైలి లో లభిస్తాయి
జీవన శైలిలో మార్పులు చర్మపు పరిశుభ్రత బరువు తగ్గడం అవసరం మేరకు నడక అనారోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. తక్కువ ఉప్పు గల ఆహారం తినడం వల్ల నీరు నిలుపుదల చేసి వాపును తగ్గిస్తుంది.
ఆధారములు
http://www.nlm.nih.gov/medlineplus/varicoseveins.html
http://www.webmd.com/skin-problems-and-treatments/guide/varicose-spider-veins
http://mdveinprofessionals.com/treatment/varicoseveins
http://www.nlm.nih.gov/medlineplus/tutorials/varicoseveins/vs059103.pdf
ముఖ్యమైన: గమనిక సాధకులు
కోన్ని విద్య విధనాలు చాల ఆచర్యముగా వుంది మాకు వచేవి కానీ మేము దానిని మీతో పున్చుకోలేకపోతున్నాం , దీనికి కారణం కోన్ని ముక్య సమాచారం మీరు మాకు ఇవ్వటం లేదు .ఆ ముక్య సమాచారం మీ నుండి రావాలి . కనుక మీరు పంపిచే రిపోర్ట్ లొ క్రింద చేపబడిన కోన్ని విషయాలను మీ రిపోర్ట్ లొ చేచాలి .మరిచి పోవధు:
పేషెంట్ యొక్క వయస్సు, ఆడ/ మగ, ట్రీట్మెంట్ ఎప్పుడూ స్టార్ట్ చేసారు, ముఖ్యమైన అనారోగ్య లక్శనాలూ, అనారోగ్య లక్శనాలూ ఎన్ని రోజులు, వారి మునుపు ట్రీట్మెంట్, కంబో అండ్ ఎంత ఇచారు, ఆరోగ్య గణాంకాల అబివ్రిధి, చీవరి ఆరోగ్య సమాచారం,మరి ఇతర సమాచారం.
పెన చెప్పిన సమాచారం మీ నుండి వస్తే మేము మీయొక్క సమాచారం రాబోయే సంచికలో ప్రచారిస్తము . మీవద్ద ఈ సమాచారం లేకపోతే మాకు మీయొక్క సమాచారం ప్రచారించుటకు చాలా ఈబంద్ది .