అదనంగా
Vol 4 సంచిక 1
January/February 2013
ఆరోగ్య చిట్కాలు
సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖల ద్వారా ప్రచురించే ఈ సమాచారము విద్యా సంబంధ మైన సమాచారమునకే తప్ప దీనిని వైద్య సలహాగా భావించరాదు. ప్రాక్టీషనర్లు పేషంట్లను సరియైన వైద్య సమాచారము కోసము మరియు ప్రత్యేక వైద్య సలహాల నిమిత్తము వారి డాక్టర్లను సంప్రదించమని చెప్పవలసిందిగా సూచన.
గుండె పోటు యొక్క ఎనిమిది హెచ్చరిక సంకేతాలు
గుండె నొప్పికి హెచ్చరికగా తీసుకోగల 8 సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. విపత్కర పరిస్థితిని నివారించడంలో సహాయపడతాయి:
1. చాతిలో అసౌకర్యం
గుండెపోటు యొక్క అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతం ఛాతీలో అసౌకర్యంగా లేదా ఎప్పుడు లేనివిధముగా కొత్తగా భారంగా అనిపించడం, తీవ్రమైనది, ఊహించలేనిది, మరియు ఊపిరి కష్టంగా ఉండేది, చమట, వికారం, లేదా బలహీనత వంటి లక్షణాలు సంభవిస్తాయి. ఇది ఒక్కొక్కసారి గుండెలో మండుతున్న భావన కూడా కలిగించవచ్చు. మన కార్యకలాపాల సమయంలో ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం విశ్రాంతితో ఉపశమనం పొందుతుంది. పైన పేర్కొన్న లక్షణాలలో దేనిని తేలికగా తీసుకోకూడదు ముఖ్యంగా మీకు గుండె జబ్బు ఉంటే ఈలక్షణాలలో ఏది సంభవించినా వెంటనే మీరు మీ వైద్యుడి దగ్గరికి లేదా సమీప ఆసుపత్రికి వెళ్లాలి. మరెవరైనా ఈ లక్షణాలతో బాధపడుతూ ఉంటే వేచిచూచే ధోరణి లేకుండా వెంటనే వారిని సమీప వైద్యుడు లేదా ఆస్పత్రికి తరలించండి.
2. శ్వాస యొక్క కొరత లేదా ఊపిరి భారంగా తీసుకోవడం
కొంచం దూరం నడక వలన గానీ, పైకి ఎక్కడం లేదా ఇతర కదలికలు లేదా వ్యాయామం తర్వాత శ్వాస భారంగా ఉంటే లేదా సాఫీగా ఊపిరి పీల్చలేకపోతే ఊపిరితిత్తులను నొక్కివేసినట్లు మరియు శ్వాస తగ్గిపోతే అది ఆందోళనకు గొప్ప కారణం కావచ్చు. శ్వాస అందకపోవడం అనేది విశ్రాంతి ద్వారా ఉపశమనం పొందలేకపోవచ్చు. ఈ పరిస్థితి ఛాతీలో అసౌకర్యంతో కలిసి ఉండకపోయినా దానిని హెచ్చరిక గానే తీసుకోవాలి. ముఖ్యంగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నట్లయితే - వేగవంతమైన హృదయ స్పందన రేటు (నిమిషానికి 150 కంటే ఎక్కువ) ఉంటుంది.
3. చెమట
వేసవి కాలపు వేడికి చెమట అనివార్యం, అయితే చల్లని పరిస్థితులలో కూడా అధిక చెమటలు పట్టడం అభిలషణీయం కాదు. అటువంటి పరిస్థితి మీరు గమనించినట్లయితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.
4. వికారము
రోజూ వికారము లేదా మైకంగా అనిపించడం గుండెపోటు ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని అలసటకు చిహ్నంగా భావించవద్దు. ధమని నిరోధింప పడటం వల్ల ఇది కలగవచ్చు. ఇది అధిక ఒత్తిడి, స్వల్ప కాలం చేయబడ్డ శారీరక కదలికలు లేదా సరళంగా చేయబడ్డ వ్యాయామం వలన కూడా అలసట, సమృద్ధిగా తింటున్నా తగినంతగా నిద్రపోతున్నా కూడా బలహీనంగా లేదా నీరసంగా అనిపించడం ఇవి గమనింప దగిన లక్షణాలు.
5. భుజాల లో తిమ్మిర్లు
చేతులు లేదా కాళ్ళలో ఆకస్మిక బలహీనత లేదా పక్షవాతం (కదలించలేక పోవడం) ఏర్పడడం. చేతులు మొద్దుబారినట్లు అనిపించడం లేదా ప్రక్కకి వాలినట్లు అనిపిస్తే ఇది గుండె సమస్యకు కారణం కావచ్చు.
6. తలనొప్పి మరియు మూర్ఛ
ఆకస్మిక, తీవ్రమైన తలనొప్పి లేదా స్థిరముగా ఉండే మైకము లేదా తేలిపోతున్నట్లు ఉండడం, అవిశ్రాంతంగా ఉండడం, (మరియు/లేదా) ఆకస్మిక గందరగోళం మరియు ఇతర సంభావ్య సంకేతాలు ఈ కోవలోనికి వస్తాయి. గుండెజబ్బుతో ఉన్న వ్యక్తి మీ సంరక్షణలో ఉంటే అతనికి మూర్ఛ గానీ, సృహ కోల్పోవడం కలిగితే వెంటనే వైద్య సహాయం చేయండి.
7. స్పందించకపోవడం
మీ శరీరంలోని కొన్ని భాగాలు స్పందించడం మానేస్తే పరిస్థితిని తేలికగా తీసుకోవద్దు. ప్రభావిత భాగాలు భుజాలు, చేతులు లేదా మెడ వెనుక భాగం కావచ్చు.
8. మాట్లాడేటప్పుడు మందగించడం
సహజంగా సన్నిహితులతో మద్యపానం చేసిన తర్వాత మాట్లాడేటప్పుడు తడబడుతూ ఇబ్బంది పడడం అన్నిసార్లు జరగక పోవచ్చు. కానీ గుండె జబ్బుల విషయంలో ఈ పరిస్థితి దానికన్నా తీవ్రమైనది కావచ్చు! పొందికగా మాట్లాడలేకపోవడం తీవ్ర గుండె పోటుకు సంకేతం. మీకు ఈ సమస్య ఏర్పడినట్లు అనిపిస్తే మీరు చెప్పేది అర్థం చేసుకొనే ప్రయత్నం చేయమని మీ స్నేహితుడిని లేదా బంధువుని సహాయం కోరవచ్చు. హెచ్చరిక సంకేతాలు సరిగ్గా సమయానికి అందుకో గలిగితే గుండె పోటును నివారించవచ్చు. పైన పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అవి ధమని మూసివేయబడడం వలన ఏర్పడి ఉండవచ్చు. గుండెపోటు కోసమే కాకపోయినా చెకప్ చేయించుకొనడంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దు! జాగ్రత్తగా ఉండడం ఎప్పటికీ ఉత్తమం!
గుండె నొప్పి లేదా పోటు యొక్క ఏడు ప్రమాద సూచికలు
అధికంగా టీవీ చూడడం, గురక, చిగుళ్ల వ్యాధి, సొరియాసిస్, మైగ్రేన్, విటమిన్ డి లోపం, గర్భధారణ సమస్యలు. ఈ నష్టాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి దిగువ వెబ్ సైట్ ను చూడండి:
http://health.yahoo.net/experts/dayinhealth/7-hidden-heart-attack-stroke-risks
గుండె జబ్బుల గురించి సమాచారం కోసం యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారి యొక్క ఈ క్రింది వెబ్ సైట్ చూడండి: http://www.cdc.gov/heartdisease/faqs.htm
ఆధారములు :
WebMD.com మరియు CDC.gov, స్వాన్సన్ రీసెర్చ్ అప్డేట్
పసుపు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
పసుపు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పసుపు (కుర్కుమా లోంగా) ఆగ్నేయ ఆసియాలో విస్తృతంగా ఉపయోగించే ప్రధాన మసాలా దినుసులలో ఒకటి. భారతదేశం నుండి ఉద్భవించిన ఈ పసుపును అనేక శతాబ్దాలుగా ఔషధం మరియు ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు. అల్లమునకు బంధువుగా పిలువబడే ఈ పసుపు పిండిని కూరల్లో ప్రధాన వనరుగా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే ప్రధాన క్రియాశీల ఔషధ పదార్ధం కుర్కుమిన్ అంటారు ఇదే పసుపు రంగును ఇచ్చే సహజ వర్ణ ద్రవ్యము.
కుర్కుమిన్ ఇటీవల సంవత్సరాలలో శాస్త్రీయ అధ్యయన కర్తల దృష్టిలో పడింది. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో జరిపిన అధ్యయనాలు దాని ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలించాయి. ఈ పరిశోధనల నేపధ్యంలో కూర్చుకున్న సాక్ష్యాల ఆధారంగా కుర్కుమిన్ అనేక రకాల వ్యాధులకు మంచి నివారణా ఏజెంటుగా పనిచేస్తుందని కనుగొనబడింది. ఈ ఫలితాల్లో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:
పసుపు మరియు క్యాన్సర్
పసుపు మరియు క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనాలు జరిగాయి. పసుపు క్యాన్సర్ మరియు దెబ్బతిన్న శరీర కణాల నాశనాన్ని ప్రేరేపించే ప్రక్రియను కనబరచినట్లు వారు వెల్లడించారు. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు బట్టి పసుపు అనేక రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడంలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ మరియు లుకేమియా విషయంలో ప్రయోజనకారిగా ఉంటుంది.
టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఎలుకలపై నిర్వహించిన అధ్యయనాలు పసుపు చర్మ క్యాన్సర్, మెలనోమా పెరుగుదలను అడ్డుకుంటుందని మరియు రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల్లోకి వ్యాపించడాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. కుర్కుమిన్ చేత ముందస్తు చికిత్స చేయడం వల్ల ఖీమో మరియు రేడియోథెరపీ కి ఎక్కువ హాని కలిగకుండా చేస్తుందని సౌత్ డకోటా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు.
పసుపు మరియు కాలేయ పనితీరు
ఎంజైముల ఉత్పత్తి ద్వారా రక్తాన్ని నిర్విషీకరణ చేయడంలో కాలేయం సహాయపడుతుంది. ఈ ఎంజైములు విచ్ఛిన్నమయ్యి శరీరములో కనిపించే విషపదార్ధాలను తొలగిస్తాయి. పసుపు సప్లిమెంట్ తీసుకోవడం లేదా పసుపు వంటకాలను ఉపయోగించడం వల్ల ఈ ముఖ్యమైన ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కాలేయం పనితీరు పెరుగుతుంది. ఆస్ట్రేలియా లోని గ్రాజ్ మెడికల్ యూనివర్సిటీ వారు చేసిన ప్రాథమిక ప్రయోగాత్మక పరిశోధనల ప్రకారం కుర్కుమిన్ లివర్ పాడవకుండా చూడడం ద్వారా లివర్ నాశనాన్ని ఆలస్యం చేస్తుందని కనుగొనబడింది.
కీళ్ల నొప్పికి మందుగా పసుపు
పసుపు యొక్క యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా పసుపు ఆరోగ్య ప్రయోజనాలు, మితమైన మరియు తేలికపాటి కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఉపశమనం ఇస్తాయి. ఆర్థరైటిస్ కోసం పసుపు ఉపయోగించే రోగులు ఉదయం మరియు సాయంత్రం కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. ఇది ఇప్పుడు ఆర్థరైటిస్ బాధితులకు సహజ నివారణ గా మారడమే కాక ఇట్టి రోగులకు గణనీయమైన నొప్పి నివారణ మరియు వారి నడక వేగాన్ని పెంచేదిగా కూడా ఉపయోగపడుతోంది.
పసుపు మరియు గాయాలు
పసుపు యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంటులుగా గాయాలకు, కోసుకుపోవడం, ఇంకా ఇతర చర్మపు గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. పిడి గల ఒక కాడ గరిటను ఉపయోగించి కొబ్బరినూనెను మరిగించి దానిలో చిటికెడు పసుపు వేసి రెండింటినీ బాగా కలపండి. స్టవ్వును ఆఫ్ చేసి చల్లార్చిన ఈ మిశ్రమాన్ని ఎక్కువ వేడి లేకుండా జాగ్రత్త వహిస్తూ శుభ్రమైన నూలు గుడ్డ ఉపయోగించి మిశ్రమములో కొంతభాగము గాయానికి పూయండి. మిగిలిన అదనపు నూనెను గాలి చొరబడని సీసాలో భద్రపరచడం వల్ల భవిష్యత్తులో తిరిగి తయారుచేసే అవసరం లేకుండా దీనిని ఉపయోగించుకోవచ్చు.
పసుపు మరియు అల్జీమీర్స్ (జ్ఞాపకశక్తి క్షీణత)
మెదడు యొక్క వ్యాకోచం లేదా ఉబ్బడం అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటిగా అనుమానిస్తున్నారు. పసుపుతో చేసిన అధ్యయనాలు పసుపు ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి అల్జీమర్స్ వ్యాధిని నివారించడానికి సహాయపడుతుందని తేలింది. పసుపు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ వ్యాధి రాకుండా నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి సహాయపడతాయి. పసుపు నరాల చుట్టూ కనిపించే రక్షణ పొరను నాశనం చేసే IL-2 ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకుంటుందని విశ్వసిస్తారు.
సంక్రమణ రోగ విజ్ఞాన శాస్త్రవేత్తలు (ఎపిడెర్మోలాజిస్ట్స్) భారతదేశంలో పసుపును కూరలలో విరివిగా ఉపయోగించడం వలన ఆ దేశంలో అల్జీమీర్స్ వ్యాధి యొక్క తక్కువ రేటులో ఉండడం గురించి వివరించడానికి సహాయపడుతోందని ఊహించారు. 70 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ రేటు యునైటెడ్ స్టేట్స్ కంటే నాలుగింట ఒక వంతు కంటే కూడా తక్కువ.
పసుపు మరియు హృదయ వ్యాధి
చాలావరకూ హృదయ సంబంధ వ్యాధులకు అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రధాన కారణం. కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెందుతున్నప్పుడు ఇది శరీర జీవకణాల గోడలపై కొంత అవశేషంగా ఉండిపోతుంది. పసుపులో విటమిన్ B6 ఉంటుంది. ఇది హోమో సిస్టిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ హోమోసిస్టిన్ శరీర కణాలను దెబ్బతీసేందుకు నేరుగా బాధ్యత వహిస్తుంది. కాలేయంతో పరస్పర చర్య ద్వారా పసుపు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా ఇది చాలా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
జపాన్ లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్ సమాచారం ప్రకారం రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు వ్యాయామం చేసినందువలన ఏదైతే హృదయ సంబంధమైన ప్రయోజనం చేకూరుతుందో అదే ఆరోగ్య ప్రయోజనాన్ని ప్రతీరోజూ తీసుకునే కుర్కుమిన్ సప్లిమెంట్ ఇస్తుందని పేర్కొంది. న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఫ్లో మీడియేటెడ్ డైలేషన్ (FMD) అంచనా ప్రకారం కుర్కుమిన్ సప్లిమెంట్ తీసుకున్న మహిళల బృందంలోనూ శ్వాస సంబంధమైన వ్యాయామం చేసే మహిళల బృందంలోనూ ఒకే విధమైన హృదయ సంబంధ ఆరోగ్యం చేకూరినట్లు పేర్కొంటున్నాయి.
జాతీయ ఆరోగ్య సంస్థ యుఎస్ఏ ప్రకారం పసుపు మరియు దాని ముఖ్య క్రియాశీలక భాగం కుర్కుమిన్ యొక్క ప్రభావాలపై 24 ప్రస్తుత అధ్యయనాల జాబితా విడుదల చేసింది. ఇటువంటి అధ్యయనాలు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి: ఆహారంలో ఉపయోగించే పిండి రూపంలో ఉండే సంపూర్ణ పసుపు మరియు సప్లిమెంట్ గా తీసుకునే కుర్కుమిన్ రెండింటిలో ఏది తీసుకోవడం మంచిది? ఆండ్రూ వెయిల్ ప్రకారం “ పసుపు మరియు కుర్కుమిన్ ప్రతీ ఒక్కదానికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం వాస్తవమే. అయితే మీకు ప్రేగు వ్యాధి(IBD) వంటి నిర్దిష్ట అనారోగ్య పరిస్థితి లేకపోతే కుర్కుమిన్ మాత్రలు తీసుకోవడం కంటే పసుపునే (ముఖ్యంగా వంటల్లో) వాడటం మంచిది. ఇది నా అసాధారణ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిపై పూర్తి అధ్యయనం జరిగే వరకూ సాధారణంగా మొక్క యొక్క ఉత్పత్తుల కంటే, పూర్తి మొక్కను తీసుకోవడమే మంచి ఎంపిక. ఇంకోరకంగా చూస్తే కుర్కుమిన్ మరింత వేగంగా పనిచేసేదిగానూ మరియు నాటకీయ ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు, వ్యాధి నిర్మూలనకు (వ్యాధి రాకుండా నివారణ మిన్నా) మంచి ఎంపిక అనే నానుడి ఉంది.
ఆధారములు:
http://www.huffingtonpost.com/andrew-weil-md/turmeric-health-have-a-happy-new-year_b_798328.html
http://nccam.nih.gov
http://feelgoodtime.net/what-are-benefits-and-side-effects-of-curcumin-kurkumin-curcumin-for-cancer-and-dosage/
http://turmerichealthbenefits.org/
http://www.nutraingredients-usa.com/Research/Curcumin-may-match-exercise-for-heart-health-benefits-RCT-data http://neovitin.com/curcumin.aspx