చికిత్సా నిపుణుల వివరాలు
ప్రాక్టీషనర్ 10001...ఇండియా ఎకనామిక్స్ లో గ్రాడ్యుఏట్ ఐన వీరు కార్మిక చట్టాలలో డిప్లమా పొంది ముంబాయిలో మూడు సంవత్సరాలు పనిచేసారు. వివాహం తరువాత ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూణేలోని కార్మిక మరియు పరిశ్రమల రంగంలో న్యాయవాది అయిన తన భర్తకు సహాయం చేయడం ప్రారంభించారు. హోవార్డ్ మర్ఫెట్ రాసిన “మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్” పుస్తకం చదివిన తరువాత వీరు1997 లో స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు. ఆ తరువాత ఆమె వారాంతాలు మరియు సెలవు దినాలలో సాయి సంస్థ యొక్క సేవా కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు.
2007లో ముంబాయి లో జరిగిన వర్క్ షాప్ కు హాజరయ్యే వరకు వీరికి వైబ్రియోనిక్స్ గురించి తెలియదు. ఒక భక్తురాలు ఆమెను వైబ్రియానిక్స్ లో చేరడానికి ఒప్పించారు. ఆ విధంగా ఆమె పూణేలో మొదటి అభ్యాసకురాలిగా మారారు. అదే రోజున దురదృష్ట వశాత్తూ ప్రమాదానికి గురైన తన యువ మేనల్లుళ్ళను చూడటానికి ఆమె ఆసుపత్రికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులందరూ షాక్ కు గురియైన ఈ సందర్భంలో అక్కడే ఆమె అభ్యాసం ప్రారంభమయ్యింది. వెంటనే సన్నిహితులైన కుటుంబ సభ్యులందరికీ CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic ఇచ్చారు.
కుటుంబ సభ్యులు ఇచ్చిన సంతృప్తికరమైన ప్రతిస్పందన వైబ్రియోనిక్స్ పట్ల ఆమె విశ్వాసం స్థిరపడేందుకు దోహదపడింది. తరువాత ఆరు నెలలలోనే వీరు VP అయ్యారు. వైద్యులు రోగులకు సేవ చేయడం చూసి ఆమె చిన్నప్పటి నుంచీ వైద్యుల పట్ల వైద్య విధానము పట్ల ప్రత్యేక గౌరవం పెంచుకున్నారు. ఇప్పుడు వైబ్రియోనిక్స్ రూపంలో ఆమె కోరిక తీరడానికి, నిస్వార్థంగా సేవ చేయడానికి అవకాశం లభించింది. 2012లో క్యాన్సర్ ను ధైర్యంగా ఎదుర్కొని 2014 ఏప్రిల్ లో SVPగా అర్హత సాధించారు. శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ చేయించుకొనే నిమిత్తం ఆమె కొంతకాలం అల్లోపతి చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత, ఆమె వైబ్రియోనిక్స్ రెమెడీలు మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు.
బాలవికాస్ గురువుగా, నిరుపేదలకు తరగతులు నిర్వహించడానికి సమీప మురికివాడలను ఈమె సందర్శించేవారు. అక్కడ పిల్లలకు జ్ఞాపకశక్తి కోసం నివారణలు ఇవ్వడం ప్రారంభించే సరికి ప్రతిస్పందన అద్భుతంగా వచ్చింది. కొన్ని వారాల్లోనే వారు తమ పాఠములను బాగా గుర్తు ఉంచుకోగలగటం, మరియు పరీక్షలో మంచి మార్కులు పొందడం ప్రారంభించారు. ఆవిధంగా పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యులను సందర్శించక ఈ ప్రాక్టీషనర్ దగ్గరే రెమిడీలు తీసుకునే వారు. ఆ విధంగాఅతి త్వరలో వారి తల్లిదండ్రులు, తాతలు, పొరుగువారు రెమెడీల కోసం రావడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువ మంది పని మనుషులుగా పనిచేస్తున్నవారు ఉండగా వారి జీవిత భాగస్వాములు రిక్షాలు నడుపుతూ ఉండేవారు. వారిలో చాలామంది పొగాకుకు బానిసలయ్యారు.4 నెలల్లో 6 గురు మహిళలకు ఈ ప్రాక్టీషనర్ ఇచ్చిన రెమెడీలు సహాయపడ్డాయి. మద్యపానమునకు బానిస ఐన ఒక వ్యక్తి నెలలోనే తన అలవాటు నుండి బయటపడ్డారు. ఈ విధంగా వైబ్రియానిక్స్, దురలవాట్ల నుండి బయట పడాలని ఆకాంక్ష ఉన్న వారికి ఎంతో సహాయపడింది. సమీప గ్రామాల్లోని శిబిరాల్లో రోగులకు చికిత్స చేయడానికి వీరు క్రమం తప్పకుండా వెళుతూ ఉంటారు. ఈ విధంగా ఇప్పటివరకూ 9500 మంది రోగులకు చికిత్స చేశారు. వీరు విజయవంతంగా చికిత్స చేసిన కొన్ని అనారోగ్యాలు... ఆమ్లత్వం, కడుపు లో పుండు, సాధారణ జలుబు, మహిళలు మరియు యువత కు సంబంధించిన సమస్యలు, చర్మ అలెర్జీలు మరియు అంటువ్యాధులు, వ్యసనాలు మరియు దీర్ఘకాలిక నిరాశ( క్రానిక్ డిప్రషన్), అలాగే కి సూర్యరశ్మికి ఎలర్జీ నుండి మొదలు పెట్టి గోధుమలు, చక్కెర మరియు బెల్లం వంటి సామాన్య పదార్ధాల వరకూ అలెర్జీ ఉన్న రోగులకు కూడా ఆమె (ఎలర్జిన్ ను పోటెంటైజ్ చేయటం ద్వారా) విజయవంతంగా చికిత్స చేసారు. రోగులు వారి దీర్ఘకాలిక వ్యాధుల నుండి నయం కావడాన్ని చూసినప్పుడు ఆమె చాలా సంతృప్తి చెందేవారు. పూణే మరియు నాగ్‌పూర్‌లోని అభ్యాసకులను వారి వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ ను తిరిగి ప్రారంభింప చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ రెండు చోట్ల రిఫ్రెషర్ వర్క్ షాప్ లు నిర్వహించడంలో ఆమె తన మెంటర్ మరియు టీచర్ కు సహాయం చేసారు. పాల్గొన్న వారు మొదట్లో ఇంగ్లీషును సులభంగా అర్థం చేసుకోలేక సంకోచించడంతో వీరు మరాఠీలో వివరించడం ద్వారా వారికి సులభంగా అర్ధమయ్యేటట్లు చేసారు. జెవిపి మాన్యువల్ మరియు108 సిసి పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి మరాఠీకి అనువదించడంలో మరియు మాన్యువల్ ముద్రించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. సేవ చేసే విషయంలో వినయం మరియు ప్రేమకు ప్రతీకగా వీరు పేరు తెచ్చుకున్నారు.
"అందరినీ ప్రేమించండి మరియు అందరికీ సేవ చేయండి" అనే సందేశాన్ని ఆచరణలో పెడుతూ జీవించడానికి ఒక వినయపూర్వకమైన సాధనంగా తనను మార్చినందుకు స్వామికి వీరు హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలుపుకొంటున్నారు. అభ్యాసకురాలిగా మారిన తర్వాత ప్రాపంచిక ప్రయోజనాల కోసం పనిచేయడం మాని పూర్తిగా సాయి సేవలో మునిగిపోవడంతో తన జీవితంలో ఎంతో పరివర్తన వచ్చిందని వీరు తెలుపుతున్నారు. ఇది ఆమె ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి మరియు తన ధృక్పథం మరింత ప్రేమమయంగా మారడానికి సహాయపడింది. ప్రతీ ఇంటిలోనూ సభ్యులంతా జీవితంలో సంతోషంగా ఉండటానికి మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ఆ ఇంటిలోఎవరో ఒక సభ్యుడు/సభ్యురాలు వైబ్రో అభ్యాసకులుగా మారాలని ఆమె భావిస్తున్నారు.
పంచుకున్న కేసులు :