మూత్రం ఆపుకోలేక పోవడం, నోరు ఆరుకు పోవడం, హై బి.పి. 10001...India
79 ఏళ్ల మహిళ గత 6 నెలలు గా ముత్రాన్ని ఆపుకోలేని వ్యాధితో బాధపడుతూ ఉన్నది. కొన్నిసార్లు మూత్ర విసర్జనలో మంట కూడా అనిపించేదట. ఆమె నాలుక అకస్మాత్తుగా పొడిగా మరియు ఎర్రగా మారుతుంది మరియు ఆమె మాట రోజుకు ఒకటి లేదా రెండుసార్లు అస్పష్టంగా మారిపోతూ ఉంటుంది.
27 ఏప్రిల్ 2018న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC11.5 Mouth infections + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…TDS
ఆమె వ్యాధి లక్షణాలన్నీ రెండు వారాల్లో అదృశ్యము కావడంతో మోతాదు ఒక నెలలో నెమ్మదిగా OW కి తగ్గించబడి తరువాత ఆపివేయ బడింది. ఆమె మరో సమస్యకు చికిత్స కోసం 26 మే 2018న ప్రాక్టిషనర్ ను కలుసుకున్నారు. మందులు తీసుకుంటున్నప్పటికీ ఆమె బిపి గత 2 సంవత్సరాలుగా ఎక్కువగా ఉంది.
దీని నిమిత్తం ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#2. CC3.3 High Blood Pressure (BP)…TDS
రెమిడీ తీసుకున్న వారం తరువాత 2 సంవత్సరాలుగా ఉంటున్న అధిక బి.పి నార్మల్ కి చేరుకున్నది. అంతేకాక 2018 డిసెంబర్ నాటికి బి.పి. నార్మల్ గా ఉండడమే కాకుండా ఆమె యొక్క మూత్రం ఆపుకోలేని తనము మరియు నోరు పొడిబారిపోయే లక్షణాలు పునరావృతం కాలేదు. ఆమెకు బి.పి. సాధారణ స్థితిలోనే ఉంటోంది. ఈ రిపోర్టు ఇచ్చేనాటికి ఆమె ఆలోపతి మరియు వైబ్రో రెమిడీలు రెండింటినీ తీసుకుంటున్నారు.