సోరియాసిస్ 10001...India
30 ఏళ్ల వయసు గల మహిళ గత పది సంవత్సరాలుగా చేతులు మరియు కాళ్ళ మీద (అరచేతులతో సహా) లేత ఎరుపుదద్దుర్ల తో బాధపడుతున్నారు. ఐతే దురద ఆమె అరచేతులపై మాత్రమే ఉంది. ఇది సోరియాసిస్ అని నిర్ధారించబడింది, కానీ ఆమె ఎప్పుడూ ఎలాంటి చికిత్స తీసుకోలేదు.
12 డిసెంబర్ 2015 తేదీన ఆమెఅభ్యాసకుని సంప్రదించగా ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis...TDS
15 రోజుల తరువాత దురద తగ్గినప్పటికీ దద్దుర్ల విషయంలో మార్పేమీ లేదు. నెల తరువాత అభ్యాసకుడు CC10.1 లేకుండా #1 ను తిరిగి తయారుచేసి ఇవ్వాలని అనుకున్నారు.
#2. CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis...TDS
మొత్తంగా 3 నెలల తరువాత ఆమె చర్మం సాధారణస్థాయికి చేరుకున్నది. మోతాదు క్రమంగా OW కు తగ్గించబడింది. అంతేకాక 2016 ఆగస్టునుండి నిర్వహణ మోతాదుగా దీనిని కొనసాగిస్తూ ఉన్నారు. 2018 నవంబర్లో ఆమెను సంప్రదించి నప్పుడు రోగలక్షణములు ఏవీ పునరావృతం కాకుండా ఆమె చర్మం సంపూర్ణంగా సాధారణస్థితిలో ఉంది.