కనురెప్ప పైన కురుపు 10001...India
15 సంవత్సరాల అమ్మాయికి ఎడమ కనురెప్ప పైన గత నాలుగు నెలలు గా 4-5 మి.మీ కురుపు ఉంది. ఆమె కంటిలో వేసుకునే చుక్కలతో సహా అల్లోపతి మందులను వాడుతూ ఉన్నప్పటికీ ఏమాత్రం ఫలితం కనిపించ లేదు. 20 ఏప్రిల్ 2018న ఆమెకు ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC2.3 Tumours & Growths + CC7.3 Eye infections + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS లోపలికి తీసుకొనడానికి మరియు నీటితో కలిపి BD గా పైనరాయటానికి. ఒక నెల తరువాత, కంటి కురుపు దాని పరిమాణంలో సగం అయ్యింది. అంతేకాక కంటి ఎరుపు దనం కూడా తగ్గిపోయి రెండు నెలల్లోకన్ను సంపూర్ణంగా సాధారణస్థాయికి చేరుకుంది. మోతాదును రెండు వారాల పాటు OD కి మరియు తరువాత OW కు తగ్గించడం జరిగింది. 2019 మార్చిలో తన బోర్డు పరీక్షలు ముగిసే వరకు రెమెడీని OW గా కొనసాగించాలని ఆమె నిర్ణయించుకొన్నారు.