Practitioner Profile 10728...India
కర్ణాటకలో మంగళూరుకు చెందిన చికిత్సా నిపుణురాలు 10728…India, దీర్ఘకాలంగా స్వామి భక్తురాలు. స్థానిక సాయి కేంద్రంలో జరిగే కార్యకలాపాలలో ఈమె ఉత్సాహంతో పాల్గొంటుంది. ఒకప్పుడు బాలవికాస్ విద్యార్థినియైన ఈమె, ఇప్పుడొక బాలవికాస్ గురువు. 2004లో ముంబైలో సత్యసాయి ఏడూకేర్ లో డిప్లొమా పూర్తి చేసింది. ఉపాద్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, మంగళూరు చుట్టు ప్రక్క ప్రాంతాలలో ఉన్న గ్రామీణ పాఠశాలల్లో మరియు 45 పిల్లలున్న ఒక అనాధ ఆశ్రమంలో శిక్షణ అందచేస్తోంది. ఏ విధమైన సేవను అందచేసినా ఆత్మానందం కలుగుతుందని ఈమె యొక్క భావన.
ఈ చికిత్సా నిపుణురాలు మొట్టమొదట సాయి వైబ్రియానిక్స్ గురించి తన సాయి కేంద్రానికి పంపబడిన సమాచార పత్రం మరియు దరఖాస్తు పత్రం చూసి తెలుసుకుంది. సేవ చేయడంలో ఈమెకున్న ఆశక్తి గురించి తెలిసిన ఈమె సమితి అధ్యక్షులు వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణురాలుగా శిక్షణ పొందడానికి ఈమెను ఎంపిక చేసారు. 2009లో ఈమె వైబ్రో శిక్షణ పూర్తి చేసింది. చేసిన వెంటనే ఈమె సాయి కేంద్రంలో, ప్రతి గురువారం జరిగే ఒక క్లినిక్ ను ప్రారంభించారు. ఈ క్లినిక్ లో ఇప్పటివరక్లు ఈమె 6,500 రోగులకు విజయవంతంగా చికిత్సను అందచేసారు. అత్యవసరం ఉన్నవారికి, అన్ని వేళల్లోనూ ఈమె చికిత్సను అందచేస్తోంది.
రోగులను తన ద్వారా స్వామి నయం చేస్తున్నారన్న విశ్వాసమున్న ఈమె, ఈ సేవా సాధన, ప్రతిఫలదాయకంగా ఉందని భావిస్తోంది. స్వామి యొక్క వినమ్ర సాధనంగా ఉన్నందుకు తను ఎంతో ఆనంద పడుతోంది. ఈమె వైబ్రో క్లినిక్ నడుపుతున్న సాయి కేంద్రానికి స్వామి స్వయంగా రెండు సార్లు వచ్చి దర్శనం ఇచ్చియున్నారు. ఈ కారణంగా క్లినిక్లో రోగులకు చికిత్స ఇస్తున్న సమయంలో తీవ్రమైన స్వస్థతా తరంగములను అనుభవిస్తున్నట్లుగా ఈమె చెబుతున్నారు.
ఏడు సంవత్సరాల అభ్యాసంలో, తనకు శిక్షణ సమయంలో చెప్పబడిన సూచనలను సలహాలను పాటించింది. ఈమె నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాటం: "స్వామికి ఏది అసాధ్యం కాదు". రోగుల వద్ద నుండి వస్తున్న మహత్తరమైన ప్రతిస్పందనను చూసి, దైవాన్ని పూర్తిగా విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఈమె చెబుతోంది. ఈమె బృందావన్లో మరియు మంగళూరు చుట్టూ ఉన్న గ్రామాలలో ఇతర చికిత్సా నిపుణులతో కలిసి వైబ్రో సేవను చేసింది. ఈమె వద్దనున్న 108CC పెట్టె ద్వారా, క్రింద ఇవ్వబడిన అనేక రకముల వ్యాధులకు చికిత్సనిచ్చింది: వివిధ క్యాన్సెర్లు, మానసిక మరియు నరాలకు సంభందించిన రోగాలు, సంతానంలేమి సమస్య, చర్మ రోగాలు, కీళ్ళ వాతపు సమస్యలు, జంతువులు మరియు మొక్కలకు సంభందించిన సమస్యలు.
ఏడు సంవత్సరాలుగా చేస్తున్న వైబ్రియానిక్స్ సాధన ద్వారా ఈమెకు మరింత స్వామి సేవ చేయాలన్న ప్రేరణ కలిగింది. మనశ్శాంతి మరియు సంతృప్తి ఈ సేవ ద్వారా తనకు అందిన ప్రతిఫలములని ఈమె చెబుతోంది. ఈ కారణంగా ఈమె తన సేవా కార్యక్రమానికి అధిక ముఖ్యత్వం ఇస్తోంది. సేవ చేయడానికి ఈమె అధిక సమయం కేటాయిస్తున్న కారణంగా ఈమె ఎల్లపుడు తన భర్త మరియు బిడ్డలను ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలా ప్రోత్సాహించేది. "అమ్మ దివ్య కార్యం చేయడానికి దేవుని ద్వారా ఎంపిక చేయబడింది; ఆమెకు అటువంటి సేవా కార్యం చేయడానికి సమయం ఉండాలి" అని ఈమె కుమారుడు యొక్క భావన.
----------------------------------------------------------------------------------------------------------------