Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సంతానం లేమి 10728...India


వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలైనా సంతాన ప్రాప్తి లేకుండుట కారణంగా ఒక జంట 2014 మార్చ్ 14న చికిత్సా నిపుణుడను సంప్రదించడం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఏమిలేని  ఆ మహిళ వయసు 34 సంవత్సరాలు. వివాహం అయిన కొంత కాలానికి ఆమె గర్భం ధరించింది కాని గర్భస్రావం జరిగింది. ఆపై ఆమె తిరిగి గర్భవతి కాలేక పోయింది. ఆమె భర్త యొక్క కుటుంభ సభ్యులు, లోపం ఆమెలోనే ఉందని అగుపించడంతో ఆమె చాలా ఒత్తిడికి గురియైంది. వైధ్యుడను సంప్రదించడంతో ఆమె ఆరోగ్యకరంగా ఉన్నట్లు , 45 ఏళ్ళ ఆమె భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువ ఉన్నట్లు వెల్లడైంది. అతను మధుమేహం సమస్య నియంత్రణకు అల్లోపతి మందులు వాడేవాడు. క్రింది మందులు వారిద్దరికి ఇవ్వబడినాయి:

భార్యకు:
#1. CC8.4 Ovaries & Uterus + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS
భర్తకు:
#2. CC12.1 Adult tonic + CC14.3 Male infertility + CC15.1 Mental & Emotional tonic...QDS
 
2015 జనవరి 15న చేసిన పరీక్షలో ఆమె గర్భావతియని తెలిసింది. ఎంతో ఆనందించిన ఆ జంటను, చికిత్సా నిపుణుడు #1 మరియు #2 నిలిపివేయమని చెప్పారు. భార్యకు క్రింది మందులు ఇవ్వబడినాయి: 
 
గర్భధారణ మరియు వికారము కోసం:
#3. CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sickness + CC15.1 Mental & Emotional tonic...QDS
 
ఆమెకు గర్భధారణ సునువుగా కొనసాగింది. 2015 ఆగస్ట్ 27న, ఈ జంట ఎంతో ఆనందించే విధంగా ఒక ఆరోగ్యకరమైన శిశువు సాధారణ ప్రసవం ద్వారా జన్మించింది. దీని తర్వాత #3 నిలిపి వేయబడింది. తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంత అద్భుతమైన వరాన్ని ప్రసాదించినందుకు ఆ జంట సాయి వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు