Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ల్యుకేమియా (పాండురోగం) 10728...India


ఒక 21 సంవత్సరాల వైద్య విద్యార్ధి, ఆమ్లపిత్తము (ఎసిడిటీ), నిద్రలేమి, విపరీతమైన నీరసం మరియు భరువు కోల్పోవడం వంటి లక్షణాలతో భాధపడేది. ఆశ్పత్రిలో చేసిన రక్త పరీక్షల ద్వారా ఆమెకు ల్యుకేమియా వ్యాధి (పాండురోగం) ఉందని నిర్ధారించబడింది. ఈ క్యాన్సర్ నాలుగవ స్థాయికి చేరుకుందని తెలిసింది. రోగి యొక్క రక్తవర్ణం మరియు రక్త(కణ)పట్టికల సంఖ్య అతి తక్కువగా ఉంది. ఆమె ఎక్కువ కాలం జీవించి యుండడం కష్టమని వైద్యులు విషాదభరితమైన నిరూపణ చేసారు. ఆమె ఎక్కువ కాలం జీవించియుండడం అసాధ్యమని వైద్యులు చెప్పడంతో, లండన్లో చదువుకుంటున్న రోగి యొక్క సోధరుడను పిలిపించారు. ఆశ్పత్రిలో ఉన్న రోగి తన మంచం నుండి క్రిందకు దిగలేక పోయేది. రోగి యొక్క తండ్రి వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. 2015 నవంబెర్ 13న రోగికి క్రింది మందులు ఇవ్వడం జరిగింది

ల్యుకేమియా సమస్యకు:
#1. CC2.1 Cancers - all +  CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...QDS 

అసిడిటీ మరియు బలహీనత సమస్యకు:
#2.  CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS 

నిద్రలేమి సమస్యకు:
#3. CC15.6 Sleep disorders + CC18.1 Brain disabilities...half an hour before going to bed, and again just before going to bed.
 
నవంబెర్ 30 న, రోగికి భగంధరము సమస్య మొదలైందని రోగి యొక్క తండ్రి తెలపడంతో క్రింది మందులు ఇవ్వబడినాయి:
భగంధరము సమస్యకు (ఆనల్ ఫిస్టులా) :
#4. CC4.4 Constipation + CC13.3 Incontinence...QDS

ఒక నెల రోజులలో భగంధరము సమస్య పూర్తిగా నయమవ్వడంతో, #4 మందు క్రమంగా ఆపివేయబడింది. డిసెంబెర్లో చలి కాలం రావడంతో, రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. ఈ కారణంగా, డిసెంబెర్ 9న క్రింది మందులు అదనంగా ఇవ్వబడినాయి:
శ్వాస సమస్యకు:
#5. CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic...QDS

ఆకలి లేకపోవడం సమస్యకు:
#6. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS


ఒక నెల లోపున రోగి యొక్క శ్వాస సమస్య పూర్తిగా తగ్గి ఆమె ఆకలి కూడా పెరిగింది. #5 మరియు #6 మందులను ఆపివేయడం జరిగింది.

2015 జనవరిలో రోగిని కాన్సెర్ ఆశ్పత్రిలో చేర్చారు. రోగికి రసాయనచికిత్స (కీమోతెరపి) మరియు ఎముక మజ్జ మార్పిడి జరిగింది. దీని కారణంగా రోగి చాలా బలహీనపడింది. అదే సమయంలో రోగికి జుట్టు రాలిపోయింది. ఆశ్పత్రిలో చికిత్స పొందిన సమయంలో రోగి  #1, #2 మరియు  #3 తీసుకోవడం కొనసాగించి వేగంగా కోలుకుంది. ఆమె జుట్టు తిరిగి పెరగడం మొదలైంది. ఆశ్పత్రి నుండి డిశ్చార్జ్ చేయబడి ఏప్రిల్ లో రోగి ఆమె సొంతూరు చేరుకుంది.  ఏప్రిల్ 4న చేసిన స్క్రీనింగ్ పరీక్షల్లో రోగి యొక్క రక్త(కణ)పట్టికల మరియు రక్తవర్ణ సంఖ్యలలో అభివృద్ధి కలిగింది. రోగికి నిద్రలేమి సమస్య పూర్తిగా తగ్గడంతో, #3ను ఆపివేయడం జరిగింది.  గతంలో తప్పిపోయిన కళాశాల పరీక్షలను రాయగలిగింది. ఆగస్ట్ లో కళాశాల తరగతులకు హాజరు కావటం ప్రారంభించి, ఆమె వైద్య శిక్షణను కొనసాగించింది. 17 సెప్టెంబర్ న చేయబడిన పరీక్షల్లో కాన్సెర్ కణాల చాయ మాత్రమైనా కనపడలేదు. రక్తవర్ణ స్థాయి మరియు రక్త కణాల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంది. ఈ కారణంగా #1 మరియు #2 BD గా తగ్గింపబడింది. పూర్తిగా కోలుకున్న ఆ మహిళ మరియు ఆమె తల్లి తండ్రులు క్రుతజ్ఞ్యతతో సాయి మందిరంలో క్రమముగా జరపబడే భజనల్లో పాల్గొనడం ప్రారంభించారు. డిసెంబెర్ 30న, ఈ మహిళ తన తల్లి తండ్రులతో పాటు నూతన సంవత్సర వేడుకలు చూడడానికి పుట్టపర్తికి వచ్చింది. ఈమె పర్తిలో పది రోజులు సేవ చేసింది. 2016 జనవరిలో #1 మరియు #2 యొక్క మోతాదు వారానికి మూడు సార్లు కి(3 ) తగ్గించ బడింది. ప్రతి నెల ఈ మహిళ చేయించుకున్న స్క్రీనింగ్ పరీక్షల నివేదికలు సాధారణంగానే ఉన్నాయి. 2016లో ఈమె జుట్టు తిరిగి పూర్తిగా పెరగడమే కాకుండా ఈమె పూర్తి స్వస్థతను పొందింది. దీని కారణంగా ఈమెకు వైబ్రో చికిత్స పూర్తిగా ఆపివేయబడింది.