రక్తప్రదరము, గర్భాశయ కణితి 10728...India
గత ఆరు నెలలుగా తీవ్ర రక్తప్రదరము (మేనోర్ర్హేజియా) సమస్యతో భాదపడుతున్న ఒక 48 ఏళ్ళ మహిళ, 2013 జూన్ లో వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఆమె జూన్ నెలంతా నొప్పితో కూడిన తీవ్ర రక్తస్రావంతో భాధపడింది. పరిశోధనల ద్వారా ఆమె గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఉన్నాయని, శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించాలని వైద్యులు సలహా ఇచ్చారు. శస్త్రచికిత్స చేయించుకోకుండా వైబ్రియానిక్స్ చికిత్సను ఎంచుకుంది. ఆమె ప్రయాణం చేసేవంటి పరిస్థితిలో లేన కారణంగా, మొదటి నియామకమునకు ఆమె యొక్క భర్త రావడం జరిగింది. చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇచ్చారు:
#1. CC10.1 Emergencies. రోగి యొక్క భర్తకు, తమ ఇల్లు చేరుకున్న వెంటనే ఆమె నోటిలో ఒక డోస్ వేయవలసిందిగా చెప్పబడింది.
#2. CC8.4 Ovaries & Uterus + CC8.6 Menopause...QDS
#3. CC20.6 Osteoporosis...QDS
రుతువిరతి కారణంగా బోలో ఎముక సమస్య (ఆస్టియోపోరోసిస్) కలుగుతుంది కాబట్టి #3 ఇవ్వబడింది.
ఈ చికిత్స తీసుకున్న రెండు నెలల తర్వాత ఆమె రుతుక్రమం పూర్తిగా ఆగిపోయింది. ఆపై చేసిన స్కాన్ పరీక్షల్లో ఫైబ్రాయిడ్లు తొలగిపోయాయని తెలిసింది. ఆమె గర్భాశయాన్ని తొలగించే అవసరం లేదని వైద్యులు చెప్పారు. పూర్తిగా నయంకావడంతో ఆమె చాలా ఆనందించింది మరియు ఎంతో ఉత్సాహంతో తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.