అభ్యాసకురాలి వివరాలు 02754...Japan
నేను 2008 సెప్టెంబర్లో పుట్టపర్తిలో ఉన్నసాయి బాబాగారి ఆశ్రమంలో ఉన్నపుడు సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నాను. నాకున్న ఒక ఆరోగ్య సమస్య గురించి చెబుతుండగా వైబ్రో అభ్యాసకుడైన ఒక భక్తుడు నన్ను వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవమని ప్రోత్సాహించాడు. నా సమస్య ఏమిటంటే ఫెబ్రవరి 15న మా ఇంట్లో ఉండగా నాకు విపరీతమైన తలనొప్పితో పాటు తలలో ఏదో పెలినట్లుగా శబ్ధమొచ్చింది.ఆ విపరీతమైన నొప్పివలన నాకు ఊపిరాడలేదు. నేను ఒకటి నుండి పది లెక్క పెట్టేలోపు నొప్పి తగ్గకపోతే ఆమ్బులన్స్ని పిలవాలని నిర్ణయించుకున్నాను.వెంటనే నా తలనొప్పి మటుమాయమయిపోయింది.ఈ సంగటన తర్వాత నేను నా స్నేహితురాలిని కలిశాను.ఆమెకు ఆధ్యాత్మిక విషయాల గ్రహనశీలత ఎక్కువ.ఆ రోజు నాకొచ్చిన విపరీతమైన తలనోప్పినుండి సాయిబాబా నన్ను కాపాడారని ఆమె నాకు చెప్పింది. నాకొచ్చిన తలనొప్పికి కారణం నా మెదడులో ఉన్న వేరికోస్ వీన్స్ అని తర్వాత నేను ఇండియాకు వెళ్ళినప్పుడు తెలిసింది. ఇదే నన్ను సాయి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడానికి దారితీసింది. మందులు మొదలుపెట్టిన మూడు రోజులకి తలలో నాకున్న అసౌఖర్యం తొలిగింది. ఇంత త్వరగా నాకు నయమవ్వడంతో నేను చాలా ఆశ్చర్య పోయాను.స్వామికి నా మనసార నా కృతజ్ఞ్యతలు తెలుపుకున్నాను.
నాకు 2008 డిసంబర్లో మూడు నెలల వైబ్రియానిక్స్ చికిత్స పూర్తవ్వగానే డా అగ్గర్వాల్ని కలిసి అభ్యాసకులు శిక్షణ కొరకై దరఖాస్తు పత్రాన్ని ఇచ్చాను. ఇంగ్లిషు రానందువలన నాకు వైబ్రియానిక్స్ లో శిక్షణ పొందడానికి నా భాషలో అర్ధం చెప్పేవాళ్ల సహాయం కావలిసివచ్చింది. స్వామీ నాకు సహాయం చేయడానికి నలుగురు వ్యక్తుల్ని పంపారు.అందులో ఒకరు సీనియర్ అభ్యాసకుడు అవ్వడం విశేషం.
సాంప్రదాయక అల్లోపతి వైద్య విధానం జపాన్లో స్థిరంగా ఉన్నపటికీ, ఈ మధ్య ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని చాలా మంది కోరుకుంటున్నారు. ఆరోగ్యకరమైన మరియు ప్రయోజకరమైన జీవిత విధానాన్ని కోరుకునే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. నన్ను సంప్రదించడానికి కొత్త పేషంట్లు ఇతరుల ద్వారా తెలుసుకొని వస్తున్నారు.