పానిక్ డిసార్డర్ (దిగులు), తరచుగా మూత్రవిసర్జన 02754...Japan
అభ్యాసకుడు ఇట్లు వ్రాసారు: నా స్నేహితుడు కుమార్తైన ఒక 30 ఏళ్ళ మహిళ తను హై స్కూల్లో ఉండగా తనని శౌచాలాయాన్ని వాడే అనుమతి ఇచ్చేవారుకాదు.దీనివలన మరియు ఇతర కారణాలు వలన ఈమె మనసులో బెదురు కలిగి స్కూల్కి వెళ్ళడం మానేసింది.తన కుటుంభ సభ్యలుతో కూడా మాట్లాడేది కాదు. తర్వాత తనకి పానిక్ డిసార్డర్ (దిగులు,అత్యంత భయం) సమస్య కలిగింది.ఈ మహిళతో నేరుగా మాట్లాడే ముందుగా నేను ఈమెకు ఫోన్ చేసి సాయి వైబ్రియోనిక్స్ గురించి చెప్పాను మరియు నన్ను సంప్రదించడానికి నిర్నితమైన సమయం(అప్పాయింట్మెంట్) ఏదో చెప్పాను. ఈమెకు మొదట నన్ను సంప్రదించడానికి రైల్లో అరగంట సేపు ప్రయాణం చేసి రావడం అసాధ్యం అనిపించింది.కాని తనకు అల్లోపతి మందులు వాడడం ఇష్టం లేనందువలన వైబ్రియోనిక్స్ మందులు కోసం తన తల్లిగారుతో 2009 ఫెబ్రవరిలో వచ్చింది. దారిలో ఈమె పలు మారులు రైలునుండి దిగి శౌచాలాయానికి వెళ్ళవలిసి వచ్చింది.
నాతో సంప్రదించుచుండగా ఈమె తనకు దిగులు, విరోచనాలు మరియు తరచుగా మూత్రవిసర్జన,మైగ్రేన్ తలనొప్పి,సంక్షోభం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపింది.నేను ఈమెకు ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చాను
#1. CC4.6 Diarrhoea + CC11.4 Migraines + CC13.3 Incontinence + CC15.2 Psychiatric disorders…TDS
ఈమె ఇంతకముందు మూలిక ఔషధం తీసుకుంటూ వుండేది. తనకిష్టమైతే ఆ ఔషధం తీసుకోవడం కొనసాగించవచ్చని చెప్పాను. ఒక నెల తర్వాత ఈమె తన భావాలను వ్యక్తీకరించడం మరియు తన ఇష్టా అయిష్టాలను తెలియజేయడం మొదలుపెట్టింది. ఈమెకు మానసిక సంక్షోభ సమస్య ఉండడంవల్ల నేను ఈమెను ఆక్షేపించాకుండా ఈమె చేసేవన్నీకేవలం చూస్తూ ఉన్నాను.ఈమె నన్ను సంప్రదించడానికి వచ్చినప్పుడల్లా నాకు ఈమెకు మందులు తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. 2012 ఏప్రల్ నాటికి ఈ మహిళలో చాలా మంచి మార్పులు వచ్చాయి. ఈమె తన ఆలోచనలను,మాటలు మరియు చేతలను భాగా పరిశీలించడం మరియు విశ్లేషించడం మొదలుపెట్టింది. ఈ తరుణంలో ఆమెను ఆశావాదిగాను, తనను మరియు తన చుట్టూ ఉన్నవారిని అంగీకరించమని ప్రోత్సాహించాను. అంగీకరణ భావన తన స్వభావమును మెరుగు పరిచి తనకీ తన చుట్టూ ఉన్నవాళ్ళందరికీ ఆనందాన్ని కలుగజేస్తాయని యని చెప్పాను.#1 రేమేడి ఇవ్వడం ఆపి ఈ క్రింద వ్రాసిన రేమేడీలు ఈమెకు ఒత్తిడి మరియు భయం తగ్గడానికి ఇచ్చాను
#2. CC15.2 Psychiatric disorders + CC15.5 ADD & Autism…TDS for 5 months, then OD
2012 జూన్ నాటికి ఈమె తన కుటుంభాన్ని ఆదుకోవడానికి సహాయపడేంతగా బాగుపడింది. ఈమెకు భయము మరియు ఒత్తిడి బాగా తగ్గాయి. 2014 వసంతకాలంలో తనకు చాలావరకు నయమైందని రోజుకి ఒకమారు మందు తీసుకుంటున్నానని తెలియజేసింది. ఈ మహిళకు రోగ లక్షణాలన్నీ చాలావరకు నయమైనందువల్ల మరియు అభ్యాసకుని ద్రిష్టిలో రోగి స్వీయ ప్రేరణకు గౌరవమివ్వడం ప్రధానమైనందువలన ఈ రోగితో సంపర్కం ఇప్పుడు తగ్గిపోయింది.