ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్య 02754...Japan
ఒక 54 ఏళ్ళ మహిళ 2015 ఫెబ్రవరిలో ఒత్తిడి సమస్యతో అభ్యాసకుడిని సంప్రదించింది.ఈమె అంతకుముందు పనిచేస్తున్న కంపనీ దివాళా ఎత్తడంతో కొత్త ఉద్యోగంలో జెరింది.అక్కడ రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయటంవలన ఈమెకు ఒత్తిడి,గుండె దడ కలిగి నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఈమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇచ్చారు
ఒత్తిడి కొరకు:
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities…TDS
నిధ్రలేమికోరకు:
#2. CC15.6 Sleep disorders
ఈమె నిద్రపట్టడం కొరకై వైబ్రిఒనిచ్స్ మందులతో పాటు అల్లోపతి మందులు కుడా తీసుకుంటానని చెప్పింది. మార్చ్ నెలలో వత్తిడి 50% తగ్గినట్లుగా ఈమె తెలియజేసింది. కాని ఈమెకు రోజంతా పనిచేసి కుర్చీనుండి లేచేటప్పుడు తలదిమ్ము కలిగేది. ఈమెకు గుండెదడ సమస్య ఉండడంతో ఆందోళన పడింది. ఈ సమస్యలకోరకు #1 మందు ఆపి ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చారు
#3. CC3.1 Heart tonic + CC3.6 Pulse irregular + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities + CC18.7 Vertigo...TDS
రెండు రోజుల తర్వాత ఈ రోగి అభ్యాసకునికి పంపిన ఒక ఈమైల్లో తన ద్రిష్టికోణంలో మార్పు కలిగిందని మునుపు కన్నా ఆనందంగా ఉన్నానని వ్రాసింది. 2015 జులైలో ఈమెకు 75% నయమైందని రిపోర్ట్ చేసింది. ఈమె మందుల్ని ఇప్పుడుకూడా కొనసాగిస్తోంది.
అభ్యాసకుని వ్యాఖ్యానం:
ఈ వైబ్రియోనిక్స్ వైద్యం ద్వారా అవసరమైన వారందరికీ సేవ చేయడానికి అమూల్యమైన అవకాశాలు ఇవ్వబడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పేషంట్లునుండి అనుకూలమైన రిపోర్ట్లు అందినప్పుడు మరింత ఆనందంగా ఉంటుంది.