Vol 14 సంచిక 6
నవంబర్ / డిసెంబర్ 2023
అవలోకనం
డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
డాక్టర్ జిత్ అగర్వాల్, భూమాతను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అనేక మంది ప్రాక్టీషనర్లు చేపడుతున్న చెట్ల నాటడం, తమ సేవా కార్యక్రమాన్ని విస్తరించేందుకు పరస్పరం సహకరించడం, అలాగే యెస్ ఆర్ హెచ్ వి పి లో కాంబోలు మరియు వివిధ పదార్థాలను పొటెన్టైజ్ చేసే ప్రయోగాలను అభినందిస్తున్నారు. రాబోయే పండుగల సందర్భంగా వెలుగు మరియు ప్రేమను హృదయపూర్వకంగా ఆచరించాలని, అలాగే ప్రపంచ శాంతి కోసం అందరూ కలిసి ప్రార్థనలో పాల్గొనాలని ఆయన పిలుపునిస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
ఈ సంచికలో 12 ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: శాశ్వత దంతాలు ఆలస్యంగా రావడం, మోకాలి నొప్పి, మానసిక డిప్రెషన్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ – ఇబియెస్, అధిక బహిష్టు రక్తస్రావం, చర్మ దురద, మైగ్రేన్, క్యాటరాక్ట్, పెరిగిన అడినాయిడ్స్ గ్రంథులు, శిశువులో ఎగ్జిమా (చర్మ దద్దుర్లు), జీర్ణకోశ రుగ్మత, హెర్పీస్ వైరస్ ఇన్ఫెక్షన్, కోవిడ్ అనంతర ప్రభావాలు
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
ఈ సంచికలో అమెరికా లో సేవలందిస్తున్న ముగ్గురు అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. వారిలో మొదటి ప్రాక్టీషనర్ న్యూజెర్సీకు చెందినవారు. వైబ్రియోనిక్స్ యొక్క అద్భుతమైన ఫలితాలను ప్రత్యక్షంగా చూసిన తరువాత 2016లో ప్రాక్టీషనర్‌గా మారారు. చికిత్సలో వినూత్నమైన విధానాలను అనుసరిస్తూ, యెస్ వి ఆర్ టి లోని అనేక విభాగాలలో చురుకైన స్వచ్ఛంద సేవకుడిగా కూడా సేవలందిస్తున్నారు. మిగిలిన ఇద్దరు హ్యూస్టన్కు చెందిన దంపతులు. వీరు ఒక బృందంగా వైబ్రియోనిక్స్ సేవ చేస్తున్నారు. సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటూ, స్వామి నుండి పొందిన అనేక అందమైన అనుభవాలు మరియు ఆశీర్వాదాలను ఈ సంచికలో పంచుకుంటున్నారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు-జవాబులు
తెలుసుకోవడానికి చదవండి: బెడ్‌సోర్ (ఒత్తిడి వల్ల ఏర్పడే పుండ్లు)ను ఎలా ఎదుర్కోవాలి మరియు చికిత్స చేయాలి? ఒక రెమెడీ తయారు చేస్తున్నప్పుడు స్వామి వారి ఆశీర్వాదాన్ని ఎలా ఆహ్వానించాలి? మనుషుల చుట్టూ ఉండే ఇన్‌విజిబుల్ ఆరా (అదృశ్య శక్తి వలయం)పై జరిగిన తాజా పరిశోధన ఏమిటి? అలాగే రెమెడీ ద్వారా దానిని ఎలా శుద్ధి చేయవచ్చు? మహిళల్లో మెనోపాజ్ (రజోనివృత్తి) కోసం చికిత్సను ఎప్పుడు ప్రారంభించాలి? చికిత్సలో ఏ అంశాలను గుర్తుంచుకోవాలి? విభూతిని పొటెన్టైజ్ చేసి, దాని వైబ్రేషన్ ను రెమెడీకి జోడించడం నిజంగా అవసరమా? దానివల్ల ఏమైనా ప్రమాదమా? అలాగే దీనికి సురక్షితమైన ప్రత్యామ్నాయం ఏమిటి?
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
మన శారీరక ఆరోగ్యంను ఒక అమూల్యమైన నిధిగా ఎలా సంరక్షించుకోవాలో, అలాగే హనుమంతుడు వలె గర్వం, అహంకారం అనే జాడ కూడా లేకుండా ఎలా సేవ చేయాలో స్వామి ప్రేమపూర్వకంగా మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
భారతదేశంలోని పుట్టపర్తి మరియు ఫ్రాన్స్లో జరగబోయే శిక్షణా శిబిరాలు.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
సమతుల్య ఆహారంలో అవసరమైన మాక్రో పోషకాలను ప్రణాళికాబద్ధంగా తీసుకోవడం అనే ఆరోగ్య వ్యాసంలో మాక్రోన్యూట్రియెంట్స్ (ముఖ్య పోషకాలు) అంటే ఏమిటి? వాటి సరైన నిష్పత్తి ఎంత ఉండాలి? ప్రతి వ్యక్తి తన కేలరీ (శక్తి ను ఎలా లెక్కించుకోవాలి? ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్, ఫైబర్ (పీచు పదార్థం), ప్రోటీన్ మరియు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలి? అలాగే వాటిని సమతుల్యంగా తీసుకోవడానికి ఉపయోగకరమైన సూచనలు వివరించబడ్డాయి. యూకే వార్షిక సమావేశంలోని ముఖ్యాంశాలు. సమూహ సేవా కార్యక్రమాలు ఎలా మరింత విస్తృతంగా అభివృద్ధి చెందాయి. 93 సంవత్సరాల వయస్సు గల అంతిమ దశలో ఉన్న ఒక రోగికి వినూత్నమైన కాంబోలు ఉపయోగించి నొప్పి మరియు ఇన్‌ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగించిన సాయి వారి కృపను వివరిస్తున్న ఒక ఆసక్తికరమైన అనెక్డోట్ (స్ఫూర్తిదాయక సంఘటన). జీవితాంతం ఉత్సాహంగా, బహుముఖ ప్రజ్ఞతో సేవలందించిన 74 సంవత్సరాల అంకితభావం కలిగిన ఒక ప్రాక్టీషనర్‌కు అర్పించిన నివాళి ఉన్నాయి.
పూర్తి వ్యాసం చదవండి