Vol 14 సంచిక 6
నవంబర్ / డిసెంబర్ 2023
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
ఒక అద్భుతమైన శ్వేత శోభతో కూడి స్వర్గధామంలా భాశిస్తున్న పుట్టపర్తి లోని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్న ప్రతీసారి ప్రకృతి మాత పై స్వామికి ఉన్న ప్రేమ నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒక పాఠశాలగా, ఒక ప్రయోగశాలగా, ముక్తికి ప్రవేశద్వారంగా, మరియు భగవంతుని యొక్క అపార మహిమను ఆవిష్కరింపజేసే అద్భుత దృశ్యంగా గోచరించే ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోమని భగవంతుడు మనలను ఉద్భోదించారు. చెట్లు గురించి స్వామి చెప్పిన మాటలను నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను, “చెట్లు బతికి ఉన్నప్పుడు ఫలాలను ఇవ్వడమే కాకుండా వాటి నుండి ప్రాణం పోయిన తర్వాత కూడా తమ శరీరాన్ని వంటచెరుకుగా కూడా అందిస్తూ త్యాగానికి నిలువెత్తు సాక్ష్యంగా మనకు పాఠాలు నేర్పుతుంది. ప్రకృతి సంబంధిత బోధకులు
అందరిలో చెట్టు చాలా గొప్పది”- శ్రీ సత్య సాయి వాణి, సంపుటం 33 అధ్యాయం 17, 2000 సెప్టెంబర్ 29.
2025 భగవాన్ శతాబ్ది ఉత్సవాల నాటికి భూమాతను 10 మిలియన్ మొక్కలతో అలంకరించేందుకు సాయి గ్లోబల్ కౌన్సిల్ తో పాటు సెంట్రల్ ట్రస్ట్ వారు తీసుకున్న అద్భుతమైన చొరవ కంటే మన స్వామికి నివాళులు అర్పించడానికి మరింత సముచితమైన సేవ మరి ఏమి ఉన్నది? భక్తులందరూ ఈ కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్/యాప్ లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రోత్సహిస్తున్నారు. ఈ అవకాశము నుండి ప్రేరణ పొందిన అనేక మంది ప్రాక్టీషనర్లు సాయి వైబ్రియానిక్స్ సంరక్షణలో చెట్లను నాటడానికి మరియు పెంచడానికి కలిసి సాగుతున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమం లో ముందున్నందుకు ప్రాక్టీషనర్లు అందరినీ మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇతరులను కూడా చురుకుగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వైబ్రియానిక్స్ సంరక్షణలో నాటిన చెట్ల సంఖ్య పై అన్ని అభిప్రాయాలను మా రికార్డుల కోసం [email protected] కు పంపవలసిందిగా సూచన.
SVIRT ఏర్పడినప్పటి నుండి వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయడానికి దేశం నలుమూలల నుండి ప్రాక్టీషనర్లు క్రమం తప్పకుండా నిరంతరం సహకరిస్తున్నారని మీకు తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఈ వైబ్రో క్యాంపులలో పాల్గొన్న ప్రాక్టీషనర్లు మరియు ప్రాంతీయ సమన్వయకర్తల అందరి కృషి మరియు అంకిత భావాన్ని మేము గుర్తించాము. ఇది ఇతరులకు ఆన్లైన్ మరియు ప్రాంతీయ గ్లోబల్ వైబ్రానిక్స్ వనరులను సమీకరించుకోవడానికి సహకరించుకోవడానికి మరియు ట్యాప్ చేయడానికి అవకాశాల అన్వేషణకు తమ అభ్యాసాన్ని పెంచుకోవడానికి ఇతరులను ప్రేరేపిస్తుంది.
పైన పేర్కొన్న రెండు కార్యకలాపాలపై మరిన్ని వివరాల కోసం ఈ సంచికలోని అదనపు విభాగాన్ని చూడండి.
మూడు దశాబ్దాల వైబ్రియానిక్స్ అభ్యాసంలో అనేకమంది SVPలు SRHVP ద్వారా వివిధ వ్యాధులకు చికిత్స చేయడానికి వివిధ పదార్థాలను పోటెంటైజ్ చేయడంలో ప్రయోగాలు చేశారు. తరచుగా అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చాయి. అనేక సంవత్సరాలుగా అనుభవజ్ఞులైన SVP లు వివిధ వ్యాధులకు వారి చికిత్స విధానంలో భాగంగా వారి సొంత కాంబో లను కూడా రూపొందించారు. ప్రాక్టీషనర్ల నుండి లభ్యమైన అటువంటి విలువైన సమాచారం సహాయంతో మా పరిశోధనా బృందం 108CC లకు మార్పులు మరియు చేర్పులు చేయగలరు. అటువంటి అనుభవాలను ప్రాక్టీ షనర్లు [email protected] కు రాయడం ద్వారా వివరాలు పంచుకోవాలని కోరుతున్నాము. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, సూచనలు, మరియు కేసు చరిత్రలు, నిరంతరం అభివృద్ధి చెందుతున్న వైబ్రియానిక్స్ కు అత్యంత విలువైనవి మరియు ప్రశంసింపదగినవి.
మనము త్వరలోనే భారతీయుల దీపాల పండుగ దీపావళిని సమీపిస్తున్నాము. ఇది ఈ సంవత్సరం గ్లోబల్ అఖండ భజనకు చేరువులో ఉంది, స్వామి ఇలా అంటారు, “ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగిస్తే ఉన్నచోటనే అవి రెండు వెలుగుతూనే ఉంటాయి తప్ప మొదటి దీపం రెండవది తన కాంతిని ప్రసరింప చేయకుండా ఆపలేదు కదా, మీరు కూడా ఒక దీపం నుండి మిలియన్ కొద్దీ దీపాలను వెలిగించవచ్చు, అయినప్పటికీ మొదటి దీపం ఏ కొంచమైనా బేధాన్ని చూపదు. ప్రేమ కూడా ఇలానే ఉంటుంది. ఒక మిలియన్ జనులకు మీ ప్రేమను పంచండి, అయినప్పటికీ ఆ ప్రేమ ఏ మాత్రం తరగకుండా అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. దీపావళి మీకు కాంతి మరియు ప్రేమ పాఠాన్ని నేర్పడానికి ఉద్దేశింపబడింది, ప్రేమను గట్టిగా పట్టుకోండి పెంచండి, విస్తరించండి. ఈ అపరిమితమైన ప్రేమ ప్రవాహంలో నా మరియు నీ అతని మరియు వారి కులం మరియు మతం యొక్క పరిమితులను వదిలివేయండి ఇదే ఆధ్యాత్మిక సాధనకు పరాకాష్ట.” శ్రీ సత్యసాయి ప్రసంగాలు వాల్యూమ్ 10, అధ్యాయము 31, అక్టోబర్ 29, 1970.
అవివేకపు హింసొన్మాదం ప్రపంచంలోని అనేక ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నప్పుడు మరియు యుద్దం వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న సమయంలో ప్రపంచ శాంతి కోసం మనం కలిసి అఖండ భజనలో పాల్గొందాం. భజనలో స్వామి మహిమను పాడుతూ ప్రపంచంలోని నలుమూలలకు స్వామి తాలూకు స్వస్థత ప్రకంపనలను వ్యాపింపచేసేలా వారి కాంతికి దీప స్తంభాలుగా మన హృదయాల్లో వెలుగుతున్న ప్రేమ అనే దీపాన్ని మరింత ప్రకాశవంతముగా చేస్తూ ప్రేమను ప్రసరింప చేయాలని స్వామిని ప్రార్థిద్దాం.
ప్రేమతో సాయి సేవలో
జిత్ కె అగర్వాల్.
ఆలశ్యమైన శాశ్వత దంతాలు 03547...यूएसए
6½ ఏళ్ల బాలుడికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం క్రితమే అనగా 2022 మార్చిలో పాల దంతాలు రాలిపోయినప్పటికీ ఎగువ ముందు దంతాలు బయటపడలేదు. ఈ విషయంలో ఆందోళన చెందిన తల్లి (AVP) దంతాల ఖాళీ భాగంలో చిగుర్లు గట్టిపడి పోయినట్లు గుర్తించి వైద్య సలహా కోరారు. X రే రిపోర్ట్ ప్రకారం చిగుర్ల లోపల సెంట్రల్ ఇన్ సి సర్ పళ్ళు(పైకి పొడుచుకు రావడంలో ఆలశ్యం) ఉన్నట్లుగా వెల్లడించింది. డాక్టరు ఒక చిన్న శస్త్ర చికిత్సా విధానాన్ని సిఫారసు చేస్తూ గట్టిపడిన చిగుళ్ళను తెరవడానికి ఒక సంవత్సరం వరకు వేచి చూడవలసి రావచ్చు అనితెలిపారు. అందుచేత బాలుడు తల్లి సహాయం కోసం సీనియర్ ప్రాక్టీషనరును సంప్రదించారు. 2023 జూలై 14న బాలుడికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
NM12 Combination-12 + NM67 Calcium + NM89 Mouth and Gum + NM90 Nutrition + SM38 Teeth + SR254 Calc Phos…QDS
బాలుడు ఇతర మందులు ఏమి తీసుకోవడం లేదు. రెమిడీ తీసుకున్న కేవలం రెండు నుండి మూడు రోజుల్లో తల్లికి సంతోషం కలిగించే విధంగా ఎడమ వైపు చిగుళ్ల మధ్య కోత కనిపించింది. ఒక నెలలో అనగా ఆగస్టు 14 నాటికి కుడివైపు కోత కూడా కనిపించింది(చిత్రాలు చూడండి). దంతాలు మొత్తం పట్టిష్టతను నిర్ధారించడానికి తదుపరి రెండు నెలల పాటు రెమిడి కొనసాగించబడింది. ఆపివేయడానికి ముందు నెమ్మదిగా ODకి తగ్గించబడింది. దంతాలు విజయవంతంగా ఆవిర్భవించడంతో డాక్టర్ తో ఫాలోఅప్ అవసరం లేకుండా పోయింది.
108CC బాక్సు ఉపయోగిస్తుంటే : CC11.6 Tooth infections + CC12.2 Child tonic ఇవ్వాలి
మోకాలి నొప్పి 03547...यूएसए
61 ఏళ్ల మహిళ తన రెండు మోకాళ్లలో వాపు మరియు నొప్పితో 15 ఏళ్లుగా బాధపడుతున్నారు. గతంలో హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ చికిత్సలతో నొప్పి నయమైంది, అయితే ఋతు విరతి తరువాత గత ఐదేళ్లుగా మోకాళ్ళ నొప్పులు తిరిగి ఏర్పడ్డాయి. ఆమె తన ఇంటి పనులు చేసే సమయంలోనూ, మెట్లు ఎక్కడం లేదా నిలబడడానికి ప్రయత్నించటం వంటి చర్యలతో నొప్పి పెరుగుతుంది. ఆమె హోమ్ రెమెడీస్ తో పాటు హోమియోపతిని తీసుకుంటున్నారు కానీ పాక్షిక ఉపశమనం మాత్రమే ఉంది. 2013లో ఆమె యొక్క థైరాయిడ్ గ్రంధి తొలగించబడింది, ప్రతీరోజూ 88 mg థైరాగ్జిన్ ట్యాబ్లెట్ తీసుకునేవారు.
ఈ మందులన్నీ నిలిపివేసి వైబ్రియానిక్స ఎంచుకున్నారు. 2023 జులై 7న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC6.2 Hypothyroid + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.5 Spine…every 10 minutes రెండు గంటల వరకు అనంతరం TDS*
జూలై 23 నాటికి నొప్పి తగ్గి 70% మెరుగుపడింది. ఆమె రోజువారి పనులను స్వల్ప అసౌకర్యంతో చేసుకో గలుగుతున్నారు. ఆగస్టు13 నాటికి ఆమె 100% స్వస్థత పొంది ఎటువంటి నొప్పి లేకుండా అన్ని కార్యకలాపాల్లో పాల్గొనగలిగారు. అక్టోబర్ చివరి నాటికి ఆమె ఎటువంటి నొప్పి లేకపోయినా రెమిడీ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
* రెమిడీ ప్రారంభములో రెండు గంటల పాటు ప్రతి పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున తీసుకున్న తరువాత పేషంటు 6TD గా మోతాదు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు, కానీ ఆమె సౌకర్యం కోసం TDS గా కొనసాగించమని సలహా ఇవ్వబడింది.
మానసిక వ్యాకులత 03599 & 02726...यूएसए
58 ఏళ్ల మహిళ గత 12 సంవత్సరాలుగా మానసిక వ్యాకులతో బాధపడుతు అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స చేస్తున్న ప్రాక్టీషనర్ను సంప్రదించారు. రోగి తన చిన్ననాటి రోజుల్లో చాలా ఆత్మవిశ్వాసంతో సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేవారు కానీ ఆమె పెరిగికొద్ది ఆమె తన తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఇది ఆమె మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపి యుక్త వయసులో నిరాశకు దారితీసింది. ఏ పని పైన దృష్టి సారించలేకపోతూ క్రమంగా వివాహానంతరం జీవిత భాగస్వామితో విభేదాలకు కూడా దారితీసి చివరకు ఇద్దరు విడిపోవడం జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా అల్లోపతి మందులు వాడుతున్నారు కానీ పెద్దగా ఉపయోగం లేదు,
2022 సెప్టెంబర్ 23న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic...TDS
#2. IB…OD అల్లోపతి మందులు నిలిపివేశారు
అక్టోబర్ 7వ తేదీన ఆమె ప్రాక్టీషనరు ను తిరిగి సందర్శించిన సందర్భంలో ఆమె తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం వలన ఎక్కువ ఒత్తిడికి లోనై ఉన్నారు, కాబట్టి ప్రాక్టీషనర్ #1 ని 6TD గా నీటితో తీసుకోమని చెపుతూ క్రింది రెమిడి కూడా ఇచ్చారు: .
#3. CC17.2 Cleansing…TDS నీటితో ఇంటి లోపలా మరియు బయట చల్లుకోవడానికి అనంతరం అక్టోబర్ నెలలోనే ఆమె తల్లి గతించారు.
2022 నవంబర్ చివర్లో జరిగిన ఒక ఫాలోఅప్ సెషన్ లో ఆమె తన పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు అయితే గత కొన్ని వారాలుగా ఆమె శరీరం అంతా కండరాల తిమ్మిరి, మరియు సంకోచాలను కలిగి ఉంది కనుక #1 క్రింది విధంగా మెరుగుపరచబడింది:
#4. CC3.7 Circulation + #1...6TD నీటితో
2023 మార్చి నాటికి ఆమె మానసిక వ్యాకులత విషయంలో 60% మెరుగుదల ఏర్పడి, కండరాల తిమ్మిరి మరియు నొప్పుల విషయంలో 70% మెరుగుదల ఏర్పడింది. ఐతే ఆమెకు అజీర్ణం మరియు ఆమ్లత్వము కారణంగా కాలేయ పనితీరు స్వల్పంగా దెబ్బతినడంతో(బోర్డర్ లైన్ లో) దానిని గుర్తించిన డాక్టర్ అల్లోపతీ సూచించడంతో అది తీసుకోవడానికి ఇష్టపడనందున ప్రాక్టీషనరును అజీర్ణం మరియు ఆమ్లత్వానికి చికిత్సను అభ్యర్థించగా #4 క్రింది విధంగా మెరుగుపరచబడింది:
#5. CC4.10 Indigestion + CC4.11 Liver & Spleen + CC13.1 Kidney & Bladder tonic + #4...6TD నీటితో
ఏప్రిల్ 27 నాటికి ఆమె డిప్రెషన్, కండరాలు తిమ్మిరి, మరియు సంకోచాలలో 90% మెరుగుదల, అజీర్ణం, ఆమ్లత్వం విషయంలో 80% మెరుగుదల కనిపించింది. #5 ను TDS, కు తగ్గించడం, #2 ను ఆపివేయడం జరిగింది. #3 ను అప్పుడప్పుడు మాత్రమే ఆమె ఉపయోగిస్తున్నారు. మే 23 నాటికి ఆమెకు ఎటువంటి లక్షణాలు లేవు ఆమె బాగానే ఉందని తెలిపారు. 2023 సెప్టెంబర్ నాటికి ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది, ఇది ఆమెకు మరింత విశ్వాసాన్ని ఇవ్వడంతో #5 కొనసాగించాలని భావించారు.
ప్రేగు ప్రకోపం (ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ IBS) 02726...यूएसए
30 ఏళ్ల వ్యక్తి BMI రీడింగ్ 30 కలిగి ఉండి చిన్నప్పటి నుండి వారంలో ఒకటి లేదా రెండు సార్లు లూజ్ మోషన్ కలిగి ఉన్నారు. అతను మషాలాతో కూడిన ఆహారం ఏ కొంచెం తీసుకున్నా లూజ్ మోషన్ తో పాటు పొత్తికడుపు నొప్పితో కూడా బాధపడేవారు, తిరిగి అది అతని సాధారణ ఆహారంతో స్వయంగా పరిష్కరింపబడుతుంది. 2017లో కామెర్లు సోకి అలోపతి చికిత్సతో కోలుకున్నారు, అప్పటినుండి తేనుపు మరియు ఉబ్బిన పొత్తికడుపు అతనిని దాదాపు ప్రతిరోజూ ఇబ్బంది పెడుతున్నాయి. క్రమంగా అతనికి IBS ఉన్నట్లు గుర్తింప బడి దానికోసం గత కొన్ని నెలలుగా సూచించిన మందులను (ఫాంటాసిడ్ డి ఎస్ ఆర్ మరియు యూనిఎంజైమ్) తీసుకుంటున్నారు కానీ గుర్తించదగిన మెరుగుదల లేనందున వాటిని నిలిపివేశారు. తన ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా తన పరిస్థితిని మైంటైన్ చేయగలుగుతున్నారు.
ఒక పేషెంట్ విషయంలో విజయవంతమైన ఫలితాలు చూసిన తర్వాత అతనికి వైబ్రియానిక్స్ వ్యవస్థపై విశ్వాసం పెరిగి 2023 మార్చి 3వ తేదీన ప్రాక్టీషనర్ను సంప్రదించగా క్రింది రెమిడీలు ఇచ్చారు:
అజీర్ణ సమస్యలకు :
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10
Indigestion…6TD
సాధారణ ఆరోగ్యానికి :
#2. IB*…OD
మానసిక ఆరోగ్యానికి :
#3. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…TDS
రెండు రోజుల్లో అతని లక్షణాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించి, ఆ తర్వాత రెండు వారాల్లో అనారోగ్య సమస్యలు పూర్తిగా పరిష్కరింపడ్డాయి. తను మానసికంగా మరియు శారీరకంగా మెరుగ్గా ఉన్నారు కాబట్టి #1 రెండు వారాల పాటు TDS కు తగ్గించబడింది, మరియు రోగి ఏప్రిల్ 8న అన్ని రెమిడీలను నిలిపివేయాలని భావించారు. 2023 సెప్టెంబర్ 8 నాటికి అతను రోగ లక్షణాలలో ఎటువంటి పునరావృతం లేకుండా సంతోషంగా మరియు ఆరోగ్యంగా కొనసాగుతున్నారు!
*IB combo వార్తా లేఖ సంచిక 13 #5 ప్రకారం
ఋతు రక్త స్రావం 02726...यूएसए
45 ఏళ్ల వంట మనిషి ఆరు నెలలకు పైగా బాధాకరమైన మరియు భారీ ఋతు రక్తస్రావమును నెలలో 10 నుండి 12 రోజులు పాటు ఎదుర్కొంటున్నారు. 2022 అక్టోబర్ మొదటి వారంలో డాక్టర్ ఆమెకు కొన్ని మందులు ఇచ్చారు కానీ అవి సహాయం చేయలేదు. డాక్టర్ ఆమె యొక్క స్కానింగ్ రిపోర్ట్లు నార్మల్ గా ఉన్నాయని గుర్తించి గర్భాశయాన్ని తొలగించాలని(హిస్టరెక్టమీ) సూచించారు. యజమాని ఆమెను 2022 అక్టోబర్ 31న ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని రాగా ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC8.4 Ovaries & Uterus + CC8.6 Menopause + CC8.7 Menses frequent + CC10.1 Emergencies + CC12.1 Adult tonic+ CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…6TD
#2. IB*…OD
మూడు నెలల తర్వాత 2023 జనవరి 28 న ఆమె నొప్పితో పాటు రక్తస్రావం నుండి 80% ఉపశమనాన్ని పొందారు. #1 TDS కు తగ్గించబడింది. మార్చి 31 నాటికి ఆమె ఋతుస్రావం 3-4 రోజులకు దాదాపు నొప్పి లేకుండా సాధారణ స్థితికి చేరుకుంది. 2023 సెప్టెంబరు లో ప్రాక్టీషనర్ను సంప్రదించినప్పుడు ఆమెకు సాధారణ ఋతుక్రమం కొనసాగుతున్నందు వలన ఆమె రెమెడీలను నిలిపివేశారు.
*IB combo వార్తాలేఖ సంచిక 12 #2 ప్రకారం.
చర్మము పై దురద 11652...भारत
దుర్బలంగా ఉండే 76 ఏళ్ల మహిళ తన బాల్యం నుండి ఆస్త్మాతో బాధపడుతున్నారు, అది ఆయుర్వేద చికిత్సతో నయమైంది కానీ 12 ఏళ్ల వయసులో ఆమె మెడ, గజ్జలు, మరియు చీలమండలపై దురద వచ్చింది. దురద పగటిపూట మాత్రమే తీవ్రంగా ఉంటుంది కానీ నిద్రలో ఉండేది కాదు. సాధారణంగా మొటిమలు కోసం ఉపయోగించే నిక్సోడర్మ్ క్రీమ్ ను ఆమె సంవత్సరాల తరబడి ఉపయోగించారు కానీ స్వల్ప ఉపశమనం మాత్రమే కలిగించింది. 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె వైద్యుని సలహాపై బెట్నవేట్ క్రీమ్ మరియు మాయిశ్చరైజర్ ఉపయోగించారు ఇవి బాగా పనిచేశాయి కానీ స్వల్పకాలికమైన ఉపశమనాన్ని మాత్రమే అందించాయి. 2021 వరకు ఐదు దశాబ్దాలకు పైగా ఆమె తన పరిస్థితిని ఇదేవిధంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అనంతరం దురద చాలా తీవ్రంగా మారి అది గోకడంతో గాయాలకు దారితీసింది. గత రెండు చెడు అనుభవాల కారణంగా వైద్యసహాయం తీసుకోవడానికి ఇష్టపడక 2023 లో ఆమె ప్రాక్టీషనర్ ని సంప్రదించి రెండు నెలలకు పైగా గృహ వైద్య చికిత్స తీసుకున్నారు కానీ అది పాక్షిక ఉపశమనాన్ని ఇచ్చింది, కాబట్టి ఆమె వెంటనే బెట్నవేట్ క్రీమును ODగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే సమయంలో ఆమె కుమార్తె AVP గా అర్హత సాధించారు. 2023 మే 26న క్రింది రెమిడి ఇచ్చారు:
#1. CC21.3 Skin allergies + CC21.6 Eczema…BD శుద్ధ కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం
#2. CC12.1 Adult tonic + #1…TDS
బెట్నవేట్ క్క్రీమును ఉపయోగించడం మానేశారు, మెడలో గొలుసులు ధరించవద్దని ఆమెకు సలహా ఇవ్వబడింది. జూన్ 15 నాటికి మూడు వారాల్లో ఆమె అద్భుతమైన 80% ఉపశమనం పొందారు. మరియు జూన్ 30 నాటికి దురద మాయమైంది. #1 ఆపి వేయబడింది #2 సెప్టెంబర్ చివరి వారంలో ఆపడానికి ముందు ఆగస్టు 26నాటికి క్రమంగా OW కి తగ్గించబడింది.
2023 అక్టోబర్ నాటికి64 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టిన సమస్య ఎటువంటి పునరావృతం లేకుండా తగ్గిపోయింది.
పార్శ్వపు నొప్పి 11647...भारत
41 ఏళ్ల గృహిణి 2019 జనవరి నుండి నాలుగు సంవత్సరాలుగా తల ముందు మరియు వెనుక భాగంలో తరచుగా తలనొప్పితో బాధపడ్డారు. సూర్యరశ్మి కి గురికావడం, తలస్నానం లేదా ఒత్తిడి గురైన సందర్భంలో వారానికి కనీసం మూడుసార్లు ఈ నొప్పులు సంభవించేవి. ప్రతీసారి ఈ ఇబ్బంది ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరమయ్యేది. ఇది ఆమె దినచర్యకు భంగం కలిగించడమే కాకుండా ఆమె కుటుంబాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఆమెకు చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో తాత్కాలిక ఉపశమనం కోసం ఓవర్ ది కౌంటర్ (OTC) మందులను ఆశ్రయించారు. పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె టీచర్ ప్రాక్టీషనర్ అని తెలుసుకున్నప్పుడు 2022 డిసెంబర్ 29 న అతనిని సంప్రదించారు. ఆ సమయంలో ఆమెకు జ్వరంతో ముక్కు కారడం కూడా ఉంది ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC11.3 Headaches…6TD
నాలుగు రోజుల తర్వాత ఆమె ముక్కు కారడం మరియు జ్వరం నుండి 100% ఉపశమనం పొందారు. ఆమె తన సాధారణ OTC తలనొప్పి మందు తీసుకోవడం కొనసాగించారు. 2023 ఫిబ్రవరి 25 న ఆమె తదుపరి సందర్శనములో ఆమె తలనొప్పిలో ఎటువంటి మెరుగుదల కనిపించక పోవడంతో తదుపరి విచారణలో ప్రాక్టీషనర్ ఆమె పరిస్థితి మైగ్రేన్ అని గ్రహించారు. కాబట్టి #1 క్రింది విధంగా మార్చబడింది:
#2. CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic…every 10 minutes రెండు గంటల వరకు అనంతరం 6TD
ఆ తరువాత వారంలో ఆమెకు 2-3 గంటల పాటు ఒకసారి మాత్రమే నొప్పి రావడం అది కూడా క్రితం రోజుపూర్తిగా విహారయాత్రలో గడపవలసి వచ్చిన కారణం గా గణనీయమైన మెరుగుదల కనిపించింది. మరియు ఆమెకు ఎలాంటి OTC మందులు అవసర పడలేదు.
మే 10 నాటికి సూర్య రశ్మి కి గురి కావడం లేదా తలస్నానము చేసినా కూడా తలనొప్పి రావడం లేదు కానీ ఒత్తిడి వలన తలనొప్పి ఏర్పడి ఒక గంట మాత్రమే ఉంటోంది. పేషంటు 90% మెరుగుదలగా ఈ మార్పును గుర్తించారు. జూన్ 15న, #2 TDS కి తగ్గించబడింది. ఆ రోజు ఆమెకు స్వల్పముగా తలనొప్పి వచ్చింది. ఆమెకు అదే చివరి తలనొప్పి కావడంతో జూలై 18 నాటికి OD నిర్వహణ మోతాదుగా తీసుకో సాగారు.
అక్టోబర్ 26 నాటికి ఆమె ఎటువంటి తలనొప్పి లేకుండా #2 ను సంతోషంగా కొనసాగిస్తున్నారు.
కంటి శుక్లం 11632...भारत
2020 మధ్య కాలం నుండి 61 ఏళ్ల మహిళ దృష్టిలో సమస్యతో బాధపడుతున్నారు. మూడు గంటలకు పైగా చదివిన తర్వాత ఆమె దృష్టి ముఖ్యంగా ఎడమ కన్ను మసకబారుతూ ఉంటుంది. ఐదు నిమిషాల రెస్ట్ తీసుకుని కళ్ళు కడుక్కుంటే కొంతసేపటికి మసక మాయమవుతున్నది. 2022 జులై 16న ఆమె పరిస్థితి మరీ అధ్వానంగా మారడంతో ఆమె నేత్ర వైద్య నిపుణుడిని సంప్రదించారు. వారు దానిని కంటి శుక్లమని నిర్ధారించి మూడు నెలల్లో శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. 2022 సెప్టెంబర్ 5 నాటికి మసక బారడం మరింత పెరిగింది. ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న కారణంగా ఆమెకు కళ్ళలో నొప్పి కూడా మొదలైంది.
2022 సెప్టెంబర్ 12న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC7.2 Partial Vision…BD డిస్టిల్డ్ వాటర్ లో ఐ డ్రాప్స్ గా
#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + #1...ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకు తదుపరి 6TD
అక్టోబర్ 20 నాటికి కంటి మసకలో 50% మెరుగుదల, మరియు నొప్పుల విషయంలో 20 % అలాగే నవంబర్ 29 నాటికి ఇవి వరుసగా 75% మరియు 30% మెరుగుదల చూపాయి. నొప్పి విషయంలో మెరుగుదల నెమ్మదిగా కనిపించడంతో #2 కింది విధంగా మెరుగుపరచబడింది:
#3. CC18.5 Neuralgia + #2...TDS
2023 జనవరి 2 నాటికి పైన పేర్కొన్న గణంకాల వరుసగా 100% మరియు 75% నమోదవగా జనవరి చివరి నాటికి నొప్పి మాయమైంది. జనవరి 27 నాటికి ఆమెకు కంటి శుక్లం లేదని అందువల్ల శస్త్ర చికిత్స అవసరం లేదని ఆమె నేత్ర వైద్యుడు ధ్రువీకరించారు. #3 యొక్క మోతాదు BD కి తగ్గించ బడింది.
2023అక్టోబర్ 26 నాటికి ఆమె కంప్యూటర్ లో ఎక్కువ సేపు ఆన్లైన్ క్లాసులు వినవలసి వస్తోంది కనుక #1 మరియు #3 కొన సాగించడానికి సుముఖత చూపారు.
పేషంటు వాంగ్మూలము: తెలుగులో ఆమె ఒరిజినల్ ఆడియో క్లిప్పింగ్ మా వెబ్సైట్లో ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ తో పాటు అందుబాటులో ఉంది
శిశువులో విస్తరించిన అడినాయిడ్లు 03511...यूके
2023 జనవరి 16 న శిశువులో 15 నెలల శిశువు 7 నెలలుగా నిరంతరాయంగా ముక్కు కారడంతో బాధపడుతున్నది. రాత్రిసమయంలో ముక్కు మూసుకుపోతు అది ఆమె నిద్రకు భంగం కలిగిస్తున్నది. రెండు నెలల తర్వాత ఆమెకు విస్తరించిన ఆడినాయిడ్స్ (ముక్కు మరియు గొంతు వెనక శ్వాసరస కణజాలం) ఉన్నట్లు నిర్ధారణ చేసి కాల్ పోల్ మరియు మల్టీ విటమిన్ సిరప్ సూచించబడింది. ఇవి ఆమెకు తాత్కాలిక ప్రయోజనం మాత్రమే చేకూర్చి కడుపునొప్పి, గట్టి మలం, మరియు వాంతులు వంటి దుష్ప్రభావాలకు కారణమయ్యాయి. మందు వల్ల మేలు కంటే కీడే ఎక్కువ అనిపించి మూడు నెలల తర్వాత ఆపేశారు. పాప విరామం లేకుండా బాధ అనుభవిస్తూ ఏడుస్తూ నర్సరీకి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. కాలేజీలో సహచరిగా ఉన్న వ్యక్తి ద్వారా పాప తల్లి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని దాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.
2023 జనవరి 16న పాప కు క్రింది రెమిడీ ఇవ్వ బడింది:
CC19.5 Sinusitis…6TD రెండు రోజుల వరకు తదనంతరం TDS
ఒక వారంలో శిశువు ముక్కు కారడం నుండి 75% ఉపశమనం పొందింది, మరియు ఆమె నిద్ర మెరుగుపరచబడింది. మరొక వారం తర్వాత లక్షణాలు అన్నీ అదృశ్యం అయ్యాయి; ఆ తర్వాత ఆమె గాఢ నిద్ర అనుభవిస్తూ తన ఉల్లాసపరితమైన స్వభావానికి తిరిగి వచ్చింది. రెమిడి ఆపడానికి ముందు మరో మూడు వారాలపాటు కొనసాగించబడింది.
2025 సెప్టెంబర్ 23 నాటికి శిశువు లక్షణాల్లో ఎటువంటి పునరావృతం లేకుండా ఆరోగ్యంగా ఉంది
తామర 11618...भारत
60 ఏళ్ల మహిళ తన కుడికాలి చీలమండ లోపలి భాగంలో చీము రక్తము స్రవిస్తున్నదాదాపు 10 cm x 5 cm నల్లని మచ్చతో వచ్చారు (1 వ ఫోటో చూడండి). ఆమె 18 ఏళ్ల వయసులో చిన్న మచ్చగా ఏర్పడి క్రమంగా అభివృద్ధి చెంది 30 సంవత్సరాల వయసు నాటికి దుర్భరంగా తయారయ్యింది. వైద్యుడు దాన్ని తామరగా గుర్తించి నోటి ద్వారా తీసుకునే మందులతో పాటు ఆయింట్మెంటును సూచించారు. చలికాలం మరియు వర్షాకాలంలో మచ్చ పెద్దగా మారి చెమట వలన దురద పెరిగి పగుళ్లు అభివృద్ధి అయ్యి రక్తం కారుతూ చికాకు కలిగిస్తుంది. అప్పుడు మాత్రమే వైద్యుడు సూచించిన మందులను కొనసాగిస్తూ ఉండడంతో మంట ఒక వారంలో తగ్గిపోతుంది కానీ పునరావృతం అవుతూ ఉంటుంది. అందుకే ఆమె 2 సంవత్సరాల తర్వాత ఆలోపతిని ఆపివేశారు. ఆ తర్వాత ఆమె ఒక సంవత్సరం పాటు ఆయుర్వేదం తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది అనంతరం ఆమె కొన్ని ఇంటి నివారణలతోపాటు మళ్లీ అయింట్ మెంట్ ను ఆశ్రయించారు ఇది 25% ఉపశమనం ఇచ్చింది. ఆమె 2020 జూలై 20 నాటికి ప్రాక్టీషనర్ ను సంప్రదించే వరకు తన పరిస్థితిని ఆ విధంగా కొనసాగించారు. ఆమెకు గత పది సంవత్సరాలుగా మధుమేహం కూడా ఉంది ఇది ఇన్సులిన్తో నియంత్రణలో ఉంటున్నది కనుక ఆమె తామరకు మాత్రము చికిత్సను కోరుకున్నారు, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC21.3 Skin allergies + CC21.5 Dry Sores + CC21.6 Eczema + CC21.11 Wounds & Abrasions…TDS మౌఖికంగా మరియు నువ్వుల నునె తో బాహ్య అనువర్తనానికి BD సెప్టెంబర్ 30 నాటికి దురద మరియు చీము మరియు రక్తం కారడం 30% తగ్గింది. ఆమె అల్లోపతి ఆయింట్మెంట్ను తోపాటు నోటి ద్వారా తీసుకునే మందు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రాక్టీషనర్ వేగవంతమైన ఉపశమనం కోసం బాహ్య అనువర్తనం కోసం రెమిడి వాడమని దాని ప్రయోజనాలను చెప్పారు. డిసెంబర్ 30 నాటికి ఆమె లక్షణాలు అన్నిట్లో 40% మెరుగుదల కనిపించింది. మచ్చ యొక్క ఆకృతి మరియు రంగులో కూడా మెరుగుదల కనిపించింది ఆ తర్వాత రోగి చాలా నెలల వరకు ప్రాక్టీషనర్ తో ఉత్తర ప్రత్యుత్తరాల సంబంధం కోల్పోయి అనంతరం 2021 జులై 17 నాటికి ఆమె గణనీయమైన మెరుగుదలను ఆనందంతో నివేదిస్తూ దురదలో 80%, పగుళ్లు 70%, చెమట మరియు చిరాకులో 60% వరకు మెరుగుదల కనిపిందని తెలిపారు. వాతావరణ మార్పులతో వచ్చే పెరుగుదల కూడా అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా స్వల్పంగానే ఉంది. ఆమె అప్పుడప్పుడు అల్బీట్ రెమిడీ బాహ్య అనువర్తనం కోసం అయింట్ మెంట్ తో పాటు ఉపయోగించడం ప్రారంభించారు. మూడు నెలల క్రితమే తన అరికాళ్ళలో నొప్పి మంట మొదలైందని ఆమె పేర్కొనడం వలన #1 క్రింది విధంగా మెరుగుపరచబడింది :
#2. CC3.7 Circulation + #1…మోతాదు గతంలో వలనే
నవంబర్ 3 నాటికి మంట తక్కువ కాగా అరికాళ్ళలో నొప్పి మరియు మంట కూడా తగ్గింది. అయినప్పటికీ ఆమె కఠినమైన మరియు దురదతో కూడిన చర్మంతో బాధపడుతున్నారు కనుక #2 క్రింది విధంగా మెరుగుపరచబడింది:
#3. CC21.10 Psoriasis + #2…మోతాదు గతలో వలనే
మందులు వాడుతున్నప్పుడు మందులు వాడిన తరువాత
2022 జూన్ 17 నాటికి దురద మరియు అన్ని ఇతర లక్షణాల్లో 90% మెరుగుదల ఉన్నందున ఆమె అల్లోపతి ఆయింట్మెంట్ నిలిపివేశారు. 2022 సెప్టెంబర్ 19 నాటికి ఆమె జీవితకాల రోగ లక్షణాలన్నీ మాయమయ్యాయి. బాహ్య అనువర్తనం లేకుండా #3, BD కి తగ్గించబడింది. తదుపరి మూడు నెలల్లో నిర్వహణ కోసం తీసుకోవాల్సిన OW మోతాదుకి తగ్గించబడింది
ఒక సంవత్సరం తర్వాత 2023 సెప్టెంబర్ 25 నాటికి రోగికి పునరావృతం లేదా ఎటువంటి మంటలు లేవని నిర్ధారించబడింది.

During treatment After treatment
జీర్ణ కోశ రుగ్మత 11639...भारत
61 ఏళ్ల మహిళ 2020 నుండి రోజు యాసిడ్ రిఫ్లెక్స్ మరియు త్రేనుపు కారణంగా తేలికపాటి మంటను ఎదుర్కొంటున్నారు. ఆమెకు ప్రతీరోజు సాధారణ మలవిసర్జన లో ఇబ్బందిలేనప్పటికీ సగటున వారానికి ఒకసారి గట్టి మల విసర్జన జరుగుతోంది. ఈ లక్షణాలు మషాలా తో కూడిన ఆహారం లేదా భోజన సమయంలో స్వల్ప మార్పుతో మరింత పెరుగుతున్నాయి. 2021 లో క్యాన్సర్ తో మరణించేవరకు అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసుకోవడంతో ఆమె 2019 నుండి నిరంతరం ఒత్తిడికి లోనయ్యారు. ఇది ఆమె ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసింది. అలోపతి మందులు ఆమె ఎంపిక చేసుకోలేదు.
ఏదైనా చికిత్స మరియు ట్రిగ్గర్లను తగ్గించడం ద్వారా ఆమె పరిస్థితిని మెయింటైన్ చేసుకుంటున్నారు కానీ ఆమె తన ఆరోగ్యం గురించి నిరంతరం ఆందోళన చెందుతూ శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.
2022 జూన్ లో రోగి ఆధ్యాత్మిక శిబిరంలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందు ఆమె చాలా ఆందోళన చెందినప్పుడు వైబ్రియానిక్స్ యొక్క శక్తిని అనుభవించారు. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న ప్రాక్టీషనర్ ఆమెకు CC10.1 Emergencies ఇవ్వగా ఐదు నిమిషాల్లో ఆమె ఆందోళన మాయమై ఆమె శక్తివంతంగా ఉన్నట్లు అనుభూతి చెంది చాలా సులభంగా మరియు విశ్వాసంతో తన అంశాన్ని ప్రెజెంట్ చేసారు. ఆమె మ్యాజికల్ పిల్స్ అని పిలిచే ఈ రెమిడీలకు ప్రాక్టీషనర్ కు కృతజ్ఞతలు తెలిపి తన జీర్ణ సమస్యలకు చికిత్స కోరారు.
2022 జూన్ 28న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది;
CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS
జూలై 30 నాటికి ఆమె అన్ని లక్షణాలు ఉండి 50% ఉపశమనం పొందారు, ఇది ఆగస్టు 10 నాటికి 90% కి పెరిగింది కాబట్టి మోతాదు BDకి తగ్గించబడింది. ఆగస్టు 18న ఆమె 100% మెరుగుదలను నివేదించారు. ఆగస్టు 31న ఆపివేయడానికి ముందు మోతాదు ODకి తగ్గించబడింది.
2023 సెప్టెంబర్ నాటికి ఆమె బాగానే ఉన్నారు, ఎటువంటి సమస్య లేకుండా స్పైసీ ఫుడ్ కూడా ఆస్వాదించగలుగుతున్నారు.
హెర్పెస్ వ్యాధి మరియు పోస్ట్ కోవిడ్ ఫలితాలు 11648...भारत
39 ఏళ్ల మహిళకు సమస్యలు 2006లో, తన 24 సంవత్సరాల వయసులో భర్త వేధింపులు మరియు బాధాకరమైన వివాహం కారణంగా ఒత్తిడితో ప్రారంభమయ్యాయి. ఆమె బరువు 2006 లో 65 కేజీల వద్ద స్థిరంగా ఉంది కానీ రెండేళ్లలో 85 కేజీలకు చేరుకుంది. బహుశా డిప్రెషన్ కారణంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో నిరంతరం బరువు పెరిగి 2021 లో ఆమె 115 కిలోలకు చేరుకుంది. 2014లో ఆమె జీవిత భాగస్వామి నుండి పెదవులపై హెర్పస్ వ్యాధి సోకి అది 2016 డిసెంబర్ నాటికి ఆమె జననాంగాలకు కూడా సోకింది. ఆమె యోని చుట్టూ 10 మిల్లీ మీటర్ల వెడల్పు గల బాధాకరమైన మూడు బొబ్బలు యోని లోపల మూడు ఉన్నాయి. ఆమెకు నోటి ద్వారా తీసుకునే మందులతో పాటు ఒక లేపనం కూడా సూచింపబడింది మరియు ఆమె యోనిని తరచుగా తుడుస్తూ పొడిగా ఉంచుకోవాలని కూడా సలహా ఇవ్వబడింది. బాహ్య అనువర్తనం కోసం వాడే మెడిసిన్ సహాయం చేయకపోవడంతో ఆమె ఒక నెల తర్వాత దానిని నిలిపివేసారు. ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు చీలిక ఏర్పడి రక్తం కారుతోంది. అధిక వత్తిడితో ఉన్నప్పుడు ముఖ్యంగా ఋతుస్రావ సమయంలో ఈ బొబ్బలు దురదగా మరియు చాలా బాధాకరంగా మారి దాదాపు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి ఉదంతాల సమయంలో ఆమె చాలా సమయం తను చేస్తున్న పనికి విరామం ఇవ్వాల్సి వచ్చేది. ఈ ఒక్కొక్క ఉదంతం 10 నుండి 15 రోజులపాటు నెలకు రెండు సార్లు ఏర్పడుతుంది. ఆమె లేపనాన్ని తన ఏకైక ఆశ్రయంగా ఉపయోగించ సాగింది ఐతే అది కేవలం 50% ఉపశమనం మాత్రమే అందిస్తోంది.
ఆమె బాధలు మరింత పెంచడానికి 2021 మే నెలలో కోవిడ్ (డెల్టా) వచ్చింది. దీని వలన బలమైన స్టెరాయిడ్స్ మరియు యాంటీబయాటిక్స్ అవసరం అయ్యాయి దీని ఫలితంగా ఆమె చీలమండలు మరియు పాదాలలో ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు వాపు (నీరు నిలుపుదల) మరియు కళ్ళ కింద ఉబ్బడం తర్వాత ఇదే డిసెంబరు నాటికి నల్లటి వలయాలుగా మారాయి. కోవిడ్ అనంతర ప్రభావములు నిద్రకు భంగం కలిగించడం మరియు నిస్సత్తువ కలిగించాయి. ఆమె అధిక బరువు కారణంగా ఆమెకు మోకాళ్ళ నొప్పులు, 2022 మే నాటికి బోర్డర్ లైన్ డయాబెటిస్ మరియు 2022 జూన్ నాటికి ఫ్యాటీ లివర్ తో బాధపడటం ప్రారంభమైనది. ఆమె శారీరక శ్రమ ఏమాత్రం లేని నిశ్చల జీవనశైలిని కలిగి ఉన్నారు. ఆమె లేపనం తప్ప మరి ఏ మందు వాడలేదు.
2022 డిసెంబర్ 2న క్రింది రెమిడి ఇవ్వ బడింది:
పోస్ట్ కోవిడ్ ఫలితాలకు :
#1. IB Recuperation*…TDS
హెర్ప్స్ వ్యాధికి
#2. CC8.5 Vagina & Cervix + CC21.8 Herpes…BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం
మోకాళ్ళ నొప్పికి :
#3. CC20.2 SMJ pain…BD నువ్వుల నూనెలో బాహ్య అనువర్తనం కోసం
రోగిని భోజనానికి ముందు ముడి కూరగాయలను ప్రధానంగా సలాడ్లు తీసుకోమని ప్రాక్టీషనర్ సలహా ఇచ్చారు. డిసెంబర్ 12న అంటే పది రోజుల్లో రోగికి 20% మెరుగైన శక్తి స్థాయి ఉన్నట్లుగా తెలిపారు. వాపు 20% తగ్గింది నొప్పి మరియు పొక్కుల పరిమాణం 30% తగ్గింది. ఆమె ఒత్తిడి కూడా తగ్గింది. నాలుగు వారాల్లో చీలమండలు మరియు పాదాల్లో వాపు పోయింది హెర్పస్ నొప్పి మరియు ఒత్తిడి 70% తగ్గింది. మోకాలు నొప్పి 30% తగ్గి శక్తి స్థాయి 60% మెరుగుపడింది. 2023 ఫిబ్రవరి 1 నాటికి రెండు నెలల్లోనే ఆమె ఒత్తిడి మరియు దురద మరియు బాధాకరమైన బొబ్బలు కూడా మాయమయ్యాయి. ఆమె శక్తి స్థాయి సాధారణ స్థితికి చేరుకుంది. అంతేకాక బోనస్ గా గొంతులో వికారము, వాంతలు, మరియు కఫం వంటి కొన్ని ఇతర రుగ్మతలు కూడా పూర్తిగా తగ్గాయి. కళ్ళ కింద వాపు 90% నల్లటి వలయాలు 50% మోకాలు నొప్పి 60% తగ్గుముఖం పట్టాయి. నాటకీయ మెరుగుదలను అనుభవించిన తర్వాత ఆమె ఊబకాయం కోసం చికిత్స అభ్యర్థించారు. 2023 ఫిబ్రవరి 21న ఇది ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. #1 నుండి #3 వరకూ ఆమె కొనసాగిస్తున్నారు. ఐతే మే 10న ఆమె తన ప్రయాణాల కారణంగా ఒక నెలపాటు ఎటువంటి రెమెడీ తీసుకోలేదని దానివలన జననాంగాల్లో దురద మరియు నొప్పి తిరిగివచ్చినట్లు ప్రాక్టీషనర్ కు తెలియజేశారు. ప్రాక్టీషనర్ ఒక్క డోస్ కూడా మిస్ కాకుండా రెమెడీస్ కొనసాగించాలని ఆమెకు సూచించారు. జూన్ 14న తదుపరి సమీక్ష సందర్భంగా రోగ లక్షణాలన్నీ అదృశ్యమయ్యాయని తెలియజేశారు.
2023 అక్టోబర్ 26 నాటికి, ఆమె హెర్పెస్ లేదా పోస్ట్ కోవిడ్ లక్షణాల పునరావృతం ఏమీ లేకుండా రెమిడీలు కొనసాగిస్తున్నారు.
*2022 సెప్టెంబర్/అక్టోబర్ సంచిక 5 సంపుటి 13 ని చూడండి.
పేషంటు వాంగ్మూలం :
అసాధారణమైన పురాతన జ్ఞానం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క మూర్తీ భవించిన కలబోతగా తోస్తూ నా యొక్క వివిధ ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి నన్ను ప్రేరేపించిన ప్రాక్టీషనర్ కు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చికిత్సను, ఉపశమనాన్ని అందించే రెమిడీలు అద్భుతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రాక్టీషనర్ అందించె చికిత్సకు, వెల్నెస్ కు ఆమె అందించే అద్భుతమైన సంపూర్ణ విధానం తో కూడిన మద్దతు వలన ఆమె విలక్షణంగా నిలిచారు. ప్రాక్టీషనర్ భౌతిక లక్షణాలకు చికిత్స చేయడంపై మాత్రమే దృష్టి పెట్టకుండా మనసు, శరీరము, మరియు ఆత్మ మధ్య అంతర్గత సంబంధాన్ని గుర్తించడం విశేషం. ఆమె యొక్క విశేషమైన కౌన్సిలింగ్ ద్వారా నా సొంత అంతర్గత బలం మరియు శక్తి రిజర్వాయర్ లోకి నన్ను నేను ప్రవేశ పెట్టుకోవడానికి నాకు ప్రావీణ్యం కల్పించగా అది నా జీవితంలో సమతుల్యత మరియు సామరస్యం యొక్క కొత్త భావానికి దారితీసింది. ఆమె యొక్క స్థిరమైన మార్గ దర్శకత్వం స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి సరళత్వం మరియు దైవ కృప తో జీవిత సవాళ్లను అధిగమించడానికి నన్ను ప్రేరేపించింది. నేను ఇప్పుడు ఎక్కువ శక్తిని అంతర్గత శాంతిని మరియు నా కళలను వ్యక్తీకరించే మెరుగైన సామర్థ్యాన్ని అనుభవిస్తున్నాను.
అసాధారణమైన ఔషధ పరిష్కారాలు మరియు సంపూర్ణ మార్గదర్శకత్వం కోసం నేను వైబ్రియానిక్స్ ను సిఫార్సు చేస్తున్నాను.
ప్రాక్టీషనర్ల వివరాలు 03547...USA
ప్రాక్టీషనర్ 03547....USA, అమెరికా లోని న్యూ జెర్సీ కి చెందిన ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ వాణిజ్య మరియు మిశ్రమ భవనాల రూపకల్పన పై పనిచేస్తున్నారు. 12 ఏళ్ల చిన్న వయసులోనే బాలవికాస్ కార్యక్రమాల ద్వారా స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు.
సంగీత ఉపాధ్యాయులైన వీరి యొక్క బాలవికాస్ గురువు వీరిని సేవా కార్యక్రమాలకు తీసుకువెళ్లడం, మానవతా విలువల కథ, ఇతివృత్తాలతో కూడిన నాటకాలలో పాల్గొనేటట్లు చేయడం మరియు స్వామి జీవితంలోని సంఘటనలను కదా కథనం ద్వారా వివరించడం ద్వారా స్వామి పట్ల అతని భక్తిని పెంపొందించడంలో అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ సమయంలో వీరికి సలహాదారుగా ఉన్న వ్యక్తి భగవాన్ బాబా వారి చిరకాల భక్తులు కావడంతో వీరి వృత్తిపరమైన జీవితాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రాక్టీషనర్ తన సమితిలో నారాయణ సేవతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇతను తన జీవితంలో అడుగడుగునా స్వామి యొక్క అదృశ్య మార్గదర్శక హస్తాన్ని గుర్తించసాగారు. యూఎస్ఏ కి వెళ్లిన తర్వాత అతను తన స్థానిక సాయి సెంటర్లో సూప్ కిచెన్ సేవలో పాల్గొంటూ అధ్యయన మండలులను కూడా సమన్వయం చేసేవారు.
2016 మార్చిలో యూఎస్ కెనడా కోఆర్డినేటర్ యొక్క సోల్జర్న్స్ ఇంటర్నెట్ ఎపిసోడ్ ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి మొదటిసారి విన్నారు. ఆ తర్వాత శ్రీమతి మరియు శ్రీ అగర్వాల్ గారి ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు వైబ్రియానిక్స్ భవిష్యత్ ఔషధం అన్న స్వామి మాటలు వీరిలో లోతుగా ప్రతిధ్వనించాయి. అంతేగాక క్యాన్సర్ మరియు అల్జీమీర్స్ వంటి నయం చేయలేని పరిస్థితులతో బాధపడుతున్న రోగుల్లో మెరుగుదలను చూసినప్పుడు, అంతేకాక తన కుటుంబ సభ్యుల విషయంలోనే 53 సంవత్సరాల వయసులో ఉన్న అతని తల్లి పార్కిన్సన్స్ వ్యాధితో ఏడు సంవత్సరాలుగా బాధపడుతు ఈ మందుల ద్వారా తగ్గటంతో ప్రాక్టీషనర్ కావాలనే ప్రేరణ రేకెత్తింది. అతను 2016 జూలైలో AVP అయ్యారు మరియు 2022 జులైలో SVP అయ్యారు. ప్రస్తుతం అతను వైబ్రియానిక్స్ అడ్మిషన్స్ టీం, బ్రాడ్కాస్టింగ్ టీం, నెట్వర్క్ టీం మరియు AVP ల e కోర్స్ టీచర్లతో కూడా పనిచేస్తున్నారు.
తన మూడవ త్రైమాసికంలో గర్భధారణ మధుమేహాన్ని అభివృద్ధి చేసిన 38 ఏళ్ల గర్భిణీ స్త్రీ యొక్క అద్భుతమైన కేసును ప్రాక్టీషనర్ వివరిస్తున్నారు. ఆమె నూచల్ ట్రాన్స్లుఎన్సీ (NT)అనే అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకున్నారు. ఇది శిశువు మెడ వెనక ఉన్న ద్రవము మొత్తాన్ని కొలుస్తుంది. ఆమె విషయంలో NT రీడింగ్ 6.5mm అయితే ఇది గర్భధారణ దశలో సాధారణ 3.5mm కంటే ఎక్కువ. అధికంగా ఉన్న ద్రవం పిండములో మెదడును దెబ్బతీసే అవకాశాన్ని సూచిస్తుంది, కాబట్టి ఆమె చాలా ఆందోళన చెందింది 2019 మే 2న ప్రాక్టీషనర్ ఆమెకు CC6.3 Diabetes + CC8.2 Pregnancy tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities ఇచ్చారు. రెండు వారాల తర్వాత చేసిన ఎమ్మారై స్కానింగ్ లో ద్రవంస్థాయి సాధారణీకరించబడిందని నిర్ధారణ అయింది, ఆమె రెమెడీ తీసుకోవడం కొనసాగించారు, మరియు పూర్తి కాలం తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించారు.
కోవిడ్ ప్రబలంగా ఉన్న రోజులలో IB తీసుకుంటున్నరోగులు నాలుగు నుండి ఐదు రోజుల్లో వైరస్ నుండి కోలుకోవడం గమనించి స్వామి వాణి “ నేను ఇక్కడే ఉండగా భయమెందుకు” అనే మాటలు అతని మనసులో నిరంతరం ప్రతిధ్వనించేవి. కోవిడ్ రీకూపరేషన్ రెమెడీతో రోగులు వారి శ్వాసకోశ, రక్త ప్రసరణ మరియు జీర్ణవ్యవస్థలకు కలిగే నష్టాల నుండి కోలుకోవడం చూసి వారు స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలిపేవారు.
అతను ప్రమాదవశాత్తు ఐవీ ఆకుల మొక్క యొక్క సంపర్కానికి గురైనప్పుడు వాటి ఆకులను బ్రాడ్కాస్టింగ్ చేయడం ద్వారా అతని లక్షణాలు రెండు మూడు రోజుల్లో అదృశ్యమైనట్టు కనుగొన్నారు. వాల్యూం 13 సంచిక 5 సంపుటి 6 లో చూడండి. బ్లడ్ నోసోడ్ ద్వారా థైరాయిడ్ పనితీరులో వచ్చిన అద్భుతమైన మెరుగుదల గురించి తన స్వీయ అనుభవాన్ని ఉటంకిస్తున్నారు. 2014లో అతనికి హైపోథైరాయిడిజం ఉన్నట్టు నిర్ధారణ అయింది, అల్లోపతి వైద్యం ఏమాత్రం సహాయం చేయలేదు. ఆగస్టు 4న ప్రాక్టీషనర్ బ్లడ్ నోసోడ్ తీసుకోవడం ప్రారంభించారు. 2021 డిసెంబర్లో వార్షిక తనిఖీ లో అతనిTSH 7.55 mU/l (సాధారణ స్థాయి: 0.5 నుండి 4.5) మరియు D విటమిన్ స్థాయి 24 ng/ml (సాధారణ స్థాయి : 30+), 2022 డిసెంబర్లో ల్యాబ్ పరీక్షలు అతని TSH స్థాయి 5.5 కి చేరినట్లు చూపాయి, అంతేకాక బ్లడ్ నోసోడ్ D విటమిన్ ను ఎక్కువగా గ్రహించేందుకు సహాయ పడడంతో అతని విటమిన్ డి స్థాయి 40 కి పెరిగింది.
ప్రాక్టీషనర్ ఇష్టపడే కొన్ని కాంబోలు CC2.3 Tumours & Growths + CC4.8 Gastroenteritis దీర్ఘ కాలిక ఉబ్బరం సమస్యలకు CC4.2 Liver & Gallbladder tonic + CC15.2 Psychiatric disorders అధిక కోపం, ప్రవర్తన సమస్యల కోసం మరియు మానసిక రుగ్మతలకు, మరియు CC8.1 Female tonic + CC8.8 Menses irregular అణచి వేయబడిన లేదా క్రమ రహిత ఋతు చక్రాలకు సంభంధించిన సమస్యలకు
NM12 Combination-12 (12 టిస్యూ సాల్ట్ ల కలయిక) అన్నీ రకాల అనారోగ్య సమస్యలకు అద్భుతంగా పని చేస్తుందని వీరు తెలుసు కున్నారు. కణాలలో అకర్బన లవణాల లోపము అనేది వ్యాధికి కారణమవుతుందని ఈ రెమిడి ఆ లోటును భర్తీ చేయడానికి వైద్య ప్రక్రియలో సహాయపడుతుందని అతను నమ్ముతున్నారు. 108CC లలో జాబితా చేయబడిన 18 టానిక్కులలో 11 టానిక్ లు NM 12 కలిగి ఉంటాయని మిగతా 7 వ్యక్తిగత కణజాల లవణాలు వివిధ స్థాయిలో అనగా కొన్నింట్లో 12 లో గరిష్టంగా 7 వరకు కలిగి ఉంటాయని వీరు గమనించారు. సాధారణంగా కణజాల లవణాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ప్రత్యేకించి NM 12 కి సంబంధించి నంత వరకు సోహం సిరీస్ వాల్యూమ్ 2 సెక్షన్ 3 నుండి SVP లు ఈ రెమెడీ యొక్క లాభాల గురించి మరింత తెలుసుకోవాలని ఆయన సిఫారసు చేస్తున్నారు.
నీటితో మొదటి మోతాదు ఇచ్చినప్పటి నుండి రెండు నుండి మూడు రోజుల వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక డోస్ చొప్పున రెండు గంటల వరకు కొనసాగించితే అది వైద్య ప్రక్రియను వేగిర పరుస్తుందని వీరు కనుగొన్నారు. డయాబెటిక్ రోగులకు అల్లోపతి డోస్ పెంపుతో రక్తంలో చక్కెర స్థాయి తగ్గనప్పుడు పైన పేర్కొన్న రీతిలో వైబ్రియానిక్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది. రెమిడీలను సిద్ధం చేస్తున్నప్పుడు స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని జపించడానికి లేదా వినడానికి వీరు ఇష్టపడతారు, ఎందుకంటే ఇది పేషంటు స్థితిలో గణనీయమైన మెరుగుదలను అందిస్తుంది. వీరు ప్రాక్టీషనర్లకు అందించే మరో చిట్కా ఏమిటంటే వైబ్రేషన్లు మరింత ప్రభావంతంగా పనిచేయడానికి రెమిడీ బాటిల్ను ఓపెన్ చేసే ముందు కొన్నిసార్లు షేక్ చేయాలి.
గత కొన్ని సంవత్సరాలుగా రోగ చరిత్రలు మరియు ఫాలో అప్ కేసులు రికార్డ్ చేయడానికి ప్రాక్టీషనర్ తన విధానాలను మెరుగుపరిచారు. రోగి యొక్క పురోగతిని అనుసరించడానికి ప్రాక్టీషనర్ వ్యక్తిగత శ్రద్ధ కనబరిచినప్పుడు రోగి తన శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తున్నారనే భరోసా కలిగి ఉంటాడు. ప్రతీ వార్తా లేఖను క్షుణ్ణంగా చదవడం తన వైబ్రో అభ్యాసానికి చాలా విలువైనదిగా అతను నమ్ముతున్నారు. అలాగే సోహం సిరీస్ పుస్తకాల యొక్క వివరణాత్మక అధ్యయనం అతనికి సబ్జెక్టుపై అవగాహన మరింత పెంచుకోవడంలో సహాయపడింది. చక్రాలచే నియంత్రింపబడే శక్తి క్షేత్రాలు ద్వారా మానవ శరీరం ఎలా స్వస్థత పొందుతుంది అనే దానిపై అతను విస్మయానికి లోనౌతూ ఇట్టి సంపూర్ణ వైద్యం యొక్క ఈ ప్రత్యేకమైన వ్యవస్థను తనకు పరిచయం చేసినందుకు స్వామికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
పంచుకున్న కేసుల సందర్భాలు :
ప్రాక్టీషనర్ల వివరాలు 03599 & 02726...USA
ప్రాక్టీషనర్స్ 03599 & 02726…USA అమెరికా లోని హోస్టన్ కి చెందిన ఈ జంట ఒక టీం గా కలిసి సేవ చేస్తున్నారు. భర్త కెమికల్ ఇంజినీరుగా భారతదేశంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్య సంస్టల లోనూ, మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసి అనంతరం యునైటెడ్
స్టేట్స్ కి వెళ్లినప్పుడు అక్కడ కూడా పనిచేశారు. 2019 నుండి అతను ప్రోబొనో సంస్థకు అధ్యక్షుడిగా పనిచేస్తూ కోచింగ్ మరియు కెరీర్ గైడెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యర్ధులు వారి కలలను సహకారం చేసుకోవడంలో సహాయం చేస్తున్నారు. అతను ప్రస్తుతం ప్రాజెక్టు మేనేజ్మెంట్ ను బోధిస్తున్నారు అంతేకాక 50 మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కమ్యూనికేషన్ మరియు స్వీయ నిర్వహణ పద్ధతులలో మార్గదర్శకత్వం వహిస్తున్నారు. వీరి శ్రీమతి B. Sc మరియు MBA డిగ్రీ కలిగి ఉండి పదవీ విరమణ వరకు వివిధ పరిశోధన ప్రయోగశాలలో పనిచేశారు. ఆమెకు బాలివికాస్ పట్ల మక్కువ, భజనలు పాడటం కవిత్వం రాయడం అంటే చాలా ఇష్టం.
1999లో భర్త విదేశీ అసైన్మెంట్ కోసం జపాన్ లోని యోకో హోమాలో పోస్ట్ చేయబడినప్పుడు ఈ జంట సాయిబాబా ఫోల్డ్ లోకి వచ్చారు. వారి నాలుగున్నర సంవత్సరాల కుమారుడిని భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు అలవాటు చేద్దామనే ప్రయత్నంలో వారానికి ఒకసారి బాలవికాస్ తరగతులు నిర్వహించే ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని చూశారు. వారు మొదటిసారి సాయి కేంద్రాన్ని సందర్శించినప్పుడు వారి కుమారుడు నేరుగా స్వామివారి పీఠం వద్దకు వెళ్లి స్వామివారి పాదాలకు నమస్కరించాడు. సాయి మరియు వారి కుమారుని మధ్య ఉన్న ఈ లోతైన అనుబంధం బాలవికాస్ గురువు వారి ఆధ్యాత్మిక మార్గదర్శి గా మరియు స్వామి వారి జీవితానికి కేంద్ర బిందువుగా మారి ఈ కుటుంబం సాయి వైపు ప్రయాణం ప్రారంభించింది. వారు యోకో హోమాలో నారాయణ సేవలో చురుకుగా పాల్గొనడమేకాక హ్యూస్టన్ లో కూడా నారాయణ సేవ కొనసాగించారు. వీరి శ్రీమతి 13 ఏళ్లు SSE టీచరుగా, నాలుగేళ్లు ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. భర్త SSE టీచరుగా, సేవా కోఆర్డినేటర్ గా, వైస్ ప్రెసిడెంటుగా, సాయి ఆర్గనైజేషన్ సెంటర్ లో ప్రెసిడెంట్ గా వివిధ హోదాలలో పని చేసారు. వీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సర్టిఫైడ్ సేవా వాలంటీర్ కూడా. ఈదంపతులు వైద్య శిబిరాలు మరియు ఆహార పంపిణీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, నర్సింగ్ హోమ్ లో కూడా సేవ చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ వైద్య పద్ధతుల పట్ల ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండే వీరి శ్రీమతి 2007లో వైబ్రియానిక్స్ గురించి విన్నప్పుడు ప్రాక్టీషనర్ గా మారడానికి ప్రేరణ పొందారు. 2007లోనే పుట్టపర్తిలో AVPగా శిక్షణ పొందారు. ఆ తర్వాత AVP గా మరలా శిక్షణ పొంది కొంతకాలం తర్వాత 2021లో VP అయ్యారు. అనేక సందర్భాల్లో వైబ్రియానిక్స్ యొక్క శక్తిని ప్రత్యక్షంగా చూసిన భర్త తన శ్రీమతితో పాటు పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అతను 2020లో AVP, 2021లో VP మరియు 2023లో SVP అయ్యారు.
స్వామి వారి సేవను ఆశీర్వదించిన అందమైన అనుభవాన్ని వారు ఇలా వివరిస్తూన్నారు. ఒకసారి వారు ఒక SVP సహకారంతో తమ 108CC బాక్స్ ను రీచార్జి చేస్తూ సాయి నామాన్ని జపిస్తున్నప్పుడు తమ టేబుల్ పై ఉన్న ఎలెక్ట్రిక్ బల్బు నిరంతరం దానికదే వెలిగి ఆరుతూ ఉండటం గమనించారు. రీ చార్జి పూర్తికాగానే అలా వెలగడం దానంతట అదే ఆగిపోయింది. స్వామి సర్వవ్యాపకత్వం గురించి ఈ నిస్సందేహమైన లీలతో వారు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. స్వామి దయకు సంబంధించిన మరో సందర్భంలో వీరి శ్రీమతి UK లో అలోపతి వైద్యుడు గా పనిచేస్తున్న తమ సోదరుడు 2020లో కోవిడ్ మహమ్మారి ఉదృతంగా ఉన్న సమయంలో పేషంట్లను సందర్శించ వలసిన పరిస్థితి కొనసాగుతూ ఉండేది. అతని కుటుంబానికి IB తీసుకువెళ్ళి ఇద్దామని ఆమె అంతరంగికంగా ప్రేరేపింప బడి సోదరుని అడుగగా ఆమెను అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తూ అతను అంగీకరించాడు, మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారికి తమ ఇంటి నుండి అరగంట డ్రైవింగ్ దూరంలోనే వారికి IBని అందించగల మరొక ప్రాక్టీషనర్ను వారు కనుగొన్నారు. వారు రెమిడీ పొందిన మరుసటి రోజు సోదరుడు కోవిడ్ లక్షణాల బారిన పడ్డాడు. ఈ విషయం విని ఆమె తన ప్రార్థనా మందిరానికి పరిగెత్తి స్వామిని జాగ్రత్తగా చూసుకోమని హృదయపూర్వకంగా వేడుకోగా ఆమె సోదరుడు బాగుంటాడని స్వామి స్పందించారు. ఆమె సోదరుడు కోలుకోవడానికి రెండు వారాలు పట్టింది కానీ తన ప్రాణం కాపాడిన క్రెడిట్ అంతా తన సోదరికే ఇచ్చారు!
2023 మార్చి లో 30 ఏళ్ల పురుషునికి IBS(పేగు ప్రకోపము) నిర్ధారణ అయ్యి, లూజ్ మోషన్ సమస్య తో వారిని సంప్రదించారు. అతను చిన్నతనం నుండి జీర్ణ సమస్యల చరిత్ర కలిగి ఉన్నారు, మరియు ఆరు సంవత్సరాల క్రితం కామెర్ల వ్యాది సోకిన అనంతరం అతను అధికత్రేనుపు, ఉబ్బరం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడ్డారు. అలోపతి చికిత్సలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది #1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…6TD, #2. IB and #3. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic. రెండు వారాల్లో రోగి మెరుగయ్యారు, ఆ తర్వాత ఆరు నెలల్లో ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదు.
ఈ ప్రాక్టీషనర్ల జంట CC17.2 Cleansing మరియు CC12.1 Adult tonic చాలా శక్తివంతమైన రెమిడిలుగా గుర్తించారు. భర్తకు దశాబ్ద కాలంగా ఉన్న తీవ్రమైన పుప్పొడి ఎలర్జీ ఈ రెమిడీలను ప్రత్యామ్నాయంగా ఒకేసారి తీసుకోవడం ద్వారా నాలుగు నెలల్లో పూర్తిగా మాయమైంది. ఇది జరిగి 8 సంవత్సరాలు అయ్యింది. కోవిడ్ కలిగించిన సంక్లిష్టత వల్ల కోలుకోవడం కష్టంగా ఉన్న ఆరుగురు వృద్ధ రోగుల్లో IB + Covid Recuperation ఉపయోగించగా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడమే కాక వారందరూ సాధారణ స్థితిని పొందారు. అలాగే కనీసం 10 రోజులుగా కోవిడ్ తో బాధపడుతున్న మరో నాలుగు కేసుల్లో పై రెమిడి త్వరగా కోలుకోవడానికి దారితీసింది.
అన్ని సమస్యలు మనస్సు నుండే ఉత్పన్నమవుతాయి అనే సూత్రం ఆధారంగా ఈ జంట CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disorders రెమిడిని సిద్ధం చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగుల జీవిత భాగస్వామి లేదా కుటుంబసభ్యులకు మానసిక స్వాంతన ఇవ్వడం కోసం మొదట తమ పైనే అనేక నెలలు ప్రయత్నం చేసి ఆ ఫలితంతో వారు దాన్ని కనీసం 50 మంది రోగులపై విజయవంతంగా ఉపయోగించారు. తీవ్రమైన డిప్రెషన్ విషయంలో కూడా ఈ రెమిడి చాలా బాగా పనిచేసింది.
ఈ దంపతు లిద్దరూ ఎల్లప్పుడూ ఏదైనా సేవా అవకాశం కోసం నిరంతరం ఎదురు చూస్తూ వారి వల్ల ప్రయోజనం పొందగల ఎవరికైనా వీరి సహాయం అందిస్తారు. రోగులతో సంప్రదింపులు మరియు రెమిడీ తయారీ సమయంలో స్వామి వారితోనే ఉన్నట్లు వారు భావిస్తారు. తమ వంతు కృషి చేసి వారు స్వామిని ప్రార్థించి ఫలితాన్ని స్వామికి సమర్పించుకుంటూ ఉంటారు. ఎందుకంటే తాము నిమిత్త మాత్రుల మని నయం చేసేది స్వామీనే అనే భావన వీరిని ప్రశాంతతను అనుభవింప చేస్తుంది. ఆలోచనలు వ్యాధిని నయం చేయడంలో సహాయపడతాయని లేదా ఒక అవరోధంగా కూడా ఉంటాయని వారు గ్రహించారు కనుక ప్రేమ మరియు దైవిక ఆలోచనలతో నిండిన హృదయం ఆవశ్యక మైనదని వీరు భావిస్తారు.
వీరి శ్రీమతి వైబ్రియానిక్స్ ప్రారంభించినప్పుడు స్వామి తనకు ప్రసాదించిన ఆశీర్వాదబలం యొక్క శక్తిని ఆమె గ్రహించలేదు, ఇప్పుడు ఈ సేవ తమ జీవితానికి అర్థం మరియు ప్రయోజనాన్ని అందించిందని వారు తెలియ జేస్తున్నారు. వాస్తవానికి గతంలో భారత దేశం లోని డెహ్రాడూన్ లో సీనియర్ సిటిజన్ కమ్యూనిటీలో నివసిస్తున్న సందర్భంలో తోటి నివాసితులు మరియు సిబ్బంది అనేక మందికి వైబ్రియానిక్స్ చికిత్స చేసారు. వైబ్రియానిక్స్ అభ్యాసం వారు వారి అంతర్గత ప్రయాణంలో స్వామి వైపు ముందుకు సాగడానికి సహాయపడింది, విశ్వాసం, కృతజ్ఞత, వినయం మరియు అంగీకారానికి సంబంధించిన పాఠాలు నేర్పింది. వారు తమ అనుభవాలను పంచుకోవడానికి లేదా ఇతర ప్రాక్టీషనర్ల నుంచి సంక్లిష్టమైన కేసులపై సలహాలు తీసుకోవడానికి ఏదైనా బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
ప్రతి ప్రాక్టీషనర్ తమ ప్రియమైన ప్రభువు చేత ఎంపిక చేయబడిన వారే అని శ్ర్రీమతి విశ్వేసిస్తారు. కనుక ప్రాక్టీషనర్లు దీన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఇట్టి సువర్ణ అవకాశాన్నిఅందించిన స్వామికి కృతజ్ఞతతో ఉండాలి. తనును డాక్టర్ చేయాలని కోరుకున్న తల్లిదండ్రుల కలలను స్వామి నెరవేర్చారని భావించిన భర్త మనం ఎల్లప్పుడు మన చర్యలపై మాత్రమే దృష్టి సారించాలని, ఫలితాన్ని ఆశించే వారుగా ఉండరాదని ఎందుకంటే దైవిక చర్యలు మన ఊహకు అందని విధంగా ఉంటాయని తన తోటి ప్రాక్టీషనర్లకు సూచిస్తున్నారు.
పంచుకున్న కేసుల వివరాలు :
ప్రశ్నలు-జవాబులు
Q1 బెడ్ సోర్స్ కోసం నేను రోగి యొక్క చెమట ఉపయోగించి నోసోడ్ తయారు చేయాలి అనుకుంటున్నాను, అది ప్రభావంతంగా ఉంటుందా? బెడ్ సోర్ నుండి ఉత్సర్గం ఉన్నప్పుడు దీని నుండి తీసిన నోసోడ్ మరింత ప్రభావంతంగా ఉంటుందా?
A. బెడ్ సోర్ అనేది చర్మంపై దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా చర్మం మరియు అంతర కణజాలానికి మధ్య ఏర్పడిన గాయం. చమట అనేది చర్మం నుండి వచ్చే ద్రవం కాబట్టి ఇది నోసోడ్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది, అయితే గాయానికి చికిత్స చేయడానికి ఉత్తమ మార్గం CC21.11 Wounds & Abrasions మౌఖికంగా అలాగే బెడ్ సోర్ ఉన్న ప్రదేశంలో బాహ్య అనువర్తనం గా ఉపయోగించడం ఉత్తమం. ఇక రెండవ ఉత్తమ మార్గం బెడ్ సోర్ నుండి కొంచం ఉత్సర్గం తీసుకొని దాని నుండి ఒక నోసొడ్ తయారు చేయడం. అలాగే గాయాన్ని శుభ్ర పరచడం, డ్రెస్సింగ్ చేయడం, దీనితొపాటు తరచూ పడుకునే విధానంలో మార్పులు చేయడం ద్వారా పుండు పై ఒత్తిడిని తగ్గించవచ్చు.
_______________________________________________________________________________________
Q2. SRHVP ద్వారా కార్డులు ఉపయోగించి రెమిడీ తయారు చేస్తున్నప్పుడు స్వామి ఆశీర్వాదం కోసం శాంపిల్ వెల్ లో స్వామి ఫోటో ఉంచాలని అనుకుంటున్నాను. ఇలా చేయవచ్చా దాని వల్ల ఫలితం ఉంటుందా?
A. SRHVP మిషను స్వామివారి ఆశీర్వాదం తోనే ఉద్భవించిందనే విషయం మీకు బాగా తెలిసే ఉండవచ్చు, ఇంటర్వ్యూ గదిలో కూడా స్వామి చేత అనేక పర్యాయములు ఆశీర్వదింపబడ్దది. అందుచేత SRHVP లో స్వామి ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు. రెమిడీ తయారీ సమయంలో స్వచ్ఛమైన హృదయం నుండి వెలువడే ప్రార్ధన (ఈ ప్రార్ధన లో ఆర్ధత చాలా ముఖ్యం) స్వామి ఆశీర్వాదాలు అందుకోవడానికి ఉత్తమ మార్గం.
_______________________________________________________________________________________
3. అనారోగ్య సమయంలో మనిషి చుట్టూ ఉన్న ఆరా (అదృశ్య ప్రకాశం) ప్రభావితం అవుతుందని నేను ఇటీవల శాస్త్రీయ అధ్యయనం నుండి అర్థం చేసుకున్నాను. వైబ్రో రెమిడీని స్ప్రే చేయడం ద్వారా మనం ఈ ఆరాని శుభ్రపరచగలమా? అలా అయితే ఏ వైబ్రేషన్ సముచితంగా ఉంటుంది?
A. మొదటగా కొంచెం నేపథ్యం: ఈ ప్రశ్న ఇటీవల ఒక సైన్స్ జనరల్ లో ప్రచురింపబడిన అధ్యయనాన్ని సూచిస్తుంది. ఓజోన్ అణువులు మానవ దేహంతో కాంటాక్ట్ అయినప్పుడు ఉత్పత్తి చేయబడిన గాలిని శుద్ధి చేసే అణువుల యొక్క అదృశ్య ప్రకాశము ఆరాని ప్రదర్శిస్తుందని సూచించింది. గతం లోని ఒక విశ్లేషణ ప్రకారం మన చర్మం పై OH రాడికల్స్ అని పిలవబడే ఈ అణువులు సూర్యరశ్మి ద్వారా తయారైనప్పుడు విషపూరిత అణువులను తటస్తీకరిస్తాయి అని కనుగొనబడింది. అయితే మానవులు స్వయంగా తయారు చేసుకుంటున్న OH రాడికల్ లను శాస్త్రవేత్తలు కనుగొనడం ఇదే ప్రధమం. ఈ అణువులకు మూలం స్క్వాలీన్ అనే సమ్మేళనం. ఇది మన చర్మాన్ని మృదువుగా ఉంచుతుందని అంటారు. ఈ అధ్యయనం ఇంకా ప్రారంభ దిశలోనే ఉందని మరియు ఈ ఆవిష్కరణ యొక్క చిక్కులను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయవలసింది ఉందని గమనించడం ముఖ్యం. OH రాడికల్స్ శరీరం చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తాయి అనే భావనలో ఈ సంభావ్య ప్రయోజనాల గురించి ఆలోచించడం మనోహరంగా ఉన్నప్పటికీ ఈ రాడికల్స్ మన ఆరోగ్యం పై ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో లేదో మనకు ఇంకా తెలియదని గుర్తుంచుకోవడం ముఖ్యం.
మీ ప్రశ్నకు తిరిగివస్తే ఒక వ్యక్తి యొక్క ఆరాని శుభ్రపరచడం, ఆ వ్యక్తికి రెమిడి తో చికిత్స చేయడం ఈ రెండు వేరు కాదు కాబట్టి మీరు వ్యక్తి యొక్క వ్యాధి ని బట్టి తగిన రెమిడీ తో ఆరా శుభ్రపరచడానికి శరీరంపై స్ప్రే చేయండి. వాస్తవానికి రెండు వైపులా కొనసాగింపబడే విధానం మరింత ప్రభావంతంగా ఉంటుంది. అనగా ఇంకో విధంగా చెప్పాలంటే అనారోగ్యానికి తగిన నివారణను మౌఖికంగా ఇవ్వడం, పిచికారి చేయడం రెండూ చేయవచ్చు.
_______________________________________________________________________________________
Q4. ఋతు విరతి కోసంఆదర్శ వంతమైన చికిత్స ఎప్పుడు ప్రారంభించాలి. మనం ఏ ఏ అంశాలను గుర్తుంచుకోవాలి?
A. ఒక స్త్రీ ఋతుక్రమం లేకుండా ఒక పూర్తి సంవత్సరం ఉన్నట్లైతే ఋతు విరతి లో ఉన్నట్లు చెబుతారు. కొందరు స్త్రీలు తక్కువ వయసులో అనగా 40 సంవత్సరాల లోపు లేదా ఎక్కువ వయసులో అనగా 50 సంవత్సరాల తరువాత ఋతు విరతికి లోనవుతారు, ఐతే వీరి సంఖ్య చాలా స్వల్పం. సాధారణంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో ఇది ప్రారంభం అవుతుంది. వేడి అవిర్లు, రాత్రి చెమటలు భావో ద్వేగాలు, రొమ్ము నొప్పి లేదా మంట, యోని పొడిబారడం, కోరికలు తగ్గడం, అలసట, జుట్టు పలచ బడడం, ఆందోళన, నిరాశ నిద్రాభంగం, బరువు పెరగడం, కీళ్ల/కండరాల నొప్పి వంటివి సాధారణంగా అనుభవించే లక్షణాలు. కొందరికి హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన తలనొప్పి, అవయవ అంత్యభాగాల్లో జలదరింపు లేదా విద్యుత్ షాక్ వంటిది, లేదా జ్ఞాపకశక్తి లోపించడం వంటివి కొందరికి సంభవించవచ్చు. సాధారణంగా 45 నుండి 55 సంవత్సరాల వయసులో స్త్రీకి మెనోపాస్ వయసు వచ్చిన వెంటనే సక్రమం కాని ఋతు క్రమం తో పాటు పై లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా మనము ఈ చికిత్సను ప్రారంభించ వచ్చు.
_______________________________________________________________________________________
Q5. నేను విభూతిని పోటెం టైజ్ అనగా శక్తివంతం చేసి రెమిడీలను మరింత శక్తివంతం చేయడానికి నా అన్ని రెమెడీలకు ఈ కంపనాన్ని జోడించవచ్చా?
A. మీ ఉద్దేశం స్వామి రక్షణ చేర్చడమే అయితే SM2 Divine Protection తగిన కార్డు అవుతుంది. విభూతిని శక్తివంతం చేయవలసిన అవసరం లేదు. ఇది ఎలా తయారు చేయబడినది, ఎలా వినియోగింప బడుతోంది అనే దానిపై ఆధారపడి దీనిలో కొన్ని ఇతర వైబ్రేషన్లు కూడా ఉండవచ్చు. రోగి బాబా భక్తుడైతే అతని కోరిక మేరకు విభూతితో కూడా రెమిడీ తయారు చేయవచ్చు.
దివ్య వైద్యుని దివ్య వాణి
“ప్రజలు తాము తిన్నప్లేట్ నుండి పైకి లేవడానికి చాలా అవస్థ పడేంత పెద్ద మొత్తంలో ఆహారం పొట్టలో నింపు కుంటారు. సంపన్నులు ఖరీదైన, ఆర్భాటంతో కూడిన విందులు చేస్తూ గర్వపడతారు కానీ ఈ భారీ ఆహారాలు తీసుకోవడం ద్వారా వారి జీర్ణ వ్యవస్థను నాశనం చేసుకుంటున్నామని అర్ధం చేసుకోరు. శారీరిక ఆరోగ్యమే గొప్ప సంపదని తెలిసినవారు సాత్వికమైన ఆహారం మాత్రమే తినడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పూర్తిగా ఉడకని ఆహారము, కాయలు మరియు పండ్లు, మొలకెత్తిన విత్తనాలు ఉత్తమమైనవి. రోజులో కనీసం ఒక్క సారి ఉదాహరణకి రాత్రి భోజన సమయంలో వీటిని ఉపయోగించండి, ఇది సుదీర్ఘ జీవితాన్ని అందిస్తుంది”.
... శ్రీ సత్య సాయి వాణి, సేవపై దివ్య వాణి చక్కని ఆరోగ్యం-మంచిదనం, సంచిక 15, అధ్యాయము 21,30 సెప్టెంబర్ 1981 https:sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf
“సేవ చేస్తున్నప్పుడు హనుమంతుని ఉదాహరణగా తీసుకోండి. అతను అన్ని రకాల ఆటంకాలను లెక్కచేయకుండా ధర్మానికి యువకుడైన రాముడిని సేవించాడు అతను బలవంతుడు, విద్యావంతుడు మరియు గుణవంతుడు అయినప్పటికీ అతనికి ఏ కొంచం కూడా గర్వం లేదు. అతను చాలా ధైర్యంగా లంకలో ప్రవేశించి అక్కడ రాక్షసులు ఎవరు నీవు అని అడిగినప్పుడు తనను తాను చాలా వినయంగా “రాముని సేవకుడను” అని వర్ణించుకున్నాడు. సేవ ద్వారా మనలో తీసుకురావాల్సిన అహంకార నిర్మూలనకు ఇది ఒక చక్కని ఉదాహరణ. అహం ప్రభలంగా ఉన్నప్పుడు ఎవరు మరొకరికి సేవ చేయలేరు. పరస్పర సహాయ దృక్పథం మరియు నిస్వార్థ సేవా దృక్పథం మనిషి లో మానవత్వాన్ని అభివృద్ధి చేస్తుంది మరియు అతనిలో నిక్షిప్తమైన దైవత్వాన్ని ఆవిష్కరించడానికి సహాయపడుతుంది”.
... శ్రీ సత్య సాయి వాణి, సేవపై దివ్య వాణి http://Dal Conference, “సేవా సాధన పై పాఠాలు సంచిక 15,అధ్యాయం 31, 19 నవంబర్ 1981 http://sssbpt.info/ssspeaks/volume15/sss15-31.pdf
ప్రకటనలు
భవిష్యత్తు లో నిర్వహింప బోనున్న వర్క్ షాప్ లు *
- ఇండియా పుట్టపర్తి : విర్చ్యు వల్ AVP ప్రాక్టికల్ వర్క్ షాప్ 2-20 నవంబర్ 2023 తదనంతరం ముఖాముఖీ వర్క్ షాప్ 25-27 నవంబర్ 2023, సంప్ర దించ వలసిన వారు [email protected]
- ఫ్రాన్స్ పెరిగ్యూ ఆక్స్ : AVP fముఖా ముఖి వర్క్ షాప్ 9-13 నవంబర్ 2023** సంప్రదించ వలసిన వారు [email protected]
*ఈ వర్క్ షాప్ లు అడ్మిషన్ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే .
అదనంగా
1. ఆరోగ్య కథనం
సమ తుల్య ఆహారంలో అవసరమైన స్థూల పోషకాలను చేర్చడం
“భౌతిక శరీరం అన్నమయ కోశ నిర్మితము, శరీరం క్షణభంగుర మైనది, కానీ మీరు దాన్ని పోషించాలి, ఎందుకంటే సరైన పోషక కారకమైన ఆరోగ్యకరమైన శరీరము మాత్రమే ప్రాణమయ కోశము మరియు మనోమయ కోశము నకు మద్దతు ఇస్తుంది. ప్రాణమయ కోశము శరీరంలోని ప్రాణ శక్తి సమతుల్య ప్రవాహానికి సహాయపడుతుంది”...సత్యసాయిబాబా 1
పరిచయము : ఆరోగ్యం యొక్క ప్రధాన లక్షణం “శారీరక, మానసిక, మరియు సామాజిక శ్రేయస్సు యొక్క సంపూర్ణ స్థితి”2 స్థిరమైన మంచి ఆరోగ్యానికి సరిపడినంత మరియు తగు విధమైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, నిద్ర, సంతృప్తికరమైన వృత్తి మరియు బాల్యం నుండి కూడా వినోదంతో పాటు మానసిక శాంతి కూడా ప్రధానంగా ఉండాలి. ఇందులో స్థూల మరియు సూక్ష్మ పోషకాల సమతుల్య ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆరోగ్య కథనం అవసరమైన స్థూల పోషకాలను పరిశీలిస్తుంది.
1. స్థూల పోషకాలు అంటే ఏమిటి ?
1.1 కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మరియు కొవ్వులు సమూహంగా CPF “మాక్రో న్యూట్రియంట్స్” (సంక్షిప్తంగా మాక్రోస్)
Carbohydrates (carbs) are the primary అని పిలుస్తారు. ఇది శరీరం ఉత్పత్తి చేయదు కానీ అది సరైన రీతిలో పనిచేయడానికి ఇవి ఖచ్చితంగా అవసరం. కార్బోహైడ్రేట్లు( పిండి పదార్థాలు) కేంద్రం నాడీ వ్యవస్థ, మెదడు మరియు కండరాలకు కీలకమైన ప్రాథమిక శక్తి వనరు. కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి జీవక్రియను నియంత్రించడానికి ఎంజైములను ఉత్పత్తి చేయడానికి మరియు శరీరం అంతటా పోషకాలు రవాణా చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ప్రోటీన్ లోని అమినోయాసిడ్లు ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ ఏర్పరుస్తాయి. కొవ్వులు శరీరానికి శక్తి నిల్వలు, ఇవి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి, తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని నిర్వహిస్తాయి మరియు శరీర మరియు ఆరోగ్యకరమైన హార్మోన్ సమతుల్యతను కాపాడుతాయి.3,4,5
1.2 CPF నిష్పత్తి : పిండి పదార్థం, ప్రోటీన్, కొవ్వులు ఒక ఆదర్శ వంతమైన నిష్పత్తిలో ఎప్పటికీ ఉండవు. ఐతే 40-65% కార్బోహైడ్రేట్, 10-35% ప్రోటీన్ మరియు 20-35% కొవ్వు, సంతృప్త కొవ్వు 10% సీలింగ్ తో కూడినటువంటి ఒక విస్తృత ఫ్రేమ్ వర్క్ ఆకృతిలో ఒకరి శరీరకూర్పు, స్త్రీ పురుష బేధము, బరువు, వృత్తి, జీవనశైలి, మరియు ఆరోగ్య స్థితిని పరిగణనలోనికి తీసుకున్న తర్వాత ఒకరి మొత్తం క్యాలరీల అవసరాల ఆధారంగా వీటన్నింటిని సమతుల్య ఆహారంలో చేర్చాల్సిన నిష్పత్తిని మనం ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు సగటు ఆరోగ్యవంతమైన పెద్దలకు 50- 20- 30 నిష్పత్తిలో, 60 ఏళ్లు పైబడిన వారికి 45- 25- 30 నిష్పత్తిలో, మరియు బరువు తగ్గడమే లక్ష్యంగా ఉన్న వారికి 40-40-20 నిష్పత్తిలో తీసుకోవాలి.3,4,5
2. మన శక్తి అవసరాలు-ప్రాధమిక విషయాలు
2.1 కేలరీ అంటే ఏమిటి ? కేలరీ అంటే జీవక్రియ జరుప బడినప్పుడు ఆహారం ద్వారా విడుదలయ్యే శక్తి యొక్క కొలత. ఇది సాధారణంగా కిలో క్యాలరీలలో వ్యక్తీకరించబడుతుంది(క్యాలరీ చాలా చిన్న యూనిట్ కాబట్టి) కిలో క్యాలరీ ని సంక్షిప్తంగా kcal లేదా కేలరీ అని వ్రాయబడుతుంది. కారు పెట్రోల్ నుండి శక్తిని గ్రహించిన రీతిగా మన శరీరం కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు మరియు కొవ్వుల నుండి శక్తిని సంగ్రహిస్తుంది. పిండి పదార్థాలు మరియు ప్రోటీన్లు గ్రాముకు 4 క్యాలరీల శక్తిని ఉత్పత్తి చేస్తే కొవ్వు గ్రాముకు 9 క్యాలరీలు శక్తిని ఇస్తుంది.4,5,6
2.2 రోజుకు అవసరమైన కేలరీ శక్తి: రోజుకు మహిళలకు 1600 నుంచి 2,400 క్యాలరీలు మరియు పురుషులకు 2000 నుంచి 3200 క్యాలరీల వరకు అవసర మవుతుంది. 6-8
2.3 వర్క్ అవుట్ :
శ్వాసక్రియ, జీర్ణక్రియ, వంటి కీలక విధులను కొనసాగించడానికి అవసరమైన కనీస శక్తి స్థాయి మరియు సర్కులేషన్ అనేది ఒకరి బరువు, ఎత్తు, వయసు, మరియు నిశ్చల జీవనశైలి నుండి చురుకు జీవన శైలి వరకు వారి యొక్క శారీరక శ్రమ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. క్రింది లింకులలో ఇవ్వబడిన సూత్రాల ఆధారంగా పనితీరు తెలుసుకోవచ్చు.6-8
3. ఆరోగ్య వంతమైన కార్బో లను ఎంచుకోవడం:
3.1 కార్బో హైడ్రేట్ లు పంచదార, స్టార్చ్ మరియు ఫైబర్లను కలిగి ఉండి ప్రకృతిలో పచ్చని మొక్కల ద్వారా ఏర్పడిన
అత్యంత సమృద్ధిగా మరియు విస్తృతమైన శ్రేణిలో లభించే సేంద్రియ ఆహార పదార్థములు. చక్కెర సాధారణ కార్బో హైడ్రేట్, ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులో ఫ్రూట్ షుగర్(ఫ్రక్టోజ్), టేబుల్ షుగర్(సుక్రోజ్), మిల్క్ షుగర్(లాక్టోజ్) ఇవన్నీ కూడా సహజంగా పండ్లు కూరగాయలు, పాలు పాల ఉత్పత్తులలో ఉంటాయి. స్టార్చ్ మరియు ఫైబర్ అనేవి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, మరియు ఉడికించిన బీన్స్ మరియు బఠానీలలో కనిపించే సంక్లిష్ట పిండి పదార్థాలు. అవి శరీరానికి ధృఢత్వాన్ని, బలాన్ని, మరియు ఎక్కువ కాలం శక్తిని ఇస్తాయి. చాలా వరకు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కానీ అరటి మరియు ఖర్జూరాలలో స్టార్చ్ చాలా ఎక్కువగా ఉంటుంది9,10.
3.2 చాలామంది ప్రజల ఆహారంలో కార్బోహైడ్రేట్ లు ఎక్కువగా ఉంటాయి. ప్రజల యొక్క ప్రధాన ఆహార వనరులు, మరియు వారి ఆచారాల ఆధారంగా పాశ్చ్యత్య దేశాల్లో స్టార్ట్ నిష్పత్తి 50%గాను, ఆసియా మరియు ఆఫ్రికాలో దేశాలలో 80% వరకు ఉంటుంది. కార్బో అనేది శరీరానికి కావాల్సిన ఇంధన వనరు అయినప్పటికీ ఇది కనీస అవసరాలు తీర్చలేని ఏకైక స్థూల పదార్థం. రోజుకు 275 గ్రాముల కార్బోహైడ్రేట్లు సిఫారసు చేయబడినప్పటికి తక్కువ తీసుకోవడం రక్తంలో చక్కెరను తగ్గించడంలో మరియు హార్మోన్ల అసమతుల్యతను నివారించడంలో సహాయపడవచ్చు5,9,11-14. ఈ కథానిక చివరిలో ఇచ్చిన లింకుల ఆధారంగా కార్బో హైడ్రేట్ ల లిస్టు ప్రకారం ప్రతీ వస్తువుకు ఏ పరిమాణంతో ఒక వ్యక్తి తీసుకోవాలో ట్రాక్ చేయవచ్చు13-19.
జాగ్రత్తలు: సరళ కార్బో హైడ్రేట్ లను అధికంగా తీసుకోవడం రక్తంలో విడుదల చేయబడిన చక్కెరను నిరోధించ డానికి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తికి కారణ మవుతుంది. అధికంగా చేరిన కార్బో హైడ్రేట్లు కొవ్వు వలె నిలువ చేయబడి ఉదర పెరుగుదలకు, అంతేకాక శరీరంలో నీటిని అధికంగా నిలువ చేయడం వలన ఉబ్బరం, గ్యాస్ మరియు ఏర్పడవచ్చు.20,21
3.3 ఫైబర్ అధికంగా ఉండే ఆహారం:
ఫైబర్ అనేది మొక్కల నుండి లభించే ఆహారాల్లో ప్రత్యేకించి వాటి కణ గోడలలో ఉంటుంది. పండ్లు, ఓట్ మీల్, చియా గింజలు కాయ ధాన్యాల్లో ఉండే కరిగే ఫైబర్ కడుపు మరియు ప్రేగుల నుండి జీర్ణశయాంతర ద్రవాలలో కరిగిపోయినప్పుడు అది పెద్దప్రేగులలో జీర్ణం అయ్యే జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కొవ్వులు శోషించబడకుండా నిరోధిస్తుంది, మరియు రక్తంలో కొలెస్ట్రాల్ మరియు చక్కెరను తగ్గిస్తుంది. పులియబెట్టబడే ఫైబర్ కొన్ని చిక్కుళ్ళు, పచ్చి అరటి, లీక్స్, ఉల్లిపాయ మరియు వెల్లుల్లిలో ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. (వండి చల్లపరిచిన అన్నం, బంగాళాదుంపలు పచ్చి అరటి, వివిధ రకాల పప్పు దినుసులు, జీడిపప్పులు మరియు పచ్చి ఓట్స్ లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ పులియ పెట్ట బడిన ఫైబర్ల మాదిరిగానే పనిచేస్తుంది). తృణ ధాన్యాలు, పచ్చి బఠానీలు, పొట్టు తీయని బంగాళదుంపలు, మరియు అనేక రకాల గింజలు మరియు విత్తనాలలో కనిపించే కరగని ఫైబర్ క్యాలరీలను విడుదల చేయదు కానీ సమూహ ప్రతినిధి గా (బల్కింగ్ ఏజెంట్గా) పని చేస్తుంది, మరియు ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. పెద్దలకు రోజుకు కనీసం 20-35 గ్రాముల ఫైబర్ మంచిది కానీ వయసు పైబడిన వారికి ఈ అవసరం కొంచెం తక్కువ ఉంటుంది. 2-5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఇది 15 గ్రాములుగా ఉండి వయసు పెరిగే కొద్దీ క్రమంగా పెంచబడుతుంది. ఒక కప్పు అన్నము, పప్పులు, కొన్ని పండ్లు మరియు కూరగాయలు రోజువారి ఫైబర్ అవసరాన్ని తీర్చగలగాలి. అనేక రకాల ఫైబర్స్ తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.22-30
హెచ్చరిక : అధిక ఫైబర్ తీసుకోవడం వలన కడుపు నిండి నట్లుగా అని పించి ఆవసరమైన ఇతర పోషకాలను తీసుకోవడంలో నిరోధింప బడడమే కాక త్రేనుపులు, గ్యాస్, మలబద్ధకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.23
4. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం
4.1 మన శరీరంలోని ప్రతీ భాగము మరియు దాని కణజాలాలలో ప్రోటీన్ కనిపిస్తుంది. మన శరీరం అమైనో ఆమ్లాలు అని పిలవబడే 20 కంటే ఎక్కువ బిల్డింగ్ బ్లాకుల నుండి ప్రోటీన్ లు (వీటిలో 9 రకాలు మన శరీరం తయారు చేయలేదు కాబట్టి అవి ఎంతో అవసరం) ఆహార పదార్థాల నుండి తీసుకోబడతాయి. నిశ్చల జీవన శైలి గల సగటు వయోజన వ్యక్తి అనారోగ్యం బారిన పడకుండా నిరోధించడం కోసం సిఫార్సు చేయబడిన కనీస రోజువారి ఆహారం మనిషి శరీర బరువులో 08g/kg, లేదా 0.36g/పౌండ్. ఆరోగ్యకరమైన జుట్టు, 4,12,31-33
4.2 గుడ్లు: ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ కలిగిన ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్న అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం. కానీ వాణిజ్యపరంగా విక్రయించే గుడ్లు ఆరోగ్యకరం కాదని, వాణిజ్యపరంగా పెంచిన కోళ్లు ప్రతికూల పరిస్థితులలో జీవిస్తాయి మరియు అనారోగ్యానికి గురికాకుండా నిరోధించడానికి యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేయడం వల్ల ప్రజలు యాంటీబయాటిక్ లకు నిరోధకతను కలిగి ఉంటారని అధ్యయనాలు చూసిస్తున్నాయి. మొక్కల ఆధారిత నాణ్యమైన ప్రోటీన్ విత్తనాలు మరియు గింజలనుండి లభిస్తాయి. ( ఉదాహరణకు వాల్నట్లు, బాదం, పెఖాన్లు వీటిలో ఒక పిడికెడు పరిమాణంలో 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి). వండిన చిక్కుళ్ళు(, బఠానీ లు, వేరుశనగలు, బీన్స్, తృణ ధాన్యాలు జీలకర్ర గింజలు మరియు బే ఆకుతో వండినప్పుడు సులభంగా శోషించబడతాయి) వేపించిన పప్పులు, మరియు దాని పొడి, క్వినోవా, ఓట్లు, సంపూర్న సోయా, బచ్చలి కూర వంటి కూరగాయలు, బంగాళదుంప, చిలకడదుంప, మరియు బ్రోకలీ లో అధిక ప్రోటీన్లు లభిస్తాయి. పాల ఆధారిత వనరులు A2 పాలు (10 గ్రాములు/ కప్పు) కాటేజ్ చీజ్ (11.5g/ 100 గ్రాములు), పెరుగు (8.5g/కప్పు) ఐతే ఇవి ప్రాధాన్యతా పరంగా తాజాగా మరియు ఇంట్లో తయారు చేసిన వై ఉండాలి. 31-37
4.3 సరియైన పాళ్లలో ప్రోటీన్ తీసుకోవడానికి ప్రతీ రోజు తినే ఆహారములో వీటిని చేర్చడం ముఖ్యం.31
హెచ్చరిక : అధిక ప్రోటీన్ తీసుకోవడం మూత్రపిండ రుగ్మత మరియు మూత్రం ద్వారా కాల్షియం నష్టానికి దారి తీస్తుంది శాఖాహారులు తీసుకునే విధంగా ప్రోటీన్లను తక్కువ తీసుకుంటూ శరీరానికి అలవాటు పడేలా క్రమంగా పెంచండి, లేకుంటే పొత్తికడుపులో అసౌకర్యానికి దారి తీయవచ్చు. ప్రోటీన్ పౌడర్ ను సప్లమెంటుగా తీసుకొనే టట్లైతే ఎడిటివ్స్ లేకుండా జాగ్రత్త పడాలి. ఇది వారి రోజువారీ అవసరాలలో 10% మించ కూడదు.36,38
5. ఆరోగ్య కరమైన కొవ్వులను ఎంచు కోవడం.
మీకు రోజుకు 2000 క్యాలరీల ఆహారం అవసరమైతే అందులో మొత్తం కొవ్వు భాగం70 గ్రాములు(=630 క్యాలరీలు @9 క్యాలరీ / గ్రామ్) కు మించకూడదు. మీరు బరువు తగ్గాలనుకొంటే కొవ్వు చాలా తక్కువగా ఉండాలి. మీరు ఆరోగ్య కరమైన కొవ్వులను తీసుకోవాలనుకుంటే మొక్కల ఆహారాల నుండి లభించే విత్తనాలు అనగా వాల్నట్లు(అక్రోట్లు), గింజలు ప్రత్యేకించి అవిసె మరియు చిక్కుళ్ళు, బఠానీలు, మొలకలు, అవకాడో మరియు బచ్చలి కూర వంటివి తీసుకోవాలి. పాల ఉత్పత్తులలో కనిపించే సంతృప్త కొవ్వులను అవి కూడా మీరు తీసుకునే మొత్తం క్యాలరీలో 5-10% కంటే మిన్చి ఉండకుండా జాగ్రత్త వహిస్తూ తీసుకోండి. కొబ్బరి నుండి సంతృప్తి కొవ్వు ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి12,37,39-44
హెచ్చరిక ; ప్యాక్ చేసిన వేయించిన మరియు బేకింగ్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా కనిపించే హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్ లను నివారించండి.
6. స్థూల పోషకాలను సమతుల్యం చేయడానికి చిట్కాలు:
- మీరు వినియోగించే స్థూల పోషకాలు సంఖ్య లేదా గ్రాముల బట్టి మక్కువ పెంచుకోవడం కంటే వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాల నుండి మీ స్థూల పోషకాలను పొందడం చాలా ముఖ్యం. 12
- మీ ఆహారపు ప్లేట్ లో కూరగాయలు (బంగాళదుంప మినహాయించి) మరియు పండ్లు సగ భాగం(1/2) మరియు ¼ భాగం తృణ ధాన్యాలు, మిగిలిన 1/4 భాగం లో ప్రోటీన్ అధికంగా ఉండే పప్పు ధాన్యాలు, వేరుశనగలు, గింజలు, మరియు విత్తనాలు ముఖ్యంగా నానబెట్టిన లేదా పొడిగా వేయించిన ఆహారాలు ఉండాలి. పెద్దలు కనీసం ఒకటి నుండి రెండు కప్పుల పళ్ళు మరియు రెండు నుండి మూడు కప్పుల కూరగాయలు తీసుకోవాలి5,12,18,19,44.
- మీరు సగం లేదా సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకోగానే సంతృప్తి చెందినట్లు అనిపించినప్పుడు ఆపండి ఎక్కువ తీసుకోవాలి అనే చాపల్యాన్ని నిరోధించండి.
- వ్యవస్థను శుభ్రపరచడానికి, అదనపు కొవ్వును కరిగించడానికి, జీర్ణక్రియకు సహాయ పడటానికి, మరియు ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి ఉదయాన్నే మరియు భోజనాల మధ్య వేడి నీటిని త్రాగండి. తాజా కలబంద, ఉసిరి, అల్లం రసం రాత్రిపూట నానబెట్టిన బార్లీ నీరు, మరియు క్యాబేజీని ఆహారంలో చేర్చండి.
- ప్యాక్ చేసిన ఆహారాలపై పోషకాహార సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసినవి, డబ్బాలలో ప్యాక్ చేసినవి, మరియు అధికంగా ప్రక్టోస్ ఉండే డ్రింక్స్ మరియు రిఫైన్డ్ షుగర్ మానివేయండి 10,12,13
- వైద్య పరంగా సలహా ఇస్తే తప్ప తక్కువ కార్బోలు లేదా అధిక ప్రోటీన్ ఆహారం లేదా కీటో డైట్ ని ఆశ్రయించవద్దు. ఉదాహరణకి కీటో డైట్ ప్రధానంగా మూర్చలను తగ్గించడంలో సహాయపడుతుంది 46

తుది పలుకు : స్థూల పోషకాల యొక్క ప్రాధాన్య మూలాలు ఎక్కువ మొక్కల ఆధారిత పూర్తి ఆహారాలుగా ఉండాలి తప్ప సప్లిమెంట్లు గా కాదు. అలాగే ప్రతీదీ మితంగానే తీసుకోవాలి. ఆహారంలో మార్పులు పరిస్థితికి అనుగుణ్యంగా మరియు క్రమాను గతంగా ఉండాలి, ఎందుకంటే శరీరం మార్పును స్వీకరించడానికి కొంత సమయం తీసుకుంటుంది.
రిఫెరెన్సు లు మరియు లింకులు
- Sri Sathya Sai Speaks on “Nature of Self”, Divine Discourse, Kodaikanal, 28 April 1999: sss32p1-13.pdf (sssbpt.info)
- World Health Organization(WHO) Definition Of Health - Public Health
- What are macros: https://www.foodnetwork.com/healthyeats/healthy-tips/what-are-macronutrients
- What Are Macronutrients? All You Need to Know (healthline.com)
- Macronutrient ratios: Daily Diet Composition Charts for Carbs, Protein, and Fat (verywellfit.com)
- Recommended Calories: https://www.verywellfit.com/what-is-a-calorie-and-why-should-i-care-3496238
- Calories calculation: https://www.verywellfit.com/how-many-calories-do-i-need-each-day-2506873
- BMR: https://www.wikihow.com/Calculate-Basal-Metabolic-Rate
- What is a Carb: https://www.brittanica.com/science/carbohydrate
- Types of Carbs: https://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/in-depth/carbohydrates/art-20045705#
- No minimum carbs prescribed: https://ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5996878/
- Body’s Preferred fuel source: Macronutrients: 3 Types of Food Your Body Needs Daily (verywellfit.com)
- RDA for carbs: https://www.myfooddata.com/articles/foods-highest-in-carbohydrates.php
- Carbs and Insulin response: How Many Carbs Should a Person with Diabetes Have? (healthline.com)
- Carbs list: https://www.med.umich.edu/1libr/MEND/CarbList.pdf
- https://www.healthline.com/nutrition/12-healthy-high-carb-foods
- https://www.medicalnewstoday.com/articles/323110
- Determining food portions for fruits: https://www.bhf.org.uk/informationsupport/support/healthy-living/healthy-eating/healthy-eating-toolkit/food-portions/fruit
- Portion of vegetables: https://www.eatforhealth.gov.au/food-essentials/how-much-do-we-need-each-day/serve-sizes#
- Blood Sugar Spikes: Symptoms and How to Manage Them (verywellhealth.com)
- Do Carbs Make Your Belly Fat? | Healthfully
- Fibre: https://www.usta.com/content/dam/usta/pdfs/USTAFiber.pdf
- Soluble vs. Insoluble Fiber: What’s the Difference? (healthline.com)
- https://medicalnewstoday.com/articles/319176#what-are-the-benefits-of-fiber
- https://hsph.harvard.edu/nutritionsource/carbohydrates/fiber/
- Fibre - British Nutrition Foundation
- What Are High Fiber Foods? Chart, Fiber Needs, and More (healthline.com)
- https://health.clevelandclinic.org/high-fibre-foods/
- The Top 25 Fruits High In Fiber - Nutrition Advance
- https://healthline.com/nutrition/resistant-starch-101#how-to-add
- Protein: https://hsph.harvard.edu/nutritionsource/what-should-you-eat/protein/
- Essential Amino acids: https://my.clevelandclinic.org/health/articles/22243-amino-acids
- 5 Amazing vegetarian protein foods better than egg—fit tuber: https://youtube.com/watch?v=Pcd28t9x8w87t=459s
- https://hopkinsmedicine.org/wellness-and-prevention/5-protein-packed-foods-for-healthy-meatless-meals
- https://pharmeasy.in/blog/list-of-protein-rich-food-for-vegetarians/
- How much protein you need for weight loss: How much PROTEIN do you need for weight loss? - YouTube
- Fat and Protein in fruits: Fruits Protein And Fruits Fat Content (dailyonefruit.com)
- Excess protein: https://pubmed.ncbi.nlm.nih.gov/9614169
- Track your fats: https://newsnetwork.mayoclinic.org/discussion/fat-grams-how-to-track-fat-in-your-diet/
- Healthy fats: https://helpguide.org/articles/healthy-eating/choosing-healthy-fats.htm
- https://www.hsph.harvard.edu/nutritionsource/what-should-you-eat/fats-and-cholesterol/
- Goodness of coconut oil: https://www.hsph.harvard.edu/nutritionsource/food-features/coconut-oil/
- https://www.healthline.com/nutrition/healthy-cooking-oils#TOC_TITLE_HDR_3
- Healthy Eating Plate | The Nutrition Source | Harvard T.H. Chan School of Public Health
- Melt extra fat: https://www.youtube.com/watch?v=gjYVS8m91UU
- Should you try the keto diet? - Harvard Health
_______________________________________________________________________________________________
2.UK వార్షిక సమావేశము, లండన్, 24 సెప్టెంబర్ 2023
యూకే కోఆర్డినేటర్02822 నిర్వహించిన ఈ జాతీయ సమావేశానికి 21 మంది ప్రాక్టీషనర్లు వ్యక్తిగతంగా హాజరయ్యారు మరియు 8 మంది ఆన్లైన్లో పాల్గొన్నారు. సెమినార్ లో సమర్పింపబోయే మొత్తం మెటీరియల్ను కోఆర్డినేటర్ కు ముందుగానే పంపడంతో వారు దీన్ని యూకే ప్రాక్టీషనర్లు అందరికీ పంపిణీ చేశారు.
1994లో స్వామివారి ఆశీస్సులతో వైబ్రియానిక్స్ ప్రారంభించినప్పటి నుంచి వైబ్రియానిక్స్ సేవలో యూకే ముందంజలో ఉందని డాక్టర్ అగర్వాల్ తన ప్రసంగంలో తెలియ జేశారు. ప్రాక్టీషనర్లు తమ యొక్క రోగులు, స్నేహితులు, బంధువులు, మరియు సాయి కేంద్రాల సభ్యులు ఇలా ఈ వైబ్రో సేవను చేపట్టడానికి మరింత మంది కొత్త వ్యక్తులను పరిచయం చేయడం ద్వారా ఈ మిషన్ ఊపందుకుంటుందని ఆయన సమావేశములో సభ్యులను ప్రోత్సహించారు. తన మరియు UK కోఆర్డినేటర్ యొక్క పని భారాన్ని తగ్గించడానికి నిర్వాహక(అడ్మిన్) పనిని చేపట్టడానికి మరింత మంది ప్రాక్టీషనర్లు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే IT వర్కంతా తన భుజ స్కందాలపై వేసుకొని సేవలు నిర్వహిస్తున్న ప్రాక్టీషనర్03531 కు ఇది ఎంతో ఊరట నిచ్చేదిగా ఉంది. అడ్మిన్ సేవ కోసం ప్రాక్టీషనర్ల నుండి కాక ఇతరులను నియామకం చేసుకొని వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రాక్టీషనర్02802 ఎంతో విలువైన సూచన చేసారు.
సమావేశంలో సమర్పించిన రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొదటిది డాక్టర్ భిషక చౌదరి టైప్ 2 మధుమేహం, రక్త పోటు, హై కొలెస్ట్రాల్ లను నిజ జివితంలో సమర్ధవంతంగా ఎలా పరిష్కరించ గలగాలో వివరంగా తెలిపారు. ఈ మూడింటిలో ప్రతీ ఒక్కటి చికిత్స లేకపోతే ప్రాణాంతకం ఔతాయి అని తెలిపారు. ఇవి మూడు కలిసే ప్రభావితం చేస్తూ ఉంటాయి, అంతేకాక ఈ మూడు గుండె పోటు మరియు స్ట్రోక్ కు దారి తీస్తాయి. సరళ మైన మరియు అనువైన జీవన విధాన పద్ధతుల ద్వారా ఈ రుగ్మతలను ముందుగానే అరికట్టుకొనే విధానాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. చక్కర తక్కువగా ఉన్న ఆహారం, కార్బో హైడ్రేట్లు, లవణాలు మరియు సంతృప్త కొవ్వులు, అధిక ఫైబర్ ఉన్న పప్పు ధాన్యాలు, అపరాలు, నీటిని అధికంగా తీసుకోవడం(రోజుకు రెండు లీటర్లు) ఇవి ఆకలిని తగ్గిస్తాయి. ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చెయ్యడం ద్వారా బరువు తగ్గడం అలాగే గుండె పై వత్తిడి ఆందోళన తగ్గుతాయి. సరైన సమయానికి క్రమం తప్పకుండా ముఖ్యంగా సాయంత్రం 8 గంటల లోపు ఆహారం తీసుకోవడం ఉత్తమం.
మరొక ప్రెజెంటేషన్ SVP 02802 “ప్రాణాంతక మైన వైద్య అత్యవసర పరిస్థితులు”అనే టాపిక్ పై 33 సంవత్సరాలుగా GPగా పనిచేసిన తన అనుభవములను ఉటంకిస్తూ అవగాహన ప్రాణాలను కాపాడుతుంది అని నొక్కి చెప్పారు. తక్షణ వైద్య సంరక్షణ అవసరమయ్యే క్రింది అత్యవసర పరిస్థితులను ఆమె వివరించారు. 30 నిమిషాలకు పైగా అపస్మారక స్థితి లేదా ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన రక్తస్రావం, షాక్ గురైన లక్షణాలు, సెప్సిస్ లేదా మెనుం జైటీస్ సంకేతాలు, ఆకస్మిక తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అలర్జీ ప్రతి చర్య, తీవ్రమైన కాలిన గాయాలు, మరియు ఉక్కిరి బిక్కిరి చేయడం ఇవన్నీ అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. మరియు సహాయం వచ్చేవరకు అటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఆమె ఉపయోగకరమైన చిట్కాలను అందించారు.
కోఆర్డినేటర్ IB ని ఉపయోగించడం కొనసాగించమని ప్రాక్టీషనలకు గుర్తు చేస్తూ ముగించారు. తను తన ఇల్లు మరియు గార్డెన్ లో క్రమం తప్పకుండా ప్రతీరోజూ IB చిలకరిస్తారు, మరియు ఈ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడానికి IB సహాయపడుతుందని విశ్వ సిస్తారు. ఎనిమిది మంది ప్రాక్టీషనర్లు తమ108 CC బాక్సు లను రీఛార్జి చేసుకునే అవకాశాన్ని పొందారు.
*పూర్తి వివరాలు పవర్ పాయింట్ ఫార్మేట్ లో [email protected] నుండి అభ్యర్థన పై అందుబాటులో ఉంటాయి.
_______________________________________________________________________________________________
3.సాయి వైబ్రియానిక్స్ ఇన్సిటూట్ ఫర్ రెసెర్చ్ మరియు ట్రైన్నింగ్ (SVIRT ) ద్వారా సామూహిక కార్యకలాపాలకు కొత్త ఒరవడి
క్యాంపులు /శిబిరాలు
ఆర్ సి ల అలుపెరగని ప్రయత్నం మరియు స్థానిక ప్రాక్టీషనర్లు ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా భారీ వర్షాలకు కూడా లెక్క చేయకుండా కేవలం 7 నెలల్లో సెప్టెంబర్ ముగిసే వరకు 118 మంది ప్రాక్టీషనర్లు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరియు గుజరాత్ లో 17 కొత్త వేదికలతో సహా మొత్తం 97 ప్రదేశాలలో 968 శిబిరాలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు ఐన కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మరియు ఒడిశాలలో కూడా శిబిరాలు నిర్వహింప బడ్డాయి. శిబిరాలు సాధారణంగా నెలవారిగా మరియు కొన్ని ప్రదేశాలలో స్థానిక డిమాండ్ ను బట్టి వారానికి ఒకసారి నిర్వహించబడుతున్నాయి. మొత్తం 32,837 రోగులు చికిత్స పొందారు. ఈ ఒరవడి భవిష్యత్తులో మరింత పటిష్టంగా కొనసాగుతుందని భావిస్తున్నారు.
పుట్టపర్తి లో వైబ్రో క్లినిక్
స్థానిక మరియు సందర్శన ప్రాక్టీషనర్లు చే SVIRT కార్యాలయంలో వారానికి రెండుసార్లు సాధారణ క్లినిక్ నిర్వహించబడుతుంది.
ప్రేమ తరు జాతీయ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం
2023 సెప్టెంబర్ 16 మరియు అక్టోబర్ 14 భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో ఎనిమిది మంది ప్రాక్టీషనర్లు, బాలవికాస్
పిల్లలు, సేవా దళ్ మరియు స్థానిక నివాసితుల భాగస్వామ్యంలో వైబ్రియానిక్స్ సంరక్షణలో మొత్తం 278 మొక్కలు నాటబడ్డాయి. బలమైన పునాది కోసం CC1.2 Plant tonic నాటే సమయంలో ఉపయోగించబడింది, మరియు అనంతర సంరక్షణ కోసం తగిన ఇతర రెమిడిలను వాడటం జరిగింది. ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాల్లో 278 మొక్కలు, ఢిల్లీలో 232, హర్యానాలో 38 యూపీలో 5, ఉత్తరాఖండ్లో 3 మొక్కలు నాటారు. మన పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చేపట్టే సహాయక కార్యక్రమాలకు SVIRT కట్టుబడి ఉంటుందని తెలిఫేందుకు ఇది ప్రారంభ సూచిక మాత్రమే.
_______________________________________________________________________________________________
4.ఉదంతం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి పై సాయి అనుగ్రహం 03598…UK
ప్రాక్టీషనరుకు సన్నిహిత కుటుంబ సభ్యుడు ఐన 93 ఏళ్ల భార్యా విహీనుడు, పొరుగువారు మరియు స్నేహితుల సహకారంతో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇతను తన మోకాలు మరియు వెన్నుముక యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి తప్ప ఆరోగ్యంగానే ఉండేవారు. తన మోకాళ్ళకు సాధారణ స్టెరాయిడ్ ఇంజక్షన్ అందుకుంటు పాక్షిక ఉపశమనం పొందుతున్నారు. వారు 2023 మార్చి లో బాత్రూంలో పడిపోయి తీవ్రమైన అల్పోష్ణస్థితికి (హైపో థెర్మియకి) గురై ఆస్పత్రిలో చేరేంత వరకు కూడా స్వతంత్రంగా జీవిస్తూ బాగానే ఉండేవారు. అప్పటినుండి ఈ సంఘటన పునరావృతం అయ్యే మూత్ర మరియు ఛాతీ సంబంధిత అంటువ్యాధులు మరియు సాధారణ ఆరోగ్యంలో క్రమ క్షీణత వఆంటీ సంక్షోభాల శ్రేణిని ప్రారంభించింది. వారికి కీళ్ల నొప్పులు తీవ్రంగా పెరగడంతో తను పూర్తిగా మంచం పట్టారు. వారి రెండు మోకాళ్లు వాచిపోయి కేవలం స్పర్శకే బాధతో విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది. తను బలమైన ఓపియేట్ అనాల్జసిక్ మందులపై ఆధారపడ్డా చాలా స్వల్పంగామాత్రమే తేడా ఉంటోంది.
వివిధ ఇన్ఫెక్షన్ ల కారణంగా ఆసుపత్రిలో చాలాకాలం గడపడంతో కోలుకోబడే ఆశ కూడా క్షీణించ సాగింది. ఎక్కువగా మగతగా ఉంటున్నారు. తినడానికి నిరాకరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ యొక్క రెండు కోర్సులు పూర్తి చేసిన తర్వాత కూడా ఇవ్వబడే సూచనలు లేదా ఆదేశాలకు స్పందించడం చాలా పేలవంగా ఉంది. తను బలమైన మందులు పై ఉన్నప్పటికీ కాళ్ల ప్రతి చిన్న కదిలికకు అరుస్తున్నారు. చివరి ప్రయత్నంగా అతనికి నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడటానికి ఇటీవలే పదవీ విరమణ పొందిన ఈ వైద్యుడు మరియు వైబ్రో ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమిడిని సిద్ధం చేసారు.
CC12.1 Adult tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles and soft tissues + Pain* + Inflammation**…నీటితో అంతర్ముఖంగా, ఆముదంతో బాహ్య అనువర్తనం కోసం
జూన్ 3న ప్రాక్టీషనరు అతనికి నోటిలో ఒక డోస్ ఇచ్చి స్వామి నామాన్ని స్మరిస్తూ అతని రెండు మోకాళ్ళకు రెమిడి ఆయిల్ రాశారు తన పడక పక్కనే ఉన్న తాగునీటి పాత్రలో మూడు మాత్రలు కూడా వేశారు. వైద్యుల మరియు సాధారణ వ్యక్తులు అతని అంత్యక్రియలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అభిప్రాయ పడసాగారు. కానీ రెండు రోజుల తర్వాత ఆమె అతన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె పూర్తిగా ఆశ్చర్యానికి గురి అయ్యారు. రోగి పూర్తిగా అప్రమత్తంగా మంచంలో సౌకర్యవంతంగా మరియు పరిపూర్ణమైన తెలివైన సంభాషణ చేయగలిగారు. తన మోకాళ్లలో ఎలాంటి నొప్పి లేదని కూడా తెలిపారు. ఇక కీళ్ళ వద్ద వాపులు సున్నితత్వం కూడా లేవు. నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి నప్పుడు అతని పరిస్థితిలో ఇంత నాటకీయ పరిణామం ఏర్పడడానికి అతని మందుల్లో ఎటువంటి మార్పు కూడా లేదు. అతను జూన్ మధ్యలో ఒక సంరక్షణ గృహానికి డిస్చార్జి చేయబడ్డారు అక్కడ తన చివరి మూడు వారాలు ప్రశాంతంగా గడిపారు. 2023 జూలై 7న నొప్పిలేకుండా ప్రశాంతంగా స్వర్గస్తులయ్యారు.
*Pain: NM20 Injury + NM36 War + SR397 Morphinum + Cannabis 10M + Cocaine 10M + Crotalus Horridus 30C + Lithium 10M, all four from homoeo store
**Inflammation: NM45 Atomic Radiation + NM113 Inflammation + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR324 X-ray + SR348 Cortisone
_______________________________________________________________________________________________
శ్రీమతి చంద్రావతి వామన్ శెట్టి 12017…India,ముంబైకి చెందిన చురుకైన మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి 73 ఏళ్ల VP సబ్ ఆర్కానాయిడ్ హెమరేజ్ అనగా మెదడు లోని మధ్య మరియు లోపలి పొరల మధ్య రక్తస్రావం కారణంగా పది నెలల సుదీర్ఘ వేదన అనంతరము 2023 ఆగస్టు 1న స్వామి వారి పాదాలకు చెంత చేరుకున్నారు. 2011 నుండి ఆమె చాలా చురుకైన ప్రాక్టీషనర్, ఆమె ఆసుపత్రిలో చేరే వరకు చాలా దూరం ప్రయాణించి సీయోను మరియు వడల వైద్య శిబిరాలలో రోగులకు క్రమం తప్పకుండా చికిత్స అందిస్తూ వచ్చారు. తను అందరిచే ఆరాధింపబడే బాలవికాస్ గురువుగా, మనోహరమైన భజన గాయని, ప్రశాంతి నిలయంలో నిత్య సేవాదళం మరియు అన్ని సమితి కార్యక్రమాల్లో ఎంతో అంకితభావం భక్తి మరియు ఉత్సాహంతో పాల్గొంటూ తన అందమైన చిరునవ్వు మరియు ఉల్లాసమైన ప్రవర్తనతో అందరినీ ఉత్తేజపరిచేవారు. ఆమె కుటుంబం మరియు సాయి కుటుంబం కూడా ఆమె ప్రేమకు దూరం కావడం బాధాకరం.