ప్రశ్నలు-జవాబులు
Vol 14 సంచిక 6
నవంబర్ / డిసెంబర్ 2023
Q1 బెడ్ సోర్స్ కోసం నేను రోగి యొక్క చెమట ఉపయోగించి నోసోడ్ తయారు చేయాలి అనుకుంటున్నాను, అది ప్రభావంతంగా ఉంటుందా? బెడ్ సోర్ నుండి ఉత్సర్గం ఉన్నప్పుడు దీని నుండి తీసిన నోసోడ్ మరింత ప్రభావంతంగా ఉంటుందా?
A. బెడ్ సోర్ అనేది చర్మంపై దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా చర్మం మరియు అంతర కణజాలానికి మధ్య ఏర్పడిన గాయం. చమట అనేది చర్మం నుండి వచ్చే ద్రవం కాబట్టి ఇది నోసోడ్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది, అయితే గాయానికి చికిత్స చేయడానికి ఉత్తమ మార్గం CC21.11 Wounds & Abrasions మౌఖికంగా అలాగే బెడ్ సోర్ ఉన్న ప్రదేశంలో బాహ్య అనువర్తనం గా ఉపయోగించడం ఉత్తమం. ఇక రెండవ ఉత్తమ మార్గం బెడ్ సోర్ నుండి కొంచం ఉత్సర్గం తీసుకొని దాని నుండి ఒక నోసొడ్ తయారు చేయడం. అలాగే గాయాన్ని శుభ్ర పరచడం, డ్రెస్సింగ్ చేయడం, దీనితొపాటు తరచూ పడుకునే విధానంలో మార్పులు చేయడం ద్వారా పుండు పై ఒత్తిడిని తగ్గించవచ్చు.
_______________________________________________________________________________________
Q2. SRHVP ద్వారా కార్డులు ఉపయోగించి రెమిడీ తయారు చేస్తున్నప్పుడు స్వామి ఆశీర్వాదం కోసం శాంపిల్ వెల్ లో స్వామి ఫోటో ఉంచాలని అనుకుంటున్నాను. ఇలా చేయవచ్చా దాని వల్ల ఫలితం ఉంటుందా?
A. SRHVP మిషను స్వామివారి ఆశీర్వాదం తోనే ఉద్భవించిందనే విషయం మీకు బాగా తెలిసే ఉండవచ్చు, ఇంటర్వ్యూ గదిలో కూడా స్వామి చేత అనేక పర్యాయములు ఆశీర్వదింపబడ్దది. అందుచేత SRHVP లో స్వామి ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు. రెమిడీ తయారీ సమయంలో స్వచ్ఛమైన హృదయం నుండి వెలువడే ప్రార్ధన (ఈ ప్రార్ధన లో ఆర్ధత చాలా ముఖ్యం) స్వామి ఆశీర్వాదాలు అందుకోవడానికి ఉత్తమ మార్గం.
_______________________________________________________________________________________
3. అనారోగ్య సమయంలో మనిషి చుట్టూ ఉన్న ఆరా (అదృశ్య ప్రకాశం) ప్రభావితం అవుతుందని నేను ఇటీవల శాస్త్రీయ అధ్యయనం నుండి అర్థం చేసుకున్నాను. వైబ్రో రెమిడీని స్ప్రే చేయడం ద్వారా మనం ఈ ఆరాని శుభ్రపరచగలమా? అలా అయితే ఏ వైబ్రేషన్ సముచితంగా ఉంటుంది?
A. మొదటగా కొంచెం నేపథ్యం: ఈ ప్రశ్న ఇటీవల ఒక సైన్స్ జనరల్ లో ప్రచురింపబడిన అధ్యయనాన్ని సూచిస్తుంది. ఓజోన్ అణువులు మానవ దేహంతో కాంటాక్ట్ అయినప్పుడు ఉత్పత్తి చేయబడిన గాలిని శుద్ధి చేసే అణువుల యొక్క అదృశ్య ప్రకాశము ఆరాని ప్రదర్శిస్తుందని సూచించింది. గతం లోని ఒక విశ్లేషణ ప్రకారం మన చర్మం పై OH రాడికల్స్ అని పిలవబడే ఈ అణువులు సూర్యరశ్మి ద్వారా తయారైనప్పుడు విషపూరిత అణువులను తటస్తీకరిస్తాయి అని కనుగొనబడింది. అయితే మానవులు స్వయంగా తయారు చేసుకుంటున్న OH రాడికల్ లను శాస్త్రవేత్తలు కనుగొనడం ఇదే ప్రధమం. ఈ అణువులకు మూలం స్క్వాలీన్ అనే సమ్మేళనం. ఇది మన చర్మాన్ని మృదువుగా ఉంచుతుందని అంటారు. ఈ అధ్యయనం ఇంకా ప్రారంభ దిశలోనే ఉందని మరియు ఈ ఆవిష్కరణ యొక్క చిక్కులను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయవలసింది ఉందని గమనించడం ముఖ్యం. OH రాడికల్స్ శరీరం చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తాయి అనే భావనలో ఈ సంభావ్య ప్రయోజనాల గురించి ఆలోచించడం మనోహరంగా ఉన్నప్పటికీ ఈ రాడికల్స్ మన ఆరోగ్యం పై ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో లేదో మనకు ఇంకా తెలియదని గుర్తుంచుకోవడం ముఖ్యం.
మీ ప్రశ్నకు తిరిగివస్తే ఒక వ్యక్తి యొక్క ఆరాని శుభ్రపరచడం, ఆ వ్యక్తికి రెమిడి తో చికిత్స చేయడం ఈ రెండు వేరు కాదు కాబట్టి మీరు వ్యక్తి యొక్క వ్యాధి ని బట్టి తగిన రెమిడీ తో ఆరా శుభ్రపరచడానికి శరీరంపై స్ప్రే చేయండి. వాస్తవానికి రెండు వైపులా కొనసాగింపబడే విధానం మరింత ప్రభావంతంగా ఉంటుంది. అనగా ఇంకో విధంగా చెప్పాలంటే అనారోగ్యానికి తగిన నివారణను మౌఖికంగా ఇవ్వడం, పిచికారి చేయడం రెండూ చేయవచ్చు.
_______________________________________________________________________________________
Q4. ఋతు విరతి కోసంఆదర్శ వంతమైన చికిత్స ఎప్పుడు ప్రారంభించాలి. మనం ఏ ఏ అంశాలను గుర్తుంచుకోవాలి?
A. ఒక స్త్రీ ఋతుక్రమం లేకుండా ఒక పూర్తి సంవత్సరం ఉన్నట్లైతే ఋతు విరతి లో ఉన్నట్లు చెబుతారు. కొందరు స్త్రీలు తక్కువ వయసులో అనగా 40 సంవత్సరాల లోపు లేదా ఎక్కువ వయసులో అనగా 50 సంవత్సరాల తరువాత ఋతు విరతికి లోనవుతారు, ఐతే వీరి సంఖ్య చాలా స్వల్పం. సాధారణంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో ఇది ప్రారంభం అవుతుంది. వేడి అవిర్లు, రాత్రి చెమటలు భావో ద్వేగాలు, రొమ్ము నొప్పి లేదా మంట, యోని పొడిబారడం, కోరికలు తగ్గడం, అలసట, జుట్టు పలచ బడడం, ఆందోళన, నిరాశ నిద్రాభంగం, బరువు పెరగడం, కీళ్ల/కండరాల నొప్పి వంటివి సాధారణంగా అనుభవించే లక్షణాలు. కొందరికి హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన తలనొప్పి, అవయవ అంత్యభాగాల్లో జలదరింపు లేదా విద్యుత్ షాక్ వంటిది, లేదా జ్ఞాపకశక్తి లోపించడం వంటివి కొందరికి సంభవించవచ్చు. సాధారణంగా 45 నుండి 55 సంవత్సరాల వయసులో స్త్రీకి మెనోపాస్ వయసు వచ్చిన వెంటనే సక్రమం కాని ఋతు క్రమం తో పాటు పై లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా మనము ఈ చికిత్సను ప్రారంభించ వచ్చు.
_______________________________________________________________________________________
Q5. నేను విభూతిని పోటెం టైజ్ అనగా శక్తివంతం చేసి రెమిడీలను మరింత శక్తివంతం చేయడానికి నా అన్ని రెమెడీలకు ఈ కంపనాన్ని జోడించవచ్చా?
A. మీ ఉద్దేశం స్వామి రక్షణ చేర్చడమే అయితే SM2 Divine Protection తగిన కార్డు అవుతుంది. విభూతిని శక్తివంతం చేయవలసిన అవసరం లేదు. ఇది ఎలా తయారు చేయబడినది, ఎలా వినియోగింప బడుతోంది అనే దానిపై ఆధారపడి దీనిలో కొన్ని ఇతర వైబ్రేషన్లు కూడా ఉండవచ్చు. రోగి బాబా భక్తుడైతే అతని కోరిక మేరకు విభూతితో కూడా రెమిడీ తయారు చేయవచ్చు.