డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 14 సంచిక 6
నవంబర్ / డిసెంబర్ 2023
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
ఒక అద్భుతమైన శ్వేత శోభతో కూడి స్వర్గధామంలా భాశిస్తున్న పుట్టపర్తి లోని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్న ప్రతీసారి ప్రకృతి మాత పై స్వామికి ఉన్న ప్రేమ నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒక పాఠశాలగా, ఒక ప్రయోగశాలగా, ముక్తికి ప్రవేశద్వారంగా, మరియు భగవంతుని యొక్క అపార మహిమను ఆవిష్కరింపజేసే అద్భుత దృశ్యంగా గోచరించే ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోమని భగవంతుడు మనలను ఉద్భోదించారు. చెట్లు గురించి స్వామి చెప్పిన మాటలను నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను, “చెట్లు బతికి ఉన్నప్పుడు ఫలాలను ఇవ్వడమే కాకుండా వాటి నుండి ప్రాణం పోయిన తర్వాత కూడా తమ శరీరాన్ని వంటచెరుకుగా కూడా అందిస్తూ త్యాగానికి నిలువెత్తు సాక్ష్యంగా మనకు పాఠాలు నేర్పుతుంది. ప్రకృతి సంబంధిత బోధకులు
అందరిలో చెట్టు చాలా గొప్పది”- శ్రీ సత్య సాయి వాణి, సంపుటం 33 అధ్యాయం 17, 2000 సెప్టెంబర్ 29.
2025 భగవాన్ శతాబ్ది ఉత్సవాల నాటికి భూమాతను 10 మిలియన్ మొక్కలతో అలంకరించేందుకు సాయి గ్లోబల్ కౌన్సిల్ తో పాటు సెంట్రల్ ట్రస్ట్ వారు తీసుకున్న అద్భుతమైన చొరవ కంటే మన స్వామికి నివాళులు అర్పించడానికి మరింత సముచితమైన సేవ మరి ఏమి ఉన్నది? భక్తులందరూ ఈ కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్/యాప్ లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రోత్సహిస్తున్నారు. ఈ అవకాశము నుండి ప్రేరణ పొందిన అనేక మంది ప్రాక్టీషనర్లు సాయి వైబ్రియానిక్స్ సంరక్షణలో చెట్లను నాటడానికి మరియు పెంచడానికి కలిసి సాగుతున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమం లో ముందున్నందుకు ప్రాక్టీషనర్లు అందరినీ మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇతరులను కూడా చురుకుగా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వైబ్రియానిక్స్ సంరక్షణలో నాటిన చెట్ల సంఖ్య పై అన్ని అభిప్రాయాలను మా రికార్డుల కోసం [email protected] కు పంపవలసిందిగా సూచన.
SVIRT ఏర్పడినప్పటి నుండి వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయడానికి దేశం నలుమూలల నుండి ప్రాక్టీషనర్లు క్రమం తప్పకుండా నిరంతరం సహకరిస్తున్నారని మీకు తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఈ వైబ్రో క్యాంపులలో పాల్గొన్న ప్రాక్టీషనర్లు మరియు ప్రాంతీయ సమన్వయకర్తల అందరి కృషి మరియు అంకిత భావాన్ని మేము గుర్తించాము. ఇది ఇతరులకు ఆన్లైన్ మరియు ప్రాంతీయ గ్లోబల్ వైబ్రానిక్స్ వనరులను సమీకరించుకోవడానికి సహకరించుకోవడానికి మరియు ట్యాప్ చేయడానికి అవకాశాల అన్వేషణకు తమ అభ్యాసాన్ని పెంచుకోవడానికి ఇతరులను ప్రేరేపిస్తుంది.
పైన పేర్కొన్న రెండు కార్యకలాపాలపై మరిన్ని వివరాల కోసం ఈ సంచికలోని అదనపు విభాగాన్ని చూడండి.
మూడు దశాబ్దాల వైబ్రియానిక్స్ అభ్యాసంలో అనేకమంది SVPలు SRHVP ద్వారా వివిధ వ్యాధులకు చికిత్స చేయడానికి వివిధ పదార్థాలను పోటెంటైజ్ చేయడంలో ప్రయోగాలు చేశారు. తరచుగా అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చాయి. అనేక సంవత్సరాలుగా అనుభవజ్ఞులైన SVP లు వివిధ వ్యాధులకు వారి చికిత్స విధానంలో భాగంగా వారి సొంత కాంబో లను కూడా రూపొందించారు. ప్రాక్టీషనర్ల నుండి లభ్యమైన అటువంటి విలువైన సమాచారం సహాయంతో మా పరిశోధనా బృందం 108CC లకు మార్పులు మరియు చేర్పులు చేయగలరు. అటువంటి అనుభవాలను ప్రాక్టీ షనర్లు [email protected] కు రాయడం ద్వారా వివరాలు పంచుకోవాలని కోరుతున్నాము. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, సూచనలు, మరియు కేసు చరిత్రలు, నిరంతరం అభివృద్ధి చెందుతున్న వైబ్రియానిక్స్ కు అత్యంత విలువైనవి మరియు ప్రశంసింపదగినవి.
మనము త్వరలోనే భారతీయుల దీపాల పండుగ దీపావళిని సమీపిస్తున్నాము. ఇది ఈ సంవత్సరం గ్లోబల్ అఖండ భజనకు చేరువులో ఉంది, స్వామి ఇలా అంటారు, “ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగిస్తే ఉన్నచోటనే అవి రెండు వెలుగుతూనే ఉంటాయి తప్ప మొదటి దీపం రెండవది తన కాంతిని ప్రసరింప చేయకుండా ఆపలేదు కదా, మీరు కూడా ఒక దీపం నుండి మిలియన్ కొద్దీ దీపాలను వెలిగించవచ్చు, అయినప్పటికీ మొదటి దీపం ఏ కొంచమైనా బేధాన్ని చూపదు. ప్రేమ కూడా ఇలానే ఉంటుంది. ఒక మిలియన్ జనులకు మీ ప్రేమను పంచండి, అయినప్పటికీ ఆ ప్రేమ ఏ మాత్రం తరగకుండా అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. దీపావళి మీకు కాంతి మరియు ప్రేమ పాఠాన్ని నేర్పడానికి ఉద్దేశింపబడింది, ప్రేమను గట్టిగా పట్టుకోండి పెంచండి, విస్తరించండి. ఈ అపరిమితమైన ప్రేమ ప్రవాహంలో నా మరియు నీ అతని మరియు వారి కులం మరియు మతం యొక్క పరిమితులను వదిలివేయండి ఇదే ఆధ్యాత్మిక సాధనకు పరాకాష్ట.” శ్రీ సత్యసాయి ప్రసంగాలు వాల్యూమ్ 10, అధ్యాయము 31, అక్టోబర్ 29, 1970.
అవివేకపు హింసొన్మాదం ప్రపంచంలోని అనేక ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నప్పుడు మరియు యుద్దం వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న సమయంలో ప్రపంచ శాంతి కోసం మనం కలిసి అఖండ భజనలో పాల్గొందాం. భజనలో స్వామి మహిమను పాడుతూ ప్రపంచంలోని నలుమూలలకు స్వామి తాలూకు స్వస్థత ప్రకంపనలను వ్యాపింపచేసేలా వారి కాంతికి దీప స్తంభాలుగా మన హృదయాల్లో వెలుగుతున్న ప్రేమ అనే దీపాన్ని మరింత ప్రకాశవంతముగా చేస్తూ ప్రేమను ప్రసరింప చేయాలని స్వామిని ప్రార్థిద్దాం.
ప్రేమతో సాయి సేవలో
జిత్ కె అగర్వాల్.