Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 14 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2023
అవలోకనం

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రాక్టీషనర్లు గత ఏడాది కాలంలో నిస్వార్థంగా చేసిన సమిష్టి సేవను అభినందిస్తూ, డాక్టర్ జిత్ అగర్వాల్ సేవా కార్యక్రమాలకు తోడ్పడుతున్న వారికి ప్రోత్సాహం అందించే కొత్త కార్యక్రమం గురించి, అలాగే వెబ్‌సైట్లో కేస్ హిస్టరీలు (రోగి వైద్య చరిత్రలు) ప్రచురించే కార్యక్రమం గురించి వివరిస్తున్నారు. అదనంగా, కోవిడ్-19 కొత్త సబ్- వేరియంట్లును ఎదుర్కొనే ఉద్దేశ్యంతో ఇబి ద్వారా చేపట్టిన రెమెడీ పంపిణీ కార్యక్రమం గురించి కూడా తెలియజేస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో 12 ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: శ్వాసకోశ అలర్జీ; మైగ్రేన్; ఫైబ్రోఅడెనోసిస్ (రొమ్ములో గడ్డలు ఏర్పడే పరిస్థితి); నిద్రలో ఊపిరి ఆడకపోవడం; గౌట్ (యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే కీళ్లవాతం); శ్వాసకోశ అలర్జీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది; మోకాలి నొప్పి; చర్మ సమస్య – చిత్రాలతో; ఒక బాలుడిలో మలబద్ధకం; పడిపోవడం తర్వాత డబుల్ విజన్ (ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం); కోవిడ్ అనంతర ప్రభావాలు, నడుము దిగువ భాగం నొప్పి; ప్లాంటర్ ఫాసియైటిస్ (పాదం అడుగు భాగంలోని కండర తంతువుల వాపు), మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ (మనోభావాల మార్పులు).

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

ఈ సంచికలో ఎల్లప్పుడూ భగవంతుని సాన్నిధ్యాన్ని, మార్గదర్శకత్వాన్ని అనుభవిస్తూ సేవ చేస్తున్న ఇద్దరు అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. వారిలో ఒకరు క్రొయేషియాకు చెందినవారు. వృత్తిరీత్యా లైబ్రేరియన్ (గ్రంథపాలకురాలు). స్వామి పట్ల అపారమైన విశ్వాసం, కృతజ్ఞత కలిగి ఉండి, తన సేవా అనుభవాలను చిత్రాలతో సహా పంచుకున్నారు. మరొకరు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మారుమూల కాలింపాంగ్ జిల్లాకు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. అక్కడ వైబ్రియోనిక్స్ సేవలో విశేషంగా కృషి చేస్తూ, ఎల్లప్పుడూ రోగులతో కిక్కిరిసిన సేవా కేంద్రంలో అనేక అద్భుతమైన స్వస్థత అనుభవాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్న జవాబులు

తెలుసుకోవడానికి చదవండి: వైబ్రియోనిక్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి? అలాగే దానికి హోమియోపతి తో ఉన్న సంబంధం ఏమిటి? ఒమిక్రాన్ యొక్క కొత్త సబ్-వేరియంట్ ను ఎదుర్కోవడానికి తాజా ఇబి వెర్షన్ ఇప్పటికీ ఎందుకు సముచితంగా ఉంది? నోసోడ్ ను ఎప్పుడు ఉపయోగించడం సముచితం? రెటినల్ ఆర్టరీ ఆక్లూజన్ (కంటి రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే ధమని మూసుకుపోవడం)కు ఉపయోగించే రెమెడీ ఏమిటి? భూమి యొక్క విద్యుదయస్కాంత క్షేత్రం లేదా స్పందన యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న నేపథ్యంలో, బ్రాడ్‌కాస్టింగ్, పొటెన్టైజింగ్ మరియు నోసోడ్స్ తయారీలో సాధారణంగా ఉపయోగించే 200C లేదా 1M పొటెన్సీలలో ఏది అత్యంత అనుకూలమో ఎలా నిర్ణయించాలి? యెస్ ఆర్ హెచ్ వి పి యంత్రాన్ని సురక్షితంగా మరియు జాగ్రత్తగా ఎలా నిర్వహించాలి?

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్య వాణి

సాత్విక ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అలాగే మనం ఇతరులకు సేవ చేసినప్పుడు, నిజానికి మనకు మనమే ఎలా సేవ చేసుకుంటున్నామో స్వామి ప్రేమపూర్వకంగా మనకు బోధిస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

లండన్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు భారతదేశంలోని పుట్టపర్తిలో జరగబోయే శిక్షణా శిబిరాలు.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

ఆరోగ్యం మరియు రుచికోసం పిండులు అనే ఆరోగ్య వ్యాసం ఆరోగ్యానికి హానికరమైన తెల్లని ఆహార పదార్థాలను నివారించడం అనే శ్రేణికి ముగింపు భాగం. ఇందులో వివిధ రకాల ఫ్లోర్స్ (పిండులు), వాటి పోషక విలువలు, ఆహారంలో వాటి వినియోగం మరియు పిండుల ద్వారా గరిష్ట ఆరోగ్య ప్రయోజనం పొందేందుకు ఉపయోగపడే సూచనలు వివరించబడ్డాయి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రాక్టీషనర్ల మొదటి రాష్ట్రస్థాయి సమావేశం విశాఖపట్నంలో నిర్వహించబడింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయ గిరిజన ప్రాంతంలో సాయి వైబ్రియోనిక్స్ వెల్‌నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఒక అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్ కు అర్పించిన నివాళి.

పూర్తి వ్యాసం చదవండి